
నూతన్, అపూర్వ (ఫైల్)
కర్ణాటక, యశవంతపుర : తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వివాహం చేసుకున్న ప్రేమజంట తుదకు జీవితాన్ని చాలించింది. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలుకాలో జరిగింది. నూతన్(25) అపూర్వ(22)లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను అంగీకరించి వాహం చేయాలని పెద్దలను కోరారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇటీవల పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అయినా పెద్దలు ఒప్పకొంటరాని ఎంతోగానో ఎదురు చూశారు. అయితే పెద్దలు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో రెండు రోజుల క్రితం ప్రేమజంట తాము నివాసం ఉంటున్న అద్దె ఇంటిలోనే విషం సేవించారు. ఇరు కుటుంబాల వారు గమనించి వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నూతన్, అపూర్వలు బుధవారం మృతి చెందారు. ఘటనపై ఒణకల్, గోణిబీడు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment