
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: పెళ్లికి నిరాకరించిన ప్రియురాల్ని ప్రియుడు కత్తితో పొడిచాడు. అతడి నుంచి తప్పించుకునే ›క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో ప్రియురాలు కూడా దాడి చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మరణించగా, ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలు.. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరులో ఓ ప్రైవేటు నూలు పరిశ్రమ ఉంది. ఇక్కడ ఉత్తరాదికి చెందిన కార్మికులు అధికంగా పనిచేస్తున్నారు. ఇందులో చత్తీస్‌గడ్‌కు చెందిన తులసి (20), రూపేష్ కుమార్(24) కూడా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు తొలుత ప్రేమించుకున్నారు. తర్వాత అతడిని ఆమె దూరం పెట్టింది.
చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్‌లో యువతి ఆత్మహత్య
దీంతో ఆగ్రహించిన రూపేష్‌కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని తులసిపై ఒత్తిడి తెచ్చాడు. ఈక్రమంలో శనివారం రాత్రి విధుల్ని ముగించుకుని తులసి తమకు కేటాయించిన క్వార్టర్స్‌లోని ఇంట్లోకి వెళ్లగానే, రూపేష్‌కుమార్ కూడా చొరబడి.. కత్తితో ఆమెపై దాడి చేశాడు. తనను తాను రక్షించుకునేందుకు ఇంట్లో ఉన్న కత్తి తో తులసి ఎదురు దాడి చేసింది. చివరికి కత్తిగాట్ల తో తులసి ఘటనాస్థలంలోనే మరణించింది. గాయ పడిన రూపేష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నామక్కల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో
Comments
Please login to add a commentAdd a comment