మాట్లాడుతున్న పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింద్యాల
షాద్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింVŠ జడ్జితో విచారణ చేయించాలని పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర కార్యదర్శి జయవింద్యాల డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు.
షాద్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింVŠ జడ్జితో విచారణ చేయించాలని పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర కార్యదర్శి జయవింద్యాల డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకునేందుకు ఆంధ్రా పాలకులు నయీంను పావుగా వాడుకున్నారన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని అప్రూవల్‌గా మార్చి విచారించి ఉంటే బడా నేతల భాగోతం బయటపడేదన్నారు. నయీంను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌ఖాన్, జంట నగరాల ప్రధాన కార్యదర్శి సలీం, సభ్యుడు కష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.