మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి వంటమనిషి ఫర్హానా, నయీం డ్రైవర్ భార్య అఫ్షాలకు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది.
హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి వంటమనిషి ఫర్హానా, నయీం డ్రైవర్ భార్య అఫ్షాలకు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఘర్హానా నిందితురాలు. దాంతో ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు నిందితుల కస్టడీ పిటిషిన్ దాఖలు చేశారు.
నయీమ్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్షాలు డెన్ కీపర్లుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. నయీం డెన్ నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాగా, నయీం అంత్యక్రియలు నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ రోజు జరుగనున్నట్టు తెలుస్తోంది.