
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అయిదు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తోంది. భవనంలో ఉన్నవారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. చుట్టుపక్కలా ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది.