కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మరో 15 మంది! | KCR Criticize On Congress | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు వెళ్దామా?

Published Mon, Jun 25 2018 1:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

KCR Criticize On Congress - Sakshi

ఆదివారం తెలంగాణ భవన్‌లో దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో తలసాని, పద్మారావు, నాయిని, మహమూద్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీ యాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు కూడా దూరంగా లేదు.. దగ్గర్లోనే ఉంది...అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం మాజీ మంత్రి దానం నాగేందర్‌ తెలంగాణ భవన్‌కు వచ్చి సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్‌ నేతలు చెప్పరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్‌కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్సే గెలిచింది. కాంగ్రెస్‌ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు.

ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్‌ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్‌ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్‌ కాలేదని చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్ది ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్‌ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడ పోయాడని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ను ఇంకా వస్తారు
టీఆర్‌ఎస్, మజ్లిస్‌ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్‌ఎస్‌కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. ‘‘దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్‌ఎస్‌ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్‌ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని కేసీఆర్‌ గుర్తుచేశారు.

హైదరాబాద్‌ను మురికి కుంటగా మార్చారు
మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్‌కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్‌ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం.

తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం అని అన్నారు. సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు.

‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్‌ నేతలు చెప్పరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్‌కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్సే గెలిచింది. కాంగ్రెస్‌ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్‌ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్‌ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్‌ కాలేదని చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్‌ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడకు పోయాడని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను మురికి కుంటగా మార్చారు
మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్‌కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్‌ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. ‘‘అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం’’ అని అన్నారు. 

కాంగ్రెస్‌ నుంచి ఇంకా చాలా మంది వస్తారు

టీఆర్‌ఎస్, మజ్లిస్‌ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్‌ఎస్‌కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్‌ఎస్‌ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్‌ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

దానంకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుతున్న కేసీఆర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement