Telangana Omicron Variant Updates: Three Omicron Cases Detected In Hyderabad - Sakshi
Sakshi News home page

Omicron Cases In Telangana: తెలంగాణలో ఒమిక్రాన్‌ కలకలం

Published Wed, Dec 15 2021 11:12 AM | Last Updated on Wed, Dec 15 2021 9:33 PM

Three Omicron Cases Detected In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కలవరం మొదలైంది. ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు  అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ సోకిన వీరు.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే.

సోమాలియా, కెన్యా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ వచ్చినట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు. వీరిలో ఇద్దరిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందించనున్నట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.. మెహదీపట్నం, టోలీచౌక్‌ వీరిని గుర్తించి పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌గా తేలినట్లు డీహెచ్‌ పేర్కొన్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లిన మరొక బాలుడి కూడా ఒమిక్రాన్‌ నిర్దారణ అయ్యిందన్నారు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బాలుడికి పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చేరవేశమన్నారు.  ఒమిక్రాన్‌ సోకిన సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ వచ్చిన రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారనేది అవాస్తవమని డీహెచ్‌ తెలిపారు.

గాలిద్వారా ఒమిక్రాన్‌ సోకే ప్రమాదముందని డీహెచ్‌ తెలిపారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్‌ సోకిన వారికి స్పల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని డీహెచ్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement