'నయీంతో ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలు'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీంకు, ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మోహన్‌రెడ్డి బాధిత సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఎండీ, పద్మానగర్, నగునూర్‌లో భూ సెటిల్‌మెంట్‌లను మోహన్ రెడ్డి నయీం ముఠాతో చేయించాడని తెలిపారు. బాధితులందరు కలిసి నయీం కేసును విచారిస్తున్న సిట్ బృందానికి శనివారం ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు.
మోహన్‌రెడ్డి వ్యవహారాలపై విచారణ జరిపితే నయీం ముఠాతో సంబంధాలు బయటపడతాయన్నారు. మోహన్‌రెడ్డి ఎక్కువగా దళితుల భూములనే అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని... దీనిపై త్వరలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలుస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామని సీపీఐ, లోక్‌సత్తా ప్రతినిథులు తెలిపారు.