girl friend issue
-
ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): త్రికోణ ప్రేమకథలో భగ్నప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దొడ్డ తాలూకా సూలుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఆనంద్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కనబడకుండాపోయిన ఆనంద్ శవం సోమవారం చెరువులో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. షోరూంకు నిప్పుపెట్టిన ఉద్యోగి కోలారు: నగరంలోని ఎల్రక్టానిక్ షోరూంలోని పనిచేస్తూ నగదు కోసం షోరూంకే నిప్పు పెట్టిన వ్యక్తిని ధల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సల్మాన్ సాదిక్ పోలీసులు గుర్తించారు. ఇతను రెండేళ్లుగా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 35 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మొదట ఇది ప్రమాదం అనుకున్నారు. కానీ క్యాష్‌బాక్స్‌లో ఉన్న నగదు కనిపించకపోయేసరికి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. చదవండి: పొరపాటున.. దారుణ హత్య -
ప్రేమికుడి బాబా వేషం.. గడ్డం లాగడంతో..
భువనేశ్వర్: ప్రియురాలి బాగోగులు తెలుసుకునేందుకు బాబా వేషం ధరించాడు ఓ ప్రేమికుడు. చివరి దశలో వ్యూహం బెడిసి కొట్టింది. స్థానికులకు పట్టుబడి చావు దెబ్బలు తిన్నాడు ప్రియుడు. జాజ్‌పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనీలో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. బాబా వేషంలో వీధిలో తిరుగాడుతున్న ప్రేమికుడిని పిల్లల దొంగగా భావించిన స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు కథ బట్టబయలైంది. ఈ వేషగాడు అంగుల్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు వీరి ప్రేమని నిరాకరించారు. దీంతో ప్రియురాలి ఇంట్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆమెతో ముఖాముఖి భేటీ కావాలనుకున్నాడు. తక్షణమే వేషం మార్చి బాబాగా తయారయ్యాడు. ప్రియురాలి ఇంటి పరిసరాల్లో తిరుగాడుతున్న అతన్నిపై అనుమానంతో స్థానికులు పట్టుకుని నిలదీశారు. మొదట తాను హిమాలయాల నుంచి వచ్చినట్లు బుకాయించాడు. అతడి సమాధానాలతో ఏకీభవించని స్థానికులు సందేహంతో గడ్డం లాగడంతో బండారం బట్టబయలైంది. దొంగ బాబాను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. -
నా లవర్‌తోనే చనువుగా ఉంటావా..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే ఓ నాయకుడి కుమారుడు చెలరేగిపోయాడు. తన ప్రియురాలి స్నేహితుడిపై కత్తితో దాడి చేయడం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లింగరాజుకుమారుడు రాకేశ్ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్ ఉన్నాడని రాకేశ్ తెలుసుకున్నాడు. తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రాకేశ్ కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
ప్రేమ.. చంపేసింది
‘‘పెద్దగా చదువుకోలేదు.. కానీ చేతిపని ఉన్నోడు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో సీలింగ్ పని చేస్తుంటాడు... హైదరాబాద్‌లో ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. ప్రేమికురాలి కోసమని పనిమానేశాడు. కాంట్రాక్టు పనుల కోసం పెట్టుబడి పెట్టాలని ఇంట్లో చెప్పి తండ్రితో అప్పులు చేయించి మరీ పెద్దమొత్తంలో డబ్బులు తీసుకువెళ్లేవాడు. వేలకు వేలు డబ్బులు ప్రియురాలికి సమర్పించుకుంటూ ఉండేవాడు. చివరికి నీపై ప్రేమేలేదని ఆ యువతి చెప్పింది... తాను నిజాయితీగా ప్రేమిస్తే ఆమె మోసం చేసిందని వేదనతో కుమిలి పోయాడు.. ఆమె లేకపోతే బతికి ఉండడమే వేస్ట్ అనుకున్నాడు. స్నేహితులు ఎంత నచ్చజెప్పినా వినకుండా కాలువలోకి దూకి ప్రాణం తీసున్నాడు’’ ఏలూరు టౌన్ : ఏలూరు హనుమాన్‌నగర్ కృష్ణా కాలువలో ఒక యువకుడు దూకాడనే సమాచారం మంగళవారం ఏలూరు పట్టణంలో కలకలం రేపింది. స్నేహితుడు చూస్తుండగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కాలువలోకి దూకేయటంతో అతడు హతా శుడయ్యాడు.తేరుకుని వెళ్లి స్నేహితుడిని కాపాడేందుకు కాలువలోకి దూకాడు. కానీ బురదలో ఇరుక్కుపోవటంతో భయపడి వెనక్కి వచ్చేశాడు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.35 నిమిషాల వరకూ కృష్ణకాలువలో అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తీవ్రస్థాయిలో గాలించారు. బోటు, లైఫ్ జాకెట్లు వేసుకుని సిబ్బంది కాలువలో జల్లెడపట్టారు. జిల్లా అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి యాగంటి హనుమంతరావు కుమారుడు శివతేజ కాలికి మృతదేహం తగలటంతో మిగిలిన సిబ్బంది కాలువలో దూకి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ కాటేసింది : ఏలూరు దొండపాడుకు చెందిన జొన్నాదుల రాజు (28) పదో తరగతి వరకూ చదువుకున్నాడు. తండ్రి కృష్ణ తాపీపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు రాజు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వర్కు చేస్తుంటాడు. గత కొంతకాలంగా కాంట్రాక్టు వర్కులు ఒప్పుకుని ఊర్లు తిరుగుతూ పనులు చేస్తుండేవాడు. ఇటీవల రాజుకు ఒక యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారటంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉండే యువతి కోసమే వేలాది రూపాయలు అప్పులు చేస్తుండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఇంట్లో వారితో కూడా కాంట్రాక్టు పనుల కోసమని చెప్పి అప్పులు చేయించి మరీ తీసుకువెళ్లి యువతికి ఖర్చు చేసేవాడని అంటున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసిమరీ ప్రేమగా చూసుకుంటూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ యువతిని తీసుకువచ్చి తనతో పెళ్లి చేయకపోతే రైలుకింద పడి చనిపోతానని ఇంట్లో వాళ్లని రెండు రోజుల క్రితం బెదిరించినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం బలవంతంగా హైదరాబాదు నుంచి తీసుకువచ్చారు. హనుమాన్ నగర్లో సంఘటనా స్థలానికి ఎదురుగా నివాసం ఉంటున్న స్నేహితుడు యార్లగడ్డ రమేష్ వద్ద ఉంటున్నాడు. ఉదయం నుంచి పూటుగా మద్యం సేవిస్తున్న రాజు మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో పరుగెత్తుకుంటూ వెళ్లి కృష్ణా కాలువలోకి దూకేశాడు. రక్షించేందుకు కాలువలోకి దూకిన అతని స్నేహితుడు రమేష్ బురదలో ఇరుక్కుపోవటంతో భయపడి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రెండున్నర గంటలు శ్రమించి రాజు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
నెన్నెల(బెల్లంపల్లి): ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే దాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చుంది. ఈ సంఘటన మండలంలోని గన్పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతి సండ్ర సంధ్యారాణి, గన్పూర్ గ్రామానికి చెందిన సత్యంశెట్టి సత్యనారాయణ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకొని మోసం చేసినట్లు యువతి తెలిపింది. పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా అప్పుడూ.. ఇప్పుడూ అంటూ దాటేసుకుంటు వచ్చినట్లు పేర్కొంది. తీరా సోమవారం వేరే అమ్మాయితో నిశ్చితార్థం కాగా.. తనకు న్యాయం చేయాలంటూ సత్యనారాయణ ఇంటి ఎదుట సంధ్యారాణి ఆందోళనకు దిగింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది. కాగా, ప్రియుడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లగా.. సత్యనారాయణ సైతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సంధ్యారాణి వాపోయింది. -
స్నేహితురాలిని బైక్ ఎక్కించుకోలేదని..
కుత్బుల్లాపూర్: తన గర్ల్‌ఫ్రెండ్‌ను బైక్‌పై తీసుకువెళ్లలేదన్న కోపంతో ఓ విద్యార్థి స్నేహితులతో కలిసి కారులో ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ అందె శ్రీనివాస్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసమ్మగూడలోని కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్ధిని, జగద్గిరిగుట్టకు చెందిన తన క్లాస్మేట్ పవన్‌కుమార్‌ను ఈ నెల 6న బైక్‌పై ఎర్రగడ్డకు తీసుకువెళ్లాలని కోరింది. అందుకు పవన్‌కుమార్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సదరు యువతి ఈ విషయాన్ని అదే కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న జోయల్‌కు చెప్పింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న జోయల్ తన స్నేహితులు ప్రేమ్‌కుమార్, రీయాజ్లతో కలిసి 7వ తేదీన పవన్‌కుమార్‌ను కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి షాపూర్‌నగర్‌లో దింపి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితులు జోయల్, ప్రేమ్‌కుమార్, పవన్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. -
గర్ల్‌ఫ్రెండ్ వివాదం.. అన్నను చంపిన తమ్ముడు
అర్ధరాత్రి పూట తనను బయటకు పంపి, గర్ల్‌ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తున్నాడన్న కోపంతో సొంత అన్నను డంబెల్‌తో కొట్టి చంపేశాడో పీజీ విద్యార్థి. ఈ సోదరుల తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఝాన్సీలో నివసిస్తారు. తనను బయటకు ఎందుకు పంపుతున్నావంటూ ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న హిమాంశు వర్మ (23) తన అన్న హితేష్ (28)తో గొడవ పడ్డాడు. రాత్రిపూట చలిలో తాను బయట ఉండలేనని అన్నాడు. ఆ విషయమై ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో కోపంతో డంబెల్ తీసుకుని అన్నమీద విసిరేశాడు. అంతేకాక.. అతడు చనిపోయేవరకు దాంతో కొట్టాడు. బాధితుడు హితేష్ ఓ కాలేజిలో సంస్కృతం చెబుతుంటాడు. రాత్రి 1.30 గంటల సమయంలో అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చి, హిమాంశును బయటకు వెళ్లమని చెప్పాడు. ప్రతి రెండు రోజులకోసారి అతడు అలాగే చేస్తున్నాడని హిమాంశు పోలీసులకు చెప్పాడు. ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటంతో తనకు కోపం వచ్చిందని, ఆ చలిలో బయటకు వెళ్లడానికి తాను నిరాకరించానని అన్నాడు. అన్నను చంపిన తర్వాత తానే పోలీసులకు రాత్రి 3 గంటల సమయంలో ఫోన్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన అన్నను చంపారని కట్టుకథ అల్లాడు. చంపడానికి ఉపయోగించిన డంబెల్‌ను మంచం కింద దాచేశాడు. అయితే రాత్రి ఎవరూ ఇంటికి రాలేదని ఇంటి యజమాని చెప్పారు. మొదటి అంతస్థుకు వెళ్లడానికి ఒకటే దారి ఉండగా.. కింద గ్రౌండ్‌ఫ్లోర్‌లో యజమాని ఉంటారు. గట్టిగా ప్రశ్నించినప్పుడు హిమాంశు ఒక్కసారిగా ఏడ్చేసి, తన నేరాన్ని అంగీకరించాడని డీసీపీ మాధుర్ వర్మ చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఢిల్లీకి వచ్చిన రెండు నెలల తర్వాత హితేష్ ఓ అమ్మాయితో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో దాన్ని రహస్యంగా ఉంచినా, తర్వాత హిమాంశుకు తెలిసిపోవడంతో సహకరించాలని కోరాడు. మొదట్లో అంగీకరించినా, అర్ధరాత్రి బయటకు పంపడంతోప తట్టుకోలేకపోయానని హిమాంశు పోలీసులకు చెప్పాడు.