నయీం కేసులో పలువురికి కస్టడీ
Published Thu, Sep 8 2016 12:51 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నయీం అనుచరులను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. తాజాగా చర్లపల్లి జైల్లో ఉన్న నయీం అనుచరులు సమీరుద్దీన్, శ్రీధర్‌గౌడ్‌లను 9 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా సంజీవ్‌రెడ్డి, శ్రీహరిలకు నాలుగు రోజులు, అబ్దుల్ ఫహీం, సామ్యూల్‌లకు రెండు రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Advertisement
Advertisement