
స్పీకర్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్న లబ్ధిదారులు
బాన్సువాడ టౌన్: ఆసరా పింఛన్ లబ్ధిదారులతో బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాల్ మాట్లాడారు. పింఛన్లు రూ.2016 ఇవ్వడం సంతోషంగా ఉందని, పిల్లలపై ఆధారపడకుండా పింఛన్లు ఇచ్చి ఇంటికి కేసీఆర్, మీరు(పోచారం శ్రీనివాస్‌రెడ్డి)లు పెద్ద కొడుకులయ్యారని లబ్ధిదారులు పేర్కొనడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తనకు చెప్పవచ్చునని, తమ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పీఏ భగవాన్‌రెడ్డి అందుబాటులో ఉంటారని స్పీకర్ చెప్పారు.