Stabbed
-
తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి
తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్పై కక్ష పెంచుకుని దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్‌లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్‌కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
కండక్టర్‌కు కత్తిపోట్లు..బస్సులో ప్రయాణికుడి బీభత్సం
బెంగళూరు: నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. కత్తి దాడిలో కండక్టర్ యోగేష్(45)కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కత్తిదాడికి పాల్పడ్డ యువకుడిని జార్ఖండ్‌కు చెందిన హరీశ్సిన్హా(28)గా గుర్తించారు. ఇతడు కాల్సెంటర్లో పనిచేస్తూ గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. మంగళవారం(అక్టోబర్1) జరిగిన ఈ ఘటనకు సంబంధించి హరీశ్సిన్హాపై వైట్‌ఫీల్డ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Stabbing inside BMTC Bus Shocks #BengaluruBPO employee who was fired from his job, stabs a conductor inside BMTC bus near ITPL Whitefield Conductor Yogesh reportedly asked the accused not to stand near the door, in a fit of rage the accused stabbed the conductor multiple… pic.twitter.com/AhwqUoAYPZ— Nabila Jamal (@nabilajamal_) October 2, 2024 ఇదీ చదవండి: పుణెలో కుప్పకూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి -
అత్తను దారుణంగా చంపిన కోడలికి మరణ శిక్ష
భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు నరికి నరికి చంపింది. ఈ కేసు విచారించిన రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్ చేతిలో అత్త సరోజ్కోల్ హత్యకు గురైంది. అత్త సరోజ్కోల్ హత్యకు మామ వాల్మీకికోల్ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్‌ను కోర్టు విడుదల చేసింది. -
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా?
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం జరిగింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి ఉంది అనగా.. వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతకంగా 15సార్లు పొడిచి మరి ప్రాణాలు తీశారు అగంతకులు. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఇతడికి గురువారమే పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా మరికొన్ని గంటల్లో వధువు మెడలో తాళి కడతాడనే సమయంలో తన ఇంట్లోనే తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. అతని ముఖం, ఛాతీపై 15 సార్లు కత్తితో పొడిచిన గుర్తులు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే సింఘాల్ హత్య విషయంలో తమ కుటుంబంలో ఎవరిని అనుమానించడం లేదని మృతుడి మేనమామ జావవర్ తెలిపారు. అతడ్ని ఎవరూ చంపారే విషయంలో కుటుంబానికి తెలియదని, ఇంటి దగ్గర బ్యాండ్ సౌండ్ వస్తుండటంతో తమకు ఎలాంటి అరుపులు వినపడలేదని తెలిపారు. హత్యపై పోలీసులు సరైన విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. మరోవైపు మృతుడికి, అతడి తండ్రితో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసిందని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ కేసుపై అయిదు బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందిడిని అదుపులోకి తీసుకొని, హత్యకు దారితీసిన కారణాలను వెల్లడిస్తామని తెలిపారు. -
ప్రియుడిని 100సార్లు పొడిచి చంపినా.. అమెకు శిక్షపడలేదు.. ఎందుకు!?
కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు అనుకోకుండా ప్రమాదవశాత్తు నేరం చేసినందుకు ఏళ్ల కొద్ది జైల్లో మగ్గి శిక్ష అనుభవిస్తుంటారు. మరికొందరూ అత్యంత కిరాతకంగా హత్య చేసి కూడా చిన్న లాజిక్‌తో చాలా సునాయాసంగా బయటపడతారు. అయితే ఆ వ్యక్తులు చేసిన నేరం చూస్తే క్షమించేలా ఉండదు. కానీ వాళ్లకు శిక్ష ఎందుకు పడలేదనే ప్రశ్న మిగిలుంటుంది. అదృష్టమా లేక తలరాత అనుకోవాలో కూడా తెలియదు. అలాంటి షాకింగ్ ఘటనే అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలో బ్రైన్ స్పెజ్చెర్ 32 ఏళ్ల మహిళ తాను ఎంతగానో ప్రేమించిన 26 ఏళ్ల చాడ్ ఓ మెలియాను దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. విచారణలో ఏకంగా వందసార్లు పైగా కత్తితో అతికిరాతకంగా పొడిచినట్లు వెల్లడైంది. పైగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ కూడా ఆమె చేతితో కత్తినే పట్టుకునే ఉంది, ఓమెలియా రక్తపు మడుగులో ఉన్నాడు, అదీగాక పోలీసులు ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆమె ఆ కత్తిలో తన గొంతుపై గాయం చేసుకునే యత్నం కూడా చేసింది. స్పెజ్చెర్నే చంపిందనేందుకు పూర్తిసాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆమెకు శిక్షపడలేదు. పైగా జడ్జీ ఆమెకు కొద్దిపాటి జైలు శిక్ష విధించి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ స్పెజ్చెర్ పూర్తి స్ప్రుహలో ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోవడమే ఆమెను జైలు పాలు కాకుండా చేసింది. నిజానికి ఈ ఘటనకు కొద్దిరోజులు ముందు ఇద్దరు కలుసుకుంటూ హాయిగా ఉన్నారు. సరిగ్గా 2018లో థౌజండ్ ఓక్స్లోని ఓ మెలియా అపార్ట్మెంట్లో ఇరువురు కలిసి గంజాయి తాగారు. అయితే స్పెజ్చెర్ ఫస్ట్ షాట్ గంజాయి తీసుకున్నప్పుడు అంతగా మత్తులో లేదు. అయితే ఆమెను మరింత గంజాయి తీసుకోవాల్సిందిగా ఓమెలియా ఒత్తిడి చేయడంతో మరో షాట్ తీసుకుంది. దీంతో ఇరువురు పూర్తిగా మత్తులో జోగుతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అధికంగా గంజాయి తీసుకోవడంతో స్పెజ్జెర్ సైకోటిక్‌గా మారిపోయింది. తాను ఏం చేసిందో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లిపోయింది. తాను ఎంతో ఇష్టపడ్డ వ్యక్తే అతి కిరాతకంగా 100 సార్లు పొడిచి మరీ హతమార్చింది. ఆ రోజు ఆమె పోలీసులు వచ్చిన తర్వాత కూడా మాములు స్థితికి రాకపోగా అదే ఉన్మాదస్థితితో తనను తాను హతమార్చుకునేంత దారుణ స్థితికి వచ్చేసింది. సమయానికి పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి స్పెజ్చెర్ ప్రాణాతో బతికిబట్టగట్టగలిగింది. అయితే పోలీసులు ఓ మెలియా ఆ ఘటనలో అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు. అయితే కోర్టులో స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది ఆమె స్ప్రుహలో ఉండి చేసిన నేరం కాదని గట్టిగా వాదించారు. పైగా అతడే ఆమెను గంజాయి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని అన్నారు. తన క్లయింట్ నాటి ఘటనలో ఏం జరగుతుంది, తానేం చేస్తుంది అనేది కూడా తెలియని దారుణ స్థితిలో ఉందని అన్నారు. వాస్తవానికి ఆమె కావాలని చేసిన హత్య మాత్రం కాదని కూడా అన్నారు. దీంతో న్యాయమూర్తి ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాదు. పైగా ఇరువురు ఇష్టపూర్వకంగా గంజాయి సేవించి ఉండటంతో జరిగిన ఘటనే అని ఈ కేసుని కొట్టిపడేసింది కోర్టు. అంతేగాదు తెలియని స్థితిలో చేసిన నేరానికిగానూ ఆమెకు రెండేళ్ల ప్రోబేషన్ శిక్ష తోపాటు వంద గంట సామజికి సేవ కూడా చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు పట్ల బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ గంజాయి తాగిన ప్రతి ఒక్కరూ మరో వ్యక్తి చంపేయొచ్చు అనేలా ఉంది ఈ తీర్పు అని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక స్పెజ్చెర్ న్యాయవాది మాత్రం జడ్డి ఓర్లీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మరీ ఈ విధంగా తీర్చు ఇచ్చారని ప్రశంసించాడు. ఈ తీర్పు పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాని అన్నారు. ఆయన దీన్ని మత్తులో జరిగిన అనుకోని ఘోరమే తప్ప తన క్లయింటే స్వతహాగా మంచిదే అని వెనుకేసుకొచ్చాడు స్పెజ్చెర్ తరుఫు న్యాయవాది. ఏదీమైన మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు తమకే గాక తామెంత ఇష్టపడ్డ వాళ్లను కూడా దూరం చేసుకునేలా చేస్తుంది. సరిదిద్దుకోలేని తప్పులను చేయిస్తుంది. ఇలాంటి ఉందంతాలు కోకొల్లలు కూడా. అందువల్ల దయచేసి ఇలాంటి వ్యసనాలకు బానిసలై ఉన్మాదులుగా మారి మిమ్మల్ని మీరు కోల్పోయి, మీ వాళ్లను దూరం చేసుకోకండి. (చదవండి: ఇదేం ఆఫర్ సామీ! ఇల్లు కొంటే భార్య ఉచితమా?) -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై దాడి
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత దాడి లీ జే మ్యుంగ్ జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన బూసన్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్ పోర్టు సైట్‌ను సందర్శించారు. అనంతరం లీ జే మ్యుంగ్ మీడియాతో మాట్లాడున్న సమయంలో పెద్ద సంఖ్యయలో యువకులు చుట్టూ చేరారు. ఒక్కసారిగా ఓ యువకుడు లీ జే మ్యుంగ్‌పై దాడి చేశాడు. కత్తి వంటి ఓ ఆయుధంతో ఆయన మెడపై బలంగా పొడిచాడు. దీంతో లీ జో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పదించిన భద్రత అతన్ని అక్కడి నుంచి లాక్కువెళ్లి అరెస్ట్ చేశారు. లీ జే మ్యుంగ్ను స్థానికఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది. Footage showing the Stabbing Attack earlier against the Leader of the Democratic Party of South Korea, Lee Jae-myung while he was Speaking to a Crowd in the Southeastern City of Busan. pic.twitter.com/uEAabsxzmX — OSINTdefender (@sentdefender) January 2, 2024 దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిపక్ష నేత లీ జే పై జరిగిన దాడి ఘటనను దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిటం సరికాదని అన్నారు. అయితే 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీ యూన్ సుక్ యోల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు -
17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు
న్యూయార్క్: హత్య కేసులో అమెరికాలో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. దోషికి కఠిన యావజ్జీవ శిక్షను విధించారు. ఫిలిప్ మ్యాథ్యు, మేరిన్ జోయ్(26) కేరళకు చెందినవారు. వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది జోయ్. అయితే.. మనస్పర్థల కారణంగా మ్యాథ్యు విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న జోయ్‌ని మ్యాథ్యు అడ్డగించి కత్తితో 17 సార్లు పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పైనుంచి కారును పోనిచ్చాడు. జోయ్ సన్నిహితులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో తనకో పాప ఉంది అని తెలిపిన జోయ్.. నిందితుని వివరాలను తెలిపింది. దీని ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. కేసును నమోదు చేశారు. దాదాపు మూడేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం దోషికి యావజ్జీవ శిక్ష విధించింది. తీర్పుపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు దోషికి శిక్ష పడినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు -
అమెరికాలో దాడి.. విషమంగానే ఖమ్మం యువకుడి పరిస్థితి
చికాగో: అమెరికా చికాగోలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గత మూడు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ మీదనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి దృష్యా వరుణ్ని ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ చికాగోలో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 29న జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్ప త్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందామని వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా అన్నారు. అటు వరుణ్ చికిత్స ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) గో ఫండ్ మీ(GoFundme)లో నిధుల సమీకరణను ప్రారంభించింది. బుధవారం రాత్రికి 38,000 డాలర్లకు పైగా సమీకరించింది. అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివర్ధన్ ఫోన్ చేసి వరుణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
పట్టపగలే అతి దారుణం.. రూ.3000 కోసం కత్తితో..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. రూ.3000 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే ఈ దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు కూడా ఆపే సాహసం చేయలేకపోయారు. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసఫ్ అలీ అని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితున్ని ఢిల్లీలోని సంఘమ్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆర్థిక వ్యవహారాలపై షారుక్ అనే వ్యక్తి తన కుమారున్ని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడని యూసఫ్ తండ్రి షాహిద్ అలీ తెలిపారు. అయితే.. షారుక్ వద్ద యూసఫ్ రూ.3000 అప్పుగా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలోనే షారుక్ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. షారుక్.. బాధితుడు యూసఫ్‌పై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే.. నిందితుడు షారుక్ కూడా సంగమ్ విహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
లండన్‌లో కత్తిపోట్లతో భారతీయుడు దుర్మరణం
లండన్: దక్షిణ లండన్‌లో భారతీయుడు ఒకరు వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. కేరళకు చెందిన అరవింద్ శశికుమార్ (38)ను సౌత్‌వార్క్‌లో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న శశికుమార్ ఆస్పత్రికి తరలించే లోపు మరణించినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్ సలీమ్ (25) అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తేజస్విని రెడ్డిని కత్తితో పొడిచి చంపిన మూడు రోజుల్లోనే మరొక భారతీయుడు అదే విధంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. -
రాక్షస తండ్రి.. కూతురు టెర్రస్‌పై పడుకుంటానని చెప్పడంతో..
ఇటీవల చాలామంది చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకులోనై ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగడుతున్నారు. చివరికి కటకటాలపాలై వారిని నమ్మకున్నవారిని నట్టేట ముంచుతున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అసహనంతో చేయకూడని పనులు చేసి నేరస్తులుగా మారుతున్నారు. సూరత్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ కోవలోనిదే! వివరాల్లోకెళ్లే.. సూరత్‌లో ఓ వ్యక్తి సత్య నగర్ సొసైటీలోని అద్దె అపార్ట్మెంట్లో కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె టెర్రస్‌పై పడుకునేందుకు వెళ్తానని అడిగింది. ఆ విషయమై ఇంట్లో వాగ్వాదం చోటుచేసుంది. అక్కడ పడుకోవద్దంటూ అతడు తన కూతురుకు కరాకండీగా చెప్పేశాడు. అయినా ఆమె మాటవినకపోవడంతో భార్య, పిల్లలతో గొడవపడ్డాడు. ఐతే కూతురు తాను టెర్రస్‌పైకే వెళ్తానంటూ మొండిపట్టుతో వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. అతడు తన కూతుర్ని అడ్డుకోవడమే గాక, ఏమాత్రం కనికరం లేకుండా కత్తితో 25 సార్లు దాడి చేసి హతమార్చాడు. విచక్షణ కోల్పోయిన సదరు వ్యక్తి ఆ తర్వాత భార్యపై దాడి చేసేందుకు యత్నించాడు. ఐతే ఇతర పిల్లలు జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నారు. ఆ సమయంలో వారు కూడా గాయపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ దారుణానికి పాల్పడిన నిందితుడిని రామానుజులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం) -
కేరళ వైద్యురాలిపై దాడి: కేంద్ర ఆరోగ్యమంత్రికి వైద్యుల సంఘం లేఖ
కేరళలో ఓ యవ వైద్యురాలు చికిత్స చేస్తుండగా.. పేషెంట్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలోని వ్యైద్యులు, ఆరోగ్యకార్యకర్తల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే వైద్యుల సంఘం ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవడమే గాక ఆరోగ్య సంరక్షణాధికారుల భద్రతను కూడా పర్యవేక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ విషయమై గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. లేఖలో ఆ సంఘటనను డ్యూటీలో ఉండగా జరిగిన క్రూరమైన హింసాత్మక చర్యగా పేర్కొనడమే గాక తక్షణమే చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. అలాగే బాధితురాలిని పోగొట్టుకున్న కుటుంబానికి తగిన మొత్తంలో నష్ట పరిహారాన్ని, ఆమె కుటుంబానికి ఉచిత ఆరోగ్య సదుపాయం అందించాలని లేఖలో పేర్కొంది వైద్యుల సంఘం. ఈ క్రమంలో సదరు వైద్యుల సంఘం ఎఫ్ఓఆర్డీఏతో సంబంధం ఉన్న అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసీయేషన్(ఆర్డీఏ)లను సదరు వైద్యురాలి మృతికి సంతాపాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే బాధితురాలి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు, క్యాండిలైట్స్తో మార్చ్ నిర్వహించి..ఆమె కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించడమే గాక సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు కూడా. పైగా సత్వరమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు. కాగా, కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్క ప్రాంతలో పోలీసులు బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చిన సందీప్ అనే సస్పెన్షన్‌కు గురయ్యిన ఉపాధ్యాయుడి దాడిలోనే సదరు వైద్యురాలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో గొడవపడి గాయడిన అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకురావడంతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..) -
కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..
యువ వైద్యురాలి మృతి యావత్తు కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. దీంతో వైద్యుల, ఆరోగ్య కార్యకర్తలకు కేరళ రాష్ట్రంలో ఎలాంటి భద్రత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో కేరళ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ ప్రతిపక్షాలు పినరయి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. అసలేం జరిగిందంటే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బుధవారం కేరళలో 24 ఏళ్ల వందనా దాస్ అనే యువ వైద్యురాలు పెషెంట్ దాడిలో మృతి చెందింది. నిజానికి ఆ రోగిని పోలీసులు తీసుకువచ్చారు. అతను సస్పెన్షకు గురైన ఓ ఉపాధ్యాయుడు. పేరు సందీప్. తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రక్షించమంటూ అతను పోలీసుల అత్యవసర హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన సందీప్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆ సమయంలో వందనాదాస్ అతడి గాయానికి డ్రస్సింగ్ చేస్తోంది ఇంతలో ఆకస్మికంగా రెచ్చిపోయి..చికిత్స చేస్తున్న డాక్టర్‌తో సహా సమీపంలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై కత్తెరతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ పేషెంట్ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువ డాక్టర్ వందనా దాస్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించి తెలసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు. దీన్ని దిగ్బ్రాంతికరమైన బాధకర ఘటన అని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఐతే ఈ ఘటనకు వ్యతిరేకంగా మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసీయేషన్(కేజీఎంఓఏ) వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. మరోవైపు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఏడురోజుల్లోగా ఈ ఘటనపై కొల్లాం జిల్లా పోలీస్ చీఫ్‌ను నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా, కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బాధితురాలు హౌస్ సర్జన్ అని, అంతగా అనుభవం లేదని చేసిన ప్రకటన కాస్త మరింత వివాదాస్పదమై విమర్శలకు ఆజ్యం పోసింది. ఆమె ప్రకటనపై కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ ఫైర్ అయ్యారు. వైద్యురాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..ఇలాంటికి జరగడం దురదృష్టకరమని సుధాకరన్ అన్నారు. యువ వైద్యురాలు హత్య యావత్తు కేరళ రాష్ట్రాన్నే కలిచివేసిందని కేరళ సీనియర్ నేత సతీశన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని సతీశన్ ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పినరయి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించాయి. కాగా, విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలపడమే గాక ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐతే కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఈ విషాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే గాక మెడికల్ టూరిజానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలో ఇలాంట ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ ఘటన కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని, కేరళలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతలో లోపాలను తేటతెల్లం చేసిందని విమర్శించారు. (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్
తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు హత్యకు సంబంధించిన తాజా సీసీఫుటేజ్ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీహార్ జైలులోని అధికారులు, భద్రతా సిబ్బంది ప్రవర్తన విషయమై విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని తీహార్ జైలులో జరిగిన గ్యాంగ్‌వార్‌లో టిల్లు తాజ్‌పురియా చనిపోయినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీసీఫుటేజ్ ప్రకారం..నిజానికి జైలులో భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లు హత్యకు గురయ్యినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో.. సుమారు 20 మంది ఖైదీలు టిల్లుపై దారుణంగా దాడిచేశారు. దీంతో భద్రతా సిబ్బంది అతని జైలు నుంచి తరలిస్తుండగా ప్రత్యర్థి గ్యాంగ్ మరోసారి దాడికి పాల్పడింది. వారంతా భద్రతా సిబ్బంది సమక్షంలో సుమారు 90 సార్లు కత్తితో దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషించేదే తప్ప వారిని ఆపే యత్నం చేయలేదు. గ్యాంగ్‌స్టర్ టిల్లు శరీరీంపై సుమారు 100 గాయాలు గుర్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఆ తీహార్ జైలులో నియమించబడిన భద్రతా సిబ్బంది తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు చెందినవారు. ఇదిలా ఉండగా, సెప్టెంబరు 2021లో రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లోని కోర్టు గదిలో ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగీని దారుణంగా హత్య చేసిన కేసులో మరణించిన తాజ్‌పురియా ప్రధాన నిందితుడు. ఐతే పోలీసులు తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా గోగీ గ్యాంగ్ సభ్యలు తాజ్‌పురియా హత్యకు పథకం పన్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, గత నెలలో, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు ప్రిన్స్ తెవాటియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో దాడి చేసి చంపిన ఘటన మరువక మునుపే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు) -
పట్టుబడ్డ దొంగను స్టేషన్‌కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..
మొబైల్ ఫోన్ దొంగతనం కేసు విషయమై ఒక దొంగను పట్టుకుని తరలిస్తుండగా అనుహ్యంగా పోలీసుపై దాడి చేశాడు. అదీకూడా అందరూ చూస్తుండగా పట్టపగలే దాడి చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలో మయపూరీలోని ఒక స్లమ్ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ ఢిల్లీలోని మాయపురిలో అనిష్ రాజ్ అనే దొంగ ఒక మహిళ ఫోన్‌ని దొంగలించాడు. దీంతో ఆ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్ఐ శంభు దయాల్ ఈ కేసు విషయమే ఆ మహిళను తీసుకుని సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సదరు మహిళ అనీష్‌ను చూపిస్తూ ఇతనే నా భర్త ఫోన్ దొంగలించాడనే చూపించింది. దీంతో వెంటనే దయాల్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కి తరలిస్తుండగా ఒక్కసారిగా జేబులోంచి కత్తిని తీసి పోలీసు ఛాతి, మెడ, వెన్నుపై ఏకంగా 12 సార్లు దాడి చేశాడు. పాపం ఆ పోలీసుల వాటిని లెక్కచేయకుండా అతన్ని ఆపేందుకు యత్నించాడు. ఐతే నిందితుడు సదరు పోలీస్‌ని తోసేసి పారిపోయాడు. దీంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా స్పందించి..నిందితుడిని వెంబడించారు. సమీపంలో ఉన్న మరో పోలీసు అతడ్ని పట్టుకుని అరెస్టు చేశాడు. ఆ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది కూడా. ఐతే గాయపడిన ఏఎస్ఐని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆయన నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి మృతి చెందారు. రాజస్తాన్‌లోని సికార్‌కు చెందిన శంభు దయాల్‌కి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా సదరు పోలీసు శంభూజీకి నివాళులర్పించారు. అంతేగాదు ట్విట్టర్లో...ప్రజలను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పట్టించుకోని మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. మీ ప్రాణానికి విలువ కట్టలేం కానీ మీ గౌరవార్థం కోటి రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం అని అన్నారు. जनता की रक्षा करते हुए ASI शंभु जी ने अपनी जान तक की परवाह नहीं की। वे शहीद हो गये। हमें उन पर गर्व है। उनकी जान की कोई क़ीमत नहीं पर उनके सम्मान में हम उनके परिवार को एक करोड़ रुपये की सम्मान राशि देंगे। https://t.co/RA3EW8MKXL — Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2023 Delhi Police Cop was brutally stabbed to Death in Mayapuri Delhi by a Jihadee. When u vote for Free and ur Leader is an Anarchist ,hell bound to change the demography this is bound to happen. What u need somebody Like Maharaj #Yogi in almost all the state of Bharat. pic.twitter.com/Fzv4a2sY5b — Kavi🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) January 9, 2023 (చదవండి: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా! విలపిస్తున్న బాధితురాలి భర్త) -
ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో..
తరచూ ఎక్కడో ఒక చోట ప్రేమోన్మాదుల దాష్టీకానికి అమ్మాయిలు బలవుతున్నారు. చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాల్సినవారు ప్రేమపాశానికి బలవుతూ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. మరోవైపు దాడులకు పాల్పడినవారు కటకటాల పాలై బతుకును బుగ్గి చేసుకుంటున్నారు. యశవంతపుర: ప్రేమించలేదనే కోపంతో విద్యారి్థనిని మరో విద్యార్థి చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. యలహంక రాజనకుంట పోలీసుస్టేషన్ పరిధిలో దిబ్బూరులోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీ ఈ దారుణానికి వేదికైంది. కోలారుకు చెందిన లయస్మిత (19) హతురాలు. వివరాలు.. లయస్మిత ఈ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యారి్థని కాగా, ఆమె స్నేహితుడు పవన్ నృపతుంగ రోడ్డులో విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. లయస్మితను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె ఇష్టం లేదని చెప్పినా పవన్ తీరు మారలేదు. 10 సార్లు కత్తితో పొడిచి హత్య కాలేజీకీ వచ్చి ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి లయస్మితను క్లాసు నుంచి పిలిపించాడు. నన్ను ప్రేమిస్తావా, లేదా అని పవన్ డిమాండ్ చేయగా లయస్మిత నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన పవన్ కత్తి తీసుకుని 10 సార్లు ఆమెను పొడిచాడు. లయస్మిత రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ ఘోరాన్ని చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. తరువాత ప్రేమోన్మాది చాకుతో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన పవన్‌ను విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. పవన్ తరచూ కాలేజీకి వచ్చి ప్రేమ పేరుతో లయస్మితను వేధించినట్లు తెలిసింది. రాజనుకుంట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమోన్మాది మారణకాండ తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి: బెంగళూరులో వ్యాపారి ఆత్మహత్య.. సుసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే పేరు -
షాకింగ్ వీడియో.. బైక్‌ను వెంబడించి మరీ.. యువకుడిని కత్తితో పొడిచి..
భోపాల్: ఆరుగురు మైనర్లు ఓ బైక్‌ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్ 31న చోటుచేసుకుంది. భన్వర్ కౌన్ ప్రాంతంలో ఆయుష్(22) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంత మంది అబ్బాయిలు నిలబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో హారన్ కొట్టిన ఆయుష్..దారి క్లియర్ చేసి వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు. ఈ క్రమంలో మైనర్లకు, యువకుడికి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం కొంతమంది మైనర్లు బైక్ వెనక పరుగెత్తి బైక్‌పై వెనకాల కూర్చున్న ఆయుష్‌పై కత్తితో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంతమంది యువకుల బృందం బైక్ వెనకాల పరుగెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తిని పట్టుకొని కత్తితో పొడిచారు. అనంతరం వారందరూ అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈ ఘటన అనంతరం ఆయుష్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. నిందితులైన ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్ల్ చేశారు. అందరిపై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. मध्यप्रदेश इंदौर में रात पौने तीन बजे युवक की हत्या, हार्न बजाने की बात पर हुआ था विवाद#Indore #MadhyaPradesh #MPNews pic.twitter.com/SWpWlC6jB2 — manishkharya (@manishkharya1) January 1, 2023 -
షాకింగ్: ఓనర్‌పై కత్తులతో దాడి.. అడ్డొచ్చిన మరో ఇద్దరినీ దారుణంగా..!
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పనిలోంచి తీసేశాడనే కోపంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన ఇద్దరు బందువులను దారుణంగా పొడిచి చంపేశారు ఇద్దరు వర్కర్లు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించామని, వారిని ఇటీవలే పని లోంచి తీసేసినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కల్పేశ్ ధోలకియాకు సూరత్‌లో వేదాంత టెక్సో పేరిటా ఎంబ్రయిడరీ ఫ్యాక్టరీ ఉంది. 10 రోజుల క్రితం పనిలోంచి తొలగించిన ఇద్దరు కార్మికులు ఆదివారం ఉదయం 9 గంటలకు ధోలకియాను కలిసేందుకు ఫ్యాక్టరీకి వచ్చారు. తమను పనిలోంచి తీసేయడంపై యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులో ఒకరు కత్తి తీసి ధోలకియాను పొడిచాడు. అక్కడే ఉన్న కల్పేశ్ తండ్రి ధంజిభాయ్, అతడి మామ ఘన్‌శ్యామ్ రజోడియాలు కలుగజేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని సైతం కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. హుటాహుటిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సూరత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హర్షద్ మెహత తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారిలో ఒకరు జువెనైల్‌గా పేర్కొన్నారు. నైట్ డ్యూటీ సమయంలో వారు చేసిన తప్పిదం వల్ల ఇరువురిని పనిలోంచి తీసేసినట్లు గుర్తించామన్నారు. వారికి ఇవ్వాల్సిన జీతం మొత్తం ఇచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...
భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆమె భర్త. ఈ ఘటన రాజస్తాన్ ధోలపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకాం....ఈ జంట ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకుసుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే జైపూర్‌లో ఉంటున్న భర్త కుటుంబసభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబసభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందకు ఒప్పుకోవడం లేదన్న కోపందో ఆమె భర్త కోపంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానన్న భయంతో బెంచ్ మీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను రాసింది. ఆ తర్వాత ఆమె ఒక జీఆర్పీ జవాన్ సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్‌తో...) -
ఘోరం: పేగులు బయటకొచ్చేలా పొడిచి....
దీపావళికి రెండు రోజుల ముందు ఒక దారుణ ఘటన చోటుచోసుకుంది. అక్టోబర్ 22 తేదిన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ...బస్సుకోసం ఎదురు చూస్తున్న వ్యక్తిపై కొందరూ వ్యక్తుల దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఏకంగా పేగులు బయటకొచ్చేలా 12 సార్లు కత్తితో పొడిచి హతమార్చారు. ఆ తర్వాత అతని వద్ద నుంచి వాలెట్, ఫోన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని ఆస్పత్రిక తరలించగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. బాధితుడుని హర్షగా పోలీసులు గుర్తించారు. ఐతే హర్హ కుటుంబికులకు అతను మృతి చెందినట్లు మరసటి రోజు వరకు తెలియరాలేదన్నారు. హర్షే తన కుటుంబానికి జీవనాధారం అని, అతను అందరికి సహాయకారిగా ఉంటాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితుడి కుటుంబం తమకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఐతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీఫుటేజ్‌లు లేకపోవడంతో వారిని అరెస్టు చేయలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం) -
ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్ షేక్
ఇటీవలకాలంలో పలు జంటలు ఏవేవో కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన పిల్లల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడం తదనంతరం ఒకరినోకరు చంపుకునే స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడం తోపాటు వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం...ముంబైలోని 36 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ ఇక్బాల్ షేక్ హిందు మహిళ రూపాలిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. రూపాలి అతన్ని పెళ్లి చేసుకోవడంతోనే తన పేరును జరా గా మార్చుకుంది. ఆ తర్వాత వారికి 2020లో ఒక కొడుకు జన్మించాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. రానురాను ఇక్బాల్ బురఖా ధరించాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అందుకు అంగీకరించని రూపాలి తన కుమారుడిని తీసుకుని విడిగా ఉంటోంది. ఐతే ఇక్బాల్ షేక్ విడాకులు తీసుకునే విషయమై చర్చించేందుకు కలుద్దాం అంటూ ఆమెని పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొడుకు కస్టడీ విషయమై వాగ్వాదం తలెత్తింది. అంతే ఒక్కసారిగా ఇక్బాల్ కోపంతో కత్తి తీసుకుని రూపాలిని పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి విలాస్ రాథోడ్ తెలిపారు. నిందితుడు ఇక్బాల్ షేక్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం) -
క్వీన్ అంత్యక్రియల వేళ అనుహ్య ఘటన... షాక్‌లో బ్రిటన్
లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వేళ ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసు అధికారులు కత్తిపోటుకు గురయ్యారు. ఒక దుండగుడుని దాడులకు తెగబడతాడన్న అనుమానంతో ఇద్దరు అధికారులు అదుపులోకి తీసుకుంటుండగా.. వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ ఇద్దరు అధికారుల తోపాటు సదరు దుండగుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని లండన్ మెట్రో పాలిటన్ పోలీస్ శాఖ పేర్కొంది. ఈ సంఘటనకు గల కారణాలపై పూర్తి స్తాయిలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. లండన్ మేయర్ ఈ దాడిని అత్యంత భయంకరమైనదిగా పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూకేలో తొలిసారిగా జరుగుతున్న ప్రభుత్వ లాంఛన అంత్యక్రియలకు యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరుకానున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని కట్టదిట్టంగా పర్యవేక్షించడానికి బ్రిటన్ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పోలీసులు లండన్‌లో మోహరించారు. అందులో 15 వందల మంది ఆర్మీ సిబ్బంది ప్రజల భద్రతను నిర్వహిస్తారు. (చదవండి: రాణి తుది వీడ్కోలు... ఆహ్వానం లేనిది వీళ్లకే) -
చిచ్చు రేపిని బిర్యాని వంట... భార్యపై కత్తితో దాడి
ముంబై: ఒక వ్యక్తి తన భార్య రాత్రి భోజనానికి బిర్యాని వండలేదన్న కోపంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని లతూర్లో చోటుచేసుకుంది. ఆగస్టు 31 రాత్రి సదరు వ్యక్తి రాత్రి భోజనానికి బిర్యాని ఎందుకు వండలేదంటూ భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్న వినకుండా భార్యని కత్తితో పొడిచి పరారయ్యాడు. సదరు వ్యక్తిని పోలీసులు విక్రమ్ వినాయక్ దేదేగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని వెల్లడించారు. ఐతే ఈ కేసు విషయమై ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి... ఆ తర్వాత అతను
పెళ్లి చేసుకుందామంటూ ఆమె వెంటపడ్డాడు. ఐతే ఆమె అందుకు అస్సలు అంగీకరించటం లేదు. దీంతో ఆమె పై పలుమార్లు కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని 20 ఏళ్ల యువతిని బబ్లు అనే వ్యక్తి పెళ్లి చేకుందామంటూ వేధించసాగాడు. ఐతే ఆ యువతి అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన బబ్లు ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉన్నసమయంలో కత్తితో దాడి చేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, సదరు యువతిని చికిత్సి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి వివేక్ సింగ్ తెలిపారు. నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులకు బబ్లు ఖడ్వాలోని ఇందిరా సాగర్ డ్యామ్ సమీపంలో శవమై కనిపించాడని తెలిపారు. బహుశా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి సోదరి బబ్లు అనే వ్యక్తి పక్కనే ఉన్న గ్రామంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తుంటాడని తెలిపింది. ఐతే ఆ బబ్లు అనే వ్యక్తి తన అక్కను పెళ్లి చేసుకోవాలని పదే పదే బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. వాళ్ల అమ్మనాన్నలు ఊరెళ్లడంతో తామిద్దరమే ఇంట్లో ఉన్నామని, ఆ సమయంలోనే బబ్లు వచ్చి అక్క పై దాడి చేసి వెళ్లిపోయాడని చెప్పింది. తాను ఆ సమయంలో ఇంటి బయట బకెట్లో నీళ్లు నింపుతుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి చెల్లెలు చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనపై తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు. (చదవండి: కుడి చేతిపై లవ్ సింబల్.. భార్య ప్రవర్తనతో భర్త షాక్.. చివరికి ఏం చేశాడంటే?) -
స్వాతంత్య్ర వేడుకుల నడుమ ఉద్రిక్తతలు
శివమొగ్గ: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శివమొగ్గ నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమరయోధుడు సావర్కర్ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. సోమవారం ఇక్కడి హమీద్ అహ్మద్ సర్కిల్ వద్ద వీర సావర్కర్ ఫ్లెక్సీతో సావర్కర్ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించగా కొందరు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఇదే సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని సావర్కర్ ఫ్లెక్సీని తొలగించాలని యత్నించారు. దాని స్థానంలో టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి యత్నిస్తుండగా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో హిందూ పోరాట సంఘాలు అక్కడి చేరుకోవడంతో గొడవ మరింత పెరిగింది. సర్కిల్‌కు సమీపంలో ప్రేమ్‌సింగ్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు చాకుతో దాడి చేశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. (చదవండి: జెండా పండుగలో విషాదం) -
న్యూయార్క్: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
-
వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజెంటర్ రష్దీని సభికులకు పరిచయడం చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి వేదికపైకి దూసుకొచ్చి వెనక నుంచి దాడికి తెగబడ్డాడు. కనీసం 10 సెకన్ల పాటు కత్తితో ఆయనను పదేపదే పొడిచాడు. మెడ తదితర చోట్ల పది నుంచి పదిహేను దాకా కత్తిపోట్లు దిగినట్టు తెలుస్తోంది. దాంతో రష్దీ రెయిలింగ్‌ను ఊతంగా పట్టుకుని అలాగే కిందికి ఒరిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘రష్దీ చుట్టూ రక్తం మడుగులు కట్టింది. అయన కళ్ల చుట్టూ, చెంపల గుండా రక్తం కారింది. వెనకనున్న గోడ, సమీపంలోని కుర్చీతో పాటు పరిసరాలు కూడా రక్తసిక్తంగా మారాయి’’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ హఠాత్సంఘటనతో సభికులంతా బిత్తరపోయారు. సహాయకులు, భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి కింద పడిపోయిన రష్దీని పైకి లేపారు. ప్రథమ చికిత్స తర్వాత హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. దాడిలో రష్దీ మెడపై గాయమైనట్టు న్యూయార్క్ పోలీసులు నిర్ధారించారు. ‘‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు దాడి జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. రష్దీ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతానికి మాకెలాంటి సమాచారం లేదు’’ అని వెల్లడించారు. రష్దీని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి కూడా దాడిలో స్వల్ప గాయాలైనట్టు చెప్పారు. రష్దీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని బీబీసీ వార్తా సంస్థ పేర్కొంది. దాడి అనంతరం అంతా రష్దీ చుట్టూ మూగగా దుండగుడు దర్జాగా వేదిక దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక సభికులు, భద్రతా సిబ్బంది అతన్ని నిర్బంధించారు. దాడిపై సాహితీ ప్రపంచం నుంచి విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. జరిగింది మాటలకందని దారుణమని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ అన్నారు. రష్దీ ప్రాణాలతోనే ఉన్నారని ధ్రువీకరించారు. కడపటి సమాచారం అందేసరికి ఆయనకు ఆపరేషన్ జరుగుతున్నట్టు సమాచారం. బెదిరింపులే ప్రసంగాంశం... శుక్రవారం రష్దీపై జరిగిన దాడికి పశ్చిమ న్యూయార్క్ శివార్లలోని చౌటౌకా ఇన్స్టిట్యూషన్ వేదికైంది. అక్కడ రష్దీ ప్రసంగ అంశం కూడా బెదిరింపుల కారణంగా ప్రవాసులుగా మారిన రచయితలకు సంబంధించిందే కావడం విశేషం. వారి రక్షణకు కృషి చేస్తున్న పిట్స్బర్గ్ నాన్‌ప్రాఫిట్ సిటీ ఆఫ్ అసైలం అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ సభలో ‘మోర్ దాన్ షెల్టర్ (ఆశ్రయానికి మించి...)’ అనే అంశంపై ఆయన మాట్లాడాల్సి ఉంది. అందులో భాగంగా బెదిరింపులు ఎదుర్కొంటున్న రచయితలకు అమెరికా ఆశ్రయంగా మారుతున్న వైనంపై కూడా చర్చ జరగాల్సి ఉంది. ‘‘రష్దీపై దాడి జరిగిందని తెలిసి షాకయ్యా. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పాశ్చాత్య దేశాల్లో అత్యంత సురక్షిత పరిస్థితుల్లో నడుమ ఉన్న ఆయనపైనే దాడి జరిగిందంటే ఇస్లాంపై విమర్శనాత్మక ధోరణి కనబరిచే వారందరిపైనా దాడులు తప్పవు. చాలా ఆందోళనగా ఉంది’’ – తస్లీమా నస్రీన్ ఫత్వా పడగ నీడలో.. వివాదాస్పద రచయితగా పేరుపడ్డ రష్దీ 1947 జూన్ 19న ముంబైలో జన్మించారు. పూర్తి పేరు అహ్మద్ సల్మాన్ రష్దీ. రచయితగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చారిత్రక విషయాలతో పాటు వర్తమాన అంశాలకు ఆత్మాశ్రయ శైలిలో మనసుకు హత్తుకునేలా అక్షర రూపమివ్వడం ఆయన ప్రత్యేకత. 14 నవలలు, ఓ కథా సంకలనంతో పాటు పలు కాల్పనికేతర రచనలు చేశారు. ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం, దేశ విభజన దాకా సాగిన పరిణామాలను చిత్రించిన నవల మిడ్నైట్స్ చిల్డ్రన్కు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. అయితే మతాన్ని కించపరిచే రాతలు రాస్తున్నారంటూ 1980ల నుంచే రష్దీని వివాదాలు చుట్టుముట్టాయి. బెదిరింపులు మొదలయ్యాయి. మహ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా 1988లో రాసిన నాలుగో నవల సటానిక్ వర్సెస్ పెను దుమారానికే దారితీసింది. పాకిస్తాన్ సహా పలు దేశాలు దాన్ని నిషేధించాయి. రష్దీని చంపుతామంటూ లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చాయి. ఫత్వాలు జారీ అయ్యాయి. రష్దీని ఉరి తీయాలంటూ ఇరాన్ ఆధ్యాత్మిక నేత అయతుల్లా ఖొమైనీ 1989లో ఫత్వా జారీ చేశారు. ఆయన్ను చంపిన వారికి 30 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామంటూ ఇరాన్ తదితర దేశాల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి! దాంతో 1989లో రష్దీ భారత్ వీడారు. జోసెఫ్ ఆంటొన్ అనే మారుపేరుతో తొమ్మిదేళ్లకు పైగా రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అందుకే తన జ్ఞాపకాలకు జోసెఫ్ ఆంటొన్ పేరుతోనే పుస్తక రూపమిచ్చారు. ఎప్పటికైనా చంపి తీరతామంటూ ఇరాన్ నుంచి తనకు ఏటా క్రమం తప్పకుండా ‘ప్రేమలేఖలు’ వచ్చేవని రష్దీ ఒక సందర్భంలో చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో 1989 నుంచి 2002 దాకా బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు నిరంతర భద్రత కల్పించింది. సాహిత్యానికి చేసిన సేవకు గాను 2007లో నైట్‌హుడ్ ఇచ్చి గౌరవించింది. ఈ అనుభవాలకు కూడా ‘ఫత్వా జ్ఞాపకాలు’గా రష్దీ పుస్తక రూపమిచ్చారు! 2000 అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అంతర్జాతీయ రచయితల సంఘానికి సారథ్యం వహించారు. బెదిరింపుల కారణంగా ప్రవాసంలో గడుపుతున్న రచయితల సంక్షేమం కోసం నడుం బిగించారు. రష్దీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. 30 ఏళ్లకు పైగా రష్దీ ఫత్వా పడగ నీడలోనే గడుపుతున్నారు. ఇటీవల భారత్ వచ్చేందుకు కేంద్రం వీసా నిరాకరించడం తననెంతగానో బాధించిందని చెప్పారాయన. అనువాదకుల హత్య సటానిక్ వర్సెస్ను అనువదించినందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు రచయితలు ప్రాణాలు కోల్పోయారు! జపనీస్‌లోకి అనువదించిన హిటోషీ ఇగరాషీని యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పొడిచి చంపారు. టర్కిష్‌లోకి అనువదించిన అజీజ్ నెసిన్పై జరిగిన బాంబు దాడి ఆయనతో పాటు మరో 36 మందిని కూడా బలి తీసుకుంది. ఇటాలియన్‌లోకి అనువదించిన ఎటోర్ కాప్రియోలో కత్తి పోట్ల బారిన పడ్డారు. నార్వే భాషలో ప్రచురించిన వ్యక్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. నిరంతరం భారీ భద్రత నడుమ బతకాల్సి వస్తోందంటూ రష్దీ పలుమార్లు ఆవేదన వెలిబుచ్చారు. కానీ ఆయనపై తాజాగా దాడికి భద్రతా లోపాలే ప్రధాన కారణమంటూ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన సాహితీ అభిమానులు వాపోవడం విషాదం. -
నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! అంటూ గొడవ చేసిన తండ్రి...
Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్. ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్లు వేసే అంగన్వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం) -
కర్ణాటకలో ముసుగు దుండగుల దాడి కలకలం
బెంగళూరు: కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు. భయంతో అతను పరుగులు తీసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వాళ్లు పారిపోగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆపై అతను మరణించినట్లు తెలుస్తోంది. Karnataka | Last rites of man hacked to death by an unidentified group yesterday being performed in Surathkal near Mangaluru pic.twitter.com/40mIW4SleD — ANI (@ANI) July 29, 2022 ఘటన తర్వాత సురత్కల్‌ను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్. 144 సెక్షన్ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా. ఇదీ చదవండి: ఘోరం.. కుప్పకూలిన మిగ్–21.. ఇద్దరు పైలట్ల దుర్మరణం -
తన ప్రేమను తిరస్కరించిందని...కర్కశంగా కత్తితో పొడిచి ఆ తర్వాత...
ఇటీవల యువతీ యువకులు ప్రేమ కోసం చనిపోవడం లేదా తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని చంపేయడం వంటి దారుణాలకు ఒడిగడ్డుతున్నారు. చదువకుకునే వయసులో కలిగే ప్రేమలకు, ఆకర్షణలకు లొంగిపోయి బంగారంలాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అదే కోవకు చెందినవాడు తమిళనాడుకు చెందిన ఒక యువకుడు. చక్కగా తన మానాన తాను చదుకుంటున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఆ యువకుడి వెంటపడి వేధించాడు. చివరికి జైల్లో పెట్టించినా మారకపోగా ఆ బాలికను చంపేందుకు యత్నించాడు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక పరీక్షలు అయిపోయాయని తన బంధువుల ఇంటికి ఆనందంగా వెళ్తోంది. ఇంతలో కేశవన్ అనే వ్యక్తి వచ్చి ఆమె వెళ్తున్న దారిలో అడ్డగించి అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమంటూ వేధించాడు. ఆమె నిరాకరించడంతో కోపంగా కత్తితో 14 సార్లు కిరాతకంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ కేశవన్ పై ఆ బాలిక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులు కేశవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి స్పందిచడమే కాకుండా నిందుతుడి పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కోరారు. ఈ మేరకు పోలీసులు కేశవన్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కూడా. అయితే కేశవన్ మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతదేహం వద్ద ఉన్న వస్తువులు, కేశవ తండ్రి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కేశవన్ పోలీసులు నిర్థారించారు. (చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..) -
సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి..
బుచ్చెయ్యపేట/రావికమతం(అనకాపల్లి జిల్లా): నెల రోజుల్లో ఇద్దరికీ వివాహం. సోమవారం షికారుకని ఇంట్లో పెద్దలకు చెప్పి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. కొత్త జంట ఆనందంగా గడుపుతారని అందరూ అనుకున్నారు. యువకుడు రక్తపు మడుగులో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడడంతో అంతా హతాశులయ్యారు. తనకు కాబోయే భార్యే కత్తితో తన గొంతు కోసిందని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ సీన్ సోమవారం సాయంత్రం బుచ్చెయ్యపేట మండలం అమరపురి వద్ద జరిగింది. హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న తమ కుమారుడికి ఈ గతి పట్టిందేమిటని తల్లిదండ్రులు రమణ, గంగమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. బుచ్చెయ్యపేట ఎస్ఐ బి.రామకృష్ణ కథనం ప్రకారం.. మాడుగుల మండలం ఘాటీరోడ్డుకు చెందిన అద్దేపల్లి రామునాయుడుకు రావికమతానికి చెందిన వియ్యపు పుష్పతో వివాహం చేయడానికి ఇరు కుటుంబాల వారు ఆరు నెలల కిందట నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన వీరి వివాహానికి నిశి్చతార్థం చేశారు. మే 20న వివాహం చేయడానికి ముహూర్తం పెట్టారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం అమ్మాయి ఫోన్ చేయడంతో రామునాయుడు ఘాటీరోడ్డు నుంచి రావికమతం వెళ్లాడు. అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పి ఇద్దరూ బుచ్చెయ్యపేట మండలం కొమళ్లపూడి దగ్గర ఉన్న అమరపురి బాబా గుడి వద్దకు బైక్‌పై వెళ్లారు. ప్రైజ్ ఇస్తానని.. సర్ప్రైజ్ చేస్తానని.. బహుమతి ఇస్తానని, కళ్లు మూసుకోమని యువతి కోరినట్టు బాధితుడు వాంగ్మూలంలో చెప్పాడు. తన చున్నీతో కళ్లకు గంతలు కట్టిందని, అంతలోనే కత్తితో గొంతుపై గాయపరచిందని ఆయన పేర్కొన్నారు. రక్తంతో రామునాయుడు షర్టు తడిచిపోవడంతో పుష్ప భయందోళన చెందింది. రక్తం కారకుండా పుష్ప చున్నీ గొంతుకు కట్టుకుని ఆమెను బైక్ ఎక్కించుకుని రామునాయుడు రావికమతం ఆస్పత్రికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పరిస్ధితి విషమంగా ఉండటంతో బైక్‌ను రోడ్డు పక్కన ఆపి సొమ్మసిల్లిపోయాడు. అక్కడ ఉన్న యువకుడు రామునాయుడు పరిస్ధితిని చూసి రావికమతం ఆస్పత్రిలో ఇద్దరినీ విడిచి వెళ్లిపోయాడు. వైద్యుల సలహా మేరకు పరిస్ధితి విషమంగా ఉండటంతో రామునాయుడును అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తం అవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని రామునాయుడు కుటుంబ సభ్యులకు అక్కడ వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న బుచ్చెయ్యపేట ఎస్ఐ అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి విషమ పరిస్ధితిలో ఉన్న రామునాయుడు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనకు కాబోయే భార్యే కత్తితో తన గొంతు కోసిందని, నీవంటే నాకు ఇష్టం లేదని చెప్పిందని రామునాయుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సోమవారం వీరు ఎక్కడెక్కడికి తిరిగారు.. గొంతు కోసిన తరవాత వీళ్లని ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడెవరు.. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులేమంటున్నారు.. తదితర విషయాలపై బుచ్చెయ్యపేట ఎస్ఐ విచారణ చేస్తున్నారు. రామునాయుడు పరిస్థితి కాస్త మెరుగైందని, ప్రాణాపాయం లేదని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. చదవండి: (ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే చావే గతని..) -
ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు
సాక్షి, చెన్నై: పెళ్లికి నిరాకరించిన ప్రియురాల్ని ప్రియుడు కత్తితో పొడిచాడు. అతడి నుంచి తప్పించుకునే ›క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో ప్రియురాలు కూడా దాడి చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మరణించగా, ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలు.. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరులో ఓ ప్రైవేటు నూలు పరిశ్రమ ఉంది. ఇక్కడ ఉత్తరాదికి చెందిన కార్మికులు అధికంగా పనిచేస్తున్నారు. ఇందులో చత్తీస్‌గడ్‌కు చెందిన తులసి (20), రూపేష్ కుమార్(24) కూడా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు తొలుత ప్రేమించుకున్నారు. తర్వాత అతడిని ఆమె దూరం పెట్టింది. చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య దీంతో ఆగ్రహించిన రూపేష్‌కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని తులసిపై ఒత్తిడి తెచ్చాడు. ఈక్రమంలో శనివారం రాత్రి విధుల్ని ముగించుకుని తులసి తమకు కేటాయించిన క్వార్టర్స్‌లోని ఇంట్లోకి వెళ్లగానే, రూపేష్‌కుమార్ కూడా చొరబడి.. కత్తితో ఆమెపై దాడి చేశాడు. తనను తాను రక్షించుకునేందుకు ఇంట్లో ఉన్న కత్తి తో తులసి ఎదురు దాడి చేసింది. చివరికి కత్తిగాట్ల తో తులసి ఘటనాస్థలంలోనే మరణించింది. గాయ పడిన రూపేష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నామక్కల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో -
అత్తారింటికి వెళ్లి.. భార్య, బామ్మర్దిపై కత్తితో దాడి
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్య, బామ్మర్దిలపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన వడ్లపూడి రైల్వే క్వార్టర్స్ చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. గాజువాకలోని సుందరయ్య కాలనీకి చెందిన భాస్కర్ (33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి రైల్వే కార్టర్స్‌కు చెందిన భారతి (31)తో గతంలో వివాహం జరిగింది. భార్యతో మనస్పర్థల వల్ల రెండేళ్ల నుంచి గొడవలు పడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఒక కేసు కోర్టులో నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆదివారం రాత్రి భాస్కర్ రైల్వే క్వార్టర్స్‌లోని అత్తారింటికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసిన బామ్మర్ది గోపాలకృష్ణ పొట్టలో కత్తితో పొడిచాడు. ఈలోగా అక్కడికి వచ్చిన భార్య భారతి మెడపై, కడుపులో, ఎడమ చేతిపై దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. స్థానికులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం మొదట గాజువాక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతను గాజువాక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో స్టీల్‌ప్లాంట్ పోలీసులకు సమాచారం అందించారు. స్టీల్‌ప్లాంట్ సీఐ సత్యనారాయణరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) -
ఎల్బీనగర్లో ఉన్మాది ఘాతుకం..
-
కాదన్నందుకు కత్తి కట్టాడు
నాగోలు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంగా కక్ష కట్టిన ప్రేమోన్మాది ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఏకంగా 18 సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిందితుడిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ సమీపంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజు (23) నగరంలోని రాందేవ్‌గూడలో ఉన్న సన్‌సిటీలో ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకాల్ గ్రామానికి చెందిన యువతి (20) గతేడాది లాక్డౌన్ నుంచి హస్తినాపురం సెంట్రల్‌లోని తన పిన్ని వద్ద ఉంటోంది. ఈమె ఇంటర్ పూర్తి చేసింది. బస్వరాజు అమ్మమ్మది కూడా చంద్రకాల్ కావడంతో ఇతడు తరచూ అక్కడికి వెళ్తుం డేవాడు. దూరపు బంధువైన ఆ యువతితో ఇతడికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల కింద ఆమె ఇంటికి వెళ్లిన బస్వరాజు.. తమ ప్రేమ విషయం చెప్పాడు. అయితే డిగ్రీ చదివినప్పటికీ సెంట్రింగ్ పని చేస్తున్న బస్వరాజుకు ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి కుటుంబీకులు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా, ఆమెకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో మూడు నెలల కింద నిశ్చితార్థం జరిగింది. ఈమెకు తరచుగా ఫోన్లు చేస్తున్న బస్వరాజ్ పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండేవాడు. దీంతో అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. అయినా వేరే నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఆమె బయటకు వెళ్లినప్పుడు వచ్చి కలుస్తుండేవాడు. ఆ సందర్భంలోనూ పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. అయితే తన కుటుంబీకులకు ఇష్టం లేకపోవడంతో పెళ్లి చేసుకోలేనంటూ ఆమె స్పష్టం చేసింది. 18 కత్తిపోట్లు.. బుధవారం తన ఇంట్లో ఉండే కత్తిని తీసుకుని బస్వరాజు హస్తినాపురం వచ్చాడు. మధ్యాహ్నం 3:35 గంటల సమయంలో శిరీష ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటి తలుపులు కొట్టడంతో శిరీష వచ్చి తీసింది. ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి వాగ్వాదానికి దిగాడు. విచక్షణ కోల్పోయిన అతగాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ఇంటి ముందే, నడిరోడ్డుపై దాడికి దిగాడు. తనను ఏమీ చేయొద్దని శిరీష ప్రాధేయపడినా, కాళ్లు పట్టుకున్నా బస్వరాజ్ కనికరించలేదు. కత్తితో విచక్షణారహితంగా చేతికి దొరికిన చోట పొడిచాడు. శిరీష చేతులు, వీపు, ఛాతీ, తొడ, కడుపు భాగాల్లో మొత్తం 18 కత్తిపోట్లు గాయాలయ్యాయి. దాదాపు 5 నిమిషాల పాటు పొడిచాడని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న శిరీష అరుపులు విని బయటకు వచ్చిన పైఅంతస్తులో ఉండే వారు బస్వరాజ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. అనంతరం ఫోన్ ద్వారా ఉషశ్రీకి సమాచారం ఇచ్చారు. వెంటనే శిరీషను హస్తినాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
పెద్దపల్లి: మూడేళ్ల ప్రేమ.. పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి ఇంట్లో చొరబడి..
-
పెద్దపల్లిలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి యువతిని హతమార్చాడు. రామగుండం కార్పొరేషన్ యైటింక్లైయిన్ కాలనీ కేకే నగర్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజు, గొడుగు అంజలి అనే ఇద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంజలి డిగ్రీ చదువుతుండగా.. ప్రియుడు రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అంజలి పెళ్లికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాజు.. ప్రియురాలి ఇంట్లోకి చొరబడి గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: (పోర్న్ వీడియోలు చూసి రాక్షసంగా.. ఓ చిన్నారి కేకలు వేయడంతో..) -
‘అమ్మ.. నీ గురించి నాన్న అందరికి చెడుగా చెప్తున్నాడు’
చైతన్యపురి: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కూరగాయల చాకుతో భర్త మెడపై భార్య దాడి చేయటంతో చనిపోయాడు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 6వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఉదంతం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సీతా రాం తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బసిరెడ్డిగూడెంకు చెందిన మురళీధర్‌రెడ్డి (42), మిర్యాలగూడకు చెందిన మౌనిక (25)లకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు సరూర్‌నగర్ శ్రీసాయికృష్ణనగర్ కాలనీలో ఉంటున్నారు. మురళీధర్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. కాగా, డిగ్రీ పరీక్ష రాసేందుకు గుంటూరు వెళ్లిన మౌనిక ఈనెల 6న సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. నీవు లేనప్పుడు నీగురించి నాన్న అందరికీ చెడుగా చెప్పాడని కుమారుడు తల్లికి చెప్పాడు. దీంతో భర్తను ఆమె నిలదీసింది. ఇష్టం లేకపోతే వదిలేయమని గొడవకు దిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మౌనిక వంటగదిలోని చాకుతో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపు మడుగులో మురళీధర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. విషయం చుట్టుపక్కల ఫ్లాట్ల వారికి తెలిసి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ మురళీధర్‌రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్యను విచారించగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. మురళీధర్‌రెడ్డి భార్యను అనుమానించి వేధించేవాడని, ఈక్రమంలోనే కడతేర్చిందని గుర్తించారు. సోమవారం మౌనికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య
లండన్: బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, డేవిడ్ హత్యను బ్రిటన్ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. చదవండి: (ఆఫ్గానిస్తాన్ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య) -
పెళ్లి వద్దన్నందుకు.. ప్రేయసిపై కత్తితో దాడి
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతిపై హత్యాయత్నానికి పాల్పడి, తానూ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోయిన్పల్లి బాపూజీనగర్‌లో నివాసముండే నందు, జ్యోతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. నందు ఆర్టీసీ మెకానికల్ డిపోలో పనిచేసి రిటైరయ్యాడు. నందు పెద్ద కుమార్తె చామంతి(22) ఆర్నెళ్లుగా స్థానిక ఘన్‌శ్యామ్ సూపర్మార్కెట్లో పనిచేస్తోంది. ఐదేళ్లక్రితం మారేడుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ ద్వారా యాప్రాల్‌కు చెందిన గిరీష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవల అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఈక్రమంలో చామంతిని తాను పెళ్లి చేసుకుంటానంటూ గిరీష్ ఆమె తల్లిదండ్రులను కలిసి ఒప్పించే ప్రయత్నం చేశాడు. దినేశ్‌తో పెళ్లికి చామంతి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇంటికొచ్చి వేధింపులకు గురి చేశాడు. దీంతో నందు గత నెలలో బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గిరీష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో రూ.50 జరిమానా గిరీష్ వేధింపుకుల సంబంధించిన కేసు విచారణ బుధవారం సికింద్రాబాద్ కోర్టులో జరిగింది. గిరీష్‌ను మందలించిన కోర్టు అతనికి రూ.50 జరిమానా విధించింది. మళ్లీ చామంతి జోలికి వెళ్లనని హామీ ఇచ్చిన గిరీష్, జరిమానా చెల్లించి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికెళ్లే క్రమంలో చామంతి, గిరీష్ల మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో చామంతికి ఇంటికెళ్లి ఆమెను బయటకు పిలిచాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో చామంతి పొట్టలో పొడిచాడు. గిరీష్‌ను అడ్డుకునే క్రమంలో చామంతి చేతిపై మరో గాటు పడింది. చామంతి తల్లిదండ్రులు కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంతలోనే గిరీష్ తనను తాను కత్తితో పొడుచుకుని బాల్కనీలో పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్‌తో సహా పోలీసు సిబ్బందికి అక్కడికి చేరుకున్నారు. గిరీష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చామంతికి స్థానిక వీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
విషాదం: దోపిడీని అడ్డుకున్న మహిళా బ్యాంకర్ దారుణ హత్య
సాక్షి, ముంబై: విధి నిర్వహణలో బ్యాంకు ఆస్తులను కాపాడబోయి ఓ మహిళా అధికారి ప్రాణాలు కోల్పోయిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫాల్గర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒకప్పటి బ్యాంకు మేనేజర్ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన మహిళా ఉద్యోగులపై కత్తులతో ఎటాక్ చేసి ఒక అధికారిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ యోగితా వార్తక్ ప్రాణాలు కోల్పోగా, మరో ఉద్యోగిని, బ్యాంకు క్యాషియర్ శ్రద్ధా దేవ్రుఖ్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో విరార్ ఈస్ట్ బ్రాంచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అసిస్టెంట్ మేనేజర్ యోగితా వార్తక్, క్యాషియర్ శ్రద్ధా దేవ్రుఖ్కర్ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి కత్తులతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. నగలు నగదు ఇవ్వమంటూ మహిళా ఉద్యోగినుల ఇద్దరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే వారిని ధైర్యంగా ఎదుర్కొన్న యోగితా అలారం మోగించి సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో డబ్బులు, జ్యువెల్లరీ తీసుకొని పారిపోతూ ఇద్దరు మహిళలపైనా కత్తితో దాడిచేశారు. ప్రధానంగా వర్తక్పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. అయితే అలారంతో అప్రమత్త మైన సిబ్బంది బ్యాంక్ లోపల రక్తపు మడుగులో పడి ఉన్న యోగితాను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. యెగితాను కాపాడబోయి తీవ్ర గాయాల పాలైన దేవ్రుఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పారిపోతున్న అనిల్ దుబేను పట్టుకోగా, మరో నిందితుడు మాత్రం అక్కడి నుంచి ఉడాయించాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ బ్యాంకు మాజీ మేనేజరే అనిల్ దుబే, మరో వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గతంలో ఇదే బ్యాంకులో కోటి రూపాయల రుణం తీసుకున్నాడు అనిల్. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టాడు. చివరికి ఏకంగా బ్యాంకుకే కన్నం వేసేందుకు కుట్ర పన్నాడు. ప్రస్తుతం అతను మరో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని సీనియర్ పోలీసు అధికారి సురేష్ వరదే వెల్లడించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. -
వృద్ధురాలిపై లైంగిక దాడి, 20 సార్లు కత్తితో పొడిచి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నడి బొడ్డున అమానుష ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డంతో పాటు, ఆమెను గొంతుకోసం హత్యోందంతం కలకలం రేపింది. నిందితుడు మహిళను 20 సార్లు పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. వివరాలను పరిశీలిస్తే... బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన మహిళ ఢిల్లీలో తన మనవడితో కలిసి నివసిస్తోంది. మనవడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఆమె స్థానికంగా కూరగాయల విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మనవడు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో జొరబడ్డ నిందితుడు ఆమెపై ఎటాక్ చేశాడు. లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో 20 సార్లు పొడిచి పారిపోయాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గొంతు, కడుపులో పదునైన గాయాలున్నాయనీ, పోలీసు అధికారి ప్రియాంక కశ్యప్ చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడనీ, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మద్యం మత్తులో ఆ అఘాయిత్యానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. -
కడుపులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు పరుగు
నాగపూర్: తనపై కత్తితో దాడి చేసిన వారి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. కడుపులో కత్తి దిగి తీవ్రంగా రక్తం కారుతున్నప్పటికీ అలాగే పోలీస్ స్టేషన్ వైపు వేగంగా పరిగెత్తాడు. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటనలో ఆ వ్యక్తి చివరికి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. నాగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు అర కిలో మీటర్ దూరంలో ఉన్న బహిరంగ మైదానంలో ఆదివారం రాత్రి పాత కక్ష్యల నేపథ్యంలో ఓ 20 ఏళ్ల వ్యక్తిని కొందరు కడుపులో కత్తితో పొడిచారు. దాంతో బాధితుడు కడుపులో ఉన్న కత్తితోనే పోలీస్ స్టేషన్ వైపు పరుగుపెట్టాడు. కొంతదూరం పరుగెత్తిన తర్వాత స్నేహితుడు లిఫ్ట్ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. బాధితుడిని పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. దాడి ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: అధికారి భార్య ఆత్మహత్య -
యువకుల ఘర్షణ.. 22 సార్లు కత్తితో పొడిచి!
న్యూ ఢీల్లీ: దేశ రాజధాని ఢీల్లీలో దారుణం చోటుచేసుకుంది. యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ముఖేష్, రాకేష్ అనే ఇద్దరు యుకులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరిద్దరితోపాటు మరో స్నేహితుడు నీరజ్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ తగాదాలో నీరజ్‌పై 22 సార్లు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి గాయలయ్యాయి. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులలో కృష్ణ, రవిని అరెస్టు చేసి మరొక వ్యక్తి (మైనర్) కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. కాగా బాధితులు పనిచేస్తున్న ఆసుపత్రిలోనే ఇంతకముందు నిందితులు కృష్ణ, రవి పనిచేసేవారని కానీ ప్రస్తుతం వారి స్థానంలో కాని ముఖేష్, రాకేష్ రావడంతో వీరి మధ్య శత్రుత్వం ఏర్పడిందని సౌత్ వెస్ట్ డీసీపీ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణ , రవి ఇద్దరు వాళ్ల(మైనర్ బాలుడు) స్నేహితుడితో కలసి వీరిని అడ్డగించి వారిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇరు బృందాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొని, ఘర్షణకు దారితీసిందని, ముఖేష్, రాకేష్‌పై దాడి చేస్తున్న క్రమంలో నీరజ్ అడ్డగించడంతో వారు నీరజ్‌ను 22 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు ఆయన తెలిపారు. -
డేటా వాడేశాడని తమ్ముడిని కడతేర్చాడు
జోధ్‌పూర్: మొబైల్ డేటాను మొత్తం వాడేశాడని సొంత తమ్ముడిని అన్నయ్య చంపిన ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నిందితుడు రామన్(23) తన తమ్ముడు రాయ్‌ను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఇంటర్నెట్ డేటాను పూర్తిగా వాడడంతో తమ్ముణ్ణి తిట్టాడు. కోపంతో నిందితుడు రాయ్ ఛాతీ మీద పొడిచి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న రాయ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. పారిపోయిన నిందితుడు రామన్‌ను శుక్రవారం రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. (చదవండి:ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) -
కూతురికి పోలీసు జాబ్.. చూపు పొగొట్టిన తండ్రి
కాబూల్: అఫ్ఘాన్ మహిళ ఖతేరాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకుని.. పోలిసు ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి మాత్రం ఆడవారు బయటకు వెళ్లి పని చేయడం అంటే నచ్చేది కాదు. అసలు ఆడపిల్లకు చదువే దండగ అనుకునేవాడు. కానీ ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. ఇక ఉద్యోగం విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. అయితే ఖతేరా అదృష్టం కొద్ది అర్థం చేసుకునే భర్త లభించాడు. అతడు ఆమె ఆశయాన్ని తెలుసుకుని ఆ వైపుగా ప్రొత్సాహించాడు. దాంతో ఖతేరా తన కలను నేరవేర్చుకున్నారు. కొద్ది నెలల క్రితం అప్ఘనిస్తాన్‌లోని ఘజ్ని ప్రావిన్స్‌లోని పోలీసు స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్‌లో అధికారిగా చేరారు. ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తుండేవారు. ఉద్యోగం మానేయాల్సిందిగా బెదిరించేవాడు ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఖతేరా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమె మీద దాడి చేశారు. కత్తితో గాయపర్చడమే కాక కాల్పులు జరిపి ఆమె కళ్లు పోయేలా చేశారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖతేరాని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది కానీ జరిగిన దాడిలో ఆమె చూపు కోల్పోయింది. ఫలితంగా ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాలిబన్లు తన మీద దాడి చేశారని ఖతేరా, స్థానికులు చెప్తుండగా.. వారు మాత్రం ఆరోపణల్ని కొట్టి పారేశారు. తాలిబన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఖతేరా ఉద్యోగం చేయడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అతడే ఈ దాడి చేయించి ఉంటాడు. ఇది వారి కుటుంబ సమస్య. ఇందులో మా ప్రమేయం లేదు’ అని తెలిపాడు. ఇక ఖతేరా మాట్లాడుతూ.. ‘నేను ఉద్యోగం చేయడం నా తండ్రికి ఇష్టం లేదు. కానీ భర్త ప్రొత్సాహంతో పోలీసు డిపార్ట్మెంట్లో చేరాను. నా తండ్రి ప్రతి రోజు నన్ను వెండించేవాడు. ఉద్యోగం మానేయాల్సిందిగా బెదిరించమంటూ తాలిబన్లను కోరాడు. నా ఐడీ కార్డు వారికి ఇచ్చి నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నానని వారికి తెలిపాడు. దాడి జరిగిన రోజు కూడా మా నాన్న నాకు ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నది కనుకున్నాడు’ అన్నారు ఖతేరా. (చదవండి: నోబెల్ ‘శాంతి’ పోటీలో అప్ఘనిస్తాన్ మహిళ) ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసు ఖతేరా మాట్లాడుతూ.. ‘ఏదో ఓ రోజు నాపై దాడి జరుగుతుందని తెలుసు. కనీసం ఒక్క ఏడాది అయినా ఉద్యోగం చేయాలని భావించాను. సంవత్సరం తర్వాత ఈ దాడి జరిగి ఉంటే ఇంత బాధపడేదాన్ని కాదు. డాక్టర్లు నాకు పాక్షికంగా చూపు వస్తుందని చెప్తున్నారు. అదే నిజమైతే.. చూపు వస్తే.. వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరతాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఖతేరా తన ఐదుగురు పిల్లలతో కలిసి కాబూల్‌లో రహస్యంగా జీవనం సాగిస్తున్నారు. ఇక తన పుట్టింటితో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్నారు. ఆమె తల్లితో సహా. ఎందుకంటే ఖతేరా ఫిర్యాదు మేరకు ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కోపంతో ఖతేరా తల్లి ఆమెతో మాట్లాడటం లేదు. (చదవండి: తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక) ఇక అఫ్ఘనిస్తాన్‌లో మహిళలు ఉద్యోగాలు చేయడం.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం తాలిబన్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా ఇష్టం ఉండదని మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. ఖతేరా పోలీసు అధికారిగా పని చేయడం తాలిబన్లకు కోపం తెప్పించింది అన్నారు. ‘పబ్లిక్ రోల్స్‌లో అఫ్ఘన్ మహిళల పరిస్థితి ఎప్పుడూ ప్రమాదకరమైనదే. ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా హింస పెరగడంతో వారి పరిస్థితి మరింత దిగజారిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ క్యాంపెయినర్ తెలిపారు. -
తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన భార్యకు ఫోన్ చేసి తరచుగా వేధిస్తున్న వ్యక్తిని భర్త కత్తితో పొడిచాడు. వివరాలు.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆ మహిళ తన భర్త సిద్దుల రవిపాల్‌కు విషయాన్ని తెలిపింది. రవిపాల్ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. అనంతరం రవిపాల్ కత్తితో పిచ్చయను పలుమార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పిచ్చయ్యను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ రవిపాల్‌పై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (చదవండి : ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య) -
17 సార్లు పొడిచిన యువకుడికి శిక్ష
సాక్షి, హైదరాబాద్: అది ఫిబ్రవరి 6, 2019.. బర్కత్‌పురకు చెందిన పదిహేడేళ్ల మేఘన(పేరు మార్చాం) ఎప్పటిలాగే ఇంటర్ కాలేజ్‌కు వెళ్లేందుకు బస్‌స్టాప్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల భరత్ అనే యువకుడు ఆమె రాక కోసం ఓమూల నక్కి ఉన్నాడు. తన ప్రేమను అంగీకరించని ఆ యువతిని చంపేయాలని కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో నిల్చున్నాడు. ఆమె కనిపించగానే రాక్షసుడిలా మారిపోయాడు. ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు చేరుకుని వరుసగా పదిహేడు సార్లు కత్తితో పొడిచాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుకుంటున్నా అతడు వదిలేయలేదు. కసి తీరా పొడిచి అక్కడ నుంచి పరారయ్యాడు.అప్పటివరకు భయంతో బిగుసుకుపోయిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎలాగోలా ఆమె చావు నుంచి బయటపడింది, కానీ జీవితమే చీకటి అయింది. (బీర్ సీసాతో భార్యపై దాడి) బాగా చదివి విదేశాలకు వెళ్లాలన్న ఆమె కల అర్ధాంతరంగా ఆగిపోయింది. శారీరకంగా, మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. ఈ దారుణం జరిగి ఏడాదికి పైనే అవుతోంది. ఈ కేసులో నిందితుడికి సోమవారం కోర్టు పదేళ్ల జైలు విధించింది. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నా బిడ్డ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మౌనంగానే ఉంటోంది. మళ్లీ పాత గాయాలను గుర్తు చేయడం ఇష్టం లేక దోషికి శిక్ష పడిందన్న విషయాన్ని కూడా ఇప్పటివరకు ఆమెకు చెప్పనేలేదు'అని తెలిపారు. తన కూతురికి కూతురికి జరిగిన ఘోరానికి సాక్ష్యంగా నిలిచిన బర్కత్పురను వదిలి ఆ కుటుంబం వేరే ప్రాంతంలో నివసిస్తోంది. ప్రస్తుతం మేఘన బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటికీ ఆమె కాలేజ్‌కు వెళ్లాలంటే బస్‌స్టాప్ వరకు ఒకరు తోడుగా వెళ్లాల్సిందే. (తల్లీ, కూతుళ్లపై హత్యాయత్నం) -
వ్యక్తి ప్రాణం తీసిన కోడి ధర
ఢిల్లీ : కోడి ధర మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముతున్నావంటూ జరిగిన గొడవ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని జాంగీర్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షిరాజ్ బతుకుదెరువు కోసం ఢిల్లీ వచ్చి చేపల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.అయితే లాక్డౌన్ నేపథ్యంలో తన ఇంటి ముందే చిన్న షెడ్డును ఏర్పాటు చేసుకొని లైవ్ చికెన్ అమ్మకాలను కూడా ప్రారంభించాడు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చికెన్ కొనుగోలు చేయడానికి షిరాజ్ వద్దకు షా ఆలమ్ అనే వ్యక్తి వచ్చాడు. చికెన్ ధర ఎంత అని ఆలమ్ అడగ్గా.. షిరాజ్ ధర చెప్పాడు. మార్కెట్ రేటు కంటే ధర ఎక్కువ చెబుతున్నావంటూ షా ఆలమ్ షిరాజ్‌తో వాదనకు దిగాడు. ఇరువరి మధ్య మాటా మాట పెరగడంతో షా ఆలమ్ షిరాజ్‌ను కిందకు తోశాడు. ఇద్దరు వాదులాటలో ఉండగా ఇంతలో షా ఆలమ్ సోదరులు కత్తులు , రాడ్లతో అక్కడికి చేరుకొని షిరాజ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో షిరాజ్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి.ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షిరాజ్‌ను మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. షా ఆలమ్, అతని సోదరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ విజయంత ఆర్య పేర్కొన్నారు. -
ఓటు వేయలేదని.. కత్తి దించాడు!
-
వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కోపంతో ముద్రకోల వెంకటేశ్ అనే మాజీ కౌన్సిలర్ శివ అనే యువకుడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు..వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్ టీఆర్ఎస్ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, తన ఓటమి కారణం శివే అని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తనకు కాకుండా దివ్యకు ఓటు వేసిన శివను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతనిపై కత్తితో దాడికి దిగాడు. నిందితుడు వెంకటేశ్, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
బాధితుల ట్వీట్‌పై స్పందించిన విదేశాంగ మంత్రి
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన బుధవారం కెనడాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన రాచెల్(23) అనే యువతి కెనాడాలోని టొరంటోలో మాస్టర్స్ చదువుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒంటరిగా వస్తున్న యువతిని దుండగులు కత్తితో దాడి చేసి కొంత దూరం లాక్కెళ్లి పడేశారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాచెల్ కుటుంబ సభ్యులు.. కెనడా వెళ్లడానికి ప్రయత్నించగా వీసా విషయంలో ఆలస్యం ఏర్పడింది. దీంతో రాచెల్ మామయ్య.. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ట్వీట్ చేశారు. కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తన మేనకోడలిపై హత్యాయత్నం జరిగిందని, ఆమెకు సహాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించి స్థానిక ఛానల్లో ప్రసారం చేశారని.. రాచెల్ తల్లిదండ్రులు తమిళనాడులో ఉన్నారని వాళ్లు అక్కడకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి జయశంకర్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.. ‘కెనడాలోని టొరంటోలో రాచెల్ ఆల్బర్ట్ అనే భారతీయ విద్యార్థిపై దాడి జరిగిన విషయం తెలిసి షాక్‌కు గరుయ్యాను. ఆమె కుటుంబం కెనాడా వెళ్లడానికి వీసాకు సహాయం చేయమని నేను విదేశాంగశాఖ అధికారులను ఆదేశించాను. బాధితురాలు కుటుంబ సభ్యులు వెంటనే సాయం కోసం 9873983884ను సంప్రదించవచ్చు’ అని జైశంకర్ ట్వీటర్లో పేర్కొన్నారు. -
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో...
చెన్నై : తనను వివాహం చేసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్నిగుట్టు చప్పడు కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఈ వ్యవహారమంతా బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన ఓ యువతి(17) మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి అదే రోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. అలాగే జాఫర్ షా(26) అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉన్నట్లు, ఇంతకుముందు చాలా సార్లు తన కూతురిని వేధింపులకు గురిచేశాడని యువతి తండ్రి పోలీసులకు తెలియజేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాఫర్ గురించి విచారించగా ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అనంతరం అతడి మొబైల్ లొకేషన్‌ను తనిఖీ చేయగా తమిళనాడులోని వలపరాయ్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసులు అక్కడికి చేరుకోగా నిందితుడి కారులో యువతి కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు జాఫర్‌ను విచారించగా.. యువతిని పొడిచి చంపి మృతదేహన్ని ఊరి చివర పడేసినట్లు అంగీకరించాడు. కాగా సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా తేయాకు తోట పక్కన యువతి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే యువతి ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనట్లు ఆనవాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తమిళనాడు పోలీసులు తెలిపారు. -
60యేళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా
కోలకతా : దేశంలో మహిళలపై హింసకు, దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. దక్షిణ కోల్‌కతాలోని అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపింది. ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. ఇంత దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడ్డారో అంచనా వేయలేక పోలీసులు సైతం తలలు పట్టుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనలో చనిపోయిన మహిళను పంజాబ్‌కు ఊర్మిళ కుమారిగా గుర్తించారు. తన ఇద్దరు కొడుకులతో గత కొన్నాళ్లుగా కోలకతాలో నివసిస్తోంది. కుమారులు ఇద్దరు వివాహానికి హాజరయ్యేందుకు వేరే నగరానికి వెళ్లారు. దీంతో ఆమె రెండు రోజులుగా ఒంటరిగానే వుంటోంది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని భావిస్తున్నారు. శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. తలను వేరు చేయడంతోపాటు, పొత్తి కడుపును చీల్చివేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు, ఇంట్లోని నగదు అలానే ఉన్నాయనీ, దీంతో పగతో చేసిన హత్యగానే ప్రాథమికంగా భావిస్తున్నామని జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) మురళీధర శర్మ అన్నారు. అయితే విలువైన వస్తువులు ఏమైనా మాయమయ్యాలేదా అనేది ఇపుడే నిర్ధారించలేమని శర్మ తెలిపారు. బాధితురాలి కుమారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని వెల్లడించారు. అయితే ఊర్మిళ నివాసానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండేదనీ, దీంతో అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పలుసార్లు ఆమె గారియాహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థానికులు చెప్పారు. ఆ కక్షతోనే ఈదారుణానికి ఒడిగట్టి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. -
ఎన్నికల ప్రచారంలో ఎంపీపై కత్తితో దాడి
ఉస్మానాబాద్(మహారాష్ట్ర) : ఎన్నికల ప్రచారంలో ఉన్న శివసేన ఎంపీ ఓంరాజే నింబల్కర్పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. అయితే కత్తి ఓంరాజే చేతికి తలగడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం ఉదయం ఉస్మానాబాద్ పరిధిలోని కలాంబ్ తాలుకాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన అభ్యర్థి కైలాశ్ పాటిల్ తరఫున ఓంరాజే ప్రచారం చేపట్టారు. అయితే పడోలి నైగాన్ గ్రామంలో ఓంరాజే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పలువురు పార్టీ నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఎంపీపై కత్తితో దాడికి పాల్పడాడు. ఆ కత్తి ఎంపీ చేతికి ఉన్న వాచ్‌కు తగలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అనంతరం ఎంపీని.. శివసేన శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఓంరాజే తండ్రి పవన్‌రాజే నింబల్కర్ జూన్ 3, 2016 హత్యకు గురయ్యారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవే ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు కాల్చిచంపారు. ఈ కేసులో మాజీ ఎంపీ పాదమ్‌సిన్హా పాటిల్ కీలక నిందితుడిగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనుండగా.. ఫలితాలు 24న వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
రూ.100 ఫైన్ కట్టమంటే.. కత్తి తీసి..
సాక్షి, బెంగళూరు : వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని అడ్డగించిన సిబ్బంది అతనికి రూ.100 ఫైన్ వేశారు. ఈ క్రమంలో అతను చెప్పిన సమాధానం విని నోరెళ్ల బెట్టారు. ‘త్వరగా వెళ్లాలి సార్. మా ఫ్రెండ్‌ను కత్తితో పొడిచా. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడానికి వెళ్తున్నా. నన్ను విడిచిపెట్టండి’ అని 26 ఏళ్ల సందీప్ శెట్టి చెప్పడంతో ట్రాఫిక్ సిబ్బందికి నమ్మబుద్ధి కాలేదు. ‘నిజం సార్. కావాలంటే చూడండి. ఇదే కత్తితో పొడిచా’ అని సందీప్ రక్తం మరకలతో ఉన్న కత్తి చూపించాడు. దీంతో కంగుతిన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వివరాలు..చిక్కబళ్లపురకు చెందిన సందీప్ శెట్టి, దేవరాజ్ స్నేహితులు. దేవరాజ్ స్థానికంగా కుకింగ్ ఆయిల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడదామని చెప్పిన దేవరాజ్.. కొంతకాలం క్రితం సందీప్ శెట్టి నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. కానీ, దేవరాజ్ ఆ సొమ్మును ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని సందీప్.. దేవరాజ్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సందీప్ దేవరాజ్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. కాగా, బాధితుడి పొట్ట, వీపుపై కత్తి పోట్లున్నాయనీ, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
‘దేవుడు ఆదేశించాడు.. నేను పాటించాను’
బ్రెజీలియా : ఎన్నికల ప్రచారంలో భాగంగా మినాస్ గ్రేస్ రాష్ట్రంలో పర్యటిస్తున్న బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి జేర్ బోల్సోనారోపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మినాస్ గ్రేస్‌కు చెందిన అడెలియో డీ ఒలివిరాగా నిందితుడిని గుర్తించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల(అక్టోబర్)లో పోలింగ్ జరగనున్న క్రమంలో జేర్‌పై దాడి జరగడంతో.. ఇది ప్రత్యర్థుల పనేనంటూ సోషల్ లిబరల్ పార్టీ ఆరోపించింది. కాగా తన చర్య వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరని, ఆయన ఆదేశించడం వల్లే తానిలా చేశానంటూ ఒలివిరా పేర్కొన్నాడు. అతడి తరపు లాయర్ మాట్లాడుతూ...‘ ఒలివిరా ఆవేశంలో దాడి చేశాడని, రాజకీయ, మత పరమైన నాయకులకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. ఒలివిరా మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఇలా చేసి ఉండవచ్చని పేర్కొన్నాడు. బాగానే ఉన్నారు.. ఆందోళన వద్దు ఒలీవిరా దాడిలో జేర్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తితో కడుపులో పొడవడంతో పెద్దపేగుకు తీవ్ర గాయమైందని వైద్యులు పేర్కొన్నారు. 40 శాతం రక్తం పోయిందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే జేర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఆయన కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జేర్ కోలుకుంటున్నారని, ఆయనకు విజయాన్ని బహుమానంగా ఇవ్వాలంటూ కోరారు. కాగా గతంలో బ్రెజిల్ మిలిటరీ అధికారిగా పనిచేసిన జేర్కు వివాదాస్పద నేతగా పేరుంది. 1964- 85 మధ్య బ్రెజిల్లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగానే సమర్థించేవారు. అదే విధంగా పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జేర్‌పై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒలీవిరా ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
యువతిని స్నేహం పేరుతో నమ్మించి...
న్యూఢిల్లీ : డబ్బుకోసం ఓ యువతిని స్నేహమంటూ నమ్మించి ఆపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శుక్రవారం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు... న్యూఢిల్లీకి చెందిన 28ఏళ్ల వస్త్రాల వ్యాపారి జూదం కారణంగా దాదాపు రూ.50లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు తోడు ఓ ఖరీదైన కారును లోన్‌లో తీసుకున్నాడు. దీంతో ఎలాగైనా అప్పులు మొత్తం తీర్చేయ్యాలన్న కసితో ఓ పన్నాగం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల సంపన్న యువతితో స్నేహం పెంచుకున్నాడు. యువతి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించిన ఆ వ్యాపారి.. ఆ ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నపుడు వెళ్లి ఆమెను చంపి డబ్బుతో చెక్కేయాలనుకున్నాడు. పథకం ప్రకారం బ్యాగులో కత్తి, సుత్తె, పెనాయిల్తో వేలి ముద్రలు పడకుండా ఉండటానికి చేతులకు సాక్సులు ధరించి స్కూటర్లో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు కొట్టగానే యువతి బయటకు వచ్చింది. అతడు వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని మూడు సార్లు పొడిచాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో వేరే వ్యక్తులు ఉన్నారని గ్రహించి అక్కడినుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వటంతో నిందితున్ని తొందరగానే పట్టుకోగలిగారు. -
వడోదరా స్కూల్లో బాలుడి హత్య
వడోదరా: గుజరాత్ వడోదరాలోని ఓ పాఠశాలలో బాలుడు హత్యకు గురయ్యాడు. బారన్పురా ప్రాంతంలోని భారతి స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడిని 9వ తరగతి చదువుతున్న దేవ్ భగవాన్‌దాస్ తాడ్వి(14)గా గుర్తించారు. గతేడాది సెప్టెంబర్‌లో గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన ఏడేళ్ల విద్యార్థి హత్యోదం తాన్ని గుర్తుచేస్తున్న ఈ ఘటనలో.. మృతుడి శరీరంపై 10 కత్తి పోట్లు ఉన్నాయి. భోజన విరామ సమయంలో తాడ్వి తన తరగతి గదికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టి, అతని మృతదేహాన్ని వాష్‌రూంలో వదిలిపెట్టి పోయారని పోలీసులు తెలిపారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను పోలీసులు గుర్తించారు. తాడ్విని హత్య చేసిన తరువాత నిందితులు ఆ సంచిని అక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీసీపీ ఆర్ఎస్ భగోరా వివరాలు వెల్లడిస్తూ..శవపరీక్ష నిమిత్తం తాడ్వి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామని చెప్పారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూలుకు చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. వారం క్రితమే ఈ స్కూలులో చేరిన తాడ్వి ఇక్కడ తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. అతని తల్లితండ్రులు ఆనంద్ పట్టణంలో నివసిస్తున్నారు. -
నా లవర్‌తోనే చనువుగా ఉంటావా..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే ఓ నాయకుడి కుమారుడు చెలరేగిపోయాడు. తన ప్రియురాలి స్నేహితుడిపై కత్తితో దాడి చేయడం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లింగరాజుకుమారుడు రాకేశ్ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్ ఉన్నాడని రాకేశ్ తెలుసుకున్నాడు. తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రాకేశ్ కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
ప్రేమించలేదని కత్తితో దాడి
గుంటూరు : తనను ప్రేమించలేదనే కారణంతో ఓ యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లీ, చెల్లెలికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పాత గుంటూరులో శుక్రవారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 500 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ఐదు వందల రూపాయల కోసం స్నేహితులు ఘర్షణ పడి, చివరికి కత్తి పోట్లకు దారితీసిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..మల్కాజిగిరి సర్కిల్ రామాంజనేయనగర్లో నివాసం ఉండే సాయి(24), వేణు(20) ఇద్దరూ స్నేహితులు. సాయి కారు డ్రైవర్ కాగా వేణు ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. అయితే వేణు వద్ద సాయి 500 రూపాయలు గతంలో అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని వేణు, సాయిని పలుమార్లు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయమై ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వేణు, సాయిని తీవ్రంగా గాయపరిచాడు. సాయి కడుపు, గొంతు భాగంలో వేణు కత్తితో గాయపరిచాడు. ప్రస్తుతం సాయి జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మసీదులో ప్రార్థన చేస్తుండగా దారుణం
కసాల(సూడాన్) : మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అగంతకుడి కత్తి దాడిలో ముగ్గురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సూడాన్‌లోని కసాల నగరంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కసాల నగరంలోని ఓ మసీదులో సాయంకాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవ్వరూ తనకు బదులు చెప్పకపోవడంతో ఆగ్రహించిన దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రార్థన చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొంత సమయం తర్వాత తేరుకున్న అక్కడి వారు ఆ దుండగుడిపై దాడిచేసి చంపేశారు. గాయాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కసాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, వందల మంది సూడాన్ సైనికులు నగరాన్ని మోహరించినా ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
కోడలిని కత్తితో పొడిచి.. ఆపై ఆత్మహత్యాయత్నం
మంచాల : ఓ మహిళపై మరో మహిళ కత్తితో దాడి చేసి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మతండాకు చెందిన సపావట్ కవిత, సపావట్ బుజ్జి వరుసకు అత్తాకోడల్లు. మంగళవారం వారిద్దరూ వంట చెరకు కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. కవిత కట్టెలు చూస్తుంది. అప్పటికే బుజ్జి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో.. తన కోడలు కవితను పొడిచి చంపడానికి యత్నించింది. కవిత తప్పించుకొని సమీపంలో వ్యవసాయ పొలం వద్ద ఉన్న వ్యక్తులను ఆశ్రయించింది. దాడిలో కవిత కత్తి గాట్లకు గురైంది. గమనించిన స్థానికులు బుజ్జి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించడంతో.. బుజ్జి సమీపంలోని ఎత్తయిన బండరాయి ఎక్కి దూకింది. ఈ ప్రమాదంలో బుజ్జి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుజ్జిని చికిత్స నిమిత్తం నగరంలోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. కవితను హస్తనాపురంలోని అమ్మ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఒక్కరుపై ఒక్కరు దాడి చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. -
లోకాయుక్తకు కత్తిపోట్లు
-
బెంగళూరు షాక్.. లోకాయుక్తకు కత్తిపోట్లు
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఓవ్యక్తి ఏకంగా ఆ రాష్ట్ర లోకాయుక్తను కత్తితో పలుమార్లు పొడిచేసి కలకలం సృష్టించాడు. నేరుగా బెంగళూరులోని లోకాయుక్త ఆఫీసుకు వెళ్లి అక్కడ లోకాయుక్తగా పనిచేస్తున్న జస్టిస్ పీ విశ్వనాథ శెట్టి(74)పై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పలు కత్తిపోట్లకు గురైన లోకాయుక్త జస్టిస్ విశ్వనాథశెట్టిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిని తేజస్ శర్మ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కర్ణాటక హోమంత్రి రామలింగ రెడ్డి ప్రకటన చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే ఆగ్రహంతో ఏకంగా జస్టిస్ శెట్టిపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేరుగా ఆస్పత్రికి వెళ్లి జస్టిస్ శెట్టిని పరామర్శించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌పార్టీ నేత బ్రిజేశ్ కలప్పా స్పందిస్తూ లోకాయుక్తను ఎవరైనా కలుసుకోవచ్చని అన్నారు. ఏదైనా ఒక అవినీతి అంశానికి సంబంధించి ఆధారాలుంటే వాటిని తీసుకొని సామాన్యుడు సైతం లోకాయుక్తను కలిసేందుకు అవకాశం ఉందని, కనీసం ఒక ఆయుధం కలిగిన భద్రతా సిబ్బంది కూడా అక్కడ లేరని చెప్పారు. బహుశా దాడికి పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అయ్యుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ’పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మెటల్ డిటెక్టర్ కూడా ఉంది. ఎంతోమందిని గమనిస్తునే ఉంటారు.. అలాంటిది అక్కడ భద్రతా మొత్తానికే లేదని కూడా అనలేం’ అని ఆయన మరో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్దే దీనిపై స్పందిస్తూ కచ్చితంగా ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. -
హోలీ వేడుకల్లో గొడవ.. యువకుడికి 50 కత్తి పోట్లు
-
హోలీ వేడుకల్లో గొడవ.. యువకుడికి 50 కత్తి పోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌లపై వచ్చిన పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కత్తులతో, రాడ్లతో అతనిపై విరుచుకుపడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఖాన్పూర్కు చెందిన అశిశ్ అనే యువకుడు గురువారం సాయంత్రం జిమ్ నుంచి బయటకు వచ్చాడు. అంతలో సుమారు 10 బైక్‌లు అక్కడికి దూసుకొచ్చాయి. వాటిపై వచ్చిన 20 మంది యువకులు అశిశ్‌పై కత్తులతో, రాడ్లతో దాడి చేశారు. అంత మంది ఒకేసారి అతనిపై దాడి చేసే సరికి ప్రతిఘటించలేకపోయాడు. స్థానికులు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. దాడి అనంతరం అంతే వేగంగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆపై స్థానికులు అశిశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడికి 50 కత్తిపోట్లు తగిలాయని.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దాడితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పిల్లాడిని కాపాడినందుకే... అంతకు ముందు ఉదయం హోలీ వేడుకల్లో స్థానికంగా ఓ చిన్న ఘర్షణ నెలకొంది. ఓ బాలుడు రంగుల బెలూన్లను ఇద్దరు వ్యక్తులపై పొరపాటున విసిరాడు. దీంతో వారు ఆ బాలుడిని చితకబాదగా.. అశిశ్ జోక్యం చేసుకుని బాలుడిని రక్షించాడు. వెళ్లేముందు అంతు చూస్తామని వారు అశిశ్‌ను బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. బహుశా ఇది వారిపనే అయి ఉంటుందని భావిస్తున్నారు. -
దారుణ హత్య.. పొడిచి అడవిలోకి పరార్
సాక్షి, తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురయ్యారు. అదే చర్చిలో పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన వ్యక్తే ఆయనను కత్తితో పలుమార్లు పొడిచేసి సమీపంలోని అడవిలోకి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఫాదర్ చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం జిల్లాలోని మలయత్తూర్ క్యాథలిక్ చర్చ్‌లో ఫాదర్ జావియర్ తెలిక్కాట్ (52) ఫాదర్‌గా పనిచేస్తున్నారు. జానీ అనే వ్యక్తి చర్చిలో మెయింటెన్స్ పనులు, స్మశానంలో పనులు చూసుకుంటున్నాడు. అయితే, జానీ కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఫాదర్ జావియర్ అతడిని పనిలో నుంచి తొలగించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న జానీ ఫాదర్ కురుయిష్‌మల కొండపైకి యాత్రకు వెళ్లి గురువారం ఉదయం 10.45గంటల ప్రాంతంలో కిందికి దిగి వస్తుండగా అనూహ్యంగా కత్తితో ఫాదర్ ముందుకు దూసుకొచ్చి వాదన పడుతూనే దాడికి పాల్పడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తీవ్ర గాయాలతో కన్నుమూశారు. ఈ సంఘటన ఆ చుట్టుపక్కల సంచలనంగా మారింది. జానీ కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. అతడు అడవిలోకి పారిపోవడంతో అటవీశాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. -
జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య
సాక్షి,వాషింగ్టన్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిక్కు యువకుణ్ని ఓ అమెరికన్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ దురదృష్టకర ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి గగన్‌దీప్ సింగ్ (22) హత్యకు గురికావడం విషాదాన్ని రేపింది. యూనివర్శిటీలో అడ్మిషన్ రాలేదన్న అక్కసుతో జాకబ్ కోలెమన్ (19) టాక్సీ డ్రైవర్, సిక్ విద్యార్థిని అనేకసార్లు పొడిచి హత్యచేశారని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సింగ్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేన్నారు.. ఈ క్రమంలో ఆగష్టు 28 న వాషింగ్టన్ లోని స్పోకేన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిందితుడు సింగ్ టాక్సీ ఎక్కాడు. ఇదాహోలోని బోనర్ కంట్రీలో తన స్నేహితుడు ఇంటికి వెళ్లమని కోరాడు. ఆకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు విచక్షణా రహితంగా దాడి చేయడంతో సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గోంజాగా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రయివేట్ కాథలిక్ యూనివర్శిటీలో ప్రవేశం లభించకపోవడంతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల కథనం. అయితే ఈ విషయాన్ని యూనివర్శిటీ ఖండించింది. అలాంటి అప్లికేషన్ ఏదీ తమ దగ్గరకు రాలేదనీ, విచారణకు సహకరిస్తున్నట్టు తెలిపింది. పంజాబ్‌లోని జంషెడ్పూర్కుచెందిన గగన్‌దీప్‌సింగ్ గా మృతుణ్ని గుర్తించారు. 2003నుంచిన ఆయన వాషింగ్టన్లో నివసిస్తున్నారు. మరోవపు జలంధర్ కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ రాజు మేనల్లుడు గగన్ సింగ్. ఈ హత్యపై ఆయన స్పందిస్తూ, తన మేనల్లుడు జాతి విద్వేషాలకు బలైయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనపై ట్రంప్ విధానాల ఫలితంగా జాతి విద్వేషాలకు బాధితులుగా భారతీయులు, ఆసియన్లు బాధితులుగా మారుతున్నారని మండిపడ్డారు. కాగా అమెరికాలో ఇటీవలి నెలల్లో అమెరికన్లు లభారతీయలును, సిక్కులను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆందోళన రేపుతోంది. జూలైలో కాలిఫోర్నియాలో ఒకే వారం లో రెండు వేర్వేరు సంఘటనలలో ఇద్దరు హత్యకు గురైన సంగతి తెలిసిందే. -
ముంబైలో మరో దారుణం
ముంబై: వాణిజ్య రాజధాని ముంబై లో మరో దారుణం జరిగింది. స్నేహితునికోసం వేచివున్న మహిళ(28)పై గుర్తుతెలియని దుండగుడు దాడిచేశాడు. హాలక్ష్మి రేస్ కోర్స్ దగ్గర గురువారం రాత్రి ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. పదునైన ఆయుధంతో వెనకనుంచి ఎటాక్ చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన స్నేహితుడు వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఈఘటనపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి దారుణంగా
మీరట్: తండ్రికి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యక్తిని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముగ్గురు యువతులు షమ్లీలోని అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి.. కత్తులతో పొడిచి చంపారు. హత్యకు గురైన వ్యక్తి శరీరంలో 20 కత్తిపోట్లు ఉండటం చూసి పోలీసులే విస్తుపోయారు. ఘటన వివరాలు.. షమిమ్ అహ్మద్ అనే వడ్డీ వ్యాపారి ఓ వ్యక్తికి లక్షరూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీర్చడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని వేదించడంతో పాటు అతడి కూతుళ్లపై అహ్మద్ కన్నేశాడు. అప్పు వంకతో ఇంటికి వెళ్లి అతడి ముగ్గరు కూతుళ్లను వేదించాడు. వారిలో ఒకరిని తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ముగ్గురు అక్కాచెలెళ్లు కత్తులతో వెళ్లి విచక్షణారహితంగా అహ్మద్‌పై దాడిచేశారు. దీంతొ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు యువతులతో పాటు.. ఈ హత్యకు సహకరించిన తండ్రి, ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. -
కత్తిపోట్లకు దారితీసిన చిన్న గొడవ
చైతన్యపురి: ఇంటి ఎదుట వీధి కుక్కలకు దానా వేస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కత్తి పోట్లకు దారి తీసింది. స్థానిక సీఐ గురు రాఘవేంద్ర కథనం ప్రకారం.. ఎస్ఆర్ఎల్ కాలనీ రోడ్ నెంబర్.6లో బాణాల వెంకట రమణాచారి అద్దెకు ఉంటున్నారు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి వీధి కుక్కలకు దానా వేయడానికి తన కారు హారన్ మోగిస్తుండగా, ఈయన ఇంటి సమీపంలోనే ఉండే కాలనీ కార్యదర్శి అశోక్‌చారి బయటికి వచ్చి రమణాచారితో గొడవ పడ్డారు. ఇరువురు కొట్టుకున్నారు. దీంతో ఆవేశానికి గురైన రమణాచారి ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అశోక్‌చారి కడుపులో పొడిచారు. అశోక్‌చారి అరవగా చుట్టపక్కల వారు వచ్చి ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. రమణాచారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
వదినపై మరిది కత్తితో దాడి
తెగి పడిన చెయ్యి, తలకు తీవ్రగాయం పరిస్థితి విషమం పీకేపాడు (సోమశిల) : ఇంటి స్థలం విషయంపై వదినపై మరిది కత్తితో దాడి చేయడంతో ఎడమ చేయి తెగి పడి పోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడులో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెరుమాళ్ల పెద సుబ్బరాయుడు భార్య వెంకటమ్మ ఇంట్లో పని చేసుకుంటుండగా ఆమె మరిది మస్తానయ్య తన స్థలంలో గోడ కట్టారని వాదనకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మస్తానయ్య బాకు వంటి కత్తితో దాడి చేశాడు. తలకు తగులుతుందని చెయ్యి అడ్డం పెట్టింది. దాడిలో ఆమె ఎడమ చెయ్యి తెగి పడింది. అయినా విచక్షణా రహితంగా ఆమె తలపై కత్తితో దాడి చేశాడు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో మస్తానయ్య అక్కడి నుండి పరారయ్యాడు. 108 వాహనంలో ఆమెను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు సీఐ ఖాజావలి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోలీసులు మస్తానయ్య కోసం గాలిస్తున్నారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట వివాదంలో వ్యక్తికి కత్తిపోట్లు
బొల్లారం : తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలోని శ్మశాన వాటికలో జరిగిన పేకాట వివాదంలో కుమార్ (50) అనే వ్యక్తి కత్తి పోట్లకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం శ్మశాన వాటికలో నలుగురు కలిసి పేకాటాడుతుండగా కుమార్, రవి అనే వ్యక్తి కి రూ.50 లు బాకీ పడ్డారు. దానికోసం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో రవి తన బ్యాగులో నుంచి కత్తి తీసి కుమార్ మెడ, చాతీపై దాడి చేయడంతో తీవ్రగాయలయ్యాయి. కుమార్‌ను గాంధీ అసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హిందూ పూజారులపై ఆగని దాడులు
ఢాకా: బంగ్లాదేశ్ లో హిందూ పూజారులపై దాడులు ఆగడం లేదు. నిన్న ఒక హిందూ పూజారిని ఉగ్రవాదులు నరికి చంపిన ఘటన మరువకముందే మరో పూజారిపై శనివారం దాడి జరిగింది. సత్ఖిరా జిల్లాలోని శ్రీ రాధా గోవింద గుడిలో పూజారిగా పనిచేస్తున్నబాబాసింధ్ రాయ్(48) పై దేవాలయం కంపౌండ్ లో నిద్రించిన సమయంలో ఆయనపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరళించామని ఇది ఉగ్రవాదుల దాడి గానే భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. గడిచిన మూడేళ్లో 50 మంది మైనారిటీలు ఆదేశంలో హత్యకు గురయ్యారు. -
పిల్లలను దారుణంగా చంపేసింది!
మెంఫిస్ః నలుగురు పిల్లలను దారుణంగా చంపేసిన తల్లి ఉదంతం అమెరికాలోని టెన్నెస్సీలో వెలుగు చూసింది. మెంఫిస్ నగర శివారులో జరిగిన ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. పదునైన ఆయుధంతో ఆ మహిళ నలుగుర్నీ పొడిచి చంపేసినట్లు మెంఫిస్ ప్రాంతంనుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలోని మెంఫిస్ ప్రాంతం టెన్నెస్సీలో చోటుచేసుకున్న ఘటన అక్కడి వారిని కలచి వేసింది. టెన్నెస్సీ గేటెడ్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో నలుగురు పిల్లలను ఓ తల్లి చంపేసిందంటూ తమకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చనిపోయిన నలుగురు పిల్లలతోపాటు, తల్లికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో ఆమెపై నేరాభియోగాలు నమోదు చేయలేదని పోలీసులు చెప్తున్నారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వెర్డెంట్ గోల్ఫ్ కోర్స్ సమీపంలోని ఆపార్టుమెంట్‌లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు, కౌంటీ షరీఫ్ విలేకర్లు చెప్తున్నారు. పదునైన ఆయుధంతో చిన్నారులను ముక్కలు ముక్కలు చేసేందుకు ఆమెకు ఎలా మనసొప్పిందోనని, అంతటి దారుణానికి ఎలా ఒడిగట్టిందో తమకు తెలియడం లేదని ఇరుగు పొరుగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో విగతజీవులుగా పడి ఉన్న నలుగురు చిన్నారులను గుర్తించిన పోలీసులు.. తల్లిని కస్టడీలోకి తీసుకున్నారు. చిన్నారుల వయసు, పేర్లు మొదలైన వివరాలేమీ పోలీసు అధికారులు వెల్లడించలేదు. వారిని బేబీస్ అంటూ పిలుస్తున్నారు. అయితే షరీఫ్ కార్యాలయం మాత్రం వారంతా ఆరేళ్ళ లోపు వారేనని తెలిపింది. కాగా తల్లికి మానసిక సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో పడిన పోలీసులు హత్యలు జరిగిన సమయంలో చిన్నారుల తండ్రి ఇంట్లో లేకపోకపోవడంపై కూడ దృష్టి సారించారు. దర్యాప్తుకోసం కావలసిన అన్నిరకాల సహకారాన్ని అందిస్తామని షెల్బీ కౌంటీ మేయర్ మార్క్ లుటరెల్ పోలీసులకు హామీ ఇచ్చారు. అయితే ఆ ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా.. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఇంటి ముందు స్థలంలో ఆడుకుంటూ కనిపించేవారని, అందరూ ఆరేళ్ళలోపు వారేనని ఓ పొరుగు వ్యక్తి తెలిపాడు. తాను తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ కు వెళ్ళేప్పుడు కూడ ఇష్టంగా పలకరించేవారని, నాకు తెలిసినంతవరకూ ఆ పిల్లలు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని వివరించాడు. ఇరుగు పొరుగువారు చెప్పిన వివరాలను సైతం నోట్ చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
కాలిఫోర్నియాలో 10 మందికి కత్తిపోట్లు
శాక్రమెంటో: కాలిఫోర్నియాలో ఓ పార్టీకి చెందిన వారు మరో పార్టీకి చెందిన వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 10 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి జార్జి గ్రెనడా వివరాలను మీడియాకు వెల్లడించారు. దాదాపు 30 మంది ట్రెడిషనలిస్ట్ పార్టీకి చెందిన వారు ర్యాలీ నిర్వహిస్తుండగా, వీరికి మరో పార్టీకి చెందిన 400 మంది ఎదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు ముసుగు ధరించిన యువకులు కత్తులు, కర్తలతో హల్చల్ చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు పొడిచారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. కాగా ఈ ఘటనలో ఒక మహిళ సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు సాక్రామెంటో అగ్నిమాపక శాఖ అధికారి క్రిస్ హార్వే చెప్పారు. వీరంతా 19 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయసు మధ్య వారని చెప్పారు. -
నడిరోడ్డుపై మంటగలిసిన మానవత్వం
హసన్: నడిరోడ్డుపై మానవత్వం మంటగలిసింది. బస్టాప్ లో నిల్చున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేస్తున్నా ఒక్కరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు సరి కదా అందరూ వేడుక చూస్తూ తమ సెల్ ఫోన్ లో జరిగిన ఉదంతాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన హృదయ విదారక ఘటన కర్నాటక లోని హసన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న సాయంత్రం ధనుష్ అనే వ్యక్తి బెంగళూరుకు 185 కిలో మీటర్ల దూరంలోని హసన్ లోని బస్టాప్ సమీపంలో ఒక మహిళతో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దుర్భాష లాడుతూ అతనిపై దాడి చేశారు. దీంతో ధనుష్ తన సోదరున్ని, ఇద్దరు స్నేహితులను సాయం చేయమని కేకలు వేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు దాదాపు 20 నిమిషాలు రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ దాడిలో ధనుష్ సోదరుడు సుదీప్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ఇంత జరుగుతున్నా ఒక్కరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. .జరుగుతున్న ఉదంతాన్ని తమ చరవాణిలో చిత్రీకరించడానికే ప్రయత్రించారు. కేసును నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి రాహుల్ కుమార్ తెలిపారు. -
ప్రాణాపాయ స్థితిలోనూ పండంటి బిడ్డకు జన్మ..
బ్రిటన్ః నలభై ఏళ్ళ నిండు గర్భిణి... తనపై దాడి జరిగినా పట్టించుకోలేదు. కడుపులో ఉన్న తన పండంటి బిడ్డను కాపాడుకోవడంకోసం తీవ్రంగా ప్రయత్నించింది. ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితిలోనూ బిడ్డను కాపాడుకోవడం కోసం పరితపించింది. చివరికి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె మాత్రం ప్రాణాలకోసం పోరాడుతోంది. ఇంగ్లాండ్ వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ప్రాంతంలో జరిగిన కిరాతకుడి దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎప్పుడూ బిజీగా ఉండే సుట్టన్ కోల్డ్ ఫీల్డ్ పట్టణ కేంద్రంలో 41 ఏళ్ళ దుండగుడు ఉన్నట్లుండి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. అయితే కత్తిపోట్లకు గురైన ఆమె ఇతరుల సహాయంతో ఆస్పత్రిలో చేరి.. ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించింది. అయితే ఆమె మాత్రం ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్లు వెస్ట్ మిడ్‌లాండ్ పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు, నేరస్థుడు ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన వారేనని, ఇది కుటుంబ తగాదా అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే మరే ఇతర సభ్యులు ఘటన సమయంలో అక్కడ లేకపోవడం, ఆమెపై దాడి జరిగిన కొన్ని సెకన్ల తర్వాత బాధితురాలు అరుపులు వినిపించడంతో దగ్గరలోని వారు రక్షించేందుకు సహాయపడ్డారని వారు తెలిపారు. దీంతో ఒకే ఒక వ్యక్తి దాడికి పాల్పడినట్లు తాము భావిస్తున్నట్లు వెస్ట్ మిడ్లాండ్స్ ఛీఫ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూలియన్ హార్పర్ వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసుగా అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే బాధితురాలిని కాపాడటంలో ఇద్దరు వ్యక్తులకు కూడ స్వల్ప గాయాలవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరైన సమయంలో ప్రాణాలకు తెగించి, ధైర్యంగా బాధితురాలిని కాపాడిన వారిద్దరికీ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అనంతరం బిడ్డకు జన్మనిచ్చిందని వెస్ట్ మిడ్‌లాండ్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది తెలిపారు. -
చికెన్ ముక్క కోసం చంపేశాడు
లండన్ : చికెన్ ముక్క ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పార్టీలో చికెన్ ముక్క కోసం చెలరేగిన స్వల్ప వివాదంతో స్నేహితుడిని పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. హూస్టన్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం రినాల్డ్ కార్డోసో రివేరా (38) డార్విన్ పెరెజ్ గోంజాలెజ్ (34) ఇద్దరూ స్నేహితులు. పెరేజ్ నివాసంలో మరో అయిదుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. చికెన్, మందుతో విందు జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో డార్విన్ చికెన్ ఆఖరి ముక్కను ఆరగిస్తున్నాడు. అయితే ఆ ముక్క తనకు కావాలంటూ రివేరా అనటంతో .... ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. అసలే మద్యం సేవించి ఉన్నారేమో, విచక్షణ మరిచిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న క్రమంలో రివేరా, డార్విన్ పై కత్తి దూశాడు. ఆగ్రహం పట్టలేని రివేరా...స్నేహితుడిని పలుమార్లు కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినా , ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. -
పోలీసును పొడిచి చంపారు
ఢాకా: ఒకే రోజు రెండు చోట్ల పోలీసులపై దుండగులు జరిపిన దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగర శివారులోని అశులియా చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. నెల రోజుల్లో పోలీసులపై దాడి జరగడం ఇది రెండో సారి. పోలీసులు తెలిపిన వివరాలు.. బైక్‌లపై వచ్చిన ఏడుగురు దుండగులు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం పై బుధవారం కాల్పులు జరిపారు. అనంతరం ఇద్దరిపై పెద్ద పెద్ద కత్తులతో దాడి చేశారు. వీరిలో కానిస్టేబుల్ ముకుల్ హోసైన్(23) మెడ భాగంలో పొడవగా, తీవ్రగాయాలతో ఆస్పత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ నూర్-ఈ-ఆలంకు తీవ్రగాయాలయ్యాయి, ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తూర్పు ఢాకాలో పోలీసులపై జరిగిన మరో దాడిలో ఐదుగురుకి గాయాలయ్యాయి. గుర్తు తెలియని దుండగులు పోలీసు వాహనంపై కాల్పులు జరపడంతో పోలీసులకు గాయాలయ్యాయి. గత నెల 21న ఎస్ఐని దుండగులు కత్తులతో పొడిచి చంపిన ఘటన మరువకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ దాడులను హోం మంత్రి అసదూజ్జమాన్ ఖాన్ కమాల్ ఖండించారు. ఇంతకుముందు పోలీసు అధికారులపై జరిపిన మిలిటెంట్ సంస్థే ఈ దాడికి కూడా పాల్పడి ఉండొచ్చని అన్నారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. -
బాలికపై లైంగిక దాడి, చిత్రహింసలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డులో మరో అమానుషం జరిగింది. ఓ కామాంధుడి చేతిలో చిత్రహింసలకు గురైన మరో నిర్భయ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఒక్లా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఎనిమిదేళ్ల పాపను స్కూలు నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. అనంతరం చిత్రహింసల పాలు చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 45 ఏళ్ల వ్యక్తి పథకం ప్రకారం బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. బాలిక బంధువునని చెప్పి స్కూలు సిబ్బందిని నమ్మించాడు. అతను తన పొరుగువాడే కావడంతో బాలిక కూడా అతని వెంట వెళ్లేందుకు ఒప్పుకుంది. అక్కడి నుంచి స్కూలు వెనుకనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారిపై కత్తితో దాడిచేశాడు. తలపై బండరాయితో మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్రగాయాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్ననిందితుడి కోసం వెదుకుతున్నారు. -
యువతిపై అత్యాచారయత్నం
చిత్తూరు: మేకలు కాసేందుకు వెళ్లిన యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవడంతో కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం డొలగుట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఒక యువతి ఆదివారం మేకలు కాసుకొని వస్తుండగా సాయంత్రం ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తులు ఇది గమనించడంతో కత్తితో ఆమె పీక కోసి పరారయ్యారు. కాగా, బాధితురాలిని వెంటనే మెరుగై వైద్యం కోసం కుప్పం తరలించారు. మంగళవారం విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మిర్చి లారీని ఎత్తుకెళ్లిన దుండగులు
గుంటూరు(సత్తెనపల్లి): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మిర్చిలోడ్తో వెళుతున్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది, లారీని తీసుకెళ్లారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
తమతో ఫోటోలు దిగాలని వేధింపులు
తిరునవ్వేలి: ముసుగు ధరించి వచ్చిన దుండగులు గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చొరబడి ఇద్దరు బాలికలపై కత్తులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని తిరునవ్వేలిలో కలకలం రేపింది. గాయపడిని బాలికలను అంబాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో కడలూరు-పొత్తపాతూరు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. అయితే గతవారం రోజులుగా బాలికలను కత్తులతో బెదిరించి అల్లరి పెడుతున్న ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమతో కలిసి సెల్‌ఫోన్ లో ఫోటోలు దిగాలని బాలికలను వేధించారని పోలీసులు తెలిపారు. పారిపోయి ముగ్గురు ఇద్దరు బాలికలపై దాడికి పాల్పడివుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చెల్లెలిని ప్రేమించాడని 15 కత్తిపోట్లు
అమ్మాయిని ప్రేమించినందుకు ఆమె అన్నలు ముగ్గురు కలిసి దేశ రాజధాని నడిబొడ్డున ఓ వ్యక్తిని కత్తులతో పలుమార్లు పొడిచేశారు. తీవ్ర గాయాల పాలైన సదరు బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సుజిత్ అనే ఈ ప్రేమికుడిని అమ్మాయి అన్నయ్యలు ముగ్గురు, వారి స్నేహితుడొకరు కలిసి ఏకంగా 15 సార్లకు పైగా కత్తులతో పొడిచినట్లు తెలుస్తోంది. తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని తొలుత సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చి, తర్వాత అక్కడినుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడే మృత్యువుతో పోరాడుతున్నాడు. కత్తిపోట్లు పొడిచిన వారిలో అమ్మాయి అన్నల్లో ఒకరితో పాటు వారి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు సోదరులు పరారీలో ఉన్నారు. సుజిత్‌కు ఆ అమ్మాయితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ విషయమై కోపగించిన ఆమె అన్నలు.. కొన్ని రోజుల క్రితమే సుజిత్‌ను తమ చెల్లెలికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కానీ మళ్లీ ఆమె సుజిత్‌తో కలిసి తిరుగుతుండటం చూసి, ఇంటి నుంచి బయటకు పిలిచి పొడిచి పారిపోయారని పోలీసులు తెలిపారు.