ఎలక్ట్రికల్‌ మార్కెట్లు.. కళకళ | Electrical And Automobile Markets Reopen In City On Monday | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రికల్‌ మార్కెట్లు.. కళకళ

Published Tue, May 19 2020 9:19 AM | Last Updated on Tue, May 19 2020 9:22 AM

Electrical And Automobile Markets Reopen In City On Monday - Sakshi

ట్రూప్‌ బజార్‌లో సందడి

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నగరంలోని ప్రముఖ మార్కెట్లయిన ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్‌ మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ వస్తువులను ప్రజలు భారీగా కొనుగోళ్లు చేశారు. దీంతో ట్రూప్‌బజార్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెట్, రాంకోఠి, ఫీల్‌ఖానా, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల ఆటోమొబెల్‌ మార్కెట్లలో సందడి నెలకొంది. ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో మొదటి రోజు మార్కెట్‌ కళకళలాడింది. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. (నిబంధనల సడలింపు సాధ్యం కాదు: సీఎం)

భౌతికదూరం అంతంతే.. 
రాంకోఠి, ట్రూప్‌బజార్, కోఠి బ్యాంక్‌స్ట్రీట్, ఫీల్‌ఖానా మార్కెట్లకు ఎలక్ట్రానిక్స్, ద్విచక్ర, కార్ల స్పేర్‌పార్ట్స్‌తో పాటు హౌస్‌వైరింగ్, ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్‌ స్వీచ్‌లు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచి్చన ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం కనిపించింది. అంతేగాకుండా సొంత వాహనాల్లో ఎలాక్ట్రానిక్‌ వస్తువులు పెద్ద ఎత్తున తీసుకు వెళ్తుండటంతో పలుచోట్ల చిన్న ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గూడ్స్‌ ఆటోల రవాణా లేకపోవడంతో కొందరు ప్యాసింజర్‌ ఆటోల్లో వస్తువులను తరలించారు. (‘కశ్మీర్‌ గురించి పట్టించుకోవడం మానేయ్‌’)

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం
ఎల్రక్టానిక్‌ దుకాణదారులు, ఆటో మొబైల్‌ దుకాణదారులు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారస్తులకు సొంత మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకున్నారు. షాపుల్లో భౌతికదూరం పాటించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. షాపు లోపలకు కొద్ది మందిని మాత్రమే అనుమతినిస్తూ, వారు వెళ్లిపోయిన తర్వాతే ఇతరులకు అనుమతి ఇచ్చారు. 


ట్రూప్‌ బజార్‌

ఆన్‌లైన్‌ పద్ధతికి శ్రీకారం  
ఎల్రక్టానిక్, ఆటోమొబైల్‌ వ్యాపారులు సొంతంగా వైబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకుని ఈజీ బైయింగ్, ఈజీ సేల్‌ పద్ధతికి స్వీకారం చుట్టారు. రాష్ట్రంలోనే పేరుపొందిన మార్కెట్లు ఇక్కడ ఉండటంతో వివిధ జిల్లాల నుంచి కేవలం ఆన్‌లైన్‌ ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకొని టాన్స్‌పోర్టుల ద్వారా డెలివరీ చేస్తున్నారు. (కరోనా.. కమ్మేస్తోంది!: వైరస్‌ వ్యాప్తిపై నీతి ఆయోగ్‌)

మాస్క్‌ లేకపోతే నో సేల్స్‌..  
ఆటోమొబైల్‌ వ్యాపారులకు తమ సంఘం ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాం. మాస్‌్కలు లేకపోతే విక్రయాలు చేయవద్దని వ్యాపారులకు సూచించాం. ప్రతి వినియోగదారుడికి శానిటైజ్డ్‌ చేసిన తర్వాతే విక్రయిస్తున్నాం. భౌతిక దూరం పాటించాలి. ఎక్కువ శాతం ఆన్‌లైన్‌ వ్యాపారానికి అవకాశం ఇవ్వాలని సూచించాం. తమకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.      
– శ్రీనివాస్‌గుప్తా, అధ్యక్షులు, తెలంగాణ ఆటోమోబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌  

సమ్మర్‌ వ్యాపారం నేటి నుంచే ప్రారంభం  
30 ఏళ్ల నుంచి కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్‌ వ్యాపారం చేస్తున్నాం. లాక్‌డౌన్‌ వల్ల 50 రోజులకు పైగా తమ దుకాణాలు బంద్‌ ఉండటం ఇదే మొదటిసారి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి దుకాణాలు తెరిచాం. సమ్మర్‌ వ్యాపారం నేటి నుంచి మొదలైంది. ప్రజలకు కావాల్సిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, హౌస్‌ వైరింగ్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.    
– జితేందర్‌తివారి, వ్యాపారీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement