ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. | Cheated In Love: Man Commits Suicide In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి..

Published Tue, Oct 19 2021 7:38 AM | Last Updated on Tue, Oct 19 2021 7:49 AM

Cheated In Love: Man Commits Suicide In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): త్రికోణ ప్రేమకథలో భగ్నప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దొడ్డ తాలూకా సూలుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఆనంద్‌ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్‌ ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కనబడకుండాపోయిన ఆనంద్‌ శవం సోమవారం చెరువులో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

షోరూంకు నిప్పుపెట్టిన ఉద్యోగి
కోలారు: నగరంలోని ఎల్రక్టానిక్‌ షోరూంలోని పనిచేస్తూ నగదు కోసం షోరూంకే నిప్పు పెట్టిన వ్యక్తిని ధల్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని సల్మాన్‌ సాదిక్‌ పోలీసులు గుర్తించారు. ఇతను రెండేళ్లుగా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 35 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాలిపోయాయి. మొదట ఇది ప్రమాదం అనుకున్నారు. కానీ క్యాష్‌బాక్స్‌లో ఉన్న నగదు కనిపించకపోయేసరికి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితున్ని  అరెస్ట్‌ చేశారు.    

చదవండి: పొరపాటున.. దారుణ హత్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement