సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్‌లో సుమారు ఐదున్నర గంటల పాటు జిల్లా అధికారుల తో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ ద్యంతం ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. స మాచారం సేకరిస్తూ.. గద్దిస్తూ.. సముదాయిస్తూ.. ప్రోత్సహిస్తూ చేసిన సమీ క్ష అధికారుల్లో కదలిక తెచ్చింది.
ఆర్మూర్ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఏళ్ల తరబడి వివాదంగా ఉన్న రూ.10.83 కోట్ల ఎర్రజొన్నల బకాయిలను వారం రోజుల్లో చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రజొన్నల బకాయిల వివరాలపై జిల్లా కలెక్టర్ రొనాల్‌రాస్ శుక్రవా రం ఆరా తీశారు. తక్షణమే బకాయిలు చెల్లించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆ దేశించారు. అలాగే ఆర్మూర్, అంకాపూ ర్, నిజామాబాద్‌లలో మాట్లాడిన సందర్భంగా కురిపించిన సీఎం వరాల జాబి తాపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
ముఖ్యమంత్రి హోదాలో తొ లిసారిగా జిల్లాకు వచ్చిన కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించి జిల్లా ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నా రు. అయితే ఈ పథకాలను తూ.చ. త ప్పకుండా అమలు చేయడంలో భాగం గా సాగునీరు, వైద్యం, పర్యాటక, కనీస సౌకర్యాల కల్పనలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే దసరా,
దీపావళి పండగల మధ్యలో వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొ ప్పున పింఛను అందజేయనుండగా, ఆ జాబితాను తయారు చేయాలని కలెక్టర్ ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ), బైపాస్ రోడ్డును పూర్తి చేయడంతో పా టు నగరంలో రోడ్ల విస్తరణ, స్లాటర్‌హౌజ్‌లు, రైతుబజార్ల ఏర్పాటుకు ప్లాన్ సిద్ధం చేసే పనిలో నిజామాబాద్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు.
సాగునీటి ప్రాజెక్టుల విస్తరణపై కసరత్తు...
వినీతి పరుల భరతం పట్టడమే లక్ష్యమంటూ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేను ఈ నెల 19న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. ఇదిలా వుండగా కేసీఆర్ పర్యటనలో భాగంగా నిజాంసాగర్, గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల విస్తరణ గురించి ప్రస్తావించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలకు సాగునీరు అందేలా చూస్తామన్నారు.
అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచి బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి, ఆర్మూర్ నియోజకవర్గం పరిధి మాక్లూర్ మండలంలోని 18 గ్రామాలకు గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందే ఏర్పా టు చేస్తామన్నారు. ఈ మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ల ఆదేశం మేరకు శుక్రవారం నుంచే నీటిపారుదలశాఖ అధికారులు ఆ ప్రాజెక్టుల విస్తరణ పనుల్లో నిమగ్నం అయ్యారు. మొత్తానికి కేసీఆర్ పర్యటన టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, అధికారులు అలర్టయ్యారు.
సీఎం పర్యటనతో అంతా అలర్ట్
Published Sat, Aug 9 2014 4:25 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement