ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం తదితరులు
బాన్సువాడ : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, సంక్షేమ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం బాన్సువాడలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ లౌకికవాది అని, దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముస్లింలకు రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్‌విందుతో పాటు నిరుపేదలకు దుస్తులు అందజేస్తున్నారన్నారు.
ఇఫ్తార్ విందుల్లో పార్టీలకు, కులమతాలకు అతీతంగా వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనడం తెలంగాణ సంస్కృతి కి నిదర్శనమన్నారు. మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్‌లకు రాష్ట్రప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున భృతి చెల్లిస్తుందని, షాదీముబారక్‌తో పేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో 206 మైనారిటీ గురుకులాలను ప్రారంభించామని, మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు నాసా సదస్సులో తమ ప్రదర్శనలు చూ పారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ముస్లిం ల అభ్యున్నతికి మంత్రి కృషి చేస్తున్నారన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు..
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్నది రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రె డ్డి అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చిస్తుంద న్నారు. అనంతరం తెలంగాణాలో వర్షాలు బాగా కు రవాలని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందా లని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, రైతు స మన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నార్ల సురేష్ , పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, టీఆర్‌ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, అలీముద్దీన్ బాబా,వహీద్, ఖవీ చావుస్,రిజ్వాన్, ఖయ్యూం నిషాత్, ముఖీద్, పాతబాలకృష్ణ, తన్‌జీముల్ మసాజిద్ అధ్యక్ష కార్యదర్శులు మునయిం, అబ్దుల్ వహాబ్, తహసీల్దార్ గోపి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment