![Automobile Shops In Telangana To Be Open Till 6.30 pm - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/11/am.jpg.webp?itok=sdfw4Q6j)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్(టూ, త్రీ వీలర్) దుకాణాలు సాయంత్రం గం.6:30లకే మూసివేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వీటిని అందరూ పాటించాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment