moral values
-
ఈ నేరప్రవృత్తికి కారణాలేమిటి?
క్రమశిక్షణే విద్యార్థికి సంస్కారవంతమైన విద్యను అంది స్తుంది. క్రమశిక్షణే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. అది లోపించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యా యులపై దారుణంగా భౌతిక దాడులకు దిగడం అందులో ఒకటి. రాయచోటి (Rayachoty) పట్టణంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ‘ఏజాష్ అహ్మద్’ అనే ఉపాధ్యాయునిపై ఇద్దరు విద్యార్థులు పిడిగుద్దులతో భౌతికదాడి చేయడంతో టీచర్ ప్రాణాలు విడిచారు. తన తరగతిలో బోధన చేస్తుండగా, పక్క క్లాసులో అల్లరి చేస్తున్న వారిని టీచర్ మందలించారు. అంతే... కోపోద్రిక్తులై టీచర్‌పై దాడిచేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలు మరవక ముందే మరో రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చత్తర్‌పూర్ జిల్లాలోని ధామోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ‘సురేంద్రకుమార్ సక్సేనా’పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది కూడా పాఠశాలకు విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని మందలించడం వలనే జరిగింది.దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా రకరకాల కారణాలతో జరిగాయి. కానీ మూడు – నాలుగు రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే కారణంతో పై సంఘటనలు సంభవించడం బాధా కరం. విద్యారంగంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలు స్వతహాగా సున్నిత హృదయులు. వారి లేలేత మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇంటిలో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు మెలగాలి. పిల్లలు ఎక్కువ సమయం మిత్రులతో గడుపుతారు. ఈ క్రమంలో సహవాస దోషం వల్ల కొన్ని చెడ్డ అలవాట్లు సంక్రమిస్తాయి. దీన్ని ఎవరైనా వ్యతిరేకించి మందలిస్తే, వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అందుకే వారిని అనునయిస్తూ పరిష్కారాలను కనుగొనాలి.చిన్నతనంలో కుల, లింగ వివక్ష, లైంగిక వేధింపులకు గురి కావొచ్చు. ఇవన్నీ పిల్లల విపరీత ధోరణికి కారణమౌతాయి. టీనేజ్ పిల్లలు రాత్రనక పగలనక స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలు చూస్తూ కాలం గడుపుతుంటారు. బెట్టింగ్, రమ్మీ, రేసింగ్ లాంటి ఆటల్లో పాల్గొని డబ్బు పోగొట్టుకుంటారు. దీంతో ప్రతీ విషయానికీ కోపం, అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటి వల్లనే నేడు విద్యార్థులలో వింత ప్రవర్తన చూస్తున్నాం. ఈ కారణాలతోనే పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, రీల్స్ చూసి నాయికా నాయకులను అనుకరిస్తున్నారు. ఈ రోజుల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులు సైతం ధూమపానం, మద్యం సేవించడం చూస్తున్నాం. ఇవన్నీ పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచేవే.ఒక విద్యార్థిని ‘నీకేమీ రాదు, నీవు దేనికీ పనికి రావు’ అని పది మందిలో తక్కువ చేసి టీచర్ మాట్లాడకూడదు. శారీరకంగా శిక్షించకూడదు. దాన్ని అవమానంగా భావించి కృంగిపోతాడు. గ్రామీణ విద్యార్థులను చులకనగా చూడకూడదు. వీరికి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించకూడదు. వీరికి అవసరమైన పక్షంలో ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలి. స్కూల్లో అందరు టీచర్లూ ఐక్యంగా ఉండాలి. పాఠశాలల్లో సహ పాఠ్యేతర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. వాటిలో విద్యార్థులను భాగస్వామ్యలుగా చేయాలి. అవసరమైతే పాఠశాలలో సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంబడి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను, పత్రికలను పిల్లలు చదివేలా చూడాలి. సైన్స్, సోషల్, మోరల్ క్లబ్బులను నిర్వహించాలి. ప్రపంచీకరణ వల్ల సంక్రమించిన వస్తువుల వల్ల కలిగే నష్టాలను ఎరుక పరచాలి. ప్రభుత్వమైతే విద్యా ప్రణాళికలో మార్పులు చేయవచ్చు. ఆ మార్పులు సామాజిక అంతరాలను నిలువరిస్తూ, మానవత్వాన్ని చాటేలా ఉండాలి. స్ఫూర్తిదాయక, నీతి ప్రబోధక పాఠ్యాంశాలను తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడే విద్యార్థికి విలువలతో కూడిన విద్య అందుతుంది. లేనిచో విద్యార్థుల్లో హింసాప్రవృత్తి పెచ్చు మీరిపోయి, రాబోవు యువతరం నిర్వీర్యయ్యే ప్రమాదం లేకపోలేదు.- పిల్లా తిరుపతిరావుతెలుగు ఉపాధ్యాయుడు -
ఐపీఎస్ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో (ఎస్వీపీఎన్పీఏ) ఐపీఎస్ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతి క విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు. అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ ఆర్) బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్ కావడంతో ‘అమృత్కాల్ బ్యాచ్’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం అకాడమీలో జాయింట్ డైరెక్టర్ ఎన్.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించిన వివరాలివీ... ఎప్పటికప్పుడు శిక్షణను విశ్లేషిస్తూ... సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సైబర్ క్రైమ్ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కోఅంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేరి్పస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్ టాపర్‌గా నిలిచారు. వచ్చే నెల 14 నుంచి 76వ బ్యాచ్ ట్రైనింగ్ మొదలు కానుంది. మాక్ కోర్టులు సైతం నిర్వహిస్తూ... సాధారణంగా ఐపీఎస్ అధికారులకు ఎఫ్ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో మాక్ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు. ఐఆర్ఎస్ నుంచి ఐపీఎస్‌కు.. అల్వాల్ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్ కావడం సంతోషంగా ఉంది. – ఎస్.చిత్తరంజన్, ఐపీఎస్ ట్రైనీ తెలుగు నేర్చుకోవడమే తొలి లక్ష్యం మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్–కానిస్టేబుల్. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం. – చేతన్ పందేరి, ఐపీఎస్ ట్రైనీ -
గురువాణి: శ్రమకు నమస్కారం
నైతిక విలువలు పతనమయిన జీవితాన్ని గడపడం... అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాగింపుగా మనసు కూడా తోడయితే... దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు. పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడూ ఒక సరళరేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను ΄పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దలనుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థం అయితే తప్ప ఆ డబ్బు ఖర్చుపెట్టడానికి యోగ్యత ΄పొందలేడు. కారణం.. డబ్బు సంపాదించేటప్పడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు వ్యసనాలకు వశులు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది. నీతి శాస్త్రం ఏమంటుందంటే... మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చుపెట్టావన్నది అత్యంత ప్రధానం. ప్రతివారికి ద్రవ్యసముపార్జనలోని కష్టం తెలియాలి... అంటుంది రఘువంశం కావ్యంలో... పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందినా... జీవితంలో ఒకసారి దండయాత్రకు వెడతాడు. రాజులందర్నీ గెలిచి వస్తాడు. ఎందుకు... అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచిపనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి.. అందుకే ఆ దండయాత్రలు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే, ఆ ద్రవ్యం ఎంత మంది ఉద్ధరణకో ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు. ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతయినా కావచ్చు. అసలు సంపాదించినది ఏదీ లేక΄ోవచ్చు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికీ ప్రధానం. -
శ్రుతి మించిన ప్రేమ
పబ్జీకి బానిసై తల్లిని కాల్చి చంపిన కుర్రాడు, పరీక్షలను వాయిదా వేయించడానికి ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన పన్నెండవ తరగతి కుర్రాడు, అంతకు ఐదేళ్ల ముందు నిర్భయ సంఘటన, ఆ తర్వాత రెండేళ్లకు హైదరాబాద్‌లో అభయ ఘటన, మరో ఐదేళ్లకు అదే హైదరాబాద్‌లో ఒక దిశ, ఇప్పుడు ఒక రొమేనియా బాలిక...నెక్లెస్ రోడ్లో మరో ఉదంతం. వీటన్నింటిలోనూ అన్నింటిలోనూ నిందితులు టీనేజ్ దాటుతున్న వాళ్లు, యువతరానికి ప్రతినిధులే. అభివృద్ధి సాధిస్తున్నాం, డిజిటల్‌గా ముందుకు వెళ్తున్నాం... అనుకుంటున్న ఈ రోజుల్లో అత్యాచారాలు, కరడు కట్టిన నేరాలకు యువతరమే కారణమవుతోందంటే ఈ తప్పు ఎవరిది? తప్పంతా సమాజానిదేనా? పేరెంట్స్ పాత్ర ఎంతవరకు? ప్రేమ – బాధ్యత ఈ రెండూ పేరెంటింగ్‌లో ప్రధానమైనవి. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతున్నామనే ప్రదర్శన ఎక్కువవుతున్న రోజులివి. ఈ ప్రదర్శనలో మునిగిపోయి తమ మీద ‘బాధ్యత’ కూడా ఉందనే వాస్తవాన్ని మర్చిపోతున్న పేరెంట్స్ కూడా ఎక్కువవుతున్నారనే చెప్పాలి. ► ఒక ఆర్టీఏ అధికారి తన పదిహేడేళ్ల కూతురు బైక్ తీసుకుని రోడ్ మీదకు వెళ్తున్నప్పుడు ‘ట్రాఫిక్ పోలీస్ ఆపితే నా పేరు చెప్పు, అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి’ అని చెప్పి పంపిస్తే దానిని ప్రేమ అనవచ్చా? బాధ్యతరాహిత్యం అనాలా? ఈ రెండూ కాకపోతే అధికారంతోపాటు వచ్చిన అతిశయం అనుకోవాలా? ► అనతి కాలంలోనే బాగా సంపాదించిన ఓ తండ్రి తన కొడుకుతో ‘ఈ వయసులో నేను కెరీర్లో స్థిరపడడానికి అహోరాత్రులు కష్టపడ్డాను. నీకు ఆ కష్టం అవసరం లేదు, నా లైఫ్‌ని కూడా నువ్వే ఎంజాయ్ చెయ్యి’ అని అవసరానికి మించినంత డబ్బు ఇవ్వడాన్ని ఏ విధమైన పేరెంటింగ్‌గా పరిగణించాలి? ► ‘నువ్వు ఏదైనా చెయ్యి, అయితే! ఏం చేశావో చెప్పేసెయ్, తర్వాత ఏ తలనొప్పులూ రాకుండా నేను చూసుకుంటాను’ అని ఒక నాయకుడు తన పిల్లలతో చెప్పడాన్ని ఎలా చూడాలి? ► ‘మా అమ్మాయి ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ చాలా గొప్పవాళ్లు. తనకు కారు లేదని చిన్నబుచ్చుకుంటోంది. అందుకే తన కోసం ఓ కారు బుక్ చేశాం’ అని చెప్పుకునే ఓ తల్లి. ఆ మైనర్ అమ్మాయి బైక్ యాక్సిడెంట్ చేస్తే అందుకు మూల్యం చెల్లించాల్సింది అమాయకులే కదా! ఆ సంపన్న కుర్రాడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే సదరు అమ్మాయిల జీవితాన్ని, జీవించే హక్కును కాలరాసిన నేరం ఎవరిది? పై తల్లిదండ్రులందరికీ తమ పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంది. అందులో సందేహం లేదు. ఆ ప్రేమ వెనుక ఉండాల్సిన బాధ్యత ఏమవుతోంది? మద్యం సేవించి కారు నడిపితే జరిగే ప్రమాదాల గురించి చెప్పాలని, మద్యం సేవించి కారు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి, ఆ ప్రమాదం తమకు ఎదుటి వారిని కూడా ప్రాణాపాయంలోకి నెట్టివేస్తుంది కాబట్టి ఆ సమయంలో వాహనం నడప వద్దని, అలా నడపడం చట్టరీత్యా నేరమని చెప్పడం మర్చిపోతున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు ఆపుతారు, కాబట్టి పోలీసులకు దొరకకుండా ఉండడానికి చిట్కాలు నేర్పిస్తున్నారు. ఇంటికి మెయిన్రోడ్లో రాకుండా పోలీసు నిఘా, సీసీ కెమెరాల్లేని గల్లీల్లో ఎలా రావాలో జాగ్రత్తలు చెప్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండడం నేర్పిస్తున్నారు, పోలీసులు ఆపినప్పుడు ఎలా బయటపడాలో నేర్పిస్తున్నారు తప్ప ఆ పొరపాటు మీరు చేయవద్దు అని చెప్పే వాళ్లు ఎంతమంది? ఉద్యోగం– ఒత్తిడి జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి, పిల్లల్ని సౌకర్యంగా పెంచాలి, మంచి చదువు చెప్పించాలి... మధ్యతరగతి పేరెంట్స్ వీటన్నింటినీ ప్రధాన కర్తవ్యాలుగానే చూస్తున్నారు. అయితే ఒక కార్పొరేట్ స్కూల్లో చేర్చడంతో తమ బాధ్యత పూర్తయినట్లు భావిస్తున్నారు. నిజానికి ఏ స్కూలూ పేరెంటింగ్ రోల్ పోషించలేదు. ఆ బాధ్యత పేరెంట్స్‌దే. తమ పిల్లలకు స్నేహితులెవరనేది ప్రతి పేరెంట్‌కి తెలిసి ఉండాలి. పిల్లలను ఇంట్లో బంధించినట్లు పెంచడమూ కరెక్ట్ కాదు, అలాగని పార్టీలకు వెళ్తుంటే... గుడ్డిగా వదిలేయనూకూడదు. ఆ పార్టీ జరిగే ప్రదేశం తెలిసి ఉండాలి. అది బర్త్‌డే పార్టీ కావచ్చు, ఫేర్వెల్ కావచ్చు. పార్టీ జరిగే చోట పిల్లల్ని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం తల్లిదండ్రులే చేస్తుంటే అనేక ఘోరాలకు అడ్డుకట్ట పడుతుంది. అంతకంటే ముందు మద్యం సేవించడం అభ్యుదయానికి చిహ్నం అనే అపోహను తొలగించాలి. అలాగే మంచి– చెడు చెప్పడం, సంస్కారం నేర్పించడంతోపాటు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల గురించి అవగాహన కల్పించాలి. న్యాయవ్యవస్థ మీద గౌరవం తల్లిదండ్రులలో ఉండాలి. అప్పుడే పిల్లలకు నేర్పడం సాధ్యమవుతుంది. చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎదురయ్యే పర్యవసానాలను తెలియచెప్పాలి తప్ప తప్పించుకోవడానికి ఉన్న మార్గాలను కాదు. అన్నింటికంటే ఈ తరం పిల్లలకు ఇంట్లో వాళ్ల భయం తక్కువగా ఉంటోంది. అమ్మానాన్నలను సులువుగా ఏమార్చవచ్చనే ధోరణి కూడా పెరిగింది. దొరికిపోతామేమోననే భయం లేకుండా సులువుగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. అలాగే హింసలో ఆనందాన్ని వెతుక్కునే దారుణమైన మానసిక స్థితి కూడా పెరిగింది. దీనికి బాల్యంలో వీడియోగేమ్‌ల రూపంలో బీజాలు పడుతున్నాయి. ఒకటి– ఒకటి కలుస్తూ సమస్య పెనుభూతంలా విస్తరిస్తోంది. తరం మారిన వైనం ఒక్కసారి వెనక్కి చూసుకుంటే... గడచిన తరాలు పాటించిన పేరెంటింగ్ వాల్యూస్ పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలో తల్లిదండ్రులు కచ్చితంగా చెప్పేవారు. పిల్లల్ని పై చదువులకు బయటకు పంపించేటప్పుడు ‘గౌరవానికి భంగం కలిగే పనులకు పాల్పడవద్దు’ అని హితవు చెప్పేవారు. ‘మీరు తప్పు చేస్తే మేము తలవంచుకోవాల్సి వస్తుంద’ని పిల్లలకు బాధ్యత గుర్తు చేసేవాళ్లు. ఆడపిల్లల విషయంలో ఎంత హుందాగా వ్యవహరించాలో చెప్పేవాళ్లు. ఇప్పుడు పిల్లల్లో షేరింగే కాదు, తోటి వారి పట్ల కేరింగ్, సర్దుబాటు కూడా కొరవడింది. తాము కోరుకున్నది, కోరుకున్న క్షణంలోనే అందాలి. ‘నేను, నా ఎంజాయ్మెంట్’ అనే సెల్ఫ్ సెంట్రిక్ ధోరణి ఎక్కువవుతోంది. టీనేజ్ పిల్లల్లో, యువతలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి, జరుగుతున్న నేరాలకు ఇవన్నీ తెరవెనుక కారణాలే. త్రిబుల్ రైడింగ్లోనో, హెల్మెట్ లేదనే కారణంతోనో పోలీసు ఆపితే తండ్రి పేరు చెప్పడానికి భయపడేది గత తరం. తండ్రికి తెలిస్తే కోప్పడతారనే భయం అది. ఇప్పుడు ‘నన్నే ఆపుతావా! మా నాన్న ఎవరో తెలుసా?’ అని ఓ టీనేజ్ కుర్రాడు పోలీసు మీద హుంకరించాడంటే తప్పు పట్టాల్సింది ఎవరిని? ఎవరినో తప్పు పట్టడం కాదు, ఆత్మ పరిశీలన, ప్రక్షాళన ఇంటి నుంచే మొదలుకావాలి. ఒంటరిగా వదలవద్దు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. పైగా చాలా కుటుంబాలు ఒన్ ఫ్యామిలీ– ఒన్ కిడ్ పాలసీనే అనుసరిస్తున్నాయి. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిన ఇళ్లలో పిల్లలు ఒంటరిగా గడిపే సమయం పెరుగుతోంది. ఇది డిజిటల్ ఎరా, ప్రపంచం అరచేతిలోనే ఉంటోంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ వయసు పిల్లలు చూడకూడనివెన్నో చూస్తారు. స్నేహితులను ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అవసరానికి మించిన ప్రైవసీ కూడా ప్రమాదమే. ఒక సంఘటనను లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఇలాంటి అసలు నిజాలెన్నో. ఒక దారుణం జరిగిందంటే ఆ నాలుగైదు రోజులు చర్చించుకుని ఆ తర్వాత మర్చిపోవడం సహజం. కానీ అలాంటి దుష్ప్రభావాలకు లోనుకాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. – వాకా మంజులారెడ్డి -
విద్యార్ధులకు నైతికత నేర్పిద్దాం : కేసీఆర్
మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. – కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలషించారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. మాజీ డీజీపీ హెచ్.జె. దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. పుస్తక రచయితను, ప్రచురణకర్తలను సీఎం సన్మానించారు. దొరను మనసారా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.నందన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దొర గురువు ఆచార్య ఆర్వీఆర్ చంద్రశేఖర్‌రావు, ప్రముఖ పాత్రికేయులు ఐ.వెంకట్రావు, దొర స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రాన్ని ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దాలి... దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగు తోంది. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతు న్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకు అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలి. మాజీ డీజీపీలతో కమిటీ వేస్తాం. జీయర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటాం. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలి. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా ... మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు. సామాజిక రుగ్మతలపైనా పోలీసుల పోరు... డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలను తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణకే పరిమతం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా నిరోధం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో ఎంతో కృషి చేశారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు వారి వంతు పాత్ర పోషించాలి. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతోంది. అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలి. చదువుకోని వారందరినీ అక్షరాస్యులగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇది మంచి పుస్తకం... హెచ్‌జే దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్ వర్క్‌తో విజయాలు ఎలా సాధించవచ్చో, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మంగా ఎలా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో, ఉన్న వనరులతో ఎంత సమర్థంగా పనిచేయవచ్చో దొర అనుభవం ద్వారా నేర్పారు. పుస్తకంలో కూడా అనేక విషయాలు చెప్పారు. వాటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని పోలీసు అధికారులు ముందుకు సాగాలి. మానవ జీవితంలో మార్పులు అనివార్యం. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా మారుతూ కార్యాలు నెరవేర్చాలి. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలి. వారిలో ప్రొఫెషనలిజం పెరగాలి. దీనికి అవసరమైన చర్యలు డీజీపీ తీసుకోవాలి. మనమెవరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శంగా నిలబడ్డాం అనేది ముఖ్యం. దొర అలాంటి వారిలో ఒకరు. గ్రేహౌండ్స్‌ను తీర్చిదిద్ది ఇప్పటికీ అందులో శిక్షణ ఇస్తున్న భాటి లాంటి వారు ఆదర్శప్రాయులు. ప్రవీణ్ కుమార్‌కు సంపూర్ణ మద్దతు.. దేశంలో మనం ఏ ఊరికి వెళ్లి వెతికినా దళితులే పేదలుగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. దళితులు ఎదగాలి. తెలంగాణలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారు. దళితులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనే ప్రవీణ్ సంకల్పానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. దళితుల్లో న్యూనతాభావాన్ని తీసేసి తాము గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామనే భావన కల్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాలి. పోలీసులు నిస్సహాయులు కాదు: దొర పోలీసులు నిస్సహాయులనే భావనకు లోనుకావద్దని, ఉన్న వనరులను సమర్థంగా వాడుకోవాలని హెచ్‌జే దొర సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపదగా మిగులుతాయన్నారు. భవిష్యత్తులో చాలా మంది మేటి విద్యార్ధులు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎంచుకున్న శాంతియుత పంథా వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. 1969 ఉద్యమం హింసాత్మకం కావడం వల్లే విజయవంతం కాలేదన్నారు. తెలంగాణలో పోలీసు శాఖకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనివల్ల శాంతిభద్రతల పర్యవేక్షణ సులభమైందని చెప్పారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశంలో తెలంగాణ పోలీసలు అందుకున్న అవార్డులు ఎవరూ అందుకోలేదని మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్‌రావు కితాబిచ్చారు. ప్రభుత్వం పోలీసు శాఖకు తగినన్ని నిధులు సమకూరుస్తూ పోలీసు శాఖను ఆధునీకరించిందని ప్రశంసించారు. సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మాట్లాడుతూ కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ పోలీసులు అద్భుత విజయాలు సాధించారన్నారు. పూర్వ అధికారుల నుంచి ఎంతో నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు పెను మార్పులు తీసుకురావడం సాధ్యమవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. -
‘నైతిక విలువలే ప్రధానం’
పాత శ్రీకాకుళం: ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత పవిత్రమైనదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపనిష్మందిరం కార్యదర్శి నిష్టల నరసింహమూర్తి అన్నారు. మండలంలోని మునసబుపేటలో గల గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ తెలుగువిభాగం సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరై వివేకానందుని జీవితంపై ప్రసంగించారు. విద్యార్థులు చక్కని నైతిక సంస్కారాలను నేర్చుకొని మంచి భవిష్యత్ రూపొందించుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు విభాగానికి చెందిన భమిటిపాటి గౌరీశంకర్, మధుసూధనరావు, అప్పలనాయుడు, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు. -
నైతిక విలువలు నేర్పని విద్య వృథా
విజయవాడ,న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా బోధన ఉండాలని, నైతిక విలువలు నేర్పని విద్య వృథా అని రాష్ర్ట మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. విజయవాడ గుణదల బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాలలో మూడురోజు పాటు జరిగే 41వ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్ర స్థాయి విద్యావైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన(సైన్స్ ఫెయిర్) ఆదివారం మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో మంత్రి ముఖాముఖి మాట్లాడారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో దాదాపు 400 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. 23 జిల్లాల నుంచి 800 మంది విద్యార్థులు, 400 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన కొన్ని ఎగ్జిబిట్లు అందరినీ ఆలోచింపజేశాయి. విద్యుత్ ఉత్పత్తిని నిలువ చేయడం, గృహోపకరణాలను షార్ట్ సర్క్యూట్ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడే మోడ్రన్ ఇన్వెన్షన్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మద్యం తాగి వాహనాలు నడిపేందుకు ప్రయత్నిస్తే సెల్ఫ్‌లాక్ అయ్యే ఇగ్నేషన్ ఇంటర్ లాక్ డివైజ్.. భవన నిర్మాణ సమయంలో అధిక బరువులను సునాయాసంగా ఎత్తేందుకు ఉపయోగపడే హైడ్రాలిక్ ఎక్సావేటర్.. వ్యర్థాల నుంచి పెట్రోలు తయారుచేసే క్లీన్ బర్నింగ్ బయో ఫ్యూయల్ ఫౌడర్ ఫ్రం వేస్ట్ బయోమాస్ నమూనాలు ఆకట్టుకున్నాయి. పంటలను నాశనం చేసే పురుగులను నివారించేందుకు బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్.. కంప్యూటర్ విధానం ద్వారా పంట పొలాలకు రక్షణ కల్పించే హైటెక్ ఫార్మింగ్.. ఉప్పునీరు, థోరియం రియాక్టర్ల ద్వారా విద్యుత్ తయారు చేసే ఎలక్ట్రిసిటీ ఇన్ ఫ్యూచర్ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి సభకు అధ్యక్షత వహించారు. సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ జి.గోపాలరెడ్డి, పాఠశాలవిద్య ఆర్జేడీ ఎంఆర్ ప్రసన్న కుమార్, డీఈవో దేవానందరెడ్డి, బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.మెలకియార్, కరస్పాండెంట్ పాదర్ జోసెఫ్ వెంపనీ, ఉప విద్యాశాఖాధికారులు ప్రభాకర్,జి.వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఎంవీ కృష్ణారెడ్డి, ఎం.జార్జిరాజ్ పాల్గొన్నారు. -
అతడు, ఆమె.. ఓ లవర్!
సమాజంలో పతనమవుతున్న నైతిక విలువలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. నీతిబాహ్య సంబంధాలు నవనాగరిక మానవుడికి పరీక్ష పెడుతున్నాయి. విచ్చలవిడి అనైతిక సంబంధాలు వివాహ వ్యవస్థ పవిత్రతను మంటగలుపుతున్నాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న విలువల క్షయం అభిమాన ధనుల పాలిట శరాఘాతంగా మారుతోంది. సున్నిత మనస్కులను బలి కోరుతోంది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మరొకరితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక ఓ అమాయక భర్త తన ప్రాణాలు తీసుకున్నాడు. కట్టుకున్న దాన్ని తన దగ్గరికి చేర్చాలని వేడుకున్నా ఖాకీలు కనికరించకపోవడంతో తానే కడతేరిపోయాడు. తనకు జరిగిన అవమానం తట్టుకోలేక ఉరిపోసుకుని ఆయువు తీసుకున్నాడు. తన చావుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలుపుతూ 18 నిమిషాల నిడివివున్నవీడియాను సెల్‌ఫోన్‌తో రికార్డు చేశాడు. 'సూసైడ్ నోట్'గా వీడియోను వినియోగించడం ఇదే మొదటిసారి భావిస్తున్నారు. సెంట్రల్ ముంబైలోని అగ్రిపడా ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల డ్రైవర్ సునీల్ అగ్డీ మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను తీసిన వీడియో చూడాలని చిన్న కాగితంపై మరాఠీలో రాసి చనిపోయాడు. తన భార్య అనురాధ, ఆమె ప్రియుడు అబ్దుల్ వహబ్ అలియాస్ ఛోటు కారణమని అందులో పేర్కొన్నాడు. ప్రియుడితో లేచిపోయిన తన భార్యను తిరిగి తీసుకురావాలని అగ్రిపడా సబ్-ఇన్స్పెక్టర్ అజిత్ కదం కోరనుగా తనను హేళన చేశాడని, చర్యలేమీ తీసుకోలేదని తెలిపాడు. తనకు చావు తప్ప మరోసారి కనిపించలేదని వీడియాలో సునీల్ వాపోయాడు. సీనియర్ పోలీసు అధికారులు ఈ వీడియో చూసి న్యాయం చెప్పాలని వేడుకున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. సునీల్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అనురాధ, ఛోటును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు పురిగొల్పడం, నేరానికి పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు తరలించారు. తన కోడలు పెడదారి పట్టడడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సునీల్ తల్లి వాపోయింది. ఛోటుతో అనురాధ ఏడేళ్లుగా సంబంధం కొనసాగిస్తోందని అతడి భార్య హీరా తెలిపింది.మొత్తానికి వివాహేతర బంధం రెండు కుటుంబాలను క్షోభ పెట్టింది. -
నైతికతపై సివిల్స్‌లో కొత్త పరీక్ష
న్యూఢిల్లీ: పరిపాలనలో కీలకపాత్ర పోషించే ఉన్నతాధికారులకు నైతిక విలువలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మార్పులు చేసింది. ఈ ఏడాది కొత్తగా ‘నైతిక విలువలు, నిజాయితీ, అభిరుచి’ సిలబస్‌పై 250 మార్కులకు కొత్త పరీక్ష ప్రవేశపెట్టింది. అభ్యర్థుల సౌకర్యార్థం దీనికి సంబంధించిన నమూనా పేపర్‌ను యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.