Electronic shop
-
ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): త్రికోణ ప్రేమకథలో భగ్నప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దొడ్డ తాలూకా సూలుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఆనంద్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కనబడకుండాపోయిన ఆనంద్ శవం సోమవారం చెరువులో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. షోరూంకు నిప్పుపెట్టిన ఉద్యోగి కోలారు: నగరంలోని ఎల్రక్టానిక్ షోరూంలోని పనిచేస్తూ నగదు కోసం షోరూంకే నిప్పు పెట్టిన వ్యక్తిని ధల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సల్మాన్ సాదిక్ పోలీసులు గుర్తించారు. ఇతను రెండేళ్లుగా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 35 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. మొదట ఇది ప్రమాదం అనుకున్నారు. కానీ క్యాష్‌బాక్స్‌లో ఉన్న నగదు కనిపించకపోయేసరికి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. చదవండి: పొరపాటున.. దారుణ హత్య -
మార్కెట్ మళ్లీ కళకళ!
మోస్ట్ హాపెనింగ్ సిటీ ఇండియాలో ఏది..? హైదరాబాద్ అని ఓ మూడు నాలుగు నెలల క్రితం చాలామంది ఠక్కున సమాధానం చెప్పేవారు. తెలుగువారే కాదు.. ఈ ప్రశ్నకు ఉత్తరాదిన కూడా ఇలాంటి జవాబే వినిపించేది. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరుకు కంగారు పెట్టిస్తున్న వేగాన్ని నమోదు చేసుకుంటుం డటం, పారిశ్రామికంగా వేగంగా అడుగులు ముందుకు పడుతుండటం, నిర్మాణ రంగంలో రెక్కలు కట్టుకున్నట్లు రివ్వున ఎగురుతుండటం.. ఈ చారిత్రక నగరం ప్రత్యేకత. మినీ భారత్‌గా వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిన భాగ్యనగరం ఇప్పుడు దేశంలో వేగంగా పురోగమిస్తున్న నగరాల జాబితాలో ముందు వరుసలో ఉంది. అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అంటే షహర్ హమారానే. ఇప్పుడు తన మార్కును లాక్డౌన్ సమయంలోనూ నిరూపించుకుంటోంది. దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు చేసుకుని భయం భయంగా కేంద్రం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్న తరుణంలో.. జనం గడప దాటేందుకు జంకుతారన్న అభిప్రాయం ఉండేది. కానీ.. దుకాణాలు తెరుచుకుని నాలుగు రోజులే అయినా.. హైదరాబాద్ యావత్తూ కళకళలాడుతోంది. ఈ సమయంలో జనం రోడ్లపైకి రావటం కరోనా కోణంలో ప్రమాదమే అయినా, జాగ్రత్తలు పాటిస్తూ సిటిజన్లు మళ్లీ బిజీగా మారిపోయారు. నాలుగు రోజుల్లోనే మళ్లీ కార్యాలయాలు తెరుచుకున్నాయి.. కార్యకలాపాలు మొదలయ్యాయి. కొనుగోళ్లు మొదలయ్యాయి. దక్షిణాదిలో చెన్నై, బెంగళూరులు బిక్కుబిక్కుమంటూ ఉంటే హైదరాబాద్ మాత్రం ధైర్యంగానే అడుగులు వేస్తోంది. దుకాణాలన్నీ ఒకేసారి తెరిస్తే వీధులు జనంతో నిండిపోయే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం సరి–బేసి పద్ధతిలో తెరవాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వాటికి నంబరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కో నంబర్ ఆధారంగా దుకాణాలు తెరుస్తున్నారు. చిరువ్యాపారాల నుంచి.. పురానాపూర్ వంతెన.. ఒకప్పుడు మూసీకి రెండు వైపులా ఉన్న నగరాన్ని అనుసంధానిం చేందుకు నిర్మించిన వంతెన. ఇప్పుడు చిరువ్యాపారుల అడ్డా. లాక్డౌన్ వల్ల బోసిపోయిన ఈ వంతెన ఇప్పుడు మళ్లీ కళకళలాడు తోంది. అఫ్జల్‌గంజ్ బ్రిడ్జి, చార్మినార్‌కు వెళ్లే ప్రధాన రహదారి, అమీర్‌పేట, సుల్తాన్ బజార్, బడీచౌడీ, సికింద్రాబాద్ జనరల్ బజార్.. ఇలా చిల్లర వ్యాపారుల ప్రధాన కేంద్రాలన్నీ పాత రూపును సంతరించుకున్నాయి. కొనుగోలు దారులతో కిక్కిరిసి పోయాయి. అదే బాటలో నగల దుకాణాలు.. ఇప్పుడిప్పుడే నగల దుకాణాలు తెరుచుకుంటున్నాయి. షాపులను పూర్తి శానిటైజ్ చేసి, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ఓ ప్రధాన నగల దుకాణం గురువారం తెరుచుకుంది. తొలి రోజే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చారు. గొలుసు కట్టు దుకాణాలున్న మరో పెద్ద దుకాణ సముదాయం శుక్రవారం తెరుస్తున్నారు. పైగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఫోన్ల ద్వారా కావాల్సిన డిజైన్ నగల ఆర్డర్లు ఇవ్వటం విశేషం. ఇవి కాకుండా నగరవ్యాప్తంగా ఉండే చిన్న దుకాణాలు దాదాపు తెరుచుకున్నాయి. ఊపందుకున్న వాహనాల కొనుగోళ్లు.. విలాసవంతమైన కార్ల కొనుగోలులో హైదరాబాద్ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉంటోంది. లాక్డౌన్ సడలింపులతో మళ్లీ కార్ల కొనుగోళ్లు ఊపందుకుంటోంది. వాటితోపాటు బైక్‌లు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని షోరూమ్‌లు తెరుచుకున్నాయి. గత నాలుగు రోజుల్లో దాదాపు 2 వేల వరకు వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ డిజైన్ చూడండి మేడమ్.. మామూలు రోజుల కంటే ఎక్కువగా.. గత రెండు నెలల లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పాడయ్యాయి. ఇప్పుడు దుకాణాలు తెరుచుకోగానే వాటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ కేటగిరీ దుకాణాలు దాదాపు వారం కిందటే తెరుచుకున్నాయి. అప్పటి నుంచి అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. ‘లాక్డౌన్ కంటే ముందు సాధారణ రోజుల్లో మా షోరూమ్‌కు నిత్యం సగటున దాదాపు 50 మంది వరకు కొనుగోలుదారులు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య సగటున 70 వరకు ఉంటోంది. కొంతకాలం ఇలాగే సాగే అవకాశం ఉంది’అని నగరంలోని ఓ చైన్ ఎలక్ట్రానిక్ షోరూమ్ నిర్వాహకుడు పేర్కొన్నారు. సవాళ్లు నగరానికి కొత్త కాదు.. ► 1908 సెప్టెంబర్.. దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం ఏకధాటిగా గంటల తరబడి కొనసాగటంతో మూసీ నది ఉప్పొంగింది. దాదాపు 60 అడుగుల మేర నీళ్లు ప్రవహించి నగరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అఫ్జల్‌గంజ్, ముస్లింజంగ్, చాదర్‌ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. జనావాసాలను ధ్వంసం చేశాయి. 85 వేల ఇళ్లు నేలమట్టమై 50 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంత భారీ విధ్వంసం తర్వాత వెంటనే నగరం కోలుకుంది. మళ్లీ జనజీవనం సాధారణంగా మారింది. ► 1919–20 స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా భీకరంగా విరుచుకుపడటంతో నగరంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. లక్షల్లో జనం చనిపోయారు. కానీ నాటి ప్రభుత్వం మృతుల వివరాలు తొక్కి పెట్టడంతో అవి వెలుగు చూడలేదు. కానీ నగరం భారీగా అల్లాడింది. అయినా చూస్తుండగానే కోలుకుంది. ఇలాంటి జరీ వర్క్ వేరే షాపులో దొరకదు.. పుంజుకున్న వస్త్ర వ్యాపారం వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే సుముహూర్తాలున్న సమయంలోనే లాక్డౌన్ వచ్చి పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల వివాహాలు, ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు బట్టల దుకాణాలు తెరుచుకోవటంతో ఒక్కసారిగా కొనుగోళ్లు ఊపం దుకున్నాయి. బుధ, గురువారాల్లో నగరంలోని ప్రధాన వస్త్ర దుకా ణాలు రద్దీగా కన్పించాయి. ‘శుభ కార్యాలు జరిగే సమయంలో లాక్ డౌన్ వచ్చిపడటంతో మేం దుకా ణాలు తెరవలేదు. లాక్డౌన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో, వ్యాపా రంలో ఎంత నష్టం మిగులుతుందో నన్న చింత వెంటాడింది. షాపులు తెరుచుకున్న తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉంటుం దనుకోలేదు. కానీ ఊహించిన దాని కంటే కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నాయి’అని కోఠిలోని ఓ వస్త్ర వ్యాపారి ముకుంద్ దాస్ పేర్కొన్నారు. ఇంత వేగంగా పుంజుకుంటుందనుకోలేదు ‘దుకాణం తెరిచిన మొదటిరోజే 15 కూలర్లు విక్రయించాం. కరోనా ఇంతలా భయపెడుతున్న సమయంలో కూడా జనం ఈమాత్రం కొనుగోలు చేస్తారని మేం ఊహించలేదు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుంది. ఇంకా దాదాపు నెల రోజుల పాటు ఎండలు ఉండనున్నందున కూలర్ల కొనుగోలు బాగా జరుగుతాయన్న ఆశాభావం ఉంది.’ – మహ్మద్ జావీద్, కూలర్ల దుకాణం నిర్వాహకుడు, అబిడ్స్ మరో రెండు చేతులుంటే బాగుండేది ‘రెండే రోజులైంది దుకాణం తెరిచి. 35 మిక్సీల మరమ్మతు చేశాను. నాకు మరో రెండు చేతులుంటే.. ఇంకొన్ని బాగు చేసే వాడిని కదా అనుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత దుకాణం తెరిచాను కదా.. ఎవరూ రారేమో అనుకున్నా. కానీ, తొలి రోజు నుంచే జనం వస్తున్నారు.’ – అజీమ్, మిక్సీల మరమ్మతుదారు, ట్రూప్‌బజార్ -
ఎలక్ట్రికల్ మార్కెట్లు.. కళకళ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నగరంలోని ప్రముఖ మార్కెట్లయిన ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వస్తువులను ప్రజలు భారీగా కొనుగోళ్లు చేశారు. దీంతో ట్రూప్‌బజార్ ఎలక్ట్రానిక్ మార్కెట్, రాంకోఠి, ఫీల్‌ఖానా, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల ఆటోమొబెల్ మార్కెట్లలో సందడి నెలకొంది. ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో మొదటి రోజు మార్కెట్ కళకళలాడింది. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. (నిబంధనల సడలింపు సాధ్యం కాదు: సీఎం) భౌతికదూరం అంతంతే.. రాంకోఠి, ట్రూప్‌బజార్, కోఠి బ్యాంక్‌స్ట్రీట్, ఫీల్‌ఖానా మార్కెట్లకు ఎలక్ట్రానిక్స్, ద్విచక్ర, కార్ల స్పేర్‌పార్ట్స్‌తో పాటు హౌస్వైరింగ్, ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్ స్వీచ్‌లు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచి్చన ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం కనిపించింది. అంతేగాకుండా సొంత వాహనాల్లో ఎలాక్ట్రానిక్ వస్తువులు పెద్ద ఎత్తున తీసుకు వెళ్తుండటంతో పలుచోట్ల చిన్న ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గూడ్స్ ఆటోల రవాణా లేకపోవడంతో కొందరు ప్యాసింజర్ ఆటోల్లో వస్తువులను తరలించారు. (‘కశ్మీర్ గురించి పట్టించుకోవడం మానేయ్’) ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎల్రక్టానిక్ దుకాణదారులు, ఆటో మొబైల్ దుకాణదారులు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారస్తులకు సొంత మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకున్నారు. షాపుల్లో భౌతికదూరం పాటించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. షాపు లోపలకు కొద్ది మందిని మాత్రమే అనుమతినిస్తూ, వారు వెళ్లిపోయిన తర్వాతే ఇతరులకు అనుమతి ఇచ్చారు. ట్రూప్ బజార్ ఆన్లైన్ పద్ధతికి శ్రీకారం ఎల్రక్టానిక్, ఆటోమొబైల్ వ్యాపారులు సొంతంగా వైబ్‌సైట్ ఏర్పాటు చేసుకుని ఈజీ బైయింగ్, ఈజీ సేల్ పద్ధతికి స్వీకారం చుట్టారు. రాష్ట్రంలోనే పేరుపొందిన మార్కెట్లు ఇక్కడ ఉండటంతో వివిధ జిల్లాల నుంచి కేవలం ఆన్లైన్ ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని టాన్స్‌పోర్టుల ద్వారా డెలివరీ చేస్తున్నారు. (కరోనా.. కమ్మేస్తోంది!: వైరస్ వ్యాప్తిపై నీతి ఆయోగ్) మాస్క్ లేకపోతే నో సేల్స్.. ఆటోమొబైల్ వ్యాపారులకు తమ సంఘం ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాం. మాస్‌్కలు లేకపోతే విక్రయాలు చేయవద్దని వ్యాపారులకు సూచించాం. ప్రతి వినియోగదారుడికి శానిటైజ్డ్ చేసిన తర్వాతే విక్రయిస్తున్నాం. భౌతిక దూరం పాటించాలి. ఎక్కువ శాతం ఆన్లైన్ వ్యాపారానికి అవకాశం ఇవ్వాలని సూచించాం. తమకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. – శ్రీనివాస్‌గుప్తా, అధ్యక్షులు, తెలంగాణ ఆటోమోబైల్ డీలర్స్ అసోసియేషన్ సమ్మర్ వ్యాపారం నేటి నుంచే ప్రారంభం 30 ఏళ్ల నుంచి కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేస్తున్నాం. లాక్డౌన్ వల్ల 50 రోజులకు పైగా తమ దుకాణాలు బంద్ ఉండటం ఇదే మొదటిసారి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి దుకాణాలు తెరిచాం. సమ్మర్ వ్యాపారం నేటి నుంచి మొదలైంది. ప్రజలకు కావాల్సిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, హౌస్ వైరింగ్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. – జితేందర్తివారి, వ్యాపారీ -
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాల్‌దర్వాజ సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. షాపులోని ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతైయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో పెట్రోల్ బంకు ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా షాపులో భారీగా స్టాక్ ఉండడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు షాపు యజమానులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్య్కూటే కారణంగా తెలుస్తోంది. -
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
ఓడిన స్నేహం.. గెలిచిన మృత్యువు
► అనారోగ్యంతో తనువు ► చాలించిన యువకుడు ► ఏడాదిగా మంచానికే ► పరిమితమైన తల్లిదండ్రులు మృత్యువు ముంచుకొస్తున్నా ఆ యువకుడు మంచానికే పరిమితమైన తల్లిదండ్రులకు సేవ చేయడం గురించే ఆలోచించేవాడు.. అలాంటి వ్యక్తిని బతికించుకునేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు తనువు చాలించడంతో కన్నీరు మున్నీరయ్యారు. గట్టు : మండల కేంద్రానికి చెందిన అంజనమ్మ, గుర్రం బజారి దంపతులకు ఇద్దరు కూతుళ్లతోపాటు కుమారుడు వెంకటేష్ (24) ఉన్నారు. వీరిది పేద కుటుంబం. స్థానికంగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలోనే పెద్ద కూతురు వివాహం చేశారు. కాగా, తల్లిదండ్రులు ఏడాదికాలంగా అనారోగ్యంతో మంచాన పడ్డారు. దీంతో డిగ్రీ వరకు చదివిన కొడుకు ఓ ఎలక్ట్రానిక్ షాపులో, చిన్న కూతురు కూలి పనికి వె ళ్లొచ్చి ఇంట్లో వారికి సపర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 15రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కొడుకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నాడు. కిడ్నీ, ఉపిరితిత్తుల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యు లు నిర్ధాంచారు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మొదట్లో కర్నూలుకు తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. మిత్ర బృందంతోపాటు కొర్విపాటి వినోద్‌కుమార్ రూ.లక్ష వరకు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే గ్రామస్తులు మరో రూ.లక్ష పోగు చేసి ఇచ్చినా ప్రయోజనం దక్కలేదు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆ యువకుడు మృతి చెందడతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు.