కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం జానీ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దానిని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బెయిల్ ప్రకటన రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.
జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అవకాశాల పేరుతో తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో పోక్సో కేసుగా నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. అక్టోబర్ 25న చంచల్‌గూడా జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల కానున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment