కూతుర్ని చంపి రీసార్ట్‌లో దంపతులు ఆత్మహత్య | Couple Kills 11 Year Old Daughter Dies By Suicide At Karnataka | Sakshi
Sakshi News home page

కూతుర్ని చంపి రీసార్ట్‌లో దంపతులు ఆత్మహత్య

Published Sun, Dec 10 2023 4:21 PM | Last Updated on Sun, Dec 10 2023 5:09 PM

Couple Kills 11 Year Old Daughter Dies By Suicide At Karnataka - Sakshi

బెంగళూరు: కర్ణాటకాలో కోడుగు జిల్లాలో దారుణం జరిగింది. కూతురు(11)తో పాటు దంపతులు తమ ఫామ్‌హౌజ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఓ నోటు కూడా ఘటనా ప్రదేశంలో లభించింది. వినోద్ (43), భార్య జుబీ అబ్రహం (37), కుమార్తె జోహాన్ (11) మృతదేహాలు ఓ ప్రైవేట్ రిసార్ట్‌ గదిలో లభ్యమయ్యాయి. 

బాధితులు కేరళలోని కొట్టాయంకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. పర్యటకులకు ప్రసిద్ధి గాంచిన కొడుగు జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌లో బాధితులు శనివారం దిగారు. అనుకోకుండా మరుసటి రోజే ఆదివారం మృతదేహాలు లభ్యమయ్యాయి. కూతుర్ని చంపిన తర్వాత దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. బంధువులకు సమాచారం అందించారు. 

ఇదీ చదవండి: యువకుడి సెల్ఫ్‌ ‘రిప్‌’ పోస్టు..వెంటనే సూసైడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement