బొలిశెట్టి.. భయపెట్టి..
సెటిల్‌మెంట్లు, అక్రమ రవాణాల్లో అందె వేసిన చేయి
లారీ ఫీల్డ్‌తో మొదలై సంపన్నుడిగా మారిన వైనం
బియ్యం అక్రమ రవాణా, కల్తీ కందిపప్పులో సిద్ధహస్తుడు
మున్సిపల్ చైర్మన్‌గా సరికొత్త దోపిడీకి రతీసిన వైనం
30 ఏళ్లు.. మూడు రాజకీయ పారీ్టలు
పెండింగ్‌లో మూడు కేసులు.. ముగిసినవి రెన్నో..
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్‌తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్‌మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్‌మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్‌గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్‌మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్‌మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్‌కు లారీల కాంట్రా క్టర్‌గా, గన్నీ బ్యాగ్ సప్లయర్‌గా, కందిపప్పు సప్లయర్‌గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు.
బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్‌లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది.
బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని..
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్‌ఈడీ లైట్ల కొనుగోలు టెండర్‌లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్‌లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్‌లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
చంపేస్తామని మహిళకు బెదిరింపులు
స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్‌బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు.
పేకాటలో సిద్ధహస్తుడు
బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది.
తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు
కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్‌గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్‌గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు.
ఏసీ ఫిష్, నాన్‌వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment