land settlements
-
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్‌తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్‌గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్‌కు లారీల కాంట్రా క్టర్‌గా, గన్నీ బ్యాగ్ సప్లయర్‌గా, కందిపప్పు సప్లయర్‌గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్‌లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్‌బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్‌గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్‌గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్‌వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి. ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది. అంతలోనే ఇంత పెద్ద స్పందనా? కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది. టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు. ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. లక్ష్మి గతమంతా అక్రమాలే స్వర్ణ భారతి నగర్‌కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు. వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. ♦ 2013లో స్వర్ణభారతి నగర్‌కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు. 2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది 2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్‌లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్ అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్‌ట్రిక్స్‌నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
అడ్డంగా బుక్కైన నకిలీ ఐఏఎస్
సాక్షి, విశాఖపట్నం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గెదేల అనిల్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్‌నంటూ ఒక ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి అమాయకులను టార్గెట్ చేయడం ప్రారంభించాడు. ఇదివరకే భూ సెటిల్మెంట్లు చేస్తానని చెప్పి పలువురి దగ్గర సుమారు రూ. 9 లక్షలు తీసుకున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో భూమి సమస్య పరిష్కరిస్తానంటూ అనిల్ నకిలీ ఐఏఎస్‌గా తనను తాను పరిచయం చేసుకొని ఓ వ్యక్తి వద్ద రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. బాధితునికి అనిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనిల్ కుమార్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి: విశాఖ ‘సిట్’ గడువు పెంపు) ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఒకరి అరెస్ట్ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న శ్రీకాకులపు శ్రీనివాస్ అనే వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కంపెనీలో ఏజీఎంగా ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి ఓ వ్యక్తి నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మల్కాపురంతో పాటు విజయనగరం జిల్లా గరివిడి, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. -
గ్యాంగ్‌స్టర్ మధుతో సంబంధాలున్నాయి
-
గ్యాంగ్‌స్టర్ మధుతో సంబంధాలున్నాయి : ఏపీ మంత్రి
అనంతపురం : గ్యాంగ్‌స్టర్ ఎర్నంపల్లి మధుతో తనకు సంబంధాలున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతలో గురువారం ఆయన మాట్లాడుతూ...గత ఎన్నికల్లో తన గెలుపు కోసం అతను పనిచేశాడని చెప్పారు. బెంగళూరులో మధు ల్యాండ్ సెటిల్మెంట్లతో మాత్రం ఎలాంటి సంబంధం లేదని పల్లె పేర్కొన్నారు. (చదవండి : బెంగళూరులో గ్యాంగ్ వార్) 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యాంగ్‌స్టర్ మధు టీడీపీలో చేరాడు. మంత్రి పల్లె బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధును కలుస్తాడని తెలుస్తోంది. సెటిల్మెంట్ల వ్యవహారంలో మధు దొరికిపోవడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు భారీగా సెటిల్మెంట్లు నిర్వహించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. -
'ఏఎస్సై మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి'
కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారి ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షులు మహేందర్‌రెడ్డితో పాటు లోక్‌సత్తా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. మోహన్‌రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోహన్‌రెడ్డి జైల్లోనే ఉంటేనే అతనిపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో జైల్లో ఉన్న మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలు వెదజల్లి బెయిల్ పొందేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. నయీం కుటుంబసభ్యుల మాదిరిగా మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే కొత్తకోణాలు బయటికి వస్తాయని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు పోలీస్ వర్గాల మధ్య అంతర్గత పోరుతో ఒక వర్గం నయీంను ఆశ్రయించి పైచేయి సాధించిందని ఆ వర్గమే మోహన్‌రెడ్డి ముఠా అని ఆరోపించారు. సిట్ అధికారులు నయీం, మోహన్‌రెడ్డిల సంబంధాన్ని బయటికి తీయాలని, మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. -
వట్టిపల్లిలో రియల్టర్ల భూ దందా
కుంట కబ్జాకు యత్నం.. అడ్డుకున్న గ్రామస్తులు జగదేవ్‌పూర్: కొందరు రియల్టర్లు భూ దందాకు తెరలేపారు. కుంటను కబ్జా చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని వట్టిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న 20 ఎకరాల భూమిని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు విక్రయించారు. అయితే గ్రామస్తులు తన భూమి పక్కనే కామునికుంట ఉంది. కొన్నేళ్లుగా గ్రామస్తులు కుంటలోనే బతుకమ్మలను వేస్తున్నామని అయితే కుంటను విడిచి మిగతా భూమిని అమ్ముకోవాలని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే కొన్నవారు కుంట లేదు శికం లేదు అంతా తమదేనని ఇరవై రోజుల నుంచి చదును చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం కొంత మంది గ్రామస్తులు కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ గ్రామంలో కామునికుంటను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించారు. కుంట సర్వే నంబర్ 276, 278 లో ఉందని డీప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలు తెలిపారు. దీంతో మంగళవారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కామునికుంట దగ్గరకు వెళ్లి భూమిని పరిశీలించారు. ముందే తెలుసుకున్న రియల్టర్లు పనులను ఆపేశారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ కుంటను కబ్జాను చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కుంట శికం ఐదెకరాల వరకు ఉంటుందని తెలిపారు. బతుకమ్మలను వేసేటోళ్లం.. ఎన్నో ఏళ్ల నుంచి కామునికుంటలో బతుకమ్మలు వేసుకుంటూ వస్తున్నాం. కుంట ఇన్నాళ్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిలోనే ఉందని అనుకున్నాం. అయన కూడా ఎప్పుడు బతుకమ్మలను అడ్డుకోలేదు. తాను అమ్ముకున్న తర్వాత కొన్నవారు భూమితో పాటు కుంటను కూడా తవ్వేస్తున్నారు. కుంటను తవ్వొద్దని చెప్పినా వినలేదు. అధికారులను కలిసితే అసలు విషయం తెలిసింది. కామునికుంట ప్రభుత్వ భూమిలో ఉందని, రికార్డులో కూడా చుశాం. - గ్రామస్తుడు, నర్సయ్య అధికారులు హద్దులు పాతాలి గ్రామంలో కామునికుంట కబ్జాకు గురైంది. మిషన్‌కాకతీయ నిధులు వచ్చినా పనులు జరగనివ్వలేదు. కామునికుంట గ్రామానికే చెందాలి. లేకుంటే గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేస్తాం. కొన్నవారిని అడిగితే ఏమి చేసుకుంటరో చేసుకోండని అంటున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు పాతాలి. - గ్రామస్తుడు, సత్యనారాయణ -
వివాదాస్పద భూములే నయీమ్ టార్గెట్
రాష్ట్రంలో ఎక్కడ లిటిగేషన్ ఉన్నా వాలిపోవాల్సిందే ఇందుకోసం ‘ప్రత్యేక’ నెట్వర్క్ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: సులభంగా డబ్బు సంపాదించేందుకు ల్యాండ్ సెటిల్మెంట్లే అత్యుత్తమ మార్గంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎంచుకున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. రాష్ట్రంలో ఎక్కడ వివాదాస్పద (లిటిగేషన్) భూమి ఉన్నా.. అక్కడ క్షణాల్లో వాలిపోయేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపడింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి కేవలం లిటిగేషన్ భూముల మీదనే దృష్టి సారించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద భూముల సమాచారం తెలియగానే వాటిని ‘సెటిల్’ చేయడానికి నయీమ్ ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుంది. వారికి మాట వినకపోతే ‘భాయ్’ దగ్గర ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తారు. అక్కడ సెటిల్ అయ్యేలా.. అంతకుమించి వారికి మరోమార్గం లేకుండా చేసే ప్రణాళిక రూపొందించుకున్నారు. పెద్ద డీల్ ఉన్న భూ లావాదేవీలన్నీ నయీమ్ కనుసన్నల్లోనే జరిగి నట్లు పోలీసులకు అనేక ఆధారాలు లభించాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సిట్ చీఫ్ నాగిరెడ్డి నేతృత్వంలో గత పది రోజులుగా చేస్తున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారీ మొ త్తంలో ఆస్తులు వెలుగు చూడటంతో.. అందులోనూ భూముల వివరాలు బయటపడటంతో ఆ దిశగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నయీమ్ డెన్స్లలో లభించిన ల్యాండ్ డాక్యుమెంట్ల విలువ మదింపు చేసేందుకు రెవెన్యూ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ఈ మేరకు పుప్పాలగూడలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా లెక్కింపు కొనసాగింది. అలాగే మిగతా ప్రాం తాల్లో కూడా డాక్యుమెంట్ల విలువను లెక్కించాలని సిట్ యోచిస్తోంది. సమాచారానికి ‘ప్రత్యేక’ నెట్వర్క్ భూ లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడుతుండటంతో నయీమ్ పూర్తిగా వాటి మీదే దృష్టి కేంద్రీకరించాడు. అందుకోసం అన్ని ప్రాంతాల్లో భూ లావాదేవీలకు సంబంధించిన సమగ్ర సమాచారం తనకు చేరేలా ‘ప్రత్యేక’ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బృందంలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే కొంత మంది అధికారులు, డాక్యుమెంట్స్ రాసే వారినే నియమించుకున్నాడు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖలో పదవీ విరమణ పొందిన వారి సేవలను వినియోగించుకున్నాడు. వారి సేవలకుగాను ప్రతీ నెల పారితోషికాలు, నజరానాలు అందించినట్లు సిట్‌కు కొన్ని ఆధారాలు లభించాయి. ‘పెద్ద’ వ్యక్తులూ నయీమ్ వద్దకే.. నయీమ్ భూ లావాదేవీలు మొదట్లో నల్లగొండ జిల్లాకే పరిమితం కాగా.. ఆ తర్వాత క్రమంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు విస్తరించాయి. ఎంతటి వివాదాస్పద భూమైనా సరే నయీమ్ రంగ ప్రవేశం చేస్తే పరిష్కారం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ‘పెద్ద’ వ్యక్తులందరూ కూడా నయీమ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. వారి వివరాలన్నీ నయీమ్ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది. భారీగా నమోదవుతున్న కేసులు నయీమ్, అతని అనుచరులపై కేసుల పరంపర కొనసాగుతోంది. వారి ఆగడాలకు సంబంధించి సిట్ ప్రకటించిన టోల్‌ఫ్రీ నంబర్‌కు 150కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. కొంత మంది బాధితులు ఆధారాలతో సహా స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 15, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌లలో 8, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, కరీంనగర్ జిల్లాలో 4, నిజమాబాద్ జిల్లా ఒక కేసు నమోదయ్యాయి. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సమీక్షిస్తున్న పోలీసులు.. ఆధారాలు లభ్యమైతే మరిన్ని కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'నయీంతో ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలు'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీంకు, ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మోహన్‌రెడ్డి బాధిత సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎల్ఎండీ, పద్మానగర్, నగునూర్‌లో భూ సెటిల్మెంట్లను మోహన్ రెడ్డి నయీం ముఠాతో చేయించాడని తెలిపారు. బాధితులందరు కలిసి నయీం కేసును విచారిస్తున్న సిట్ బృందానికి శనివారం ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. మోహన్‌రెడ్డి వ్యవహారాలపై విచారణ జరిపితే నయీం ముఠాతో సంబంధాలు బయటపడతాయన్నారు. మోహన్‌రెడ్డి ఎక్కువగా దళితుల భూములనే అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని... దీనిపై త్వరలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలుస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామని సీపీఐ, లోక్‌సత్తా ప్రతినిథులు తెలిపారు. -
భారీ కుట్రను భగ్నం చేసిన నల్లగొండ పోలీసులు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు యత్నించిన ఓ ముఠా కుట్రను శుక్రవారం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. మునగాల మండలం నర్సింహులగూడెంలో గత కొంతకాలంగా భూవివాదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముగ్గురిని హత్య చేసేందుకు యత్నించిన నలుగురి సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్కార్పియోలో వెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. గతంలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నల్లగొండ సరిహద్దు జిల్లాలో ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడకు చెందిన వీరిపై పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. వారి నుంచి రూ.12 లక్షలు, ఓ స్కార్పియోతో పాటు 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
డోంట్ వర్రీ.. నేనున్నాగా..!
విజయవాడ : భూ వివాదంలో కూరుకుపోయిన పోలీసు అధికారిని రక్షించేందుకు నియోజకవర్గం ప్రజలు ముద్దుగా షాడో ఎమ్మెల్యేగా పిలుచుకునే వ్యక్తి రంగంలోకి దిగినట్టు తెలిసింది. తనను గండం నుంచి గట్టెక్కించాలంటూ వచ్చిన మధ్యవర్తులతో ‘ప్యాకేజీ’ కుదుర్చుకొని ఇబ్బందుల నుంచి బయటపడేస్తానంటూ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ వైద్యుని ప్లాట్ల విషయంలో చోటు చేసుకున్న మోసం, పోలీసు కమిషనర్ ఆదేశంలో కేసు నమోదు, నిందితులను అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాలపై ‘సెటిల్మెంట్..సో బెటర్ బాస్!’ శీర్షికన మంగళవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనం పెనమలూరు నియోజకవర్గంలో కలకలం రేపింది. స్టేషన్‌కి వచ్చిన బాధితుణ్ణి ప్రైవేటు వ్యక్తుల వద్ద సెటిల్ చేసుకోమంటూ సాక్షాత్తు పెనమలూరు ఇన్స్పెక్టర్ జగన్మోహనరావు పంపడంపై నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.కాగా, విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారడం, పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించడంతో పెనమలూరు పోలీసు స్టేషన్ అధికారి మధ్యవర్తుల ద్వారా షాడో ఎమ్మెల్యేని ఆశ్రయించినట్టు తెలిసింది. గతంలో వారికి తాను చేసిన ఉపకారం ఏకరువు పెట్టడంతో పాటు తనను బయటపడేస్తే రానున్న రోజుల్లో చేయబోయే సాయం గురించి కూడా భరోసా ఇచ్చినట్టు తెలిసింది. లిక్కర్ సిండికేట్ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా పోలీసు అధికారికి కలిసొచ్చింది. షాడో ఎమ్మెల్యేగా చెప్పుకునే వ్యక్తి లిక్కర్ సిండికేట్‌లో కీలక వ్యక్తి కావడంతో సాయం చేసే వ్యక్తిని వదులుకోవద్దంటూ పలువురు చెప్పినట్టు వినికిడి. పైగా సాయం చేసినందుకు ప్యాకేజీ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగి నియోకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ద్వారా పోలీసు పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. ఇద్దరి పైనే కేసు పోలీసు కమిషనర్ సవాంగ్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఇద్దరిపైనే కేసు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖర్లో రంగ ప్రవేశం చేసిన వ్యక్తి పై స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి బయటపడేందుకు చేసిన యత్నాలు ఫలించినట్లు చెపుతున్నారు. పైగా విచారణ అధికారి ఆ వ్యక్తి మంచోడంటూ ముందుగానే కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ఇక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడుతున్నారు. ఏసీపీ ఆగ్రహం ఓ కేసు దర్యాప్తు కోసం పెనమలూరు పోలీసుస్టేషన్‌కి వెళ్లిన మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ టిఎస్ఆర్కె ప్రసాద్ అక్కడి పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన వెళ్లేసరికే అదుపులోకి తీసుకున్న వారిని బయట కూర్చొబెట్టి మహిళా కానిస్టేబుల్ ద్వారా టీ సర్వ్ చేయిస్తున్నారు. ఇదే విషయమై అక్కడి అధికారిని మందలించడంతో పాటు వెంటనే వారిని లోపల కూర్చోబెట్టాలంటూ ఆదేశించినట్లు స్టేషన్ సిబ్బంది చెపుతున్నారు.