
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్ చేశారు.