పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట | Love Couple Shelter to Srikakulam Police | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Published Sat, Sep 22 2018 12:08 PM | Last Updated on Sat, Sep 22 2018 12:08 PM

Love Couple Shelter to Srikakulam Police - Sakshi

పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమజంట

శ్రీకాకుళం రూరల్‌: మండలంలోని బట్టేరు గ్రామానికి చెందిన ప్రేమికులు తమకు భద్రత కల్పించాలంటూ శుక్రవారం శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బట్టేరుకు చెందిన వి.కామేశ్వరి అదే గ్రామానికి చెందిన కె.రవికుమార్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు వీరి ప్రేమను అడ్డుకున్నారు. కొన్నాళ్లుగా కామేశ్వరికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ గురువారం మధ్యాహ్నం ఇళ్ల నుంచి వచ్చేసి శ్రీకాకుళం నగరంలోని శ్రీరాఘవేంద్ర స్వామి దేవస్థానాన్ని ఆశ్రయించారు. అదేరోజు రాత్రి అమ్మాయి బంధువులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్త, సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరావు వీరిద్దరినీ శుక్రవారం రూరల్‌ పోలీస్టేషన్‌కు తీసుకొచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement