దివ్య (ఫైల్)
సాక్షి, బెంగళూరు: పక్కింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడిన భార్య అలిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా సూరత్కల్‌లోని బాళ గ్రామం ఒట్టెకాయారుకు చెందిన హరీశ్, దివ్య (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పక్కింట్లో శుభకార్యం జరిగితే హరీశ్ ఒక్కడే వెళ్లాడు.
ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆక్రోశం వ్యక్తం చేసిన దివ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దివ్వ సూరత్కల్‌లోని ఒక మందుల షాపులో పని చేసేది. అన్యోన్యంగా కాపురం సాగుతుండగా, కూతురు ఇలా చేయడంపై అనుమానంతో ఆమె తల్లి గిరిజా పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త హరీశ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తునారు.
చదవండి: ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి
Comments
Please login to add a commentAdd a comment