Woman employee
-
గచ్చిబౌలిలో దారుణం.. ప్రైవేట్ ఉద్యోగినిపై ఆటోలో లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.కోడలిపై అత్త, ఆడపడుచు దాడికోడలిపై అత్త, ఆడపడుచు వేడి నీళ్లు పోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నజియా బేగంకు సంతోష్‌నగర్ ఓవైసీ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్‌తో వివాహం జరిగింది. షేక్ షబ్బీర్ ప్రస్తుతం ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. నజియా బేగంకు నలుగురు సంతానం.అత్త మహ్మదియా బేగంతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో నజియాబేగం కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో పిల్లలతో కలిసి వేరుగా నివాసముంటోంది. ఆదివారం పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లడంతో వారిని తీసుకొచ్చేందుకు నజియా బేగం అత్తగారింటికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్త, ఆడపడుచుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అత్త మహ్మదియా బేగం, ఆమె కుమార్తె కలిసి నజియా బేగంపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు నజియా బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య
కర్ణాటక: గ్యారంటీ పథకాల పని ఒత్తిడితో పాటు గ్రేడ్–2 తహసీల్దార్ వేధింపులు తాళలేక ఒక మహిళా ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధుగిరిలో జరిగింది. మేదరహట్టి నివాసి లతా మోహన్ (35) తాలూకా కార్యాలయంలో15 ఏళ్లుగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకుంది. తక్షణమే జిల్లాస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తాలూకా కార్యాలయం ముందు సంతాపసభ ఏర్పాటు చేసి లతా మోహన్‌కు నివాళులర్పించారు. కొందరు మాట్లాడుతూ పని ఒత్తిడితో పాటు గ్రేడ్–2 తహసీల్దార్ జయలక్ష్మమ్మ వేధింపులే లతా మరణానికి కారణమని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. లత భర్త మోహన్ మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని, రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పని ఒత్తిడి ఉంటుందని తన భార్య చెప్పినట్లు తెలిపారు. మధుగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు
సాక్షి, ఏలూరు: ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ జయరాజ్ కొంత కాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తోటి మహిళా ఉద్యోగిణి దిశా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. జయరాజ్ ను.. ఎన్నిసార్లు మందలించిన వినడంలేదని, వేధింపులు భరించలేకపోయాయని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి -
Panchayat Secretary: ఉద్యోగమా.. చాకిరా?
ఆమె ఓ పంచాయతీ కార్యదర్శి. ఇద్దరు పిల్లల తల్లి. చీకటిలోనే పనులు ముగించు కున్నారు. ఈలోపు భారీ వర్షం. అయినా.. తడుస్తూనే విధులకు వెళ్లారు. కార్యాలయానికి చేరుకొని ఫొటో తీసుకుని యాప్‌లో అప్లోడ్ చేశారు. ఇదంతా ఎందుకంటే కేవలం అటెండెన్స్ కోసమే. సాక్షి, కరీంనగర్: ఉదయాన్నే 8 గంటలకు విధుల్లో చేరామన్న సందేశం చేరితేనే ఆ రోజు పనిచేసినట్లు లెక్క. పోనీ అంత ఉదయం వెళ్లినా.. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనంతగా పనులు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో తీవ్ర పని ఒత్తిడి మధ్య పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి యాప్ వచ్చాక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాము ఉదయాన్నే అది కూడా ఉదయం 8 గంటల్లోపే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేరుకొని, కార్యాలయం కనిపించేలా సెల్ఫీ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. ఏదైనా కారణం చేత కాస్త లేటైనా.. ఆ రోజు జీతం హుష్‌కాకి. ఇటీవల బుగ్గారంలో ఓ ఎంపీడీవో తన పరిధిలోని తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తాను వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశానికి స్పందించలేదన్న కారణానికే ఆగ్రహించిన అధికారి ఏకంగా 9 మందికి మెమో జారీ చేశారు. ఈ విషయం పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు, జగిత్యాల కలెక్టర్ రవి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ఫీ తీసుకుంటేనే మస్టర్.. ► ఉదయాన్నే ఎనిమిది గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలి. అక్కడ జీపీ లైవ్ లొకేషన్‌తోపాటు, లాంగిట్యుడ్, లాటిట్యూడ్ వివరాలు, పంచాయతీ భవనం కనిపించేలా సెల్ఫీ దిగి పల్లె ప్రగతి పీఎస్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ► పల్లెప్రగతి పీఎస్ యాప్.. ఎంపీవో (మండల పంచాయతీ ఆఫీసర్) అనే రెండు రకాల లాగిన్లు పంచాయతీ కార్యదర్శులకు ఉంటాయి. ప్రతీ పంచాయతీ కార్యదర్శి విధిగా రోజూ రెండు కాలువలు, రెండు రోడ్లు, ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థల భవనాలను క్లీన్ చేయించాలి. ► ఈ ఐదు పనులకు సంబంధించి ఐదు ఫొటోలు విత్ డేట్ అండ్ టైం ప్రకారం.. అప్లోడ్ చేస్తేనే ఆ రోజు పనిచేసిట్లు లెక్క. ఈ విధంగా నెలలో మొత్తం 24 పనిదినాలు ఇదే రకంగా విధులు నిర్వహించాలి. పాత ఫొటోలు అప్లోడ్ కావు. ► దీనికితోడు వీధి బల్బులు మార్చడం, ఇళ్ల నుంచి చెత్త సేకరణ వివరాలు కూడా రోజూ రిపోర్టు అప్లోడ్ చేయాలి. ► ఏ ఉద్యోగికైనా ఇంట్లో కనీస బాధ్యతలు ఉంటాయి. పిల్లలను స్కూలుకు పంపడం, మహిళలైతే ఇంట్లో వంట, పిల్లలు తదితర పనులు ఉంటాయి. కానీ.. కొత్త నిబంధన కారణంగా ఉదయాన్నే 7 గంటలకు బయల్దేరాలి. పిల్లలు నిద్రలేవక ముందే వదిలేసి రావడం చాలా బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► పోనీ, 5 గంటలకు ఉద్యోగం ముగుస్తుందా.. అంటే అదీ లేదు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫనెన్స్లు జరిగితే గంటల కొద్దీ సమయంపాటు అక్కడే ఉండాలి. అవి పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరాలి. మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవ్వాలి. ► పంచాయతీ కార్యదర్శులపై మండలస్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డివిజనల్ స్థాయిలో డీఎల్పీవో, ఏపీడీ, పీడీ జిల్లాస్థాయిలో ఏపీవో, డీపీవో వరకు ఇంతమంది సూపర్విజన్ ఉంటుంది. వీరందరూ ఏం పనిచెప్పినా ఎదురుచెప్పకుండా చేయాల్సిందే. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. జనన మరణ రికార్డులు, ఇంటి పన్నులవసూళ్లు, రెవెన్యూ రికార్డుల నమోదు, పరిపాలనపరమైన విధులన్నీ వీరే నిర్వహించాలి. ► పొరపాటున ఎదురుతిరిగినా, చేయలేమని చెప్పినా, టైమ్‌కు విధులకు రాలేకపోయినా మెమోలు జారీ చేస్తూ మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ► హరితహారం మొక్కలు పెరగకపోయినా, ఊర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా, చిన్న చెత్త కనిపించినా వెంటనే మెమో జారీ చేస్తారు. ► ఇవి చాలవన్నట్లుగా గ్రామంలో సర్పించి, వార్డుమెంబర్లు, ప్రతిపక్ష నాయకులు, ఊర్లో ఉన్న పెద్దమనుషులు అంతా ప్రతీ పనికి వీరి మీదే పడుతున్నారు. ► ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 99 శాతం మంది పీజీలు చదివిన వారే. కరోనాకు ముందు ఈ ఉద్యోగాన్ని చాలామంది మానేద్దామనుకున్నారు. కానీ.. బయట కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో విధిలేక ఈ కొలువులోనే కొనసాగుతున్నారు. చదవండి: 50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి -
అసభ్య సందేశాలు.. బాస్‌ను చితకబాదిన మహిళ
బీజింగ్: ఆడవాళ్లు ఇంటి పట్టునే ఉండాలి.. కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి.. వారికి కావాల్సినవన్ని అమర్చి.. ఆమె జీవితాన్ని కుంటుంబానికే అంకితం చేయాలి. ఉద్యోగాలు చేయడం అంటే పెద్ద నేరం చేసినట్లే. స్త్రీ అంటే నేటికి సమాజంలో చాలా మందికి ఇదే భావం. ఇక ఈ బంధనాలు తెంచుకుని ఉద్యోగాలు చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలు కోకొల్లలు. పనిలో ఏ మాత్రం జాప్యం జరిగినా.. ఆఫీసుకు కాస్త లేటుగా వెళ్లినా.. కొందరు పురుష ఉద్యోగులు ఇంటి పట్టున ఉండక.. వీరికి ఇవన్ని ఎందుకు అంటూ ఎద్దేవా చేస్తారు. ఇక బాస్ "మగానుభావుడైతే" ఆ కష్టాలు ఇంకో రకం. ఆ పెత్తనంతో ఆడవారిని వేధింపులకు గురి చేస్తారు. తమ మాట వినకపోతే.. టార్చర్ పెడతారు. బాస్ అనే కారణం చెప్పి ఫోన్ చేసి.. అసభ్య సందేశాలు చేస్తూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తారు. చాలా మంది ఆడవారు వీటన్నింటిని మౌనంగా భరిస్తారు. కానీ కొందరు మాత్రం ఎదురుతిరుగారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ యువతిని ఆమె బాస్ వేధింపులకు గురి చేస్తాడు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సహనం కోల్పోయిన సదరు ఉద్యోగిణి మాబ్ కర్ర తీసుకువచ్చి.. బాస్‌ను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని సుయిహువా, బీలిన్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలో ఈ సంఘటన జరిగిందని చైనా టైమ్స్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ వీడియోలో ఓ మహిళ తన బాస్ తనను ఎలా హింసించాడో వివరిస్తూ అతడిపై మాబ్ కర్రతో దాడి చేస్తుంది. తనకు అసభ్య సందేశాలు పంపాడని.. వార్నింగ్ ఇచ్చినా ఆగలేదని.. దాంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని అనడం వీడియోలో వినిపిస్తుంది. ఎన్ని చేసినా బాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓపిక నశించిన సదరు యువతి మాబ్ కర్రతో బాస్‌పై దాడి చేస్తుంది. చితకబాదుతుంది. ఇక సదరు బాస్ తన మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని తనను వదిలి వేయాల్సిందిగా బతిమిలాడతాడు. తాను జోక్ చేద్దామని భావించి మెసేజ్ చేశానని తెలుపుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు సదరు ఉద్యోగిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి మహిళ ఇంతే ధైర్యంగాఉండాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి -
వైరల్ వీడియో: బాస్‌ను చితకబాదిన మహిళ
-
చాటింగ్ చేస్తూ... భవనంపై నుంచి పడి..
శంషాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగిని మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని ముదుళీ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (25) శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమర్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె తాను నివసిస్తున్న మూడంతస్తుల భవనం బాల్కనీ పైనుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అయితే, సిమ్రాన్ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ రెండు కూడా ఆన్‌లోనే ఉండటంతో చాటింగ్ చేస్తూ కిందపడిందా..? తానే దూకి ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయన క్లీన్చిట్ పొందారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ స్పష్టం చేసింది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించడం తెల్సిందే. దీంతో జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. 14 రోజుల పాటు విచారణ జరిపిన ఈ కమిటీ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సీజేఐపై మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు లేవని కమిటీ గుర్తించింది’ అని తెలిపారు. కమిటీ నివేదికను ఆదివారమే సమర్పించింది. కోర్టులో సీజేఐ తర్వాత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ బాబ్డేకు నివేదికను అందజేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు. తీవ్ర అన్యాయం జరిగింది.. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడంపై ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నివేదిక తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తాను భయపడుతున్నట్లే జరిగిందని, ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన న్యాయవాదితో చర్చించి తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దానిపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ న్యాయకోవిదుడు సోలి సొరబ్జీ స్వాగతించారు. కమిటీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగానే విచారణ జరిపిందని పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్ ఇవ్వడానికి కమిటీ చాలా తొందరపడిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం ట్వీట్ చేశారు. సీజేఐపై కేసులో పూర్వాపరాలు ► ఏప్రిల్ 19: సీజేఐ వేధించారంటూ 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖలు పంపిన మాజీ ఉద్యోగిని. ► ఏప్రిల్ 22: లైంగిక వేధింపుల బూటకపు కేసులో సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ ఆరోపణ. ► ఏప్రిల్ 23: మాజీ ఉద్యోగిని ఆరోపణలపై విచారణ జరిపేందుకు జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీల అంతర్గత త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటు. జస్టిస్ రమణ ఆ కమిటీలో ఉండటం, ఒక్కరే మహిళా జడ్జి ఉండటంపై మాజీ ఉద్యోగిని అభ్యంతరం. ఏప్రిల్ 25న విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ. దీంతో కమిటీలోకి మరో మహిళా జడ్జి జస్టిస్ ఇందూ ► ఏప్రిల్25: సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోం దన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ సభ్యుడిగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. లైంగిక వేధింపులపై విచారణ కాకుండా, కుట్ర కోణంపై జస్టిస్ పట్నాయక్ విచారణ జరుపుతారని వెల్లడి. ► ఏప్రిల్ 26: త్రిసభ్య కమిటీ ఎదుట రహస్య విచారణకు తొలిసారి హాజరైన మాజీ ఉద్యోగిని. మొత్తంగా మూడుసార్లు విచారణకు హాజరు. అనంతరం ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ విచారణ నుంచి నిష్క్రమణ. n మే 6: సీజేఐపై ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పిన అంతర్గత త్రిసభ్య కమిటీ. -
వేధింపులపై విచారణకు హాజరైన సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ బుధవారం సీజేఐని కూడా విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల త్రిసభ్య కమిటీ ఎదుట సీజేఐ విచారణకు హాజరయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడిగా ఓ సీజేఐ విచారణ కమిటీ ముందు హాజరవ్వడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలోనే ఈ కమిటీ సీజేఐని కోరింది. దీంతో ఆయన విచారణకు వచ్చిన తన వంతుగా సహకరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన మహిళ, సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, ఫిర్యాదు చేసిన మహిళ మూడు రోజులపాటు విచారణకు హాజరైన అనంతరం, ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదంటూ వెళ్లిపోవడం తెలిసిందే. కమిటీ విచారణ వాతావరణం తనకు భయాన్ని కలిగిస్తోందనీ, తన లాయర్‌ను కూడా తనతోపాటు ఉండనివ్వటం లేదనీ, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె విచారణ నుంచి మంగళవారం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. విచారణను ఆడియో లేదా వీడియో రికార్డింగ్ కూడా చేయటం లేదనీ, ఏప్రిల్ 26, 29 తేదీల్లో ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను కూడా తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. విచారణ ఎలా జరుగుతుందీ, ఏయే విధానాలను అనుసరిస్తారు అనే దానిని కూడా తనకు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆమె లేకపోయినా విచారణ కొనసాగుతుందని చెప్పినా ఆమె విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో సీజేఐని త్రిసభ్య కమిటీ బుధవారం విచారించింది. -
సీజేఐ వేధింపుల కేసుపై విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో విచారణను ముగ్గురు జడ్జీల అంతర్గత కమిటీ శుక్రవారం ప్రారంభించింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల కమిటీ ఎదుట ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని విచారణకు హాజరయ్యారు. జస్టిస్ బాబ్డే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. మాజీ ఉద్యోగినితోపాటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కమిటీ విచారణకు వచ్చారు. అయితే విచారణ సమయంలో జడ్జీల ముందు మహిళ మాత్రమే ఉన్నారు. ఇది సాధారణ న్యాయ విచారణ కానందున న్యాయవాదులను విచారణ సమయంలో మహిళతోపాటు ఉండేందుకు అనుమతించబోమని జస్టిస్ బాబ్డే ఇంతకుముందే స్పష్టం చేయడం గమనార్హం. ఈ విచారణను ముగించేందుకు నిర్దిష్ట గడువు కూడా ఏదీ లేదని జస్టిస్ బాబ్డే గతంలోనే చెప్పారు. ఈ విచారణలో వెలుగుచూసే అంశాలను కూడా రహస్యంగానే ఉంచనున్నారు. ఆరోపణలు చేసిన మహిళ గతంలో సీజేఐ ఇంట్లోని కార్యాలయంలో పనిచేసేది. గతేడాది అక్టోబర్‌లో సీజేఐ తనను లైంగికంగా వేధించారనీ, ఖండించినందుకు తనను ఉద్యోగంలోనుంచి తీసేయడంతోపాటు హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తన భర్త, మరిదిలను సస్పెండ్ చేయించారని ఆరోపిస్తూ 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆమె లేఖలు పంపారు. -
రైలు నుంచి మహిళా టీటీఐ తోసివేత
కాజీపేట రూరల్ : పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో నుంచి మహిళా ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ (టీటీఐ)ని ప్రయాణికులు కోచ్‌లో నుంచి బయటికి తోసేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జంక్షన్లో జరిగింది. కాజీపేట జంక్షన్ రైల్వే కమర్షియల్ విభాగంలో టీటీఐగా పనిచేస్తున్న నీలిమ సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌క్లాస్–1 బోగిలోకి వెళ్లి టికెట్ తనిఖీ చేస్తుండగా.. కొందరు ప్రయాణికులు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్‌క్లాస్ కోచ్‌లోకి రావడంతో పరిశీలించి జరిమానా చెల్లించాలని చెప్పింది. అప్పటికే కోచ్ రద్దీగా ఉంది. టీటీఐ మాట వినిపించుకోకుండా వారు బయటికి తోసి వేయడంతో నీలిమ ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్ బోగి ప్రయాణికులు గమనించి బయటికి తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో ఆగింది. -
బ్యాంక్ దళిత అధికారిణిపై టీడీపీ నేత వీరంగం
నెల్లూరు: అధికార పార్టీ మదంతో కావలికి చెందిన ఓ టీడీపీ నేత కో ఆపరేటివ్ బ్యాంక్‌లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ స్థాయి దళిత అధికారిణిపై వీరంగం చేశాడు. మహిళ అనే విచక్షణ మరిచి పత్రికల్లో రాయలేని బూతు పురాణంతో దూషించాడు. ఈ ఘటన పట్టణంలోని జనతాపేటలో ‘నెల్లూరు జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్’ శాఖలో శుక్రవారం జరి గింది. సహచర ఉద్యోగుల సమక్షంలో సదరు నేత చేసిన వీరంగానికి అవమానం భారంతో కుంగిపోయిన ఆమె విలపిస్తూ కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీద మస్తాన్‌రావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితుడైన టీడీపీనేత అల్లంపాటి పార్థసారథిరెడ్డి అత్యంత సన్నిహితుడు. పార్థసారథిరెడ్డి శుక్రవారం తన వ్యక్తిగత ఖాతాలో రూ.58 వేల నగదు జమ చేసి, డీడీ ఇవ్వాలని సిబ్బందిని అడిగాడు. క్యాషియర్ పాన్‌కార్డు ఇవ్వమని అడిగారు. తాను మళ్లీ ఇస్తానని చెప్పడంతో, క్యాషి యర్ నిబంధనలు అంగీకరిచవన్నారు. ఆయన క్యాషియతో వాగ్వాదానికి దిగడంతో పక్కనే ఉన్న అసిస్టెంట్ మేనేజర్ దృష్టి తీసుకెళ్లారు. పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆమె చెప్పడంతో, పార్థసారథిరెడ్డి రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. విచక్షణ కోల్పోయి మహిళా అధి కారిణి అని కూడా పత్రికలో రాయడానికి వీలు కాని భాషలో ఆమెను దూషించాడు. బ్యాంక్‌లో టేబుల్‌పై పైళ్లలోని కాగితాలు గాలికి ఎగరకుం డా చేసేందుకు ఉపయోగించే బలంగా ఉండే పొడవాటి కర్రను తీసుకుని ఆమెపై దాడి చేయబోయాడు. కాగితాలను గుదిగుచ్చి పెట్టే స్టాండ్ ను ఆమెపైకి విసిరాడు. బ్యాంక్‌లో వీరంగం చేస్తున్న పార్థసారథిరెడ్డిని అడ్డుకోబోయిన ఇతర సిబ్బందిని తోసేశాడు. తాను ఎవర్నో తెలుసా అంటూ హెచ్చరిం చాడు. బ్యాంక్‌లో విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ స్థాయి దళిత అధికారిణితో జుగుప్సాకరంగా ప్రవర్తించి హెచ్చరించడంతో బ్యాంక్‌లో పనిచేసే వారు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితురాలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ జీఎల్ శ్రీనివాసరావు ధృవీకరించారు. రంగంలోకి టీడీపీ నాయకులు ఇది ఇలా ఉండగా అధికార టీడీపీలో పెత్తనం చేస్తున్న బీద సోదరులకు సన్నిహితుడైన అల్లంపాటి పార్థసారథిరెడ్డిని ఈ వీరంగం కేసు నుంచి తప్పించడానికి టీడీపీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. కనీసం కేసును అవకాశం ఉన్నంత వరకు నీరు గార్చి చాలా స్వల్ప కేసుగా చేయాలని పోలీసులపై వత్తిళ్లు మొదలు పెట్టారు. పోలీసులు బ్యాంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో ఫుటేజీని పరిశీలించి, టీడీపీ నేత అల్లంపాటి పార్థసారథిరెడ్డి వీరంగంపై విస్తుపోయారు. -
నన్నే టోల్ ఫీజు అడుగుతావా?!
సాక్షి, గుర్గావ్ : టోల్ ఫీజ్ చెల్లించమన్నందుకు ఒక మహిళా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘుటన గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద.. గురువారం ఉదయం11 గంటల ప్రాంతంలో జరిగింది. గురువారం ఉదయం గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదున్న ఖేర్కి దులా టోల్ ప్లాజా దగ్గరకు ఒక వాహనం వచ్చింది. ఎప్పటిలానే టోల్ ప్లాజాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిన టోల్ మొత్తాన్ని చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి నేను స్థానికుడను.. నాకు టోల్ ఉండదంటూ ఆగ్రహంగా ఉద్యోగినిపై చేయిచేసుకున్నాడు. అంతేకాక రాయడానికి వీలు లేని విధంగా టోల్ ప్లాజా ఉద్యోగులపై తిట్ల వర్షం కురిపించాడు. టోల్ ఉద్యోగులంతా అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన సదరు వ్యక్తి అక్కడనుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది కారుకు బారీకేడ్లు అడ్డుపెట్టి పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. టోల్ ఫీజు అడిగినందుకు నన్ను కొట్టడంతో పాటు.. చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. #WATCH: Man argues & attempts to beat a female toll plaza employee in #Gurugram pic.twitter.com/QlhYun3x3i — ANI (@ANI) December 7, 2017 -
అలజడి; అసెంబ్లీలోనికి దూసుకెళ్లిన మహిళ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో కలకలం చెలరేగింది. శాసన మండలి జరుగుతుండగా, ఓ మహిళ.. చైర్మన్ పోడియంవైపు దూసుకురావడంతో సభ ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్రమత్తమైన మార్షల్స్.. ఆమెను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. నిమిషాల తర్వాతగానీ అతికష్టం మీద ఆమెను బయటికి ఈడ్చిపారేశారు. సదరు మహిళ అసెంబ్లీలో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగిని కావడంతో ఆమె చర్యపై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మంగళవారం శాసన మండలి కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది సేపటికే, కాంట్రాక్టు పద్ధతిపై అసెంబ్లీలో క్లాస్-4 ఉద్యోగినిగా పనిచేస్తోన్న మహిళ.. సభలోకి పరుగున వచ్చి, చైర్మన్ పోడియం ముందు నిలబడింది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, అందుకే ఈ విధంగా నిరసన తెలిపానని అరెస్ట్ అనంతరం ఆమె మీడియాకు చెప్పారు. కాగా, ఉద్యోగిన చర్య.. శాసన సభలో భద్రతాలేమిని తేటతెల్లం చేసిందని అధికార బీజేపీ పక్షనేత, యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ అన్నారు. అసెంబ్లీలో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే, నిరసన తెలిపేందుకు సభలోనికి రావడం మహిళా ఉద్యోగిన చేసిన తప్పే అయినప్పటికీ, ఆమె పట్ల మార్షల్స్ ప్రవర్తించిన తీరు మాత్రం సహేతుకంగా లేదని విపక్షాలకు చెందిన మహిళా ఎమ్మెల్సీలు అన్నారు. సర్దిచెప్పి పంపేయాల్సిదిపోయి, మహిళను ఈడ్చుకెళ్లడం సరైందికాదని ఆక్షేపించారు. కాగా, సదరు మహిళా ఉద్యోగినిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సిఉంది. -
మహిళా ఉద్యోగికి వయాగ్రా మాత్ర ఇచ్చాడు
బెంగళూరు: తలనొప్పికి వయాగ్రా మాత్ర ఇచ్చిన బాస్ పై ఓ మహిళా ఉద్యోగి(22) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. తనకు తలనొప్పిగా ఉందని, మాత్రలు కొనుక్కునేందుకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మహిళా ఉద్యోగికి బాస్ వయాగ్రా మాత్ర ఇచ్చాడు. దీంతో అవాక్కయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. జలహళ్లిలోని ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలో ఏడాది కాలం నుంచి ఇంచారా(పేరు మార్చాం) డేటా ప్రాసెసర్ గా పనిచేస్తోంది. మేనేజర్ మల్లప్ప(38) గత మూడు నాలుగు నెలల నుంచి ఆమెను వేధిస్తున్నాడు. ఆఫీసులో ఎవరూ లేనప్పుడు తన చున్నీ లాగడం, అసభ్యంగా తాకడం వంటి పనులు చేస్తున్నాడని పీన్యా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. తన తండ్రి మరణించిన నాటి నుంచి పెళ్లి చేసుకుంటానని వెంట బడుతున్నాడని తెలిపింది. అతడి వేధింపుల గురించి చెప్పినా ఎవరూ నమ్మరని, తన ఉద్యోగం కూడా పోతుందన్న భయంతో ఇన్నాళ్లు కేసు పెట్టలేదని చెప్పింది. పైచదువులకు ఆర్థిక సహాయం చేస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తామని పలుమార్లు మలప్ప ఆఫర్ చేసినా తిరస్కరించానని బాధితురాలు వెల్లడించింది. -
మహిళా ఉద్యోగిపై వేధింపులు.. రైల్వే ఎస్పీపై కేసు
సికింద్రాబాద్: ఓ మహిళా ఉద్యోగికి ఉన్నతాధికారి నుంచి లైంగిక వేధింపులు తప్పడం లేదు. దీంతో తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశించడంతో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సెక్షన్ 354, 506, ఆర్/డబ్ల్యూ 34 కింద వేధింపులకు పాల్పడ్డ రైల్వే ఎస్పీపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. -
మహిళ ఉద్యోగిపై కానిస్టేబుళ్ల వీరంగం
ఆర్టీసీ బస్సులో మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించి వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. దేవరపల్లి గ్రామానికి చెందిన గారపాటి అనిత పద్మకుమారి గోపాలపురం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు విజయవాడలో చదువుకుంటున్నాడు. ఆదివారం విజయవాడ వెళ్లిన ఆమె కుమారుడిని చూసి సాయంత్రం తిరిగి ఆర్టీసీ బస్సులో దేవరపల్లి బయల్దేరింది. అదే బస్సులో ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద ఏలూరు పోలీసు హెడ్ క్వాటర్స్‌లో ఉంటున్న ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు పోలి ప్రభుదాస్, కంకిపాటి రాజు, పంపన సూరిబాబులు విశాఖపట్నం నుంచి ఖైదీలను తీసుకు వచ్చేందుకు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ప్రభుదాస్ పద్మకుమారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమె బ్యాగ్‌ను తనిఖీ చేయాలంటూ పట్టుబట్టడంతో భయపడిన పద్మకుమారి పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపాలంటూ డ్రైవర్‌కు చెప్పింది. పోలీస్ స్టేషన్ వద్ద ఎందుకు బస్సు ఆపమన్నావంటూ ప్రభుదాస్ పద్మకుమారి తలకు తన వద్ద ఉన్న గన్ను ఎక్కు పెట్టడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురై మౌనం వహించారు. మిగిలిన కానిస్టేబుళ్లు కూడా ప్రభుదాస్‌కు వత్తాసు పలికారని అనంతపల్లి పోలీసులకు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు ఆమె పేర్కొన్నారు. సోమవారం అనంతపల్లి పోలీస్ స్టేషన్‌కు కానిస్టేబుళ్లను తీసుకురాగా, అక్కడకు వచ్చిన పద్మకుమారి కానిస్టేబుళ్లను నిలదీసి ఓ మహిళా ఉద్యోగిపై దాడికి దిగడం ఏమిటని నిలదీయడంతో వారు క్షమాపణ కోరారు. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే కేసు నమోదు చేయాలని బాధితురాలు కోరగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో స్పందించిన పొలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
టీసీఎస్ ఉద్యోగిని హత్య?
వారం రోజుల క్రితం అదృశ్యమైన టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) ఉద్యోగిని ఒకరు హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉమా మహేశ్వరి అనే ఈ మహిళ హత్యకు గురైందనే వారు భావిస్తున్నారు. ఆమె శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో కూడా వెల్లడైందని ఓ అధికారి తెలిపారు. ఉమా మహేశ్వరి (24) ఈనెల 13వ తేదీ (వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు) ఆఫీసు నుంచి సాయంత్రం వెళ్లిన తర్వాతి నుంచి కనపడకుండా పోయింది. శనివారం నాడు ఓ పొద సమీపంలో ఆమె మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె గత ఏడాది నుంచి టీసీఎస్‌లోని అకౌంట్స్ విభాగంలో పనిచేస్తోందని, సహోద్యోగులంతా ఆమెను మెచ్చుకుంటారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
ఉద్యోగిని ఆచూకీ లభ్యం
అదృశ్యమైన ప్రైవేటు ఉద్యోగిని ఆచూకీ లభ్యమైంది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవే టు సంస్థలో పనిచేస్తున్న శ్రీలత(26) అనే ఉద్యోగిని శుక్రవారం అదృశ్యమవడం విదితమే. దీనిపై శనివారం ఫిర్యాదు అందగా.. 24 గంటల వ్యవధిలో ఆమె ఆచూకీని పేట్‌బషీరాబాద్ పోలీసులు కనుగొన్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి విశాఖపట్నం-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నట్టు గుర్తించారు. దీంతో ఆదివారం ముంబై సమీపంలోని కుర్లా స్టేషన్ వద్ద ఆమెను రైల్వే పోలీసుల సాయంతో రెస్క్యూ చేశారు. ఆమెతో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం శ్రీలత ను హైదరాబాద్ తీసుకువస్తోంది. శ్రీలత ఆచూకీ కనుగొన్నామని, సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపా రు. శ్రీలత ఐటీ ఉద్యోగిని కాదు. ‘మాస్క్ హెయిర్ రీప్లేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్’ సంస్థలో పనిచేస్తున్నారు. ఘటన పూర్వాపరాలివీ..: నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీలత(26) తన కుటుంబంతో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని సూర్యానగర్ కాలనీలో ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. రోజూ స్కూటీపై రాకపోకలు సాగించే శ్రీలత శుక్రవారం ఉదయం ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికిరాలేదు. అదేరోజు రాత్రి భర్త ఆమె సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా.. స్విచ్ఆఫ్ అయి ఉంది. శ్రీలత వినియోగించే వాహనం మేడ్చల్ పోలీసులకు ఈఎంఆర్ఐ వద్ద లభించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. తన భార్య అదృశ్యమైందంటూ శనివారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు మేడ్చల్, పేట్‌బషీరాబాద్, దుండిగల్ పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన ఉదంతాలను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) అధికారులు కూడా దర్యాప్తులో పాలుపంచుకుని గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం శ్రీలత ఆచూకీ కనుగొనగలిగారు. -
సెక్రటేరియట్లో నీలిచిత్రాల కలకలం
రాష్ట్ర సచివాలయం సకల అక్రమాలకు నిలయంగా మారుతోంది. తాజాగా శనివారం నాడు అక్కడ ఏకంగా నీలిచిత్రాల వ్యవహారం కలకలం రేపింది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి నీలిచిత్రాలు చూస్తున్న విషయాన్ని సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని సచివాలయ ప్రధాన భద్రతాధికారి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు సీఎస్‌వో పేర్కొన్నారు.