
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
హర్షసాయి హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం కాపీరైట్స్ విషయంలో విభేదాలు రావడంతో ఆ యువతిని టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచించి నగ్న చిత్రాలు తీశాడని ఆమె తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు.
కేసు నమోదు అయినప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. నేడు తన పిటీషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment