లైంగిక ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని ఆయన్ను అనేక ప్రశ్నలతో పోలీసులు విచారణ జరిపారు. ఈనెల 25వ తేదీ నుంచి జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు విచారించారు. నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన్ను మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, జానీ మాస్టర్‌ను మరోసారి విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరలేదు.
పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలితో తనకు ఉన్న సంబంధం ఏంటి..? ఆమెతో మొదట ఎలా పరిచయం అయింది..? ఆ యువతి ఇచ్చిన ఆధారాలను జానీ మాస్టర్ ముందు ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నాలుగు రోజులపాటు అతడిని విచారించిన నార్సింగి పోలీసులు..
అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను మైనర్‌గా ఉన్నప్పడే ఈ ఘాతుకానికి జానీ పాల్పడినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. అక్టోబర్ 3న జానీ మాస్టర్ రిమాండ్ గడువు ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment