Health Director
-
గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?
కొత్తగూడెం బీఆర్ఏస్ ఎమ్మెల్యే టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించి భంగపాటే మిగిలింది. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన వర్క్ అవుట్ కాలేదన్న భావనలో ఉన్నారు గడల. ఎమ్మెల్యే చాన్స్ చేజారడటంతో గడల సైలెంట్ అయిపోతారా? లేక వేరే దారి చూసుకుంటారా? గడల పొలిటికల్ రూట్ మ్యాప్ ఏవిధంగా ఉండబోతుంది? ఒక్కరోజు ముందు కూడా హడావిడి బీఆర్ఏస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు నిరాశే మిగిలింది. టికెట్‌పై ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ దీవెనెలు సైతం తనకే ఉంటాయన్నారు. బీఆర్ఏస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడ కొత్తగూడెంలో హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం నినాదంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో పాదయాత్ర ప్రారంభించారు. రాజకీయం అంటేనే సేవ.. కట్ చేస్తే! 23 వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి జీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులతో కలిసి గడప గడపకి పాదయాత్ర చేపట్టారు. గడప గడపకు వెళ్తూ అడపడుచులకు పసుపు-కుంకుమ, గాజులు, కరపత్రంతో కలిగిన ప్యాకెట్ ఇస్తూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై డాక్టర్ గడల శ్రీనివాస రావు స్పందిస్తూ రాజకీయం అంటేనే సేవ అని, కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఇంటింటికీ పాదయాత్ర భారీ ఆర్భాటంతో చేపట్టడంతో అధికార బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలోనూ పెద్ద చర్చకే దారి తీసింది. సీన్ కట్ చేస్తే.. హెల్త్ డైరెక్టర్‌గానే కొనసాగుతారా? లేక మరుసటి రోజే బీఆర్ఏస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో కొత్తగూడెం టికెట్ సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావుకే దక్కింది. దీంతో గడల ఆశలు గల్లంతై పోయాయని కొత్తగూడెం నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుంది. టికెట్ దక్కకపోవడంతో గడల కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తుంది. హెల్త్ డైరెక్టర్ గానే కోనసాగుతారా? లేక వేరే దారి చూసుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. చదవండి: కరీంనగర్: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా వేరే పార్టీలోకి! ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంటే.. హెల్త్ డైరెక్టర్ పదవి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సైలెంట్‌గా ఉండే వచ్చేసారి ఏమైనా గుర్తించండి అని కేసీఆర్ నుంచి హమీ తీసుకొని తన పని చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు సొంత ప్రాంతమైన కొత్తగూడెంలో కొన్ని నెలలుగా జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం వికెండ్‌లో మాత్రమే ఉంటాయి. అయితే గడల వ్యవహరంపై గతంలో ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో పైర్ అయ్యాయి. హెల్త్ డైరెక్టర్‌గా ఉండి రాజకీయాలు చేయడం ఏంతవరకు సబబని నిలదిశాయి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం గడల పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటు వెళ్లారు. చేయాల్సిన ప్రయత్నాలు చేసినా.. చివరికి భంగపాటే జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో గడల కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి అనేక వివాదాలు గడల చుట్టు తిరుగుతూ వచ్చాయి. ఓ ఏంపీపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడం, అనేక కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దూమారమే రేపాయి. అంతేకాదు ప్రగతి భవన్లో నిమిషం వ్యవధిలో రెండు సార్లు సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల్లోనే ఉంటు వచ్చారు గడల.. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగూడెం టికెట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినా చివరకు భంగపాటే మిగిలిందన్న భావనలో ఉన్నారు గడల శ్రీనివాస్ రావు.. మరి హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. -
కొత్తగూడెం నుంచే పోటీ.. హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం క్లబ్లో డాక్టర్ జీఆర్ఎస్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన వారిని ఉద్ధేశిస్తూ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశిస్తే ప్రజల కోరిక మేరకు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొంది కొత్తగూడెం వాసులు కోరుకున్నది నెరవేరుస్తానని అన్నారు. డీహెచ్‌కు ముషీరాబాద్ సీటు ఖరారైందని వస్తున్న వార్తలు అవాస్తవమని, కొంతమంది కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోటీచేస్తే కొత్తగూడెంలోనే పోటీ చేస్తానని లేకపోతే లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎస్ఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇక్కడే పుట్టిన నేను ఈ గడ్డమీదే చనిపోతానని, ఇక్కడే నా ఆఖరి మజిలీ అని అన్నారు. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ ఇంకా ఏడేళ్లు సర్వీస్ ఉన్నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వస్తున్నా. కానీ ఆస్తులు పోగేసుకోవడానికో, కీర్తులు గడించడానికో రావట్లేదు.. నాకు ఒక కూతురు మాత్రమే ఉంది. ఇప్పుడు తన భాద్యత కూడా తీరిపోయింది ఇక మిగిలింది నా కొత్తగూడెం కుటుంబం బాధ్యత మాత్రమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ కేటగిరి ఉన్నది కేవలం మూడు స్థానాలే. వాటిలో ఒక స్థానం ఒక వర్గం, మరొక స్థానం మరొక వర్గం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే పుట్టిన, ఇక్కడే చనిపోతా.. కొత్తగూడెంపై ఇక మిగిలిన కొత్తగూడెం నియోజకవర్గం బీసీల అడ్డా. ఇక్కడైనా బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే కేటాయించాలి. నా గురించి ఎందరో ఎన్నో మాటలను మాట్లాడుతున్నారు. శనివారం వస్తారు, సోమవారం వెళ్తారని అంటున్నారు. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా. హైదరాబాద్ వెళ్ళేది కేవలం శరీరం మాత్రమమే.. నా మనసు ఇక్కడే మీ చుట్టూ ఉంటుంది. నాకు మిగిలిన ఈ జీవితం నా జన్మ భూమి అయిన కొత్తగూడెంనకు మాత్రమే’నని వ్యాఖ్యానించారు. -
టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే స్థానం కోసం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఈ సారి టికెట్టు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ట్రస్టు ద్వారా సేవలు చేస్తూ అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నా జీవితం.. ప్రాణం కొత్తగూడెం ప్రజల కోసమేనని చెబుతూ అందరి మనసులను గెలుచుకునే పనిలో పడ్డారు. కన్న తల్లిని.. పుట్టిన భూమిని మర్చిపోకూడదనే ఇక్కడ సేవ చేయడానికి వచ్చానని చెప్పారు. రావణాసురుడి పాలన.. రాష్ట్రమంతా రామరాజ్యం నడుస్తుంటే కొత్తగూడెంలో మాత్రం ఓ రావణాసురుడు పాలిస్తున్నాడని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడి ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని నడిపిస్తున్నాడని దుయ్యబట్టారు. కొత్తగూడెం ప్రాంత ప్రజలకు ఇకపై తాను కాపలా కాస్తానని చెప్పారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న తనను కావాలని ఇబ్బంది పెడితే తానేంటో కూడా చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నో సేవలు చేశా.. కొత్తగూడెం ప్రాంతంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాని శ్రీనివాసరావు చెప్పారు. మెగా హెల్త్ క్యామ్ప్ లు పెట్టి సుమారు 200 మందికి నాలుగు కోట్ల రూపాయల విలువైన వైద్యాన్ని అందించామని అన్నారు. 8వేల మంది నిరుద్యోగులకు జాబ్ మేళా లు నిర్వహించి 4 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు శ్రామిక శక్తి అవార్డులు బహుకరించి గౌరవించుకున్నామని స్పష్టం చేశారు. వందలాదిమంది నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉచిత కోచింగ్ ఇప్పించి భోజనాలు పెట్టించామని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశామని చెప్పారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫర, ఆరో ఓ ప్లాంట్ లను ఏర్పాటు చేసి మంచినీటిని అందించామని చెప్పారు. అభిమానాన్ని తొలగించగలరా? పుట్టిన రోజు సందర్భంగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి పర్యటన సందర్భంగా మా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కావాలని తొలగించారని ఆరోపించారు. తమ ట్రస్ట్ ద్వారా లబ్ది పొందిన వ్యక్తి చేతే ఫ్లెక్సీ తొలగించారు కానీ అతని గుండెల్లో తనపై ఉన్న అభిమానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసి మొదటి మెడికల్ కాలేజ్ ను సాంక్షన్ చేయించానని చెప్పారు. ఏసీ కారు, బంగ్లా, మంచి పొజీషన్ వదిలి ఇక్కడకు వచ్చి సేవ చేస్తున్నానని అన్నారు. ఇదీ చదవండి: క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్‌లో అడుగు పెట్టాలి: కేటీఆర్ -
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రూటే సపరేటు.. కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి రావడం, తమదైన తీరులో ముద్ర వేయడం కొత్తేమీ కాదు. గతంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు పాలిటిక్స్‌లో సత్తాచాటారు. వారిలో కొంతమంది రాజకీయాలు తమకు సరిపోవని తూర్పు తిరిగి దండంపెట్టి గుడ్ బై చెప్పారు. అయితే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఆ తర్వాతనే రాజకీయాల్లో మునిగి తేలారు. వారు పద్ధతి ప్రకారం నడుచుకుంటే తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. శ్రీనివాస్ రూటే సపరేటు ఈయన పేరు గడల శ్రీనివాసరావు.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్. కరోనా మహమ్మారి సమయంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియజేస్తూ టీవీల్లో కనిపించేవారు. అలా ప్రజలకు పరిచయమైన ఈయన ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనల కారణంగా తరచుగా వార్తల్లో వుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి కానీ గడల శ్రీనివాసరావు రూటే సపరేటు. ఏ కాస్త అవకాశం దొరికినా సరే పొలిటీషియన్‌లాగా వ్యవహరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. రాజకీయాలకే ఎక్కవ టైం ఉన్నత అధికారిగా నిర్వహించాల్సిన సేవలకు కాకుండా రాజకీయాలకే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ప్రజాప్రతినిధిగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలనే కోరిక గడల శ్రీనివాసరావుకు బలంగా వున్నట్లుంది. అందుకేనేమో ఆయన హెల్త్ డైరెక్టర్ విధులను మర్చిపోయి కొత్తగూడెంనకు మాత్రమే పరిమితం అయ్యారన్న చర్చ నడుస్తోంది. చదవండి: ‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్ టార్గెట్ వనమా! వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి తీరతానంటూ ఇప్పటికే పలుమార్లు ఆయన తన మనసులో మాట వెలిబుచ్చారు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం ఉల్వనూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వనమాకు 80 ఏళ్ళు వచ్చాయి. ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయమని.. ఇంకా ఎంతకాలం ఆయన రాజీకాయల్లో ఉంటారంటూ గడల శ్రీనివాసరావు సెటైర్లు విసిరారు. వేడేక్కిన రాజకీయం అంతటితో ఆగకుండా నేను అభివృద్ధి చేయడానికి వస్తే అడ్డుకుంటారా అంటూ ఆవేదన చెందారు. కొత్త కొత్తగూడెంను చూద్దాం. కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందాం అని ప్రజలకు పిలుపు నిచ్చారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా అని కార్యక్రమానికి వచ్చినవారిని అడగడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థాయికి సరిపోని వ్యాఖ్యలు, విమర్శలు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గడల శ్రీనివాసరావుకు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. ఆయన పలుమార్లు తన స్థాయికి సరిపోని వ్యాఖ్యలు, విమర్శలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి ఆయన ఈ రకంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అనేది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ వుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అంతే తప్ప అధికారిగా ఉంటూ రాజకీయాలు చేయడం ఏంటన్న చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతోంది. చదవండి: వీరి సంగతేంటి?.. బీజేపీకి పెద్ద దెబ్బే పడుతుందా? -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు. కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య -
తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు..
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్ చేశారు. -
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస రావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
ఎన్నిసార్లయినా కేసీఆర్ పాదాలకు నమస్కరిస్తా : డీహెచ్ శ్రీనివాసరావు
-
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని సమర్థించుకున్నారు. ఒక్కసారి కాదు వందసార్లు బరాబర్ మొక్కుతానని అన్నారు. ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వక్తిని ఎలా బలహీన పరచాలి? ఎలా దూరంచేయాలి? అనే కుట్రలు చేస్తున్నారంటూ ఆయనను నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమిషం వ్యవధిలోనే డీహెచ్ రెండు సార్లు కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: (కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా!) -
పొలిటికల్ కారిడార్: హెల్త్ డైరెక్టర్ తీరుపై అధికారవర్గాల్లో చర్చ..
-
కొత్త వివాదంలో హెల్త్ డైరెక్టర్.. బతుకమ్మ ముందు డీజే టిల్లు పాటకు స్టెప్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాపరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఓ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పులేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ సంసృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు డ్యాన్సు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీనివాసరావు డ్యాన్స్ వ్యవమారం తాజాగా చర్చనీయంశంగా మారింది. కాగా హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
డీజే టిల్లు సాంగ్‌కు స్టెప్పులేసిన హెల్త్ డైరెక్టర్
-
తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈనెల 25 మృతుల బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు ఇబ్రహీంపట్నం- సాగర్ హైవేపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్) -
నెలన్నర కీలకం.. అప్పటివరకు కరోనా కేసుల్లో పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఈ సమయంలోనే 66 శాతం కేసులు పెరిగాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. నెల నుంచి నెలన్నరపాటు కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటుందని హెచ్చరించారు. అప్పటివరకు ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో పెరుగుదల మహారాష్ట్రలో 145 శాతం, ఏపీలో 111 శాతం, కేరళలో 77 శాతం ఉందన్నారు. తెలంగాణలో గత వారంలో 355 కేసులు నమోదైతే, ఈ వారంలో 555 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 55 శాతం పెరుగుదల ఉందన్నారు. శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘దేశంలో పాజిటివిటీ రేటు 1.4 శాతం ఉండగా, తెలంగాణలో దాదాపు ఒక శాతానికి చేరుకుంది. క్రియాశీలక కేసులు పెరిగాయి. కరోనా కేసులు పెరుగు తున్నా ఆసుపత్రుల్లో రెండు మూడు కేసులు మాత్రమే ఉన్నాయి. రెండు నెలలుగా కరోనా మరణాలు సంభవించలేదు. కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరగడం వల్ల ప్రజల్లో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్‌లోని సబ్ వేరియంట్ అయిన బీఏ.2 కేసులు 66 శాతం నమోదయ్యాయి. కొత్త వేరియంట్లు పుట్టలేదు కాబట్టి నాలుగో వేవ్ రాదని చెబుతున్నాం’ అని చెప్పారు. కరోనా ఇంకా అంతం కాలేదని, ఆరు నెలల నుంచి ఏడాది వరకు అప్పుడప్పుడు కేసుల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. తర్వాత అది ఎండెమిక్ (వైరస్ వ్యాప్తి తగ్గే) దశకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష ప్రస్తుతం వర్షాకాల సీజన్ ప్రారంభం అవుతోం దని, సీజనల్ వ్యాధులు వస్తుంటాయని శ్రీనివా సరావు చెప్పారు. దాంతోపాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణ ఫ్లూలో గొంతులో గరగర, ముక్కుకారటం వంటివి ఉంటాయని, కోవిడ్‌లో అవే లక్షణాలతో జ్వరం, పొడిదగ్గు ఉంటా యన్నారు. కరోనాలో ఈ లక్షణా లు ఐదు రోజుల వరకు ఉంటాయని, అను మానముంటే ప్రజలు తక్షణమే పరీక్షలు చేయించు కోవాలని కోరారు. కరోనా నుంచి బయటపడా లంటే మాస్క్ తప్పనిసరని, అలాగే వ్యాక్సిన్ కూడా తీసుకోవాలన్నారు. ఈ నెల 3 నుంచి ఇంటింటికీ కరోనా టీకా వేస్తున్నామన్నారు. త్వరలో పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని, 12–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. అందుకోసం విద్యా సంస్థల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేస్తామ న్నారు. ఆన్లైన్ తరగతులు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు బూస్టర్ డోస్ వేస్తామన్నారు. ‘పిల్లల వ్యాక్సిన్లలో లక్షల్లో ఎక్కడో ఒక రియాక్షన్ వచ్చిందన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేకుండా టీకా వేయించాలి. 12 ఏళ్లలోపు వారికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువ. వారికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. రాబోయే రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతాం. నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం. జీహెచ్ఎంసీలో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ క్రియాశీలక కేసులు ఎక్కువగా ఉన్నాయి. కేసులు ఎక్కువైతే మాస్క్‌లు పెట్టుకోనివారికి జరిమానాలు విధిస్తారు’ అని చెప్పారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల నుంచి రెండు శాతం శాంపిళ్లు తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తున్నామన్నారు. ఇటీవల 527 శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా, అందులో 65 శాతం బీఏ.2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నమోదైందన్నారు. ఈసారి డెంగీ దడ 2019లో రాష్ట్రంలో డెంగీ కేసులు అధికమొత్తంలో నమోదు అయ్యాయని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోందని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నా యన్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 158 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఏప్రిల్, మే నెలల్లోనే వంద కేసులు రికార్డు అయ్యాయన్నారు. మురికి వాడల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడ 150 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 10 వేల మంది శాంపిళ్లకు డెంగీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. జిల్లాల్లో పెద్దగా డెంగీ ప్రభావం లేదన్నారు. పగటి దోమ వల్ల డెంగీ కేసులు పెరుగుతాయని, కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి డెంగీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. హైదరాబాద్‌లో చెరువులు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్నందున దోమలు వృద్ధి చెందాయని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, వాటిల్లో 15 భవనాలను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. చదవండి: ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు! -
‘నాలుగో వేవ్ చాన్స్ తక్కువే’
‘‘రాష్ట్రంలో 92.9% మందిలో యాంటీబాడీలు ఇప్పటికే వృద్ధిచెంది ఉన్నాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. నాలుగో వేవ్ ఉండే అవకాశాలు లేవనేది నా విశ్లేషణ. అయితే ఇది నిర్ధారణ అవడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఒకవేళ 6– 8 వారాల్లో కేసులు పెరిగినా.. అవి అతి స్వల్పంగానే ఉండే అవకాశాలు ఎక్కువ. ఆందోళన అవసరం లేదు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది..’’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో 92.9% మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని.. అందువల్ల కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశం తక్కువేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా దాని ప్రభావం స్వల్పమేనని.. కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ సాధారణ జలుబు మాదిరే ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గత జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించారు. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.2 శాతం మందిలో.. అత్యధికంగా హైదరాబాద్‌లో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు సర్వేలో తేలింది. ఒకడోసు తీసుకున్న 91.4 శాతం మందిలో, రెండు డోసులు తీసుకున్న 96 శాతం మందిలో.. అసలు వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా 77 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ’’ అని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కులు, వ్యాక్సిన్ తప్పనిసరి కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదైందని.. దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా సాధారణఫ్లూ దశకు చేరుకుంటుందని తెలిపారు. అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, మాస్కు పెట్టుకోవడం, టీకాలను తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఆంక్షలు అవసరం లేదని.. యధావిధిగా శుభకార్యాలు, ఇతర వేడుకలు జరుపుకోవచ్చని, కానీ గుంపుగా ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14 శాతమేనని.. రోజూవారీ కేసుల సంఖ్య 20–25 మధ్య నమోదవుతోందని చెప్పారు. మే నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలు, దూరప్రయాణాలు చేస్తుంటారని.. ఆ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. 18–59 ఏళ్ల మధ్య వారికి ఉచితంగా బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. -
మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉన్నా.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం కరోనా సమాచారం గురించి పలు జాగ్రత్తలను మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారాయన. అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. ఆరువారాలుగా కరోనా వైరస్ అదుపులోనే ఉంది. రోజూ 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపారాయన. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫోర్త్‌వేవ్‌పై అనేక సందేహాలున్నాయి. దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్ లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 1శాతం కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 0.5 మాత్రమే ఉంది. ఫోర్త్ వేవ్ రాబోదని ఎన్ఐఎం సీరో సర్వేలాంటివి చెప్తున్నాయి. 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సీరో సర్వేల్లో వెల్లడైంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అలాగని కరోనా భయం పూర్తిగా తొలగిపోలేదు. రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉన్నాయి. ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్లు, ప్రయాణాల్లో ప్రజలందరూ మాస్క్ లు ధరించాలి. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచిస్తున్నాం అని తెలిపారు డీహెచ్. చదవండి: భారత్‌లో వరుసగా రెండో రోజు కేసుల్లో పెరుగుదల -
హెల్త్ డైరెక్టర్ పూజ వివాదాస్పదం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సుజాత నగర్/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం పాత అంజనాపురం పంచాయతీ పరిధిలోని చిమ్నతండాలో నిర్వహించిన ప్రత్యంగిర పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు పాల్గొనడం వివాదాస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి.. లంబాడీల కులదైవం ప్రత్యంగిర అమ్మవారి భక్తురాలు. భర్త శ్రీరాం, కుటుంబసభ్యులతో కలిసి గత రెండేళ్లుగా తమ ఇంటివద్ద ప్రతిరోజూ హోమాలు, ప్రతి శుక్రవారం గోపూజ, మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 మధ్య రాహుకేతు పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిదిగా భావించే ముక్కుపుడక, మెడలో పూలదండ ధరించి ‘ప్రత్యంగిర.. ప్రత్యంగిర.. ప్రత్యంగిర..’ మంత్రోచ్ఛారణతో నిత్యం గంట పాటు హోమం చేస్తున్నారు. అయితే హోమగుండంలో ఎండుమిర్చి వేస్తే ఘాటు రావడం లేదని, ఇది ప్రత్యంగిర అమ్మవారి మహిమ అని స్థానికులు చెప్పుకుంటున్నారు. అనేక మంది భక్తులు వచ్చి ఆ పూజలో పాల్గొంటున్నారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు తదితర ప్రజాప్రతినిధులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 5న జిల్లా పర్యటనలో ఉన్న శ్రీనివాసరావు ఈ పూజలో పాల్గొనడంతో విజయలక్ష్మి నిర్వహించే ప్రత్యంగిర పూజ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. కుమారుడి గుండె జబ్బు తగ్గిపోయిందని.. స్థానికుల కథనం ప్రకారం.. విజయలక్ష్మి, శ్రీరాం దంపతులకు సుమంత్, 18 ఏళ్ల చరణ్ కుమారులు. మూడేళ్ల క్రితం చరణ్ గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న ప్రత్యంగిర అమ్మవారిని దర్శించుకున్న ఆ కుటుంబం తమ కులదైవానికి మొక్కుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ లేకుండానే చరణ్ గుండె జబ్బు తగ్గిపోయిందని, మందులూ వాడనవసరం లేదని వైద్యు లు చెప్పారని, ఇదంతా తమ కులదైవమే చేసిందని ఆ కుటుంబం నమ్మింది. రెండేళ్ల నుండి చిమ్నతండాలో తమ ఇంటి వద్ద పూజలు ప్రారంభించింది. ఆహ్వానం మేరకే డీహెచ్ హాజరు! జిల్లాకు చెందిన డీహెచ్ శ్రీనివాసరావు ఇటీవల మరణించిన తన తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నెల 24న పాల్వంచలోనూ ఈ తరహా శిబిరం నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన, నిరుపేద విద్యార్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈనెల 5న జిల్లా కేంద్రానికి వచ్చారు. మధ్యా హ్నం 2:30 గంటలకు సుజాతనగర్ వెళ్లిన డీహెచ్ మెడలో పూలమాల వేసుకుని అక్కడ విజయలక్ష్మి నిర్వహించిన ప్రత్యంగిర పూజలో పాల్గొన్నారు. ఆయన్ను తానే ఆహ్వానించానని, తాను చేస్తున్నవి క్షుద్ర పూజలు కావని ఆమె ‘సాక్షి’కి చెప్పారు. ప్రశాంతత కోసమే గ్రామానికి.. తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్వయం ప్రకటిత దేవతతో తనకు సంబంధం లేదని, మూఢ నమ్మకాలను తాను విశ్వసించనని వివరించారు. తన తండ్రి స్ఫూర్తితో జీఎస్సాఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామాజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం సెలవుల్లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రజారోగ్య సంచాలకునిగా ఉన్న తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏం ఉందన్నారు. మెగా హెల్త్‌క్యాంపు ఏర్పాట్లలో భాగంలోనే గత కొంత కాలంగా కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. -
ఖమ్మం ‘చంద్రముఖి’ నిజ స్వరూపం: అప్పుడు.. ఇప్పుడు
సాక్షి, హైదరాబాద్: సామాన్య జనాలకు మూఢ నమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన వ్యక్తే.. ఓ దేవతా అవతారం ఎత్తిన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చర్చాంశనీయంగా మారింది. ఆయనే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అంతేకాదు ఆమె ఆశ్వీరాదం కోసం వంగి వంగి దండాలు పెడుతూ తాను కూడా మిరపకాయల పూజలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాతను దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అంటూ భక్తిని చాటుకున్నారు. విచిత్రమేమిటంటే.. తనతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బందిని కూడా తీసుకెళ్లి పూజలు చేయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చదవండి: వివాదంలో తెలంగాణ డీహెచ్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. అనేక వివాదాల్లో ఉన్న ఎంపీపీ దేవత అవతారం ఎత్తడం విచిత్రం. తను నడిచే నడక, చూపు, మాట అంతా అమ్మవారిలా కనిపించేలా తెగ కవర్ చేస్తూ భక్తులకు దర్శనమిచ్చింది. మరో విశేషమేమిటంటే.. ఎంపీపీ భర్త సింగరేణి ఉద్యోగి. ఆయన సైతం డ్యూటీకి వెళ్లకుండా పూజలో నిమగ్నమయ్యారు. పూజలు, హోమాలు, అన్నదానాల పేరుతో వీళ్లు చేసే దందా అంత ఇంత కాదు. భూత, భవిష్యత్, వర్తమానం గురించి చెప్తా అంటూ అమాయక ప్రజలను మోసం చేసే ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. -
ఒకే రోజు 10వేల కేసులు పెరిగాయి.. వచ్చే 2,3 వారాల్లో కేసులు పెరుగుతాయి
-
ఒమిక్రాన్.. వచ్చే 2,3 వారాలు అత్యంత కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా వ్యాప్తిస్తోంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోంది. తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులపై రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఆయన గురువారం మాట్లాడుతూ.. తెలంగాణలో త్వరలోనే ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్‌వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ ఉగ్రరూపం.. 1000కి చేరువలో కేసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ(263), మహారాష్ట్రలు(252) మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. తరువాత గుజరాత్, రాజస్థాన్, కేరళ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది. బుధవారం ఒక్క రోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్ -
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వీరు.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే. సోమాలియా, కెన్యా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు. వీరిలో ఇద్దరిని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందించనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.. మెహదీపట్నం, టోలీచౌక్ వీరిని గుర్తించి పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌గా తేలినట్లు డీహెచ్ పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన మరొక బాలుడి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయ్యిందన్నారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాలుడికి పరీక్షలు చేయగా ఒమిక్రాన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చేరవేశమన్నారు. ఒమిక్రాన్ సోకిన సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారనేది అవాస్తవమని డీహెచ్ తెలిపారు. గాలిద్వారా ఒమిక్రాన్ సోకే ప్రమాదముందని డీహెచ్ తెలిపారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్ సోకిన వారికి స్పల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని డీహెచ్ తెలిపారు. -
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
-
ప్రజలు ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్
-
భయాందోళన వద్దు: ఈనెలలోనే కరోనా తగ్గుద్ది
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్- 19 సంక్రమణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జూన్ నెలలో తగ్గుముఖం పట్టి ఊరట కలిగిస్తుందని, భయాందోళన చెందాల్సిన పనిలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో పాజిటివ్ రేటు బెంబేలెత్తించింది. 3 లక్షల 20 వేల 803 మందికి కోవిడ్ పాజిటివ్ నమోదైంది. 711 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. మే 22వ తేదీన ఒక్కరోజునే 12 వేల 852 మందికి పాజిటివ్ నమోదు కావడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. 4 వారాల తర్వాత లాక్డౌన్ ప్రభావం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా నమోదైన సుందరగడ్, నువాపడా, గజపతి, సుందరగడ్ జిల్లాల్లో తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల పాజిటివ్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. త్వరలో కోవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి త్వరలో కోవిషీల్డ్ టీకాలు సరఫరా కానున్నాయి. జూన్ నెల 3వ తేదీ నాటికి 3 లక్షల 5 వేల 460 మోతాదుల కోవిషీల్డ్ టీకాలు చేరుతాయి. ఈ విడత టీకాల్ని ప్రధానంగా 45 ఏళ్లు పైబడిన వారి కోసం వినియోగిస్తామని తెలిపారు. జూన్ 6వ తేదీ నాటికి మరో 40 వేల మోతాదుల కోవ్యాక్సిన్ టీకాలు రాష్ట్రానికి చేరుతాయని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా కొనసాగుతున్న రాష్ట్రంలోని 5 మునిసిపల్ కార్పొరేషన్లు, 6 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.