
ఆస్పత్రిలో బాధిత యువకుడు, ఇన్‌సెట్‌లో రాకేశ్
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే ఓ నాయకుడి కుమారుడు చెలరేగిపోయాడు. తన ప్రియురాలి స్నేహితుడిపై కత్తితో దాడి చేయడం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లింగరాజుకుమారుడు రాకేశ్ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్ ఉన్నాడని రాకేశ్ తెలుసుకున్నాడు.
తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రాకేశ్ కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment