ప్రేయర్‌ కోసం వస్తే.. చితక్కొట్టాడు..! | Christian Preacher Frauds Public In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేయర్‌ కోసం వస్తే.. చితక్కొట్టాడు..!

Published Fri, May 31 2019 4:24 PM | Last Updated on Fri, May 31 2019 4:39 PM

Christian Preacher Frauds Public In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : రోగాలు నయం చేస్తానని.. దయ్యాలు వదిలిస్తానని మాయమాటలు చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నఓ క్రిస్టియన్‌ మత బోధకుడు కటకటాల పాలయ్యాడు. దైవ ప్రార్థనల కోసం వచ్చిన వారిపై మత్తుమందు ప్రయోగించి శారీరకంగా హింసించిన శాంసన్‌ అనే క్రిస్టియన్‌ మత బోధకున్ని మారేడ్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి సికింద్రాబాద్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. వివరాలు.. విజయ్‌కుమార్‌ అనే ప్రభుత్వోద్యోగి గత ఆరునెలలుగా శాంసన్‌ దగ్గర ప్రేయర్‌ చేయించుకుంటున్నాడు. అక్కడికి వెళ్లగానే విజయ్‌కుమార్‌ నోట్లో శాంసన్‌ మత్తు కలిగిన స్ర్పే కొట్టేవాడు. విజయ్‌కుమార్‌ స్పృహ తప్పిన అనంతరం మొహం, చెంపలు, వీపుపై కొట్టేవాడు. ఇలా గత కొంతకాలంగా జరుగుతోంది. ఉన్న సమస్యలు తొలగకపోగా.. కొత్తగా శారీరక సమస్యలు కూడా మొదలవవ్వడంతో విజయ్‌కుమార్‌కు అనుమానం వచ్చింది.

ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, కోర్టు ఆవరణలో శాంసన్‌ వెకిలిగా ప్రవర్తించాడు. అక్కడకు వచ్చిన మహిళలు, యువతుల ఫొటోలు తీశాడు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అతనిపై మరో కేసు కూడా నమోదైంది. రోగాలు నయం చేస్తానని చెప్పి శాంసన్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. లైంగికంగా లోబర్చుకున్నాడని పలువురు మహిళలు, యువతులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారంకోసం వస్తే.. ఇల్లుకు వాస్తు సరిగా లేదని, దానిని అమ్మేసి డబ్బులు ఇవ్వాలని శాంసన్‌ ఒత్తిడి తేచ్చాడని బాధితులు ఆరోపించారు. నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మోసగాళ్లబారిన పడకుండా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement