పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న సాయంత్రం ధనుష్ అనే వ్యక్తి బెంగళూరుకు 185 కిలో మీటర్ల దూరంలోని హసన్ లోని బస్టాప్ సమీపంలో ఒక మహిళతో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దుర్భాష లాడుతూ అతనిపై దాడి చేశారు. దీంతో ధనుష్ తన సోదరున్ని, ఇద్దరు స్నేహితులను సాయం చేయమని కేకలు వేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
ఇరు వర్గాలు దాదాపు 20 నిమిషాలు రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ దాడిలో ధనుష్ సోదరుడు సుదీప్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ఇంత జరుగుతున్నా ఒక్కరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. .జరుగుతున్న ఉదంతాన్ని తమ చరవాణిలో చిత్రీకరించడానికే ప్రయత్రించారు. కేసును నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి రాహుల్ కుమార్ తెలిపారు.