nayeem encounter
-
నయీం కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలు ఉన్నాయని ల్యాండ్ సెటిల్మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు. కాగా నయీం ఎన్కౌంటర్, తదనంతరం పరిణామాలపై సిట్ 175కుపైగా చార్జ్‌సీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,13 మంది సీఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా వీరందరికి క్లీన్‌చీట్ ఇస్తున్నట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు. మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు కోరారు. క్లీన్ చిట్ పొందినవారిలో అడిషనల్ ఎస్పీ లు శ్రీనివాస్ రావు చంద్రశేఖర్ డీఎస్పీలు.. సీహెచ్. శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ సాయి మనోహర్ ప్రకాష్ రావు వెంకట నరసయ్య అమరేందర్ రెడ్డి తిరుపతన్న ఎస్ఐలు.. మస్తాన్ రాజగోపాల్ వెంకటయ్య శ్రీనివాస్ నాయుడు కిషన్ ఎస్ శ్రీనివాసరావు వెంకట్ రెడ్డి మజీద్ వెంకట సూర్య ప్రకాష్ రవి కిరణ్ రెడ్డి బలవంత య్య నరేందర్ గౌడ్ రవీందర్ కానిస్టేబుల్ దినేష్ ఆనంద్ బాలన్న సదాత్ మియా -
నయీం ఎన్కౌంటర్, అక్రమాలపై వ్యాజ్యాల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రత్యేక పరిస్థితులు ఏమున్నాయో పిటిషనర్లు వివరించలేకపోవడంతో ఈ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కి చెందిన మండవ శ్రీనివాస్ 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. నయీం అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుందని తెలిపింది. -
నయీం బినామీ ఆస్తుల స్వాధీనానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇన్‌కం ట్యాక్స్ అడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో హైదరాబాద్ ఐటీ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆదాయ మార్గాలు లేకుండా రూ.వేల కోట్ల ఆస్తులను నయీం సంపాదించాడని ఐటీ శాఖ తేల్చింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత వేలాది మంది బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేశారు. తమను బెదిరింపులకు గురి చేసి భూములు లాక్కున్నారని ఫిర్యాదుల్లో పేరొన్నారు. వీటిపై విచారణ చేసిన సిట్ సంబంధిత ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీతో పాటు ఐటీ విభాగానికి లేఖలు రాసింది. ఈ మేరకు విచారణ జరిపిన ఐటీ బృందాలు నయీం ఆస్తులను బినామీ పేర్ల మీదకు బదలాయించారని, వారికి నోటీసులిచ్చి విచారణ జరిపాయి. ఈ సందర్భంగా వాళ్లకు ఎలాం టి ఆదాయ మార్గాలు లేవని దర్యాప్తులో బయటపడ్డట్టు తెలిసింది. త్వరలోనే పిటిషన్ విచారణ.. నయీం బినామీల ఆస్తులను కొత్తగా తీసుకొచ్చిన బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకునేందుకు అనుమతివ్వాలని అడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో ఐటీ పిటిషన్ దాఖలు చేసింది. నయీం బినామీ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.1,500 కోట్ల మేర ఉంటాయని ఐటీ పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ పిటిషన్‌పై త్వరలోనే వాదనలు జరుగుతాయని సంబంధిత దర్యాప్తు బృందాల ద్వారా తెలిసింది. ఇక, నయీం ఆస్తుల వ్యవహారంపై అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫైల్ చేసినట్టు తెలిసింది. ఈ దర్యాప్తు కోసం ఇప్పటివరకు సిట్ బృందం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లను కోర్టు నుంచి తీసుకోనున్నట్టు తెలిసింది. -
నయీం ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : జలధరింపజేసిన పోలీసుల వేట... నయీం గుండెల్లోకి దూసుకెళ్లిన పోలీసుల తూట. స్థానికుల వదనాల్లో భయంతో నిండిన చమట.. ఒళ్లు గగుర్పాటు పొడింపించిన ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నయీం ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా నేటితో రెండేళ్లు పూర్తయింది. వెన్నులో వణుకు పుట్టించిన ఘటనను షాద్‌నగర్ ప్రాంత వాసులు నేటికీ మరిచిపోలేకపోతున్నారు. ఉదయం 6గంటలకు 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ పట్టణ శివారులోని మిలీనియం టౌన్షిప్లో ఒక్కసారిగా పోలీసులు ఓ ఇంటిని చుట్టుముట్టారు. అసలు ఏం జరుగుతుందో కాలనీ వాసులకు అర్థం కాని పరిస్ధితి. భారీ ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు మొహరించారు. తుపాకులెక్కుపెట్టి ఓ వ్యక్తిపై పోలీసులు ఏకదాటిగా కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో హతమైంది కరుడుగట్టిన నేరస్తుడు, వంద కేసుల్లో నిందితుడు, 40హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు నయీం అని ఆ రోజు తెలిసింది. వెంటాడుతున్న జ్ఞాపకాలు షాద్‌నగర్‌లోని మిలీనియంటౌన్‌షిప్ అంటేనే నయీం డెన్‌గా మారిపోయింది. మిలీనియం టౌన్షిప్లో ఇంటిని కొనుగోలు చేసి డెన్‌గా ఏర్పర్చుకొని రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించాడు. గుట్టు చప్పుడు కాకుండా నయీం షాద్‌నగర్‌కు వచ్చి వెళ్లేవాడు. ఇంట్లో ఉండే వారు పెద్దగా బయటికి వచ్చే వారు కాదు. షాద్‌నగర్‌లోని ఇంటికి మామిడితోటగా పేరుపెట్టుకొని దందాలను నిర్వహించేవాడు. భారీ ఎత్తున సెటిల్మెంట్లు, మాటవినని వారిని హత్య చేసేందుకు ఇక్కడ నుండే పథకం రచించేవాడని సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఇప్పటికీ నయీం ఇల్లు మూతే మిలీనియం టౌన్షిప్లో సుమారు రెండు వందల చదరపు గజాల్లో ఉన్న ఇంటిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చెందిన సయ్యద్ సాధిక్‌పాషా పేరుపై 2012లో కొనుగోలు చేశాడు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ఇంట్లో దొరికిన సామగ్రిని వాహనాల్లో తరలించారు. అయితే సుమారు నాలుగేళ్ల పాటు షాద్‌నగర్ నుంచి నయీం కార్యకలాపాలు కొనసాగించాడు. 2016 ఆగస్టు నుంచి నయీం ఇల్లు మూత పడే ఉంది. ఇప్పటికీ నయీం ఇంటి వైపు వెళ్లాలంటే చాలా మంది జంకుతుంటారు. ప్రస్తుతం ఇంటి గేటుకు తాళం వేసి ఇంటి ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి చిందరవందరగా ఉంది. షాద్‌నగర్ మున్సిపాలిటీ వారు మిలీని యం టౌన్ షిప్లో మొక్కలు పెంచేందుకు స్మృతి వనం ఏర్పాటు చేశారు. నయీం ఎన్కౌంటర్ స్మృతి వనం ఎదుట జరిగింది. అయితే ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ఓ బుల్లెట్ స్మృతి వనం గేటుకు తాకడంతో రంద్రం పడింది. బుల్లెట్ తాకి గేటుకు రంద్రం పడిన దృశ్యం నేటికి కనిపిస్తుంది. -
నయీమ్ సొమ్ము ఏమైంది?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత దొరికిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు(వీహెచ్) ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీమ్ కేసుపై తాను గతంలోనే సిట్ అధికారులకు, రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. కానీ, ఇంతవరకు ఏ చర్యలు చేపట్టలేదని, కేసును ప్రభుత్వం కావాలనే నీరుగార్చుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలన్నింటిలో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉండటంతోనే ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు -
యాక్షన్ టీమ్ ఎక్కడ..?
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఏడాది - ఇప్పటికి చిక్కిన వారంతా ‘సివిల్ క్రిమినల్సే’ - ఎన్కౌంటర్ తర్వాత కనిపించని యాక్షన్ టీమ్ - కొందరు ఖాకీలపైనే వేటు.. సేఫ్జోన్లో రాజకీయ నాయకులు సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: 2016 ఆగస్టు 8.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అయిన రోజు. ఇది జరిగి రేపటికి ఏడాది.. నాటి నుంచి పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 174 కేసులు నమోదు చేశారు. 120 మంది నయీమ్ అనుచరుల్ని పట్టుకున్నారు. మరోవైపు నయీమ్‌తో అంటకాగిన ఖాకీలపై వేటు పడినప్పటికీ.. రాజకీయ నాయకులు మాత్రం ‘సేఫ్‌జోన్’లోనే ఉండిపోయారు. నయీమ్ డెన్ల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు ఎన్ని? వాటిలో ఉన్న వివరాలు ఏంటి? అనేది సైతం రహస్యంగా ఉండిపోయింది. యాక్షన్ టీమ్ ఎక్కడ..? నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన అనుచరులంతా అప్పటి వరకు వెలుగులోకి రాని ‘సివిల్ నేరగాళ్ల’నే వాదన ఉంది. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీమ్ కనుసన్నల్లో పని చేసింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన, హైదరాబాద్‌లో జరిగిన పటోళ్ళ గోవర్థన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న ఈ టీమ్‌లో కీలకం. మహబూబ్‌నగర్, అచ్చంపేట, సిద్ధిపేట, నగరంలోని ముషీరాబాద్, పాతబస్తీలకు చెందిన మరో ఆరుగురు సభ్యులుగా ఉండేవారు. నయీమ్ ఆదేశాలతో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడటం.. ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ టీమ్ ఏడాది గడిచినా పోలీసులకు చిక్కడం కానీ, అరెస్టు కావడం కానీ జరగలేదు. ఇంకా దర్యాప్తులో అనేక కేసులు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది బాధితులు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో హత్య, భూకబ్జా, కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలపై 174 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనేక మందికి బెయిల్ లభించింది. నయీమ్ భార్య హసీనాకు ఈ నెల 2న బెయిల్ రావడంతో సంరక్షణాలయంలో ఉన్న తన పిల్లల్ని సైతం ఆమె తీసుకువెళ్లింది. ఇన్ని కేసులు నమోదైనప్పటికీ అభియోగపత్రాలు దాఖలైన వాటి సంఖ్య తక్కువే. కేసుల విచారణ, చార్జిషీట్ల దాఖలులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలతో ఇటీవల భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్కు ఈ బాధ్యతలను పోలీసు శాఖ అప్పగించింది. సేఫ్ జోన్లో రాజకీయ నాయకులు.. నయీమ్‌తో అనేక మంది పోలీసులు దందాల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 20 మంది పోలీసులపై విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆరోపణలు రుజువైతే కేసులుంటాయని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఇప్పటికీ రుజువులు లభించలేదు. గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగిన వారిలో రాజకీయ నేతలు సైతం ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. పోలీసులపై సస్పెన్షన్ వేటు పడినా.. నేతలు మాత్రం ‘సేఫ్‌జోన్’లో ఉండిపోయారు. కొందరికి నోటీసుచ్చిన సిట్ తమ కార్యాలయానికి పిలిపించి విచారించింది. తమకు నయీమ్‌తో దోస్తీ తప్ప దందాలు లేవంటూ చెప్పడంతో ఆ కథకు బ్రేక్ పడింది. -
కొత్త రూపు.. నవ్య పథం!
- మూడో ఏడాదీ దూసుకుపోయిన రాష్ట్ర సర్కారు - హామీ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ - కోటి ఎకరాల మాగాణానికి అసెంబ్లీలో ప్రజెంటేషన్ - మచ్చ తెచ్చిన ఎంసెట్ లీకేజీ, భూసేకరణ పుష్కలంగా వర్షాలు.. కొలువుదీరిన కొత్త జిల్లాలు.. పాలనలో నవ్య పంథా.. ముఖ్యమంత్రి ఇలాఖాలో ‘డబుల్’సంతోషం.. మొత్తమ్మీద ఈ ఏడాది తెలంగాణ సర్కారుకు కలిసొచ్చింది! పాలన సంస్కరణల్లో కొత్త ప్రయోగాలను మూడో ఏడాదిలోనూ ప్రభుత్వం అప్రతిహతంగా కొనసాగించింది. పది జిల్లాల తెలంగాణకు 31 జిల్లాలతో కొత్త రూపునిచ్చింది. కొత్త మండలాలు, కొత్త డివిజన్లను ఏర్పాటు చేసింది. ప్రజలకు పరిపాలనను చేరువ చేసే లక్ష్యంతో కొత్త జిల్లాల ఆవిర్భావానికి సర్కారు చేసిన కసరత్తు ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, మహారాష్ట్రతో అంతర్రాష్ట సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందం, ప్రధాని చేతుల మీదుగా మిషన్ భగీరథ పథకం ప్రారంభం, హరితహారం.. ఈ ఏడాదిలో సర్కారు దృష్టి సారించిన కార్యక్రమాలు. ఎంసెట్ లీకేజీ, గ్యాంగ్‌స్టర్ నయీమ్ హత్యానంతర పరిణామాలు, ముందుకుసాగని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, నత్తనడక దళితులకు మూడెకరాల భూపంపిణీ, విడతల వారీగా రైతుల రుణమాఫీ, ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలు, రైతులకు పంపిణీ కాని ఇన్పుట్ సబ్సిడీæ ఈ ఏడాదిలో సర్కారుకు మచ్చగా మిగిలిపోయాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రధాని తొలి రాక ఈ ఏడాది ఆగస్టు 7న నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. దీనితోపాటు మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వే లైనుకు శంకుస్థాపన, రామగుండంలో ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటు, ఎఫ్‌సీఐ పునరుద్ధరణ పనులకు పునాదిరాయి వేశారు. అక్కడ్నుంచి కేంద్రంతో రాష్ట్ర సంబంధాలు మరింత బలపడ్డాయి. హామీలు.. అమలు ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు ఈ ఏడాదిలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, జూన్ 2న అమరవీరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకాలు ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటివరకు వివిద శాఖల్లో దాదాపు వెయ్యి మంది ఉద్యోగాలు క్రమబద్ధీకరించింది. ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొత్తగా రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. మొక్కల పండుగ.. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. జూలైæ 8న ఒకే రోజున హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా 163 కి.మీ. మేర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్‌లోనూ ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటారు. బిజినెస్ ర్యాంకుల్లో నంబర్ వన్ టీఎస్ఐపాస్ పారిశ్రామిక విధానం సత్ఫలితాలను ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఆమెరికా బయట మొదటి ఆపిల్ కార్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కొత్త జిల్లాలే హైలెట్ అపోహాలు.. అనుమానాలన్నీ కొట్టిపారేస్తూ ప్రభుత్వం అక్టోబర్ 10 అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 17 జిల్లాలతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాలు, వివిధ రకాల ఒత్తిళ్లతో మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. 125 కొత్త మండలాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు స్వయంగా సీఎం కేసీఆర్ కసరత్తు చేసి కొత్త జిల్లాల రూట్‌మ్యాప్‌ను పక్కాగా అమలు చేశారు. ముందుగా ప్రకటించిన ముహూర్తం ప్రకారం అక్టోబర్ 11న దసరా రోజున కొత్త జిల్లాల్లో ప్రభుత్వం ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. ఈ కసరత్తులో భాగంగా గతంలో ఉన్న జోనల్ వ్యవస్థ రద్దుకు నిర్ణయం తీసుకుంది. తొలి రెండేళ్లు విధాన నిర్ణయాల రూపకల్పన, ప్రాజెక్టుల రీ డిజైనింగ్, నిధుల సమీకరణపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది పథకాల అమలు, ఆచరణకు పెద్దపీట వేసింది. ఆదాయం పెరుగుతుందనే ఆశతో 1.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచేందుకు బడ్జెట్లో ప్రతి నెలా రెండు వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయిస్తూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఊరిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు డబుల్ బెడ్ రూం పథకం ఇంకా పట్టాలెక్కలేదు. సీఎం సొంత నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నరసన్న పేటలో మోడల్ గృహల నిర్మాణం తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఈ నిర్మాణాలు చేపట్టలేదు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పథకం నత్తనడకన సాగుతోంది. రైతు రుణమాఫీ మరో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దాదాపు రూ.4 వేల కోట్ల మేరకు పేరుకపోయిన ఫీజు రీ ఇంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. మచ్చ తెచ్చిన ఎంసెట్ లీకేజీ ఎంసెట్ లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది. పేపర్ లీకేజీ గుట్టు రట్టు చేసినప్పటికీ బాధ్యులపై కఠినంగా వ్యవహరించకపోవటం అనుమానాలకు తావిచ్చింది. మరోసారి పరీక్ష నిర్వహించి విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడింది. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు నయీమ్ ఎన్కౌంటర్ ఈ ఏడాది సంచలనంగా నిలిచింది. నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పేర్లు బయటకు పొక్కటంతో కేసు ఉత్కంఠ రేపింది. ప్రత్యేకంగా సిట్ వేసినా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యంతో సర్కారు విమర్శలపాలైంది. అసెంబ్లీలో సాగునీటి విధానం రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఏడాదిలో ఎక్కువ సమయం సాగునీటి పథకాల సమీక్షలపైనే దృష్టి సారించారు. బడ్జెట్ సమావేశాల్లో సీఎం స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే తమ లక్ష్యాన్ని, గతంలో ప్రాజెక్టుల పేరిట జరిగిన అన్యాయం, దగా, దోపిడీలను ఎండగట్టారు. ఇదే ఏడాది గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదుల ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్కారు ఒకడుగు ముందుకేసింది. ఈ ఒప్పందం చేసుకునేందుకు సీఎం రెండుసార్లు ముంబై వెళ్లా రు. ఆగస్టు 28న చరిత్రాత్మక మహా ఒప్పం దంపై రెండు రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేశారు. భూసేక‘రణం’ ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూ సేకరణ ప్రభుత్వాన్ని ఇరుకునపడేసింది. మల్లన్నసాగర్, పాలమూరు ఎత్తిపోతల, నిమ్జ్ భూముల సేకరణపై నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేసిన 2013 భూసేకరణ చట్టానికి బదులుగా జీవో నెం.123 ప్రకారం భూసేకరణ చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. జీవోను కొట్టి వేసింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం 193, 194 జీవోలను తీసుకు రావాల్సి వచ్చింది. తర్వాత కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర భూసేకరణ చట్టం అమలుకు ప్రభుత్వం పావులు కదిపింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రగతి భవన్‌లోకి సీఎం ఈ ఏడాది కూడా సీఎం సెక్రెటేరియట్‌కు చుట్టపుచూపుగానే వచ్చి వెళ్లారు. ఇక ఈ ఏడాదిలోనే సీఎం కొత్త అధికారిక నివాస భవన నిర్మాణం పూర్తయింది. దానికి ప్రగతి భవన్‌గా పేరు పెట్టారు. -
నయీం కేసులో మరో వ్యక్తి అరెస్ట్
మహబూబ్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నయీం పై 126 కేసులు నమోదు కాగా.. 93 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా సోమవారం మహబూబ్‌నగర్‌కు చెందిన బత్తుల ఈశ్వరయ్యను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
'ఏఎస్సై మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి'
కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారి ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షులు మహేందర్‌రెడ్డితో పాటు లోక్‌సత్తా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. మోహన్‌రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోహన్‌రెడ్డి జైల్లోనే ఉంటేనే అతనిపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో జైల్లో ఉన్న మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలు వెదజల్లి బెయిల్ పొందేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. నయీం కుటుంబసభ్యుల మాదిరిగా మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే కొత్తకోణాలు బయటికి వస్తాయని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు పోలీస్ వర్గాల మధ్య అంతర్గత పోరుతో ఒక వర్గం నయీంను ఆశ్రయించి పైచేయి సాధించిందని ఆ వర్గమే మోహన్‌రెడ్డి ముఠా అని ఆరోపించారు. సిట్ అధికారులు నయీం, మోహన్‌రెడ్డిల సంబంధాన్ని బయటికి తీయాలని, మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. -
యాక్షనా? యాక్టింగా ?
-
‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’
-
‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని, రాడికల్ యూనియన్‌లో పని చేసినప్పుడు సంబంధాలు ఉండేవని, తాను ముఖ్యమంత్రి కావాలని నయీం కోరుకునే వాడని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో శుక్రవారం అన్నారు. ప్రభుత్వం చర్యను సమర్థిస్తున్నా నయీం అరాచకాలు చేశారని, కాబట్టి ప్రభుత్వ చర్యను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు. నయీం కేసులో తన పైన ప్రభుత్వం బురద జల్లుతుందని చెప్పారు. తనకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇస్తే తాను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నోటీసులు ఇస్తే వెళ్తా తనకు సిట్ నోటీసులు ఇస్తే కచ్చితంగా మాట్లాడుతానని కృష్ణయ్య తెలిపారు. అయితే సిట్ దర్యాఫ్తులో పారదర్శకత లేదని, దీనిని సీబీఐకి అప్పగించాలని, రాజకీయ దురుద్దేశ్యంతో తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం నయీంతో కలిసినట్లుగా చెప్పడం సరికాదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి నాలాంటి నిజాయితీపరుడిపైన ఆరోపణలు చేయటం సరికాదని, తాను తన వాళ్ల కోసం పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదని కృష్ణయ్య అన్నారు. ఎల్పీ నగర్లో పోటీ చేసిన సమయంలో తనకు నయీం డబ్బులు పెట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తనలాంటి నిజాయితీపరులైన వారిని టార్గెట్ చేయడం విడ్డూరమన్నారు. నయీంతో తనకు ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు సిట్ నిరూపిస్తే తాను చట్టపరమైన శిక్షకు సిద్ధమన్నారు. తనకు మాత్రం ఆర్థికపరమైన సంబంధాలు లేవని చెప్పారు. నయీం వ్యవహారంలో అధికార పార్టీ నేతలే 99 శాతం మంది ఉన్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నయీంతో సంబంధాలు కలిగిన వారిలో ఉన్నారన్నారు. నయీంను బెదిరించా : తన వద్దకు రోజుకు బాధల్లో ఉన్నవారు చాలామంది వస్తారని, వారి తరఫున తాను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పని చేస్తానని కృష్ణయ్య అన్నారు. అలాగే నయీం బాధితులు కూడా కొందరు తన వద్ద గోడును వెళ్లబోసుకున్నారని, వారి తరఫున నయీంకు ఫోన్ చేసి తిట్టానని చెప్పారు. నయీం మరో ముగ్గురితో కలిసి లొంగిపోవాలనుకున్నాడని, ఈ విషయాన్ని తమకు చెబితే, లొంగిపోయినప్పుడు చూద్దామని చెప్పానన్నారు. నయీం చేసే దురాగతాలు తమకు అంతగా తెలియవన్నారు. తాను సీఎం కావాలన్నది నయీం కల అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నయీం తనకు సీఎం పదవి మిస్ అయిందని, తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని అతను కోరుకునేవాడన్నారు. తాను గతంలో భువనగిరి ఉర్సు, వినాయక ఉత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. ఉద్యమం సమయంలోనే నయీంతో సంబంధాలు ఉన్నాయన్నారు. కొద్ది నెలల క్రితం అతనితో మాట్లాడానని, ఇక నయీంని కలవక చాలా రోజులు అవుతోందన్నారు. అయితే, గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని తమను టార్గెట్ చేయడం సరికాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. -
నయీం కేసులో చర్యలకు సీఎం గ్రీన్ సిగ్నల్
నయీం కేసులో చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. డీజీపీ నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. నయీంతో సంబంధమున్న రాజకీయ నేతలు, అధికారులపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాజకీయ, అధికార ప్రముఖులకు గుండెల్లో గుబులు మొదలైంది. ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది అధికారులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు ఉన్న విపక్ష నేతలపై కూడా విచారణ వేగవంతం అయ్యింది. ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు రాకుండా ఉండేందుకు ముందుగా సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుని, ఆ తర్వాతే విపక్షాల జోలికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ఇప్పటికే ఆయనకు అధికారులు అందజేసినట్లు తెలుస్తోంది. -
నయీం కేసులో పలువురికి కస్టడీ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నయీం అనుచరులను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. తాజాగా చర్లపల్లి జైల్లో ఉన్న నయీం అనుచరులు సమీరుద్దీన్, శ్రీధర్‌గౌడ్‌లను 9 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా సంజీవ్‌రెడ్డి, శ్రీహరిలకు నాలుగు రోజులు, అబ్దుల్ ఫహీం, సామ్యూల్‌లకు రెండు రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
'కేసీఆర్ గారు.. మీకో మంచి అవకాశం'
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ప్రశంసించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన 'ఓటుకు కోట్లు కేసులో కూడా ఇలానే ప్రవర్తిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది' అని అన్నారు. 'కేసీఆర్ గారు.. ఇది మీకు మంచి అవకాశం' అంటూ కితాబిచ్చారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. -
‘క్రాంతిసేన’పై పోలీసుల ఆరా
సాక్షి, హైదరాబాద్: ‘నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం. అందుకు సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను విడిచిపెట్టం’ అంటూ క్రాంతి సేన పేరిట మీడియా కార్యాలయాలకు వచ్చిన లేఖ పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట విడుదలైన ఈ ప్రకటనపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కమిటీ నిజమైనదేనా, లేక ఆకతాయిల పనా అనే కోణంపై దృష్టి సారించారు. లేఖలో ఒక అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నేరుగా, మిగతా వారిని షార్ట్‌కట్‌లో ప్రస్తావించారు. ప్రస్తావిత ఎమ్మెల్యేలు పీఎస్ఆర్, ఆర్ఎల్ఆర్, వీఆర్ఎం ఎవరనేది బహిరంగ రహస్యమే. వారి పేర్లు మీడియాలో కొంతకాలంగా తరచూ ప్రస్తావనకు వస్తున్నాయి. వీరిలో ఒకరు మెదక్, ఇద్దరు నల్లగొండ జిల్లాకు చెందిన వారు. దాంతో వారి భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు అధికార పార్టీకే చెందిన ఒక ఎంపీ వల్లే నయీమ్‌తో విభేదాలు తలెత్తి ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయనెవరనేది ఎక్కడా ఎలాంటి క్లూ ఇవ్వలేదు.అయినా ఆయనెవరనేది పోలీసులకు స్పష్టత ఉండటంతో ఆయనకూ భద్రతను కట్టుదిట్టం చేశారు. క్రాంతిసేన పేరిట వచ్చిన లేఖను సీరియస్‌గానే తీసుకుంటున్నామని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్టయిన నయీమ్ అనుచరుల నుంచి ఈ లేఖ గురించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధాన అనుచరుల కోసం గాలింపు మరోవైపు నయీమ్ ప్రధాన అనుచరుల కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నయీమ్ కుడిభుజం శేషన్నతో పాటు ప్రతి జిల్లాలోనూ ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. వారిని పట్టుకుంటేనే డొంకంతా కదలవచ్చని భావిస్తున్నారు. మరోవైపు నయీమ్ నేర సామ్రాజ్యంపై సిట్ దర్యాప్తులో పలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నయీమ్ తన అనుచరులతో పాటు డీల్ చేసే వ్యక్తులతో ఎంపిక చేసిన సెల్ నంబర్లతోనే సంప్రదింపులు జరిపేవాడని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు అతి నమ్మకస్తులుగా 60 మందిని ఏర్పాటు చేసుకొని వారితోనే వ్యవహరాలు నడిపేవాడు. వారితో ఒక్కొక్కరికి ఒక సెల్ నంబర్ వాడేవాడు. ఒకరి నంబర్‌తో మరొకరికి అస్సలు ఫోన్ చేసేవాడు కాదు. పుప్పాల్‌గూడ నివాసంలో దొరికిన 70 సిమ్ కార్డులపై ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఈ సిమ్‌లలో కొన్ని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, గోవా, కర్ణాటక చిరునామాతో ఉన్నాయి. ఆయా చిరునామాలున్న నివాసాలన్నీ నయీమ్వేనని పోలీసులు భావిస్తున్నారు. -
'నయీంను పెంచింది వాళ్లు.. అంతం చేసింది మేము'
నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిశోర్, ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని, ఇప్పుడు తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యామని గాదరి కిశోర్ చెప్పారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. అహంకార ధోరణితో తమపై నిరాధార ప్రేలాపనలు చేస్తున్నారని, పిచ్చికూతలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ప్రజలే బట్టలూడదీసి కొడతారని.. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇదే తమ హెచ్చరిక అని కిశోర్ అన్నారు. ఇక నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయని చెప్పడం వాళ్ల అవివేకం అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ పదేళ్లు పెంచి పోషించిన క్రూరమృగాన్ని అంతంమొందించింది ఎవరో అందరికీ తెలుసని, నయీం ముచ్చట వాళ్లు ఊరికే మాట్లాడుతున్నారని చెప్పారు. నయీంతో తమకు హాని ఉన్న విషయాన్ని నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆ నేతలే అన్నారని.. అలాంటి క్రూరమృగాన్ని అంతమొందించింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను ప్రజల మెప్పును పొందుతుంటే ఓర్వలేక ఇలా చెబుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకం లేదు గానీ అధికారుల మీద నమ్మకం ఉందని చెబుతున్నారని.. ఆ అధికారులను ఆ స్థానంలో పెట్టింది కేసీఆరేనని మర్చిపోకూడదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఎంతో హైప్ ఉన్న ప్రధానమంత్రి మోదీ కూడా కేసీఆర్ గురించి గొప్పగా ప్రశంసించారని, కేసీఆర్ ఇంత బాగా పనిచేస్తుంటే పచ్చకామెర్ల రోగిలా మాట్లాడుతుంటే బాధాకరమని ఆయన అన్నారు. మీకు హైప్ వచ్చిందో, అయిపోవచ్చిందో ప్రజలే ఆలోచించుకుంటారని, వాళ్లు చైతన్యవంతులని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమైనా అనుమానాలుంటే సిట్ అధికారులకు ఒక దరఖాస్తు ఇవ్వడమో, ఫోన్ చేసి చెప్పడమో చేయాలని సూచించారు. పొరపాటు ఎవరు చేసినా చట్టానికి అతీతులు కారని.. ఎవరు తప్పుచేసినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. -
'నయీంను పెంచింది వాళ్లు అంతం చేసింది మేము'
-
నయీం కేసులో విస్మయకర విషయాలు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసు విచారణలో పది రోజుల పసికందు విక్రయం బయటపడింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఏనెమీది తండాకు చెందిన దత్తు అనే వ్యక్తి మిర్యాలగూడలో ఉండే నయీం అత్త సుల్తానాకు పది రోజుల పసికందును విక్రయించినట్లు గుర్తించారు. దత్తు నుంచి కొనుగోలు చేసిన పసికందును సుల్తానా నయీంకు అప్పగించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆర్ఎంపీలు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నయీం పేరు కూడా వినలేదు: రిటైర్డ్ ఎస్పీ
తాను అసలు నయీం పేరు కూడా విన్నట్లు గుర్తులేదని రిటైర్డ్ పోలీసు అధికారి శివానందరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో తాను అతి తక్కువ కాలం మాత్రమే ఏఎస్పీగా పనిచేశానని, అది కూడా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కావడంతో శాంతిభద్రతల గురించి, తీవ్రవాదుల కార్యకలాపాల గురించి తనకు పెద్దగా తెలియదని ఆయన అన్నారు. 2003 వరకు తాను నల్లగొండ జిల్లాలో ఉన్నానని, అప్పటికి అతడిపేరు కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదని తెలిపారు. తాను సజ్జనార్, శివధర్‌రెడ్డి లాంటి అధికారుల వద్ద పనిచేశానని, వాళ్లు చాలా మంచి పేరు కలవారని.. వాళ్లకు నయీంతో సంబంధం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాను అడ్మినిస్ట్రేషన్‌లో ఉండటంతో ఇన్ఫార్మర్ల వ్యవస్థ గురించి పెద్దగా తెలియదన్నారు. అలాగే ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఎస్ఐలు, సీఐలలో 99 శాతం మందికి నయీంతో లింకులు ఉన్నాయంటే తాను నమ్మనని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉన్నట్లే పోలీసు శాఖలో కూడా ఒకరిద్దరు బ్లాక్ షీప్ ఉండొచ్చని, కానీ అంతమాత్రాన అందరి మీద ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. తన తండ్రి కాంగ్రెస్ నాయకుడని.. కానీ తనకు మాత్రం రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. టీడీపీ వాళ్లు నయీం విషయంలో తనకు ఎప్పుడూ ఫోన్లు చేయలేదని చెప్పారు. అయినా అప్పట్లో రాజకీయ నాయకుల మాట వినాల్సిన అవసరం జిల్లా ఎస్పీలకు ఉండేది కాదని, ప్రధానంగా ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలు చూసేవాళ్లకు ఆ అవసరం ఉండేది కాదని అన్నారు. తాను పదవీ విరమణ చేసి ఏడేళ్లవుతోందని, ఒక్క చానల్ లో మాత్రమే తన పేరు వచ్చిందని తెలిపారు. నల్లగొండలో పనిచేశానని తన పేరు బయటకు వచ్చి ఉండొచ్చేమో గానీ.. దాన్ని ఖరారు చేసుకుని ఉపయోగించాలని సూచించారు. తమ కుటుంబానికి రాజకీయ చరిత్ర కూడా కేవలం నందికొట్కూరులో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. -
5 రోజుల కస్టడీకి నయీం భార్య
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమాబేగంలను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి షాద్‌నగర్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. నయీం ఆగడాలకు సంబంధించిన విషయాలపై మరిన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. -
నయీమ్.. నన్ను బెదిరించాడు
రైతు గర్జన సభలో రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్ఎస్ నేతలకు నయీమ్‌తో సంబంధాలన్న కాంగ్రెస్ నేత కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు: దిగ్విజయ్ టీఆర్ఎస్ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ తనను ఎన్నోసార్లు బెదిరించాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నయీమ్ మనుషులు తన దగ్గరకు వచ్చి, పోటీ నుంచి తప్పుకోవాలంటూ హెచ్చరించారన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు గర్జన బహిరంగ సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నయీమ్ బెదిరింపులకు తాను బెదరలేదన్నారు. నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్ఎస్ నాయకులకు నయీమ్‌తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై నమ్మకం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘‘పోలీస్స్టేషన్లను, తహసీల్దార్ కార్యాలయాలను టీఆర్ఎస్ నేతలు తమ అధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారు. సీఎం చివరికి వయసు సరిపోతే తన మనవడికి కూడా ఎమ్మెల్సీ పదవిచ్చేలా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులున్నా అంతా ఏకమై ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నాం’’ అని అన్నారు. సంక్షోభంలో రైతన్న: దిగ్విజయ్ ఎన్నికల హామీల అమలులో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమవుతోందని సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. రెండున్నరేళ్ల పాలనలో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే. వాటి అంచనా వ్యయాలను భారీగా పెంచడంలో అవినీతి దాగుంది. ఈ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం’’ అని ప్రకటించారు. రైతులు పత్తి పండించవద్దని ముఖ్యమంత్రే చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే మల్లన్నసాగర్ భూ సేకరణ చేయాలన్నారు. దీనిపై హైకోర్టులో చుక్కెదురవడం సర్కారు పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్ పోరాటానికి మద్దతిచ్చే ముందు అంతర్గత శాంతిభద్రతలపై దృష్టి సారించాలన్నారు. దళితుల కంటే ముందు తనను కాల్చండనడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి దిగ్విజయ్ తన ప్రసంగంలో పలుమార్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలో సాగు, తాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సభలో పలుమార్లు కార్యకర్తలు వైఎస్సార్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతులు వలస కూలీలుగా ముంబై మురికివాడల్లో దయనీయ జీవితం గడుపుతున్నారని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు ఆవేదన వెలిబుచ్చారు. కాంట్రాక్టర్ రాజ్: ఉత్తమ్ ధ్వజం కాంగ్రెస్ పాలనలో రైతేరాజన్న ధ్యేయంతో పని చేస్తే, కేసీఆర్ సర్కారులో మాత్రం కాంట్రాక్టర్లే రాజాలుగా వర్ధిల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బలవంతపు భూసేకరణకు దిగితే సహించబోమని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే వెళ్లాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మంది రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి. 3 లక్షల మంది మహిళా రైతుల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయి. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అంచనాల్లో టీఆర్ఎస్ సర్కారు మాయ చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.26 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెంచిందని దుయ్యబట్టారు. ఏఐసీసీ కార ్యదర్శి కుంతియా, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, జి.చిన్నారెడ్డి, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కిగౌడ్, షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు సభలో పాల్గొన్నారు. 30న కాంగ్రెస్ నేతలకు శిక్షణ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఈ నెల 30న శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఆదిలాబాద్‌లో దిగ్విజయ్ అధ్యక్షతన నిర్వహించిన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. -
మమ్మల్ని నయీంతో హత్య చేయించేవారేమో!
-
నల్లగొండలో నయీంకు నాలుగు ఇళ్లు
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల నుంచి పోలీసులకు విస్మయకర సమాచారాలు లభిస్తున్నాయి. తవ్వేకొద్ది నయీం దురాగతాలు బయటపడుతూనే ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ అయిన రోజే నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన నయీం సోదరి(చిన్నమ్మ కూతురు) అస్మత్బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు తరలించారు. న్యాయస్థానం ఆమెను పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఆమెను విచారిస్తున్న పోలీసులు నయీంకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయని.. వాటితో పాటు కనగల్ మండలం పర్వతగిరి మండలంలో ఓ డెన్ ఉన్నట్లు గుర్తించారు. నల్లగొండలోని నాలుగు ఇళ్లలో ఆయన సమీప బంధువులు ఉంటుండగా.. పర్వతగిరిలోని ఇళ్లు మాత్రం ఖాళీగా ఉందని.. ఆ ఇంటికి అయిన సెటిల్మెంట్లకు, అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లడానికి మాత్రమే వినియోగించేవాడని తెలుస్తోంది. నయీం హత్య జరిగిన రోజు అస్మత్‌బేగం ఇంట్లో జరిపిన సోదాల్లో ఓ తుపాకి, ల్యాప్‌టాప్, వందలకొద్ది దస్తావేజులు లభించాయి. ఇప్పటివరకు నల్లగొండలో ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్ నయీం తమ్ముడు అలిమొద్దీన్ కూతురికి అస్మత్‌బేగం కొడుకుతో గతేడాది హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం ఘనంగా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పెళ్లికి నయీం కట్న కానుకలుగా రూ. 12 కోట్లు సమర్పించుకున్నట్లు సమాచారం. -
కరీంనగర్లో నయీం అనుచరులు అరెస్ట్
కరీంనగర్: గ్యాంగ్ స్టర్ నయీం గ్యాంగ్‌తో కలిసి భూదందాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు సిట్ అదుపులోకి తీసుకుంది. కరీంనగర్ జిల్లా నగునూర్‌కు చెందిన నర్సింగోజు గోవర్ధనాచారి అలియాస్ గోపి, కొరవేణి రమేష్‌లను శనివారం అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. భూదందాలతో పాటు, హత్యల్లో పాలుపంచుకున్నారా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. -
నయీంను చంపడం మంచిదే: దినేశ్ రెడ్డి
-
నయీంను చంపడం మంచిదే: దినేశ్ రెడ్డి
గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు ఏ డీజీపీ స్థాయి అధికారితోను సంబంధం లేదని మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. సంచలనం కోసమే ఇలాంటి ప్రచారం జరిగిందని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీంను చంపడం మంచిదేనని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చేస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన కొంత సున్నితమైన సమాచారాన్ని ఆయనకు అందిస్తానని చెప్పారు. పోలీసు శాఖలో డీజీపీ అంటే అత్యున్నత స్థాయి అధికారి అని, ఇన్ఫార్మర్లను వాళ్లు డీల్ చేయరని చెప్పారు. మహా అయితే డీఐజీ స్థాయి అధికారి మాత్రమే ఇన్ఫార్మర్లను వాడుకుంటారన్నారు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటారని, అందులో తప్పులేదని తెలిపారు. కానీ దాన్ని సొంత లావాదేవీల కోసం, ఆస్తులు సంపాదించుకోడానికి దుర్వినియోగం చేయడం సరికాదని చెప్పారు. నయీంను చంపడం మంచిదేనని, ఈ కేసులో ఉన్నవారందరినీ బయటకు తేవాలని దినేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంకా ఎవరున్నా కూడా వారిని తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, ఈ కేసుతో సంబంధం లేనివారిని ఇరికిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో కలీముద్దీన్ అనే వ్యక్తి కోసం మాత్రం సీబీఐ వెతికినట్లు తనకు తెలుసని, అంతే తప్ప నయీముద్దీన్ కోసం ఎవరూ రాలేదని తెలిపారు. తాను పార్టీ ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. సిట్ విచారణలో తేడా ఏమైనా వచ్చిందనుకుంటే అప్పుడు ఎన్ఐఏ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. ఇలాంటి కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. తనపై ఇంతకుముందు కొంత దుష్ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. గతంలో కూడా తాను డీజీపీ కాకముందు కేఎస్ వ్యాస్ పక్కన తాను ఉన్నానని, కాల్పులు జరిపానని ప్రచారం జరిగిందని, కానీ అసలు తాను ఆయన పక్కన లేనని చెప్పారు. వ్యాస్‌కు, తనకు మధ్య 400 గజాల దూరం ఉందని అన్నారు. అలాగే, తాను డీజీపీ కాకముందు శంషాబాద్ ప్రాంతంలో తనకు 1500 ఎకరాల భూములు ఉన్నట్లు నకిలీ పత్రాలతో ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. -
నయీంతో సిటీ మాజీమంత్రి చెట్టపట్టాలు?
నయీం కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొందరు పోలీసు ఉన్నతాధికారులు, పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నయీంతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈగ్యాంగ్స్టర్తో కలిసి ఎన్నో భూ దందాలు, సెటిల్మెంట్లు చేసినట్లు వార్తలొస్తున్నాయి. డైరీలో ఈ అంశాలను నయీం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తుండగా... ఆ మంత్రి ఎవరై ఉంటారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లోని దాదాపు 42 మంది అధికారులు నయీంకు సహకరించినట్లు సమాచారం. వారిలో ఎక్కువమంది ఉన్నతాధికారులే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ జాబితాలో 18మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని... వీరిలో సర్వీసులో ఉన్నవారు 9 మంది, రిటైరైనవారు 9 మంది ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలివారు కింది కేడర్ అని సమాచారం. డీసీపీ, ఏసీపీలుగా ఉన్నవారి నుంచి ఉన్నతస్థాయి వరకు నయీంకు తోడూ.. నీడగా నిలిచినట్లు సమాచారం. నక్సల్స్ వ్యవహారాలపై నిఘా పెట్టే స్పెషల్ ఇంటెలిజెన్స్‌లో పనిచేసి రిటైర్ అయిన వారిలో ఆరుగురు ఎస్పీ కేడర్ అధికారులకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా కేసీఆర్‌కు ఇచ్చిన నివేదికలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే, నయీం వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన కొందరు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. -
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
షాద్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్లో నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింVŠ జడ్జితో విచారణ చేయించాలని పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర కార్యదర్శి జయవింద్యాల డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్షిప్లో నయీం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకునేందుకు ఆంధ్రా పాలకులు నయీంను పావుగా వాడుకున్నారన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని అప్రూవల్‌గా మార్చి విచారించి ఉంటే బడా నేతల భాగోతం బయటపడేదన్నారు. నయీంను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌ఖాన్, జంట నగరాల ప్రధాన కార్యదర్శి సలీం, సభ్యుడు కష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో కొనసాగుతున్న బైండోవర్లు
యాదగిరిగుట్ట: గ్యాంగ్‌స్టర్ నయీం అలియాస్ నయీమొద్దీన్ ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లాలోని బైండోవర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు నయీంతో సంబంధాలు నెరిపిన ఛోటా నాయకుల నుంచి బడా రౌడీల వరకు మొత్తం 25 మంది అనుమానితులను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ నిర్వహించారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'నయీంతో ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలు'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీంకు, ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మోహన్‌రెడ్డి బాధిత సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎల్ఎండీ, పద్మానగర్, నగునూర్‌లో భూ సెటిల్మెంట్లను మోహన్ రెడ్డి నయీం ముఠాతో చేయించాడని తెలిపారు. బాధితులందరు కలిసి నయీం కేసును విచారిస్తున్న సిట్ బృందానికి శనివారం ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. మోహన్‌రెడ్డి వ్యవహారాలపై విచారణ జరిపితే నయీం ముఠాతో సంబంధాలు బయటపడతాయన్నారు. మోహన్‌రెడ్డి ఎక్కువగా దళితుల భూములనే అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని... దీనిపై త్వరలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలుస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామని సీపీఐ, లోక్‌సత్తా ప్రతినిథులు తెలిపారు. -
చంద్రబాబు పెంచిన నల్లతాచు నయీమ్ : సోలిపేట
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి * టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఆ రాక్షసుడు ఎదిగాడు * నన్ను చంపేస్తానని 2004, 2008ల్లో బెదిరించాడు * నేను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు * చాలా పనులను అప్పటి ప్రభుత్వం నయీమ్‌ను అడ్డుపెట్టుకుని చేయించింది సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరుడుగట్టిన నేరగాడు, గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెంచి పోషించిన బ్లాక్ కోబ్రా (నల్లతాచు) అని మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లుగా నయీమ్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారుల కనుసన్నల్లోనే ఈ రాక్షసుడు ఎదిగాడని చెప్పారు. రాజ్యాంగ పరిధిలో చేయలేని పనులను నయీమ్‌ను అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వం చేయించిందన్నారు. 2004లో ఒకసారి, 2008లో మరోసారి నయీమ్ తనను బెదిరించాడని తెలిపారు. 2004 ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాన న్నాడని చెప్పారు. 2008లో కూడా నయీమ్, అతని అనుచరులు తమ గ్రామం చిట్టాపూర్‌కు వచ్చి తనను చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారని, దీనిపై తాను అప్పట్లో సిద్దిపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. నయీమ్ అరాచకాలపై అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు సోలిపేట తెలిపారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో ఇద్దరిని, కొండపాకలో ఇద్దరిని నయీమ్ ముఠా కిడ్నాప్ చేసిందని, వారి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదన్నారు. నయీమ్ లాంటి నరహంతకుని పీడ విరగడ కావటం తెలంగాణ రాష్ట్ర సిద్ధి ఫలమే అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ప్రజలు కూడా పోలీసులకు అండగా నిలబడి వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచాలని సూచించారు. ఈ జీవితం నాకు బోనస్ ఇరవై ఏళ్ల కిందట గిరాయిపల్లి ఎన్కౌంటర్లోనే తాను అమరుడిని కావాల్సిందని, ఆ రోజు అదృష్టం బాగుండి బయటపడ్డానని సోలిపేట చెప్పారు. ఇప్పుడున్న ఈ జీవితం, ఎమ్మెల్యే పదవి తనకు బోనస్ లాంటివేనన్నారు. నయీమ్ లాంటి హంతకుల హెచ్చరికలు తనకు వెంట్రుకతో సమానమని, తనకు ప్రాణాలపై తీపి, డబ్బుపై ఆశ లేవని చెప్పారు. తాను సాధారణంగా గన్‌మెన్ లేకుండానే ప్రజల్లో తిరుగుతానని, అయితే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు ప్రస్తుతం ఒకే ఒక గన్‌మ్యాన్‌ను పెట్టుకున్నానని తెలిపారు. -
ఎన్ గ్యాంగ్ ఇదే!
* షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లతో జట్టుకట్టిన నయీమ్ * ముఠాలో మెజారిటీ నల్లగొండ జిల్లా వారే.. కీలకపాత్ర కుటుంబ సభ్యులది * ప్లాన్ వేసేది ఒకరు.. చంపేది మరొకరు.. లొంగిపోయేది ఇంకొకరు సాక్షి, హైదరాబాద్: భూదందాలు.. సెటిల్మెంట్లు.. బెదిరింపులు.. హత్యలు. సామాన్యులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు.. చివరికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులైనా సరే నయీమ్ గ్యాంగ్ లెక్క చేయదు. ఎవరైనా తమ మాట వినాల్సిందే. బెదిరించడం.. వినకపోతే కొట్టడం.. కాలో, చెయ్యో విరగ్గొట్టడం.. వినకపోతే చంపేందుకూ వెనుకాడకపోవడం గ్యాంగ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. ఏదై నా పక్కాగా ఉంటుంది. ఒకరు ప్లాన్ చేస్తారు.. మరొకరు వెళ్లి అమలుపరుస్తారు.. పోలీసు కేసయితే ఇంకొకరు వెళ్లి లొంగిపోతారు. అసలు వారికి నేరారోపణపై జైలుకు వెళ్లే వారికి సంబంధమే ఉండదు. ఈ ముఠాలో షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లు ఉంటారు. జెడ్పీటీసీల నుంచి కౌన్సెలర్ల వరకు ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. నయీమ్ కుటుంబ సభ్యులు కూడా క్రియాశీలకంగా పనిచేస్తారు. మొత్తంగా నయీమ్ గ్యాంగ్‌లో ఎక్కువగా నల్లగొండ జిల్లాకు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న అరెస్టులు, సోదాల్లో వెలుగు చూస్తున్న అంశాల ఆధారంగా చూస్తే.. నయీమ్ గ్యాంగ్ చాలా పకడ్బందీగా ఉందని వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్-గ్యాం గ్లో కీలక సభ్యులెవరు? వారి నేపథ్యమేమిటి? ఏం చేస్తుంటారనే దానిపై ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వర్గాల ద్వారా తెలుస్తున్న వివరాలివి.. శేషన్న మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. నయీమ్‌కు రైట్‌హ్యాండ్. గ్యాంగ్‌లో తర్వాతి లీడర్. నయీమ్‌తో కలసి శేషన్న స్కెచ్ వేశాడంటే తిరుగులేనట్టే. ఎన్కౌంటర్ తర్వాత శేషన్న పరారీలో ఉన్నాడు. సలీమా నయీమ్ దందాల్లో సలీమాది ప్రధాన పాత్ర. భువనగిరికి చెందిన ఆమె నయీమ్‌కు సోదరి. పలు యాక్షన్లకు స్కెచ్ వేసేది కూడా ఆమేనని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే ఆమెను అరెస్టు చేశారు. షకీల్ భువనగిరిలో నయీమ్‌కు ప్రధాన అనుచరుడు. పలు కిరాయి హత్యల్లో స్వయంగా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లాడు. వ్యాపారులను చంపుతానని బెదిరించడంలో దిట్ట. షకీల్‌పై పీడీ యాక్టు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి.. రెండు నెలల క్రితం శవమై ఇంటికి చేరాడు. అతడి భార్య జైనబున్నీసాబేగం ప్రస్తుత మున్సిపాలిటీలో కౌన్సెలర్, టీడీపీ నుంచి ఏకగ్రీవంగా గెలిచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. పాశం శ్రీను భువనగిరిలో నయీమ్‌కు మరో ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్ అలియాస్ పాశం శ్రీను. రియల్టర్లను, వ్యాపారులను గుర్తించి వారిని నయీమ్ వద్దకు తీసుకెళ్లడం, ఒప్పుకున్న మొత్తాన్ని వసూలు చేయడం ఇతడి పని. టీడీపీ నుంచి గతంలో కౌన్సెలర్‌గా గెలుపొందాడు. పీడీ యాక్టు నమోదు కావడంతో ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు. ఎండీ నాసర్ నయీమ్ మరో ప్రధాన అనుచరుడు ఎండీ నాసర్. స్థానికంగా సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. షకీల్, పాశం శ్రీనులతో సమానమైన స్థానం ఇతనిది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలను నడుపుతాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చే స్తాడు. సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. ప్రస్తుత మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సెలర్ గా గెలిచి టీఆర్ఎస్లో చేరాడు. అక్రమ అయుధాలు కలిగి ఉన్న కేసులో జైల్లో ఉన్నాడు. ఫహీమ్ నయీమ్ చిన్నమ్మ కొడుకు ఫహీమ్ది సంస్థాన్ నారాయణపురం. న యీం సోదరి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. అతని స్నేహితులంతా నయీమ్ వెంట తిరుగుతూ ఉండేవారు. పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన నీళ్ల శ్రీధర్‌గౌడ్, పున్న బలరాంలు కూడా ఫహీమ్ స్నేహితులే. ఫహీమ్ ఎనిమిదేళ్ల క్రితం వరకు చౌటుప్పల్ మండలం డి.నాగారంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా ముంబై సిట్ పోలీసులు గతంలో అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో దాదాపు 40మంది వరకు ఇలాంటి అనుచరులున్నారు. సందెల సుధాకర్ నయీమ్ మరో అనుచరుడు సందెల సుధాకర్. పీడీ యాక్టు కింద వరంగల్ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసాడు. శ్రీహరి హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నయీమ్‌కు చెందినదిగా బయటపడ్డ 67 ఎకరాల భూమి శ్రీహరి పేరున ఉన్నట్టు సమాచారం. శ్రీహరి కూడా సంస్థాన్ నారాయణపురం వాసి అని చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్టలోనూ వందల ఎకరాల్లో చేసిన వెంచర్లను ఇతనే దగ్గరుండి చూసుకుంటున్నట్టు చెబుతున్నారు. టమాటా శ్రీను హాలియాకు చెందిన శ్రీను నల్లగొండ పట్టణంలో కూరగాయల వ్యాపారం చేస్తాడు. టమాటా శ్రీనుగా గుర్తింపు పొందాడు. పేకా ట, సింగిల్ నంబర్ లాటరీ, భూసెటిల్మెంట్లు చేస్తాడు. పేరు కోసం నయీమ్‌కు ముఖ్య అనుచరుడిగా చలామణి అయిన యూసుఫ్ వెంట తిరిగాడు. యూసుఫ్ సొంతంగా సెటిల్మెంట్లు చేస్తుండటంతో నయీమ్ ముఠానే హత్య చేసింది. ఆ తర్వాత శ్రీను నయీమ్ సోదరికి అనుచరుడిగా మారాడు. మండలానికో ఇన్చార్జి నయీమ్ తన నేర సామ్రాజ్యంలో మండలానికో ఇన్చార్జిని నియమించుకున్నాడు. వారు ఆ మండలంలో బాగా రియల్ వ్యాపారం చేసే వారిని, బాగా డబ్బు సంపాదించే వారిని గుర్తించి నయీమ్‌కు సమాచారం ఇవ్వాలి. వీరితో పాటు నయీమ్ సోదరి, అత్త, బావమరిది.. ఇలా ఆయన కుటుంబ సభ్యులంతా గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించేవారు. -
ఆదిభట్లలోనూ నయీం ఆగడాలు!
నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లను బెదిరించి కోట్ల విలువైన భూములను ఈ ముఠా కొట్టేసినట్లు బయటకు వస్తోంది. ఇటీవలి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతంలో కూడా నయీం ముఠా ఆగడాలకు పాల్పడింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల ప్రాంతంలో తనకున్న 41 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు నయీం ముఠా ప్రయత్నించిందని బాధితుడు లయన్ లింగారెడ్డి 'సాక్షి'కి తెలిపారు. భూమి అప్పగించాలంటూ తనను బెదిరించారని, తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఆ 41 ఎకరాలను కబ్జా చేసేందుకు వాళ్లు ప్రయత్నించారని చెప్పారు. వందలమంది రౌడీలను తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టించారని, దాంతో తాను పోలీసులను ఆశ్రయించగా.. ఆ తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని లింగారెడ్డి అన్నారు. తన భూమిని కబ్జా చేయడమే కాక, తనమీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. ప్రోత్సహించింది ప్రభుత్వం, పోలీసులే కాగా నయీంను గత ప్రభుత్వాలు, పోలీసులే ప్రోత్సహించారని నయీం చేతిలో హతమైన బెల్లి లలిత సోదరి కవిత ఆరోపించారు. నయీం అనుచరులను కూడా హతమార్చాలని ఆమె డిమాండ్ చేశారు. నయీంకు సహకరించిన రాజకీయ నేతల అంతు కూడా చూడాలన్నారు. -
నయీంకు నేను ఫోన్ చేయలేదు
-
నయీంకు నేను ఫోన్ చేయలేదు: ఉమా మాధవరెడ్డి
► నా కాల్ లిస్ట్ బయటపెడితే విషయాలన్నీ తెలుస్తాయి ► తప్పుచేస్తే జైల్లో కూర్చోడానికి సిద్ధం ► ఈ వ్యవహారంపై సిట్ విచారణ మీద నమ్మకం లేదు ► జ్యుడీషియల్ విచారణ జరిపించాలి ► ప్రభుత్వ పెద్దలను కాపాడుకోడానికే మాపై బురద జల్లుతున్నారు ► అర్థం పర్థం లేని లీకులు ఎందుకిస్తున్నారో సీఎం చెప్పాలి ► నయీం మా ఇంట్లో ఆశ్రయం పొందాడో లేదో గన్‌మెన్‌ను అడగండి ► మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ► పేర్లు బయటకు వచ్చిన వాళ్లంతా టీఆర్ఎస్ మనుషులే: సందీప్ రెడ్డి హైదరాబాద్ నయీం వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, అధికార పార్టీలో ఉన్నవాళ్లు, కొందరు పెద్దలను కాపాడుకోడానికే తమ మీద బురద జల్లుతున్నారని మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. నయీం వ్యవహారంపై సిట్ విచారణ మీద తమకు నమ్మకం లేదని.. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. నిజంగా తాను తప్పుచేసినట్లు తేలితే జైల్లో కూర్చోవడానికి కూడా సిద్ధమన్నారు. నయీం ఫోన్ నుంచి తనకు గానీ, తన ఫోన్ నుంచి నయీంకు గానీ ఎలాంటి కాల్స్ వెళ్లలేదని, కావాలంటే కాల్ రికార్డులు మొత్తాన్ని బయటపెట్టి ఆరోపణలు రుజువు చేయాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ లీకులు రావని, వీటిపై ముఖ్యమంత్రి.. ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరారు. కేవలం తమకు సంబంధించిన వాళ్లను ఈ కేసు నుంచి బయట పడేసుకోడానికే తమను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. నయీం వ్యవహారంలో టీడీపీకి చెందిన ఒక మాజీమంత్రి హస్తం ఉందని, ఆ మంత్రి ఫోన్ నుంచి వందలాది కాల్స్ నయీంకు వెళ్లాయని కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆమె తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. నక్సలైట్లు మాధవరెడ్డిని హతమార్చారు కాబట్టి వాళ్ల మీద పగ తీర్చుకోడానికి వాళ్ల కుటుంబం నయీంను చేరదీసినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. మాధవరెడ్డి పేరు చెడగొట్టడానికి, ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడానికే ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలు చేపట్టిందని ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. తమకు నేరపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమది సౌమ్యమైన కుటుంబమని, ఇలాంటివాటిని ఎంటర్టైన్ చేయమని అన్నారు. మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే నెంబరు వాడుతున్నానని, దీని కాల్ డేటాను ప్రభుత్వం బయటపెట్టి దాన్ని పరిశీలించుకోవాలి తప్ప లేనిపోని లీకులు ఇచ్చి తమ పేరు చెడగొట్టడం సరికాదని ఆమె చెప్పారు. తాను ఎలా రాజకీయాలు చేశానో తెలంగాణలోనే కాదని... ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుసని అన్నారు. నక్సలైట్ల వల్ల తమ కుటుంబం చాలా బాధపడిందని, లీకులు చేసినవాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నయీం వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది పెద్దలను తప్పించడం కోసం సిట్ వేసి, వేరేవాళ్లను టార్గెట్ చేయడం సరికాదని ఉమా మాధవరెడ్డి అన్నారు. ఆ వ్యక్తి తనకు ఫోన్ చేయలేదు, తానూ అతడికి ఫోన్ చయలేదని స్పష్టం చేశారు. అయినా పత్రికలలో ఒక మాజీమంత్రి అంటూ పరోక్షంగా తనను ప్రస్తావించారని, జాతీయ మీడియాలో అయితే ఏకంగా ఉమా మాధవరెడ్డి అనే పేరు కూడా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాఫియాను ప్రోత్సహిస్తున్నామా, అప్పులిచ్చి గుంజుకుంటున్నామా, రియల్ఎస్టేట్ వ్యాపారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ కుటుంబానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి దానివల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, అందుకే జ్యుడీషియల్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ ఉందని, నయీం తమ ఇంట్లో ఆశ్రయం పొందాడా, వైద్యసేవలు పొందాడా అన్న విషయం అప్పటి గన్ మన్లను అడిగితే సరిపోతుందని చెప్పారు. మాధవరెడ్డి హోం మంత్రిగా ఉండటంతో.. నక్సలైట్లను లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని కోరిన విషయం వాస్తవమేనని.. అయినా, అలా లొంగిపోయిన వాళ్లతో లింకులు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు, తమకు ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను చంపించాలని తాను టార్గెట్ చేసినట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయని, అలా చంపించి రాజకీయాలు చేసేంత నీచ ప్రవృత్తి ఉందా అని అడిగారు. ఎన్నికల్లో ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని.. దాంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లి చూసుకుందామని ఊరుకున్నామని.. అలాంటప్పుడు తమమీద బురద జల్లడం ఎందుకని అడిఆరు. ఇందులో ప్రభుత్వ పాత్ర, పోలీసు పెద్దల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. నయీం విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకోవాలని, దాంతో తమకేం సంబంధమని ప్రశ్నించారు. భువనగిరిలో ఉన్నవాళ్లలో చాలామంది నయీం అనుచరులు ఉంటారని... తమ దగ్గరకు జనం వచ్చినప్పుడు వాళ్లలో ఎవరు నయీం మనుషులో, ఎవరు కాదో చూసుకుని పనులు చేయడం ఎలా కుదురుతుందని అడిగారు. వాళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లే నయీమ్ కేసులో బయటికొస్తున్న పేర్లన్నీ ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నవాళ్లవేనని మాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవాళ్లు ఈమధ్య మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్న 2004 వరకు భూదందాలు, సెటిల్మెంట్లు ఎక్కడా లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవన్నీ మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. నయీం రాశాడని చెబుతున్న డైరీ బయటపెడితే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. టీడీపీకి గానీ, తమ కుటుంబానికి గానీ దీంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇంకా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. నయీం నక్సలైటుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాలన్నింటిపైనా జ్యుడీషియల్ విచారణ జరపాలని తెలిపారు. పాశం శ్రీనుకు ఒకప్పుడు టీడీపీ బీ-ఫారం ఇచ్చాము గానీ అతడు ఓడిపోయాడని.. అది పదేళ్ల క్రితం నాటి మాట అని ఆయన అన్నారు. ఇప్పుడు అతడితో తమకు సంబంధం లేదని తెలిపారు. -
ఫర్హానా, అఫ్షాలకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి వంటమనిషి ఫర్హానా, నయీం డ్రైవర్ భార్య అఫ్షాలకు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఘర్హానా నిందితురాలు. దాంతో ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు నిందితుల కస్టడీ పిటిషిన్ దాఖలు చేశారు. నయీమ్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్షాలు డెన్ కీపర్లుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. నయీం డెన్ నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాగా, నయీం అంత్యక్రియలు నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ రోజు జరుగనున్నట్టు తెలుస్తోంది. -
పోలీసుల అదుపులో టీవీ రిపోర్టర్లు
నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతనితో చేతులు కలిపిన వారిపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. అందులోభాగంగా నల్లగొండ జిల్లా భువనగిరిలో నయీమ్‌కు అనుయాయులుగా ఉంటున్న ముగ్గురు టీవీ రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు నయీమ్ అండ చూసుకుని రూ.35 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సదరు టీవీ రిపోర్టర్లను సోమవారం రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
జిల్లాలో భూ దందాలు
పౌర హక్కుల నేత కనకాచారి, కానిస్టేబుల్ శ్రీనివాస్ హత్యలో నయీం హస్తం నల్లమల ప్రాంతంలో స్థావరం మహబూబ్‌నగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం భూదందాలు జిల్లాలోనూ కొనసాగాయి. 2004–05 ప్రాంతంలో నల్లమల ప్రాంతాన్ని స్థావరంగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా షాద్‌నగర్, కల్వకుర్తి, ఆమనగల్లు, అచ్చంపేట, మన్ననూర్ ప్రాంతాల్లో భూ దందాలు నిర్వహించినట్లు సమాచారం. ఒకవైపు పోలీసులకు గూడచారిగా పనిచేస్తూ మరోవైపు వ్యక్తిగతంగా ముఠా ఏర్పాటుచేసుకుని భూదందాలు, సెటిల్మెంట్లతో కరుడుగట్టిన నేరగాడిగా మారాడు. సహకరించే వాళ్లను దగ్గరకు తీస్తూ ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టడం అతని నైజం. జిల్లాలో మొదట నయీంపై వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు, పౌర హక్కుల సంఘం నేత కనకాచారిని 2005లో మహబూబ్‌నగర్ పట్టణం బాలాజీనగర్‌లోని ఇంటి వద్ద కిడ్నాప్ చేశాడు. అనంతరం మక్తల్ సమీపంలోకి తీసుకెళ్లి తుదముట్టించాడు. ఈ క్రమంలోనే అప్పటి పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చారెడ్డిని భయపెట్టినట్లు సమాచారం. అలాగే అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ సస్పెండ్ అయిన శ్రీనివాస్‌ను రియల్ ఎస్టేట్‌లో వచ్చిన ఆర్థికలావాదేవీల వల్ల నయీం గ్యాంగే హత్య చేసింది. వీటితోపాటు జిల్లాలో వెలుగులోకి రాని భూదందాలు, బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గ్యాంగ్‌ను తయారుచేసి భూదందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
జిల్లావ్యాప్తంగా తనిఖీలు
అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు పుష్కరాలకు ముందు కలకలం రేపిన ఎన్కౌంటర్ మహబూబ్‌నగర్ క్రైం : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాకేంద్రంతోపాటు సరిహద్దు ప్రాంతాల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టారు. నయీం ముఠాలోని వ్యక్తులు పరారీ అయ్యారని సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం జాతీయ రహదారిపై ఎక్కడిక్కడ వాహనాలను తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. పాలమాకుల, కొత్తూర్చౌరస్తా, షాద్‌నగర్–బైపాస్, జడ్చర్ల, కొత్తకోట, అలంపూర్–ఎక్స్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానితులను, వారి గుర్తింపుకార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నయీంకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పట్టణ పోలీసులు పాతపాలమూరు, కోయిలకొండ– ఎక్స్‌రోడ్, పాలిటెక్నిక్ కళాశాల ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు.. అయితే ఎక్కడ కూడా ఎవరూ పట్టుబడలేదని సమాచారం. ఇదిలాఉండగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల ప్రారంభానికి మూడురోజుల ముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఇటు జిల్లా ప్రజల్లో, అటు పోలీసుల్లో కలకలం రేగుతోంది. పుష్కరాలకు అశేషంగా భక్తులు రానున్నందున మరింత భద్రత పెంచునున్నట్లు సమాచారం. రాబోయో రోజుల్లో నయీం ముఠా ఏమైనా చర్యలకు పాల్పడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం పుష్కరాలు ముగిసే వరకు భారీ నిఘా ఏర్పాటు చేయనుంది.