పరారీలో హర్షసాయి.. లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు | Lookout Notice Issued To Youtuber Harsha Sai, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

Harsha Sai Case: పరారీలో హర్షసాయి.. లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు

Oct 5 2024 1:02 PM | Updated on Oct 5 2024 1:43 PM

Lookout Notice Issue To Harsha Sai

తెలుగు యూట్యూబర్‌ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్‌ చేశాడని కొద్దిరోజుల క్రితం నార్సింగ్‌ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. దీంతో గత కొద్దిరోజులుగా హర్షసాయి పరారీలో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

యువతి ఫిర్యాదుతో హర్షసాయిని అరెస్ట్‌ చేసేందుకు నార్సింగ్‌ పోలీసులు పలుచోట్ల గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి నటిస్తున్న 'మెగా' సినిమా కాపీ రైట్స్ కోసమే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్షసాయి కోసం నార్సింగ్‌ పోలీసులు  గాలిస్తున్నారు. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ గతంలోనే పోలీసులకు బాధితురాలు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement