యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
మృతిపై అనుమానాలు
చైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment