Christian
-
వెలుగు ప్రదాత: జాన్ క్రిస్టియన్ ఫ్రెడెరిక్ హయ్యర్
ఆడపిల్లలకు చదువెందుకని ప్రశ్నించే రోజుల్లో పట్టుబట్టి బాలికలకు చదువు చెప్పడానికి విద్యాలయాలు స్థాపించిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ (1793–1873). ముఖ్యంగా తెలుగునేలపై వెలుగు నింపిన మానవతామూర్తి ఆయన. జర్మనీలోని హెల్మెస్టడ్ ప్రాంతంలో 1793 జూలై 10న జన్మించిన ఈయన అమెరికా వెళ్లి ఫిలడెల్ఫియాలో వేదాంత శాస్త్రం, యూని వర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్య విద్యలో ఎండీ పట్టా పొందాడు. మెడిసిన్ చదివే రోజుల్లోనే సంస్కృతం నేర్చుకున్నాడు. మిషనరీగా అభిషేకం పొంది దాదాపు 300 పైగా సండే స్కూల్స్ నెలకొ ల్పాడు. హయ్యర్ చురుకుదనాన్ని గమనించిన మెకానిక్స్ బర్గ్‌కు చెందిన ‘ది సెంట్రల్ మిషనరీ సొసైటీ’ వారు భారతదేశానికి మిషనరీగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా హయ్యర్ 1842 జూలై 31న గుంటూరు వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకుని తొలి పాఠశా లను 1842 నవంబరులో ప్రారంభించాడు. అదీ కేవలం బాలికలకు మాత్రమే. నెల గడిచేసరికి ఎని మిది మంది ముస్లిం బాలికలకు పాఠశాల ప్రవేశం కల్పించాడు. అనంతరం అన్ని వర్గాల వారికి ఏడు పాఠశాలలు నెలకొల్పి బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 1844 నాటికి మరో ఎనిమిది పాఠశాలలు ప్రారంభించారు.ఆ కాలంలో ప్రసూతి సమయంలో సరైన వైద్యం లభించక తల్లీ–పిల్లలు మరణించేవాళ్లే ఎక్కువ. అందుకే గుంటూరు కొత్తపేటలో 1843లో ఉచిత వైద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశాడు. 1845 నాటికి రాజమండ్రి, భీమవరంలో పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శాలలు ప్రారంభించాడు. హయ్యర్ ఒక ఆదర్శమూర్తిగా దర్శనమిస్తాడు. జీవిత భాగస్వామి ఎంపికలో ఇద్దరు పిల్లలున్న మేరీగాష్ అనే వితంతువును వివాహం చేసుకుని కొత్త జీవితం కల్పించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగులోనూ కీర్తనలు రాశాడని అంటారు. తెలుగు వారికి సేవచేసి విద్య, వైద్యంతో ప్రజల గుండెల్లో నిలిచిన హయ్యర్ 1873లో 80 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో మరణించాడు.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి -
FACT CHECK: హే జీసస్.. రోత రాతల పాపాలను క్షమించుడి!
సాక్షి, అమరావతి: రామోజీ పచ్చ పైత్యం రోజు రోజుకీ పరాకాష్టకు చేరుతోంది. క్రైస్తవుల సంక్షేమంపై జగన్ వివక్ష అంటూ విషం చిమ్మే నీచానికి రామోజీ దిగజారిపోయారు. రాయితీలపై అడ్డగోలుగా కోత అంటూ మడత వ్యాఖ్యలు చేస్తూ ఈనాడులో అబద్ధాలు అచ్చేయడాన్ని ‘హే జీసస్.. రామోజీ రోత రాతలు చూడు ప్రభు’ అని క్రైస్తవ సమాజం వ్యాఖ్యానిస్తోంది. పాపపు రాతల తీరును క్షమించమని ప్రార్థిస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్లపాలనలో క్రైస్తవులకు అరకొర రాయితీలు, పథకాలతో సరిపెట్టినా పచ్చ కళ్లకు అంతా సవ్యంగా కన్పించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా తోడ్పాటు అందిస్తుంటే రామోజీకి మింగుడు పడటంలేదు. ఆరోపణ: టీడీపీ హయాంలో స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం, చర్చిలకు వెన్నుదన్ను. వాస్తవం: స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ అంటూ కేవలం రెండు కార్యక్రమాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో క్రిస్టియన్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ రెండు కార్యక్రమాలే ఏదో గొప్పగా చేసేసినట్టు ఈనాడు పచ్చ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆరోపణ: వైఎస్సార్సీపీ పాలనలో క్రైస్తవులకు కుచ్చుటోపీ, యువతకు శిక్షణ లేదు, వెన్ను విరిచారు. వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్(మైనారిటీ) ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. సుమారు 6.82 లక్షల క్రైస్తవ మైనారిటీల సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ వాహన మిత్ర, లా నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వంటి ఎన్నో కొత్త కార్యక్రమాలు వారి ఉన్నతికి దోహదం చేశాయి. కరోనా లాక్డౌన్ సమయంలో పాస్టర్లకు వన్–టైమ్ ప్రత్యేక ఆర్థిక సహాయం, జెరూసలేంకు తీర్థయాత్ర, చర్చిల ద్వారా, చర్చి నడిపే సంస్థలకు సహాయం అందించడం వంటి ప్రత్యేక తోడ్పాటుతో క్రిస్టియన్ మైనార్టీల్లో ఆత్మస్థైర్యం నింపింది. ఆరోపణ: ఆర్థిక సాయమూ అంతంతే వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.29 కోట్లు, శిక్షణ కోసం రూ.3.55 కోట్లు ఖర్చు చేస్తే అదే గొప్ప అంటూ ఈనాడు డబ్బాలు కొట్టింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మార్చి వరకు క్రిస్టియన్ మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా ఏకంగా రూ.416.58కోట్లు అందించింది. దీనిలో ఒక్క చేయూత పథకం(స్వయం ఉపాధి) ద్వారా 27,150 మందికి రూ.50.90కోట్లు అందించింది. దీంతోపాటు 90శాతం సబ్సీడీపై 90 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(నిత్యావసర సరుకుల సరఫరా వాహనాలు) రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: అప్పుడలా ఇప్పుడిలా అంటూ తప్పుడు లెక్కలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వం(2014–19)లో చర్చిలకు సాయం, రాయితీలపై రుణాలు, నైపుణ్య శిక్షణ వంటివి అరకొరగా జరిగితే గొప్పగా జరిగినట్టు ఈనాడు మసిపూసి మారేడు కాయ చేసింది. వైఎస్సార్సీపీ 2019–24 మధ్య క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించిన ఆర్థిక తోడ్పాటును ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించింది. ► పాస్టర్లకు గౌరవ వేతనం కింద కోవిడ్ లాక్డౌన్ సమయంలో రూ.5వేలు చొప్పున వన్–టైమ్ గ్రాంట్‌గా 29,841 మందికి రూ.1490లక్షలు అందించింది. దీంతోపాటు నెలకు రూ.5వేలు చొప్పున 8427 మంది పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.7109.9లక్షలు అందించింది. ► ఇవి కాక లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు చొప్పున 2020–21లో రూ.30 లక్షలు, 2021–22లో రూ.50 లక్షలు కేటాయించింది. ► కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.5 లక్షలు చొప్పున, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 నుంచి 5 లక్షలు చొప్పున నిధులు ఇచ్చింది. ఇప్పటివరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు అందించింది. ► జెరూసలేం, ఇతర బైబిల్ ప్రదేశాలకు తీర్థ యాత్ర పథకం కింద, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి లబ్ధిదారునికి రూ.60వేలు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు కేటాయించింది. -
క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టింది తెలుగు తమ్ముళ్లే బాబూ!
కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను కొల్లగొట్టింది, అమ్ముకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తమతో గుంటూరు, విజయవాడ వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన క్రైస్తవ ఆస్తుల వివరాలు ఇస్తామని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. శుక్రవారం కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత సీఎం జగన్‌దని చెప్పారు. అమరావతిలో దళితుల అసైన్మెంట్ భూములను చంద్రబాబు భయపెట్టి బలవంతంగా గుంజుకున్నాడన్నారు. రేపల్లెలో 400 దళిత కుటుంబాలను వెలివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చివరికి దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి అవమానించిన వ్యక్తి ఆయన కాదా... అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు యాట ఓబులేసు, సత్తిరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందన్న ప్రతినిధులు.. పారదర్శకంగా, వివక్ష లేకుండా వారికి పథకాలు అందుతున్నాయని కొనియాడారు. పాస్టర్లకూ గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలవటంపై క్రైస్తవ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందనీ, బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉందని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, దీనికి తోడుగా నిలవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందని పేర్కొన్నారు. శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేని చోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని సీఎం వివరించారు. చదవండి: ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ -
మైనార్టీలు భయంతో బతుకుతున్నారు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని, ఈ వర్గాలవారు దేశ పౌరులే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. 2017–21 సంవత్సరాల మధ్య మైనార్టీలపై 2,900 దాడులు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డులో నమోదైందని తెలిపారు. విదేశాల నుంచి పేదలు, షెడ్యుల్డు తెగల విద్య, ఆరోగ్యం కోసం క్రైస్తవ మైనార్టీ సంస్థలకు నిధులు అందుతుంటే 6,622 సంస్థలకు మోదీ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసిందన్నారు. 3.30 కోట్ల క్రైస్తవ జనాభా ఉంటే క్రైస్తవ మంత్రి ఒక్కరే ఉన్నారని అన్నారు. దేశంలో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని, సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత 20 నెలల్లో 6.8 శాతం ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా కేసీఆర్‌ను తిడుతున్నారని కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉంటుందని అన్నారని.. అంటే బీఆర్ఎస్తో కలసి పాలిస్తారనేది అర్థం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు. మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో మణిపూర్‌లా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను దూషించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు. -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్రిస్టియన్ డయర్ ఫాల్ ఫ్యాషన్ షో.. తళుక్కుమన్న అందాల భామలు (ఫొటోలు)
-
తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు..
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్ చేశారు. -
ఎల్బీ నగర్ లో ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
-
మూడుపాయల ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం.. భిన్నభాషలు, సంస్కృతులు, ఆచారాలు, మతాలకు నెలవు. మతసామరస్యం, అలయ్, బలయ్, ఆత్మీయతలకు ఆలంబన. అన్ని మతాల సారం ఒక్కటేనని చాటిచెప్పే తాత్విక పునాదులపై వెలసింది. ఆ సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించేవిధంగా ప్రభుత్వం ‘ముక్తిఘాట్’ను నిర్మించింది. దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో మూడు మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఒకేచోట శ్మశానవాటికలు ఏర్పాటు చేసింది. ఎవరి మత సంప్రదాయాల మేరకు వారు అంతిమ సంస్కారాలను నిర్వహించేవిధంగా ముక్తిఘాట్‌లో హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘అంతిమంగా మనమంతా ఒక్కటే’అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేవిధంగా నాగోల్ బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగూడలో రూ.16.25 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంది. అత్యాధునిక, మౌలిక సదుపాయాలను ముక్తిఘాట్‌లో ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో అంతిమ సంస్కారాలను వీక్షించే సదుపాయం కూడా ఉంది. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ముక్తిఘాట్‌ను ప్రారంభించారు. ముక్తిఘాట్‌కు అడుగులు ఇలా.. ►ఫతుల్లాగూడలోని సుమారు ఆరున్నర ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని హెచ్ఎండీఏ ముక్తిఘాట్ కోసం సేకరించింది. ఈ స్థలంలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఒకేచోట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు 2.5 +2+2 చొప్పున మూడు శ్మశానాలను ఏర్పాటు చేసింది. ►ముక్తిఘాట్‌లో కార్యాలయం, ప్రార్థనామందిరాలు, శీతలీకరణగది, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది, అంతిమయాత్రల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియా తదితర సదుపాయాలను కల్పించింది. ►సుమారు 50 కేఎల్డీ (కిలోలీటర్ పర్ డే) సామర్థ్యం కలిగిన మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేప్‌లను అభివృద్ధి చేసింది. హిందూ శ్మశానవాటికలో... ►పర్యావరణహితమైన పద్ధతిలో దహనసంస్కారాలు నిర్వహించేవిధంగా 140 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ప్లాంట్లతో దహనసంస్కారాలు నిర్వహించే దహనవాటికలను ఏర్పాటు చేసింది. ►హిందూ సంప్రదాయం ప్రకారం10వ రోజు చేసే దశదిన కర్మకాండకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ముస్లిం,క్రైస్తవ శ్మశాన వాటికల్లో.. ►శ్మశానాల్లో మూడు భాగాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో సుమారు 550 మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ వీక్షణ సదుపాయం అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రులు తమ ఆత్మీయుల భౌతికదేహాలను చివరిసారి చూసుకొనేందుకు ఆన్లైన్ వీక్షణ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ జరిగే అంత్యక్రియలను ఎక్కడి నుంచైనా చూడవచ్చు. -
సాకర్ వరల్డ్ కప్ లో క్రిస్టియన్ రోనాల్డ్ సరికొత్త రికార్డు
-
పెళ్లికి ముందు.. వధువు హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు: రోస్ వేడుకలో వధువు కుప్పకూలి మరణించింది. ఉడుపి కోళలగిరి హవంజెలో జరిగింది. హవంజెకీ చెందిన జోస్నా లూయిస్ (24)కు గురువారం పెళ్లి జరగాల్సిఉంది. పెళ్లికి ముందు రోజు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటలకు బంధువుల ఇంటిలో రోస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ఆమె స్పృహ తప్పి పడిపోగా స్థానిక ఆస్పత్రికి తరతలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. లో బీపీనే కారణమని బంధువులు తెలిపారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు నెదర్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు సలహాదారులుగా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేన్ క్రిస్టియన్‌ను నెదర్లాండ్ క్రికెట్ నియమించింది. కాగా నెదర్లాండ్స్ ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కేప్ టౌన్‌లోని గ్యారీ కిర్‌స్టన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో మళ్లీ అతడు జట్టుతో సలహారుడిగా జతకట్టనున్నాడు. అదే విధంగా ఆడిలైడ్‌లో నెదార్లాండ్ ట్రైనింగ్ క్యాంప్‌లో జట్టుతో క్రిస్టియన్ కలవనున్నాడు. వీరిద్దరూ నెదర్లాండ్ హెడ్ కోచ్ ర్యాన్ కూక్‌తో కలిసి పనిచేయనున్నారు. "టీ20 ప్రపంచకప్ కోసం మా జట్టు కోచింగ్ స్టాప్‌లో గ్యారీ కిర్‌స్టన్, డాన్ క్రిస్టియన్ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను" అని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ రోలాండ్ లెఫెబ్రే పేర్కొన్నారు. కాగా కిర్‌స్టన్ 2011లో వన్డే వరల్డ్‌కప్ సొంతం చేసుకున్న భారత జట్టు హెడ్ కోచ్‌గా కిర్‌స్టన్ పనిచేశాడు. ఇక నెదర్లాండ్ ఈ మెగా ఈవెంట్లో తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. డచ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్16న యూఏఈతో తలపడనుంది. చదవండి: R Ashwin Vs Ramiz Raja: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ -
కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి
న్యూఢిల్లీ: భారత్ జోడోయాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో క్రైస్తవ మతపెద్ద ఒకరు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చిన ఓ వీడియోపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి బయటపడిందంటూ బీజేపీ మండిపడింది. జార్జి పొన్నయ్య అనే పాస్టర్ శుక్రవారం రాహుల్‌తో మాట్లాడిన వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘యేసు ప్రభువు దేవుడా, కాదా? మీరెలా భావిస్తారు?’ అని రాహుల్ ప్రశ్నించగా, ‘‘యేసు ప్రభువు నిజమైన దేవుడు. మానవుడిగా భూమిపై జీవించారు. ఆయన శక్తి దేవతల్లాంటి వారు కాదు’’ అంటూ పొన్నయ్య బదులిచ్చారు. భారత్ జోడో యాత్ర అసలు రంగు ఈ వీడియోతో బయట పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. నవరాత్రులు ప్రారంభం కానున్న వేళ శక్తి దేవతను ఇలా అవమానించడం దారుణమని మండిపడ్డారు. ‘‘హిందూ దైవాలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో రాముడి ఉనికిని ప్రశ్నించింది. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం రాహుల్ హిందువుగా నటిస్తుంటారు. ఒక వర్గాన్ని బుజ్జగించడానికి మరో మతాన్ని కించపర్చడం ఏమిటి?’’ అని నిలదీశారు. పొన్నయ్య గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యాడని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు. బీజేపీ విమర్శలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం తిప్పికొట్టారు. ‘‘బీజేపీ విద్వేషాల ఫ్యాక్టరీ. తద్వారా పబ్బం గడుపుకోవడమే దాని పని. యాత్రకు స్పందన చూసి ఓర్వలేకపోతోంది’’ అంటూ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయలేరని, కుట్రదారులకు భంగపాటు తప్పదని అన్నారు. కేరళలోకి ప్రవేశం భారత్ జోడో యాత్ర శనివారం తమిళనాడు నుంచి కేరళలో అడుగు పెట్టింది. అంతకుముందు కన్యాకుమారి జిల్లాలో తమిళనాడు తొలి మహిళా బస్ డ్రైవర్, మార్తాండంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులతో రాహుల్ మాట్లాడారు. నారాయణ గురు జయంతి నాడు కేరళలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. -
సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్
భారతదేశంలో సామాన్య మానవుడైన దేవసహాయం లేదా లాజరస్ (1712–1752)ను వాటికన్ 2022 మే 15న ‘పునీత హోదా’(సెయింట్ హుడ్)గా ప్రకటించడం అనేక రకాలుగా చారిత్రాత్మకమైనది. సెయింట్ పీటర్ లేదా మదర్ థెరీసా స్థాయిని కల్పించడంతో ఇది సమానం. పుట్టుక, పెరుగుదల, చావు వరకూ హింసాత్మక జీవితాన్ని గడిపిన అతి సామాన్యుడు సెయింట్‌గా మారడం మానవ మత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం. నీలకంఠ పిళ్లైగా జన్మించిన దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తనచుట్టూ ఉన్న లక్షలాది మంది మగ్గిపోతున్నారని గ్రహించాడు. మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత్‌లోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. హిందూ దేవాలయాల్లో ప్రార్థించినట్లు గానే, స్త్రీ పురుషులు తమకు కానుకలు (క్రైస్తవ సంప్రదాయంలో అద్భుతాలు) ఇవ్వాలని దేవసహాయంను వేడుకునే వారు. ఆయన విగ్రహం మెడలో రంగురంగుల పూలదండలను అలంకరించి పూజలు చేసేవారు. పొట్టలోనే మరణించిన తన గర్భస్థ పిండాన్ని తాను ప్రార్థించిన వెంటనే సజీవమైన పసిపాపగా చేశాడని ఒక మహిళ ఆ మహిమ గురించి పేర్కొనడం దేవసహాయంకు సెయింట్‌హుడ్ ఇవ్వడానికి గల ఆధారాలలో ఒకటయింది. శూద్ర మహిళలపై ఘోరమైన కుల, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధనాలు బిగించిన వ్యవస్థలో దేవసహాయం జన్మించాడు. తల్లి దేవకి అమ్మ. ఈమె కేరళలో నాయర్ అని పిలిచే శూద్ర వ్యవసాయ ఉత్పాదక కులానికి చెందిన వ్యక్తి. హిందూ ఆలయంలో పూజలు నిర్వహించే వాసుదేవన్ నంబూద్రి అనే బ్రాహ్మణ పూజారికి పుట్టిన సంతానమే దేవసహాయం (మతం మారడానికి ముందుపేరు నీలకంఠన్ పిళ్లై). దేవకి అమ్మ, వాసుదేవన్ నంబూద్రి మధ్య ‘సంబంధం’ వారి మధ్య ప్రేమ వ్యవహారం లేదా వారు వివాహం చేసుకున్న కారణంగా ఏర్పడిన సంబంధం కాదు. నంబూద్రికి ఆమె లొంగిపోవడం అనేది నాయర్ మహిళలతో లైంగిక సంబంధాలను నిర్బంధపూరితంగా బ్రాహ్మణులు పెట్టుకునే కులకట్టు బాటులో భాగంగా జరిగింది. ఇలాంటి లైంగిక బంధాన్ని ‘సంబంధం’ అని పిలిచేవారు. ఒక శూద్రుడిగా ఇలాంటి మానవ హింస ద్వారానే బాల్యం నుంచి పెద్ద వయసు వరకూ అనుభవిస్తూ వచ్చాడు దేవసహాయం. బ్రాహ్మణ నిర్దేశకత్వంలోని ఈ సంబంధంలోని హింసాత్మక భాగం ఏమిటంటే, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అనేది తెలుసు కోవలసి ఉంటుంది. పైగా ఈ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు తల్లివద్ద లేక ఆమె పుట్టింట్లో పెరగాలి లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ బయట గడపాలి. చాలామంది నాయర్ కుటుంబాలు ఇలాంటి వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన తమ కుమార్తెల పిల్లలను ఆమోదించి వారికి కొన్ని ఆస్తి హక్కులు కల్పించేవారు. కానీ ‘సంబంధం’లో పుట్టిన పిల్లలు తండ్రి, తల్లితో పాటు ఇతర పిల్లలు ఉన్న కుటుంబాల్లో జీవించవలసి వస్తే అది ఘోరమైన చిత్రహింస లతో కూడిన జీవితాన్ని కలిగిస్తుంది. దీనిలో ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఇలాంటి పిల్లలను దేవుడి బిడ్డల్లాగే చూసేవారు. వీళ్లు దేవుడిచ్చిన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ దానికి ఎదురు తిరగలేక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. హిందూమతంలోని అలాంటి అమానుష జీవితానికి వ్యతి రేకంగా నీలకంఠన్ పిళ్లై తిరగబడి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఆనాటి పూజారి వర్గం, క్షత్రియుల నియంత్రణలో ఉన్న రాజ్యం ఈ మతమార్పిడిని ఘోరాతిఘోరమైన నేరంగా భావించింది. క్రైస్తవు డిగా మారిన తర్వాత, దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తన చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజలు మగ్గిపోతున్నారని గ్రహించాడు. దీంతో దిగువ కులాలతో కలవటం ప్రారంభించాడు. కేరళలో ఇప్పటికీ నాయర్ కులం శూద్ర వ్యవసాయ కులంలో ఉన్నత శ్రేణిలో ఉంటోంది. అదే సమయంలో నాయర్లకు జంధ్యం ధరించే హక్కు లేదు. వీరికి సంçస్కృత గ్రంథాలు చదివే హక్కు లేదు. హిందూ ఆలయాల్లో వీరు పూజారులు కాలేరు. దేవసహాయం అన్ని కులాల ప్రజలతో కలిశాడనీ, అస్పృశ్యులతో కలిసి భోంచేయడం కొనసాగించాడనీ జనం చెప్పుకునేవారు. ఇది జీసస్ స్వయంగా ఇజ్రాయెల్‌లో అన్యజనులు, వ్యభిచారిణిలతో కలిసిన దానితో సమానం అని చెప్పుకోవచ్చు. వికీపీడియాలోని వివ రాల ప్రకారం, రాజ్యంలోని బ్రాహ్మణ పూజారి, భూస్వామ్య ప్రభువులు, రాజకుటుంబ సభ్యులు, నాయర్ కమ్యూనిటీ కలిసి దేవన్ లేదా రామయ్యన్ దలవా వద్ద దేవ సహాయంపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. శూద్రుల చారిత్రక బానిసత్వం, అదనంగా సంబంధం పేరిట స్త్రీ పురుషుల బంధంలో అత్యంత అవమానాలు భరించిన నాయర్ కమ్యూనిటీ కూడా విముక్తి ప్రదాత అయిన దేవసహాయంను చిత్రహింసలు పెట్టి వధించడంలో పూజారులతో, రాజుతో కలిసి పోయారు. శూద్రులలోని ఈ ప్రతిఘాతుక చైతన్యమే భారతదేశాన్ని చిరకాల బానిసల భూమిగా మార్చివేసింది. రెండువేల సంవత్సరాల క్రితం మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత దేశంలోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. ఇప్పటికీ శూద్రులలో ఆధ్యాత్మిక బానిసత్వం కొనసాగుతోంది. క్రిస్టియన్‌గా మారిన తర్వాత దేవసహాయం మహారాజా మార్తాండవర్మ రాజ్యంలో నివసించసాగాడు. క్రిస్టియానిటీని స్వీకరిం చిన నాటికి ఆ రాజ్యంలో మంచి స్థానంలోనే ఉండేవాడు. కానీ 40 ఏళ్ల వయసులో అంటే 1752 సంవత్సరంలో అతడిని చంపేశారు. తమిళ–మలయాళీ ప్రాంతాన్ని చాలా కాలం పరిపాలించిన వర్మలు క్షత్రియులు. జీసస్‌ను శిలువ వేసిన కాలంలో జెరూసలెంలోని ఫరిసీ కౌన్సెల్ నాటి రోమన్ పాలకులపై ఒత్తిడి తెచ్చినట్లే, భారత ఉప ఖండం మొత్తంలో క్షత్రియులు పాలిస్తున్న రాజ్యాలకు బ్రాహ్మణులు న్యాయ శాసనాలు రచించేవారు. మరణ శిక్ష విధిస్తున్న సమయంలో రోమన్ పాలకుడు పొంటియనస్ పిలేట్, జీసస్ పట్ల మరీ కఠినంగా వ్యవహరించాలని అనుకోలేదు. కానీ అప్పటి పూజారి వర్గ మండలి అత్యంత క్రూరంగా వ్యవహరించి జీసస్‌కి శిలువ విధించింది. తలపై ముళ్ల కిరీటం పెట్టారు. గోల్గోతాలోని శిలువ వేసే ప్రాంతం వరకూ ఆయనపై శిలువ మోపి నడిపించారు. బ్రాహ్మణ ఆధిపత్యంనుంచి శూద్రులకు ఏవిధంగానూ విముక్తి లభించని విధంగా ప్రాచీన బ్రాహ్మణ న్యాయ శాస్త్రమైన మను ధర్మ శాస్త్రం శాసనాలు రూపొందిం చింది. అందుకే దేవసహాయం బ్రాహ్మణాధిపత్య హిందూయిజం నుంచి బయటపడినప్పటికీ అతడిని చిత్రహింసలు పెట్టాలని పూజారి వర్గం నిర్ణయించుకుంది. దళితులు, మత్స్యకారులు, వడ్రంగులు, గొర్రెల కాపర్లు, కుమ్మ రులు, ఇనుము, బంగారు నగల పనివారితో కలిసి భోంచేయటం ద్వారా దేవసహాయం కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయ త్నించాడని ఆరోపించారు. పైగా మతమార్పిడిలను అతడు ప్రోత్స హించాడనీ, విదేశీయులకు సమాచారం ఇవ్వడం ద్వారా రాజద్రోహా నికి పూనుకున్నాడనీ ఆరోపణలు గుప్పించారు. జీసస్‌కి లాగే ముందుగా అతడిని నిర్బంధించి చిత్రహింసల ఏకాంత గదిలో ఉంచారు. మూడేళ్ల తర్వాత దేవసహాయాన్ని గొడ్డును బాదినట్లు బాది, గేదెపై కూర్చోబెట్టారు. గేదెను పురాణ గ్రంథాల ప్రకారం మృత్యుదేవత అయిన యుముడి వాహనంగా వర్ణించేవారు. గేదె వెనుక వైపు అతడిని తిప్పి గ్రామాల్లో ఊరేగిస్తూ కొరడాలతో కొట్టారు. భారతీయ ఉపఖండం మొత్తంలో అత్యధికంగా పాలను ఇచ్చే జంతువు గేదె. కానీ అది నల్లగా ఉంటుంది కాబట్టి బ్రహ్మణ పూజా రులు, క్షత్రియ పాలకులు దాన్ని దయ్యపు జంతువుగా భావించేవారు. జీసస్కు గాడిద వాహనమైనట్లే, దేవసహాయానికి గేదె దేవుడిచ్చిన వాహనంగా మారింది. ఆ గేదె ముందుకు కదులుతుండగా, రక్తమోడే టట్లు దేవసహాయాన్ని బాదారు. రోజుల తరబడి అతడికి కనీసం ఆహారం, నీరు అందించకుండా గేదెపై ఊరేగిస్తూ చిత్రహింసలు పెట్టారు. అతడిని ఎలా హింసిస్తున్నారో, బాధపెడుతున్నారో అతడి భార్య స్వయంగా చూసేలా నిర్బంధించారు. చివరకు అతడిని రాళ్లు, పొదలతో ఉన్న అడవిలో కాల్చేశారు. ఇప్పుడు దేవసహాయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సెయింట్ అయ్యాడు. సెయింట్‌గా మారిన సాధారణ మానవుడు దేవసహాయం. ప్రపంచ ఆధ్యాత్మిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
యేసును మురిపించిన జక్కయ్య విశ్వాసం
జీవం లేని బలమైన దుంగలు ప్రవాహంలో కొట్టుకుపోతే, జీవమున్న చిన్నారి చేపపిల్లలు ప్రవాహానికి ఎదురీదుతాయి. లోకంతో పాటు కొట్టుకుపోయే జీవితానికి జక్కయ్య అసలైన ఉదాహరణ. బోలెడు డబ్బు, సామాజిక ప్రాబల్యం జక్కయ్య సొంతం. జక్కయ్య అనే హెబ్రీ పేరుకు ‘పవిత్రుడు’ లేదా ‘నీతిమంతుడు’ అని అర్థం. జక్కయ్య ఎలాంటి వాడు కావాలని తల్లిదండ్రులు ఆశపడ్డారో వాళ్ళతనికి పెట్టిన ఈ పేరునుబట్టి అర్ధం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రబద్ధంగా, తలిదండ్రులు బహుశా అతన్ని ఎనిమిది రోజుల శిశువుగా ఉన్నపుడే సున్నతి కోసం, తాముండే యెరికోకు దగ్గరే గనుక, యెరూషలేము ఆలయానికి తీసుకళ్లారేమో. పన్నెండేళ్ళు పూర్తయినపుడు యూదులంతా చేసే ‘బార్ మిట్జ్వా’ అనే ఉత్సవాన్ని కూడా అతని తల్లిదండ్రులు ఆలయంలో అట్టహాసంగా చేశారేమో. కానీ చివరికి అతని జీవితం మాత్రం వాటన్నింటికీ విరుద్ధమైంది. లోకానికి ఎదురీది మహావిశ్వాసి కావాల్సిన జక్కయ్య, లోకమలినానికి మారుపేరయ్యాడు( లూకా 19:7). ఇది అతని తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చిన పరిణామం. దేవుని ప్రేమను విస్మరించి, లోకంతో పాటు కొట్టుకోవడంలో అంతకాలం అతనికి ఆనందం, సౌలభ్యం దొరికింది. అయితే అంతమాత్రాన అతను దేవుణ్ణి ఏమీ విడిచిపెట్టలేదు. దేవుడతనికి జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాకపోతే జక్కయ్యకు లోకమే సర్వస్వమ్ అయ్యింది. అదీ అతని సమస్య, అదే మనలో చాలా మందికున్న సమస్య కూడా. అలా లోకపరంగా ఎంతో ఉత్తేజంతో జీవించాడు కాని ఆత్మీయంగా చాలా స్తబ్దంగా ఉండిపోయాడు. అంటే, జక్కయ్య తాజ్ మహల్ లాంటివాడన్నమాట. తాజ్ మహల్ బాహ్యంగా కళ్ళు చెదిరేంత సుందరమైన, గొప్ప కట్టడమైనా లోలోపల కుళ్ళుకంపు కొట్టే సమాధే కదా!! రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే పనిలో జక్కయ్య తన అంతరాత్మను తాకట్టుపెట్టి అవినీతిపరుడు, ధనవంతుడు కూడా అయ్యాడు. ధనవంతుడవడం పాపం కాదు, కానీ దొడ్డిదారిలో ధనార్జన చెయ్యడం, దేవుని మీద కాకుండా, డబ్బు మీదే ఆధారపడి జీవించడం పాపం. నీతిమంతుడు ఏడుసార్లు పడ్డా తిరిగి పైకి లేస్తాడన్న బైబిల్ సూక్తి ప్రకారం (సామె 24:16), అంతగా పడిపోయిన జక్కయ్య, తన జీవితంలో ఒక దశలో ఇక తాను ఆత్మీయంగా తిరిగి పైకి లేవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యేసు వస్తున్నాడని తెలిసి యెరికోలో ఒక చెట్టెక్కి యేసు కోసం ఎదురు చూశాడు. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఇదొక మహత్తరమైన నిర్ణయం. అలాంటి నిర్ణయాన్ని ప్రభువు కూడా గొప్పగా హర్షిస్తాడు. జక్కయ్యలో ఇన్ని లోపాలున్నా అతనిలో యేసుప్రభువు చూసిన ఒక గొప్ప సుగుణమేమిటంటే, అతను కేవలం యేసు కోసమే యేసు వద్దకొచ్చాడు. జనమంతా స్వస్థతలు, సంపదలు, సమస్యల పరిష్కారం కోసం యేసు వద్దకు తరలివస్తున్న రోజుల్లో, జక్కయ్య మాత్రం యేసే కావాలనుకొని, యేసు మాత్రమే తనకు చాలుననుకొని, యేసును ఆశ్రయించాడు, అలా యేసును జక్కయ్య, అతని కుటుంబం కూడా సంపూర్ణంగా పొందారు. తన డబ్బంతా పేదలకు, తనవల్ల అన్యాయం జరిగిన వారికి పంచి, డబ్బు కన్నా యేసే తనకు ముఖ్యమని, తాను డబ్బు మనిషిని కాదని, యేసుమనిషేనని ఆచరణలో రుజువుచేసుకున్నాడు, ఇదే అత్యున్నతమైన శ్రేణికి చెందిన విశ్వాసం. అందుకే జక్కయ్య అబ్రాహాము కుమారుడన్న బిరుదును ఏకంగా యేసు నుండే పొంది, తన విశ్వాసానికి ప్రభువు నుండే ప్రామాణికతను సంపాదించుకున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
బాబును ఏకిపారేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, గుంటూరు/విజయవాడ: క్రైస్తవ సమాజం పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభిస్తున్నతీరుపై ఫిలిప్ సి తోచర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సరిలేరని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకొని బైబిల్ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్న ఆయన.. ఇప్పుడు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు క్రైస్తవ సమాజాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. కాగా, క్రైస్తవ మతంపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్) ఫిలిప్ సి తోచర్ శనివారం ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై సోమవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు వైఖరి అసహ్యం కలిగిస్తుందని, తన ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారని ఫిలిప్ మండిపడ్డారు. వ్యక్తులను, వ్యవస్థలను వాడుకొని వదిలి వేయటంలో చంద్రబాబు దిట్ట అని ఆయన పేర్కొన్నారు. గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఓట్ల కోసమే చంద్రబాబు క్రైస్తవులను వాడుకుంటాడని, ఇప్పుడు అతని అసలు రంగు బయటపడటంతో రానున్న ఎన్నికల్లో క్రైస్తవ సమాజం అతనికి తగిన గుణపాఠం నేర్పుతుందని హెచ్చరించారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసినందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పతకాలకు లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు మతి భ్రమించిందని ఫిలిప్ అన్నారు. తాను అధికారంలోకి రావడం అసంభవమని తెలిసి ఫ్రస్ట్రేషన్ లో ఏదోదో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ఫిలిప్ సి తోచర్ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. -
‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’
శరీరంలో కళ్ళది, వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర. కనురెప్ప రక్షక కవచంగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు, తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపర్చుతుంది. తానే సృష్టించిన అలాంటి కనుపాపను, కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రతా వాగ్దానం ఎంతో ఆదరణకరమైనది కూడా. ‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అన్నాడు దేవుడు తన ప్రజలతో (జఖర్యా 2:8). దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఈ వచనం అసమానమైనది. ఇక మోషే అయితే, తమ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్తుతించాడు(ద్వితీ 32:10). ఎవరైనా సరే తనకు, తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత. ప్రాచీనకాలంలో రాజులు భద్రత కోసం ఎల్తైన స్థలాలు, కొండల మీద తమ కోటలు, తామున్న పట్టణాల చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు. కాని 30 వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు, అత్యంత విధ్వంసకమైన బాంబులున్న నేటి కాలంలో ఎత్తైన ప్రాకారాలు, కోటగోడలకు, అసలు ‘ఎత్తు’ అనే మాటకే అర్థం లేకుండా పోయింది. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి, ఇంతటి మహాప్రపంచాన్ని వణికిస్తోందంటే, దేవుని ఈ వాగ్దానం మరుగున పడిందా? లేక మనిషి తన భద్రత కోసం తాను చేసే భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లు, తయారుచేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా? మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే, దేవుని కనుగుడ్డును ముట్టడం మరెంత కష్టం? ఆయన బిడ్డలమైన మనల్ని శత్రువు ముట్టడం, నష్టపర్చడం, మనపై దాడి చెయ్యడం కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు. మరి ప్రపంచమంతటా నెలకొన్న కనీ వినీ ఎరుగని భద్రతారాహిత్యానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు మనం తప్పక జవాబు తెలుసుకోవాలి. జఖర్యా ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 ఏళ్ళ బబులోను చెరనుండి విడుదలై అప్పుడప్పుడే యెరూషలేముకు తిరిగొచ్చారు. దేవుని ప్రజల్ని, దేవుడే చెరలోకి పంపడమేమిటన్న ప్రశ్న వాళ్లందరిలోనూ ఉంది. కొందరు, బబులోను చక్రవర్తి మమ్మల్ని చెర పాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా? అని జఖర్యా ప్రవక్తను నిలదీసి ఉంటారు కూడా. అయితే తమ ప్రవర్తన మార్చుకొమ్మని రెండొందల ఏళ్ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించినా ప్రజలు మారలేదు. దేవుని భయం సమసిపోయి, ప్రజలు కేవలం పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాలలో, సమాజంలో భద్రత కరువైంది. దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విధేయులై దేవుని ప్రసన్నతను, అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు, దేవునికవిధేయులై జీవితాలు, కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడా కనిపించరు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవునిలో అంతకంతకూ ఎదిగిన అనుభవం కూడా ఉండాలి. అలా కాకుండా ఎంతో వాక్యం తెలిసినా విశ్వాసంలో ఎదగక, డబ్బు, అధికారం, పేరు, ఆరోగ్యం, సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్న ‘బాలశిక్షస్థాయి’ విశ్వాసం లోనే ఉండిపోతే, అదే అన్ని సమస్యలకు మూలం. ప్రజల్లో మార్పునకు కూడా అదే ఆటంకం. మనం నమ్మే లోక నియమాలను, మనకు నచ్చని దైవిక విధివిధానాలకు అన్వయించే ‘అతి పోకడలే’ ఈ రోజు మనమెదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆత్మీయ రుగ్మత. మారని దేవునితో సాగే మన సాంగత్యానికి రుజువేమిటంటే, దినదినం మనం దేవుని సారూప్యంలోకి మారడమే!! మనం దేవుని ప్రజలమైతే, మన పరలోకపు తండ్రియైన దేవుని లక్షణాలు లోకానికి మనలో స్పష్టంగా కనిపించాలి. ఆ స్థాయిలో మనలో దేవుని ఆశీర్వాదాలకు, భద్రతకు అంతు ఉండదు. అపుడు, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే అంటాడు దేవుడు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
త్వరలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం సలహా సంఘం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ కేవలం మాటల సెక్యూలరిస్ట్ కాదని, ఆచరణలో గుండెల నిండా లౌకికవాదాన్ని నింపుకున్నారన్నారు. మంత్రుల నివాస ప్రాం గణంలోని క్లబ్‌హౌజ్‌లో శుక్రవారం జరిగిన క్రైస్తవ మత పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో మిషనరీల పాత్ర ఎవరూ కాదనలేరని, కరోనా పరిస్థితుల్లో మిషనరీ ఆసుపత్రుల సేవలు మరువలేనివని కేటీఆర్ ప్రశంసించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, క్రైస్తవ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 8 వేల మందికి విద్యాబోధన: కొప్పుల రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 204 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 వేల మంది క్రైస్తవ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించడంతో పాటు, వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన హామీనిచ్చారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. వంద దేశాల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు. -
సెరెనా అదిరెన్...
తనకెంతో కలిసొచ్చిన వేదికపై అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (24) ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న 38 ఏళ్ల సెరెనా ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించింది. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా సెరెనా ఘనత వహించింది. 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఈ మెగా టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈసారీ సెరెనా గెలిస్తే అత్యధికసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా క్రిస్ ఎవర్ట్ (6 సార్లు) పేరిటే ఉన్న రికార్డును సవరించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. న్యూయార్క్: కరోనా వైరస్ భయంతో యూఎస్ ఓపెన్ టోర్నీకి టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన స్థితిలో... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా ఈసారి మాత్రం ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సెరెనా 7–5, 6–3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లోసెరెనా 13 ఏస్‌లు సంధించింది. కెరీర్లో 20వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకుంది. 101 విజయాలతో క్రిస్ ఎవర్ట్ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే అత్యధికంగా ఏడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. 1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017లలో సెరెనా ఈ టోర్నీలో ఆడలేదు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా రెండు టోర్నీలు ఆడిన సెరెనా రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆమె మూడు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. ‘యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్ గెలవడమే నా ముందున్న లక్ష్యం’ అని సెరెనా వ్యాఖ్యానించింది. మాజీ చాంపియన్ క్లియ్‌స్టర్స్‌కు నిరాశ... ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పునరాగమనం చేసిన మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 37 ఏళ్ల క్లియ్‌స్టర్స్ 6–3, 5–7, 1–6తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–2తో విక్‌మాయెర్ (బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్) 7–6 (9/7), 6–1తో హీథెర్ వాట్సన్ (బ్రిటన్)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/1), 6–4తో ఒషీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–1తో తిమియా బాబోస్ (హంగేరి)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో బార్బరా హాస్ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో కెర్బర్, క్విటోవా.... మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా), 14వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో కెర్బర్ 6–3, 7–6 (8/6)తో ఫ్రీడ్సామ్ (జర్మనీ)పై, మార్టిక్ 6–3, 6–4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)పై, కొంటావె 6–4, 6–1తో కయా యువన్ (స్లొవేనియా)పై, క్విటోవా 7–6 (7/3), 6–2తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై గెలిచారు. అయితే 12వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 1–6, 2–6తో సస్నోవిచ్ (బెలారస్) చేతిలో... 30వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6–1, 6–7 (2/7), 0–6తో గ్రషెవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. వీనస్ రికార్డు... అత్యధికసార్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన క్రీడాకారిణిగా వీనస్ విలియమ్స్ (అమెరికా) రికార్డు సృష్టించింది. సెరెనా అక్క అయిన 40 ఏళ్ల వీనస్ యూఎస్ ఓపెన్‌లో 22వసారి బరిలోకి దిగింది. అయితే ఆమెకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–5తో వీనస్‌ను ఓడించింది. ఇప్పటిదాకా మార్టినా నవ్రతిలోవా (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్ సవరించింది. ముర్రే అద్భుతం... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అద్భుత విజయం సాధించాడు. దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 6–4తో యోషిహిటో నిషియోక (జపాన్)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రెండు సెట్లు చేజార్చుకున్నాక విజయాన్ని అందుకోవడం ముర్రే కెరీర్లో ఇది పదోసారి కావడం విశేషం. మూడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)–నికోలా కాచిచ్ (సెర్బియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శరణ్–కాచిచ్ ద్వయం 4–6, 6–4, 3–6తో కూలాఫ్–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. -
అస్పృశ్యతపై ఒక సమరయుని సమరం!
ఒకసారి ఎంతో భావగర్భితమైన ఉపమానాన్ని యేసుప్రభువు చెప్పాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉత్తరాన యేసుప్రభువు నివసించిన నజరేతు గ్రామమున్న గలిలయ ప్రాంతానికి, దక్షిణంలోని యెరూషలేము పట్టణానికి మధ్య రాకపోకలకు రెండు మార్గాలున్నాయి. ఒకటేమో సమరయ గ్రామాల గుండా వెళ్లే దగ్గరి మార్గం. కానీ సమరయులు అంటరానివారు గనుక సనాతన యూదులు ఆ మార్గంలో వెళ్లేవారు కాదు. రెండవది దూరమార్గం కానీ సనాతన యూదులుండే యెరికో లాంటి పట్టణాల గుండా వెళ్లే మార్గం. అయితే దొంగల బెడద కూడా బాగా ఉన్న మార్గమది. ఒకసారి ఆ మార్గంలోనే సనాతన యూదుడొకతను ప్రయాణమై వెళ్తూ దొంగల బారినపడ్డాడు. దొంగలతన్ని బట్టలతో సహా పూర్తిగా దోచుకొని విపరీతంగా కొట్టి కొనప్రాణాలతో దారిపక్కన పడేశారు. అపుడు అతనిలాగే సవర్ణులు, సనాతనులైన ఒక యాజకుడు, లేవీయుడు అటువైపు వచ్చికూడా అతన్ని పరామర్శించకుండా వెళ్లిపోగా, ఒక సమరయుడు అటుగా వెళ్తూ అతన్ని చూసి, పరామర్శించి, అతని గాయాలు కట్టి, ఆ మార్గంలోనే ఉన్న ఉన్న ఒక పూటకూళ్లవాని ఇంట్లో అతన్నిచేర్చి, అతనికయ్యే ఖర్చంతా భరించాడు. మనవాళ్లే కదా అనుకున్న యాజకుడు, లేవీయుడు స్వార్ధపరులై అతన్ని ముట్టుకోవడం కాదు కదా కనీసం చూడకుండా మొహం చాటేసి వెళ్ళిపోగా, ఏ అంటరాని వాళ్లకయితే దూరంగా ఉండాలనుకొని యెరికో దారినెన్నుకొని ఆపదల్లో పడ్డాడో, ఆ అంటరానివాడే ఆప్తుడై అన్ని సపర్యలూ చేసి క్షతగాత్రుని బతికించాడు. మతపరంగా ప్రముఖులు, జ్ఞానులైన ఆ యాజకుడు, లేవీయుడి కన్నా. అంటరానివాడైన ఆ సమరయుడే నిజమైన పొరుగువాడు, అసలైన విశ్వాసి అని యేసుప్రభువు తేల్చి, విశ్వాసానికి నిజమైన ప్రామాణికతనిస్తూ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న నియమం కన్నా అతున్నతమైనది మరొకటి లేదని బోధించాడు. అలా క్రైస్తవానికి ఈ బోధే మూలరాయి అయ్యింది. అయితే యేసుక్రీస్తు జీవితంలో నుండి పెల్లుబికిన ఇలాంటి విశిష్టమైన బోధలతో ఆవిర్భవించిన ‘క్రైస్తవం’,ఒక ‘మతం’ స్థాయికి దిగజారడంతో సమస్యలన్నీ మొదలయ్యాయి. నిజమైన ప్రేమ, సోదరభావం, సౌభ్రాతృత్వానికే కాదు, స్వార్ధం, పగ, ద్వేషం, వివక్షకు కూడా కుల, మత, ప్రాంతీయాది విభేదాల్లేవు, సరిహద్దులు అసలే లేవన్నదే ఇందులోని తాత్పర్యం!! ఈ సూక్ష్మం అర్ధమైతే, క్రైస్తవంలోనే కాదు ప్రపంచంలోనే అసలు సమస్యలు లేవు. ’అయ్యో! మన మనవాడే కదా!’’ అన్న జాత్యాభిమానంతోనైనా ఆపదలో ఉన్న వాడిని ఆదుకోని ’పచ్చి స్వార్థపరులు’ ఆ యాజకుడు, లేవీయుడైతే,‘నన్ను అంటరాని వాణ్ని చేసిన దుర్మార్గుడితను’ అని ఈసడించుకోకుండా, అతన్ని కాపాడిన ‘మహోన్నతమైన ప్రేమ, మానవత్వం’ ఆ సమరయుడిది. మనం తరచుగా వాడే ‘మనవాడు’, ‘పగవాడు’ అన్న పదాలు ఎంత అర్ధరహితమైనవో తెలిపే బోధ ఇది. మనల్ని ఆపదలో ఆదుకున్నవాడే మనవాడు, పొరుగువాడనీ, మొహం చాటేసే ‘మనవాళ్ళు’ పగవారికన్నా తక్కువైనవారేమీ కాదని తెలుపుతూ, మానవత్వాన్నే పునర్నిర్వచించిన పునాదిరాయి ఈ బోధ! పెద్దలు సౌకర్యార్థమై కొన్ని శాఖల్ని మనలో ఏర్పాటుచేసినా, ఒక డినామినేషన్ కాకి మరో డినామినేషన్ మీద వాలనంత వైషమ్యం, ప్రేమకు, ఐక్యతకు మారుపేరైన క్రైస్తవంలో మనకెందుకుందో లోకానికి, దేవునికి కూడా ఒకరోజున మనం సంజాయిషీ చెప్పాలి. ప్రాణం మీది తీపితో ఒక సర్జరీ చేయించుకునేటపుడు ‘డాక్టర్’ మనవాడా?’ అని ఆలోచించని వారికి, పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు ‘మనవాళ్ళా’? అని అడగని వారికి, కొన్ని సందర్భాల్లోనే ‘మనవాళ్ళా?’ అనడిగే సంకుచితత్వమా? పుట్టుకతోనే ఎవరూ విశ్వాసులు కాదు. అలాగని ఎన్నేళ్లైనా క్రీస్తు సారూప్యం ఏర్పడకుంటే, అసలు క్రైస్తవులమే కాదు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
దాతృత్వం.. ప్రార్థన.. ఉపవాసం..
రహస్యంగా సాగాలి!పాత నిబంధన కాలంలో దేవుడు తన న్యాయసంవిధాన సూత్రావళిగా మోషేకిచ్చిన పదాజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రానికి పొడిగింపుగా, కొత్తనిబంధన కాలపు విశ్వాసులకు కరదీపికగా, యేసుప్రభువే స్వయంగా ఆ ధర్మశాస్త్రానికిచ్చిన వినూత్నమైన భాష్యం ఆనాడు యేసుప్రభువు కొండమీది చేసిన ప్రసంగం!! ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అమలుపర్చడమే దేవుని ప్రసన్నుని చేసుకోగలిగిన ఏకైక మార్గమైతే, అది మానవమాత్రులకెంత అసాధ్యమో ధర్మశాస్త్రమే రుజువు చేస్తుంది. అత్యున్నతమైన ధర్మశాస్త్రపు పవిత్రతా స్థాయిని ప్రామాణికం చేసుకుంటే, ఈ లోకంలో అందరూ పాపులే అని నిర్వచిస్తుంది బైబిల్ (రోమా 3:23). అందువల్ల కొత్తనిబంధన కాలపు విశ్వాస జీవితానికి యేసు ప్రభువు వారి కొండమీది ప్రసంగం పునాది లాంటిది. దేవుని మహిమ కోసం విశ్వాసి బాహాటంగా చెయ్యవలసిన అనేక విషయాలతోపాటు, దేవుని మహిమ కోసం, తన మేలుకోసం విశ్వాసి పరమ రహస్యంగా చేయవలసిన మూడు ప్రధానమైన అంశాలను కూడా యేసుప్రభువు తన కొండమీది ప్రసంగంలోనే ప్రకటించాడు. విశ్వాసి మొదటిగా తన ‘దాన ధర్మాలను’, రెండవదిగా’ ప్రార్థనను’, మూడవదిగా తన ‘ఉపవాస దీక్ష’ను చాలా గుప్తంగా, రహస్యంగా చెయ్యాలని యేసుప్రభువు ఆదేశించాడు. ఇవి సలహాలు కాదు, ప్రభువిచ్చిన చాలా స్పష్టమైన ఆదేశాలు. అది తెలియకే, గోప్యత లోపించిన మన ప్రార్ధనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరుప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం మనకు, మన కుటుంబాలకూ రావడం లేదు. విశ్వాసి ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని ప్రభువు ఆదేశించాడు. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయి. చర్చికి కానుకగా బెంచీలిచ్చి, వాటి వెనక తమ పేర్లు రాయించుకుంటే, ఆ పేర్లు ఈ లోకంలోనే ఉండిపోతాయి కానీ పరలోకంలో దేవుని జీవగ్రంథంలో మాత్రం రాయబడవన్నది తెలుసుకోవాలి. పేదలకు చేసే ధర్మం గురించి యేసు ఇలా చెప్పాడు కానీ దేవునికిచ్చే కానుకల గురించి కాదంటూ కొందరు పాస్టర్లు తమ స్వార్థం కోసం దీనికి వక్రభాష్యం చెబుతారు. ఒక పేద విధవరాలు గుప్తంగా ఇచ్చిన చిరుకానుకను ప్రభువెందుకు శ్లాఘించాడో అర్థమైతే, ఈ వాస్తవమేమిటో బోధపడుతుంది. ఇక ప్రార్థనయితే, గది తలుపు లేసుకొని మరీ రహస్యంగా చేయాలన్నది ప్రభువాదేశం. కానీ ఆనాటి పరిసయ్యుల్లాగే, జీవితం లో ఎన్నడూ రహస్య ప్రార్థన చెయ్యని వారు కూడా మైకుల్లో సుదీర్ఘంగా ప్రార్థన చేసేందుకు ఉబలాట పడుతుంటారు. దేవుని సంబోధిస్తూ, దేవునికే చేసే మన ప్రార్థన అసలు ఇతరులెందుకు వినాలి? చర్చిల్లో ప్రార్థనలకు, కుటుంబ ప్రార్థనలకు అతీతమైనది, ఆశీర్వాదకరమైనది విశ్వాసి తన ప్రభువుతో ఏకాంతంగా చేసే రహస్య ప్రార్ధన. ఇదే బలమైన ప్రార్థనాజీవితమంటే!! పోతే అందరికీ తెలిసేలా ఉపవాస దీక్షలు చెయ్యడానికి కూడా తాను వ్యతిరేకమని, అదంతా వృథా ప్రయాస అని కూడా ప్రభువు స్పష్టం చేశాడు. ఈ మూడూ ఎంత రహస్యంగా చేస్తే అవి మనకంత ఆశీర్వాదకరమవుతాయి. అవెంత బహిరంగంగా చేస్తే, మనమంతటి వేషధారులమవుతాము. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడు చెప్పినట్టు చేయాలి కదా... అలా కాకుండా మాకు తోచినట్టే చేస్తాం అంటే, ఎండమావుల్లో నీళ్లు వెదకడమే కాదా?? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పవన్ సుడో సెక్యులరిస్టు..
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ల ఫోరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని క్రిస్టియన్ నేతలు పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫోరం తప్పుబట్టింది. పవన్ సుడో సెక్యులరిస్టుగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురదచల్లేందుకే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారు. తిరుపతిలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందంటూ ఒక మతాన్ని కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. విజయవాడ పున్నమి ఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీవారే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ధారూరు క్రిస్టియన్ జాతరకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ సమీపంలోని ధారూరులో క్రిస్టియన్ జాతర నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్‌కు ఈనెల 15, 17 తేదీల్లో నాలుగు సర్వీసులు నడుపుతోంది. బీదర్ నుంచి ధారూరుకు కూడా నాలుగు సర్వీసులు తిప్పుతోంది. ఈ సందర్భంగా యశ్వంత్‌పూర్–బీదర్, నాందేడ్–బెంగళూరు, బెం గళూరు సిటీ–నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ధారూరు స్టేషన్లో తాత్కాలిక స్టాప్‌ను కల్పించారు.