పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాల్దర్వాజ సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
షాపులోని ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతైయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో పెట్రోల్ బంకు ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా షాపులో భారీగా స్టాక్ ఉండడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు షాపు యజమానులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్య్కూటే కారణంగా తెలుస్తోంది.