Srinivas Rao
-
మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు తన తల్లి & భార్య గురించి...
-
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్‌తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్‌గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్‌కు లారీల కాంట్రా క్టర్‌గా, గన్నీ బ్యాగ్ సప్లయర్‌గా, కందిపప్పు సప్లయర్‌గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్‌లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్‌బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్‌గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్‌గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్‌వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు,జస్టిస్ రాజేశ్వర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్‌రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
చంద్రబాబును సీఎం చేయడానికే జనసేన పెట్టారు: వెల్లంపల్లి
-
టీడీపీలాంటి దరిద్రపుపార్టీలో ఇక ఉండలేను: కాపా శ్రీనివాసరావు
-
ప్రజల చెంతకే వైద్య సేవలు అందుతున్నాయి: ఎమ్మెల్యే శ్రీనివాసరావు
-
‘ఎమ్మెల్యే వనమాకు ఇంకా రాజకీయాలెందుకు?’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి వనమా వెంకటేశ్వర రావును టార్గెట్ చేసి శ్రీనివాస రావు పొలిటికల్ కామెంట్స్ చేశారు. కాగా, శ్రీనివాస్ రావు ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వనమా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. వనమాకు ఇంకా రాజకీయాలు ఎందుకు? అని సంచలన కామెంట్స్ చేశారు. గత ఎన్నికలే నాకు లాస్ట్ ప్లీజ్ అని అప్పుడు వనమా అన్నారు. 80ఏళ్ళు వచ్చాయి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి అని సూచించారు. ఇదే క్రమంలో వనమాకు కౌంటర్ ఇచ్చారు. మంచి చేయడానికి వస్తే అడ్డుకుంటారా. మంచి చేయాలనుకునే వారిని అనుసరించాలనుకునే వారిని అడ్డు కోవడం ఏం నీతి? అని ప్రశ్నించారు. అందరినీ ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు.. నేను ఉల్వనూరులో ఇల్లు కట్టుకుంటాను. నా శరీరం ఇక్కడి మట్టిలో కలిపోతుందని ఉద్వేగంతో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందామని అన్నారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నారా? అన్ని ప్రశ్నించారు. నాతో మద్దతు తెలిపే వారు చేతులెత్తండి అని.. ఆ వెంటనే అందరూ చేతులెత్తాలని సూచించారు. ఇక, శ్రీనివాస రావు కామెంట్స్‌తో కొత్తగూడెంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇది కూడా చదవండి: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్ -
ఉత్తమ ఇంక్యుబేటర్‌గా ‘టీ హబ్’
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న ‘టీ హబ్’కు ‘బెస్ట్ ఇంక్యుబేటర్ ఇండియా’అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఢిల్లీలో ‘నేషనల్ స్టార్టప్ అవార్డులు 2022’ను ప్రదానం చేశారు. టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. వివిధ రాష్ట్రాలు అవార్డుల కోసం పోటీ పడగా అవార్డు విజేతల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందిన స్టార్టప్‌లు 33 శాతం విజే తలుగా నిలిచాయి. 17 రంగాల్లో 42 స్టార్టప్‌లు అవార్డులు సాధించగా కర్ణాటక 18, మహారాష్ట్ర 9, ఢిల్లీ 4, గుజరాత్ 3, ఉత్తరాఖండ్ 2, తెలంగాణ, ఒరిస్సా, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హరి యాణా, అస్సాం ఒక్కో అవార్డును పొందాయి. జాతీయ స్థాయిలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా, టీ హబ్‌కు ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డు దక్కింది. టీ హబ్‌కు అవార్డు రావడంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. -
కరోనా ఫోర్త్ వేవ్‌పై అప్రమత్తంగా ఉన్నాం
యాదగిరిగుట్ట: కరోనా ఫోర్త్ వేవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభూలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఫోర్త్ వేవ్‌కు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఇప్పటికే పరీక్షలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 100శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని, హైబ్రిడ్ ఇమ్యూనిటీ కూడా వచ్చినట్లు వెల్లడించారు. -
పెట్టుబడులకు థీమ్... భారత్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థిరమైన విధా నాలు, తయారీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండటం, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం ప్రధాన థీమ్‌గా ఉండబోతోందని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరిన్ని వివరాలు.. ► రాబోయే దశాబ్ద కాలంలో పెట్టుబడులకు కొత్తగా ఏ థీమ్‌లు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా మూడు థీమ్‌లు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా భారత్‌తో ముడిపడినవే. అంతర్జాతీయ దృష్టికోణంతో చూస్తే భారతదేశమే కొత్త పెట్టుబడి థీమ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఎకానమీగా ఎదిగింది. స్థిరమైన రాజకీయ పరిస్థితులు, పటిష్టమైన వినియోగంతో కూడుకున్న వృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో భారత్‌లో పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక రెండో థీమ్ విషయానికొస్తే భారత్ తన తయారీ సామరŠాధ్యలను పెంచుకుంటూ ఉండటం. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ పరిస్థితులు, ముడి సరుకులపై అనిశ్చితి, చైనా ప్లస్ వన్ వ్యూహాలు మొదలైన ధోరణులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం మన జీడీపీలో ఎక్కువగా సర్వీసుల వాటా ఉంటుండగా, తదుపరి దశ వృద్ధి తయారీ రంగం నుంచి రాబోతోంది. దేశీయంగా తయారీకి ప్రాధాన్యతనిస్తుండటం, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. ఇక మూడో థీమ్‌ను తీసుకుంటే పెరుగుతున్న తలసరి ఆదాయంతో వినియోగం కూడా పెరుగుతోంది. మరింత మంది ప్రజలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ వినియోగ పరిమాణం, నాణ్యత రెండూ పెరగనున్నాయి. ఫైనాన్షియల్స్, డిజిటలైజేషన్‌లోనూ ఇదే ధోరణి కనిపించనుంది. ► ఒడిదుడుకుల మార్కెట్లో రిటైల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మార్కెట్లో టైమింగ్ కన్నా ఎంత కాలం పాటు మార్కెట్లో ఉన్నామనేది ముఖ్యం. స్వల్పకాలిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిప్ల విధానం సరైనది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. మార్కెట్లు స్వల్పకాలికంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ తమ పోర్ట్‌ఫోలియోను చూసుకోవడం కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోణంలో వ్యవహరించాలి. అలాగే వయస్సుకు తగిన విధంగా అసెట్ కేటాయింపులపై దృష్టి పెట్టాలి. తద్వారా రిటైర్మెంట్ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలవుతుంది. ► ద్వితీయార్ధంలో మార్కెట్లకు పొంచి ఉన్న రిస్కులేమిటి? ఇటీవలి కాలంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లు బాగానే రాణించాయి. వేల్యుయేషన్స్ చౌకగా లేకపోయినా చాలా అధికంగా కూడా ఏమీ లేవు. భౌగోళికరాజకీయ అనిశ్చితులు, కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన రిస్కులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా ఉన్నవి, తాత్కాలికమైనవే. ఏదేమైనా రిస్కులనేవి ఈక్విటీ పెట్టుబడుల్లో అంతర్భాగమేనని దృష్టిలో ఉంచుకుని, డైవర్సిఫికేషన్ ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ► ప్రస్తుతం ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? సాధారణంగా అసెట్ క్వాలిటీ, రుణ వృద్ధి మెరుగుపడుతుండటంతో ఫైనాన్షియల్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీకి ప్రోత్సహిస్తున్నందున ఇండస్ట్రియల్స్ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, యుటిలిటీలు మొదలైనవి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ► తొలిసారిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సూచనలు? ఫస్ట్ టైమర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంతో తక్కువ ఒడిదుడుకులు ఉండే, డైవర్సిఫైడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. డైవర్సిఫైడ్/ఫ్లెక్సి క్యాప్, ఈఎల్ఎస్ఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ కోవకు చెందుతాయి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులకు 3 ఏళ్ల ఆటోమేటిక్ లాకిన్ వ్యవధి ఉంటుంది. ఈక్విటీల్లో రాబడులు అందుకోవాలంటే కనీసం ఆ మాత్రం సమయమైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇక వయస్సు, ఇతరత్రా కట్టుకోవాల్సినవి బట్టి ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలు/వయస్సు/వ్యక్తిగత అవసరాల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్/హైబ్రిడ్ ఫండ్స్‌కు కేటాయించడాన్ని పరిశీలించవచ్చు.స్టాక్, సెక్టార్, మార్కెట్లు .. ఏవైనా కావచ్చు వేలం వెర్రి ధోరణులకు పోవద్దు. మార్కెట్లు ఆశ, నిరాశల మధ్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి రాబడులకు సంబంధించి భారీగా కాకుండా వాస్తవిక స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం మంచిది. -
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యపై కుటుంబసభ్యుల అనుమానాలు
-
Forest Range Officer: ఇక్కడ కాపాడిన ప్రాణం.. అక్కడ పోయింది!
చెట్టమ్మకు చుట్టమైండు. అడవి తల్లికి దడి కట్టిండు. దండెత్తిన మూకలను తరిమికొట్టిండు. పచ్చదనాన్ని కాపాడినందుకు మావోల హిట్లిస్ట్కెక్కిండు. చివరికి గొత్తికోయల చేతిలో హత్యకు గురైండు. ఇప్పుడా వనం కన్నీళ్లు కారుస్తోంది. చెట్లన్నీ నిలబడి సంతాపం తెలుపుతున్నాయి. ‘శ్రీనివాస్ అమర్ రహే’ అని మౌనంగా నినదిస్తున్నాయి. – బయ్యారం సాక్షి, మహబూబాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేశారు. 2011 నుంచి 2018 వరకు బయ్యారం అటవీశాఖ డీఆర్ఓగా శ్రీనివాసరావు పని చేశారు. ఆయన మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. అటవీరక్షణకు ఈప్రాంతంలోని సాయుధ దళాలతో పాటు లీగల్‌గా గట్టిపట్టు ఉన్న న్యూడెమోక్రసీ పార్టీని ఢీకొన్నారు. అటవీ రక్షణకు వెనకడుగు వేయలేదు. 2018లో పదోన్నతిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా విధుల్లో చేరారు. ఆసమయంలో అటవీ రక్షణకు తనదైన శైలిలో పని చేశారు. దీంతో పోడు, సాగుదారుల ఫిర్యాదుల ఆధారంగా మావోయిస్టులు ఎఫ్ఆర్ఓను టార్గెట్ చేశారు. ఈవిషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అటవీ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో ఎఫ్ఆర్ఓ ప్రాణాలు రక్షించుకునేందుకు ఆశాఖ అధికారులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండకు బదిలీ చేశారు. చండ్రుగొండ రేంజ్ పరిధిలో సైతం శ్రీనివాసరావు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా కృషి చేశారు. ఈక్రమంలో ఆప్రాంతానికి వలస వచ్చిన గొత్తికోయలు శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకొని హత్య చేశారు. లింగాలలో కాపాడినా.. చండ్రుగొండలో మాత్రం కాపాడుకోలేకపోయామని అటవీశాఖ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి జిల్లాలో విషాదం... బయ్యారం డీఆర్ఓగా, లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా పని చేసిన శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఉమ్మడి జిల్లాలోని అటవీశాఖలో విషాదం నెలకొంది. అటవీ రక్షణకు శ్రీనివాసరావు చేసిన కృషిని ఈసందర్భంగా పలువురు అధికారులు కొనియాడారు. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్ -
ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి వెనక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే ఫారెస్ట్ అధికారిని చంపినట్లు ప్రచారం జరుగుతోంది. లింగాలలో పనిచేస్తున్న రోజుల్లో శ్రీనివాస రావు హిట్లిస్టలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావునును గొత్తికోయలు వేట కొడవళ్లతో మెడపై దాడి చేసి క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బెదిరింపులకు గురి చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారు. ఈ క్రమంలో శ్రీనివాస రావు చనిపోక ముందు చెట్టు కర్ర గురించి గ్రామస్తులకు, ఇతర అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఓ వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. పాడే మోసిన మంత్రులు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఈర్లపూడికి చేరుకున్నారు. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే సమయంలో జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాస రావు పాడే మోశారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదని అన్నారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని, సీఎం కెసీఆర్ గారు వెంటనే స్పందించి అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారని తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసినట్లు తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని మండిపడ్డారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై కూడా దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటవీశాఖకు ఆయుధాల అంశం శ్రీనివాసరావు మృతితో అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు ఇచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు చేస్తామని అటవీ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతితో ఆయుధాలు లేకుండా అడవిలో డ్యూటీ చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్తున్నారు. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారని సంచలన నిజాలు వెల్లడించారు అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని అనేకమార్లు తమకు చెప్పారన్నారు. గతంలో కూడా ఆయుధాలు అంశానికి సంబంధించి అనేకమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఇప్పుడు మళ్ళీ మరోసారి తీసుకెళ్తామన్నారు.. శ్రీనివాసరావుది చివరి మృతి కావాలని ఫారెస్ట్ శాఖలో ఇక ఎవ్వరు చనిపోవద్దంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉద్రిక్తత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టింది. ర్యాలీగా బయలుదేరి వచ్చిన ఉద్యోగులు.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాగా తమకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు ఇచ్చి అటవీశాఖ అధికారులకు, సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఎదుట అటవీ శాఖ సిబ్బంది నినాదాలు చేశారు. అటవీశాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఫారెస్ట్ సిబ్బంది నిరసనతో మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పాత వీడియో వైరల్: ఫారెస్ట్ అధికారి మృతిపై పోలీసుల అనుమానం
-
తగ్గేదేలే.. ఆస్పత్రికి కాదు.. సరాసరి అసెంబ్లీకే పోవాల.!
ఆయనో ప్రభుత్వ అధికారి. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పనిచేస్తున్న శాఖను ఉపయోగించుకుని పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ వివాదస్పదమవుతున్నాయి. తాజాగా సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సీటు కోసం ఆ అధికారి పడరాని పాట్లు పడుతున్నారని సెటైర్లు పడుతున్నాయి. హెల్త్ డైరెక్టర్‌కు రాజకీయ ఆశలు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా ఉన్న గడల శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఆయన పేరు అందరికీ పరిచయమైంది. ఇక అప్పటినుంచి పొలిటికల్ ఏంట్రీ కోసం ఆరాటపడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారని టాక్. ఇప్పుడు కొత్తగూడెం పట్టణంలో ఎక్కడ చూసిన గడల శ్రీనివాసరావు ప్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గడల చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైలెంట్‌గా గమనిస్తున్నారు. అప్పుప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు డిహెచ్ తీరుపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.. ఎవరెన్ని డ్రామాలు వేసినా వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే ఇస్తారని చెబుతున్నారు వనమా. కఠోర పూజలు, మెడికల్ క్యాంపులు రెండు సంవత్సరాలుగా గడల శ్రీనివాసరావు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జీఏస్ఆర్ ట్రస్ట్ పేరుతో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ.. జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనే చేసే కార్యక్రమాలు కొన్ని వివాదస్పదమవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. సుజాతనగర్ ప్రాంతంలోని చిన్న తాండాలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గడల చేసిన మిరపకాయ పూజలు సంచలనం రెకెత్తించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ అయి ఉండి మూఢ నమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పూజ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వివాదంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన శ్రీనివాసరావు మళ్లీ లోకల్ గా కార్యక్రమాలు ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని డిజే టిల్లు పాటకు డ్యాన్స్ వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఇది కూడ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్.. సదా మీ సేవలో తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను సీఏం కేసీఆర్ ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు నిమిషం వ్యవధిలో రెండు సార్లు ముఖ్యమంత్రికి పాద నమస్కారం చేశారు. రెండు చేతులు జోడించి కేసీఆర్‌కు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కాని గడల శ్రీనివాసరావు చెబుతున్నదానిని కేసీఆర్ విన్నట్లుగా అనిపించలేదు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వ్యవహార శైలిపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసమే డిహెచ్ ఇలా చేస్తున్నారని ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటున్నారట. ప్రతిపక్షాలు సైతం డిహెచ్ తీరును తప్పు పడుతున్నాయి. పదవికి రాజీనామా చేసి గులాబి కండువా కప్పుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డాక్టర్‌కు గట్టి పోటీ కొత్తగూడెంలో మళ్లీ పోటీ చేయాలని సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. మరోవైపు పొత్తుల్లో ఈ సీటు సీపీఐ కే వస్తుందని, తానే బరిలో దిగుతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం మొన్నటి భేటీలో అన్నిచోట్లా సిటింగ్‌లకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. మరి కొత్తగూడెంలో ఏం జరుగుతుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ కారిడార్: హెల్త్ డైరెక్టర్ తీరుపై అధికారవర్గాల్లో చర్చ..
-
కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి..
-
ఆ రోజు నవ్వులే నవ్వులు!
ఎప్పుడో పుష్కరకాలం క్రితం ముఖ్యమంత్రి దివంగత రాజ శేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్య క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సత్యం ఫౌండేషన్, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వ ర్యంలో హెచ్ఎంఆర్ఐ రూప కల్పన చేసిన 104 కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సీఎం రాజశేఖర రెడ్డి వచ్చారు. ముందుగా అసలు ఏమిటీ కాల్ సెంటర్ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా ఉంటుంది. ఎక్కడో మారుమూల ఉండే పల్లెలతో పాటు పట్టణవాసులకు సైతం 24 గంటలూ వైద్య సలహాలు, సేవలూ అందించడానికి ఏర్పాటు చేసిందే ఈ కాల్ సెంటర్. జనానికి అనేక ఆరోగ్య సమస్యలు ఎప్పుడు పడితే అప్పుడు తలెత్తుతూ ఉంటాయి. అటు వంటి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉంటే సరే... లేకపోతే పరిస్థితి ఎంత ఆందోళన కరంగా ఉంటుందో చాలామందికి అనుభవమే. ఈ ఆందోళనను దూరంచేయడానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అత్యవసర వైద్యసేవలకోసం సంప్రదించ డానికి ఒక టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. అదే 104. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నంబరుకు ఉచితంగా ఫోన్ చేయవచ్చు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూ టర్లలో నిక్షిప్తం చేసి కాల్ సెంటర్లో ఉంచుతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్స్‌రే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు... ఇలా అన్ని వివరాలూ సిద్ధంగా ఉండటం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడి గినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ; ఎక్స్‌రే, స్కానింగ్ వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ; ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోతలు ఉన్నదీ... వంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం ఉన్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసు కుని ఒక నంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కాల్ సెంటర్లో కంప్యూటర్ తెరపై సిద్ధంగా ఉంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుం టుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటి కప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు. మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియ పరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108కి తెలియపరచి అంబులెన్స్ పంపిస్తారు. స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు. ఇక అసలు విషయం చెప్పుకుందాం. ముఖ్య మంత్రి రాజేఖరరెడ్డి ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నంబరుకు స్వయంగా ఫోన్ చేశారు. అవ తల నుంచి కాల్ సెంటర్ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది. ‘‘104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?’’ ముందు కంగు తిన్న ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు. సీఎం తన పేరు చెప్పగానే, కాల్ సెంటర్ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది. ‘ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?’ వైఎస్ ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వు లతో నిండిపోయింది. భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు (జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి) -
కొత్తగా 459 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసు లు భారీగానే నమోద వుతున్నాయి. మంగళ వారం 26,126 మం దికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 459 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధి కంగా హైదరాబాద్‌లో 232 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.99 లక్షలకు చేరింది. ఒక్క రోజులో 247 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7.91 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,172 క్రియాశీలక కేసులు నమో దయ్యాయని ప్రజారోగ్య సంచా లకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం 59 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
Telangana: కరోనా కేసులు @ 434
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్ బారిన పడ్డారు. బుధవారం 27,754 మందికి పరీక్షలు చేయగా, 434 మందికి కరోనా నిర్ధారణయింది. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 292, రంగారెడ్డి జిల్లాలో 71 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.97 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో 129 మంది, ఇప్పటి వరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,680 క్రియాశీలక కేసులు ఉన్నాయి. -
శ్రేయాస్ మీడియా ఇక గ్లోబల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో దేశంలో అగ్ర శ్రేణి సంస్థ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదార్లతో ఈ మేరకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్‌తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు తాజా నిధులను ఉపయోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా 2011లో ప్రారంభమైంది. దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. దుబాయిలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. గరిష్టంగా 10 కోట్ల మంది.. దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. ‘స్పాన్సర్స్‌కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా వీక్షిస్తున్నారు. అందుకే విదేశీ బ్రాండ్స్ స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశ, విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం‘ అని ఆయన వివరించారు. కొత్త విభాగాల్లోకి ఎంట్రీ.. సినిమా ఆసరాగా కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. ఇందులో భాగంగా నూతన సాంకేతికతతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం. కంపెనీ 2027 నాటికి ఏటా 650 సినిమా కార్యక్రమాలు, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. 2021–22లో రూ.20 కోట్ల టర్నోవర్ సాధించాం’ అని చెప్పారు. –శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు -
మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉన్నా.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం కరోనా సమాచారం గురించి పలు జాగ్రత్తలను మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారాయన. అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. ఆరువారాలుగా కరోనా వైరస్ అదుపులోనే ఉంది. రోజూ 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపారాయన. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫోర్త్‌వేవ్‌పై అనేక సందేహాలున్నాయి. దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్ లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 1శాతం కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 0.5 మాత్రమే ఉంది. ఫోర్త్ వేవ్ రాబోదని ఎన్ఐఎం సీరో సర్వేలాంటివి చెప్తున్నాయి. 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సీరో సర్వేల్లో వెల్లడైంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అలాగని కరోనా భయం పూర్తిగా తొలగిపోలేదు. రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉన్నాయి. ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్లు, ప్రయాణాల్లో ప్రజలందరూ మాస్క్ లు ధరించాలి. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచిస్తున్నాం అని తెలిపారు డీహెచ్. చదవండి: భారత్‌లో వరుసగా రెండో రోజు కేసుల్లో పెరుగుదల -
తెలంగాణలో కరోనా మూడోదశ: గుడ్‌న్యూస్ చెప్పిన డీహెచ్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై డీహెచ్ మాట్లాడుతూ.. మూడో దశ డిసెంబర్ నుంచి ప్రారంభమైందని, జనవరిలో మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని, ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందన్నారు. మరోవైపు దేశంలో కూడా కరోనా కేసులు లక్షలోపే నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు భారీగా తగ్గిందన్నారు. రెండేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని పట్టిపీడించిందని డీహెచ్ అన్నారు. ‘కోవిడ్ మొదటి దశ వల్ల 10 నెలలు ఇబ్బంది పడ్డాం. సెకండ్ వేవ్ ఆరునెలలు పాటు ఇబ్బందులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలు బలిగొంది. మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ కేవలం రెండు నెల్లోనే అదుపులోకి వచ్చింది. ఈ దశలో మొత్తం కేవలం 3 వేల మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు’ అని వెల్లడించారు. చదవండి: భర్త వేధింపులు.. స్కిన్ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్ ఇచ్చి ఫీవర్ సర్వేతో సత్ఫలితాలు ‘ఫీవర్ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఫీవర్ సర్వే చేపట్టడం ద్వారా కోటి ఇళ్లలో సర్వే చేశాం. 4 లక్షల మందికి కిట్లు అందజేశాం. కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పనిచేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా సీరియస్ వైరస్. కానీ వ్యాక్సిన్‌తో దీన్ని అరిగట్టగలిగాం.సూచనలు, జాగ్రత్తలు చేపట్టడం వల్లనే ఒమిక్రాన్ పరిస్థితి విషమించలేదు. ఇంకా ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేదో వారు తీసుకోవాలి. ఇక ముందు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు ‘రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు. జనవరి 31 st వరకే ఆంక్షలు ఉన్నాయి.. వాటిని కూడా పూర్తిగా ఎత్తివేసింది. అన్ని సంస్థలు 100 శాతం పనిచేయొచ్చు. ఉద్యోగులు అందరూ కార్యాలయాకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం తీసేయొచ్చు. విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో అయిదు కోట్ల మందికి టీకాలు వేశాలు. 82శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చాం. వచ్చే కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్ పుట్టే అవకాశం లేదు. కోవిడ్ త్వరలో ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూలా మారుతుంది.’ అని పేర్కొన్నారు. చదవండి: రాని కరోనాను రప్పించి మరీ.. -
పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ: డీహెచ్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా ఆరోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు కోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని కోర్టుకు తెలిపారు. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అవసరం అవుతాయని పేర్కొన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదు కాలేదని వెల్లడించారు. మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని అన్నారు. జీహెచ్ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని నివేదికలో చెప్పుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించామని తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కోవిడ్ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు కూడా ఇచ్చామని అన్నారు. అన్నీ తప్పుడు లెక్కలు కాగా, ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదన వినిపించారు. మూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులు బయటపడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ కిట్లలో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈక్రమంలో ఏజీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదని అన్నారు. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కోవిడ్ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితిని వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కేసులపై విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. -
ప్రజారోగ్య సంచాలకుడి అక్రమాలపై విచారణకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన అక్రమాలపై ఇప్పటికే లోకాయుక్తను ఆశ్రయించా నని, మార్చి 9న హాజరు కావాలని లోకాయుక్త సమన్లు జారీ చేసిందని తెలిపారు. మందుల కొనుగోలులో అక్రమాలు, కోవిడ్–19 మరణా ల సమాచారంలో తప్పుడు లెక్కలు, వైద్యుల బదిలీలు, పదోన్నతుల్లో అవక తవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. -
తెలంగాణపై పడగ విప్పిన ఒమిక్రాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపం లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యా యి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదవగా శనివారం నాటికి ఈ కేసులు 79కి చేరుకున్నాయి. ఇదే సమయం లో క్షేత్రస్థాయిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్రంలో ఒక్క రోజులో 300కు పైబడి కేసులు నమోదవగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే దాదాపు 200 కేసులు తేలాయి. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 2 శాతం మందికే పరీక్షలు చేస్తుండటం, వీళ్లలోనే 70 శాతం ఒమిక్రాన్ కేసులు బయటడిన నేపథ్యం లో కొత్త వేరియంట్ ఇప్పటికే కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా నమోదవుతు న్న కేసుల్లో ఒమిక్రాన్ ఉండొచ్చని భావిస్తున్నాయి. ఓవైపు జనజీవనం సాధారణ స్థితికి చే రుకోవడం, మరోవైపు సంక్రాంతి రాకపోకలు పెరుగుతుండటం, పైగా ప్రజలు కరోనా జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రెండు వారాల్లో రాష్ట్రంలో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నాయి. ఒక్కో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు రూ. 6 వేలు కరోనా వైరస్‌ను ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ర్యాట్), ఆర్టీపీసీఆర్ పరీక్షలతో గుర్తిస్తున్నారు. అయితే వైరస్‌ను నిర్ధారించినా అందులోని వేరియంట్ గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలు సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ), సీడీఎఫ్‌డీ (సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్), గాంధీ ఆస్పత్రులే చేస్తున్నాయి. సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ సంస్థల పరిధిలో నెలకు సగటున 6 వేల జీనోమ్ సీక్వెన్సింగ్‌లు చేసే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఉత్తర కర్ణాటక రీజియన్ పరీక్షలు కూడా ఈ సంస్థలే చేస్తున్నాయి. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్ విలువ రూ. 6 వేల వరకు ఉన్నట్లు సమాచారం. శాంపి ల్ తీసుకున్నాక 4 దశల్లో విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయి కేసుల్లో సీక్వెన్సింగ్ ఏది? ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగానే కొన్ని దేశాలను రిస్క్ కేటగిరీలో చేర్చారు. ఆ దేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 2 శాతం మందికి పరీక్షలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో 70 శాతానికి పైగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లకే సోకడం గమనార్హం. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై పెద్దగా నిఘా పెట్టకపోవడం, మరోవైపు రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రయాణికుల రాకపోకలు ఉండటంతో ఒమిక్రాన్ ఇప్పటికే కమ్యూనిటీలోకి చేరిందనే భావన వైద్యారోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఒమిక్రాన్‌గా అంచనా వేయొ చ్చని అంటున్నారు. పైగా క్షేత్రస్థాయి కేసుల్లోని కేసుల్లో ఒమిక్రాన్ వేరియెంట్‌ను గుర్తించట్లేదు. లోడ్ ఎక్కువే.. కానీ ప్రభావం తక్కువ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకైతే ప్రమాదకరం కాదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో కొందరికే సాధారణ లక్షణాలైన జ్వరం, దగ్గు తదితరాలే ఉన్నట్టు చెబుతున్నారు. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ లోడ్ చాలా ఎక్కువుందని, కానీ దీని ప్రభావం ఊపిరితిత్తులపై పెద్దగా లేదని పలు పరిశీలనల్లో తేలినట్టు నిజామాబాద్ మెడికల్ కాలేజీ వైద్యులు డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు. ఏదేమైనా ప్రజలు తప్పకుండా మాస్కు ధరించాలని, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఆ కేసులే కావొచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువవుతున్నాయి. ఇలా వ్యాప్తి పెరగడమంటే కొత్త వేరియంట్ వచ్చినట్లేనని భావించవచ్చు. ప్రస్తుత కేసుల్లో ఒమిక్రాన్ అధికంగా ఉన్నట్లు అనుమానిస్తున్నాం. కొత్త కేసులన్నీ ఈ వేరియంట్‌తో కూడినవని అంచనా వేయొచ్చు. – జి. శ్రీనివాసరావు, డీహెచ్ -
ఒమిక్రాన్.. వచ్చే 2,3 వారాలు అత్యంత కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా వ్యాప్తిస్తోంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర, ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోంది. తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులపై రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఆయన గురువారం మాట్లాడుతూ.. తెలంగాణలో త్వరలోనే ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్‌వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ ఉగ్రరూపం.. 1000కి చేరువలో కేసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. యూకే, యూఎస్ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ(263), మహారాష్ట్రలు(252) మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. తరువాత గుజరాత్, రాజస్థాన్, కేరళ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది. బుధవారం ఒక్క రోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్ -
మరో ఏడు ఒమిక్రాన్ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో మూడు ముప్పున్న దేశాలకు చెందినవి కాగా, నాలుగు ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారివి అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు ఎగబాకింది. అందులో ఇప్పటివరకు 13 మంది కోలుకున్నారు. కాగా ముప్పున్న దేశాల నుంచి ఒకరోజులో 165 మంది ప్రయాణికులు కాగా, అందులో నలుగురికి సాధారణ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. మొత్తం 13 కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, ఇప్పటివరకు ముప్పున్న దేశాల నుంచి 11,921 మంది హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇక రాష్ట్రంలో మంగళవారం 228 మందికి సాధారణ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా 110 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఒకేసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఒక రోజులో ఒకరు చని పోగా, మొత్తం ఇప్పటివరకు కరోనాతో 4,024 మంది మృతిచెందారు. -
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వీరు.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే. సోమాలియా, కెన్యా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు. వీరిలో ఇద్దరిని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందించనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.. మెహదీపట్నం, టోలీచౌక్ వీరిని గుర్తించి పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌గా తేలినట్లు డీహెచ్ పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన మరొక బాలుడి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయ్యిందన్నారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాలుడికి పరీక్షలు చేయగా ఒమిక్రాన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చేరవేశమన్నారు. ఒమిక్రాన్ సోకిన సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారనేది అవాస్తవమని డీహెచ్ తెలిపారు. గాలిద్వారా ఒమిక్రాన్ సోకే ప్రమాదముందని డీహెచ్ తెలిపారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్ సోకిన వారికి స్పల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని డీహెచ్ తెలిపారు. -
రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు రాదు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఆక్సిజన్ లోటు రాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్రంలో సౌకర్యం ఉందని తెలిపారు. కరోనా ఇంకా అంతం కాలేదని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 3 కోట్ల డోసుల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాల యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి, గాల్లోకి బెలూన్లు విసిరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ థర్డ్‌వేవ్ వచ్చినా దాన్ని తట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు 169 రోజులు పట్టిందని, ఆ తర్వాత కోటి వాక్సిన్ల పంపిణీకి 81 రోజులు, మూడో కోటి వ్యాక్సిన్ల పంపిణీకి 36 రోజుల సమయం పట్టిందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంద న్నారు. అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరు కల్లా వంద శాతం వ్యాక్సినేషన్ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. -
మాకూ పింఛన్ ఇవ్వండి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బ్రిటిష్, నిజాం కాలం నుంచి గ్రామాల్లో రెవెన్యూ, శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు గ్రామాల్లో పట్వారీ, పటేల్ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూములకు సంబంధించిన కీలకమైన రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడుతుండేవారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1992లో తిరిగి వీరిలో అర్హులైన వారిని వీఏఓలుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్లో రూ.600 గౌరవ వేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేశారు. చివరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారిని 2002 జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఇచ్చారు. వారిని వీఆర్వోలుగా, పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. 2002లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై 2008 జూన్ 30లోగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కనీసం ఏడేళ్ల సర్వీసు లేదంటూ పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇలాంటి వారు ఉమ్మడి ఏపీలో 2,225 మంది ఉన్నారు. తాము దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సేవలందించామని, తమకు కనీస పింఛన్ మంజూరు చేసేందుకు గతంలో 1992 నుంచి 2002 మధ్య పని చేసిన కాలాన్ని కలపాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు, 1980 ఆర్పీఆర్ జీవోలను పరిశీలించిన తర్వాత ఫైలు నం.28496/అ/2013 ప్రకారం పాత సర్వీసును పరిగణనలోకి తీసుకుని 2,225 మందికి కనీస పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 ఫిబ్రవరి 2న ఫైలుపై అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. ఏపీలో అమలు.. తెలంగాణలో ఎదురుచూపులు! ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఫైలు 28496/అ/2013 ప్రకారం ఏపీకి చెందిన 1,733 మందికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 నవంబర్ 20న జీవో నంబర్ 388 జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రిటైర్డ్ వీఆర్వోలు పింఛన్ పొందుతున్నారు. అయితే తెలంగాణలోని 492 మందికి మాత్రం ఆరేళ్లకుపైగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఆర్థిక, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి లభించినా ఫైలు మాత్రం ముందుకు కదలలేదు. ఈ జాప్యానికి అధికారులే కారణమని రిటైర్డ్ వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శ్రీనివాసరావు.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని తాడిపర్తికి చెందిన ఈయన వీఆర్వోగా పనిచేస్తూ 2008లో రిటైర్ అయ్యారు. పింఛన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన ఇటీవల పెరాలసిస్ బారిన పడ్డారు. మందులు కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ..ఇది ఒక్క శ్రీనివాసరావు దీనగాథ మాత్రమే కాదు. 2008 జూన్ 30లోపు ఉద్యోగ విరమణ పొందిన తెలంగాణలోని పలువురు వీఏఓలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఉద్యోగానికి, ఇటు పింఛన్ కోసం కోర్టులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి సుదీర్ఘ పోరాటం చేసి 2014లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వారికి పింఛన్ అందుతుండగా.. తెలంగాణలో ఉన్న వారికి మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదు. పైస్థాయి అధికారుల నిర్లక్ష్యంతోనే.. ఆరున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. పైస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతోంది. – డీకే మోహన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం సీఎం దృష్టికి తీసుకుపోనందుకే.. సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు మా సమస్యను తీసుకుని పోకపోవడం వల్లే జాప్యం జరుగుతోంది. ఆయనకు తెలిస్తే మా పింఛన్ ఫైల్‌పై సంతకం చేస్తారనే నమ్మకం ఉంది. – వి.నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం చచ్చే వరకైనా పింఛన్ వచ్చేనా? పింఛన్ కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు పింఛన్ వస్తుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. మేం చనిపోయే వరకైనా వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. – ప్రకాశ్‌రావు, రిటైర్డ్ వీఆర్వో, గజ్వేల్, సిద్దిపేట -
కొత్తగా 357 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 357 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,455కి చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. గురువారం ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,865కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 405 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,46,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,246 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. -
Dengue: డేంజర్ డెంగీ
1,205 రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన డెంగీ కేసులు 432 ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే నమోదైనవి డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, నారాయణపేట్, హన్మకొండ, ఖమ్మం. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వనపర్తి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్. గ్రేటర్లో ఫీవర్.. టెర్రర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, మలేరియా వ్యాధులు కోరలు చాస్తున్నాయి. కరోనా కేసులు ఒకవైపు నమోదు అవుతుండగా, మరోవైపు విషజ్వరాలు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డెంగీ అత్యంత తీవ్రతలో 12 జిల్లాలు ఉండగా, మలేరియా అత్యంత తీవ్రతలో 11 జిల్లాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. అత్యంత తీవ్రత జిల్లాల్లోనే 70 శాతం మేర డెంగీ, మలేరియా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధిక శాతం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్తున్నా, కొన్ని జిల్లాల్లో వైద్య యంత్రాంగం తూతూమంత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీగా కేసులు... రాష్ట్రంలో డెంగీ, మలేరియాతో పాటు చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో నీరు నిలిచినచోట్ల దోమలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. దీంతో దోమల కారణంగా వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాతో జనం ఆందోళన చెందుతుంటే, దానికి డెంగీ, మలేరియా తోడు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో డెంగీ, మలేరియా కేసులు విపరీతంగా నమోదు అవుతాయని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. జ్వరాల కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనా లేదా డెంగీ జ్వరమో అర్థంగాక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా, డెంగీతో వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఆసుపత్రుల తీరు మారడంలేదు. హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 50 వేల వరకు గుంజుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 40 వేల లోపు ప్లేట్లెట్లు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ 50 వేలున్నా కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. దోమల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వస్తే పరీక్షలు చేయించుకోండి జ్వరం ఉన్నవాళ్లు వైద్యున్ని సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశముంది. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరగకుండా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పెద్దాసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయి. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. లక్షణాలున్నవారు ఆయా కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
‘ర్యాలంపాడు’కి బీటలు
గద్వాల రూరల్: ‘ర్యాలంపాడు జలాశయం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది. కట్ట తెగితే ఏకంగా 20గ్రామాలు పూర్తిగా ఊడ్చుపెట్టుకుని పోవడం ఖాయం.’ ఇదేదో స్థానికులు చెబుతున్న మాట కాదు.. సాగు నీటిపారుదల శాఖ అధికారులే ప్రభుత్వానికి పంపిన హెచ్చరికలు. ఈ క్రమంలో ఇద్దరు సీఈలతో కూడిన ఇంజనీర్ల బృందం శనివారం ర్యాలంపాడు జలాశయాన్ని సందర్శించింది. ఎక్కడ్కెడ లీకేజీలున్నాయో తెలుసుకునేందుకు డ్యాం చుట్టూ ఇంజనీర్లు కలియదిరిగారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ►జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు వద్ద రూ.192 కోట్ల వ్యయంతో జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి 1.36లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. 2014లో అందుబాటులోకి వచ్చిన ఈ జలాశయంలో మొదటి నాలుగేళ్లు రెండు టీఎంసీల కంటే తక్కువగానే నీటిని నిల్వ చేశారు. 2018, 2019, 2020లో వరుసగా జలాశయంలో పూర్తిస్థాయి 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అయితే ఈ ఏడాది కూడా భారీగా వరద నీరు జూరాలకు వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలోనే నీటిని ర్యాలంపాడు జలాయంలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలోనే జలాశయం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ కావడం మొదలైంది. ఈ విషయాన్ని 25 రోజుల కిందట అధికారులు గురించి.. పొంచి ఉన్న ముప్పును రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు. 3 కిలోమీటర్ల మేర నీరు లీకేజీ.. జలాశయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రాళ్లకట్ట నిర్మించారు. సహజంగా జలాశయాల్లో లీకేజీలు ఎర్త్స్లోపుల నుంచి విడుదలవుతాయి. కానీ ర్యాలంపాడులో మాత్రం 3 కిలోమీటర్ల మేర ఉన్న రాక్‌టోల్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతుంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తే కట్టకు గండి పడి దాని కింద ఉన్న 20 గ్రామాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో గద్వాల పట్టణం, అయిజ, మల్దకల్‌తో పాటు ధరూరు, గద్వాల, మల్దకల్, అయిజ మండలాల్లోని 17 గ్రామాల వరకు పూర్తిగా నీటమునుగుతాయి. ప్రమాదకరమే.. ర్యాలంపాడు కట్ట చుట్టూ రాక్పోల్ ద్వారా నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని 25 రోజుల క్రితం గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శనివారం ప్రత్యేక బృందం జలాశయాన్ని పరిశీలించింది. ర్యాలంపాడు నుంచి వెలువడు తున్న లీకేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని, 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దంటూ సూచించింది. కట్ట తెగితే దాని కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వానాకాలం పంటకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీటిని అందిస్తాం. యాసంగికి మాత్రం కష్టం. – శ్రీనివాస్‌రావు, ఎస్ఈ, జిల్లా సాగునీటిపారుదల శాఖ -
చేతులెత్తి నమస్కరించిన న్యాయమూర్తి
ఖమ్మం క్రైం: మానవత్వం ఎల్లలు దాటింది.. గ్రామం, మండలం, జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు చేరిన సేవా తత్పరుడికి అక్కడి ప్రజలు పాదపూజ చేశారు. ఏకంగా జిల్లా జడ్జి చేతులెత్తి నమస్కరించి.. సేవలను అభినందించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘అన్నం’ ఫౌండేషన్ కొనసాగుతోంది. దిక్కులేని వారినేగాక మతిస్థిమితం లేనివారికి ఆశ్రయం కల్పించి బాగు చేసే వరకు బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బోటియాపూరికి చెందిన చునీల్ గొగొయ్ నాలుగేళ్ల క్రితం, జార్ఖండ్ లోని ఖుర్దేగ్ జిల్లాకు చెందిన మర్కస్ ఖుజూర్ రెండేళ్ల క్రితం మతిస్థిమితం తప్పడంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఖమ్మం చేరారు. శ్రీనివాసరావుకు అస్సాంవాసుల పాదపూజ వారిని అన్నం ఫౌండేషన్ చేరదీసింది. ఇటీవల వారి ఆరోగ్యం కుదుటపడింది. చునీల్ గొగొయ్ ఆశ్రమంలో వంటలు చేస్తూ ఉంటున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొత్తగూడెం జిల్లా ఇల్లెందువాసి అయిన గుహవాటి ఐఐటీ ప్రొఫెసర్ నందకిషోర్ సహకారంతో కుటుంబీకుల సమాచారం తెలుసుకున్నారు. అలాగే ఖజూర్ వివరాలు కూడా తెలిశాయి. దీంతో ఈ నెల 3న శ్రీనివాసరావు, ఆశ్రమం బాధ్యులు వారిని తీసుకుని ఆ రాష్ట్రాలకు బయలుదేరారు. జార్ఖండ్ వెళ్లి అక్కడ ఖుజూర్‌ను జిల్లా జడ్జి సమక్షంలో ఆయన కుటుంబానికి అప్పగించారు. ఖుజూర్‌కు రూ.25 వేల నగదు అందించారు. ఫౌండేషన్ సేవలను తెలుసుకున్న జడ్జి శ్రీనివాస్‌రావుకు నమస్కరించారు. ఆపై గోలాగాట్ జిల్లా కేంద్రానికి 7న చేరుకుని జిల్లా జడ్జి ఎదుట చునీల్ గొగొయ్‌ను కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కూడా రూ.50 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా చునీల్ కుటుంబం శ్రీనివాసరావుకు పాదపూజ చేసింది. -
రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కరోనా విషయంలో కాస్త మెరుగ్గా ఉందని.. మహారాష్ట్ర, కర్నాటకలాంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్రం పరిస్థితి బాగుందని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. వందేళ్లకోసారి ఇలాంటి విపత్తులు వస్తాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాబోయే 3,4 వారాలు చాలా కీలకం..జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌పై హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియాలో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. పెళ్లిళ్ల సీజన్ ముందుంది కాబట్టి ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల మంది పైగా వాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. విడతలవారీగా మిగతావారికి కూడా వాక్సిన్ వేయిస్తామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ గురించి ఆందోళన కూడా అవసరం లేదని భరోసా ఇచ్చారు. లక్షణాలు ఉంటేనే కోవిడ్ ఉన్నట్టని, భయంతో పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరొద్దని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలకు దూరం అవుతున్నారు..కోవిడ్ లేని వారు పరీక్షల కోసం వచ్చి వ్యాధి తెచ్చుకుంటున్నారని వివరించారు. లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని, తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 80 శాతం మందికి ఆస్పత్రులు అవసరం లేదని.. చాలా వరకు ఇంట్లో వైద్యుల సలహాలతో కోలుకోవచ్చని డైరెక్టర్ శ్రీనివాసరావు గుర్తుచేశారు. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు -
కరోనాపై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారినపడితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు సూచించారు. జాగ్రత్తలు పాటిస్తే వేగంగా కోలుకుంటారని వివరించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ రిస్క్ రేట్ తగ్గుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లా డారు. దేశంలో ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే హోం ఐసోలేషన్ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని, అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రజలు పనుల నిమిత్తం రోడ్లపైకి రావడంతో వైరస్ వ్యాప్తి పెరిగిందన్నారు. జూన్‌లో అత్యధికంగా 13 వేల కేసులు నమోదైనట్లు శ్రీనివాసరావు వివరించారు. అయితే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ అందరికీ సేవలందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గాంధీ ఆస్పత్రి ని అత్యవసర కేటగిరీ కింద నిర్దేశించామని, క్రిటికల్ కేసులను (బాధితులను) మాత్రమే అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నామన్నారు. లక్షణాలు తక్కువ ఉన్న వారికి ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైరస్ సోకిన వారిలో ఎక్కువ శాతం మందికి లక్షణాలే లేవని, కొందరికి తెలియకుండానే వైరస్ వచ్చి పోతోందన్నా రు. వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్‌తో ప్రజలంతా కలసి జీవించక తప్పదన్నారు. వైరస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా యోధులుగా పనిచేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న ఆయన... కరోనాపై ప్రజలను చైతన్యపరిచే బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కరోనా లెక్కల్ని దాచలేదని, పూర్తిస్థాయిలో పారదర్శకంగా వివరాలను ప్రజలకు చెబుతున్నామన్నారు. ల్యాబ్‌లవారీగా పరీక్షలు, ఫలితాలు... ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల విధానం సరైన విధంగా లేదని, అనుమానితుల్లో ఎక్కువ మందికి పాజిటివ్‌గా ఫలితాలు చూపుతున్నాయని డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకుగల కార ణాలను తెలుసుకొనేందుకు నిపుణుల కమిటీతో మరోసారి తనిఖీలు చేస్తామన్నారు. ఇప్పటికే 12 ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చామని, వారంతా వివరణ కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నారని, కొత్తగా మరో 5 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిందన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలపై మరింత స్పష్టంగా బులెటిన్ ఇస్తామని, ల్యాబ్‌లవారీగా పరీక్షలు, పాజిటివ్ కేసుల వివరాలను అందులో చేరుస్తామన్నారు. రాష్ట్రంలో కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా జరుగుతోందని, సీఎం కేసీఆర్ నిర్దేశించిన 50 వేల పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభు త్వ ల్యాబ్‌లలో పరీక్షల సామర్థ్యం 6,500కు పెరిగిందని, త్వరలో మరింత పెంచుతామన్నారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే 104 కు కాల్ చేయాలని, అత్యవసర సేవల కోసం 108కి ఫోన్ చేయాలని సూచించారు. -
కరోనా కేసులింకా పెరుగుతాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపులతో జనం రోజు వారీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటుండటంతో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని, ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. శనివారం వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డితో కలిసి కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలైందని, అందువల్లే కరోనా అదుపులో ఉందన్నారు. లాక్డౌన్ లక్ష్యం కరోనాను నిర్మూలించడం కాదని, ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టడం కోసమన్నారు. దీర్ఘకాల లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టమని, అందుకే విడతల వారీగా సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలు, కేసుల నమోదు అంశాలు దాచినా దాగేవి కావన్నారు. అవసరం ఉన్న వారికే నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ఇప్పటివరకు రాష్ట్రంలో 30వేలకుపైగా పరీక్షలు చేశామని, 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ కట్టడికి మూడు సూత్రాలు పాటించాలని జి.శ్రీనివాసరావు సూచించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇవి పాటిస్తే కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకున్నట్టేనన్నారు. రాష్ట్రంలో కేసుల నమోదు తీరును పరిశీలిస్తే.. జనసమూహాలు ఏర్పడిన చోటే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఒడిబియ్యం, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాల వల్లే ఒకే కుటుంబానికి చెందిన పలువురు వైరస్ బారిన పడ్డారన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ గెలిచిందని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉంటే కరోనాపై విజయం సాధిస్తామన్నారు. భవిష్యత్తులో ఊపిరితిత్తులపై ప్రభావం: రమేష్‌రెడ్డి కరోనా వైరస్ నుంచి బాధితుడు కోలుకున్నా.. దీర్ఘకాలిక ఇబ్బందులు తప్పవని వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డి చెప్పారు. వైరస్ ప్రభావం ఊపిరి తిత్తులపై ఉంటుందని, కొన్నేళ్ల తర్వాత అది బయటపడొచ్చన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి చికి త్స చేసే క్రమంలో వెంటిలేటర్ అవసరం చాలా తక్కువన్నారు. 5శాతం మందికి మాత్రమే ఇది వాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. లాక్డౌన్ సడలింపులతో కేసుల తీవ్రత పెరుగుతుందని ముందే ఊహించామని, ఇందులో భాగంగా వసతులు, సౌకర్యాలు కల్పించి ఎక్కువమందికి చికిత్స అందేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 170 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని, కింగ్‌కోఠి ఆస్పత్రి, టిమ్స్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చికిత్స చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా వైరస్‌కు చికిత్స తీసుకున్న 7రోజుల తర్వాత బాధితుడి నుంచి మరొకరికి వైరస్ సోకదని, తొమ్మిదో రోజు అతడిలో వైరస్ కణాలు నశిస్తాయన్నారు. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు
సాక్షి, విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావు నివాసాల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లో ఆయన నివాసాల్లో దాదాపు 36 గంటలపాటు సోదాలు జరుగుతున్నాయి. ఇక మాజీ మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు కిలారి రాజేష్ ఇళ్లల్లో, కంపెనీ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. (చదవండి : చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు) విజయవాడలోని శ్రీనివాస్‌రావు ఫ్లాట్‌లో పలు కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో సోదాలు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని చంపాపేట్ గ్రీన్‌పార్క్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్‌కు ఆయన్ను తరలించారు. సీఆర్పీఎఫ్ పహారాలో ఆ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు శ్రీనివాస్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు
-
చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/కడప అర్బన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఐటీ అధికారులు ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. గురువారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు విజయవాడలోని శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అలాగే లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన రాజేశ్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి. ఐటీ శాఖ తనిఖీలుచేస్తున్న భవనంలోకి వెళ్లేందుకు సీఆర్పీఎఫ్ పోలీసులతో మాట్లాడుతున్న టీడీపీ నాయ్యవాదులు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ.. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న ఇంటితోపాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సీఆర్పీఎఫ్ పోలీసుల పహారాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారులే ఈ సోదాల్లో పాల్గొనడం గమనార్హం. హైదరాబాద్ పంజాగుట్ట లుంబినీ ఎన్‌క్లేవ్‌లోని ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నం.13లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కడపలో శ్రీనివాసులరెడ్డి ఇంట్లో లభించిన సమాచారంతో కడపలోని మరో సబ్ కాంట్రాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టులకు సంబంధించిన పలు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.300 కోట్ల ఆన్లైన్ లావాదేవీలు మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి తనయుడైన శ్రీనివాసులరెడ్డి ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ఆదాయానికి సంబంధించిన పన్నులు చెల్లించకుండా ఎగవేశారని పేర్కొంటూ ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. పన్నుల ఎగవేతతోపాటు శ్రీనివాసులరెడ్డి కుమార్తె వివాహం నిశ్చయమైన సమయంలో దాదాపు రూ.300 కోట్ల ఆన్లైన్ లావాదేవీలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల వివరాలను తెలియజేసేందుకు అధికారులు నిరాకరించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణలోని నేతల ఇళ్లు, కార్యాలయాల్లో.. తెలంగాణలోని కరీంనగర్లో గురువారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు నేతలకు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. -
‘వెల్గటూరు’ ఆదర్శనీయం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తీకరణ్ పురస్కార్‌కు ఎంపికైన వెల్గటూరు మండలాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వెల్గటూరు మండలం ఆదర్శనీయమని కొనియాడారు. 2017–18 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన ఈ అవార్డును మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాసరావు ఇటీవల అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో గురువారం ఆయన ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జేసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/చిత్తూరు అర్బన్/కడప అర్బన్: ఏపీ పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బూట్లు నాకే సంస్కృతి తమది కాదని, రాజకీయాల్లో ఆ స్థాయికి రావడానికి జేసీ ఎవరి బూట్లు నాకారో చెప్పాలన్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నవ్వడం సిగ్గుచేటని.. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్ ఖాన్, సంఘం నాయకులు స్వర్ణలత, కె.నాగిని, పి.శేషయ్య పాల్గొన్నారు. జేసీని కుక్కల వ్యాన్‌లో ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలి జేసీ వ్యాఖ్యలు ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ అన్నారు. పిచి్చకుక్కలా మాట్లాడుతున్న దివాకర్‌రెడ్డికు గొలుసులు వేసి కుక్కల వ్యానులో ఎక్కించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలన్నారు. కాగా, మాజీ ఎంపీ జేసీపై కేసులు నమోదు చేయిస్తామని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పుశంకర్, వాటం జగన్మోహన్రెడ్డి తెలిపారు. జేసీని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరి్పంచాలని పోలీసు అ«ధికారుల సంఘం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్ జేసీ కుటుంబసభ్యులకు సూచించారు. -
చలిముసుగులో.. ‘స్వైన్‌ఫ్లూ’ బెడద
సాక్షి, హైదరాబాద్ : డెంగీ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టింది.శీతాకాలం మొదలు కావడంతో హెచ్1ఎన్1 వైరస్ గాలిలోకి ప్రవేశించింది.దీంతో స్వైన్‌ఫ్లూ తాకిడికి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం మొదలు పెట్టింది. గత అనుభవాల రీత్యా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, అప్రమత్తతే రోగనిరోధానికి మార్గమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, స్వైన్‌ఫ్లూ నియంత్రణ సాంకేతిక కమిటీ కన్వీనర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మూడో దశ ప్రమాదకరం.. ‘‘స్వైన్‌ఫ్లూ తీవ్రతను బట్టి దాన్ని మేం మూడు కేటగిరీలుగా వర్గీకరించాం. ఇది జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. వీరు డాక్టర్ సూచనల మేరకు తేలిక పాటి చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దనే ఉండి పరిశుభ్రతను పాటిస్తే సరిపోతుంది. ఈ లక్షణాలు 48 గంటల్లో తగ్గుముఖం పడతాయి. ఇక రెండో కేటగిరీ ఫ్లూ జ్వరం ప్రారంభమైన 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా తీవ్రం కావటం, గొంతునొప్పి పెరుగుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మొదటి కేటగిరీలో ఉన్నా బీ రకం కిందకే వస్తారు. ఈ కేటగిరీ వాళ్లంతా సత్వరమే వైద్యుడ్ని సంప్రదించాలి. ఇక 5 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, మధుమేహం, ఆస్తమా, గుండె, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలిక శ్వాస సమస్యలున్న వారు, క్యాన్సరు చికిత్స తీసుకుంటున్న వాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్నవారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది వీరు తప్పనిసరిగా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. సకాలంలో స్పందించి మందులు వాడితే ప్రమాదం ఉండదు. మూడో కేటగిరీ స్వైన్‌ఫ్లూ అత్యంత ప్రమాదకరం. జ్వర తీవ్రత, ఛాతీలో బరువు, బీపీ పడిపోవటం, శరీర రంగు మారటం, దగ్గితే రక్తం పడటం, శ్వాసకు ఇబ్బంది, వాంతులు, వీరేచనాలు, కడుపు నొప్పి మొదలైనవి ఉన్నవారు ఈ కోవలోకి వస్తారు. వీరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సిందే. తెలంగాణా ప్రభుత్వం అన్నీ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డులను ఏర్పాటు చేసింది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినా, వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక ఆసుపత్రి సిబ్బంది తప్పనిసరిగా స్వైన్ ఫ్లూ టీకా వేయించుకోవాలి’’అని శ్రీనివాసరావు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మేజర్ జనరల్
సాక్షి, అమరావతి : భారత ఉప ప్రాంతీయ సైనికాధికారి మేజర్ జనరల్ శ్రీనివాసరావు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు ఉప ప్రాంతీయ కమాండింగ్ జనరల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇలా ఉప ప్రాంతీయ సైనికాధికారి నూతనంగా పదవి స్వీకరించిన ముఖ్యమంత్రులను మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక ఆనవాయితీ. -
బాబుగారు నంది అంటే నంది!
‘‘మా ఇష్టం. మేం చెప్పిందే వేదం. మేం నంది అంటే నంది. కాదంటే కాదు. మేం అన్నట్టే మీరూ అని తీరాలి..’’ ఇదీ ఘనత వహించిన గత సర్కారువారు ఆంధ్రనాటకరంగం యావత్తూ ప్రతిష్టాత్మకంగా భావించే నంది నాటకోత్సవాల విషయంలో వ్యవహరించిన తీరు. చంద్రబాబు చేష్టలతో ఈ ఉత్సవాలు వాసితగ్గి, వన్నె తరిగి చివరకు పూర్తిగా చతికిలబడిపోయాయి. ఆంధ్రనాటకకళకు పూర్వవైభవం సాధించిపెట్టాలని, ఔత్సాహిక నాటకరంగాన్ని జనబాహుళ్యంలో ప్రవర్థమానం చేయాలని తలంచి నంది నాటకోత్సవాలను ఏలికలు ఎన్నో ఏళ్ల కిందటే ప్రారంభించారు. ఏడాదికోమారు ఈ నాటకోత్సవాలను నిర్వహించి ప్రతిభాప్రదర్శనలకు, వ్యక్తిగత నిపుణతకు నంది బహుమతులు అందజేయడం ఆరంభించారు. నంది పురస్కారాలు అందుకున్న నాటక సంఘాలు, నటీనటులు వాటిని కీర్తికిరీటాలుగా తలపోస్తుంటారు. ఒకప్పుడు నంది నాటకోత్సవాలకు దరఖాస్తు చేసుకునే నాటకసంఘాలు ముందుగా పరిశీలక బృందం ఎదుట తమ ప్రతిభా ప్రదర్శన చేస్తుండేవి. పద్యనాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటికలుగా విభజితమైన విభాగాల్లో గుణనిర్ణేతలు స్క్రూటినీ చేసేవారు. రాష్ట్రమంతా ఇలాంటి ప్రదర్శనలను తిలకించి నంది నాటకోత్సవాలకు నాటకాలను, నాటికలను ఎంపిక చేసేందుకు న్యాయనిర్ణేతలు స్వయంగా సమాజాల గడపల్లోకే వెళ్లేవారు. తమ నిర్ణయాన్ని వెల్లడించేవారు. ప్రతీ విభాగంలోనూ ఎంపికైన పదో పన్నెండో నాటకాలు, నాటికలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాలకు తరలివెళ్లేవి. సుమారుగా పదిరోజులపాటు నాటి కాలాన జరిగే ఈ నాటక మహోత్సవాలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారికీ కన్నుల పండుగచేసేవి. ఎక్కడెక్కడి వారూ నంది పోటీలకు హాజరయి చక్కని నాటకాలు అద్భుతంగా ప్రదర్శితమవుతుంటే హాయిగా చూస్తుండేవారు. ఇలా సాగుతున్న ఈ వ్యవహారంలోకి ‘తగుదునమ్మా..’ అని చొరబడిపోయిన చంద్రబాబు సర్కారు నంది నాటకాలు నవ్వులపాలయ్యేలా నిర్ణయాలు చేయడమే విషాదం. తమది విశాల హృదయమంటూ ఊదరగొట్టి నంది నిబంధనలను మూడేళ్ల కిందట పాలకులు ఇష్టానుసారం మార్చేశారు. స్క్రూటినీలకు తెరదించేశామని ప్రకటిస్తూ అడ్డదిడ్డమైన నాటక ప్రదర్శనలన్నింటికీ లాకులు ఎత్తేశారు. యువజన నాటకాలను కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పి, పిల్లల నాటికల విభాగంలో వ్యక్తిగత బహుమతులను రద్దు చేశారు. నంది నాటకాలకు స్క్రూటినీలు లేవని ప్రభుత్వమే ప్రకటించడంతో నాటకప్రదర్శనలు వరదలా పొంగు కొచ్చేశాయి. అందరూ అని చెప్పలేం గానీ, కొంతమంది మటుకు ప్రభుత్వ పారితోషికం కోసం తలాతోకాలేని నాటకాలను వేదికకు చేర్చారు. వందల్లో మందల్లో వచ్చిన ఈ నాటకాలను చూడలేక ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. ఇక ‘నంది నాటకాలు ప్రదర్శించే వారికి పారితోషికం ఇస్తున్నాం కదా..’ అనే నెపం చూపించి ఉత్సవాలు జరిగే వేదికల వద్ద కనీస సదుపాయాలు కూడా అధికారగణం కల్పించడం మానేసింది. దీంతో దూరాభారాలనుంచి వచ్చే నటీనటులు ఆకలి బాధలతో, దాహం కేకలతో అల్లాడిపోవడం మొదలైంది. పోనీ అని, కప్పలతక్కెడగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గెలిచిన వారికయినా గౌరవంగా నంది పురస్కారాలు అందించారా అంటే అదీ లేదు. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులూ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువగానే చదివారు. గతేడాది నందులు పొందేందుకు విజేతలందరినీ ఏలూరు రమ్మనమని పిలిచి, వాళ్లకి నిలువ నీడ లేకుండా చేశారు. అందరినీ ఒక హాల్లో పడేసి సాయంత్రం సమావేశం వేళకి తోటకూరకాడల్లా వేళ్లాడిపోయే స్థితి కల్పించారు. అనేకానేక పథకాల పేరిట కోట్లాదిరూపాయల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టిన బాబు సర్కారు కళాకారుల పట్ల నిర్దయగా వ్యవహరించడాన్ని అప్పట్లో నాటకరంగ ప్రముఖులే ఖండించారు. అయినప్పటికీ చంద్రుడు చలించలేదు. నంది నాటకాలు మళ్లీ గాడిన పడి పూర్వపు జిలుగులతో ఆంధ్రావనిలో విరాజిల్లాలంటే స్క్రూటినీలు నిర్వహించాలని పలువురు సీనియర్లు చెబుతున్న మాట. ఇప్పటి నంది నియమావళిని ప్రక్షాళన చేసి, బాలల క్యాటగిరీలో వ్యక్తిగత బహుమతులను పునరుద్ధరించకపోతే నాటక వికాసం ఒట్టిమాటే అవుతుందని వారంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు హయాంలో బక్కచిక్కిపోయిన నందిని, నటరాజ ప్రాంగణంలో మిలమిల మెరిసే బంగారునందిగా తీర్చిదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. నాటకరంగ ప్రముఖుల, దిగ్ధంతుల సూచనలతో కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ దిశలో పయనించాలనేదే నాటకరంగ కళాకారుల కోరిక. అభ్యర్థన. వ్యాసకర్త ప్రసిద్ధ కథ, నవలా రచయిత, నాటక కర్త ‘ మొబైల్ : 88971 47067 డా: చింతకింది శ్రీనివాసరావు -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
విశాఖపట్నం, చోడవరం: చోడవరం పట్టణ శివారుల్లో ఇనుపరాడ్లతో కొట్టి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జనసంచారం ఉన్న ప్రదేశంలోనే దుండగులు దాడి చేసి హత్య చేయడంతో ఒక్క సారిగా పట్టణం ఉలిక్కి పడింది. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఇక్కడి ద్వారకానగర్‌లో చోడవరానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మండేల శ్రీనువాసరావు (45) హత్యకు గురయ్యాడు. న్యూడిల్స్ శ్రీనుగా పట్టణ, మండల ప్రజలకు సుపరిచితుడైన ఈయన ద్వారకానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన పట్టణంలో మరో ఇల్లు కూడా ఉంది. తన ఇంటికి బంధువులు రావడంతో ద్వారకానగర్ ఇంటి నుంచి దుప్పట్లు తీసుకొని తన రెండో భార్య పద్మావతితో కలిసి పట్టణంలో ఉన్న ఇంటికి వస్తుండగా బయలుదేరిన ఇంటి సమీపంలోనే దుండగులు మాటువేసి ఒక్కసారిగా ఇనుప రాడ్లతో దాడి చేసినట్టు అతని భార్య పద్మావతి చెప్పారు. శ్రీను నల్లటి దుస్తులు ముఖం నుంచి కింద వరకు ధరించిన ఇద్దరు వ్యక్తులు.. వీరువెళ్తున్న మోటా రు సైకిల్‌కు ఎదురుగా వచ్చి ఆకస్మాత్తుగా దా డికి దిగారు. వారిని భార్య,భర్తలిద్దరూ వారించేలోగా దుండుగులు దాడికి తెబడడంతో పద్మావతి కేకలు వేస్తూ పక్కవారిని పిలవడానికి పరుగులు తీశారు. అంతలోనే శ్రీను తలపై ఇనుపరాడ్లతో దాడి చేసి తలపగలగొట్టడంతో అక్కడిక్కడకే మృతిచెందారు. స్థానికులు వచ్చేలోగానే హంతకులు అక్కడ నుంచి పరారయ్యారు. దుండగులు మోటారు సైకిల్‌పై వచ్చారు. జనం సంచారం ఉండే ప్రదేశం, అది కూడా కేవలం 8గంటల సమయంలోనే దాడికి తెగబడి హత్యచేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజలను ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకొని హత్య ఎవరు చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో చోడవరం పట్టణ అధ్యక్షుడిగా ఉన్న శ్రీను ఇటీవల ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. చిన్నవ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనుపై ఎవరు కక్షపెట్టుకొని హత్యచేశారనేది సర్వత్రా నెలకొన్న ప్రశ్న. చోడవరం ఎస్ఐ లక్ష్మణమూర్తి, ఇన్చార్జి సీఐ శ్రీనువాçసరావు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నా రు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతని భార్య పద్మావతి తోపాటు కుటుంబసభ్యులను,స్థానికులు విచా రిస్తున్నారు.డాగ్‌స్వే్కడ్‌నురంగంలోకి దింపారు. ఆరు నెలల్లో రెండు హత్యలు గడిచిన అర్నెళ్లలో ఇది రెండో హత్య. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే చోడవరం పట్టణంలో గడిచిన ఐదేళ్లలో నేరాలు బాగా పెరిగాయి. గత ఏడాది నవంబరు నెలలో చోడవరం కోట వీధికి చెందిన పద్మావతి అనే బాలికను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి పెట్రోల్‌పోసి కాల్చి హత్యచేశారు. ఆ హత్యకూడా ఇదే ద్వారకానగర్ శివార్లలోనే జరిగింది. ఇప్పుడు న్యూడిల్స్ శ్రీను హత్య కూడా ఇదే ప్రదేశంలో జరగడంతో చోడవరం పట్టణంతోపాటు పరిసర లక్ష్మీపురం,ఇతర గ్రామాల ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో తరుచూ పెట్రోలింగ్ నిర్వహించవలసిన పోలీసులు నామమాత్రంగానే వ్యవహరిస్తుండడంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నేరాలను అదుపుచేయడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలకు కోరుతున్నారు. -
శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు ఎన్ఐఏ కోర్డులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్ జ్యూడిషీయల్ రిమాండ్ ఇవాల్టితో ముగియనున్న విషయం తెలిసిందే. తనకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్సం కోసం బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. లేఖ ద్వారా న్యాయమూర్తికి బెయిల్ పిటిషన్‌పై గతంలోనే విన్నవించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌పై కోర్టు నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. -
ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు
-
ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుని వారం రోజులు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని రాష్ట్రపోలీస్‌శాఖను విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే ఎన్ఐఏకు అప్పగించాలని, ప్రతి మూడు రోజులకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. శ్రీనివాస్ కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని, విచారణలో భాగంగా నిందితుడిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించరాదని స్పష్టం చేసింది. విశాఖ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసును ఇటీవల కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కి అప్పగించిన సంగతి తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు విచారణ మొదలుపెట్టారు. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగిన సమయంలో విశాఖ పోలీసులు ఎన్ఐఏ అధికారులకు రికార్డులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాస్‌రావును తమకు అప్పగించాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కత్తి శీనుతో కొత్త డ్రామా!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మరో డ్రామాకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ‘మార్పు కోసం’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రతిపక్ష నేతను అంతమొందించేందుకు పథకం వేసిన పెద్దలే తాజా నాటకానికీ సూత్రధారులనే ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరావు రాసినట్లుగా చెబుతున్న 11 పేజీల లేఖలో పేర్కొన్న అంశాలనే ఓ పుస్తకంగా ముద్రించి నిందితుడికి ప్రచారం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తాను చెప్పదలుచుకున్న అంశాలను శ్రీనివాసరావు 22 పేజీల నోట్‌బుక్‌లో రాసినట్టు అతడి తరపు న్యాయవాది ఎ.సలీం ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ మంత్రి, జైళ్ల శాఖ డీఐజీ, డీజీలకు లేఖ రాస్తానని చెప్పారు. పుస్తకం పేరుతో శ్రీనివాసరావు కాగితాలపై రాసిన విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి తెలియజేస్తానని విశాఖ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఖైదీలు రాసిన పుస్తకం విడుదలకు వీలు కాదని స్పష్టం చేశారు. -
శ్రీనివాసరావు సేవలో ముగ్గురు ఖైదీలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు విశాఖ సెంట్రల్ జైల్లో వీఐపీ మర్యాదలు అందుతున్నాయి. చిత్రావతి హై అలర్ట్ బ్లాక్‌లో రిమాండ్ ఖైదీగా ఒంటరిగా ఉంచిన శ్రీనివాసరావుకు సదుపాయాలను సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు ఉంటున్న గదిని శుభ్రం చేయడం, వ్యక్తిగత పనులు, భోజనం గదికి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఖైదీలను ఏర్పాటు చేశారు. బిహార్‌కు చెందిన భాయ్, జలీల్, ఒడిశాకు చెందిన మిధుల్ అనే ఖైదీలను శ్రీనివాసరావుకు సేవలు చేసేందుకు నియమించారు. ఇతర రిమాండ్ ఖైదీలు కలవకుండా కట్టడి.. జైల్లో శ్రీనివాస్ ఉంటున్న గది వద్దకు నలుగురు కాపలా పోలీసులు, సేవలు అందిస్తున్న ముగ్గురు ఖైదీలు, జైలు ఉన్నతాధికారులు మినహా ఇతరులు ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిందితుడికి జైల్లో జరుగుతున్న రాచ మర్యాదలు ప్రతిపక్ష నేతపై హత్యాయత్నాన్ని ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పెద్దలే చేయించారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. (అల్లిన కథే.. మళ్లీ) శ్రీనివాస్‌కి సేవలు చేస్తే రోజూ నాన్‌వెజ్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైలుకి తరలించినప్పుడు అతడికి అవసరమైన సేవలు చేస్తే రోజూ శ్రీనివాసరావుకు అందించే మాంసాహారాన్నే ఇస్తామని జైలు అధికారులు ఖైదీలకు ఆఫర్ ఇచ్చారు. ఆసక్తి చూపిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖైదీలను కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేశారు. -
శ్రీనివాసరావుకు మరో 14 రోజుల రిమాండ్
విశాఖ లీగల్/ విశాఖ క్రైం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు జ్యూడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులపాటు పొడిగిస్తూ విశాఖ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై గత నెల 25న జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్టయిన శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో అతడిని శుక్రవారం మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, డిసెంబర్ 7 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ పూర్తయ్యే వరకు చొక్కాను అప్పగించొద్దు హత్యాయత్నం జరిగిన సమయంలో వైఎస్ జగన్ ధరించిన చొక్కాను కోర్టు ఆదేశాల మేరకు జగన్ తరఫు న్యాయవాది షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. చొక్కాకు సంబంధించిన వివరాలతో మెమో కూడా ఫైల్ చేశారు. అనంతరం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసు ఇవ్వాలని జడ్జి ఆదేశించగా.. ఏపీపీ అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారి బీవీఎస్ నాగేశ్వరరావుకు కోర్టు సమక్షంలోనే నోటీసులందజేశారు. మరోవైపు హత్యాయత్న ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఈ నెల 27న విచారణకు రానున్నందున అప్పటివరకు ఆ షర్ట్‌ను విచారణ అధికారికి గానీ, సిట్ పోలీసులకు గానీ అప్పగించొద్దని జగన్ తరఫు న్యాయవాది మెజిస్ట్రేట్‌ను కోరారు. అప్పటి వరకు కోర్టు కస్టడీలోనే ఉంచాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మేజిస్ట్రేట్ రూల్ పొజిషన్ పరిశీలించి ఆర్డర్ పాస్ చేస్తామన్నారు. కోర్టులపై తమకు ప్రగాఢ విశ్వాసం ఉందని వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ చెప్పారు. -
నిందితుడి దస్తూరి నమూనాల సేకరణ
విశాఖ క్రైం/అల్లిపురం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును దస్తూరి నమూనాలను పోలీసులు బుధవారం సేకరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతన్ని విశాఖ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట బుధవారం హాజరుపర్చారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో నిందితుని జేబులో 11 పేజీల లేఖ ఉందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లేఖలో ఎనిమిది పేజీలు తన సోదరి విజయదుర్గతోనూ, రెండు పేజీలు స్నేహితుడు రేవపతిపతితో రాయించాడని, చివరి పేజీలో మాత్రం స్వహస్తాలతో రాసి చంటి అని సంతకం చేసి పక్కనే తన చిరునామా రాసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ లేఖలో దస్తూరిని విజయ దుర్గ, రేపతిపతి దస్తూరితో పోలీసులు సరిపోల్చారు. వారి దస్తూరిలతో పాటు నిందితుడి దస్తూరిని, లేఖని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపేందుకు అనుమతి కోరుతూ ఆరురోజుల కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిందితుడ్ని సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ సమక్షంలో నిందితుని దస్తూరిని సేకరించారు. చివరి పేజీలో నిందితుడు రాసినట్టుగా చెబుతున్న విషయాలనే మేజిస్ట్రేట్ సమక్షంలోనే ఎనిమిది పేజీల్లో రాయించి ప్రతి పేజీ కింద అతని సంతకాలను తీసుకున్నారు. -
ఆ ఫోన్లలో ఏమీ లేదట!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు, అతని స్నేహితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో అనుమానించదగ్గ అంశాలేమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తేల్చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరినప్పటి నుంచి నిందితుడు తొమ్మిది సెల్ఫోన్లు, రెండు సిమ్‌లు వాడినట్లు.. ఏడాదిలో పదివేల కాల్స్ మాట్లాడినట్టుగా గుర్తించారు. ఈ కాల్స్ ద్వారా దాదాపు 321మందితో సంభాషించినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. నిందితుడు వాడిన సెల్ఫోన్లతో పాటు తన సిమ్‌కార్డులు వేసి మాట్లాడిన వేరే సెల్ఫోన్లలో ఒకటి మినహా మిగిలిన ఎనిమిదింటినీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడితో కలిసి పనిచేస్తున్న రమాదేవి, రేవతిపతి, హేమలత సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని వారం రోజులపాటు విశ్లేషించారు. గడిచిన ఏడాది కాలం నాటి డేటాను పరిశీలించారు. ఇందులో అనుమానించదగ్గ, అభ్యంతరకరమైన అంశాలేమీ లేవని సిట్ అధికారి ఒకరు “సాక్షి’కి తెలిపారు. మరోవైపు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగనగర్‌కు చెందిన ముస్లింలతో మాత్రమే వైఎస్ జగన్‌పై తాను చేయబోయే హత్యాయత్నాన్ని ప్రస్తావించినట్టుగా గుర్తించారు. వేరొకరి ఫోన్లలో తన సిమ్ ద్వారా కాల్స్ కాగా, శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వారి ఫోన్లను తీసుకుని అందులో తన సిమ్ కార్డు వేసుకుని మాట్లాడేవాడని.. అనంతరం తన సిమ్ తీసుకుని వారి ఫోన్లకు వారికి ఇచ్చేసేవాడని సిట్ అధికారుల పరిశీలనలో తేలింది. ఆరు రోజుల కస్టడి అనంతరం కూడా శ్రీనివాసరావు నుంచి పోలీసులకు దీనిపై స్పష్టత రాలేదు. పోలీస బాస్ సూచనల మేరకే నివేదిక? ఇదిలా ఉంటే.. కేసు పురోగతిపై వచ్చే మంగళవారం హైకోర్టుకు సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉన్నందున సిట్ అధికారులు శనివారం పూర్తిగా ఆ నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు శ్రీనివాసరావును దాటి విచారణ ముందుకు సాగనందున పోలీస్ బాస్ సూచనల మేరకు నివేదిక తయారవుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఎల్లుండి హైకోర్టుకు నివేదిక : సీపీ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించిన అన్ని విషయాలూ న్యాయస్థానానికి మంగళవారం నివేదిస్తామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా తెలిపారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కేసులో ఒక్క శ్రీనివాసరావునే నిందితుడిగా చూపిస్తున్నారు.. ఇతరులెవర్నీ ఇంకా గుర్తించలేదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఈ కేసు దర్యాప్తు అంశాలపై ప్రస్తుతం స్పందించలేనని చెప్పారు. ఆ వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదించిన అనంతరం మీడియాకు వెల్లడిస్తానన్నారు. అలాగే, జగన్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని.. అదనపు భద్రత అడిగితే పరిశీలిస్తామని లడ్హా చెప్పారు. -
హర్షవర్ధన్ చౌదరి జోలికి వెళ్లొద్దు సీఎంవఓ నుంచి ఆదేశాలు
-
శ్రీనివాస్ రిమాండ్ పొడిగించే అవకాశం
-
హర్షవర్ధన్ చౌదరి జోలికి వెళ్లొద్దు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అధికార తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి పాత్రను నిగ్గుతేల్చడంపై పోలీసులు చేతులెత్తేశారు. ఆ రెస్టారెంట్ కేంద్రంగానే జగన్‌పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాము హర్షవర్దన్ చౌదరి జోలికి వెళ్లలేమని, ఆ మేరకు తమకు పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని విశాఖ పోలీసులు పేర్కొంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచే ఆదేశాలు అందాయని అంటున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు ఈ కేసు విచారణను కేవలం నిందితుడు శ్రీనివాసరావుకే పరిమితం చేశారు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పక్కా స్క్రీన్‌ప్లేతో విచారణ డ్రామాను రక్తి కట్టించారు. హర్షవర్దన్ చౌదరిని ప్రశ్నించని పోలీసులు ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో నిందితుడు శ్రీనివాసరావు సహోద్యోగులైన యువతీ యువకులను ఆరు రోజుల విచారణ సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే ఉంచేవారు. ఓ దశలో స్టేషన్ వద్దనే పడిగాపులు కాస్తున్న మీడియా సిబ్బంది... ఆడపిల్లలను ఇప్పటివరకు స్టేషన్లో ఉంచితే ఎలా? అని ప్రశ్నిస్తే పోలీసులు హడావుడిగా ఆటోలు తెప్పించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీనివాసరావు సహోద్యోగులను అర్ధరాత్రి దాకా స్టేషన్లోనే ఉంచి, విచారణ డ్రామాను నడిపించిన పోలీసులు ఆ రెస్టారెంట్ యజమాని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల సన్నిహితుడైన హర్షవర్దన్ చౌదరిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయలేకపోయారు. స్టేషన్లో ఉన్న తన రెస్టారెంట్ సిబ్బందిని తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడల్లా హర్షవర్దన్ చౌదరి పోలీస్ స్టేషన్లో దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు. పోలీసులంటే తనకు ఓ లెక్క కాదన్నట్లుగా ప్రవర్తించేవాడు. తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే నో పార్కింగ్ బోర్డు వద్ద పార్క్ చేసేవాడంటే అతడి వ్యవహార శైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఎయిర్‌పోర్టులో నో పార్కింగ్ బోర్డ్ వద్ద హర్షవర్దన్ చౌదరి కారు పార్క్ చేసిన దృశ్యం.. ఎదురుగా ఉన్న వాహనం నగర పోలీస్ కమిషనర్‌ది హర్షవర్దన్ చౌదరి అండ లేకుండానే నిందితుడు బరితెగించాడా? గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరావును రక్షణ శాఖ అధీనంలోని విశాఖ ఎయిర్‌పోర్టులో తన రెస్టారెంట్లో నియమించుకోవడం.. కత్తులు, మారణాయుధాలతో ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో అతడు విచ్చలవిడిగా సంచరించడం, శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా వసతి కల్పించడం, మిగిలిన ఉద్యోగుల కంటే అధికంగా వేతనం ఇవ్వడం, వైఎస్ జగన్‌పై వ్యూహాత్మకంగానే ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం చేయడం.. ఈ వరుస పరిణామాలను గమనిస్తే హర్షవర్దన్ చౌదరి అండ లేకుండానే శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి తెగబడ్డాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 25న మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా 10 నిమిషాల ముందే హర్షవర్దన్ చౌదరి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటన తరువాత శ్రీనివాసరావు చాలా మంచోడండి, అమాయకుడండి, ఏదో అభిమానంతో పిచ్చి పని చేసుంటాడు అని వకాల్తా పుచ్చుకున్న హర్షవర్దన్ చౌదరి తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి పాల్పడితే... సదరు ఉద్యోగినే వెనకేసుకొచ్చిన హర్షవర్దన్ చౌదరి నిర్వాకంపై పోలీసులు దృష్టి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. పోలీసులు తమపై వస్తున్న విమర్శలకు తలొగ్గి హర్షవర్దన్ చౌదరిని దీపావళి పండుగ తర్వాత తమదైన శైలిలో విచారించాలని భావించారు. అయితే, హర్షవర్దన్ చౌదరి జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తాము మిన్నకుండిపోయామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. హర్షవర్దన్ చౌదరిని విచారిస్తే మొత్తం డొంకంతా కదిలి కుట్రకోణం బట్టబయలై, అసలు కుట్రదారుల పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉండడం వల్లే సీఎంవో నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో బీసీఏఎస్ దర్యాప్తు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా(బీసీఏఎస్) అధికారులు గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బీసీఏఎస్ అధికారి పాల్ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్, పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. హత్యాయత్నం జరిగిన తీరు, తదనంతర పరిణామాల గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విజయదుర్గను మరోసారి విచారించనున్న ‘సిట్’ ముమ్మిడివరం: ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు వద్ద దొరికాయని చెబుతున్న లేఖలను రాసిన అతడి సమీప బంధువు విజయదుర్గను గతంలో ‘సిట్’ సీఐ విశ్వేశ్వరరావు విశాఖపట్నం తీసుకువెళ్లి, విచారించి, తిరిగి పంపించారు. ఆయితే, మూడు రోజుల క్రితం విజయదుర్గ ఫోన్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాల్‌డేటా ఆధారంగా మరోసారి విచారించేందుకు విజయదుర్గను విశాఖపట్నం తీసుకురావాలని స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పోలీసులు గురువారం ఆమెను విశాఖపట్నం తీసుకెళ్లారు. -
ఇక పోలీస్ కస్టడీ లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు మరోసారి పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు కన్పించడం లేదు. కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితుడికి తొలుత 14 రోజులపాటు రిమాండ్ విధిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత కేసు తీవ్రతను బట్టి రిమాండ్‌ను పొడిగిస్తారు. కనీసం 90 రోజులపాటు రిమాండ్‌లో ఉంచే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద కేసులోనైనా నిందితుడిని తొలి రిమాండ్ గడువు మీరకుండా పోలీస్ కస్టడీకి ఇస్తుంటారు. 14 రోజుల రిమాండ్ కాలంలో నిందితుడిని ఎన్నిసార్లయినా జ్యుడీషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి అప్పగించే అవకాశాలుంటాయి. ఆ తర్వాత రెండో రిమాండ్ సమయంలో మాత్రం పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతమాత్రం ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టయిన నిందితుడు శ్రీనివాసరావును ఇప్పటికే ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. కస్టడీ గడువు ముగియగానే మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, తిరిగి రిమాండ్‌కు తరలించారు. పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు నిందితుడు పూర్తిస్థాయిలో సహకరించని కారణంగా విచారణలో నిజాలను రాబట్టలేకపోయామని, మరో వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ‘సిట్’ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసు కస్టడీ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చే సమయంలో హడావుడిగా పిటిషన్ దాఖలు చేయడం వల్లే తోసిపుచ్చిందని న్యాయ నిపుణులు అంటున్నారు. మరో పిటిషన్ దాఖలు చేసినా దాన్ని కోర్టు పెండింగ్‌లో ఉంచింది. మరోవైపు నిందితుడి రిమాండ్ గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనుండడంతో మరోసారి పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. నిందితుడిని మూడో మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో శుక్రవారం హాజరుపర్చనున్నారు. మరో 14 రోజులపాటు రిమాండ్‌ను పొడిగించే అవకాశాలున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మొదటి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కమ్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనున్నట్లు సమాచారం. మానసిక వైద్యాలయం నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని జైలుకు పంపి, నిందితుడు శ్రీనివాసరావకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ నిందితుడి తరపున నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం గురువారం కోర్టులో ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయం తీసుకుంటారని అబ్దుల్ సలీం చెప్పారు. సాక్షులకు నోటీసులు! ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. కానీ విచారణ సాగుతున్న తీరును నిరసిస్తూ సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు నిరాకరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు తమకు అభ్యంతరం వారు తేల్చిచెప్పారు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలోనే వాంగ్మూలం రికార్డు చేయడానికి వీలుగా సీఆర్పీసీ 164 కింద నోటీసులు జారీ చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సిట్ అధికారులు పేర్కొంటున్నారు. పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు నిందితుడు గతంలో పని చేసిన హైదరాబాద్, బళ్లారి, బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించారు. కస్టడీ పొడిగింపును కోర్టు నిరాకరించినప్పటికీ ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేని రీతిలో అన్ని కోణాల్లో దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తామని సిట్ అధికారి బీవీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. -
‘శ్రీనివాసరావుకు మరో రెండు వారాలు రిమాండ్ పెంచండి’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అతనికి విధించిన 14 రోజుల రిమాండ్ రేపటి (శుక్రవారం)తో ముగియనుంది. (సిట్ నివేదికను సమర్పించండి : హైకోర్టు) కాగా, విచారణ ఇంకా పూర్తి కానందున శ్రీనివాసరావు రిమాండ్ గడువు మరో రెండు వారాలు పొడిగించాలని సిట్ విశాఖపట్నం కోర్టులో మెమో దాఖలు చేసింది. అలాగే నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని మరో మెమో దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సాక్షుల నుంచి వివరాల సేకరణకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నోటీసులు ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. -
మట మార్చిన శ్రీనివాసరావు సోదరుడు
-
మరోసారి విచారణ!
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును మరో వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో పిటిషన్‌ను వేసింది. హత్యాయత్నం జరిగిన తరువాత ఆరు రోజుల పాటు తమ కస్టడీలో చెప్పుకోతగ్గ విషయాలను రాబట్టలేకపోయామని భావిస్తున్న సిట్ అధికారులు శ్రీనివాసరావును మరోసారి విచారించాలని నిర్ణయించారు. శనివారం కస్టడీ ముగియగానే నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చే సమయంలో కస్టడీ పొడిగింపు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో సిట్ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు దీపావళి తర్వాత రెండు మూడురోజుల్లో విచారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పక్కాగానే హత్యాయత్నం నిందితుడు శ్రీనివాసరావు కొన్ని నెలలుగా పక్కా ప్రణాళిక వేసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టాడని సిట్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ముందుగా ప్రచారంలోకి వచ్చినట్టు అతనికి ఎలాంటి మానసిక వైకల్యం లేదని, పూర్తి ఆరోగ్యవంతుడని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆరురోజుల పాటు కస్టడీ సమయంలో వివిధ కోణాల్లో విచారించిన విషయాలను పరిశీలించగా.. శ్రీనివాసరావు చెప్పిన విషయాలన్నీ ముందే తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారమే చెప్పినవని పోలీసులు గుర్తించారు. సాధారణ నేరస్తులు కస్టడీలో కొన్ని అంశాలపై పొంతన లేని సమాధానాలు చెప్పి దొరికిపోతారు. కానీ పక్కా కరుడుగట్టిన, కిరాయి హంతకులే ఇంత పక్కాగా కస్టడీ విచారణలోనూ పోలీసులను పక్కదారి పట్టించగలరని చెబుతున్నారు. శ్రీనివాసరావు తీరు కూడా అదే విధంగా ఉండడం సాధారణ విషయంకాదని ఓ ఉన్నతాధికారి సాక్షి వద్ద వ్యాఖ్యానించారు. శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేదు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయవాది అబ్దుల్ సలీం విశాఖ 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని, వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అభ్యర్థిస్తూ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లాలని సూచించారు. న్యాయవాది సలీం నిందితుడు శ్రీనివాస్‌ను శనివారం జైలులో ములాఖత్‌లో కలిశారు. నిందితుడి ఆరోగ్యం బాగుందన్న వైద్యులు.. నిందితుడు శ్రీనివాస్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కేజీహెచ్ వైద్యులు కస్టడీ సమయంలో నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించి నిర్ధారించారు. కస్టడీలోకి తీసుకున్న మూడో రోజు గుండెలో నొప్పిగా ఉందని నిందితుడు పేర్కొనడంతో తొలుత ప్రైవేట్ వైద్యుడితో స్టేషన్లో పరీక్షలు నిర్వహించిన అధికారులు అనంతరం కేజీహెచ్‌కు తరలించి బీపీ, షుగర్, పల్స్ కార్డియాక్ పరీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత రోజూ కేజీహెచ్ వైద్యుల్ని రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన ప్రతిసారీ నిందితుడు శ్రీనివాస్ నూటికి నూరు శాతం ఫిట్‌గా ఉన్నాడని, అతడి మానసిక పరిస్థితి కూడా బాగుందని వైద్యులు మీడియా ఎదుటే చెప్పారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరు పర్చే సమయంలో కూడా నిందితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడంటూ కేజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. నిందితుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా అతడికి మతిస్థిమితం లేదని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మానసికంగా ధృఢంగా ఉన్నాడని, ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా చెబుతున్నాడని విచారణాధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని, మానసిక వైద్యులతో పరీక్షించాలంటూ సీఆర్పీసీ 65ఏ కింద పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. సామాజిక బాధ్యతతోనే పిటిషన్ వేశా.. ‘సామాజిక బాధ్యతతోనే ఉచితంగా ఈ కేసులో వాదించాలని నిర్ణయించుకున్నా. నన్ను బయటకు తీసుకురావద్దు. జైలులోనే ఉంటా. ఇక్కడే బాగుంటుందని నిందితుడు చెప్పాడు. అయితే బెయిల్ కోసం ఒప్పించి నిందితుడి అనుమతితోనే పిటిషన్ వేశా. అతడి కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడా.’ – అబ్దుల్ సలీం, న్యాయవాది -
ఎవరో చేయించారు
సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నా తమ్ముడితో ఎవరో కుట్రతోనే హత్యాయత్నం చేయించారు. ఎవరు చేయించారో చెబుదామన్నా చేయించిన వాళ్లు మా వాడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పలేకున్నాడేమో. వాళ్లేదో డబ్బు ఇస్తామని ఆశ పెట్టి ఉంటారు. దీంతో వీడు భూమి కొందామని అనుకుని ఉంటాడు. అందుకే ఇలా చేసి ఉంటాడేమో. కానీ ఇప్పుడు వాళ్లు డబ్బులు వేసినా ప్రయోజనమేమిటి. నా తమ్ముడు బలైపోతున్నాడు’. ఇవీ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు సోదరి రత్నకుమారి కన్నీటితో అన్న మాటలు. తూర్పుగోదావరి జిల్లా ఠానేల్లంకకు చెందిన జనిపల్లి శ్రీనివాసరావు సోదరి శనివారం ముమ్మిడివరంలో ఆమె ఇంటి వద్ద ‘సాక్షి’తో అన్న మాటలు. ఆమె ఇంకా ఏమన్నారంటే.... చేతిలో రూపాయి కూడా లేని శ్రీనివాసరావు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు. ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. నా తమ్ముడు ఇంతటి నేరం చేశాడంటే నమ్మలేకపోతున్నా. ఇందుకు కారకులైన వారు ఇప్పుడు నా తమ్ముడిని ఏమి చేస్తారో. వాడు ఏమైపోతాడోనని ఆందోళనగా ఉంది. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు. ఇక వాళ్లు పట్టించుకోరు... ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. ఇక వాడిని వాళ్లు పట్టించుకోరు. అక్కడకు (విశాఖపట్నం) వెళ్లిన తరువాతే అలా అయ్యాడు. ఆ టైంలో ఏమైనా ఇప్పుడు వాడు నిజం చెప్పడానికి లేదు. బాగా భయపెట్టి ఉంటారు. నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. అప్పుడు వాడి చేతిలో రూపాయి ఉండేది కాదు, అక్కా 20 రూపాయలు ఇవ్వమని అడిగే వాడు. బండిలో పెట్రోలు పోసుకోవడానికి కూడా వాడి వద్ద డబ్బులుండేవి కావు. అప్పుడప్పుడు రూ.20లు, రూ.30లు కూడా ఇచ్చినా తీసుకునే వాడు. ఆరుగురిలో ఒకడు పోయినట్టేకదా అసలు ఇలా చేయాల్సిన పనికాదు, ఎందుకు చేశాడో తెలియడం లేదు. నా పరిస్థితి ఏమిటని వాడు మెడ వాల్చేసి ప్రాణహాని ఉందని పోలీసులు తీసుకు వెళుతున్నప్పుడు చెబుతుంటే... టీవీల్లో చూసి మాకు గుండె ఆగినంత పనైంది. మా ఆరుగురులో ఒకడు చెదిరిపోయినట్టే కదా.. వాడు తిరిగొస్తాడా అని బాధ కలుగుతుంది. వాడి వయసు ఎంత.. ఇలా చేస్తాడంటే నమ్మగలమా. ఇక దేవుడే దిక్కు: తండ్రి తాతారావు ఠానేల్లంకలో తండ్రి తాతారావును పలకరిస్తే నా కొడుక్కు దేవుడే దిక్కు అంటూ విలపించాడు. పిల్లలను కంటాం, పెంచుతాం. కానీ ఇలా అవుతాడని అనుకోం కదా. నా భార్య చూస్తే అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వాడు ఇప్పట్లో బయటకు వస్తాడా అని భాద కలుగుతోంది. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు. ఎప్పుడూ ఇలా చేస్తాడని అనుకోలేదయ్యా. ముఖ్యులు, బాస్‌ల నోట్లో పచ్చివెలక్యాయ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్న ఘటన అంతా డ్రామా అంటూ ఎగతాళి చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులకు దిమ్మతిరిగేలా శ్రీనివాసరావు రక్తసంబంధీకుల మనోభావాలున్నాయి. సంచలనం కోసం అలా చేశాడని డీజీపీ, అతడు రాసినట్లు చెబుతున్న లేఖే ప్రామాణికమని సిట్ అధికాలు చెప్పడం అంతా తప్పుడు సమాచారమేనని, కుట్ర కోణాన్ని బైటకు తీయకుండా ముఖ్యులు ఆడినట్లు ఆడారని నిందితుడి బంధువుల అభిప్రాయాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
విశాఖ ఎయిర్పోర్ట్ సీఎస్‌వో బదిలీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రదారులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చెన్నైకి బదిలీ చేసింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా, సూత్రధారుల జోలికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ మొక్కుబడిగా విచారణ చేస్తుంటే.. కేంద్ర పరిధిలోని సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అప్పుడే చర్యలు మొదలు పెట్టాయి. ఘటన జరిగిన అక్టోబరు 25న అనుమానాస్పదంగా వ్యవహరించిన సీఎస్‌వో వేణుగోపాల్‌ను చెన్నైకి సాగనంపుతూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆది నుంచీ టీడీపీ నేతలతోనే.. ఐదేళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే కొనసాగుతున్న వేణుగోపాల్‌కు ఇప్పటివరకు రెండుసార్లు బదలీ ఉత్తర్వులు వచ్చినా అధికార పార్టీ నేతల అండతో నిలిపివేయించుకున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలతో అంటకాగే వేణుగోపాల్.. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో కూడా చెట్టపట్టాల్ వేసుకుని తిరిగేవారు. ఘటన జరిగిన రోజు ఆయన వ్యవహారశైలి జగన్‌పై హత్యాయత్న కుట్రకు సహకరించారనేలా ఉంది. ఇదే విషయమై సీఐఎస్ఎఫ్ అధికారులు వేణుగోపాల్ వ్యవహారశైలిని సూటిగా ప్రశ్నించారు కూడా. హత్యాయత్న ఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్ పక్కన ఉండకుండా నిందితుడు శ్రీనివాసరావు వెంట ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని నిలదీశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారు వేణుగోపాల్‌పై ప్రశ్నలు కురిపించారు. కప్పు కాఫీకి అనుమతించలేదుగానీ.. వైఎస్ జగన్ గత రెండు నెలలుగా ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన సందర్భాల్లో వైఎస్సార్సీపీ స్థానిక నేత జియ్యాని శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హత్యాయత్న ఘటనకు రెండు వారాల క్రితం సీఎస్‌వో వేణుగోపాల్.. బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్‌కు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తామని ఎంత చెప్పినా వేణుగోపాల్ అంగీకరించలేదు. ఇదే అదనుగా శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే వేణుగోపాల్ బయట నుంచి వస్తున్న కాఫీని అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తాయి.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి కూడా బయటి నుంచి వచ్చే ఫుడ్‌నే ఎయిర్పోర్ట్ వీవీఐపీ లాంజ్‌లో తీసుకుంటుంటారు. వైఎస్ జగన్‌కు తీసుకువచ్చే కాఫీ విషయంలో వేణుగోపాల్ వ్యవహరించిన తీరుతోపాటు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులోకి స్వేచ్ఛగా కత్తులు తీసుకువచ్చినా అడ్డుకోలేకపోవడంతో ఆయనపై సందేహాలు బలపడ్డాయి. -
తూతూమంత్రంగా సిట్ విచారణ పూర్తి
-
ఊహించిందే జరిగింది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయట పడకుండానే విచారణ ముగిసింది. కుట్రదారుల ప్రస్తావన లేకుండానే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారుచేశారు. ఆరు రోజులు పోలీసు కస్టడీకి తీసుకుని ఏమీ రాబట్టలేకపోయారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి ఒడిగట్టిన వ్యక్తినుంచి కుట్ర సమాచారాన్ని రాబట్టలేక పోవడం పోలీసుల వైఫల్యాన్ని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతోందని జనం కోడై కూస్తున్నా పోలీసులు మాత్రం ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్ మేరకే విచారణ జరిపారు. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ ఠాకూర్ చేసిన ప్రకటనలకు ఊతమిచ్చే విధంగా ఆరు రోజుల విచారణ డ్రామాను సిట్ బృందం రక్తి కట్టించింది. ఫోన్‌కాల్స్ ఆధారంగా శ్రీనివాసరావు స్నేహితులు, అతను పని చేస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ సిబ్బంది, యజమాని విచారణతోనే కాలయాపన చేసి సూత్రధారులు, పాత్రదారులుల ప్రస్తావన లేకుండానే విచారణ డ్రామాకు తెరవేశారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వతేదీ మధ్యాహ్నం వీవీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కనీసం ప్రాధమిక విచారణ చేపట్టకముందే డీజీపీ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే... ఓ చిన్నపాటి ఘటనే.. అని ప్రకటించేశారు. డీజీపీ ప్రకటన అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చిన రీతిలో మాట్లాడారు. ఇక సిట్ అంటే సిట్..స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు గానే ఆరురోజుల కస్టడీ నాటకాన్ని విశాఖపట్నంలో సిట్ బృందం రక్తికట్టించింది. చివరి రోజు రికార్డువర్కుకే పరిమితం చివరి రోజైన శుక్రవారం విచారణ జోలికి వెళ్లని సిట్ అధికారులు పూర్తిగా రికార్డు వర్కుకే పరిమితమయ్యారు. దర్యాప్తు వివరాలను క్రోడీకరిస్తూ రిపోర్టు తయారు చేయడానికే గడిపేశారు. నిందితుడ్ని కేజీహెచ్ నుంచి రప్పించిన వైద్యులతో పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 3.20 గంటలసమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావును మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ మళ్లీ జ్యూడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు. కస్టడీ సమయంలో నిందితుడు పూర్తి స్థాయిలో సహకరించలేదంటూనే మరో ఆరురోజుల కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పద్ధతి ప్రకారం ఫైల్ చేయలేదంటూ మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. కస్టడీలో నిందితుణ్ని న్యాయవాది సమక్షంలోవిచారించలేదని, పోలీసులే సొంతంగా చేసుకున్నారని, ఇది చట్టవిరుద్దమంటూ మరో వైపు అబ్దుల్ సలీమ్ అనే న్యాయవాది నిందితుడి తరపున 41డీ, సీఆర్ సీపీ కింద మెమో ఫైల్ చేశారు. కానీ ఈ మెమోలో నిందితుడి సంతకం లేకపోవడంతో దాన్ని కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. మరోవైపు కోర్టులో నిందితుడు శ్రీనివాసరావు మెజిస్ట్రేట్ ముందు హిందీ, ఉర్ధూ భాషల్లో ఏదో మాట్లాడేందుకు యత్నించినా పోలీసులు నిలువరించారు. నివేదిక సమర్పించని సిట్ ఘటన జరిగినప్పటి నుంచి నేటి వరకు సాగిన దర్యాప్తు నివేదికతో పాటు కస్టడీ సమయంలో నిందితుడ్ని విచారించిన తీరుపై వేర్వేరుగా రిపోర్టులు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. కానీ వాటిలో ఏ ఒక్కటి సమర్పించ కుండానే నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చారు. హర్షవర్ధన్‌ను కనీసంగా విచారించని పోలీసులు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతని ప్రేరేపించి, ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలను కనీసంగా రాబట్టలేకపోయారు. ఇక కుట్రకు కేంద్రంగా భావిస్తున్న శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని వరుసగా మూడు రోజుల పాటు చుట్టపుచూపుగా పిలిపించడం, పంపించడం తప్ప అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించిన పాపాన పోలేదు. ఆరురోజులూ హైడ్రామానే.. మొదటిరోజు సీఐఎస్ఎఫ్ అధికారులనుంచి స్థానిక పోలీసులు నిందితుడిని స్వాధీనం చేసుకునే ముందు 11 పేజీల లేఖ పేరుతో నాటకం మొదలు.. కస్టడీలో మూడోరోజు డాక్టర్లు ఆరోగ్యంగానే ఉన్నాడని ధ్రువీకరించినా..మీడియాతో మాట్లాడించేందుకు ఉద్దేశ్యపూర్వకంగా వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నేను జగన్ అభిమానినే.. ఇదంతా ప్రజల కోసమే చేశా.. నా వెనుక ఎవరూ లేరు.. నన్ను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారు.. ఒకవేళ నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండని నిందితుడితో చెప్పించారు. కేసు పురోగతి పట్టని సీపీ కేసు ఫైల్ చేసిన వెంటనే హడావుడి చేసిన విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా కస్టడీ మూడో రోజు నుంచే విచారణ వైపుకన్నెత్తి చూడలేదు. కాల్‌డేటా విశ్లేషణలో విశేష అనుభవం ఉందంటూ విచారణ బాధ్యతలను అప్పగించిన ఫకీరప్పను ఉన్నట్టుండి తప్పించి.. బదలీపై కొత్తగా వచ్చిన డీసీపీ నయీమ్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు, స్నేహితులు, సహచర ఉద్యోగులు, కాల్‌డేటా ఆధారంగా 52 మందిని విచారించి స్టేట్మెంట్స్ రికార్డు చేయడం మినహా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సీసీ ఫుటేజ్ విశ్లేషణలో ఏం తేలిందో తెలియదు. హై సెక్యూరిటీ బ్లాక్‌లో నిందితుడు ఆరిలోవ (విశాఖ తూర్పు): పోలీసు కస్టడీ ముగిసిన నిందితుడు శ్రీనివాసరావును విశాఖ కేంద్రకారాగారంలో అధికారులు హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. శ్రీనివాసరావు ప్రత్యేక ఖైదీ కావడంతో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచామని, అతనితో ఇతర ఖైదీలు మాట్లాడే అవకాశం కూడా ఉండకుండా వార్డర్లను సెక్యూరిటీ ఉంచినట్లు జైల్ అధికారులు తెలిపారు. -
నత్తనడకన సిట్ విచారణ
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన విషయంలో సిట్ విచారణ మొక్కుబడిగా సాగుతోంది. నిందితుడు శ్రీనివాస్‌కు ఇచ్చిన ఆరు రోజుల కస్టడీ రేపటి ( నవంబర్ 2)తో ముగియనుంది. గత నాలుగు రోజులుగా సాగిన విచారణలో శ్రీనివాస్ నుంచి చెప్పుకోదగ్గ నిజాలేవీ రాబట్టలేకపోయారు. గతరాత్రి నిందితుడు శ్రీనివాస రావు తల్లిదండ్రులను విచారణ కోసం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. రాత్రి రెండు గంటలపాటు విచారించినట్టు తెలుస్తోంది. ఇవాళ కూడా శ్రీనివాస్‌తో పాటు అతని తల్లిదండ్రులను విచారించనున్నారు. ఈ క్రమంలో హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 35మందిని పోలీసులు విచారించారు. శ్రీనివాస్ కాల్‌డేటాపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాస్ కస్టడీ రేపటితో ముగిస్తుండటంతో కస్టడీని పొడిగించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు వేసే అవకాశమున్నట్లు సమాచారం. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ పరిమితికి మించి ఎయిర్పోర్ట్ పాస్‌లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐఎస్ఎఫ్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
‘బాస్’ల నివేదిక సిద్ధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జాతీయస్థాయిలో కలకలం రేపిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ చేపట్టిన సిట్ నివేదిక అప్పుడే సిద్ధమైపోయింది. పోలీసు ఉన్నతాధికారులు, టీడీపీ పెద్దలు చెప్పినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసేసింది. ఈ హత్యాయత్నం వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నేతాశ్రీలు మినహా కేంద్రం మొదలు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్పోర్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ఉన్నతాధికారులు కూడా ప్రాధమిక విచారణలో కుట్ర అనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన క్షణం నుంచి కేసు నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు పెద్దలు చేయని ప్రయత్నమంటూ లేదు. విచారణకు సిట్‌ను వేసి కేసులో కుట్ర కోణాన్ని సమాధి చేసేందుకు అన్ని అధికారాలూ ఉపయోగిస్తున్నారు. ఆ ఒత్తిడితో దర్యాప్తు అధికారులుకూడా నివేదికను మమ అనిపించడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. కేసును తప్పుదోవ పట్టించిన హెడ్లు.. కేసును తప్పుదోవ పట్టించడానికి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సైతం రంగంలోకి దిగారంటే వారి వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు పోలీసు అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఎన్నో జగిగాయి. ఈ విధంగా ఇద్దరు ‘హెడ్’లు వెంటనే నేరుగా రంగంలోకి దిగడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. పక్కా ప్రణాళిక ప్రకారం నేరచరిత్ర ఉన్న శ్రీనివాసరావును తప్పుడు ఎన్వోసీ ఇప్పించి రెస్టారెంట్లో ఉద్యోగంలో పెట్టడం, గత మూడు నెలల కాలంలో దాదాపు ప్రతివారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న వైఎస్ జగన్‌కు ఎప్పుడూ లేని విధంగా గత గురువారం నాడే రెస్టారెంట్ నుంచి కాఫీ తీసుకురావడం, ఆ రోజే శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నానికి ఒడిగట్టడం, ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు మొదలు టీడీపీ నేతలు, డీజీపీ సైతం అసలు అది దాడే కాదని ప్రచారం చేయడం.. సదరు దుండగుడు వైఎస్సార్ పార్టీ అభిమాని అని ప్రచారం పుట్టించడం ఇందుకు అనుగుణంగా ఓ లేఖ సృష్టించడం... చంద్రబాబు ఎల్లో మీడియా దానికి తగ్గట్టుగా విపరీత ప్రచారం చేయడం... ఇలా వరుస పరిణామాలు టీడీపీ పెద్దల డ్రామాను దాచలేకపోయాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగినట్టు స్పష్టమవుతోంది. ఎస్ బాస్... ఇక పోలీసుల విచారణ తీరు టీడీపీ పెద్దల డ్రామాను మరింత రక్తికట్టించే విధంగా సాగింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఏసీపీలు, పదిమంది సీఐలు, లెక్కలేనంతమంది ఎస్ఐలు విచారించినా... అతనేమీ మాట్లాడటం లేదని చెప్పుకొస్తూ వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నట్లు చెబుతున్న విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్హా కూడా నాలుగురోజులైనా నిందితుడు విచారణకు సహకరించడం లేదని చెప్పుకొచ్చారంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇప్పటివరకు వ్యూహాత్మకంగా విచారణ పేరిట డ్రామాను రక్తికట్టించిన పోలీసులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించాల్సిన గడువు మరో రెండురోజులే ఉండటంతో పక్కా స్క్రిప్ట్‌తో తుది నివేదిక సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే స్క్రిప్ట్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం అవాంఛనీయ ఘటనే .. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఆ ఘటనకు టీడీపీ పెద్దలకు, నాయకులకు ఎటువంటి సంబంధం లేదు. అసలు అందులో కుట్రకోణమే లేదు.. ఇక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు సానుభూతి కోసమో, టీడీపీ నేతలను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనో వైఎస్సార్ పార్టీ నేతలు కూడా దీన్ని చేయించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డీ చేయించుకోలేదు. కేవలం సంచలనం కోసం శ్రీనివాసరావు చేసిన పని ఇది.. ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవి కానీ. అతని టార్గెట్ కూడా అది కాదు.. పబ్లిసిటీ కోసమే..అతను వైఎస్సార్సీపీ అభిమానే. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగోలేదు. అప్పుడప్పుడూ సైకోలా బిహేవ్ చేస్తున్నాడు. ఇంతకు మించి కేసులో కుట్రే లేదు’’ ఇదే స్క్రిప్ట్‌తో సిట్ నివేదికను పక్కాగా సిద్ధం చేసేశారు . శుక్రవారం సాయంత్రానికి శ్రీనివాసరావు పోలీస్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, ఇద్దరు పోలీస్ బాస్‌ల మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ సిట్ నివేదిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్కా స్క్రిప్ట్‌తో రూపొందించిన సిట్ నివేదికను తిరిగి ప్రభుత్వానికే పంపించి, వారికి అవసరమైన మార్పులు, చేర్పులు చేయించి, వీలైనంత తొందరగా కేసును క్లోజ్ చేసేందుకు విశాఖ పోలీసు అధికారులు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కాల్ డేటా చుట్టూ విచారణ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ నాలుగోరోజు బుధవారం ప్రధానంగా కాల్‌డేటా ఆధారంగా సాగింది. నిందితుడు శ్రీనివాసరావునునూ విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి 48 గంటలకో సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పుకొస్తూ మంగళవారం పోలీసులు చేసిన హడావుడి, మీడియా కంటపడిన వెంటనే నిందితుడు ‘తనకు ప్రాణ హాని ఉంది..తనను చంపేస్తున్నా’ రంటూ చేసిన హంగామా ఓ తమాషాగా మారింది. వైద్య పరీక్షలు నిర్వహించి కనీసం 24 గంటలు కూడా జరక్కుండానే బుధవారం నిందితునికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, పల్స్ రేట్, సుగర్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని, చాలా ఆరోగ్యంగా ఉన్నాడని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రోజూ మాదిరిగానే బుధవారం కూడా సీపీ మహేష్‌చంద్ర లడ్డా, ఫకీరప్ప స్థానంలో కేసు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న జోన్–2 డీసీపీ నయీమ్, సిట్ అధికారి బీవీఎస్ నాగేశ్వరరావులు ఉదయమే ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కాల్‌డేటా ఆధారంగా తీసుకొచ్చిన సాకు‡్ష్యలను విచారించారు. తొలుత వారి నుంచి వాంగ్మూలం తీసుకోవడం..ఆ తర్వాత నిందితుని నుంచి వివరాలు రాబట్టడం.. రెండింటిని సరిపోల్చుకోవడంపై దృష్టిపెట్టారు. సెల్ఫోన్లు, కాల్‌డేటా ఆధారంగా పొరుగు జిల్లాలు, రాష్ట్రేతర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు బుధవారం తిరిగి విశాఖకు చేరుకున్నాయి. గుంటూరు, మధ్యప్రదేశ్, ఒడిస్సాలలో నిందితుని సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాల్ డేటా ఆధారంగా ఆయా ప్రాంతాల్లో పలువురి నుంచి వివరాలు రాబట్టారు. మరోవైపు... హత్యాయత్నం జరిగిన రోజున వైఎస్ జగన్మోహన్రెడ్డి ధరించిన రక్తపు గాయాలైన షర్ట్‌ను ఇప్పించాలని కోరుతూ విశాఖ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ వేసిన పిటీషన్ బుధవారం కూడా విచారణకు రాలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేని కారణంగా వరుసగా రెండోరోజు కూడా ఈకేసును న్యాయమూర్తి వాయిదా వేశారు. నిందితుడి జేబులో ఉందని చెబుతున్న 11 పేజీల లేఖలోని దస్తూరిని పరీక్షిం చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ బుధవారం మరో పిటీషన్ ఫైల్ చేశారు.అవసరమైతే కస్టడీ పొడిగింపుపై చివరి రోజు నిర్ణయం తీసుకుంటామని సిట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. కాల్‌డేటాలో ముఖ్యులు: ఏసీపీ అర్జున్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి ఒడిగట్టిన శ్రీనివాసరావు కాల్‌డేటాలో కొంతమంది ముఖ్యులు కూడా ఉన్నారని, వారినీ విచారిస్తామని విశాఖ నార్త్ ఏసీపీ లంక అర్జున్ విలేఖరులకు వెల్లడించారు. ఇటీవల కాలంలో శ్రీనివాస్ 321 మందితో మాట్లాడినట్టు అతని కాల్‌డేటాను బట్టి నిర్ధారించామని వాటి ఆధారంగా కొందరిని ప్రత్యక్షంగా, మరికొందరిని ఫోన్ ద్వారా విచారిస్తున్నామని తెలిపారు. గతంలో నిందితుడితో సహోద్యోగిగా పనిచేసి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి విచారిస్తున్నామన్నారు. నిందితుడి తల్లిదండ్రుల విచారణ తనకు ప్రాణహాని ఉందంటూ నిందితుడు వైద్యపరీక్షల సందర్భంగా కేజీహెచ్‌లో మీడియా ఎదుట కేకలు వేయడంతో ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు తాతారావు, సావిత్రమ్మలు తమ కుమారుడ్ని చూడాలని ఉందని చెప్పడంతో పోలీసులు వారిని బుధవారం రాత్రికి విశాఖకు తీసుకువచ్చారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో రహస్యంగా విచారిస్తున్నారు. ఉందయం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను సిట్ బృందం వారి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలో విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితుడి ఇంటి వద్ద, గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 26 మందిని విచారించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి చెందిన ఓవ్యక్తి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
జగన్‌ను చంపేయాలనుకున్నా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం: ‘‘నా టార్గెట్.. నాకు అప్పగించిన పని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాణాలు తీయడమే. ఎప్పటి నుంచో ఆ రోజు కోసం వెయిట్ చేశా. ఆ రోజు కత్తి వేటు గొంతులోనే దిగాలి. పొరపాటున మిస్ అయింది’’ అని జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో ఎట్టకేలకు అంగీకరించినట్లు తెలిసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల విచారణలో శ్రీనివాసరావు ఇవే మాటలను స్పష్టంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ‘‘కేవలం సంచలనం కోసమే చేశా. నేను వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానిని. నేను రాసిన లెటర్ ఆయన చదవాలనే ఇదంతా చేశా’’ అని ఘటన జరిగిన మొదటి రోజు నుంచీ ఇప్పటివరకు మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు పదేపదే వల్లె వేస్తున్న డైలాగులన్నీ పచ్చి అబద్ధాలేనని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని, ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవి’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసు అధికారులపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. కుట్రకోణం దాచి రిమాండ్ రిపోర్ట్ రాసినప్పటికీ విశాఖ పోలీసు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి అక్షింతలు తప్పలేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా మీరు రిమాండ్ రిపోర్ట్ రాశారంటూ పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసును విచారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అయితే, తమ సిబ్బంది రాత్రింబవళ్లు కేసును విచారిస్తుండగా, ఇంటెలిజెన్స్ వర్గాల జోక్యం ఏమిటని ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐపీఎస్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడు శ్రీనివాసరావును తమదైన శైలిలో ప్రశ్నించడంతో అతడు ఎట్టకేలకు నోరు విప్పి, వాస్తవాలను బయటపెట్టినట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతం చేయడమే లక్ష్యంగా కత్తితో దాడి చేశానని నిందితుడు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక తేలాల్సింది కుట్రకోణమే.. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్మోహన్రెడ్డిపై జరిగింది హత్యాయత్నమేనని ప్రత్యక్ష సాక్షులు, వైఎస్సార్సీపీ నేతలు మొత్తుకున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు, టీడీపీ నాయకులు తేలిగ్గా తీసిపారేశారు. అది చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కేసును విచారిస్తున్న ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ మళ్ల శేషు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జగన్‌పై కత్తి దాడి హత్యాయత్నమేనని, కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని పేర్కొన్నారు. కానీ, నిందితుడు నేరాన్ని అంగీకరించడం లేదని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. మంగళవారం నాటి విచారణలో తాను జగన్‌ను హత్యచేయడమే లక్ష్యంగా దాడి చేశాడని శ్రీనివాసరావు అంగీకరించాడని తెలిసింది. దీంతో ఇక తేలాల్సింది కుట్ర కోణమే. బడాబాబుల అండ లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఓ దుండగుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడే అవకాశం లేదని చెబుతున్నారు. సూత్రధారుల పేర్లు బహిర్గతం? జగన్‌ను చంపాలనే కత్తి దూశానని స్పష్టం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆ పని ఎవరు చేయించారో కూడా వెల్లడించాడనే అంటున్నారు. ప్రధాన కుట్రదారుల పేర్లు తనకు తెలుసో లేదో గానీ తనకు ‘ఆ పని’ అప్పగించిన సూత్రదారుల పేర్లను మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశాడని సమాచారం. విచారణలో నిందితుడు బయటపెట్టిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు పభుత్వ పెద్దలకు, పోలీస్ బాస్‌లకు ఇప్పటికే చేరవేసినట్టు తెలుస్తోంది. నిందితుడి పోలీసు కస్టడీ గడువు శుక్రవారం ముగుస్తున్న నేపథ్యంలో విచారణ డ్రామాను రక్తి కట్టించి, అతడిని తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా వాసులను విచారిస్తున్న ‘సిట్’ కనిగిరి: వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్‌డేటాను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోది. ఇందులో భాగంగా ప్రకారం జిల్లా కనిగిరి మున్సిపాల్టీలోని దేవాంగనగర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుంది. హత్యయత్నానికి ముందు నిందితుడి ఫోన్ నుంచి దేవాంగనగర్‌కు చెందిన కాశీంబీ కోడలు సైదాబీ షేక్ సెల్‌కు పలుమార్లు ఫోన్ చేసినట్టు కాల్ డేటాలో నిర్ధారణ అయింది. దీంతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు సోమవారం సైదాబీ షేక్, ఆమె మరిది రసూల్, తోడికోడలు అమ్మాజీ షేక్, అత్త కాశీంబీలను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సైదాబీ, అమ్మాజీ, కాశీంబీలను అక్కడే ఉంచి, రసూల్‌ను తిరిగి పంపించారు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల పోలీసులు రసూల్‌కు ఫోన్ చేశారు. ‘సిట్’ పోలీసులు విచారణ చేయాల్సి ఉందని చెప్పడంతో రసూల్ వైజాగ్‌కు వెళ్లాడు. సైదాబీ షేక్, అమ్మాజీ షేక్, కాశీంబీ, రసూల్‌లు వైజాగ్ ‘సిట్’ అదపులో ఉన్నట్లు సమాచారం. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. ‘‘నన్ను చూడాలనుకుంటే రేపే చూసుకోండి. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. టీవీలో వస్తుంది. తర్వాత కనిపిస్తానో లేదో’’ అంటూ నిందితుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు కాల్ డేటా ఆధారంగా ‘సిట్’ చేపట్టిన విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నిందితుడి సెల్ ఫోన్ నుంచి ఎక్కువగా కాల్స్ వెళ్లడంతో ప్రత్యేక బృందాలు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకొని విశాఖకు తరలించారు. కనిగిరిలోని దేవాంగనగర్ నుంచి తీసుకొచ్చిన సైదాబీ షేక్, అమ్మాజీ షేక్, రసూల్‌లను నిందితుడు శ్రీనివాసరావు నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌పై ఆరా తీశారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన ముందురోజు రసూల్ ఫోన్‌కు మిస్ట్‌కాల్ రావడంతో అతడు ఆ నెంబర్‌కు పదేపదే ఫోన్ చేయడంతో శ్రీనివాసరావు ఒకసారి లిఫ్ట్ చేసి కట్ చేశాడు. సైదాబీ షేక్ ఫోన్‌కు కూడా నిందితుడి నుంచి మిస్డ్‌కాల్ వచ్చింది. తిరిగి అదే నంబర్‌కు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేసిన శ్రీనివాసరావు చాలాసేపు మాట్లాడాడు. అస్తమానం కాల్ చేస్తున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి చేస్తున్నావ్.. ఎందుకు చేస్తున్నావు.. అంటూ ఆమె ఫోన్లో నిలదీసింది. ‘‘నేనెవరో తెలియాలంటే రేపు టీవీ చూడండి మీకే తెలుస్తుంది. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. అన్ని టీవీల్లో బాగా చూపిస్తారు. ఆ తర్వాత కనిపిస్తానో లేదో’’ అని శ్రీనివాసరావు బదులివ్వడంతో ఆమె విస్తుపోయింది. మనకెందుకులే ఈ గొడవ అనుకుంటూ ఫోన్ కట్ చేసింది. -
విచారణ తూతూమంత్రం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన శ్రీనివాసరావు నేపథ్యం గురించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లోతుగా విచారణ చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగి మంగళవారం నాటికి ఆరు రోజులు గడిచిపోయింది. ఇంతవరకు విచారణ శ్రీనివాసరావు రాసినట్టు చెబుతున్న లేఖ, అతడి కాల్‌డేటా చుట్టూనే తిరుగుతోంది తప్ప నిందితుడి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంక పరిసర గ్రామాల్లో అతడి వ్యవహారాలపై లోతైన పరిశీలన జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఠానేల్లంక, ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసరావు ఇటీవల సాగించిన కార్యకలాపాల గురించి సీరియస్‌గా పరిశోధిస్తే కుట్రకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. శ్రీనివాసరావు లీలలు నిందితుడు శ్రీనివాసరావు అక్టోబర్ 16న విశాఖపట్నం నుంచి ఠానేల్లంక వచ్చి సోదరుడి కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు భారీ స్థాయిలో విందు ఇచ్చాడు. ఇక వెనక్కి చూసుకోవాల్సిన పని లేదని, జీవితంలో స్థిరపడ్డట్టేనని, మంచి పార్టీ దొరికిందని అతడు తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. శ్రీనివాసరావు ఇచ్చిన విందులో పాల్గొన్న స్నేహితులు ఎవరు? ఆ రోజు ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? అనే అంశాలపై ఆరా తీస్తే హత్యాయత్నం కేసుకు సంబంధించిన విలువైన సమాచారం లభించనుంది. ఇటీవల లంక ఆఫ్ ఠానేల్లంకలో 4 ఎకరాలు లంక భూమి రూ.కోటికి కొనేందుకు శ్రీనివాసరావు ముందుకొచ్చాడని, అక్కడి భూ స్వామితో బేరం కూడా చేశాడని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ డీల్ వ్యవహారంపై దర్యాప్తు జరిపితే పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేర చరిత్ర కలిగిన శ్రీనివాసరావుకు విశాఖ ఎయిర్‌పోర్టులో తెలుగుదేశం పార్టీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి రెస్టారెంట్లో ఉద్యోగానికి సిఫార్సు చేయడానికి కారణమేమిటి? ఆ సిఫార్సు చేసింది ఎవరు? శ్రీనివాసరావుకు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇవ్వడంలో ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనేది తేల్చే దిశగా విచారణ సాగితే కుట్రదారులు బయటపడతారంటున్నారు. ఠానేల్లంకలో అలుముకున్న నిశ్శబ్దం శ్రీనివాసరావు స్వగ్రామం ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 4,000 ఓట్లు కలిగిన ఈ గ్రామ పంచాయతీలో శ్రీనివాసరావు నివాసం ఉండేది పెద్దపేట. ఆ పేటతోపాటు మిగిలిన శివారు గ్రామాల్లో స్థానికులు ఈ ఘటన చోటుచేసుకున్న దగ్గర నుంచి ఒక రకమైన భయంతో బతుకుతున్నారు. అధికార పార్టీ నేతలు జారీ చేసిన హుకుంతో స్థానికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా వెనుకంజ వేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎవరితో ఏమి మాట్లాడితే ఏమవుతుందోననే ఆందోళన నెలకొంది. చివరకు మొబైల్ ఫోన్లకు వచ్చే కాల్స్‌కు ఒకటికి, రెండుసార్లు సరి చూసుకున్న తరువాతే సమాధానం చెబుతున్నారు. బంధువులు, సన్నిహితులు సైతం ఠానేల్లంక రావడం మానుకున్నారు. 3 నెలలుగా లేనిది ఆ రోజే ఎందుకు? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు నెలలుగా ప్రతి గురువారం హైదరాబాద్ వెళ్లడానికి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డికి శ్రీనివాసరావు వీరాభిమాని అయితే ఇన్ని నెలల్లో ఏ ఒక్క రోజైనా ఆయన్ను కనీసం చూసేందుకు, మాట్లాడేందుకు, ఫొటో దిగేందుకు రాకపోవడం గమనార్హం. ఇతరుల సాయంతోనైనా ఇందుకోసం ప్రయత్నం చేసే వాడే కదా! సెల్ఫీ అంటూ దగ్గరకు వచ్చిన తొలిసారే హత్యాయత్నానికి పాల్పడ్డాడంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
నిజాలు దాస్తున్నాడు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, నిజాలు దాచిపెడుతున్నాడని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. గత మూడు రోజులుగా ఎన్ని విధాలుగా విచారిస్తున్నా నిందితుడి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోతున్నామని అన్నారు. నిందితుడు కొన్ని విషయాలు చెప్పడానికి ఎంతమాత్రం అంగీకరించడం లేదని, కావాలనే దాచేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. కేసు విచారణలో కత్తి, లేఖ విషయంపై ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడించారు. నిందితుడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. మూడో రోజు విచారణలో పెద్దగా పురోగతి లేదని, ఆరోగ్యం బాగోలేదంటూ నిందితుడు సహకరించకపోవడం వల్ల కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు కొన్ని నిబంధనలు పెట్టిందని, ఆ మేరకు నిందితుడికి 48 గంటలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కస్టడీలో ఉన్న నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించే సమయంలో కొద్దిగా హడావుడి జరిగిందన్నారు. సాధారణ వైద్య పరీక్షల్లో బాగంగానే అతడికి వైద్య పరీక్షలు చేయించామని చెప్పారు. ఏడు సెల్ఫోన్లు సీజ్ నిందితుడు వాడిన 9 సెల్ఫోన్లలో 7 ఫోన్లను సీజ్ చేశామని కమిషనర్ లడ్డా తెలిపారు. ఒకటి యానాంలో పోగోట్టుకున్నట్టు చెబుతున్నాడని, మరొకటి ఎవరి వద్ద ఉందని ప్రశ్నిస్తే ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పాడని, వారు దొరకడం లేదని వివరించారు. నిందితుడికి ఉన్న 3 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ముమ్మిడివరంలోని ఎస్బీఐ, అమలాపురంలోని విజయబ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. సహ ఉద్యోగి రమాదేవి ఖాతా నుంచి ఒకసారి రూ.50,000, మరోసారి రూ.20,000 నిందితుడి ఖాతాకు జమైనట్లుగా గుర్తించామన్నారు. జమ అయిన వెంటనే ఈ సొమ్మును తన సోదరుడి కోసమంటూ శ్రీనివాసరావు డ్రా చేసినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. ఎస్బీఐలో రూ.55, విజయాబ్యాంకులో రూ.357, ఆంధ్రా బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. ఇప్పటివరకు 35 మందిని విచారించామన్నారు. రెస్టారెంట్లో కుక్‌గా పనిచేసిన వ్యక్తి సెల్‌ఫోన్ శ్రీనివాసరావు వాడాడని తెలియడంతో ఆ మేరకు విచారణ నిమిత్తం ఓ బృందాన్ని కుక్ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పంపామన్నారు. కాల్ డేటా ఆధారంగా మరో బృందాన్ని ఒడిశాకు పంపించామన్నారు. మరోవైపు ఈ కేసును పర్యవేక్షిస్తున్న డీసీపీ ఫకీరప్ప కర్నూలు ఎస్పీగా బదిలీ అయినందున ఆయనను బుధవారం రిలీవ్ చేస్తున్నామన్నారు. ఆయన స్థానంలో డీసీపీ జోన్–2గా నియమితులైన నయీం ఈ కేసును పర్యవేక్షిస్తారని తెలిపారు. విచారణ నిమిత్తం 160 సెక్షన్ కింద వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు పంపించామని, వారిలో జియాని శ్రీధర్, కృష్ణకాంత్‌లు మినహా మిగిలిన వారు విచారణకు హాజరు కాలేదన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేవు నిందితుడి విచారణ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని సీపీ స్పష్టం చేశారు. ప్రాణహాని ఉందని నిందితుడు చేస్తున్న ఆరోపణలను సీపీ వద్ద ప్రస్తావించగా... అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. తనను చంపి రాజకీయం చేయాలని నిందితుడు చెబుతున్న విషయం ప్రస్తావించగా... ఆ అవసరం ఎవరికుందని సీపీ ఎదురు ప్రశ్న వేశారు. నిందితుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరిగిన విషయాన్ని ప్రస్తావించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని లడ్డా అంగీకరించారు. జాప్యానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధితుడు జగన్ విచారణకు సహకరించే విషయమై 160 నోటీసు జారీ చేసామని, న్యాయపరమైన సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. నిందితుడికి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) జారీ చేయడంపై కమిషనర్ స్పందిస్తూ... ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలో అతడిపై ఎలాంటి కేసులు లేనందున ఎన్ఓసీ జారీ చేశారన్నారు. -
శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే టీడీపీ సర్కారుదే బాధ్యత..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సమాధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం మరో కుట్ర చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో ప్రధాన పాత్రధారి, సాక్షి అయినా నిందితుడు శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి ‘‘తనకు ప్రాణహాని ఉందని నిందితుడు శ్రీనివాసరావు చెబుతున్నాడు. ప్రజలతో, మీడియాతో మాట్లాడాలని అంటున్నాడు. శ్రీనివాసరావే ఈ హత్యాయత్నంలో పాత్రధారుడు, సాక్షి కాబట్టి ఆతడికి ఏదైనా జరగొచ్చు అని మేం మొదటినుంచీ చెబుతున్నాం. అతడికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరాం. జగన్‌పై హత్యాయత్నం ఘటనలో సాక్ష్యాలను సమాధి చేసే కుట్ర జరుగుతోంది. అందుకే నిష్పక్షపాతంగా థర్డ్‌పార్టీ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని విచారణ జరపాలి. ఆలోగా శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిందితుడితో ముఖ్యమంత్రికి, మంత్రి లోకేశ్‌కు, టీడీపీ నేతలకు సంబంధం ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. అతడి ప్రాణానికి హాని కలిగించి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. నిందితుడికి గుండె నొప్పి అంటూ లీకులిస్తున్నారు. కానీ, ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెబుతున్నారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియడం లేదు. జగన్‌పై హత్యాయత్నం కుట్రలో ఉన్నవారు బయటకు రావాలంటే నిందితుడు బతికే ఉండాలి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిని మళ్లీ కలిసి ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు హత్యా రాజకీయాలు ఇక సాగవు’’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘నిందితుడు బతికి ఉంటేనే నిజాలు బయటకొస్తాయి. అతడి ప్రాణానికి హాని కలిగిస్తే నిజాలు బయటకు రావు. ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి ఆతడిని ఏమైనా చేస్తారేమో అన్న భయం కలుగుతోంది. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలి’’ అని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో.. మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాలాశౌరి పాల్గొన్నారు. -
చెప్పాల్సింది లేదు.. నాకేం తెలియదు!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు కత్తితో పొడిచిన నిందితుడు శ్రీనివాసరావు బాటనే ఆయన యజమాని, టీడీపీ నేత తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి ఎంచుకున్నారు. శ్రీనివాస్ విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌ను హర్షవర్థన్ ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆ రెస్టారెంట్లోనే నిందితుడు శ్రీనివాస్ కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. అయితే విచారణలో శ్రీనివాస్ పోలీసులకు సహకరించడం లేదు. తాను చెప్పవలసిందేమీ లేదని, అంతా లేఖలోనే ఉందని చెబుతూ వస్తున్నాడు. మరోపక్క శ్రీనివాస్ పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ని ఘటన జరిగిన రెండ్రోజుల అనంతరం పోలీసులు ఒకసారి, ఆ తర్వాత మరో రెండుసార్లు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హర్షవర్థన్ శ్రీనివాస్‌కు సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వడం లేదని, ఆయన గురించి తనకేమీ తెలియదని చెబుతున్నాడు. నిందితుడి వెనక ఎవరున్నారు? శ్రీనివాస్‌ను ఎవరి సిఫార్సు మేరకు ఉద్యోగంలోకి తీసుకున్నారంటూ సిట్ పోలీసులు వేస్తున్న అనేక ప్రశ్నలకు ‘నాకేమీ తెలియదు’ అన్న సమాచారం తప్ప ఇంకేమీ చెప్పడం లేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘పెద్దల’ అండవల్లే..? ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఇతర కీలక నేతలతో హర్షవర్థన్‌కు నేరుగా సంబంధాలున్నాయి. దీంతో పోలీసులు ఆయన నుంచి అదిలించో, బెదిరించో వాస్తవాలు రాబట్టలేకపోతున్నారని చెబుతున్నారు. చేసేదేమీ లేక విచారణకు పిలవడం, కాసేపు విచారించి వదిలిపెట్టేయడం చేస్తున్నారు. ఇక విచారణ సమయంలో హర్షవర్థన్ సిట్ అధికారుల ఎదుట కూర్చునే తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే సిట్ అధికారులను హర్షవర్థనే ప్రశ్నిస్తున్నట్టుగా ఉందని విచారణను చూసిన వారు చెబుతున్నారు. తన వెనక అధికార పార్టీ పెద్దలుండడం వల్లే ఆయన అలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరోవైపు జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన రోజు హర్షవర్థన్ నిందితుడు శ్రీనివాస్‌ను పరోక్షంగా వెనకేసుకొచ్చారు. అతను (శ్రీనివాస్) అలాంటివాడు కాదని, అమాయకుడని, సంచలనం కోసం చేసి ఉంటాడని చెప్పుకొచ్చారు. -
ఆ 4 వాక్యాల కోసం..పెద్దల ‘షో’
విశాఖ నుంచి సాక్షి ప్రతినిధులు: అంతా ఊహించిందే జరుగుతోంది. ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్టు మేరకే జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణ నిర్వహిస్తున్నారు. ఆది నుంచి బిగిసడలని సన్నివేశాలతో రక్తి కట్టిస్తున్న డ్రామా మంగళవారం పతాకస్థాయికి చేరింది. ‘నేను జగన్ అభిమానిని.. ప్రజల కోసమే ఇదంతా చేశా’ అంటూ నిందితుడు శ్రీనివాస్‌తో పరిమిత స్థాయిలో వాక్యాలను పోలీసులు పలికించారు. ఈ డ్రామా ముగింపులో ‘మీకు కావాల్సిన బైట్(విషయం) వచ్చింది కదా’ అంటూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ సీఐ మళ్ల శేషు ఎల్లో మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం! వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణలో భాగంగా తమ కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ మంగళవారం గుండె దడగా ఉందని చెప్పారని పోలీసులు ప్రైవేటు వైద్యుడిని పిలిపించారు. శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ దేవుడు బాబు..అతని ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. కథ నడిపిన పోలీసులు... ఆరోగ్యం బాగుందని డాక్టర్ చెప్పినా మళ్లీ వైద్య పరీక్షల కోసం నిందితుడు శ్రీనివాస్‌ను సాయంత్రం కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్సిటల్)కు తరలించారు. విచారణను అత్యంత గోప్యంగా చేస్తున్న పోలీసులు నిందితుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండటంపై మాత్రం మీడియాకు లీకులు ఇచ్చారు. ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ నుంచి కేజీహెచ్‌కు 11 కిమీల దూరం ఉంటుంది. సాయంత్రం 3.40 నుంచి 4 గంటల మధ్య పెద్దగా ట్రాఫిక్ ఉండదు. సుమో లేదా కారు వంటి వాహనాల్లో కేవలం పది లేదా 15 నిమిషాల్లోనే కేజీహెచ్‌కు చేరుకోవచ్చు. కానీ.. మీడియా కేజీహెచ్‌కు చేరుకోవడానికి వీలుగా పోలీసులు కావాలనే నింపాదిగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కేవలం పావు గంట లేదా 20 నిమిషాల్లోపే కేజీహెచ్‌కు చేరుకోవాల్సిన పోలీసు వాహనం 40(ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ నుంచి 3.40 గంటలకు ప్రాంభమై.. కేజీహెచ్‌కు 4.20 గంటలకు చేరుకున్నారు) నిమిషాలకు చేరుకుంది. మీడియాకు వినిపించడానికే... కేజీహెచ్ ఆసుపత్రి ప్రాంగణంలో వాహనం నుంచి దించిన వెంటనే.. ‘నాకు ప్రాణహాని ఉంది సర్.. ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి’ అని శ్రీనివాస్ అడగడం విన్పించింది. శ్రీనివాస్‌ను నేరుగా క్యాజువాలిటీ వార్డుకు తీసుకెళ్లి.. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సురేంద్రబాబుకు చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ‘ఆరోగ్యం బాగుంది.. పరీక్షలు అవసరం లేదు.. వైద్యమూ అవసరం లేదు’ అని వైద్యలు పోలీసులకు సూచించారు. కానీ.. పోలీసులు క్యాజువాలిటీ నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న ఎమర్జీన్సి మెడిసిన్ విభాగానికి వీల్ ఛైర్లో శ్రీనివాస్‌ను తీసుకెళ్లారు. శ్రీనివాస్‌తో ఆ నాలుగు వాక్యాలు మీడియాకు చెప్పించడానికి వీలుగా.. 30 మీటర్ల దూరంలో ఐదు సార్లు అటు ఇటు తిప్పారు. ఈ సమయంలో మీడియాతో శ్రీనివాస్ మాట్లాడుతూ ‘నేను జగన్ అభిమాని’ అని ఒకే వాక్యం చెప్పగలిగాడు. దీంతో పోలీసులు తృప్తి పడలేదు. కాస్త స్పష్టంగా ఆ నాలుగు వాక్యాలు చెప్పించడానికి వీలుగా క్యాజువాలిటీ వార్డు నుంచి కాస్త విశాలమైన రోడ్డు గుండా కార్డియాలజీ విభాగానికి తీసుకెళ్లే సమయంలో శ్రీనివాస్‌తో ఆ నాలుగు వాక్యాలు మీడియాకు స్పష్టంగా చెప్పించారు. ‘నేను జగన్ అభిమానిని.. ప్రజల కోసమే ఇదంతా చేశా. నా వెనక ఎవరూ లేరు.. నన్ను చంపి రాజకీయం చేసేందుకు చూస్తున్నారు. నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండి’ అంటూ శ్రీనివాస్‌తో మీడియాకు చెప్పించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆసుపత్రికి డీలాగా.. పోలీసు స్టేషన్లోకి హుషారుగా: నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం బాగుందని డాక్టర్ దేవుడు బాబు తేల్చి చెప్పాక.. అతన్ని మళ్లీ వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించాల్సిన అవసరం లేదు. కానీ.. మీడియాకు ఆ నాలుగు వాక్యాలను చెప్పించడం కోసం వేసిన స్కెచ్‌లో భాగంగానే సాయంత్రం నిందితుడిని కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకున్నాక డీలాగా ఉన్నట్ల నటిస్తున్న శ్రీనివాస్‌ను వీల్ ఛైర్‌పై ఆసుపత్రిలోకి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక శ్రీనివాస్‌ను పోలీసు వాహనంలో కేజీహెచ్ నుంచి సాయంత్రం 6.07 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు 6.28 గంటలకు తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా కేజీహెచ్ నుంచి కేవలం 21 నిమిషాల్లోనే చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాహనం నుంచి దిగిన శ్రీనివాస్ హుషారుగా పోలీసు స్టేషన్లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిని పరిశీలిస్తే.. కేవలం మీడియాకు ఆ నాలుగు వాక్యాలు చెప్పించడం కోసమే ఈ డ్రామాను పోలీసులు నడిపినట్లు స్పష్టమవుతోంది. మీడియాతో నేరుగా మాట్లాడించకుండా.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని నేరుగా మాట్లాడించడానికి పోలీసులకు అవకాశం ఉంది. అలా చేస్తే.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడే అవకాశం ఉందని... హత్యకు కుట్ర చేసిన తమ బండారం బయపటడుతుందని స్క్రిప్టు రాసిన పెద్దలు భయపడ్డారు. ప్రతిపక్షనేతను హతమార్చడానికి కర్కశంగా దాడిచేయడం వెనక ఉన్న సూత్రధారుల గుట్టు రట్టవుతుందనే భయంతో... తాము చెప్పించాల్సిన ఆ నాలుగు వాక్యాలను చెప్పిండచానికి మాత్రమే ఈ హైడ్రామా నడిపినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దల స్క్రిప్ట్ మేరకే ... వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్ట్ మేరకే నీరుగార్చుతున్నారు. ప్రతిపక్ష నేతపై గురువారం హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే దాడి చేశారు.. ఇదో చిన్న సంఘటన’ అంటూ విచారణను ఆదిలోనే తేల్చేశారు. అనంతరం గురువారం రాత్రి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘వాళ్లపై వాళ్ల అభిమానే దాడి చేశారు.. సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవడానికే ఇలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచి.. అల్లర్లు సష్టించి, రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం కుట్ర చేస్తోంది. శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడలో భాగంగానే కేంద్రం ఈ దాడులు చేస్తోంది’ అంటూ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు విచారణ ఏ స్థాయిలో జగరబోతోందో చెప్పకనే చెప్పేశారు. గత ఆరు రోజులుగా ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్టు మేరకే కేసు విచారణ చేస్తున్న పోలీసులు.. డ్రామాను పతాకస్థాయికి తీసుకెళ్లడానికి సోమవారం రాత్రి పూనుకున్నట్లు పోలీసు వర్గాలే వెల్లడించాయి. ‘‘సోమవారం అర్ధరాత్రి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్.. ‘శ్రీనివాస్‌ను మీడియా ముందుకు తీసుకెళ్తే అసలు విషయాన్ని బయటపెట్టేస్తాడు. కేసు విచారణ ముగుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఆ మేరకు మంగళవారం పోలీసులు ఈ హైడ్రామా నడిపి.. సూత్రధారులైన ప్రభుత్వ పెద్దల గుట్టు రట్టు కాకుండా.. కేసు విచారణను నీరుగార్చేశారనే’’ అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
సీఎం తీరుతో తలవంపులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తీవ్రమైన విషయాల్లో తమ అధినేత, ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ప్రజల్లోనూ, జాతీయ స్థాయి పార్టీల్లోనూ మాకూ, మా పార్టీకి తలవంపులు తీసుకొస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలూ వాపోతున్నారు. దీన్నుంచి ఎలా గట్టెక్కాలా అని తలపట్టుకుంటున్నారు. సీఎం వ్యవహరిస్తున్న తీరు వల్ల అన్నింటిలోనూ అడ్డంగా దొరికి పోతున్నామని అవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పట్టపగలు ఓ పక్కా వ్యూహంతో విశాఖ విమానాశ్రయంలోనే హత్యాయత్నం జరిగితే ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగా స్పందించడంలో తప్పటడుగులు వేశారని, ఏదో చేద్దామంటే ఏదో అయ్యిందని వాపోతున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దాన్ని ఖండించి, ఆయన్ను పరామర్శించి, విచారణకు ఆదేశిస్తే ఎంతో హుందాగా ఉండేదని..అలాకాకుండా ఆ సంఘటనపై వెకిలిగా మాట్లాడటం..ప్రతిపక్ష నేతను ‘వాడు’ అని అమర్యాదగా సంబోధించడం నలుగురిలో చెడ్డపేరు తెచ్చిందని టీడీపీకి చెందిన ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. దాడి జరిగాక జగన్ నేరుగా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లారని, బీజేపీ వాళ్లు ఢిల్లీనుంచి చెబితే మళ్లీ హాస్పిటల్లో చేరారని, ఇందంతా ఓ డ్రామా అని సీఎం స్థాయి వ్యక్తి పేర్కొనడం వల్ల జనంలో తమ పరువు పోయిందని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మా బాబుగారు తప్పుమీద తప్పు చేస్తున్నారని, ఇది పార్టీకి చాలా నష్టం చేకూర్చేలా ఉందని మరో ఎంపీ వాపోయారు. హత్యాయత్నం విషయమై గవర్నర్ డీజీపీతో ఎలా మాట్లాడతారని సీఎం స్థాయి వ్యక్తి ప్రశ్నించడంతగదని, ముఖ్య సంఘటనపై గవర్నర్ వివరాలు తెలుసుకుంటే తప్పెలా అవుతుందని, ప్రతీదాన్ని రాజకీయం చేయడం తగదని ఆ పార్టీకే చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. విచారణకు ఆదేశించకపోవడంతో డిఫెన్స్‌లో పడ్డాం... జగన్‌పై హత్యాయత్నం కేసుపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తే హుందాగా ఉండేదని, అలా చేయకపోవడంతో తాము డిఫెన్స్‌లో పడ్డామని, తప్పు తమవైపు ఉందనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందని ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఓ సీనియర్ నేత అన్నారు. హుందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీల అంశాన్ని ముందుకు తేవడం, విమానాశ్రయంలో హోటల్‌కూడా టీడీపీకి చెందిన వారిదే కావడం, దాని యజమాని పార్టీలో కీలక వ్యక్తులకు క్లోజ్ కావడం వల్ల తాము ఆత్మరక్షణలో పడ్డామని, జనం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో గరుడ పురాణం అంశాన్ని సమర్థించడం సబబు కాదన్నారు. హత్యాయత్నం సంఘటన జరిగిన రెండు గంటలకే డీజీపీ హడావుడిగా మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ అభిమానే జగన్‌పై కత్తితో దాడి చేశాడని ప్రటించడం, రాత్రి సీఎం మాట్లాడుతూ సంఘటన జరిగిన నాలుగున్నర గంటల తరువాత తమకు వివరాలు తెలిసాయని చెప్పడంతో తాము చెప్పేది తప్పని తెలిసిపోయిందని రాయలసీమకు చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఓ ఎత్తయితే, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పడం ఇంకా తలవంపులు తెస్తోందని, ఇది విని జనాలు ముక్కుమీద వేలేసుకుంటున్నారి గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్‌నేత ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సంస్థలను మూసేయమని చెప్పాలా? ముఖ్యమంత్రి బినామీ అయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు తదితర వ్యాపార, రాజకీయ నాయకుల సంస్థల అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ పరిశీలనలు, సోదాలు చేయడాన్ని తప్పుపట్టడం, వాటిని ఒక జాతీయ సమస్యలాగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడాన్ని ఇతర పార్టీల నేతలు ఎద్దేవా చేస్తున్నారని పలువురు ఎంపీలు ‘సాక్షి’ ముందు అభిప్రాయపడ్డారు. పన్ను ఎగవేతదారులు, తప్పుడు ఆదాయాన్ని చూపే వారిపై రాజ్యాంగపరంగా ఏర్పాటైన సంస్థ పరిశీలనలు చేయడం అత్యంత సాధారణ అంశమని ఇతరపార్టీలు గుర్తుచేస్తున్నాయని అన్నారు. దాన్ని ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రికి కూడా లేదని, కేంద్ర సంస్థల సామరŠాధ్యన్ని, విశ్వసనీయతను దెబ్బతీసేలా, విధులను అడ్డగించడం ఎలా సమర్ధనీయమంటున్నారని ఎంపీలు చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారంటే ఇతర పార్టీల నాయకులు, మీడియా కలవడానికి ఇష్టపడేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు అసల్లేవని అంటున్నారు. చివరకు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, మీడియా కూడా అంటీముట్టనట్లు వ్యవహరించాయని చంద్రబాబును వెన్నంటి ఉండే ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దే నాయకులు కూడా తమను కేంద్రంలో పట్టించుకునే వారు కరవయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. -
కాల్‌డేటాపైనే కన్ను!
సాక్షి, విశాఖపట్నం/ముమ్మిడివరం (తూర్పుగోదావరి): ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కాల్‌డేటాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి పెట్టింది. ఎక్కువ కాల్స్ స్వీకరించిన వారు గుంటూరు, హైదరాబాద్‌లలో ఉన్నట్లు గుర్తించిన ‘సిట్’ అధికారులు.. అక్కడికి రెండు ప్రత్యేక బృందాలను సోమవారం పంపించారు. విచారణలో కీలకంగా భావిస్తున్న కాల్ డేటాను విశ్లేషించేందుకు సిట్ ఇన్చార్జి, సీనియర్ ఐపీఎస్ అధికారి డీసీపీ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఈ బృందాలను రంగంలోకి దించారు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో చేరినప్పటి నుంచి తొమ్మిది సెల్ ఫోన్లు మార్చినట్టు గుర్తించిన అధికారులు ఇప్పటికే నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాటిని వాడుతున్న వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. కాగా, గడిచిన 10 నెలల్లో అతను ఏ నెంబర్లు వాడాడో తెలుసుకున్నారు. ఆయా నెట్‌వర్క్‌ల నుంచి ఎవరెవరితో ఎన్నిసార్లు, ఎంతసేపు మాట్లాడాడో కాల్‌డేటా తెప్పించారు. దాని ఆధారంగా శ్రీనివాసరావు నుంచి ఎక్కువ కాల్స్ వచ్చిన వందమందిపై దృష్టి పెట్టారు. వీరు హైదరాబాద్, గుంటూరుల్లో ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, కాల్‌డేటాలో స్థానికంగా ఉన్న వారిని కూడా అధికారులు విచారించే పనిలో పడ్డారు. నాలుగో రోజూ కొనసాగిన విచారణ కాగా, ‘సిట్’ అధికారులు వరుసగా నాలుగో రోజైన సోమవారం కూడా ముమ్మిడివరంలో విచారణ జరిపారు. ఠాణేలంకలో శ్రీనివాసరావు తల్లిదండ్రులు తాతారావు, సావిత్రితోపాటు సోదరుడు సుబ్బరాజులతో మాట్లాడి వారి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. ఇటీవల గ్రామంలో శ్రీనివాసరావు ఇచ్చిన విందులో పాల్గొన్న పలువురు యువకులను కూడా విచారించారు. శ్రీనివాసరావుకు అంత్యంత సన్నిహితంగా ఉండే మెల్లంరాజు, పులిదిండి దుర్గా ప్రసాద్, మెల్లం ప్రభాకర్, మద్దెల ప్రసాద్రావులను ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ముమ్మిడివరం గృహనిర్మాణ శాఖ డీఈ కార్యాలయంలోనూ రికార్డులను పరిశీలించారు. నిందితుడు శ్రీనివాసరావు తండ్రి తాతారావు పేరిట పీఎంఆర్‌వై ఇల్లు మంజూరు కాగా.. అందుకు రూ.85 వేలు బిల్లులు చెల్లించినట్లు రికార్డులలో చూపించారు. అలాగే.. సుబ్బరాజు పేరిట కూడా పీఎంఏవై ఇల్లు మంజూరైంది. అలాగే, ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిందితుడు శ్రీనివాసరావుకు, సోదరుడు సుబ్బరాజుకు రెండు రుణ యూనిట్లను మంజూరు చేయించేందుకు టీడీపీ నేతలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. కిరణా షాపు కింద రూ.2 లక్షల యూనిట్ కోసం శ్రీనివాసరావుతో.. సెంటరింగ్/రూఫ్ మేకింగ్ కింద రూ.లక్షా 50 వేల యూనిట్ కోసం సుబ్బరాజుతో దరఖాస్తు చేయించినట్లు తెలిసింది. అకౌంట్ల వివరాలు పరిశీలన ఇదిలా ఉంటే.. నిందితుడు శ్రీనివాసరావుకు విశాఖలోని విజయా బ్యాంకుతో పాటు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు గుర్తించిన ‘సిట్’ అధికారులు వాటిల్లో ఏ మేరకు డబ్బులున్నాయో సోమవారం పరిశీలించారు. గత ఏడాదిగా ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీల వివరాలనూ సేకరిస్తున్నారు. అంతేకాక.. నిందితుడి కుటుంబ సభ్యులు, గ్రామంలోని స్నేహితుల ఖాతాలపై కూడా దృష్టి పెట్టారు. నిందితుని ఖాతా నుంచి వారికి పెద్ద మొత్తంలో ఏమైనా నగదు లావాదేవీలు జరిగాయా? లేదా? అన్న దానిపై దృష్టి పెట్టారు. -
ఆ రోజే ఎందుకు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కుట్ర విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే జరిగిందని కేంద్ర బలగాలు విశ్వసిస్తున్నాయి. జగన్ అభిమానినని చెప్పుకుంటున్న నిందితుడు ఆ రోజే ఎందుకు తెగబడ్డాడనే విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీసులు ఆ దిశగా ఇంతవరకు లోతుగా దర్యాప్తు చేయనప్పటికీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) వర్గాలు మాత్రం కుట్రదారులు ఎంతో వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకున్నట్టు భావిస్తున్నాయి. రక్షణ శాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడాన్ని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఈ కోణంలోనే చూస్తూ అంతర్గత దర్యాప్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అభిమాని అయితే ఇన్నాళ్లూ ఎందుకు కలవలేదు? తాను వైఎస్ జగన్ వీరాభిమానినని, ఆయనంటే చాలా ఇష్టమని, ఇదే విషయం లేఖలో స్పష్టంగా రాశానని చెప్పుకొస్తున్న నిందితుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్ పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఎనిమిది నెలలుగా పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. మరి మూడు నెలల కాలంలో జగన్ అన్ని సార్లు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే ఏ సందర్భంలోనూ ఆయనతో ఫొటో కోసం గానీ, ఆటో గ్రాఫ్ కోసం గానీ, కనీసం చూసేందుకు గానీ వచ్చిన దాఖలాల్లేవు. ఇతరుల ద్వారా అయినా జగన్ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించేవాడు కదా? సరిగ్గా హత్యాయత్నానికి తెగబడిన 25వ తేదీనే తొలిసారి సెల్ఫీ పేరిట రావడం గమనార్హం. అంతకు ముందు వైఎస్ జగన్‌కు పార్టీ నేత ఇంటి నుంచి కాఫీ వస్తుంటే.. అలా తీసుకురావడానికి వీల్లేదంటూ, శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ నుంచే సర్వ్ చేయించడం చూస్తుంటే పక్కాగా వ్యూహం ప్రకారం రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగినట్టు స్పష్టమవుతోందని సీఐఎస్ఎఫ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. లేఖ విషయంలోనూ విచారణ నిందితుడు శ్రీనివాసరావు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 11 పేజీల లేఖ ఉందని చెబుతున్న వాదనలపైనా సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగా కత్తితో గానీ, పిస్తోలుతో గానీ దుండగుడు పోలీసులకు పట్టుబడితే వెంటనే అతన్ని పట్టుకుని ఇంకా అతని వద్ద ఏయే వస్తువులు ఉన్నాయో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. నాప్కిన్ మొదలు చిన్న కాగితం ముక్క ఉన్నా వదలకుండా వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది శ్రీనివాసరావు విషయంలో పోలీసులు పూటకొకటి దొరికిందని చెప్పుకొస్తున్న నేపథ్యంపై కూడా సీఐఎస్ఎఫ్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేఖ విషయంలో సీఐఎస్ఎఫ్ అధికారి ఘటన జరిగిన రోజు హడావుడిగా సంతకం చేశారని తెలుస్తోంది. సదరు అధికారిని మీరు సరిగ్గా పరిశీలించే సంతకం చేశారా? 11 పేజీలు ఉన్నాయా? అని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. శ్రీనివాసరావు వద్ద నుంచి కేవలం మడతపెట్టిన ఓ చిన్న కాగితం ముక్క మాత్రమే చూశానని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ అధికారి సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని పేజీల లేఖ ఉందంటూ తమ విభాగానికే చెందిన అధికారి ఎలా సంతకం చేశారని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎయిర్‌పోర్టే ఎందుకంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు నుంచి దాదాపు వారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశ మొదలు.. విశాఖ జిల్లాలో యాత్ర కొనసాగినప్పుడు, ప్రస్తుతం విజయనగరంలో యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో దాదాపు ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి వచ్చారు. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి, శుక్రవారం తిరిగి వస్తారు. సుమారుగా మూడు నెలల కాలంలో 20 సార్లకు పైగా ఆయన ఈ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్లి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయంలో ఎక్కడా ఆగకుండా నేరుగా పాద్రయాత్ర జరిగే ప్రాంతంలోని శిబిరం వద్దకు చేరుకుంటారు. హైదరాబాద్ వెళ్లేటప్పుడు మాత్రం కొంచెం సమయం ఉంటుంది (చెక్ ఇన్ కోసం కనీస నిర్ణీత సమయంలోగా వెళ్లాలి) కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో వేచి ఉంటారు. బోర్డింగ్ తర్వాత విమానం వద్దకు వెళ్తారు. జననేత ఎయిర్‌పోర్టుకెళ్లిన సందర్భాల్లో అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, అభిమానులు.. ఎవరు సెల్ఫీ అడిగినా కాదనకుండా వారితో ఫొటో దిగుతుంటారు. ఈ దృష్ట్యా జగన్‌పై హత్యకు కుట్ర పన్నిన వారు ఎయిర్‌పోర్ట్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. -
నిజంగానే నోరు విప్పలేదా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పోలీస్ కమిషనర్, ఐజీ మహేష్ చంద్ర లడ్హా... ఇటీవలే కర్నూలు ఎస్పీగా బదిలీ అయినప్పటికీ కేసు విచారణ నిమిత్తం ఇక్కడే ఆగిపోయిన డీసీపీ ఫకీరప్ప ఐపీఎస్.. నగరానికి కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారి డీసీపీ రవీంద్రనాథ్.. ఇంకా నలుగురు ఏసీపీలు... మరో పదిమంది సీఐలు.. పదుల సంఖ్యలో ఎస్ఐలు, ఆర్ఐలు... ఇక లెక్కలేనంత మంది కానిస్టేబుళ్లు...! ఇంతమంది ఎందుకో తెలుసా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తున్న అధికారుల బృందం ఇదీ. వీరిలో ఐజీ లడ్హా ట్రాక్ రికార్డు తక్కువేం కాదు. ఆయన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు నక్సలైట్లను మట్టుబెట్టి వారి హిట్‌లిస్ట్‌లోకి ఎక్కారు. ఇక మిగిలిన అధికారులకు బోలెడు చర్రిత ఉంది. మరి ఇంతమంది అధికారులు, వందల మంది పోలీస్ సిబ్బంది కలిసి కూడా నిందితుడు శ్రీనివాసరావు నుంచి.. ‘నేను చెప్పాల్సిందంతా లేఖలోనే రాశా.. ’ అనేది మినహా అదనంగా ఒక్క ముక్క కూడా సమాచారం రాబట్టలేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిందితుడి నుంచి నిజంగానే నిజాలు రాబట్టలేకపోతున్నారా? లేక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి నిజాలను వెలికి తీయాలని భావించడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నో కేసులను ఛేదించిన ఘనత ఉన్న ఇంతమంది అధికారులు నిందితుడు శ్రీనివాసరావు నుంచి కనీస సమాచారం కూడా రాబట్టలేకపోవడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేసును నీరుగార్చేయాలన్న కుట్ర కనిపిస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. చెదరని క్రాఫ్.. చిరునవ్వులు చిందిస్తూ.. జేబు దొంగలు, సినిమా హాళ్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారిని కూడా స్టేషన్లో తలకిందులుగా వేలాడదీసి భయభ్రాంతులకు గురిచేసే పోలీసులు ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును మాత్రం నెత్తిన క్రాఫ్ చెదరకుండా, ముఖంలో చిరునవ్వు చెదరకుండా, ఎంతో మర్యాదగా రోజూ బిర్యానీలు వడ్డిస్తూ విచారణ చేస్తుండటం విస్తుగొలుపుతోంది. దాదాపు మూడు రోజులుగా విచారణ చేస్తున్నా నిందితుడు సహకరించడం లేదని, ఏమీ మాట్లాడటం లేదని, అంతా లేఖలోనే రాశానని చెబుతున్నాడని స్వయంగా విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా చెబుతున్నారు. కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నానికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు? నిందితుడిని ప్రేరేపించి ఏం జరిగినా తాము చూసుకుంటామని అభయం ఇచ్చిందెవరు? పక్కా పథకం ప్రకారం పది నెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు..? అనే కీలక విషయాలను పోలీసు అధికారులు సూత్రప్రాయంగా కూడా రాబట్టలేకపోయారు. ఇవాళ ఏమీ లేదు.. రేపు చూద్దాం జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకున్న రెండో రోజు సోమవారం కూడా కేసు పురోగతిలో ఏమీ సాధించలేకపోయామని ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ మళ్ళ శేషు చెప్పారు. సోమవారం రాత్రి ఆయన స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇవాళ డెవలప్మెంట్స్ ఏమీ లేవు.. రేపు చూద్దాం.. అని పేర్కొన్నారు. కుట్రకు కేంద్రంగా భావిస్తున్న శ్రీనివాసరావు పనిచేసిన ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన హర్షవర్ధన్చౌదరిని ఎట్టకేలకు ఆదివారం ప్రశ్నించిన పోలీసులు.. సోమవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో మరోసారి పిలిచినా ఎలాంటి విచారణ చేయలేదు. రెస్టారెంట్లో పనిచేసే కొందరు మహిళా సిబ్బందిని ఆయన వెంట తిరిగి పంపినట్లు తెలిసింది. అవే సమాధానాలు ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు పోలీస్ కస్టడీలో రెండో రోజు కూడా నోరు మెదప లేదు. నిందితుడు నవ్వుతూ బెరుకు, భయం లేకుండానే కనిపించాడంటున్నారు. కుట్ర కోణంపై ఎన్ని విధాలుగా ప్రశ్నలు సంధించినా ఒకటే సమాధానం చెబుతుండడంతో మానసికంగా అంత ధృఢంగా ఎలా ఉండగలుగుతున్నాడో విశ్లేషించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్లో చేరినప్పటి నుంచి నిందితుడి కదలికలను పరిశీలించేందుకు ఎయిర్‌పోర్టులో సీసీ పుటేజ్‌ను సేకరించి విశ్లేషిస్తున్నారు. నిందితుడు హోటల్లో ఎలా ఉండేవాడు..? డ్యూటీ అయిపోయిన తర్వాత ఎలా ప్రవర్తించేవాడు? హోటల్లో ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు? మాట్లాడేటప్పుడు ఎలా ఉండేవాడో పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మానసిక వైద్యుల పర్యవేక్షణలో సీసీ పుటేజ్‌లను పరిశీలించాలని భావిస్తున్నట్లు ‘సిట్’ వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు గతంలోనూ ఎక్కడా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేదని తేలడంతో ఆ వివరాల సేకరణపైనా దృష్టి పెట్టారు. స్వగ్రామంలో నిందితుడిపై నమోదైన కేసు గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. -
విచ్చుకత్తితో క్షణాల్లో ప్రాణాలు హరీ...
సాక్షి, అమరావతి బ్యూరో: అరచేతిలో పట్టేంత కత్తితో ప్రాణాలు తీయవచ్చా... అంటే అవును సాధ్యమే అని చరిత్ర చెబుతోంది. పోలీసు శిక్షణ తరగతుల సిలబస్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అరచేతిలో పట్టేంత చిన్న విచ్చుకత్తి విష సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అప్పట్లో భారతీయ రాజులను అంతమొందించేందుకు బ్రిటీష్ పాలకులు వీటిని భారత్‌లోకి తీసుకువచ్చారు. బ్రిటీష్ పరిపాలన అంతమైనా ఆ విష సంస్కృతి అవశేషాలు ఇంకా దేశంలో మిగిలే ఉన్నాయి. విచ్చు కత్తుల విష సంస్కృతికి పుట్టినిల్లు మధ్య ఆసియా దేశం ఆర్మేనియా. అరచేతిలో పట్టేంత చిన్న కత్తులతో ప్రత్యర్థి ప్రాణాలు సులువుగా తీయడంలో ఆర్మేనియాలోని ఓ తెగ ప్రజలు సిద్ధహస్తులు. కేవలం నిమిషంలో 70 కత్తులను విసరగలడం వారి నైపుణ్యానికి నిదర్శనం. బ్రిటీష్ పాలకులు ఆర్మేనియా నుంచి పెద్ద సంఖ్యలో విచ్చుకత్తుల నిపుణులను దేశంలోకి తీసుకువచ్చారు. ప్రధానంగా మెడపైన దాడి చేసి సులువుగా ప్రాణాలు తీసేవారు. ఉత్సవాలు, జాతరలు జరుగుతుండగా చడీ చప్పుడు కాకుండా వచ్చి హత్య చేసి వెళ్లిపోయేవారు. ఎవరు హత్య చేశారో.. ఎలా చేశారో కూడా అంతుబట్టకుండా ఉండేది. నేర పరిశోధనలో... బ్రిటిష్ పాలనలోనే దేశంలో ఈ విచ్చుకత్తుల విద్య బాగా వెళ్లూనుకుంది. ఆ తర్వాత కూడా ఆర్మేనియా వాసులు కొందరు ఇక్కడే స్థిరపడ్డారు. వారిలో ఎక్కువమంది దారిదోపిడీ దారులుగా, నేరస్తులుగా మారారు. తూర్పు తీరం వెంబడి అనేక హత్యలు, ఇతర నేరాల్లో ఈ విచ్చుకత్తులతో దాడి ప్రధానంగా ఉండేది. దాంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వీటి గురించి మద్రాసు రాష్ట్ర మినిస్టీరియల్, పోలీసు గైడ్లో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. నేర పరిశోధనకు సంబంధించి పోలీసు అధికారులకు శిక్షణలో కూడా విచ్చుకత్తులతో దాడులు, హత్యల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. మెడపైనా, మెదడుకు సమీపంలో ఉండే నాడీ వ్యవస్థపైనా విచ్చుకత్తితో దాడి చేయడం ద్వారా అంతమొందించేవారు. ఇలాంటి కేసులను ఎలా విచారించాలన్న దానిపై పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు కూడా. తాజాగా రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినహత్యాయత్నంతో విచ్చుకత్తుల అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. వై.ఎస్.జగన్‌పై జరిగింది విచ్చుకత్తి దాడేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. నిపుణులైన కిరాయి హంతకుల ప్రణాళిక ప్రకారమే పకడ్బందీగా ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని స్పష్టమవుతోందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని తెలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదిస్తేనే అసలు సూత్రధారుల పాత్ర బట్టబయలు అవుతుందన్నారు. అయితే రాజకీయ ఒత్తిడికి తలొగ్గే పోలీసు శాఖ అంతటి పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించగలదా అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. -
ముమ్మిడివరంలోనే కుట్రకు బీజం!
సాక్షి, అమరావతి/కాకినాడ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోనే పథక రచన సాగించినట్లు తెలుస్తోంది. కోడిపందేలు, గుండాటల్లో ఆరితేరడం, దూకుడు స్వభావం, ఒకటి, రెండు కొట్లాటల్లో మారణాయుధాలతో దాడులకు తెగబడిన నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ఎంపిక చేసుకున్నారు. రెండేళ్ల క్రితం స్వగ్రామం ఠానేలంకలో వివాహేతర సంబంధం విషయంలో ఘర్షణ, 2017లో బంధువుల వివాహంలో కొట్లాట, సరిహద్దు తగాదాలో ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడిచేసే ప్రయత్నంలో శ్రీనివాసరావు భయపడి ఊరి విడిచివెళ్లిపోవడం తదితర అంశాలపై ముమ్మిడివరం పోలీసు స్టేషన్లో కేసులున్నాయి. ఇటువంటి నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును అధికార టీడీపీ నాయకుడు హర్షవర్దన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో చెఫ్‌కు సహాయకుడిగా ఎనిమిది నెలల క్రితమే ముమ్మిడివరం టీడీపీ నేతల సిఫార్సుతోనే నియమించినట్లు సమాచారం. శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో చేరేందుకు ఠానేలంక జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుతో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబుకు వరుసకు సోదరుడైన పృథ్వీరాజ్(చినబాబు) సహకరించాడని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. చినబాబు ద్వారా విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరులకు పరిచయం కావడం, రామకృష్ణ, హర్షవర్దన్ చౌదరి మ«ధ్య ఉన్న సాన్నిహిత్యంతో శ్రీనివాసరావును క్యాంటీన్లో చేర్చుకున్నారని చెబుతున్నారు. అప్పటికే శ్రీనివాసరావుపై పలు కేసులున్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అతడికి క్లీన్చిట్ (ఎన్ఓసీ) ఇవ్వడంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందంటున్నారు. అప్పుడే చంపేద్దామనుకున్నారు! టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో సంక్రాంతి సంబరాలు పేరుతో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు రాష్ట్రస్థాయిలో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పందేల్లో కోళ్లకు కత్తులు కట్టడంలో నిష్ణాతుడైన శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే ముఖ్యులతో ఏర్పడ్డ పరిచయాలు అటు విశాఖలోని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరులతో కలిసేందుకు దోహదపడ్డాయి. టీడీపీ సానుభూతిపరుడైన శ్రీనివాసరావు నేరప్రవత్తిని చూసే ఆ పార్టీ పెద్దలు జగన్ హత్య కుట్రను నడిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముమ్మిడివరం నియోజకవర్గంలో జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర జరిగినప్పుడు (జూలై 30– ఆగస్టు 2) హత్యకు ప్లాన్ చేశారంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీనివాసరావు ముమ్మిడివరంలో రెక్కీ నిర్వహించాడని, కానీ అంత జనసమూహంలో, సెక్యూరిటీ మధ్య హత్య చేయడం సాధ్యం కాదని, అందుకే విశాఖ ఎయిర్‌పోర్టును ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని హకుం ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కుట్రలో తమ బండారం బయటపడుతుందనే ఆందోళనతో టీడీపీ నేతలు ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ముమ్మిడివరంలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఠానేలంక వాసులకు హుకుం జారీ చేశారు. అందుకే జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే బుచ్చిబాబు ఎల్లో మీడియాను వెంటబెట్టుకుని అనుచరులతో కలిసి ఠానేలంక వెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కలవడం, కొద్దిసేపటికే శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు తాము వైఎస్సార్సీపీ అభిమానులమని మీడియా ఎదుట చెప్పడం, ఆ తరువాత నుంచి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వరకు అంతా పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేయడం తెలిసిందే. గప్‌చుప్‌గా టీడీపీ నేతలు జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజున నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున హడావుడి చేసిన టీడీపీ నేతలు ప్రస్తుతం గప్‌చుప్‌గా మారిపోయారు. ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ నేతల లింకులు వెలుగుచూడటంతో ఆ ఇంటివైపే రావడం లేదు. ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్టుగా, నిందితుడి కుటుంబంతో సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. రూ.కోటితో 4 ఎకరాలు కొనేందుకు బేరం ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో చేరిన దగ్గర నుంచి కుట్రకు సూత్రదారులు శ్రీనివాసరావుకు విలాసవంతమైన జీవితం గడిపేందుకు నగదు సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. ఆ డబ్బు అందబట్టే ఈ నెల 16న ఠానేలంక వచ్చినప్పుడు ‘లంక ఆఫ్ ఠానేలంక’లో 4 ఎకరాల లంక భూమి కొనేందుకు శ్రీనివాసరావు రూ.కోటికి బేరమాడి వెళ్లాడని స్థానికులు అంటున్నారు. భూమి కొనడానికే రూ.కోటి వరకు పెడతామని చెప్పిన శ్రీనివాసరావుకు అంతకు ఇంకా ఎన్నో రెట్ల సొమ్ము అంది ఉంటుందని ఠానేలంకలో పలువురు మాట్లాడుకోవడం కనిపించింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్లో మొదట్లో శ్రీనివాసరావు వేతనం రూ.7 వేలే. తర్వాత అది రూ.20 వేలకు పెరిగింది. నెలకు కేవలం రూ.20 వేల వేతనం తీసుకునే వ్యక్తి విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు కోటి రూపాయలతో భూమి కొనేందుకు బేరం మాట్లాడుకోవడం గమనిస్తే కుట్రదారుల నుంచి అతడికి ఏ స్థాయిలో సొమ్ము అందుతోందో అర్థం చేసుకోవచ్చు. కాట్రేనికోనలో కత్తి కొనుగోలు కోడిపందేలకు వాడే కత్తుల తయారీలో పేరొందిన కాట్రేనికోనలో కొన్ని నెలల క్రితం శ్రీనివాసరావు కత్తిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొత్తగా తయారు చేసినది కాకుండా అప్పటికే వినియోగించిన కత్తిని కొనుగోలు చేయడంతో సదరు విక్రయదారులకు అనుమానం కూడా వచ్చి, ఇప్పుడెందుకని అడిగినట్టు సమాచారం. తనకు వేరే ముఖ్యమైన పని ఉందని చెప్పి కోడికత్తి కొనుగోలు చేసి విశాఖకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. -
అంతా ఆ లేఖలో చెప్పాను
సాక్షి, విశాఖపట్నం, ఆరిలోవ, ఎన్ఎడీ జంక్షన్: ‘చెప్పాల్సిందంతా లేఖలో చెప్పా. కొత్తగా చెప్పడానికి నా దగ్గరేం లేదు. అంతా ఆ లేఖలోనే ఉంది..’ అంటూ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు పోలీస్ కస్టడీలో తడుము కోకుండా సమాధానాలు చెప్పాడు. ఏ ప్రశ్న అడిగినా ఇదే విషయాన్ని వల్లె వేశాడు. పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నప్పుడు ఏమాత్రం జంకు లేకుండా ఆద్యంతం నవ్వుతూ కనిపించాడు. కస్టడీకి తీసుకున్న నిందితుడిని తొలి రోజు ఆదివారం విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, సిట్‌కు సారథ్యం వహిస్తున్న ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. మ«.12 గంటలకు ప్రారంభమైన విచారణ ఏకబికిన రా. 8 గంటల వరకు సాగింది. నిందితుడి ప్రవర్తనపై ఆరా ఫ్యూజన్ రెస్టారెంట్లో శ్రీనివాసరావుతో కలిసి పనిచేస్తున్న మరో ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు సిబ్బందిని ఒకేసారి స్టేషన్‌కు రప్పించారు. శ్రీనివాసరావు ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు? డ్యూటీ సమయంలో సహచర సిబ్బందితో, ప్రయాణికులతో ఎలా ఉండేవాడు.. డ్యూటీ అయిన తర్వాత ఎలా ఉండేవాడు ? ఏ విధంగా బిహేవ్ చేసేవాడు? అతని ఆలోచన విధానం, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది? ఎటువంటి పుస్తకాలు చదివేవాడు? అందరూ కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లేవారా? స్వగ్రామం, కుటుంబ సభ్యుల వివరాలను ఏమైనా చెప్పేవాడా? తదితర విషయాలపై ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని రాత్రి ఏడు గంటల సమయంలో స్టేషన్‌కు పిలిపించారు. ‘శ్రీనివాసరావును నీకు ఎవరు పరిచయం చేశారు? ఎప్పుడు, ఎక్కడ పరిచయం చేశారు? పనిలో ఎలా పెట్టుకున్నారు? ఎవరైనా సిఫార్సు చేశారా? ఎప్పుడు పనిలో పెట్టుకున్నారు? డ్యూటీ సమయంలో ఎలా ఉండేవాడు ?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. దీనికి ఆయన బదులిస్తూ.. బెంగళూరు, హైదరాబాద్ రెస్టారెంట్లలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పడంతో పనిలో పెట్టుకున్నానని బదులిచ్చినట్టు తెలిసింది. హర్షవర్ధన్‌ను, నిందితుడిని తొలుత వేర్వేరు రూమ్‌లలో విచారించిన సీపీ, ఏసీపీలు ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ముఖాముఖి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. మరో వైపు నిందితునితో సహా అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలపై, ఫోన్‌కాల్స్‌పై దృష్టి పెట్టారు. రమాదేవిని ప్రశ్నించిన సీపీ, ఏసీపీలు వైఎస్ జగన్‌కు కాఫీ సర్వ్ చేసిన శ్రీనివాసరావు సహచర ఉద్యోగి రమాదేవితోపాటు అతని స్నేహితునిగా చెబుతున్న రేవతిపతి, లేఖ రాసిందని చెబుతున్న అతని సోదరి విజయదుర్గ, ఫ్లెక్సీ తయారు చేసిన గిడ్డి చైతన్యలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు. వీరిని తొలుత వేరే గదిలో ఉంచి ఒక్కొక్కరిగా, అనంతరం నిందితుడి ఎదురుగా తీసుకెళ్లి విచారించారు. ‘ఘటన జరిగిన రోజున నీతో పాటు శ్రీనివాసరావును ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లమని చెప్పారా? అతను నీతో వచ్చేటప్పుడు అతని వెంట ఆయుధాలు తీసుకురావడం నువ్వు చూశావా? వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అటాక్ చేసే విషయాన్ని ముందుగా నీతో ఏమైనా చర్చించాడా?’ అంటూ వరుసగా రమాదేవిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నాతో ఏమీ చెప్పలేదు.. జగన్‌ను చూడాలని ఉంది.. నీతో వస్తా తీసుకెళ్లమని బతిమలాడితేనే నా వెంట తీసుకెళ్లాను’ అని రమాదేవి బదులిచ్చినట్టు సమాచారం. అతను హత్యాయత్నానికి పాల్పడతాడని తాను ఊహించలేదని ఆమె పేర్కొన్నట్టు చెబుతున్నారు. తనవెంట వచ్చేటప్పుడు అతని జేబులో ఆ లేఖ ఉందోలేదో చూడలేదని, పైగా ఆ లేఖ ప్రస్తావన కూడా తన వద్ద తేలేదని రమాదేవి చెప్పినట్టు సమాచారం. ఆ లేఖ తాను రాయలేదని, అప్పటికే అతను రాసి ఉన్న మేటర్‌ను అందంగా రాసి ఇవ్వమన్నాడని, దాన్ని జగన్‌కు అందజేస్తానని చెప్పుకొచ్చాడని అందుకే తాను రాశానని విజయదుర్గ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. తొమ్మిది పేజీల లేఖలో ఉన్న దస్తూరిని విజయదుర్గ దస్తూరితో, మిగిలిన రెండు పేజీల దస్తూరిని రేపతిపతి దస్తూరితో సరిపోయిందా లేదా అని పరిశీలించారు. నిందితుడు విచారణకు సహకరించడం లేదు : సీపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, అయితే నిందితుడు విచారణకు సహకరించడం లేదని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా అన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును తొలిరోజు ఆదివారం విచారించాక ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన కేసు పురోగతిని మీడియాకు వివరించారు. విచారణకు నిందితుడు శ్రీనివాసరావు ఏమాత్రం సహకరించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆ లేఖలో చెప్పాను కదా.. అంటూ బదులిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీపీ ఇంకేం చెప్పారంటే.. ఆయుధాలను కిచెన్‌లో దాచాడు ‘జనవరిలో కోడి పందాల సీజన్లోనే ఆయుధాలను తీసుకొచ్చి ఎయిర్‌పోర్టులోని కిచెన్‌లో దాచాడు. అప్పుడు ఎందుకు తీసుకొచ్చావని అడిగితే చెప్పడం లేదు. ఇప్పటి వరకు 10, 12 మందిని విచారించాం. నిందితునికి విజయా బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. వాటి లావాదేవీలపై సోమవారం విచారణ సాగిస్తాం. ఏడాదిలో తొమ్మిది సెల్ఫోన్లు మార్చాడు. వీటిలో నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. ఏడాదిగా వేలాది కాల్స్ మాట్లాడాడు. వీటిలో ఎక్కువగా బంధువులు, స్నేహితులు, సహచర సిబ్బందితోనే మాట్లాడినవి ఉన్నట్టుగా గుర్తించాం. మిగిలిన కాల్స్‌పై కూడా లోతైన విచారణ జరుపుతున్నాం. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పిలిపించి విచారిస్తాం. గన్నవరానికి చెందిన లేపాక్షి ఫ్లెక్సీలో డిసెంబర్ 29న ఫ్లెక్సీకి ఆర్డర్ ఇచ్చాడు. జగన్ గారిది, తనది మాత్రమే ఫొటోలు ఉండాలని, ఎవరూ ఉండ కూడదని చెప్పి తయారు చేయించాడు. ఆరోజంతా అక్కడే ఉండి డ్రాప్ట్ చూసిన తర్వాత çఫ్లవర్స్ లేకపోతే పెట్టించి ఫ్లెక్సీ వేయించుకుని రూ.1800 ఇచ్చాడు. దాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి రూ.500 ఇచ్చి ఫ్రేమ్ తయారు చేయించి 31వ తేదీ రాత్రి 11.30 గంటలకు పెట్టించాడు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టు వైద్యురాలు స్వాతి 0.5 సెంటిమీటర్ లోతు గాయమైనట్టుగా ఫస్ట్‌ఎయిడ్ రిపోర్టులో పేర్కొంది. హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన వైద్యులు ఒకటిన్నర సెంటిమీటర్ లోతులో గాయమైనట్టుగా చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి వైద్యురాలు తన అభిప్రాయం మాత్రమే చెప్పారు. నిందితుని హ్యాండ్ రైటింగ్ బాగున్నప్పటికీ ఎందుకు ఇతరులతో లేఖ రాయించాల్సి వచ్చిందో విచారిస్తున్నాం. ఇతని బిహేవియర్, యాటిట్యూడ్ తెలుసుకునేందుకు కో వర్కర్స్‌ను విచారిస్తున్నాం. సిట్ అధికారి నాగేశ్వరరావును హైదరాబాద్ పంపితే స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాకరించారు. సెక్షన్ 160 ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాల్సిందిగా కోరతాం. రేపటి నుంచి విచారణ మరింత వేగవంతం చేస్తాం’ అన్నారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ ఫకీరప్పా, సిట్ చీఫ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆరు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి నిందితుడిని విచారించడానికి రెండు వారాలపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు విశాఖపట్నం ఏడవ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్‌ను కోరగా.. ఆరురోజుల పాటు కస్టడీకి ఇస్తూ జడ్జి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జడ్జి ఉత్తర్వులను ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు సిట్ బృందం జైలు సూపరింటెండెంట్‌ను కలిసి అందజేసింది. 11.15 గంటల సమయంలో కస్టడీకి అప్పగించిన శ్రీనివాసరావును ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య నేరుగా ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు 11.45 గంటలకు తీసుకొచ్చారు. శ్రీనివాసరావుకు ఈ నెల 26న కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేంద్ర కారాగారంలో ప్రత్యేక గదిలో ఉంచారు. ఇతర ఖైదీలెవ్వరితో మాట్లాడనివ్వలేదు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం మధ్యలో మీడియా ప్రతినిధులను దారిమళ్లిస్తూ భారీ బందోబస్తు మధ్య శ్రీనివాసరావును జైలు నుంచి ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. జైలు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడు శ్రీనివాసరావు మీడియా వాహనాలను గమనిస్తూ నవ్వుతుండటం మీడియా ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది. -
వైఎస్ జగన్‌పై వేణుగోపాల్ ఆంక్ష
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో కుట్రదారులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) వేణుగోపాల్ వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. జగన్‌పై హత్యాయత్నం చేసిన దుండగుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో వేణుగోపాల్ ఆ కుట్రకు సహకరించారన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఇటీవల కాలంలో కప్పు కాఫీ కూడా బయటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతుల్లేవని నానా హంగామా చేసిన వేణుగోపాల్.. కత్తులు తీసుకుని ఎయిర్‌పోర్టులోకి వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే జగన్‌ను అంతమొందించాలనే కుట్రలో భాగంగా బయటి నుంచి కాఫీలకు కూడా అనుమతుల్లేవంటూ హడావుడి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ జగన్‌కు బయట కాఫీకి ‘నో’ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గత కొంతకాలంగా ఎయిర్‌పోర్టుకు విచ్చేస్తున్న సందర్భాల్లో పార్టీ 42వ వార్డు అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సందర్భాల్లో మాత్రమే ఫ్లైట్ చెకింగ్‌కు సమయముంటే వీవీఐపీ లాంజ్‌లో కాసేపు ఆగి కాఫీ తాగి వెళ్లేవారు. అయితే, రెండు వారాల క్రితం బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై సీఎస్‌వో వేణుగోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ ఉండగా, బయటి నుంచి కాఫీలు తెచ్చుకుంటే అద్దెలు కట్టుకుంటున్న రెస్టారెంట్ వారి పరిస్థితి ఏమవుతుందని చిందులు తొక్కారు. ఇందుకు శ్రీధర్‌తోపాటు పార్టీ నేతలు.. జగన్ గారు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తాం.. మిగిలిన వారంతా రెస్టారెంట్ నుంచే కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకు కూడా కుదరని వేణుగోపాల్ ఖరాకండిగా చెప్పారు. పైగా శ్రీధర్ ఇంటి నుంచి తీసుకొచ్చిన కాఫీ ఫ్లాస్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెండు వారాలుగా రెస్టారెంట్ నుంచే కాఫీ, టీలు కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే అదనుగా దుండగుడు శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే బయట నుంచి తీసుకువస్తున్న కాఫీని వేణుగోపాల్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు కూడా బయటి నుంచి ఫుడ్ తెచ్చుకుని మరీ ఎయిర్పోర్ట్ వీవీఐపీ లాంజ్‌లో కూర్చుని తీసుకుంటుంటారు. వీరి విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించని వేణుగోపాల్.. జగన్ విషయంలోనే వివాదం చేయడంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. -
శ్రీనివాస్ ఫ్లాట్‌లోని వేరే గదిలో ఇద్దరమ్మాయిలు!
సాక్షి, విశాఖపట్నం/ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్మోహన్రెడ్డిని హతమార్చడానికి పక్కా పథకాన్ని రచించారన్న వాదనలకు లభిస్తున్న ఆధారాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్‌ను కత్తితో పొడిచిన జనుపూడి శ్రీనివాసరావు ఉంటున్న ఇల్లు ఎయిర్‌పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉంది. విమానాశ్రయం ఎదురుగా ఉన్న విమాననగర్ రెండో లైన్‌లోని శాంతినివాస్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో శ్రీనివాసరావు ఉంటున్నాడు. అతనితో పాటు రాజు అనే వ్యక్తి, మరో యువకుడు, ఇద్దరు యువతులు (ప్రత్యేకంగా ఉన్న గదిలో) మొత్తం ఐదుగురు ఉండేవారు. వీరిలో రాజుతో శ్రీనివాసరావు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. వీరంతా ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్‌లోనే పనిచేస్తున్నారు. ఇంతలో ఈ నెల 20న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన నరేష్ కుష్వా, భరత్‌సింగ్ అనే ఇద్దరిని (వరుసకు అన్నదమ్ములు) ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేయడానికి హర్షవర్థన్ విశాఖ రప్పించారు. గతంలో వీరిద్దరు ఇదే రెస్టారెంట్లో కుక్, సహాయ కుక్లుగా పనిచేసి ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్‌కు వెళ్లిపోయారు. గతం కంటే ఎక్కువ జీతం (నెలకు రూ.18 వేలు) ఇస్తామంటూ హర్షవర్థన్ పలుమార్లు ఫోన్లు చేయడంతో వీరు విశాఖ వచ్చారు. తాము విశాఖ వచ్చే సరికి ఇప్పుడు ఉంటున్న గదిలో శ్రీనివాసరావు, రాజు, మరో వ్యక్తి ఉంటున్నారని, ఇద్దరు యువతులు అంతకు కొద్దిరోజుల ముందే వెళ్లిపోయారని నరేష్ కుష్వా ‘సాక్షి’కి చెప్పాడు. జనవరిలో తాము గ్వాలియర్ వెళ్లిపోయే సమయానికి శ్రీనివాసరావు ఇక్కడకు రాలేదన్నాడు. తాము వచ్చి ఐదు రోజులే కావడంతో శ్రీనివాసరావుతో తమకు అంతగా పరిచయం లేదని, బయట చలాకీగా ఉన్నా తమతో ముభావంగానే ఉండేవాడని వివరించాడు. పథకంలో భాగంగానే రప్పించారా? జగన్మోహన్రెడ్డిపై హత్యకు కుట్ర పన్నిన నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు జైలు కెళ్లడం ఖాయమన్న ఉద్దేశంతోనే గ్వాలియర్ నుంచి ఇద్దరు కుక్‌లను ముందస్తుగా రప్పించి, రెస్టారెంట్ నడవడానికి ఇబ్బంది కలగకుండా వ్యూహం పన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ సన్నిహితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి మూడో వ్యక్తితో పాటు కొద్దిరోజుల క్రితం వరకు అదే ఫ్లాట్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలు ఏమయ్యారు? ఎక్కడున్నారన్న దానిపై స్పష్టత లేదు. కనిపించకుండా పోయిన ఇద్దరు అమ్మాయిల దుస్తులు ఇప్పటికీ శ్రీనివాసరావు ఉంటున్న ఫ్లాట్‌లోనే ఉన్నాయి. ఆ ఇద్దరినీ విచారించిన పోలీసులు శ్రీనివాసరావు ఉంటున్న శాంతినివాస్ ఫ్లాట్‌కు శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు కొందరు వెళ్లారు. ఫ్లాట్‌లో ఉంటున్న గ్వాలియర్‌కు చెందిన ఇద్దరు కుక్‌లను విచారించారు. శ్రీనివాసరావుతో వారికున్న సంబంధాలు, పరిచయాలపై ఆరా తీశారు. తాము ఇటీవలే ఇక్కడకు వచ్చామని, శ్రీనివాసరావు గురించి తమకేమీ తెలియదని చెప్పిన విషయాలను నమోదు చేసుకుని పోలీసులు వెళ్లిపోయారు. -
మెడపై కత్తిగాటు ప్రాణానికే ముప్పు
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం, ఏలూరు : మనిషి మెడలో కెరోటిడ్ అర్టిరీ (ధమని) అనే మెదడుకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం ఉంటుంది. దీన్ని కట్ చేస్తే ఎవరికైనా సరే నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఒకసారి ఈ నరం కట్ అయితే దీన్ని అతికించడం అసాధ్యమే. ఎందుకంటే రెండు నుంచి నాలుగు నిమిషాల్లో ప్రాణం పోతుందని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఇదే రీతిలో పదునైన చిన్నపాటి కత్తితో ఈ నరాన్ని కట్ చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని హత్య చేయాలని ప్రయత్నించడం.. అది గురితప్పి భుజానికి గాయం కావడం తెలిసిందే. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జనుపల్లి శ్రీనివాసరావు చేసిన హత్యాయత్నంలో కత్తి పోటు జగన్మోహనరెడ్డి మెడపై పడి ఉంటే చాలా ప్రమాదకరంగా పరిణమించేదని డాక్టర్లు చెబుతున్నారు. ఒక ప్రణాళికా బద్దంగా ప్రతిపక్ష నేతను అడ్డు తప్పించే కుట్రతోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు స్పష్టంగా కనపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి మనిషికి కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఈ కెరోటిడ్ అర్టరీ రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళం రెండు బ్రాంచులుగా ఉంటుంది. ఒకటి శుద్ధి చేసిన రక్తాన్ని గుండె నుంచి మెదడుకు తీసుకువెళ్తుంది. మరోటి మెడ, ముఖానికి రక్తం సరఫరా చేస్తుంది. ఈ కెరోటిడ్ ఆర్టరీ పల్స్‌ను మనం మెడపై రెండువేళ్లు పెట్టి నొక్కిపట్టుకుంటే స్పష్టంగా తెలుస్తుంది. ఇది నేరుగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి దీనికి చిన్న గాయం అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ రక్త నాళం తెగితే 15 నుంచి 20 సెకన్లలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారని, రెండు నుంచి 4నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ రక్తనాళం తెగినప్పుడు రక్తం పైపు నుంచి వెదజల్లినట్లు వస్తుందని, తెగిన నరం ముడుచుకు పోవడంతో దీన్ని గుర్తించి అతికించే ప్రయత్నం జరిగేలోగా ప్రాణం పోతుందని చెబుతున్నారు. కెరోటిడ్ ఆర్టిరీ తెగితే జరిగేదిదీ.. - ఈ రక్తనాళం తెగిపోవడం వల్ల మెదడు నుంచి సంకేతాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. - బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. - హార్ట్ రేటు పడిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశం. - పల్మనరీ ఎంబాలిజం అంటే శ్వాసకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం. - ఇది ప్రధాన రక్తనాళం కాబట్టి కొద్ది లోతు తెగినా ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. - దీనివల్ల మనిషి వెంటనే నీరసపడిపోతాడు. - మిగతా రక్తనాళాలపై కూడా ప్రభావం ఉంటుంది. తద్వారా ఇతర అవయవాల పనితీరు శ్రుతి తప్పుతుంది. - చికిత్సకు చాలా సమయం తక్కువ. ఈ నరం తెగిన వారు సురక్షితంగా బయట పడటం చాలా అరుదు. చచ్చి బతికాను.. శరీరంలో మెడ భాగంలోని నరాలు మహాసున్నితం. అక్కడ కత్తితో కోయడం వల్ల తీవ్ర రక్తస్రావం తప్పదు. అక్కడ ఉండే రక్తనాళాలు తెగాయంటే (కెరోటిడ్ ఆర్టిరీ, జుగ్లర్ వెయిన్) నిమిషాల వ్యవధిలో మనిషి కుప్పకూలిపోతాడు. ప్రత్యర్థులను కచ్చితంగా మట్టుబెట్టాలనే లక్ష్యంతోనే ఈ తరహా దాడులు చేస్తారు. సరిగ్గా ఇదే తరహాలో 1996లో నాపై హత్యాయత్నం జరిగింది. ఆ దాడిలో హంతకులు చిన్నపాటి పదునైన కత్తితో నా మెడ భాగంలో కోయబోయారు. అయితే ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు తిరగడంతో కత్తి గురి తప్పి, మెడ భాగం నుంచి దవడ కింది భాగం వరకూ కత్తిగాటు అయింది. 3 రోజులపాటు కోమాలో ఉన్నాను. పాదరసం పూసిన కత్తితో హంతకులు నన్ను 28 పోట్లు పొడిచారు. వాటి ఫలితంగా ఇన్ఫెక్షన్ సోకి నాలుగు పక్కటెముకలు తొలగించాల్సి వచ్చింది. 1996 నుంచి 2008 వరకు 16 ఆపరేషన్లు చేశారు. పాదరసం పూసిన కత్తిగాట్లు కావడంతో ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతున్నాను. నాపై హత్యాయత్నం చేసినవాడి లక్ష్యం మెడ భాగంలోని కెరోటిడ్ రక్తనాళాన్ని కట్ చేయడమే. అది మిస్ కావడంతో తీవ్ర గాయాలతో చచ్చి బతికాను. – జీవీ హర్షకుమార్, మాజీ ఎంపీ జగన్ పసిగట్టకపోయి ఉంటే.. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డ జనిపెల్ల శ్రీనివాసరావు అసలు లక్ష్యం ప్రాణాలు తీయడమేనన్న వాదనలు బలపడుతున్నాయి. కోడిపందేల కత్తితో అతడు దాడి చేసే సమయంలో జగన్ పసిగట్టి పక్కకు వాలడంతో మెడకు నాలుగు అంగుళాలు కింద భుజంపై ఆ గాటు పడింది. దీంతో జననేతకు ప్రాణాపాయం తప్పింది. అదే జగన్ పక్కకు వాలకపోయి ఉంటే ఏం జరిగిఉండేదో ఊహించడానికే భయం వేస్తోందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన కుట్రతో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ నేతలు తేలిగ్గా తీసిపారేస్తుండటం పట్ల జనం విస్తుపోతున్నారు. వెటకారం కాదు.. ఇదీ వాస్తవం ఎల్లో మీడియా వెటకారం చేస్తున్నట్లు కోడి పందేలకు వాడే కత్తి మొండి కత్తి కాదు. దీన్ని విమానాలకు ఉపయోగించే రేకుతో తయారు చేస్తారని కోడి పందేల నిర్వాహకులు చెబుతున్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొంత మంది ఈ రేకును తీసుకువచ్చి ఇనుప పిడితో వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. పందేలలో కొందరు ఈ కత్తికి ఉమ్మెత్త పువ్వు రసాన్ని కత్తికి పూస్తారు. ఈ కత్తి కట్టిన కోడి కాలు పైకి ఎత్తినప్పుడు ఎదుటి కోడికి మత్తు వచ్చి ఓడిపోతుంది. మరికొన్ని సందర్భాలలో కత్తికి పాదరసం పూసినపుడు కోడి చనిపోవడంతో పాటు ఆ గాయం ఉన్నచోట పచ్చగా మారిపోతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కత్తికి విషం ఉండవచ్చన్న అనుమానంతో వైఎస్ జగన్‌కు గాయం అయిన చోట కొంత భాగాన్ని తీసి పరీక్షకు పంపించినట్లు వైద్యులు చెబుతున్నారు. బతికే అవకాశం చాలా తక్కువ ఇలాంటి పదునైన ఆయుధాలతో మెడపై గాయం చేస్తే బాధితుడికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇది చాలా సున్నితమైన రక్తనాళం. అందులో మనిషిలోని ప్రధాన అవయవాలకు రక్తం అందించే నాళం కాబట్టి దీనిపై ఎలాంటి గాయమైనా మెదడు, గుండెపై క్షణాల్లో ప్రభావం పడుతుంది. తక్షణ చికిత్స కోసం కూడా అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం ఉండే అవకాశం ఎక్కువ. –డా.నాంచారయ్య, ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ), సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
జగన్‌పై హత్యాయత్నం: ఏసీపీ అర్జున్ ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ అధినేత, టీడీపీ విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్దన్ ప్రసాద్ చౌదరిని ఎట్టకేలకు ఎయిర్‌పోర్టు పోలీసులు విచారించారు. శనివారం మధ్యాహ్నం ఆయన్ని ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. సిట్ బృందంలోని సీఐ లక్ష్మణమూర్తి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి నోటీసులిచ్చారు. అనంతరం విడిచిపెట్టారు. మీడియాలో వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికే హర్షవర్దన్‌ను మొక్కుబడిగా విచారించి, వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘సిట్’ అదుపులో మరో ఇద్దరు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వివిధ విమానయాన సంస్థల ఉద్యోగులు, ఫ్యూజన్ ఫుడ్స్ సిబ్బందిని శనివారం సీఐఎస్ఎఫ్, సిట్ అధికారులు విచారించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు రెస్టారెంట్‌లోని మిగతా సిబ్బందితో ఉన్న సంబంధాలు, అతడి వ్యవహారశైలి తదితర అంశాలపై ఆరా తీశారు. ఎయిర్‌పోర్టులో విమానయాన సంస్థల ఉద్యోగులతోనూ శ్రీనివాసరావు ఎలా మసలేవాడు? ఎవరితో సత్సంబంధాలు కొనసాగించాడు? వంటి విషయాల గురించి వాకబు చేశారు. ఫ్యూజన్¯ ఫుడ్స్ రెస్టారెంట్లో పని చేస్తున్న ఇద్దరిని ‘సిట్’ సభ్యులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. శ్రీనివాసరావు 11 పేజీల లేఖను రాసినట్టు చెబుతున్న శ్రీనివాసరావు సోదరి (వరసకు) విజయలక్ష్మి, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పలాసకు చెందిన రేవతీపతిలను రెండో రోజూ సిట్ పోలీసులు రహస్యంగా విచారించారు. చెన్నై నుంచి వచ్చిన సీఐఎఫ్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్, డీఐజీ సెల్వంలు ఎయిర్‌పోర్టు భద్రతపై సమీక్షలు కొనసాగించారు. ఏసీపీ అర్జున్ ఓవరాక్షన్ జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణ సాగిస్తున్న ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌ను పర్యవేక్షించే నార్త్ జోన్ ఏసీపీ లంకా అర్జున్ ఓవరాక్షన్ విమర్శల పాలవుతోంది. విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడపడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అభిమాని అని చెప్పడానికే ఆయన ఎక్కువగా తాపత్రయ పడ్డారు. నిందితుడు అమాయకుడంటూ పదేపదే పేర్కొంటూ అతడి తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడారు. చెక్కు చెదరని క్రాఫ్‌తో నవ్వుతూ కనిపించిన నిందితుడు శ్రీనివాసరావును చూస్తే లంకా అర్జున్ ఆధ్వర్యంలోని బృందం విచారణ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
కేసులుంటే డ్యూటీ పాస్ ఎలా ఇచ్చారు?
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి ఎవరైనా అడుగుపెట్టాలంటే అనేక ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి. తనిఖీల విషయంలో ప్రయాణికులనే కాదు అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా విడిచిపెట్టరు. అణువణువూ తనిఖీచేస్తారు. అలాగే, అక్కడ పనిచేసే సిబ్బందికి పాసులు జారీచేసే విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనతో నిందితుడు శ్రీనివాసరావుకు పాసు జారీ విషయంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఎన్ఓసీ ఎలా ఇచ్చారు? వాస్తవానికి ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా డ్యూటీ పాస్‌లు జారీచేస్తారు. రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది అయితే దాని యజమాని తమ వద్ద ఎవరెవరు పనిచేస్తున్నారు.. వారిని ఏ విధంగా నియమించుకున్నామో వివరిస్తూ లేఖ ఇవ్వాలి. లేఖ ఇచ్చిన తర్వాత వారిపై ఏమైనా కేసులున్నాయో లేదో విచారించి రిపోర్టు ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులకు ఎయిర్‌పోర్టు అధికారులు లేఖ రాస్తారు. ఒకవేళ వారు స్థానికులైతే వారు నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో విచారించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పంపిస్తారు. వేరే జిల్లాలకు చెందిన వారైతే ఆయా జిల్లాలకు వారి వివరాలను పంపి అక్కడి ఎస్పీల ద్వారా ఎన్వోసీలు తెప్పించుకుంటారు. ఎలాంటి కేసులు లేవని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తేలితేనే ఎన్వోసీలు జారీచేస్తారు. ఒకవేళ ఉంటే వాటి తీవ్రత.. సెక్షన్లు.. ఏ సందర్భంలో ఆ కేసులు నమోదయ్యాయో వివరిస్తూ రిపోర్టు పంపిస్తారు. కేసులున్నాయని స్పష్టంగా రిపోర్టులో పేర్కొంటే మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు వాటిని తిరస్కరిస్తారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌పై దాడిచేసిన జనుపెల్లి శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నట్టు స్పష్టమైంది. గతేడాదే ఠానేలంకలో దాడిచేసిన ఘటనలో శ్రీనివాసరావుపై సెక్షన్–323, 506 (కొట్టడం, బెదిరించడం) కింద కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసరావు ఏ–4 ముద్దాయిగా ఉన్న ఈ కేసు ముమ్మిడివరం కోర్టులో నేటికీ కొనసాగుతున్నప్పటికీ ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని నిందితుడు శ్రీనివాసరావును వెయిటర్‌గా నియమించుకున్నారు. అలాంటి నిందితునికి కేసుల్లేవంటూ రాష్ట్ర పోలీసులు ఎన్వోసీ జారీచేయడం, దాన్ని ఆధారంగా చేసుకుని ఎయిర్‌పోర్టు అధికారులు డ్యూటీ పాస్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు.. రాష్ట్ర పోలీసుల ఎన్వోసీ ఆధారంగానే డ్యూటీపాస్ ఇచ్చాం.. అందులో తమ తప్పేమీ లేదంటూ ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఫోన్ కాల్స్‌పై ఇప్పుడే చెప్పలేం
విశాఖ సిటీ/ఎన్ఎడీ జంక్షన్: రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారో ఇప్పుడే చెప్పలేమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా చెప్పారు. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడ్ని సీఐఎస్ఎఫ్ బృందాలు గురువారం సాయంత్రం 4.30 గంటలకు అప్పగించిన అనంతరం విచారణ చేపట్టామన్నారు. కోడి పందేల కోసం జనవరిలో సొంతూరు వెళ్లినప్పుడే ఈ కత్తుల్ని తీసుకొచ్చాడని సీపీ తెలిపారు. నిందితుడి నుంచి 11 పేజీల లేఖతో పాటు లేఖ జిరాక్స్ కాపీలు, ఒక సెల్‌ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లేఖలో 9 పేజీలను శ్రీనివాస్ సమీప బంధువు జె. విజయలక్ష్మి రాయగా, 10వ పేజీని ఫ్యూజన్ ఫుడ్స్‌లోనే నాలుగు నెలలుగా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా రంగోయి గ్రామానికి చెందిన టి. రేవతీపతి (19)తో రెండు రోజుల క్రితం రాయించాడని విచారణలో వెల్లడించాడన్నారు. ఏడాదిలో పదివేల కాల్స్ కాగా, నిందితుడు శ్రీనివాసరావు ఏడాది కాలంలో 10 వేల కాల్స్ వరకూ మాట్లాడాడనీ, అందుకు సంబంధించిన కాల్ డేటాను సేకరించామని తెలిపారు. రాజకీయ నాయకులెవరితోనైనా మాట్లాడాడా.. రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి తొమ్మిది ఫోన్లు ఎలా మార్చగలిగాడు.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీ బదులిస్తూ.. కేసు విచారణలో ఉందనీ, ఆ వివరాలు ఇప్పుడు వెల్లడించలేనన్నారు. కాగా, వైఎస్ జగన్‌పై దాడికి కొంతకాలంగా ఎదురుచూస్తున్నట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో తెలిపాడన్నారు. ఇదిలా ఉంటే.. ఘటన జరిగిన సమయంలో నిందితుడి వద్ద లేఖ ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ వాళ్లు ముందు చెప్పలేదనీ, కొద్దిసేపటి తర్వాత స్టాంప్ వేసి అప్పగించారన్నారు. లేఖ ఉన్నట్లు ఎందుకు చెప్పలేదో తెలీదంటూ సమాధానాన్ని దాటవేశారు. కాగా, ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్‌ను విచారించేందుకు తమ బృందం వెళ్లిందనీ, ఇప్పటికే ఫోన్లో మాట్లాడి నోటీసు జారీచేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావును అరెస్టు చేసి, సెక్షన్–307 కింద హత్యాయత్నం కేసు పెట్టామని లడ్హా తెలిపారు. -
జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడ రెస్టారెంట్‌లోని వెయిటర్ శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నం చేయడం తెలిసిందే. నిందితుడిని ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అధికారులు గురువారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు శాంతి భద్రతల పోలీసులకు అప్పగించారు. గురువారం రాత్రి నుంచి శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా స్వయంగా విచారించారు. కేసులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులతో చర్చించారు. అనంతరం పోలీసులు విమానాశ్రయానికి తరలించారు. అక్కడ సీఐఎస్ఎఫ్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)కి తరలించారు. అనంతరం రాత్రి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమ్య నివాసంలో నిందితుడిని హాజరుపరచగా.. నిందితుడికి వచ్చే నెల 9వ తేదీ వరకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. నిందితుడు శ్రీనివాస్ గ్రామమైన ఠానేలంక నుంచి ఇద్దరు స్నేహితులను సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విశాఖపట్నం తీసుకువెళ్లారు. ఇందులో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. -
ఫ్లెక్సీపై మరోడ్రామా!
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, జగన్ అభిమాని అని చెప్పడానికి గ్రాఫిక్స్ బొమ్మలతో ఫ్లెక్సీ నాటకానికి తెరలేపి అభాసుపాలైన ప్రభుత్వం శుక్రవారం మరో ప్లెక్సీని తెరపైకి తెచ్చి మళ్లీ నవ్వులపాలైంది. జగన్‌తో శ్రీనివాస్ కలసి ఉన్నట్లుగా హేపీ న్యూ ఇయర్, పొంగల్ అంటూ గురువారం ఫోన్లలో ఫొటోలను విడుదల చేయించిన సంగతి తెలిసిందే. అయితే పది నెలల క్రితం నాటిది కాదని, అది గ్రాఫిక్స్‌లో తాజాగా రూపొందించినదని తేలిపోవడంతో శుక్రవారం మరో నాటకానికి పోలీసుల ద్వారా తెరలేపారు. నిందితుడి స్వగ్రామానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మీడియాను తీసుకువెళ్లి అక్కడ పొలాల్లో ఫ్లెక్సీ పడిఉందంటూ చూపించి వీడియోలు తీయించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా మళ్లీ ప్రచారంలోకి తెచ్చారు. అయితే అంతకు ముందురోజు వరకు లేని ఫ్లెక్సీ అప్పటికప్పడు పొలాల్లోకి ఎలా వచ్చిందన్నది ప్రశ్న.కానీ శుక్రవారం చీలికలతో, నలిగిపోయి పొలంలో పడిఉన్న ఫ్లెక్సీని పోలీసులు మీడియాకు చూపించి దాన్నే వీడియో తీయించారు. అయితే ఒక వ్యక్తి చినిగిపోయి ఉన్నట్లు ఉన్న ఓ ఫ్లెక్సీని శ్రీనివాస్ ఇంట్లోకి తీసుకువెళ్లి ఆ తరువాత దాన్ని మడతపెట్టి తీసుకువెళ్లారు. ఆ వ్యక్తి ఫ్లెక్సీ తెస్తున్న దృశ్యాలు సాక్షి మీడియాకు చిక్కాయి. దీంతో శుక్రవారం నాటి ఫ్లెక్సీ కూడా ప్రభుత్వ సృష్టే అన్నది స్పష్టమవుతోంది. గురువారం మంత్రులు, పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ ఫొటోలో హేపీ న్యూ ఇయర్ తరువాత రోమన్ ‘అండ్’ గుర్తు ఒక్కటే ఉండి అనంతరం పొంగల్ అని రాసి ఉంది. కానీ శుక్రవారం నాటి పోలీసులు చూపిస్తున్న ఫ్లెక్సీలో రోమన్ ‘అండ్’తో పాటు కొన్ని పువ్వుల బొమ్మలు కూడా ముద్రించి ఉండడం విశేషం. -
ప్రొఫెషనల్ కిల్లర్లతో శ్రీనివాసరావుకు తర్ఫీదు..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని అంతమొందించడానికి కుట్ర పన్నారా?అత్యంత ప్రజాదరణ ఉన్న జననేతను కడతేర్చడం ద్వారా మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని స్కెచ్ వేశారా? జగన్‌ని హత్య చేసి.. దాన్ని మరొకరిపై నెట్టేసి, ప్రజల దృష్టిని ఏమార్చేందుకు తాను రచించిన ‘గరుడ’ పురాణాన్ని సినీ నటుడు శివాజీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారా?..ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ పార్టీ నేతలు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక వేత్తలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ నిర్వాహకుడుగా టీడీపీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి ఉండడం.. ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరిగినన్ని రోజులూ ప్రతి గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతిపక్ష నేత విశాఖ విమానాశ్రయానికి వస్తుండడం.. విమానాశ్రయం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పహారాలో ఉండటంతో ఆయన్ను అంతమొందించడానికి విమానా శ్రయాన్నే వేదికగా చేసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో కలసి ప్రతిపక్ష నేత హత్యకు సర్కారు కుట్ర పన్నిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ప్రొఫెషనల్ కిల్లర్‌గా శ్రీనివాసరావుకు తర్ఫీదు.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త. శ్రీనివాసరావు బాబాయి నాగేశ్వరరావు ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచిగా పనిచేశారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లతో మాట మార్చారు. గత కొన్ని నెలలుగా శ్రీనివాసరావుకు తర్ఫీదును ఇచ్చి ప్రొఫెషనల్ కిల్లర్‌గా మార్చారని ఠాణేలంక వాసులు చెబుతున్నారు. తమకు సహకరిస్తున్న శ్రీనివాసరావు కుటుంబానికి ఆరునెలలక్రితమే పక్కా ఇంటిని మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం శ్రీనివాసరావు కుటుంబంతో దరఖాస్తు చేయించారు. అంతేగాక శ్రీనివాసరావుకు భారీ ఎత్తున సుఫారీ(నగదు) ముట్టజెప్పినట్లు ఆ గ్రామవాసులు చెబుతున్నారు. సుఫారీగా ఇచ్చిన సొమ్ముతోనే శ్రీనివాసరావు తన లైఫ్ సెటిల్ అయ్యిందంటూ ఇటీవల సన్నిహితులు, మిత్రులకు భారీ ఎత్తున పార్టీ ఇచ్చినట్లు నిందితుడి సన్నిహితులు అంగీకరిస్తుండటం గమనార్హం. ప్రొఫెషనల్ కిల్లర్‌గా తాము తర్ఫీదు ఇచ్చిన శ్రీనివాసరావును విమానాశ్రయం రెస్టారెంట్లో చెఫ్‌గా చేర్చారు. కోడి పందేలలో ఉపయోగించే కత్తి అత్యంత పదునుగా ఉంటుంది. ఆ కత్తి గొంతులోకి దించితే క్షణాల్లో ప్రాణం పోతుందని పోలీసు అధికారులే చెబుతున్నారు. పదునైన ఆ కత్తినే హత్యకు ఆయుధంగా ఎంచుకుని.. శ్రీనివాసరావుతో కలిపి పలు మార్లు రెక్కీ నిర్వహింపజేసి గురువారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హత్యాయత్నానికి తెగబడ్డారు. తన గొంతుపై దాడి చేసేందుకు శ్రీనివాసరావు చేస్తున్న యత్నాన్ని పసిగట్టి చాకచక్యంగా తప్పించుకోవడంతో.. తీవ్ర గాయంతో ప్రాణపాయం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటపడ్డారు. కేసును నీరుగార్చే యత్నం.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారన్న సమాచారం క్షణాల్లో సీఎం చంద్రబాబుకు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు చేరింది. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం వివరాలను గంటలోపే తేల్చుతామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత కొద్ది నిముషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియా ముందుకొచ్చారు. కనీసం విచారణ ప్రాథమిక దశ కూడా దాటకముందే ‘ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై ఆయన అభిమాని దాడి చేశారు. ఇది చిన్న సంఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. కత్తిని.. తొమ్మిదో పదో పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నాం’ అంటూ తేల్చడం ద్వారా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసును ఆదిలోనే సర్కారు నీరుగార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలోనిందితుడితోసహా మరో ఇద్దరి చేతిరాతలున్నట్లు తేల్చడం గమనార్హం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన ఆవేదనను బహిర్గతం చేయడం కోసం లేఖ రాసుకుంటారని.. కానీ ప్రతిపక్ష నేతపై హత్య చేయడానికి తెగబడిన శ్రీనివాసరావు లేఖ రాసుకోవడంపై పోలీసు అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చడానికే ఈ లేఖను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని చిత్రీకరించడానికి సర్కారు చేసిన ‘ఫ్లెక్సీ’ విన్యాసాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చడానికే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తున్నారని రిటైర్డు డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. గురువారం సర్కారు విడుదల చేసిన ఫ్లెక్సీకి.. శుక్రవారం సిట్ వెలికితీసిన ఫ్లెక్సీకి ఏమాత్రం సంబంధం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపడం గమనార్హం. -
ఘటన ప్రాంతం మా పరిధిలోది కాదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ప్రాంతం తమ పరిధిలోనిది కాదని, అది సీఐఎస్ఎఫ్ పరిధిలోనిదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందినవాడన్నారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజియన్ రెస్టారెంట్లో ఏడాది నుంచి చెఫ్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సెల్ఫీ దిగేందుకు వచ్చి జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి కోడి కాలికి కట్టే కత్తితో దాడి చేశాడని చెప్పారు. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే జగన్ గన్మెన్లు దుండగుడిని పట్టుకుని సీఐఎఫ్ఎస్ అధికారులకు అప్పగించారని చెప్పారు. అతను జగన్ అభిమాని అని చెబుతున్నాడని, ఈ దాడి పబ్లిసిటీ కోసం అన్పిస్తోందని అన్నారు. పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని, దీని వెనుక ఎవరున్నా రనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. అన్ని కోణాల్లో నూ ఈ కేసును దర్యాప్తు చేస్తామన్నారు. ఈ దాడికి సీఐఎస్ఎఫ్ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. దుండగుడు శ్రీనివాస్‌ను విచారించిన సీఐఎస్ఎఫ్ అధికారులు అనంతరం తమకు అప్పగించారని డీజీపీ తెలిపారు. సీఐఎస్ఎఫ్ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన శ్రీనివాస్ జేబులో ఒక లెటర్‌ను (తొమ్మిది, పది పేజీల లేఖ)ను కూడా సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కత్తి ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా వెళ్లిందో తెలుసుకొనేందుకు సీఐఎస్ఎఫ్ అధికారులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్.. ప్రాథమిక చికిత్స అనంతరం విమానంలో హెదరాబాద్కు వెళ్లారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ కోరితే భద్రతను మరింత పెంచుతామని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం నార్త్ ఏసీపీ నాగేశ్వరరావు నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు. దాడికి పాల్పడిన దుండగుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని భావంచే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో రాష్ట్ర పోలీసులు తప్పించుకునేలా దారులు వెదకడం విమర్శలకు తావిస్తోంది. హత్యాయత్నం వెనుక ఎవరున్నారు? ఎలా జరిగింది? గుండుసూదిని కూడా వెళ్లనివ్వని భద్రతా సిబ్బంది కత్తిని ఎలా పోనిచ్చారు? అనే వాటిపై దృష్టిపెట్టాల్సింది పోయి విమర్శలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి వత్తాసు పలికేలా ఉన్నాయని రాజకీయ పక్షాల నేతలు తప్పుపడుతున్నారు. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకునిపై హత్యాయత్నం జరిగితే ఏపీ పోలీసు బాస్ ఠాకూర్, సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ పరస్పర విరుద్ధంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. విమానాశ్రయంలోకి వచ్చే ప్రయాణికులను పరిశీలించి పంపించడం వరకే తమ బాధ్యతని, వ్యక్తుల భద్రతాపరమైన అంశాలు తమ పరిధిలోకి రావని ఆనంద్ అంటే.. ఎయిర్‌పోర్టులో భద్రత తమకు సంబంధంలేదని సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని డీజీపీ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే.. విశాఖ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న రెండు ప్రధాన ఘటనల్లో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని ప్రజలు ప్రస్తావిస్తున్నారు. 2017 జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్‌ను అక్కడ విమానాశ్రయంలోని రన్‌వే పైనే అడ్డుకున్న వందలాది మందికి పైగా రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. తాజాగా.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యా యత్నం ఘటనలో మాత్రం ఎయిర్‌పోర్టు తమ పరిధిలో లేదని డీజీపీ చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు అప్పుడొకలా.. ఇప్పుడొకలా వ్యవహరించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. -
ఈ కత్తి యమ డేంజర్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి కత్తులు చాలా డేంజర్.. మామూలుగా ఉపయోగించే చాకు, కత్తుల కన్నా ఇవి అత్యంత పదునుగా ఉంటాయి. దీంతో దాడి జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అసలు దాడి జరిగిందని తెలుసుకునేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదముంది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి చాలా పదునుగా ఉంది. ఇటీవలే కత్తిని సానపట్టినట్లు కనపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ కత్తులను కోడి పందేలతో పాటు పథకం ప్రకారం జరిగే దొమ్మీలలోనూ, హత్యల్లోనూ వాడతారు. ఇది దిగిన వారికి కూడా తెలియలేనంత పదునుగా ఉంటుంది. హత్య చేయడం కోసమే ఈ కత్తిని తీసుకువచ్చినట్లు తాజా ఘటనతో స్పష్టమవుతోంది. వీటిని సామాన్యులు పట్టుకోవడానికి కూడా భయపడతారు. అటువంటిది దాడిచేసిన వ్యక్తి దాన్ని జేబులోంచి తీసి దాడిచేసిన విధానం చూస్తే పక్కా ప్రణాళికతోనే వచ్చినట్లు అర్ధమవుతోంది. మెడను లక్ష్యంగా చేసుకుని దాడిచేయడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రాణాలు తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కోడి కత్తులపై బాగా అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ బిట్‌తో తయారీ సాధారణంగా కోడిపందేల సమయంలో కోడి కాళ్లకు ఈ కత్తులను కడతారు. చాలా పదునుగా ఉండే వీటిని స్టెయిన్లెస్ స్టీల్ బిట్ అనే మెటల్‌తో తయారుచేస్తారు. వీటికి ఎక్కువసార్లు సానబడతారు. ఈ కత్తి పదునుకు నరం తెగితే ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఉదా.. ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగెడిగూడెంకు చెందిన వ్యక్తి పందెం కోడిని పట్టుకునే ప్రయత్నంలో కత్తి తొడకు తగిలి నరం తెగి ఆసుపత్రికి వెళ్లేలోగా చనిపోయాడంటే అది ఎంత ప్రమాదమో అర్ధమవుతుంది. నల్లమందు, కొంగల మందు,పాదరసంతో పదును ఈ కత్తుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బరక కత్తి, రెండు సాన కత్తి. సాన కత్తి పాలిష్ ఎక్కువగా పడితే ఇది బ్లేడ్ కన్నా ఎక్కువ పదునుగా ఉంటుంది. వీటిని అంగుళంన్నర నుంచి రెండున్నర అంగుళాల సైజ్‌లో తయారుచేస్తారు. వీటికి ఉండే పిడి నాలుగు అంగుళాల వరకూ ఉంటుంది. వీటిని పదును పెట్టే సమయంలో నల్లమందు, కొంగల మందుతో పాటు పాదరసం కూడా రాసి ఎండ పెడతారు. ఒక్కోసారి పాదరసంలో ముంచి కూడా సానబెడతారు. అలా పెట్టడంవల్ల మెటల్ విషపూరితమవుతుంది. ఆ కత్తి తగిలితే వెంటనే ప్రాణంపోయే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ కత్తులు ఉపయోగించడం అందరికీ రాదు. కోడి పందాలలో వినియోగించే కత్తులకు పూస పూస్తే పందెంలో దెబ్బతిన్న కోడి వెంటనే మరణిస్తుంది. పూస అనేది ఒక పదార్ధాన్ని అరగదీసి తయారుచేసే పదార్ధం. కత్తికి పదును ఎక్కువగా ఉండటంతో, ఆ ఆయుధంతో ఎవ్వరినైనా పొడిస్తే. చూడటానికి చిన్న గాయంగా కనిపించినా, రోజులు గడిచేకొద్దీ గాయం ప్రభావం శరీరంపై, అవయవాలపై తీవ్రంగా చూపిస్తుంది. కోడిపందేలు లేవుగా కోడి కత్తెందుకు? కోడిపందేలు ఇప్పుడేమీ లేవు, పైగా నువ్వు కోడి పందేలూ ఆడవు. కోడి కత్తి నీకెందుకు అన్న తయారీదారు ప్రశ్నకు... నాకు ప్రత్యేకంగా పని ఉందిలే అని శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పి తీసుకెళ్లాడు. సుమారు నెల కిందట కోడి కత్తి తయారీదారుడు, వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణను స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి పక్కా ప్రణాళికతోనే శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నాళ్ల కిందట శ్రీనివాసరావు సోదరుని కుమార్తె పుట్టినరోజు పండుగ జరిగింది. ఆ సందర్భంగా అయిన వారికి, స్నేహితులకు శ్రీనివాసరావు ధూంధాంగా పార్టీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తుచేశారు. వాస్తవంగా అంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత శ్రీనివాసరావుకు లేదని చెపుతున్నారు. వైఎస్ జగన్‌పై దాడికి శ్రీనివాసరావును ఎంపిక చేసుకున్నట్లు, భారీగా డబ్బులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ లేఖపై సందేహాలెన్నో!
సాక్షి, విశాఖపట్నం: ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడే వారు తమ చావుకు కారణాలను వివరిస్తూ లేఖ రాసి పెట్టుకుంటారు. ఆ లేఖ ఆధారంగానే అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందో నిర్ధారణకు వస్తారు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు జనుపల్లి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీకి వీరాభిమానిగా చిత్రీకరించేందుకు పోలీసులు ఆడిన ‘లేఖ’ నాటకం విస్మయానికి గురిచేస్తోంది. చేయి తిరిగిన రాతగాడిలా..: లేఖలో మొదటి పేజీ మొదలుకుని చివరి పేజీ వరకు ఒకే దస్తూరి క్రమపద్ధతిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంత చేయి తిరిగిన రాతగాడైనా చివరి పేజీలకొచ్చేసరికి రాత శైలి మారుతుంది. కానీ ఇక్కడ శ్రీనివాసరావు రాసినట్టు పోలీసులు చెబుతున్న లేఖను పరిశీలిస్తే ఎన్నో అనునానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతను చదువుకున్నదేమో పదో తరగతి. కానీ లేఖలోని విషయాలు..భావుకత, సమాజం పట్ల నిర్ధిష్ట అవగాహన చూస్తుంటే నిజంగా అతను రాసిందేనా అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కచ్చితంగా ఈ లేఖ పోలీసులు సృష్టించిందేనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. పైగా ఈ లేఖ చివరి పేజీలో సంబంధం లేకుండా ‘ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మా..నాన్నా’ అంటూ లేఖ ముగించడం చూస్తుంటే కావాలని పథకం ప్రకారమే ఈ లేఖ సృష్టించినట్టుగా స్పష్టమవుతోంది. లేఖ ఆద్యంతం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు: ‘అన్నా ప్రజల హృదయంలో కొలువుండి ప్రజలు దైవంగా భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా అభిమానం’అంటూ ప్రారంభమైన ఆ లేఖలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారంటూ విమర్శలు సాగాయి.అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. చివరి పేజిలో చంటి పేరిట సంతకం చేసి పక్కనే వేరే దస్తూరితో జనుపల్లె శ్రీనివాసరావు చిరునామా రాసి ఉంది. సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో విడుదల చేసిన ఈ లేఖ సర్వత్రా సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఇదిలా ఉండగా డీజీపీ ఠాకూర్ అమరావతిలో ఘటనపై మాట్లాడుతూ దుండగుడు వైఎస్ జగన్‌కు వీరాభిమాని అంటూ ప్రకటించారు. అంతే కాదు.. వైఎస్సార్సీపీ అభిమాని అని తేల్చేందుకు అతని జేబులో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామంటూ చెప్పుకొచ్చిన అనంతరం పోలీసులు లేఖను విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. పోలీసుల హైడ్రామా..: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో దారుణంగా విఫలమైన పోలీసులు.. చివరికి ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ఓ సాధారణ యాధృచ్ఛిక ఘటనగా చిత్రీకరించేందుకు చేస్తున్న యత్నాలు విస్తుగొలుపుతున్నాయి. అత్యంత భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగితే పోలీసులు స్పందించిన తీరు, నిర్లక్ష్య వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. హర్షను విచారించని పోలీసులు! దుండగుడు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని, టీడీపీ నేత హర్షను పోలీసులు కనీసంగా ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యూజన్ ఫుడ్స్ బ్రాంచిని సొంతంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. -
కత్తి కట్టి దాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనిపెల్ల శ్రీనివాసరావు వెనుక ఉండి ఆడిస్తున్నదెవరు? దాడికి చాలా నెలల క్రితమే వ్యూహం రచించారా? పథకం ప్రకారమే ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత నిర్వహిస్తున్న రెస్టారెంట్లో నిందితుడు పనికి చేరాడా? జగన్‌తో అతడు ఉన్నట్లుగా చూపించే ఫ్లెక్సీలను ఆగమేఘాలపై సృష్టించిందెవరు? పందెంకోళ్లకు కత్తులు కట్టడంలో నేర్పరులైన నిందితుడు శ్రీనివాసరావు కుటుంబానికి టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం ఏమిటి? గురువారం మధ్యాహ్నం జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడి స్వగ్రామంలో టీడీపీ నేతలు వాలిపోవటమే వారి మధ్య సన్నిహిత సంబంధాలను రుజువు చేస్తోంది. టీడీపీ సానుభూతి పరుడే: నిందితుడు శ్రీనివాసరావు జగన్ అభిమాని అంటూ ఎల్లో మీడియా, పచ్చనేతలు ఓ పథకం ప్రకారం సాగిస్తున్న ప్రచారంతో స్థానికులు విస్తుపోతున్నారు. ఓ వ్యక్తి ఫొటోను జగన్ చిత్రంతో జోడించి ఫ్లెక్సీ రూపొందించి కట్టుకథలు అల్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనిపెల్ల శ్రీనివాసరావు టీడీపీ అభిమాని కాబట్టే ఇల్లు వేగంగా మంజూరు అయిందని అంటున్నారు. అతడు ఏ పార్టీ సానుభూతిపరుడో ఇదే తెలియజేస్తోందని పేర్కొంటున్నారు. పైగా ఇల్లు మంజూరయ్యాక రూ.8 లక్షలు ఖర్చు చేసి ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేశాడంటే అదంతా ఎవరు సాయం చేసి ఉంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారంటే అతడి వెనుక ‘పచ్చ’నేతల మద్దతు ఏ మేరకు ఉందో ఇట్టే తెలిసిపోతోందని చెబుతున్నారు. ఠాణేలంకలో పచ్చ నేతలకు ఏం పని? జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొద్దిసేపటికే శ్రీనివాసరావు స్వగ్రామం ఠాణేలంకలో స్థానిక టీడీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు నడింపల్లి శ్రీనివాసరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరావులు అక్కడికి చేరుకుని నిందితుడి కుటుంబ సభ్యులతో అతడిని వైఎస్సార్ సీపీ అభిమానిగా చెప్పించేందుకు నానాపాట్లూ పడ్డారు. వారితో ప్రకటనలు ఇప్పించారు. ఇక ముమ్మిడివరం మండల పరిషత్ అధ్యక్షుడు పితాని సత్యనారాయణరావు నిందితుడి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. శ్రీనివాసరావు తండ్రి తాతారావు కుటుంబీకులకు చెందిన భూములను సత్యనారాయణ కౌలుకు తీసుకున్నారు. ఆ కుటుంబానికి పలువురు టీడీపీ నేతలతో అనుబంధం ఉంది. ఏ సంబంధమూ లేకపోతే టీడీపీ నేతలు అంత హడావుడిగా నిందితుడి ఇంటికి ఎందుకు వెళ్లారు? వారిని పరామర్శించేందుకా? అండగా ఉంటామనే భరోసా ఇచ్చేందుకా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఎలా?: కేవలం ఇంటర్, ఐటీఐ చదివిన నిందితుడికి ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్లో నేరుగా ఉద్యోగం ఇవ్వడమూ సందేహాలకు తావిస్తోంది. శ్రీనివాసరావు జగన్ అభిమాని అని చెబుతున్న రెస్టారెంట్ యజమాని.. ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తిని రెస్టారెంట్లో ఎలా నియమిస్తారన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలా చెప్పడం వెనుక పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తుండడంతో తమ బండారం బయటపడుతుందన్న భయంతో విపక్షంపై దుష్ప్రచారం ప్రారంభించారు. విపక్ష నేతపై దాడి చేసేందుకు దీర్ఘకాలంగా పథకం రచించి సమయం కోసం నిరీక్షిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 6 సెల్ఫోన్లు, 9 సిమ్‌లు మార్చిన నిందితుడు ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నానికి తొమ్మిది నెలల క్రితమే కుట్ర మొదలైంది. నిందితుడు ఎనిమిది నెలల క్రితం విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో వెయిటర్‌గా చేరాడు. అందులో ఉద్యోగిగా చేరితే దాడి చేసేందుకు ఇబ్బంది ఉండదనే ఎయిర్‌పోర్టును ఎంచుకున్నాడు. జగన్ రాకపోకలను గమనిస్తూ దాడికి సిద్ధమయ్యాడు. నిందితుడు శ్రీనివాసరావు గత తొమ్మిది నెలల్లో ఆరు సెల్ఫోన్లు, తొమ్మిది సిమ్‌కార్డులను మార్చాడు. ఈ వ్యవధిలో శ్రీనివాసరావు ఏకంగా పది వేల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కేసును పర్యవేక్షిస్తున్న విశాఖ ఏడీసీపీ మహేంద్రపాత్రుడే స్వయంగా వెల్లడించారు. తన సోదరుడు కొన్నాళ్లుగా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడడం లేదని, బేసిక్ ఫోన్లే వాడుతున్నట్టు శ్రీనివాసరావు అన్న మీడియాకు తెలిపాడు. -
‘సాక్షి’.. నా ప్రాణం నిలిపింది
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాలుగు నెలలుగా విధుల్లోకి తీసుకోకుండా.. జీతం ఇవ్వకుండా వేధింపులకు గురవుతున్న ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్(ఈసీ) సీహెచ్ శ్రీనివాసరావుకు విజయనగరం అధికారులు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీనివాసరావు ‘సాక్షి’ని ఆశ్రయించారు. దీంతో ‘చావే శరణ్యం’ శీర్షికతో ఈ నెల 15న సాక్షి ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. వెంటనే దిగివచ్చిన అధికారులు, నాలుగు నెలల కిందట శ్రీనివాసరావుకు ఎక్కడైతే పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారో.. అదే కొత్తవలస మండలంలో తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్వామా పీడీ కోరాడ రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే శ్రీనివాసరావు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో అప్పుల పాలై, కుటుంబం గడవడమే కష్టమైన తరుణంలో ‘సాక్షి’ ఆదుకుందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకున్న తనకు ‘సాక్షి’ ప్రాణం పోసిందని కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగం తిరిగి రావడానికి కారణమైన సాక్షికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. -
ఏం కష్టం వచ్చిందో?
ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందోగాని ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. బతకడం కంటే చావే శరణ్యమని భావించింది. ఆ దంపతులు.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘోరానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వారి నుంచి వచ్చిన ఒతిళ్లు, పెరిగిన బ్యాంకు రుణం వడ్డీ, స్థలం విషయంలో గ్రామ పెద్దలు అన్యాయం చేశారని వినిపిస్తున్న కారణాలను పక్కన పెడితే...నాలుగు ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయూయి. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలు సాక్ష్యం కాగా... మృతులది శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ కావడం తో ఆ గ్రామంలో విషాదం అలముకుంది. గంగిట్ల శ్రీనివాసరావు(36), అతని భార్య సరోజని(32), ఇద్దరు ఆడపిల్లలు జగదీశ్వరి(12), ఉమామహేశ్వరి(10)లు రైలు పట్టాలపై ముక్కలై కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది. * రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య * మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు * ఆర్థిక ఇబ్బందులే ఈ ఘోరానికి కారణమనే అనుమానం * గ్రామ పెద్దల నిర్ణయంతో కుమిలిపోయిన ఇంటి పెద్ద! * విషాదంలో కరజాడ గ్రామం ఆమదాలవలస/శ్రీకాకుళం సిటీ/శ్రీకాకుళం రూరల్: కరజాడ గ్రామానికి చెందిన గంగిట్ల శ్రీనివాసరావుకు భార్య సరోజని, ఇద్దరు ఆడపిల్లలు జగదీశ్వరి, ఉమామహేశ్వరి అంటే ఎంతో ఇష్టం. ఎన్ని కష్టాలు ఉన్నా సంతోషంగానే ఉండేవారు. శ్రీనివాసరావు, సరోజనీలకు వ్యవసాయపనులే జీవనాధారం. పనులకు వెళ్లగా వచ్చే కూలి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. పిల్లలు జగదీశ్వరిని ఆమదాలవలసలోని కేజీబీవీ విద్యాలయంలో ఆరో తరగతి, ఉమామహేశ్వరిని కరజాడ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదివిస్తున్నారు. శ్రీనివాసరావుకు చెల్లి కృష్ణవేణి చెల్లి, తమ్ముడు చిన్నబాబు ఉన్నారు. కృష్ణవేణికి వివాహమై హైదరాబాదులో ఉంటుండగా, తమ్ముడు చిన్నబాబు శ్రీనివాసరావు ఇంటిపక్కనే ఉంటున్నారు. చిన్న కుమార్తె ఉమామహేశ్వరిని రోజూ ఇంటి సమీపంలో ఉన్న పాఠశాలకు శ్రీనివాసరావే తీసుకెళ్లి తీసుకువస్తాడని స్థానికులు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే కరజాడలో శ్రీనివాసరావు, బమ్మిడి అటకేశం ఇళ్లకు సమీపంలో మూడు సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం తమదంటే.. తమదని వీరిద్దరూ తగాదాలు పడేవారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇద్దరూ శ్రీకాకుళం రూరల్ పోలీసులను ఈ ఏడాది మే 29వ తేదీన ఆశ్రయించారు. అయితే ఈ సమస్యను పోలీసులు పరిష్కరించలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు. అరుుతే స్థలం విషయంలో తన కుటుంబానికి అన్యాయం జరిగిందని శ్రీనివాసరావు మదన పడేవారని స్థానికులు కొంతమంది చెబుతన్నారు. దీనికి తోడు వ్యవసాయ అవసరాలకు స్థానికంగా ఉన్న బ్యాంకులో 19.9 గ్రాముల బంగారు ఆభరణాలను కుదవ పెట్టి 29 వేల రూపాయలను 2015 మార్చి 23వ తే దీన రుణంగా తీసుకున్నాడు. అది ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.37 వేలకు చేరింది. బంగారం తాకట్టుపెట్టి ఏడాది దాటడంతో బ్యాంకు అధికారులు వాటిని విడిపించుకోవాలని శ్రీనివాసరావుపై ఒత్తిడి పెంచారు. అలాగే ప్రైవేటు వ్యక్తుల వద్ద కూడా లక్ష రూపాయల వరకూ అప్పుగా తీసుకోవడం, తిరిగి ఇవ్వాలని వారిని నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యూడు. ఈ క్రమంలో గార మండలం కోళ్లపేటలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నామని చెప్పి శ్రీనివాసరావు, భార్య, పిల్లలు ద్విచక్ర వాహనంపై ఆమదాలవలస చేరుకున్నాడు. అక్కడ తాండ్రంకి మెట్ట వద్ద రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలిచారు. నన్ను చంపేశారు సంఘటనా స్థలంలో మృతుడు శ్రీనివాసరావు జేబులో సూసైడ్ నోటు, ఖాళీ ప్రాంసరి పత్రాలు దొరికినట్టు జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు తెలిపారు. సూసైడ్ నోట్లో నన్ను చంపేశారు అని రాసి ఉండడంతో పాటు... కొంతమంది పేర్లు రాసి ఉన్నట్టు పేర్కొన్నారు. సూసైడ్ నోట్ ప్రకారం అప్పులు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
నాడు తండ్రులు.. నేడు పిల్లలు
బంజారాహిల్స్‌లో రసవత్తర పోరు బంజారాహిల్స్: రాజకీయాలు వారసత్వంగా పిల్లలకు రావడం పరిపాటి. అయితే, బంజారాహిల్స్ డివిజన్లో ఈ వారసత్వం రసవత్తర పోటీకి నాంది పలికింది. ఒకప్పుడు తండ్రులు ప్రత్యర్థులుగా పోటీ పడగా.. ఇప్పుడు వారి పిల్లలు ఆ పోటీని కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ బరిలో ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంపీ కె. కేశవరావు(కేకే) కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేచినేని కిషన్‌రావు కొడుకు శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఇప్పుడు తమ పిల్లల గెలుపు కోసం ఇరువురి తండ్రులు కృషి చేస్తున్నారు. ప్రణాళికతో ఈ ఇద్దరూ కార్యకర్తలు, తమ పరిచయస్తులతో మమేకమవుతూ ఎన్నికల గెలుపు కోసం పథకాలు రూపొందిస్తున్నారు. విజయలక్ష్మి తండ్రి కేకే మాజీ జర్నలిస్టు. శ్రీనివాస్‌రావు తండ్రి మేచినేని కిషన్‌రావు కూడా మాజీ జర్నలిస్టే. పూర్వాశ్రమంలో ఈ ఇద్దరూ ప్రత్యేకంగా పత్రికలు నడిపారు. మేచినేని కిషన్‌రావు ‘సమయం’ పత్రికను నిడిపితే.. కేకే ‘డైలీ న్యూస్’ పత్రికను నడిపారు. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులుగా విజయలక్ష్మి, శ్రీనివాసరావు పోటీ పడుతుంటే.. గతంలో కేశవరావు, కిషన్‌రావు ఇద్దరూ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేకేపై కిషన్‌రావు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఈ ఇద్దరూ మాజీ మంత్రులు కూడా కావడం విశేషం. కేకే కార్మికశాఖ మంత్రిగా పనిచేస్తే.. కిషన్‌రావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మరో విషయం ఏంటంటే హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేకే, కిషన్‌రావు ఇద్దరూ తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రావుపై కేకే గెలుపొందారు. ఇలా ఈ ఇద్దరూ చాలా విషయాల్లో తలపడినవారే. కేకే, కిషన్‌రావు కూతురు, కొడుకు పోటీ చేస్తున్న డివిజన్లో ఈ ఆసక్తికర పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కేకే, కిషన్‌రావులు నివసించేది బంజారాహిల్స్ రోడ్ నెం.12లోనే కావడం ఒక విశేషమైతే, ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నా ఆప్యాయంగా పలకరించుకుంటారు. రాజకీయాల్లో తలపండిన ఈ ఇద్దరు నేతలు తమ పిల్లల గెలుపు కోసం వేస్తున్న ఎత్తుల్లో ఎవరు విజేతగా నిలుస్తారో అని డివిజన్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య
కురిచేడు: అప్పుల బాధతో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన బొల్లేపల్లి శ్రీనివాసరావుకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత కొన్నేళ్లుగా సాగులో సరైన దిగుబడి లేకపోవడంతో చేసిన అప్పులు రూ.6 లక్షలకు పెరిగాయి. దీంతో అవి తీర్చడం కష్టం అవడంతో మనస్థాపం చెందిన శ్రీనివాసరావు గురువారం అర్ధరాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. -
జమ్మూ కశ్మీర్ లో తెలుగు జవాన్ మృతి!
శ్రీకాకుళం: జమ్మూ కశ్మీర్ లో ఓ తెలుగు సైనికుడు విధుల్లో ఉండగా మృతి చెందాడు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన శ్రీనివాసరావు(20), జమ్మూ- కశ్మీర్ సరిహద్దులో సైనికుడిగా సేవలు అందిస్తున్నాడు. అయితే శ్రీనివాసరావు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు అతని తల్లిదండ్రులకు ఈరోజు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ డీసీటీవోకు లంచాల దాహం
జ్యూయలరీ షాపు యజమాని నుంచి లంచం డిమాండ్ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి, ఇంట్లో సోదాలు ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు విశాఖపట్నం : ఏసీబీ వలలో మరో బడా అధికారి చిక్కాడు. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. జ్యూయలరీ షాప్ యజమాని శ్రీనివాసరావు నుంచి రూ.లక్షా 50 వేల లంచం తీసుకుంటుండగా ఉప వాణిజ్య పన్నుల అధికారి కమలారావును సోమవారం ఉద యం పట్టుకున్నారు. లంచం కేసే కాకుండా కమలారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతనికి ఐవోబీలో రెండు లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. లాకర్లు తెరిస్తేనే అతడి ఆస్తులు విలువ తేలుతుందని అధికారులు భావిస్తున్నారు. వాటిని తెరవడానికి సిద్ధమవుతున్నారు. నాలుగు రోజుల కిందటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన డి ప్యూటీ తహశీల్దారు ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.పది కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేశారు. రూ.లక్షా 50 వేల డిమాండ్: వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్-2 పరిధి వన్‌టౌన్‌లో శ్రీనివాస్ జ్యూయలరీ షాప్‌ను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ సర్కిల్ కార్యాలయం ఉప వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తున్న పి.కమలారావు ఫిబ్రవరిలో శ్రీనివాస జ్యూయలరీ షాప్‌పై దాడులు చేశారు. అప్పటి నుంచి ఎసెస్మెంట్స్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. అవి ఇవ్వాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని జ్యూయలరీ షాప్ యజమాని తెలపగా రూ.లక్షా 50 వేలు ఇవ్వడానికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. ఈ మొత్తం సోమవారం ఉదయం అప్పుఘర్ కైలాసగిరి రోప్‌వే వద్ద ఉన్న తన నివాసానికి తీసుకురావాలని శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు నగదు తీసుకుని కమలారావు ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కమలారావును పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి అతడి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. స్థలాలు, నగదు, బంగారంతోపాటు బ్యాంక్ లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. కమలారావుపై ఆరోపణలు: సహ వాణిజ్య పన్నుల అధికారిగా ఉన్నప్పటి నుంచి కమలారావుపై ఆరోపణలున్నాయి. షెక్పాయింట్ వద్ద విధులు నిర్వహించినప్పుడు లారీల యజమానుల వద్ద లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. లారీలు నిలిపి సోదాలు చేసిన విషయంలో ఓ పంజాబ్ లారీ డ్రైవర్ కమలారావును కొట్టి రూమ్‌లో బంధించడం అప్పట్లో రాద్దాంతమైంది. సిరిపురం డివిజన్ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహించినప్పుడు మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
లారీ రేషన్ బియ్యం పట్టివేత
మంగళగిరి : మండలంలోని కాజ టోల్గేట్ వద్ద లారీలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.సేకరించిన వివరాల మేరకు గుంటూరులో వారెంట్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న బి.హరిబాబు,శ్రీనివాసరావు వారెంట్ పనిపై గురువారం ఉదయం తాడేపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మండలంలోని కాజ టోల్గేట్ దాటిన అనంతరం ఒక లోడు లారీ ఆపి ఉండడం గమనించారు. అక్కడ లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. కానిస్టేబుళ్లు తమ వాహనాన్ని ఆపి ఏమిటి అని ప్రశ్నించగా వారు అక్కడ నుంచి పారిపోయారు. కానిస్టేబుళ్లు లారీలో ఉన్న సరుకును గమనించగా, అవి రేషన్ బియ్యం కావడంతో మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బియ్యం లారీని విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. వారు ఆ లారీని పౌర సరఫరాల శాఖ గోడౌన్‌కు తరలించారు. పారిపోయారా...తప్పించారా... లారీతో పాటు దొరికిన డ్రైవర్, మరో ఇద్దరు పారిపోయారా..లేక అధికారపార్టీ నేతల ఒత్తిడితో తప్పించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లారీని పట్టుకున్న కానిస్టేబుల్ మాట్లాడుతూ లారీ ఒంగోలుకు చెందిన యడ్ల మస్తాన్రావుదని, రేషన్ బియ్యాన్ని యర్రంశెట్టి కిషోర్,యర్రంశెట్టి సాంబశివరావు,పులగం సాంబశివరావు కలిసి గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని పొలాల్లో లోడ్ చేశారని, లోడును తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తరలిస్తున్నారని తెలిపారు. లారీని పట్టుకున్నప్పుడు లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు పారిపోతే పట్టుకున్న పోలీసులకు ఈ వివరాలన్నీ ఎలా తెలిశాయో అంతుచిక్కడం లేదు. వివరాలన్నీ సేకరించిన పోలీసులు ఉన్నతాధికారులకు తెలపగా, ఇంతలో బియ్యం స్మగ్లర్లు అధికార పార్టీ నేతల ద్వారా తీవ్ర ఒత్తిడి తెచ్చి డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తత్ఫలితంగా అసలు నేరస్తులు బయటకు రాకుండా తప్పించుకోవడానికి దోహదం చేసినట్టయిందని అంటున్నారు. ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమగ్రంగా విచారించి అసలైన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేరు. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
ముప్పాళ్ళ : రైతుకోరిన అడంగల్‌కాపీ ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన వీఆర్వో తోట శ్రీనివాసరావు ఇరుకుపాలెం గ్రామానికి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. ఇరుకుపాలెం శివారు రామకృష్ణాపురానికి చెందిన చెరుకూరి నరసింహారావు విజయవాడలో నివసిస్తున్నాడు. రామకృష్ణాపురంలో తనకున్న 5.5 ఎకరాలకు సంబంధించి అడంగల్ కాపీ కోసం ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోగా వీఆర్వో కాలయాపన చేసి చివరకు రూ. 10 వేలు అందిస్తే అడంగల్ ఇస్తానని తెలిపారు. మొత్తమ్మీద మధ్యవర్తుల ద్వారా రూ. తొమ్మిదివేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే నరసింహారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని వివరించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు పథకం ప్రకారం తొమ్మిది రూ. 1000 ల నోట్లు గురువారం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్వోకు అందించగా, మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రాజారావువు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసే అధికారుల సమాచారం తమకు అందిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. తన ఫోన్ నంబర్(9491305638)కు డయల్ చేయాలని కోరారు. విసిగెత్తిపోయా: నరసింహారావు తన సొంత పొలానికి సంబంధించి అడంగల్ కాపీ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశానని రైతు నరసింహారావు తెలిపారు. విజయవాడ నుంచి 20 సార్లు ముప్పాళ్ళ వచ్చాననీ, వీఆర్వో తిప్పుకుంటున్నారే తప్ప పనిచేయలేదని తెలిపారు. చివరకు రూ. 10 వేలు డిమాండ్ చేస్తే రూ. 9 వేలు చెల్లిస్తానని ఒప్పంద ం చేసుకొని ఏసీబీని ఆశ్రయించినట్టు ఆయన పేర్కొన్నారు. -
జగన్‌ను విమర్శించే స్థాయి యరపతినేనికి లేదు
దాచేపల్లి: గురజాల నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలకు, అక్రమాలకు, దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్తతలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని యరపతినేని భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి నియోజకవర్గంలో నిరంకుశ పాలనకు తెరలేపి, లీజులో ఉన్న మైనింగ్ భూములతో పాటు ప్రభుత్వానికి చెందిన భూముల్లోనూ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, నెలకు కోట్లాదిరూపాయలను అక్రమంగా ఆర్జించి, సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శించారు. పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో ఉన్న క్వారీల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎమ్మెల్యే తన సొంత మనుషులతో క్వారీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ట్రాక్టర్‌కు రూ.400 వరకు వసూలు చేస్తూ అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచారని మండిపడ్డారు. ముగ్గుమిల్లు వ్యాపారులను బెదిరించి లక్షలాది రూపాయలు తీసుకున్నారన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇన్ని అక్రమాలకు పాల్పడుతూ చిన్నవయసులోనే రాష్ట్రంలోని కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి యరపతినేనికి లేదని పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్స్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే వ్యక్తిగత స్వార్ధం కోసమే రాజకీయం చేస్తున్నారని అంబుజా, సంఘీసిమెంట్స్ గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కమిటీసభ్యుడు పేరుపోగు రాజశేఖర్, బీసీసెల్ రాష్ర్టకమిటీసభ్యుడు కుందుర్తి గురవాచారి తదితరులున్నారు. -
విద్యకు పెద్ద పీట
వెంకటాచలం : తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం విక్రమ సింహపూరి యూనివర్సిటీకి సంబంధించి రూ.12కోట్లతో నిర్మించనున్న అకడమిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారని వివరించారు. యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని సముద్ర తీరం పారిశ్రామిక కారిడార్ కానుందన్నారు. కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, అందుకు అవసరమైన రీసెర్చ్‌లు చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ యూనివర్సిటీకి మహాకవి తిక్కన పేరు పెట్టాలని అప్పటి ప్రభుత్వంతో పోరాడినట్లు తెలిపారు. మన ప్రాంత మహాకవిని మనం గుర్తించుకోవాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైతికత, విద్యా ప్రమాణాలు ఉండే బోధనను యూనివర్సిటీ అందించాలన్నారు. కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వీఎస్ యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా రూపాంతరం చెందాలని ఆకాం క్షించారు. ప్రపంచ పరిశోధన పత్రాలను ప్రచురితమయ్యేలా చూస్తే యూనివర్సిటీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు. అవసరాలు గుర్తించి ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి: కాకాణి యూనివర్సిటీ రూపాంతరానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీకి జాతీయ రహదారి నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చిన స్థలం చాలా వరకు ఉపయోగ పడదని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరింత భూమిని సేకరించుకోవాలని సూచించారు. సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్, ఆక్వా కల్చర్‌కు అనుబంధమైన కోర్సులు పెట్టాలన్నారు. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, ఇతర అనుబంధ పరిశ్రమలు రానున్నాయని, భవిష్యత్ అవసరాలు గుర్తించి కోర్సులు, రీసెర్చ్‌లు జరగాలన్నారు. జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, పొంగూరు నారాయణ వంటి వివాద రహితులు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరేవారు మంత్రులుగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ ఉపకులపతి గొట్టిప్రోలు రాజారాంరెడ్డి, రిజిస్ట్రార్ కోటా నాగేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, బీద మస్తాన్‌రావు, ఎం.శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, ఎంపీటీసీ సభ్యుడు బాణాల వెంకమ్మ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి పాల్గొన్నారు. ప్రతి బిడ్డ ముత్యంలా ఎదగాలి కోవూరు: ప్రతి బిడ్డ ఒక ముత్యంలా ఎదగాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కోవూరులో శనివారం ‘బడిపిలుస్తోంది’ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు నెల్లూరు జిల్లా పుట్టినిల్లు అన్నారు. ఈ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకురావాల్సిన అసరం ఉందన్నారు. రాష్ట్రంలో 19 శాతం డ్రాపవుట్స్ ఉండగా కేవలం నెల్లూరు జిల్లాలో 23 శాతం ఉన్నారన్నారు. డ్రాపవుట్స్‌లో నెల్లూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుట్టగానే మేధావి కాదన్నారు. బాల్యం నుంచి పట్టుదల, క్రమశిక్షణతో ముందుకుపోతేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు క్రమశిక్షణతో చదువుకుంటే ఆ తర్వాత విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టమేమీ కాదన్నారు. ఓ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు బోధిస్తున్నామన్నారు. గతంలో 23 మంది ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5 లోపు 150 మంది విద్యార్థులున్నారు. అదేవిధంగా కోవూరులో ఒక పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి, ఆర్జేడీ పార్వతి, అడిషనల్ జేసీ రాజ్‌కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, డీఈఓ ఉష, సర్వశిక్ష అభియాన్ పీఓ కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లురెడ్డి, తహశీల్దార్ నరసింహులు, ఎంఈఓ చెంచురెడ్డి, ఎంపీడీఓ నాగరాజకుమారి, ఎంపీపీ గిద్దలూరు ఉమ, సర్పంచ్ కూట్ల ఉమ పాల్గొన్నారు. -
గుంటూరులో రౌడీషీటర్ హత్య
గుంటూరు రూరల్: రౌడీషీటర్ దారుణహత్యకు గురైన సంఘటన గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోట శ్మశా నం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుతోట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కుంచాల దుర్గాచంద్రరావు(32) మూడునెలలుగా చెన్నైలో నివాసం ఉంటున్నా డు. నాలుగేళ్ల క్రితం మహిళ అత్యాచారం కేసుకు సంబంధించి ఈ నెల 11వతేదీ కోర్టు వాయిదా ఉన్నందున అంతకుముం దురోజు గుంటూరు వచ్చాడు. గతంలో దుర్గాచంద్రరావు.. తన అత్త బండి లక్ష్మికి కేవీపీ కాలనీలో ఉన్న రెండు నివాస స్థలాలను ఆక్రమించేందుకు యత్నించాడు. ఈక్రమంలో అత్త ను, పెద్దబావమరిది నాగును హతమార్చాలని పథకం పన్నా డు. వరుసకు తమ్ముడైన ఆలకంటి సతీష్‌పైనా దాడిచేశాడు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో దుర్గాచంద్రరావును తుదముట్టిస్తే తమ వారికి హాని ఉండదని చిన్నబావమరిది బండి దుర్గారావు సతీష్‌ను కలుపుకొని హత్యకు పథకం పన్నాడు. ఈనెల 10న దుర్గాచంద్రరావు గుంటూరు వస్తున్నట్లు సమాచారం అందడంతో పథకాన్ని అమలుపర్చారు. శనివారం అర్ధరాత్రి దుర్గాచంద్రరావును సతీష్ నమ్మకంగా చుట్టుగుంట సెంటర్లోని కావేరి బార్‌కు తీసుకువెళ్లి ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం రెండు బీరు బాటిళ్లు కొనుగోలు చేసిన సతీష్.. శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు సమీపంలోని శ్శశానం వద్ద ఉన్న ఓ పాకలోకి దుర్గాచంద్రరావును తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న బండి దుర్గారావు వేటకత్తితో దాడిచేశాడు. సతీష్ కూడా వేట కత్తితీయడంతో ఇద్దరూ దుర్గాచంద్రరావును హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెస్ట్ డీఎస్పీ టీవీ నాగరాజు, నగరంపాలెం సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడికి భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. హతుడిపై పలు కేసులు... హతుడు దుర్గాచంద్రరావుపై పలు కేసులు ఉన్నాయి. గతేడాది జూన్‌లో శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు సమీపంలోని శ్శశానం వద్దే రౌడీషీటర్ మల్లిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు. నగరంపాలెం పోలీసుస్టేషన్లో రౌడీషీటు ఉంది. పలు వివాదాల్లోనూ కేసులు ఉన్నట్లు తెలిసింది. -
శివశివా.. నాగపడగలెట్టా ?
నాలుగు రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు రూ.100 కోట్ల వెండి కరిగింపునకు బ్రేక్ రాహుకేతు పూజలెలా చేయూలి? కొత్త ఈవోకు తొలిరోజే ఇక్కట్లు శ్రీకాళహస్తి: దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంలో నాగపడగల కొరత తీరేలా లేదు. దీంతో ఆలయాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాహుకేతు పూజలకు వినియోగించే నాగపడగలు ఇక నాలుగు రోజులకు (75కేజీలు) సరిపడేంత మాత్రమే ఉన్నాయి. దీంతో అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆదేశాలను ధిక్కరించలేక.. ఇటు నాగపడగలను రాహుకేతు పూజలకు ఎలా అందించాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సుమారు రూ. 100 కోట్ల వెండి నిల్వలు ఉన్నాయి. కాగా వారం రోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న ముక్తేశ్వరరావు ముక్కంటి ఆలయంలోని 16 టన్నుల వెండి నిల్వలను హైదరాబాద్‌లో కరిగించాలని, నాగపడగల అవసరాలు, ఆలయంలో ఉత్సవ వాహనాల మరమ్మతులు, నూతన ఉత్సవ వాహనాల ఏర్పాటుకు పోగా మిగిలిన వెండిని విక్రయించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజుల క్రితం ఈవోగా ఉన్న రామచంద్రారెడ్డి నిల్వ ఉన్న వెండిని హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఆయన బదిలీ అయ్యారు. తిరుపతి ఆర్జేసీగా పని చేస్తున్న శ్రీనివాసరావు ఆదివారం నూతన ఈవో గా బాధ్యతలు చేపట్టారు. కాగా వారం క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యలు చేపట్టిన అనురాధ ఆలయంలోని వెండి నిల్వల్లో ఒక్క కేజీని కూడా కరిగించరాదని, ఆలానే ఉంచాలని శనివారం రాత్రి ఉత్తర్వులు పంపారు. దీంతో రూ.100 కోట్ల వెండి నిల్వలకు బ్రేక్ పడింది. అయితే వెండిని కరిగించి నాగపడగలు తయారు చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఆలయంలోని మింట్‌లో లేవు. హైదరాబాద్‌లో వెండిని కరిగించి ముద్దలు చేసి ఆలయానికి తీసుకు వస్తే స్థానికంగా ఉన్న మింట్‌లో నాగపడగలు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండి కాకపోయినా కనీసం నాగపడగలకు అవసరమైన వెండినైనా హైదరాబాద్‌లో కరిగించడానికి దేవాదాయశాఖ అనుమతి ఇస్తే నాగపడగల కొరత తీరుతుంది. అయితే ఒక్క కేజీ కూడా కరిగించరాదని ఆదేశాలు ఇవ్వడంతో రాహుకేతు పూజలకు నాగపడగల ఇక్కట్లు తప్పేలా లేవు. నాగపడగలకు సమయం ఇలా.. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఆలయాధికారులు 2500 కేజీల వెండిని హైదరాబాద్‌లోని మింట్‌లో కరిగిస్తారు. అక్కడి నుంచి వెండి ముద్దలను ఆలయానికి తీసుకువస్తే ఇక్కడ నాగపడగలు తయారు చేస్తారు. హైదరాబాద్‌లోని మింట్‌లో రోజుకు 700 నుంచి 800 కేజీల వెండిని మాత్రమే కరిగించడానికి అవకాశం ఉంది. ఈ లెక్కన 2500 కే జీల కరిగింపునకు మూడు రోజుల సమయం పడుతుంది. ఇక ఆ వెండి ముద్దలను నాగపడగలుగా చేయడానికి ఆలయంలోని మింట్‌లో మరో మూడు రోజులు పడుతుంది. అలాగే హైదరాబాద్‌కు తీసుకు పోవడానికి ఒక్కరోజు, కరిగించిన ముద్దలను శ్రీకాళహస్తికి తీసుకురావడానికి మరో రోజు సమయం పడుతుంది. మొత్తం మీద ఎనిమిది రోజుల సమయం కావాల్సి ఉంది. అయితే ఆలయంలో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే నాగపడగలు ఉన్నాయి. దీంతో నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ఆదివారం నాగపడగలకు అవసరమైన వెండి కరిగింపునకు అనుమతి ఇవ్వాలని పదేపదే దేవాదాయశాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆలయ ఈవోలను కాపాడడం కోసమేనా? ఆలయంలోని వెండిని కరిగించరాదనే ఆదేశాలు గతంలో ఈవోలను కాపాడడం కోసమేనా? అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఆలయంలో పదేళ్లుగా రూ.100 కోట్ల వెండి నిల్వలు ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన పలువురు ఈవోలు నిల్వ ఉన్న వెండిని కరిగించి నాగపడగలు చేయకుండా చెన్నైలో నాగపడగలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. వెండి కొనుగోలుపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నాగపడగల తయారీలో వెండిశాతం 90 నుంచి 95 శాతం ఉంటేనే వినియోగించాల్సి ఉంది. ప్రస్తుతం మింట్‌లో తయారు చేస్తున్న నాగపడగల్లోనూ అదే నియమాలు (90-95 శాతం వెండి) పాటిస్తున్నారు. అయితే చెన్నైలో భారీ మొత్తంలో అప్పట్లో పలువురు ఈవోలు కొనుగోలు చేసిన వెండిలో 60 నుంచి 65శాతం మాత్రమే వెండి ఉండేలా కోనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని ఈవోలు నోక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండిని కరిగిస్తే సంవత్సరాల వారీగా ఈవోలు కొనుగోలు చేసిన నాగపడగల్లో వెండి శాతం బయటపడుతుంది. దీంతో ఈవోలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఉద్దేశంతో దేవాదాయ శాఖాధికారులు వెండిని కరిగించకుండా నిలుపుదల చేశారని తెలుస్తోంది. రూ.100 కోట్ల వెండి నిల్వలు కరిగించకుండా విక్రయించి, అవసరమైన నాగపడగలు కొనుగోలు చేస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం దే వాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు మొత్తం వెండిని హైదరాబాద్‌లో కరిగించాలని ఆదేశాలు జారీచేస్తే, ఆయన పదవీ విరమణతో కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనురాధ ఒక్క కేజీ వెండి కూడా కరిగించరాదని ఆదేశాలు పంపడం విమర్శలకు దారితీస్తోంది. కొరత రానివ్వం రాహుకేతు పూజలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాగపడగల కొరత రానివ్వం. పూజలకు అవసరమైన నాగపడగలు 75 కేజీలు ఉన్నాయి. నాలుగైదు రోజులు ఇబ్బంది లేదు. దేవాదాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి నాగపడగల కోసం వెండిని కరిగించడం కోసం అనుమతి తీసుకుం టాం. పూజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసరావు, ఆలయ ఇన్చార్జి ఈవో -
విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నల్లగొండ :పేరుకు పోతున్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని టీజీఎస్పీసీడీసీఎల్ డెరైక్టర్లు రఘుమారెడ్డి, శ్రీనివాస్‌రావు ఆదేశించారు. బుధవారం నల్లగొండలో విద్యుత్ శాఖ వసతి గృహంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో భాగంగా అధికారులు బకాయిల పై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ సదరన్ పవర్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీజీఎస్పీసీడీసీఎల్) పరిధిలోని నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలు రూ. 2,510 కోట్ల మేర ఉన్నాయని, వాటిని వసూలు చేయడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బకాయిల మొత్తంలో నల్లగొండ జిల్లా నుంచే రూ. 500 కోట్లు వసూలు చేయాల్సి ఉందని వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 50 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని, అయితే అంతకు మించి విద్యుత్ వాడుకున్న వారి నుంచి కూడా అధికారులు బిల్లులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పక్క రాష్ట్రాల నుంచి యూనిట్‌కు రూ.13ల చొప్పున కొనుగోలు చేసి ప్రజలకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్నామన్నారు. మంగళవారం పొరుగు రాష్ట్రాల నుంచి 900 యూనిట్లు కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. శాఖాపరంగా రెవెన్యూ లోటు తీవ్రంగా ఉందని ప్రస్తుతం రూ.45 కోట్లకు మించి ఆదాయం రావట్లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వచ్చే నెల నుంచి విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టసాధ్యమవుతుందని డెరైక్టర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల పనిగంటలు పెంచి అ హర్నిశలు శ్రమిస్తే తప్ప విద్యుత్ శాఖ కష్టాల నుంచి బయటపడటం సాధ్యంకాదన్నారు. పనితీరు మార్చుకోవాలి. నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పురావడం లేదని డెరైక్టర్లు విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యం కేసులు పెంచాలని, గాలివానలు, వర్షాలు వస్తున్నందున ఏఈలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఈలు స్థానికంగా నివాసం ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులు ఉన్న చోట చెట్లను తొలగించాలన్నారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో రైతు సంఘం నేత రాంరెడ్డి హాల్లోకి ప్రవేశించి అధికారుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. సబ్ స్టేషన్ల వద్ద సిబ్బంది మద్యం సేవిస్తున్నారని, దీంతో నాణ్యమైన విద్యుత్ అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకుంటాం.. ఇటీవల తొలగించిన 16 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకుంటామని డెరైక్టర్లు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే కాంట్రాక్టు ఏజెన్సీలు అభ్యర్థుల నుంచి లక్షలు వసూలు చేసి ఉద్యోగాల్లో నియమించినట్లు డెరైక్టర్లకు ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ఏజెన్సీలు నమ్మబలికాయని తెలిపారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు లేకుండా విద్యుత్ సేవలు అందించడం కుదరదు కాబట్టి ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని డెరైక్టర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ బాలస్వామి, విజిలెన్స్ ఎస్ఐ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సారేసూత్రధారి
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: సంచలనం రేకెత్తించిన మహిళపై యాసిడ్ దాడి కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఆమె జీవనశైలే దాడికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాసిడ్ దాడిని సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండిం చింది. అయితే కేసు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుజూశాయి. వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన మూడో నగర పోలీసులు చివరకు దాడికి సూత్రధారైన నెల్లూరులోని ఎస్వీఆర్ స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సిటీ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. వరికుంటపాడు మండలానికి చెందిన చీమలదిన్నె లక్ష్మీచెన్నమ్మకు నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన నాగేంద్రబాబుతో పదేళ్ల కిందట వివాహమైంది. మూడేళ్ల కిందట శ్రీనివాసనగర్‌లోని ఎస్వీఆర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఆమె ఆయాగా, నాగేంద్ర బస్సు క్లీనర్‌గా పనికి చేరారు. ఈ క్రమంలో స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసరావుతో లక్ష్మీచెన్నమ్మ సన్నిహితంగా మెలిగేది. మరోవైపు అదే సమయంలో తమ ఇంటి వద్ద ఉన్న పెయింటర్ విజయకుమార్‌తోనూ చనువుగా ఉండేది. ఈ విషయం విజయకుమార్ ఇంట్లో పెద్దదుమారం రేపడంతో ఆమె అక్కడ నుంచి నివాసాన్ని మరో ప్రాంతానికి మార్చేసింది. ఆరు నెలల కిందట భర్త అనారోగ్యంతో చనిపోవడంతో కిసాన్‌నగర్‌లోని తల్లిదండ్రుల వద్దకు చేరింది. అనంతరం ట్రంకురోడ్డులోని ఓ వస్త్రదుకాణంలో చేరి, కొద్ది రోజుల్లోనే యాసిడ్ దాడికి గురైంది. అంద విహీనం చేయాలని ప్లాన్ లక్ష్మీచెన్నమ్మను తాను బాగా చూసుకుంటున్నా.. ఇతరులతో సన్నిహితంగా మెలుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఎస్వీఆర్ స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసరావు భావించాడు. ఆమెను ఎలాగైనా దెబ్బకొట్టాలని ఆలోచించసాగాడు. ఈ క్రమంలోనే స్కూలుకు రంగులు వేయాలని పెయింటర్ విజయకుమార్‌కు కబురుపంపాడు. ఆయన తన పెద్దకుమారుడు జీవన్‌తో పాటు చిన్నకుమారుడి(మైనర్)ని పెయింట్ వేసేందుకు పంపాడు. వీళ్లిద్దరూ గతంలో ఇదే స్కూలు విద్యార్థులు. పెయింట్ వేసేందుకు వచ్చిన జీవన్‌తో లక్ష్మీచెన్నమ్మ వ్యవహారాన్ని శ్రీనివాసరావు చర్చించాడు. వారిని మాటలతో రెచ్చగొట్టాడు. గతంలో తమ కుటుంబంలో గొడవలకు కారణమైన లక్ష్మీచెన్నమ్మపై అప్పటికే కోపంతో ఉన్న జీవన్‌లో ఆయన మాటలు పగను పెంచాయి. వీరి బలహీనతను అసరాగా చేసుకున్న శ్రీనివాసరావు యాసిడ్ దాడికి పథక రచన చేశారు. అందంతో ఉన్నాననే భావనతోనే ఆమె అలా వ్యవహరిస్తోందని యాసిడ్ పోసి అందవిహీనం చేయాలని ప్లాన్ వేశారు. మే 27వ తేదీ రాత్రి షాపు నుంచి వస్తున్న లక్ష్మీచెన్నమ్మను జీవన్ తన సోదరుడితో కలిసి బైక్‌పై వెంబడించారు. అనంతరం ఆటోస్టాండ్ వద్దకు చేరుకుంటుండగా ఆమెపై యాసిడ్ దాడిచేసి పరారయ్యారు. చిక్కుముడి వీడిందిలా... వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం అంతుచిక్కక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న.. ఆమెతో విబేధించిన వ్యక్తులను విచారించారు. ఈక్రమంలోనే అందె శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా మొదట తనకేమి తెలియదని బుకాయించాడు. చివరకు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో శ్రీనివాసరావు, జీవన్‌తో పాటు బాలుడిని అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందన కేసును త్వరితగతిన ఛేదించిన మూడోనగర ఇన్స్పెక్టర్ కె.వి రత్నం, హెడ్‌కానిస్టేబుళ్లు జి. ప్రభాకర్‌రావు, బి.వి నరసయ్య, ఈ. రాంబాబు, కానిస్టేబుళ్లు ఎం. రమేష్‌బాబు, ఈ. వేణుగోపాల్, పి. ప్రతాప్, అజయ్‌ను ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, సిటీ డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రసాభాస
నకిరేకల్, న్యూస్‌లైన్: నకిరేకల్‌ను నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ రసాభాసగా మారింది. సభకు డీఎల్పీఓ యాదయ్య, ఎంపీడీఓ కత్తుల సత్తెమ్మ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఈఓఆర్డీ కమలాకర్‌రావు, పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శి చంద్రశేఖర్‌లు హాజ రయ్యారు. నకిరేకల్‌ను గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేశారు. అయితే, స్థానిక పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మరికొంతమంది నాయకులు నగర పంచాయతీగా కొనసాగించాలని పట్టుబట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గామ పంచాయతీ కావాలంటున్న ప్రజలంతా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవద్దని మరోవర్గం నినాదాల చేయడంతో ఆ రెండువర్గాల మధ్య ఘర్షణ జరి గింది. ఈ సంఘటనలో పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు గాయపడ్డారు. నకిరేకల్ సీఐ శ్రీనివాసరావు, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు ప్రసాదరావు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పక్కకు తోసే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. గంటపాటు ఇరువర్గాల మధ్య గందరగోళం నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారి కమలాకర్‌రావు నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ కోసం ఇరువర్గాల నుంచి వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించామని, వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటున్నామని ప్రకటించి వెళ్లిపోతున్న అధికారులు వెళ్తుండగా ఆందోళనకారులు వారిని అడ్డగించారు. వెంటనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి అధికారులను పంపించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నకిరేకల్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పట్టణంలోని మూసి రోడ్డులో ఉంటున్న బంటు రేణుక, వనం భవానీలు గాయపడ్డారు. పారి శుద్ధ్య సిబ్బంది కావాలనే గ్రామ పంచాయతీ కోసం డిమాండ్ చేస్తున్న తమపై దాడి చేసి గాయపరిచారని పోలీస్ స్టేషన్ ఎదుట వారు ధర్నా చేశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఉదయగిరి ఎంపీడీఓ డిస్మిస్
ఉదయగిరి, న్యూస్‌లైన్: ఉదయగిరి ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావును డిస్మిస్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ తాలూకు ఆదేశాలను బుధవారం ఆ శాఖ వెబ్సైట్లో ఉంచారు. జెడ్పీ సీ ఈఓ జితేంద్ర ఈ విషయాన్ని ధ్రువీక రించారు. శ్రీనివాసరావు గుంటూరు జి ల్లాలో ఎంపీడీఓగా పనిచేస్తున్నప్పుడు ‘ఉపాధి’ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రూ.కోటికి పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ప్రస్తుతం వేటు పడింది. 2013 మేలో ఆయన ఉదయగిరి ఎంపీడీఓగా కౌన్సెలింగ్ ద్వారా విధుల్లో చేరారు. ఉదయగిరిలోనూ అక్రమాలు ఉదయగిరిలోనూ భారీ ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. మండల పరిషత్ సాధారణ నిధులు, సీఎఫ్‌సీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రాచేసి సొంతానికి వినియోగించుకున్నారు. చెరువుపల్లి, గండిపాళెం, ఉదయగిరి, శకునాలపల్లి పంచాయతీల్లో తమ అనుచరులకు పనులు అప్పగించారు. వీరు తమ సొంత నిధులతో పనులు చేసి ఎంబుక్‌లో రికార్డ్ చేయించుకున్నారు. అంతకుముందే ఎంపీడీఓ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు, టీఎఫ్సీ నిధుల నుంచి రూ.1.50 లక్షలు పైగా నిధులు డ్రా చేశారు. నిబంధనల మేరకు పని పూర్తిచేసిన తర్వాతే బిల్లులు మంజూ రు చేయాలి. గత ఏడాది జూన్ 4 నుంచి డి సెంబరు వరకు సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు, సెప్టెంబరులో టీఎఫ్సీ నుంచి రూ.2.50 లక్షలు నిధు లు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. -
ఎడ్ల పందేలకు మధ్యలోనే బ్రేక్
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా దామరమడుగులో బుధవారం నిర్వహించిన ఎడ్లతో బండ లాగుడు పందేలకు పోలీసులకు మధ్యలోనే బ్రేక్ వేశారు. మొదట పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గ్రామస్తుల కేరింతల మధ్య భారీ బండను ఎద్దులు లక్ష్యం వైపుగా లాక్కెళ్లాయి. రెండు రౌండ్ల పందేలు పూర్తవగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోటీల నిర్వహణకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఎంతోకాలంగా పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని గ్రామస్తులు వాదించినా ఎస్సై శ్రీనివాసరావు ససేమిరా అనడంతో నిలిచిపోయాయి. అనుమతి లేకుండా ఎడ్ల పందేలు నిర్వహించారంటూ తొమ్మిది మందిని బైండోవర్ చేసుకున్నారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
నార్పల, న్యూస్‌లైన్ : నార్పలలోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం నుంచి రాష్ర్టస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్స్పైర్)-2013 నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉంటాయి. 29వ తేదీ వరకూ ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం పర్యవేక్షించారు. 12 జిల్లాల నుంచి వస్తున్న విద్యార్ధులు, వారి కేర్ టేకర్ల కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రెవేట్ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులను తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయబృందంతో వచ్చేలా ప్రోత్సహించి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్వీఎం పీఓ రామారావు, డీఈఓ మధుసూదన్‌రావు, సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రాఘవయ్య, కోఆర్డినేటర్ ఆనందభాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
టీబీ డ్యాంలో కేసీ వాటా 4 టీఎంసీలే
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంలో కేసీ కెనాల్ వాటాలో 4 టీఎంసీ మాత్రమే మిగిలినట్లు డ్యాం పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు. కేసీ కెనాల్‌కు నీటి సరఫరా నిలిపివేతతో దాదాపు 90వేల ఆయకట్టు భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ బుధవారం ఎస్ఈతో ఫోన్లో మాట్లాడగా వాస్తవ పరిస్థితిని వెల్లడించారు. 2013-14 సంవత్సరంలో టీబీ డ్యాంలోని నీటి నిల్వల నుంచి కేసీ కెనాల్‌కి 6.789 టీఎంసీలు కేటాయించారన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఎక్కువ రోజులు సాగిందన్నారు. ఈ కారణంతోనే ఖరీఫ్ సీజన్లో కేసీకి నీటి విడుదల కోరలేదని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ వాటా నీటిలో కొంత 2004 నుంచి అనంతపురం జిల్లాకు మళ్లించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 2 టీఎంసీల నీరు అనంతపురం జిల్లావాసుల తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. ఇది పోగా కేసీ వాటాలో 4.7 టీఎంసీ నీరు మాత్రమే డ్యాంలో మిగిలి ఉందన్నారు. ఈ నీటిని కేసీ ఆయకట్టుకు వదలాలని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. కర్నూలు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ నాగేశ్వరరావు రైతుల ఆందోళనలను తన దృష్టికి తీసుకొచ్చారని.. అయితే అనుమతులు లేనిదే నీరు ఇవ్వలేమని ఆయనతో చెప్పామన్నారు. మిగిలిన కోటాలోనూ కొంత అనంతపురం జిల్లాకు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో తాగునీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. తుంగభద్ర దిగువ కాలువల నుంచి 100 కిలోమీటర్ల వరకు చిన్న చిన్న ప్రధాన కాల్వ లైనింగ్ పనులు జరుగుతుండటంతోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నీరివ్వాలని ఇండెంట్ పెట్టినా అంగీకరించలేదన్నారు. అదే రోజు నుంచి ఆంధ్రా వాటా నీరు నిలుపుదల చేయాలనే అధికారుల వినతితోనే ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. వచ్చే జనవరి 1వ తేదీ లోపు కాలువ పనులు పూర్తవుతాయని.. ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రా ప్రభుత్వాలు ఇండెంట్ పెడితే నీరిస్తామని ఆయన వెల్లడించారు. -
కోదండరామస్వామి ఆలయంలో చోరీ
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : గుర్తు తెలియని వ్యక్తులు కోదండరామస్వామి ఆలయంలో చొరబడి నాలుగు గ్రాముల బంగారు బొట్టు బిళ్లలను చోరీ చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆలయ ప్రహరీ పైనుంచి దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. చతుర్భుజ అమ్మవారి ఆలయం లోపలికి వెళ్లేం దుకు ఆలయం వెనక ఉన్న పశువులను కట్టేసిన గడ్డపారను తీసుకువచ్చి తాళం పగలగొట్టారు. లోపల ద్వారం రాకపోయేసరికి నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ లోపల గడియ తొలగించేందుకు విఫలయత్నం చేశారు. గర్భగుడిలోకి వెళ్లి నరసింహస్వామి విగ్రహాన్ని అపహరించేందుకు దించినా తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. దీంతో శ్రీదేవి, భూదేవి, వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలకు నుదుటిపై ఉన్న బంగారు బొట్టు బిళ్లలను చోరీ చేశారు. సమాచారం అందుకున్న నెల్లూరు డీఎస్పీ రాంబాబు, సీఐ సాంబశివరావు, ఎస్సై శ్రీనివాసరావు, పీఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే.. నరసింహస్వామి ఆలయంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ పూజారి చెప్పిన మాటలకు పొంతన లేదు. ధనుర్మాసం కావడంతో నరసింహ స్వామి ఆలయంలోని వెండి ఆభరణాలు మూటకట్టి పెట్టామని ఆలయ పూజారి చెబుతున్నారు. అయితే దొంగలే చోరీ చేసేందుకు వెండి ఆభరణాలు మూట కట్టినట్లు తెలుస్తోంది. వెండి ఆభరణాల మూటను తీసుకుని ప్రహరీని దూకడం కష్టమే. వెనక ఇంట్లో చెప్పు గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆలయం వెనుక వైపున ఉన్న గుడిసెలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆ గుడిసెలో ఉన్న కల్లూరు కొండయ్య చెబుతున్నాడు. తాను ఇంటి బయట నిద్రిస్తుండగా తన భార్య అరిచిందన్నారు. ఇంటి తలుపులు నెట్టేందుకు ప్రయత్నించాడని, తాను దోమ తెర తప్పించి బయటకు వచ్చేలోగా పరారయ్యాడన్నారు. అయితే ఆ సమయంలో తన కాలి చెప్పు ఒకటి ఇక్కడే ఉండిపోయిందన్నారు. డాగ్‌స్క్వాడ్ పరిశీలన డాగ్‌స్క్వాడ్ ఆలయం చుట్టుపక్కలంతా వెళ్లింది. తొలుత ఆలయం పక్కన ప్రహరీ నుంచి దూకేందుకు అవకాశమున్న ప్రాంతం వద్ద ఆగింది. అనంతరం వెనక వైపునున్న గుడిసె వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఆలయం పక్కనున్న కోనేరు వద్దకు వెళ్లింది. ఆంజనేయస్వామి ఆలయ పూజారి పరాంకుశం ఇంటితో పాటు పలు ఇళ్లలోకి వెళ్లింది. మళ్లీ గుడిసె వద్దకు చేరుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆ మార్గంలో ఎలా వచ్చాడో సూచించింది. అయితే చెప్పు వాసన పసిగట్టిన డాగ్‌స్క్వాడ్ చెప్పును వదిలేసిన దుండగుడు అక్కడే తిరిగినట్లు సూచించింది. పరారైనట్లు దాఖలాలు లేవు. ఏది ఏమైనా దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. -
డబ్బుకోసం బెజవాడలో జంట హత్యలు
సాక్షి, విజయవాడ: బెజవాడలోని సత్యనారాయణపురంలోని తాడంకి వారి వీధిలో గ్రూప్ హౌస్‌లో నివాసం ఉంటున్న పుణ్యవతి (57), ఆమె మనుమరాలు సాయి చంద్రిక (15)లను ఓ దుండగుడు గొంతుకలు కోసి ప్రాణాలు తీశాడు. ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి బంగారం కోసం గాలించాడు. బంగారం దొరక్కపోవటంతో వృద్ధురాలి మెడలో గొలుసుతో పరారయ్యాడు. పుణ్యవతి భర్త చక్కా సత్యనారాయణ.. కుమారులు శ్రీనివాసరావు, కిరణ్‌లతో కలిసి వన్‌టౌన్‌లో బంగారం, వెండిషాపు నిర్వహిస్తుంటారు. హత్యకు గురైన సాయిచంద్రిక కిరణ్ పెద్ద కుమార్తె. కిరణ్ భార్య శారద పెద్ద కుమార్తె చంద్రికను నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టి చిన్న కుమార్తెను తనతో తీసుకుని పుట్టిల్లైన గుంటూరుకు వెళ్లారు. సత్యనారాయణ తన కుమారులతో కలిసి బంగారం షాపునకు వెళ్లారు. పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రిక ఇంటి వద్దే ఉన్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సాయిచంద్రిక ఆ వీధిలో స్నేహితులతో ఆడుకుంటూ నాన్నమ్మ వద్దకు వెళ్లి ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్లింది. అప్పటికే నాన్నమ్మ రక్తపు మడుగులో పడిఉంది. నాన్నమ్మ పరిస్థితి చూసి ఏడుస్తూ ఇంట్లోకి పరుగులు తీయడంతో చంద్రికను కూడా చంపేశాడు. పైకి వెళ్లిన స్నేహితురాలు ఎంతకీ రాకపోవడంతో ఆమె స్నేహితులంతా కలిసి వెళ్లి చూసి గట్టిగా కేకలు వెయ్యడంతో వీధిలోని వారు హుటాహుటిన వచ్చి చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లిఫ్ట్ మెకానిక్ రవిని నిందితుడిగా పోలీసులు గుర్తించి విచారిస్తున్నారు. -
శ్రీహరి మృతితో విషాదఛాయలు
పెదపారుపూడి, న్యూస్‌లైన్ : ‘చిన్నతనంలో మాతో కలిసి మెలిసి తిరిగేవాడు. ఆటపాటలంటే మక్కువ. ఏడో తరగతి వరకు ఇక్కడే చదివాడు. ఎంత అగ్రహీరో అయినా మా స్నేహాన్ని మరచిపోలేదు’ అంటూ పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలోని శ్రీహరి సహవిద్యార్థులు వివరించారు. సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మరణంతో ఆయన స్వగ్రామం యలమర్రులో విషాదఛాయలు అలముకున్నాయి. స్నేహానికి ఎంతగానో విలువనిచ్చేవాడని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వాకా చిన్న సత్యనారాయణ తెలిపారు. 7వ తరగతి వరకు ఇక్కడే చదివాడు... సినీనటుడు శ్రీహరి 7వ తరగతి వరకు యలమర్రు గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు రఘుముద్రి సత్యనారాయణ, లక్ష్మి. శ్రీహరికి ఇద్దరు సోదరులు . అన్నయ్య శ్రీనివాసరావు హైదరాబాద్‌లోనే ట్రావెల్స్ యజమానిగా, శ్రీహరి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటారు. తమ్ముడు శ్రీధర్ సినిమాల్లో నటిస్తున్నారు. శ్రీహరి తల్లిదండ్రులు యలమర్రు గ్రామంలోనే వ్యవసాయం చేసేవారు. 30 ఏళ్లక్రితం ఇక్కడ్నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీహరి పెదనాన్న వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లిపోయారు. అప్పట్నుంచి గ్రామంతో ఆ కుటుంబానికి పెద్దగా సంబంధాలు లేవు. ఆయన మిగిలిన చదువులన్నీ హైదరాబాద్‌లోనే కొనసాగాయని బంధువులు చెబుతున్నారు. శ్రీహరి పాఠశాలలో చదివేటప్పుడు క్రీడలంటే ఎంతో మక్కువతో ఉండేవారని, ఆయనతో చదువుకున్నవారు పేర్కొంటున్నారు. ఏటా గంగానమ్మ జాతరకు వస్తాడు... గ్రామంలో జరిగే గంగానమ్మ జాతరకు భార్య, కుమారులతో ఏటా వచ్చేవాడని పేర్కొంటున్నారు. గ్రామదేవత గంగానమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని బంధువులు అంటున్నారు. ఆరు నెలల క్రితం గంగానమ్మ అమ్మవారికి రూ.లక్షతో వెండి కిరీటం, ఆభరణాలు చేయించారని తెలిపారు. గంగానమ్మ గుడిని తన సొంత ఖర్చులతో కట్టిస్తానని గ్రామపెద్దలకు హామీ ఇచ్చారని వివరించారు. వచ్చినప్పుడల్లా కలిసేవాడు... యలమర్రు గ్రామానికి వచ్చినప్పుడల్లా తన బంధువులతో పాటు సహవిద్యార్థులమైన తమను కలిసి వెళ్లేవాడని శ్రీహరి బాల్యస్నేహితులు వాకా చిన్నసత్యనారాయణ, సుంకర వెంకటేశ్వరరావు, వల్లభనేని నరసింహారావు, అట్లూరి శివాజీ చెబుతున్నారు. ఆయన మరణ వార్త తమను తీవ్ర కలతకు గురిచేసిందని వాపోయారు. యలమర్రులో శ్రీహరి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. శ్రీహరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో శ్రీహరితోనే ఉంటున్నారని వారి బంధువులు వివరించారు. శ్రీహరి పెదనాన్న, పెద్దమ్మ రఘుముద్రి కోటేశ్వరరావు, లక్ష్మి మాత్రమే యలమర్రులో ఉంటున్నారు.