టీఆర్‌ఎస్ నేత వేణుగోపాలచారి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కూడా జూన్ 2 నుంచి 7 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2వ తేదీ ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు.
తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ హాలులో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు బతుకమ్మ బోనాలు, కళారూపాల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అలాగే రాజిరెడ్డి దంపతులతో కూచిపూడి నృత్యం, హైదర్‌బాద్ ఖవ్వాలి బ్రదర్స్‌తో ఖవ్వాలి, ఫ్లోరోసిస్ సమస్యపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఢిల్లీలోనూ రాష్ట్రావతరణోత్సవాలు
Published Sun, May 31 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement