Auto Mobile shop
-
హైదరాబాద్ యూసుఫ్ గూడాలో అగ్నిప్రమాదం
-
అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు
Asia's largest 'junk market' shuts down: చోరీ చేసిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి, వాటితో జోరుగా వ్యాపారం సాగిస్తున్న సోటిగంజ్ మార్కెట్‌ను ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆదివారం సీజ్ చేసింది. ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన కార్లను ఈ మార్కెట్లో విడిభాగాలుగా చేసి ఇల్లీగల్‌గా వ్యాపారం సాగుతోంది. ఈ దందాకు చెందిన హాజీ ఇక్బాల్, హాజీ గల్లా అనే ఇల్లీగల్ గ్యాంగ్స్టర్లు పోలీసులకు పట్టుబడిన తర్వాత సోటిగంజ్ మార్కెట్ మూసివేతకు ఉపక్రమించారు. అంతేకాకుండా కోట్ల విలువచేసే ఆస్తులను కూడా సీజ్ చేశారు. నివేదికల ప్రకారం.. దొంగిలించిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి అక్రమ వ్యాపారం చేయడం ఈ మార్కెట్లో 1990లలో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇళ్లలోపల గౌడౌన్లు నిర్మించి దొంగ కార్ల వ్యాపారం ప్రారంభించారు. 1,000 మందికి పైగా పనిచేసే ఈ మార్కెట్లో ప్రస్తుతం దాదాపుగా 300 కంటే ఎక్కువ దుకాణాలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని దుకాణాలను మూసివేయాలని అక్కడి ఎస్హెచ్ఓ ఆదేశించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ కేసులో మీరట్ జిల్లా ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ మార్కెట్లో అక్రమ వ్యాపారం చేస్తున్న 100 షాప్‌లను గుర్తించాం. స్టాక్ సమాచారాన్ని సేకరిస్తే తప్ప, వాటికి ఎలాంటి సరుకులు చేరనివ్వబోమని' వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూసేందుకు పరిపాలనా యంత్రాంగం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సోటిగంజ్ మార్కెట్లో 200 మందికి పైగా సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సోటిగంజ్‌లోని ప్రధాన జంక్‌లలో హాజీ గల్లా, హాజీ ఇక్బాల్, హాజీ అఫ్తాబ్, ముష్తాక్, మన్ను అలియాస్ మీనుద్దీన్, హాజీ మొహ్సిన్, సల్మాన్ అలియాస్ షేర్, రాహుల్ కాలా, సలాహుద్దీన్ ఉన్నారు. ఈ స్క్రాపర్లపై 2,500కు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యి ఉన్నాయి. వీరిలో 37 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెల్పింది. చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్.. -
తెలంగాణ: సాయంత్రం 6.30 వరకే ఆ దుకాణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్(టూ, త్రీ వీలర్) దుకాణాలు సాయంత్రం గం.6:30లకే మూసివేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వీటిని అందరూ పాటించాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎలక్ట్రికల్ మార్కెట్లు.. కళకళ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నగరంలోని ప్రముఖ మార్కెట్లయిన ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వస్తువులను ప్రజలు భారీగా కొనుగోళ్లు చేశారు. దీంతో ట్రూప్‌బజార్ ఎలక్ట్రానిక్ మార్కెట్, రాంకోఠి, ఫీల్‌ఖానా, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల ఆటోమొబెల్ మార్కెట్లలో సందడి నెలకొంది. ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో మొదటి రోజు మార్కెట్ కళకళలాడింది. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. (నిబంధనల సడలింపు సాధ్యం కాదు: సీఎం) భౌతికదూరం అంతంతే.. రాంకోఠి, ట్రూప్‌బజార్, కోఠి బ్యాంక్‌స్ట్రీట్, ఫీల్‌ఖానా మార్కెట్లకు ఎలక్ట్రానిక్స్, ద్విచక్ర, కార్ల స్పేర్‌పార్ట్స్‌తో పాటు హౌస్వైరింగ్, ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్ స్వీచ్‌లు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచి్చన ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం కనిపించింది. అంతేగాకుండా సొంత వాహనాల్లో ఎలాక్ట్రానిక్ వస్తువులు పెద్ద ఎత్తున తీసుకు వెళ్తుండటంతో పలుచోట్ల చిన్న ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గూడ్స్ ఆటోల రవాణా లేకపోవడంతో కొందరు ప్యాసింజర్ ఆటోల్లో వస్తువులను తరలించారు. (‘కశ్మీర్ గురించి పట్టించుకోవడం మానేయ్’) ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎల్రక్టానిక్ దుకాణదారులు, ఆటో మొబైల్ దుకాణదారులు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారస్తులకు సొంత మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకున్నారు. షాపుల్లో భౌతికదూరం పాటించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. షాపు లోపలకు కొద్ది మందిని మాత్రమే అనుమతినిస్తూ, వారు వెళ్లిపోయిన తర్వాతే ఇతరులకు అనుమతి ఇచ్చారు. ట్రూప్ బజార్ ఆన్లైన్ పద్ధతికి శ్రీకారం ఎల్రక్టానిక్, ఆటోమొబైల్ వ్యాపారులు సొంతంగా వైబ్‌సైట్ ఏర్పాటు చేసుకుని ఈజీ బైయింగ్, ఈజీ సేల్ పద్ధతికి స్వీకారం చుట్టారు. రాష్ట్రంలోనే పేరుపొందిన మార్కెట్లు ఇక్కడ ఉండటంతో వివిధ జిల్లాల నుంచి కేవలం ఆన్లైన్ ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని టాన్స్‌పోర్టుల ద్వారా డెలివరీ చేస్తున్నారు. (కరోనా.. కమ్మేస్తోంది!: వైరస్ వ్యాప్తిపై నీతి ఆయోగ్) మాస్క్ లేకపోతే నో సేల్స్.. ఆటోమొబైల్ వ్యాపారులకు తమ సంఘం ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాం. మాస్‌్కలు లేకపోతే విక్రయాలు చేయవద్దని వ్యాపారులకు సూచించాం. ప్రతి వినియోగదారుడికి శానిటైజ్డ్ చేసిన తర్వాతే విక్రయిస్తున్నాం. భౌతిక దూరం పాటించాలి. ఎక్కువ శాతం ఆన్లైన్ వ్యాపారానికి అవకాశం ఇవ్వాలని సూచించాం. తమకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. – శ్రీనివాస్‌గుప్తా, అధ్యక్షులు, తెలంగాణ ఆటోమోబైల్ డీలర్స్ అసోసియేషన్ సమ్మర్ వ్యాపారం నేటి నుంచే ప్రారంభం 30 ఏళ్ల నుంచి కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేస్తున్నాం. లాక్డౌన్ వల్ల 50 రోజులకు పైగా తమ దుకాణాలు బంద్ ఉండటం ఇదే మొదటిసారి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి దుకాణాలు తెరిచాం. సమ్మర్ వ్యాపారం నేటి నుంచి మొదలైంది. ప్రజలకు కావాల్సిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, హౌస్ వైరింగ్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. – జితేందర్తివారి, వ్యాపారీ -
చిత్తుకాగితాలు ఏరుకుంటూ..
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ఓ ఆటోమొబైల్ షాప్‌లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్ల డించారు. గత నెల 16న స్థానిక మునుసబు గారి వీధిలోని కోకిలా ఎంటర్ప్రైజెస్ ఆటోమొబైల్ షాపు తాళాలు పగులగొట్టి క్యాష్ కౌంటర్లోని రూ.4.50 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ కె.బాలరాజు, ఎస్సై జీజే విష్ణువర్దన్, క్రైం పార్టీ సిబ్బంది ఎన్.సంపత్‌కుమార్, రాజేంద్ర, మధు, రాజశేఖర్ ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఐదేళ్లుగా స్థానిక వారపు సంతలో నివాసం ఉంటూ కాగితాలు, అట్టముక్కలు సేకరించే బోడేపల్లి శివాజీ ఈ చోరీ చేసినట్టు చెప్పారు. అతడిది తణుకు పట్టణం అని, అక్కడి నుంచి వచ్చి స్థానిక వారపు సంతలో, ప్లాట్‌ఫారమ్‌పై నివసిస్తున్నట్టు చెప్పారు. వ్యసనాలకు అలవాటు పడిన శివాజీ గతేడాది ఆగస్టులో వేదాంతపురంలోని ఓ ఇంట్లో రూ.10 వేలు చోరీ చేశాడన్నారు. ఈ నేపథ్యంలో కోకిల ఎంటర్‌ప్రైజెస్‌లో చోరీకి పాల్పడ్డాడన్నారు. చోరీ చేసిన సొత్తులో కొంత వారపు సంతలో తాను నివాసముండే ప్రాంతంలో ఉంచి మరికొంత నగదును విజయవాడ, రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లి ఖర్చుచేశాడన్నారు. మిగిలిన సొమ్ము కోసం వారపు సంతలో తన నివాసం వద్దకు రాగా అతడిని అరెస్టు చేసి రూ.3.10 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై, క్రైం పార్టీ సిబ్బందికి రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. -
ఆటోమొబైల్ షాపు దగ్ధం
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా రామకుప్పంలోని బజారువీధిలో ఉన్న కార్తీక్ ఆటో మొబైల్ షాపు ఆదివారం ఉదయం దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణంలో నుంచి మంటలు, పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోగానే దుకాణం కాలిబూడిదైంది. దాదాపు లక్ష రూపాయల మేర నష్టం వాటినల్లినట్లు యజమాని కార్తీక్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్లే అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.