సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. పాతబస్తీలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్‌లో సోఫా తయారీ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో సోఫా తయారీ గోదాం ఉండటంలో మంటలు భవనం పైఅంతస్తులోకి వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలు ఫస్ట్ ఫ్లోర్‌కు వ్యాపించండంతో భవనంలో నివాసం ఉంటున్న 25 మంది మంటల్లో చిక్కుకుపోయారు.
అనంతరం, స్థానికులు మంటలు అర్పే ప్రయత్నం చేయగా కొందరు మంటలను నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నాగరాణి దంపతులు, శివప్రియ, హరిణి గాయపడ్డారు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ(10) మృతిచెందింది. ఇక, ఘటనలో మరో ఎనిమిదికి గాయాలు కావడంతో వారికి చికిత్స జరుగుతోంది.
కాగా, భవనం మొదటి అంతస్తులో సోఫాల తయారీ గోడౌన్ ఉంది. రెండు, మూడు అంతస్తుల్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాన్ని మంటలు చుట్టు ముట్టడంతో ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.
భవనం కింద భాగంలో ఫోమ్ మెటిరియల్ నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు దట్టంగా అలుముకోవడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో భవనం మొత్తం కాలిపోయింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలు చెలరేగుతూరే ఉన్నాయి. గోడౌన్ యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment