
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక
న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా వివాదాస్పద అశ్లీల వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర జోక్‌లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఓవర్ ది టాప్(ఓటీటీ)ప్లాట్‌ఫామ్‌లు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు స్వీయ నియంత్రణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ నిబంధనలు,2021లోని ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ను పాటించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీచేసింది.
నైతిక నియమాల ఉల్లంఘన జరిగితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన స్వీయనియంత్రణ సంస్థలు తగు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ వంటి ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్, సోషల్ మీడియాలో అసభ్యకర, శృంగారభరిత, బూతు సమాచారం విస్తృతంగా ప్రసారంలోకి వస్తోందని పలువురు పార్లమెంట్ సభ్యులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అడ్వైజరీ జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment