సికింద్రాబాద్: ఓ మహిళా ఉద్యోగికి ఉన్నతాధికారి నుంచి లైంగిక వేధింపులు తప్పడం లేదు. దీంతో తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశించడంతో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సెక్షన్ 354, 506, ఆర్/డబ్ల్యూ 34 కింద వేధింపులకు పాల్పడ్డ రైల్వే ఎస్పీపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.