కర్ణాటక: గ్యారంటీ పథకాల పని ఒత్తిడితో పాటు గ్రేడ్–2 తహసీల్దార్ వేధింపులు తాళలేక ఒక మహిళా ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధుగిరిలో జరిగింది. మేదరహట్టి నివాసి లతా మోహన్ (35) తాలూకా కార్యాలయంలో15 ఏళ్లుగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకుంది.
తక్షణమే జిల్లాస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తాలూకా కార్యాలయం ముందు సంతాపసభ ఏర్పాటు చేసి లతా మోహన్‌కు నివాళులర్పించారు. కొందరు మాట్లాడుతూ పని ఒత్తిడితో పాటు గ్రేడ్–2 తహసీల్దార్ జయలక్ష్మమ్మ వేధింపులే లతా మరణానికి కారణమని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
లత భర్త మోహన్ మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని, రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పని ఒత్తిడి ఉంటుందని తన భార్య చెప్పినట్లు తెలిపారు. మధుగిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment