sitting judge
-
కల్కి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సాక్షి, తిరుపతి: కల్కి భగవాన్ అక్రమాస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సత్యవేడు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న కల్కి ఆశ్రమం వ్యవస్థాపకుడు విజయ కుమార్ నాయుడు, పద్మావతిని కస్టడీలోకి తీసుకోవాలన్నారు. ఆశ్రమం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టాలన్నారు. కల్కి ఆశ్రమానికి ఉన్న బినామీలు ఎవరో నిగ్గు తేల్చి నిజనిజాలు బయటపెట్టాలన్నారు. హవాలా మార్గం ద్వారా వచ్చిన విదేశీ సొమ్ము లోగుట్టు వెలికితీయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. -
‘ప్రణయ్’ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మిర్యాలగూడ టౌన్ : ప్రణయ్ హత్య కేసును హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెల్తుల మల్లయ్య, యామల సుదర్శనం డిమాండ్ చేశారు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్ నివాసం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ‘కులాంతర ప్రేమ వివా హాలు–కులదురహంకార హత్యలు–నివారణ పరి ష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా నేటికీ అంటరానితనం పోలేదని, ఎక్కడో ఒక చోట ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాటిని నియంత్రించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కులాంతర, మతాంతర వివాహాలను చేసుకున్న వారికి రక్షణగా ప్రత్యేక చట్టాలను తీసుకురా వాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కాస్ట్‌కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా దుర్మార్గంగా హత్య చేయించారని అన్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి) ప్రణయ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిం చేం దుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నా రు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, మారుతీరావు ప్రణయ్ హత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడాడో మారుతీరావు ఫోన్ కాల్ డేటా ప్రకారం దర్యాప్తు చేపట్టాలని చె ప్పారు. అందుకు సంబంధించిన వారిపై కూడా కేసులను నమోదు చేయాలని, హత్యతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరంజ్యోతిరావు, శివరాజు, అశోక్, కాంతయ్య, పేరుమళ్ల నర్సింహారా వు, జిల్లా అధ్యక్షులు కామర్ల జానయ్య, నగేష్, సోమరాజు, వెంకటరత్నం, స్వామి, కోటయ్య, దేవయ్య, ఏడుకొండలు, రవి, జోజి, విజయ్‌కుమార్, మట్టయ్య, రాజు, మల్లయ్య, బాలస్వామి, నాగయ్య, బెంజమన్, రాజరత్నం ఉన్నారు. (అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు) చదవండి: ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! ‘ప్రణయ్’ నిందితులను ఉరితీయాలి మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
కర్నూలు సిటీ: కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములుగౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేట్ యాజమాన్యాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో ఇప్పటిæ వరకు 36 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వం యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో ఫీజు కట్టని విద్యార్థిని యాజమాన్యం బయటకు పంపినా ఆ సంస్థ గుర్తింపును రద్దు చేశారని, ప్రస్తుతం విద్యార్థు«లు చనిపోతున్నా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నియమించిన నీరజారెడ్డి, చక్రపాణి కమిటీలు ఇచ్చిన నివేదికలు, సిఫారుసులను అమలు చేయించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావులను తక్షణమే ప్రభుత్వం నుంచి వారిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు డీవీఈఓ సుబ్రమణ్యేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. నాయుకులు ప్రతాప్, రమేష్, ధనుంజయ, వీరశేఖర్, మనోజ్ పాల్గొన్నారు. -
ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి
♦ సీబీఐ అధికారుల తప్పటడుగు ♦ విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లబోయి ♦ సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగుపెట్టిన వైనం ♦ తప్పిదం గుర్తించి వెంటనే నిష్క్రమణ ♦ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం భువనేశ్వర్ : అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా సీబీఐ బృందాలు రాష్ట్రంలో పలు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి పూట కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక ఇల్లు బదులుగా మరో ఇంటిలోకి చొరబడి సీబీఐ గిరీ ప్రదర్శించారు. అంతే కథ అడ్డం తిరిగింది. అదో సిట్టింగు న్యాయమూర్తి అధికారిక నివాస భవనం. విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లబోయి సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగు పెట్టారు. తప్పిదం గుర్తించి వెంటనే సీబీఐ అధికారులు అక్కడ నుంచి నిష్క్రమించారు. బుధవారం ఉదయం సరికి ఈ సంఘటన ప్రసారం కావడంతో ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో సిట్టింగు ఎమ్మెల్యే ప్రభాత్ రంజన్ బిశ్వాల్ చిట్‌ఫండ్ మోసాల్లో నిందితునిగా అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు బృందం మంగళవారం రాత్రి కటక్ మహా నగరంలో 3 వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా సీబీఐ అధికారులు పొరపాటుపడ్డారు. విధుల బహిష్కరణ సీబీఐ అధికారుల తప్పటడుగుపట్ల ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై జుడీషియల్ దర్యాప్తు నిర్వహించాలని పట్టుబట్టింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒడిశా హై కోర్టు బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సమావేశంలో తీర్మానం మేరకు తక్షణమే విధుల్ని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విధుల బహిష్కరణ తదుపరి సర్వసభ్య సమావేశం తీర్మానం వరకు నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బార్ అసోసియేషన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తీర్మానం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. సీబీఐ చర్యల పట్ల అసంతృప్తిని వివరించేందుకు రాష్ట్ర హై కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిథి బృందం ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయింది. విషయాన్ని పూర్తిగా వివరించినట్టు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కాళీ ప్రసాద్ మిశ్రా తెలిపారు. జుడీషియల్ దర్యాప్తునకు డిమాండ్ అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా దాడులు నిర్వహించిన సీబీఐ బృందం రాష్ట్ర హై కోర్టు సిట్టింగు న్యాయమూర్తి సి.ఆర్.దాస్ ఇంట్లోకి చొరబడడం సంఘవిద్రోహంగా హై కోర్టు బార్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ఈ విచారకర సంఘటనపై హై కోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన జుడీషియల్ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. తప్పటడుగు వేసిన అధికారులు, సిబ్బందిని గుర్తించిన మేరకు వారి వ్యతిరేకంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో క్రిమినల్ ప్రొసీడింగ్సు చేపట్టాలి. బాధ్యుతలైన వారిని విధుల నుంచి సస్పెండు చేయడం అనివార్యంగా బార్ అసోసియేషన్ ప్రతిపాదించింది. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
♦ గౌరీ లంకేశ్ హత్యపై పాత్రికేయుల డిమాండ్ ♦ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ దారుణ హత్యపై కర్ణాటక ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం హైద రాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో గౌరీ లంకేశ్‌కు నివాళిగా భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేకచట్టం తేవాలన్నారు. గౌరీ లంకేశ్ హత్య పత్రిక, భావప్రకటనా∙స్వేచ్ఛపై దాడి అని, దేశంలో జర్నలిస్టులకే కాకుండా, సామాన్యుకూ రక్షణ లేదని అన్నారు. గోవింద్ పర్సారే, నరేంద్ర దబోల్కర్, కల్బుర్గీ.. ఇప్పుడు గౌరీ లంకేశ్ హత్యలకు ఒకటే కారణం కనిపి స్తోందన్నారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐజేయూ నాయకుడు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆశీసులతో వచ్చిన మత శక్తులే ఈ హత్యకు కారణమన్నారు. ప్రశ్నించేవారికి రక్షణ కరువైంది... ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ గౌరీ లంకేశ్‌ని కాల్చినట్లే గురువారం బిహర్లో కూడా ఓ జర్నలిస్టుపై కాల్పులు జరి పారని అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడే వారి మీద దాడులు ఎక్కువ య్యాయని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామి కవాదులు దీన్ని సవాలుగా తీసుకొని, ప్రతిఘ టించాలని సూచించారు. దేశంలో ప్రశ్నించే వారికి రక్షణ కరువైందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ విలువల కోసం పోరాడిన పాత్రికేయురాలని కొనియా డారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హను మంతరావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్ దిలీప్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాజమౌళిచారి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ‘‘విశాఖలో రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై వేల ఎకరాలు కబ్జా చేశారు.. ఇంత భారీ కుంభకోణంపై విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. విచారణ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే వాస్తవాలు వెల్లడవుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. శర్మ మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. రెవెన్యూ రికార్డులు తారుమారవుతున్న విషయాన్ని సరిగ్గా ఏడాది క్రితమే తనతోపాటు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు, రవికుమార్ కలసి గుర్తించామని తెలిపారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పది కేసుల్లో ఇలా రికార్డులు ట్యాంపర్ అయినట్టుగా గుర్తించామన్నారు. ఈ విషయాన్ని అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. వెబ్‌ల్యాండ్ పేరుతో ల్యాండ్ రికార్డులను ఆన్‌లైన్‌తో పొందుపర్చే ప్రక్రియ సమయంలోనే ఈ భూబాగోతం జరిగిందని, ఈ భూకబ్జాలకు అమరావతిలో బీజం పడిందని శర్మ అన్నారు. -
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
హైదరాబాద్: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిం చాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్కౌంటర్ ఘటనపై నిజనిర్ధారణ వివరాలను వెల్ల డించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను, ప్రజలను విచారించి వాస్త వాలను తెలుసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారం తెలుసుకుని వారిని మట్టుపెట్టాలనే లక్ష్యంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, అందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. పోలీసులు పథకం ప్రకారం పాశవికంగా కాల్చి చంపారని, మృతదేహాలను గుర్తుపట్టకుండా శవాలను ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలపై ఉక్కుపాదం మోపు తూ ప్రజల జీవన మనుగడను ప్రశ్నార్థకం చేస్తూనే, మరో పక్క అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏపీ గ్రే హౌండ్‌స దళాలను రద్దు చేయాలని, అటవీ ప్రాంతంలో మోహరించిన పారా మిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కూంబింగ్ ఆపరేషన్స పూర్తిగా నిలిపి వేసి అటవీ హక్కు, పంచాయతీ చట్టాలను అమలు చేయాలని, బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
షాద్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్లో నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింVŠ జడ్జితో విచారణ చేయించాలని పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర కార్యదర్శి జయవింద్యాల డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్షిప్లో నయీం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకునేందుకు ఆంధ్రా పాలకులు నయీంను పావుగా వాడుకున్నారన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని అప్రూవల్‌గా మార్చి విచారించి ఉంటే బడా నేతల భాగోతం బయటపడేదన్నారు. నయీంను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌ఖాన్, జంట నగరాల ప్రధాన కార్యదర్శి సలీం, సభ్యుడు కష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సిటింగ్ జడ్జితో విచారణ జరపాలి
డుంబ్రిగుడ: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో మృతి చెందుతున్న గిరిజన విద్యార్థులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని హాస్టల్లో ఉండి చదువుకుంటూ మృతి చెందిన బోయిన రాజ్‌కుమార్ కుటుంబాన్ని కురిడి గ్రామానికి వచ్చి ఆయన మంగళవారం పరామర్శించారు. గిరిజన విద్యార్థులు నిత్యం వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాజ్‌కుమార్ కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని..తక్షణమే వారి తల్లిదండ్రులకు అందజేయాలని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంతోనే విద్యార్థులు మృతి చెందుతున్నారని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని.. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి.సూర్యనారాయణ, పాంగి సురేష్ పాల్గొన్నారు. -
సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించే దమ్ముందా ?
కొమ్మాలపాటికి కావటి మనోహర్ సవాల్ పట్నంబజారు(గుంటూరు): పూర్తి నీతి నిజాయితీలతో సదావర్తి భూములు కొనుగోలు చేసి ఉంటే సీనియర్ సిట్టింగ్ జడ్జితోనూ, లేక రిటైర్డ్ జడ్జితోనూ దర్యాప్తు చేయించే దమ్ము ఉందా అని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు సవాల్ విసిరారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లాకార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల విషయంలో నిబంధనలకు తిలోదకాలిచ్చిన మాట వాస్తవం కాదా అని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ప్రశ్నించారు. భూములు ఆక్రమణలో ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసి, ఆలయ అభివృద్ధికి ఆ నిధులు వెచ్చించాలని కొమ్మాలపాటి లేఖ రాయడం నిజం కాదా అన్నారు. ఈ నెల 26వ తేదీన చెన్నైలో సదావర్తికి సంబంధించిన 83 ఎకరాలను వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో పరిశీలించామని తెలిపారు. స్థానికులను, అక్కడి ప్రజలను, మీడియా ప్రతినిధులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నామన్నారు. భూములను పూర్తిస్థాయిలో అక్రమంగా కొనుగోలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎకరం రూ.6.50 కోట్లు ఉందని చెప్పడం నిజం కాదా..? తమిళనాడు ప్రభుత్వమే రూ. 6.50 కోట్లు ఎకరం విలువ ఉందని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా, దేవాదాయ శాఖ భూములు విక్రయించాలంటే తప్పనిసరిగా హైకోర్టు అనుమతి అవసరమని, వాటిని కూడా బేఖాతరు చేసి కేవలం రూ. 28 లక్షలు చొప్పున భూములు కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికా బద్ధంగానే భూములు దోచుకునేందుకు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు. కొమ్మాలపాటి ఆఖరికి దేవుడి భూములను కూడా వదలడం లేదని ధ్వజమెత్తారు. భూములు నిజాయితీతో కొన్నారంటే బహిరంగ చర్చకు రాగలరా... అని ప్రశ్నించారు. స్పష్టంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారి బ్రమరాంబ వేలంపాటలో అక్రమాలు జరిగాయని చెప్పినప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి, సీఎం ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్సీపీ సేవాదళ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తాచిన్నపరెడ్డి, సయ్యద్ మాబు, పార్టీనేతలు తేలుకుట్ల శ్రీకాంత్, పాలపాటి రఘు, బసవపూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
నా కుమారుడిది హత్యే
♦ రోహిత్ తండ్రి వేముల మణికుమార్ ♦ సుప్రీంకోర్టు సిటింగ్‌జడ్జితో విచారణ జరిపించాలి ♦ మాది ముమ్మాటికీ వడ్డెర కులమే విజయవాడ(గాంధీనగర్): ‘‘సెంట్రల్ యూనివర్సిటీ నా పెద్దకుమారుడిని బలితీసుకుంది. నా పిల్లవాడు చచ్చిపోయేంత పిరికివాడు కాదు. ఇది కచ్చితంగా హత్యే, ఆత్మహత్య కాదు’’ అని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ తండ్రి వేముల మణికుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రోహిత్ న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరూ చనిపోయిన తన కుమారుడి గురించి ఆలోచించట్లేదని, కేవలం కుల, శవ రాజకీయాలు చేస్తున్నారని మణికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. నేను, నా భార్య వడ్డెర కులస్తులమే.. తమ ఇంట్లోనే తాను వడ్డెర అని చెబుతుంటే.. తన భార్యాపిల్లలు మాల కులమని చెబుతున్నారని, మాల ఎలా అయ్యారంటే రకరకాల కారణాలు చెబుతున్నారని ఆయన వాపోయారు. తాను వడ్డెర కులస్తురాలినే పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. తన భార్య రాధిక తన మనసులో మాట చెబుతోందో? బయటినుంచి వచ్చిన ఆదేశాల మేరకు చెబుతుందో? అర్థం కావట్లేదని ఆయనన్నారు. ముమ్మాటికీ తాము వడ్డెర కులస్తులమేనని ఆయన స్పష్టం చేశారు. దెయ్యాల నిలయాలుగా మారాయి రోహిత్ దళితులు, బీసీలు, ఓసీలకోసం చావలేదని, యూనివర్సిటీ వేధింపులే కారణమని మణికుమార్ అన్నారు. సస్పెండైన ఐదుగురు దీక్ష చేస్తుంటే తన కుమారుడు ఒక్కడే ఎందుకు చనిపోయాడు? మిగిలినవారు ఎందుకు తప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. రోహిత్‌ను చంపి ఉరివేశారన్న ఆనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యే ప్రధానంగా, దేవాలయాల మాదిరి ఉండాల్సిన యూనివర్సిటీలు దెయ్యాలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ సంగం మాట్లాడుతూ.. రోహిత్ మృతి అనుమానాలకు తావిస్తోందన్నారు. అంబేడ్కర్ విద్యార్థి సంఘం, ఏబీవీపీ, రోహిత్‌తో కలసి ఉంటున్న నలుగురు స్నేహితులతోపాటు దత్తాత్రేయ, స్మృతిఇరానీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. -
సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించండి
-
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: వికారుద్దీన్, అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడమే కాకుండా అవమానకర పద్ధతిలో చెత్తవాహనంలో తరలించడాన్ని సీపీఎం ఒక ప్రకటనలో ఖండించింది. ఈ చర్యకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
-
'కేసీఆర్ బ్లాక్‌మెయిల్‌కు భయపడొద్దు'
-
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
అల్లర్లపై గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని సిక్చావ్ని ప్రాంతంలో జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని మాజీమంత్రి దానం నాగేందర్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌తో కలిసి గురువారం దానం గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తనకు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకోవడంతోపాటు జరిగిన ఘటనపట్ల సానుభూతి వ్యక్తం చేశారని చెప్పారు. మరోవైపు టీపీసీసీ కిసాన్- ఖేత్ మజ్దూర్ యూనియన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి గురువారం గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌ను కలిసి తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరారు. విత్తనం కొరత లేకుండా సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సరఫరా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
'కేసీఆర్ బ్లాక్‌మెయిల్‌కు భయపడొద్దు'
హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ సిక్ ఛావనీ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో దానం నాగేందర్ మాట్లాడుతూ... శుక్రవారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దానం ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగు జిల్లాలకే పరిమితమైన పార్టీ దానం ఈ సందర్బంగా గుర్తు చేశారు. కేసీఆర్ బ్లాక్‌మెయిల్‌కు సెటిలర్లు, అధికారులు భయపడొద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణలో సెటిలర్లు, అధికారుల రక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని దానం స్పష్టం చేశారు.