Mahamad ali
-
మైనింగ్ పేరుతో టోకరా!
పంజగుట్ట: మైనింగ్‌లో లాభాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మాజీ మంత్రి సీనియర్ కాగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏకే ఖాన్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. టౌలీచౌకీకి చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ వాహబ్కు జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి మోహ్సిన్ ఖాన్ పరిచయం ఉంది. మోహ్సిన్ ఖాన్ తనకు బంజారాహిల్స్‌లో సన్‌లిట్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రిజిస్టర్ సంస్థ ఉందని దానికి తానే ఎండీనని చెప్పాడు. తపస్వీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఖమ్మ జిల్లా, రామానుజవరంలో 46 ఎకరాల్లో ఇసుక మైనింగ్ టెండర్ దొరికిందని, ఆ సంస్థతో తమ సంస్థ 25 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. 25 శాతం వాటాలో సుమారు రూ.6.5 కోట్లు లాభం వస్తుందని అబ్ధుల్ వాహబ్‌ను నమ్మించాడు. రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపించాడు. తనతో చేతులు కలిపితే నీకు 50 శాతం వాటా ఇస్తానని అందుకుగాను రూ.90 లక్షలు చెల్లించాలని కోరాడు. మోహ్సిన్ ఖాన్ చెప్పిన మాటలు అబ్థుల్ వాహబ్ నమ్మక పోవడంతో తన మామ జూబ్లీహిల్స్‌కు చెందిన రాజకీయ నాయకుడు మొహ్మద్ అలీ షబ్బీర్‌ను (షబ్బీర్ అలీ)ని పరిచయం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా చేయడంతో బాధితుడు అబ్థుల్ వాహబ్ అతడిని గుర్తుపట్టాడు. కుందన్‌బాగ్‌లో ఉంటున్న మాజీ పోలీస్ ఉన్నతాధికారి అబ్థుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్)ను కూడా అతడికి పరిచయం చేశాడు. దీంతో అబ్థుల్ వాహబ్ అతడి మాటలు నమ్మి 2016లో బ్యాంకు ద్వారా, నగదు ద్వారా రూ.90 లక్షలు చెల్లించాడు. సంవత్సరాలు గడుస్తున్నా లాభం ఇవ్వకపోగా మొహం చేయడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోహ్సిన్ ఖాన్ బాధితుడిని బెదిరించడం, తప్పించుకుని తిరగడం చేస్తుండడంతో బాధితుడు నాంపల్లి కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలమేరకు పంజగుట్ట పోలీసులు మోహ్సిన్ ఖాన్, మొహ్మద్ అలీ షబ్బీర్, అబ్థుల్ ఖయ్యూం ఖాన్‌లపై 465, 420, 406, ఐపీసీ రెండ్‌విత్ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (చదవండి: సెల్‌ఫోన్ వాడడు..సీసీ కెమెరాకు చిక్కడు..శ్మశానంలోనే తిండి నిద్ర) -
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మరో 15 మంది!
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్ఎస్ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీ యాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు కూడా దూరంగా లేదు.. దగ్గర్లోనే ఉంది...అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ భవన్‌కు వచ్చి సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్‌కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ కాలేదని చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్ది ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడ పోయాడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఇంకా వస్తారు టీఆర్ఎస్, మజ్లిస్‌ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్ఎస్కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. ‘‘దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని కేసీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్‌ను మురికి కుంటగా మార్చారు మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్‌కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్‌ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం అని అన్నారు. సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్‌కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ కాలేదని చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడకు పోయాడని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను మురికి కుంటగా మార్చారు మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్‌కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్‌ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. ‘‘అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం’’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా చాలా మంది వస్తారు టీఆర్ఎస్, మజ్లిస్‌ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్ఎస్కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. -
రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రైల్వే శాఖ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌తో అన్ని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త రైల్వే మార్గాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.9,830 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. దక్షిణమధ్య రైల్వేలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ రాంచందర్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ దక్షిణమధ్య రైల్వేలోని అన్ని చోట్ల 54 వేల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల ఏటా రెండు మిలియన్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా ఏటా 1,800 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు. అలాగే విద్యుత్‌పైన చేసే ఖర్చులో రూ.1.7 కోట్లు మిగులుతుందన్నారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 90 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. దీంతో రూ.45 వేల కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంధన వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకుప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. కాచిగూడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ వల్ల ఏటా మరో రూ.21.66 లక్షలు ఆదా అవుతుందన్నారు. పర్యావరణహితమైన బయో టాయిలెట్ల ఏర్పాటును ప్రశంసించారు. నాలుగో వంతెనకు శంకుస్థాపన ప్రతిరోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200 రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు రూ.8.8 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన నాలుగో వంతెనకు మంత్రి పీయూష్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మూడు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకటి నిజాం కాలంలో సుమారు వందేళ్ల క్రితం కట్టించిన వంతెన. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వంతెన ఇరుకైపోవడం.. మిగతా రెండింటిపైనే ఎక్కువ ఒత్తిడి ఉండటంతో నాలుగో వంతెనను నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ వంతెన పూర్తయిన తరువాత పురాతన వంతెనను తొలగిస్తారు. కాచిగూడ–నిజామాబాద్ రైలు కరీంనగర్‌కు పొడిగింపు కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ–నిజామాబాద్ రైలును కూడా పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి స్టేషన్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే టెర్మినల్ పనులను త్వరలో ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ స్టేషన్లో మల్టీలెవల్ కారు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ఏర్పాటు చేసిన అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రారంభించారు. కొత్త గనులకు వేగంగా అనుమతులు: పీయూష్ రాష్ట్రంలో కొత్త గనులకు సత్వరమే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సింగరేణి నూతన ప్రాజెక్ట్‌లు, వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సింగరేణి భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ అభివృద్ధిపై సీఎండీ శ్రీధర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ జాతీయ స్థాయిలో ఆ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొత్త బ్లాకులు కేటాయించవల్సిందిగా చైర్మన్ కోరగా పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి: కవిత 60 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రిని కోరారు. రైల్వే లో దివ్యాంగుల కోటాను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచే దాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోటా పెంపు వల్ల దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్ అయిన నిజామాబాద్ స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలను పెంచాలని కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. దీనికయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. -
మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వ కృషి
బాన్సువాడ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, సంక్షేమ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం బాన్సువాడలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ లౌకికవాది అని, దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముస్లింలకు రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్విందుతో పాటు నిరుపేదలకు దుస్తులు అందజేస్తున్నారన్నారు. ఇఫ్తార్ విందుల్లో పార్టీలకు, కులమతాలకు అతీతంగా వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనడం తెలంగాణ సంస్కృతి కి నిదర్శనమన్నారు. మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్రప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున భృతి చెల్లిస్తుందని, షాదీముబారక్‌తో పేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో 206 మైనారిటీ గురుకులాలను ప్రారంభించామని, మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు నాసా సదస్సులో తమ ప్రదర్శనలు చూ పారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ముస్లిం ల అభ్యున్నతికి మంత్రి కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు.. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్నది రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రె డ్డి అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చిస్తుంద న్నారు. అనంతరం తెలంగాణాలో వర్షాలు బాగా కు రవాలని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందా లని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, రైతు స మన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నార్ల సురేష్ , పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, టీఆర్ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, అలీముద్దీన్ బాబా,వహీద్, ఖవీ చావుస్,రిజ్వాన్, ఖయ్యూం నిషాత్, ముఖీద్, పాతబాలకృష్ణ, తన్‌జీముల్ మసాజిద్ అధ్యక్ష కార్యదర్శులు మునయిం, అబ్దుల్ వహాబ్, తహసీల్దార్ గోపి పాల్గొన్నారు. -
నకిలీ పాస్ పుస్తకాలు ఇస్తే పీడీయాక్ట్
సాక్షి, యాదాద్రి : నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి భువనగిరి మండలం హన్మాపురంలో జరిగిన రైతుబంధు పథకం సభలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రైతు కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రాపరిపాలన అంతా అంధేరి పాలనగా సాగిందన్నారు. మన ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 12వేల కోట్లు కేటాయించారన్నారు. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు చెక్కులు ఇస్తున్నామన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ సిబ్బంది 95 శాతం పూర్తి చేశారని అభినందించారు.100శాతం భూ వివాదాలు లేకుండా రికార్డుల ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం, పంటకు మద్దతు ధర ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ సమితి వేదికలకు రూ. 300ల కోట్లు కేటాయించామన్నారు. రూ.12 లక్షలతో ఒక మోడల్ రైతు వేదిక నిర్మిస్తామన్నారు. తెలంగాణ దేశంలోనే మోడల్రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. రైతు కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను తీరుస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించబోతున్నామన్నారు. ఇంతవరకు పాలించిన ప్రధానులు, ముఖ్యమంత్రులు రైతుల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. లక్షల అప్పులు రైతులకు మిగిల్చారని ఆరోపించారు. హన్మాపురం గ్రామంలో 555 రైతులకు రూ. 45.18.085 లక్షలను రైతు బంధు ద్వారా ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి దశదిశను చూపించే రైతుబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. 58 లక్షల మంది రైతులకు మొదటి విడతలో రూ.5,700ల కోట్లు, రెండవ విడతలో నవంబర్ 18న రూ. 5,700ల కోట్లు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతుల బీమాకోసం రూ. 500ల కోట్లు సీఎం కేటాయించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. రైతు బంధు చెక్కులు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. తనకు వచ్చే రైతు బంధు చెక్కుల మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇచ్చేస్తానన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, భూరికార్డుల ప్రక్షాళన రాష్ట్ర అధికారి వాకాటి కరుణ, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఢిల్లీలోనూ రాష్ట్రావతరణోత్సవాలు
టీఆర్ఎస్ నేత వేణుగోపాలచారి సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా జూన్ 2 నుంచి 7 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2వ తేదీ ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ హాలులో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు బతుకమ్మ బోనాలు, కళారూపాల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అలాగే రాజిరెడ్డి దంపతులతో కూచిపూడి నృత్యం, హైదర్బాద్ ఖవ్వాలి బ్రదర్స్‌తో ఖవ్వాలి, ఫ్లోరోసిస్ సమస్యపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
రంజాన్‌కు రూ.5 కోట్లు కేటాయింపు
సచివాలయంలో రంజాన్ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మసీదుల మరమ్మతులు, ఇతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రతి రోజు రెండుసార్లు చెత్త తరలింపు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, డీసిల్టింగ్, ఫాగింగ్లతోపాటు నిరంతరం విద్యుత్‌సరఫరా, మసీదులకు వెళ్లే రహదారుల మరమ్మతులు, అదనపు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే హైదర్ మహెల్లో అన్ని శాఖల అధికారులతో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కారిస్తామని వెల్లడించారు. రంజాన్ మాసంలో హోటళ్లు, దుకాణాలు రాత్రంతా తెరిచి ఉండే విధంగా అనుమతిస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు, రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.