'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు' | Don't fear on kcr blackmail, says Danam Nagender | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు'

Published Thu, May 15 2014 1:12 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు' - Sakshi

'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు'

హైదరాబాద్లోని కిషన్బాగ్  సిక్‌ ఛావనీ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో దానం నాగేందర్ మాట్లాడుతూ... శుక్రవారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దానం ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగు జిల్లాలకే పరిమితమైన పార్టీ దానం ఈ సందర్బంగా గుర్తు చేశారు. కేసీఆర్ బ్లాక్మెయిల్కు సెటిలర్లు, అధికారులు భయపడొద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణలో సెటిలర్లు, అధికారుల రక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని దానం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement