Aasara Pension Scheme
-
దివ్యాంగుల పింఛన్లలో కోత!
సాక్షి, అమరావతి: పింఛన్‌దారుల(pensioners) పట్ల చంద్రబాబు ప్రభుత్వం(chandrababu government) కనికరం చూపడంలేదు. సాధ్యమైనంత మంది లబ్ధిదారులకు పింఛను రద్దు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దివ్యాంగులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారినీ వదలడంలేదు. అంగ వైకల్యం(Disabled), వివిధ రకాల వ్యాధులకు గురై పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పింఛన్‌దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పింఛను పొందుతున్న 24,091 మందినీ పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ఇచ్చన మార్గదర్శకాలూ కఠినంగా ఉన్నాయి.నిర్ణీత సమయానికి వారికి పరీక్ష జరగకపోతే పింఛను రద్దయినట్లే. పక్షవాతం, కండరాల వ్యాధులతో బాధ పడుతున్న వారిని వైద్య బృందాలు ఇంటికి వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చిన సమయంలో వీరు అందుబాటులో లేకపోతే పింఛను రద్దయినట్లే. దివ్యాంగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 7.95 లక్షల మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వైద్యుల కమిటీల ముందు పునః పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. వీరు నిర్ణీత తేదీన వైద్యుల బృందం ముందు హాజరు కాకపోతే పింఛను నిలిపివేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మెమో జారీ చేశారు. నేటి నుంచే తొలి దశ పరీక్షలుతొలి దశలో శనివారం నుంచే పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత తరహా వ్యాధులతో బాధపడుతూ పింఛన్లు తీసుకుంటున్న 24,091 మందికి ఇంటింటికీ వెళ్లి అర్హత పరీక్షలు చేస్తారు. ఇందు కోసం 112 వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందంలో ఎముకల డాక్టర్, జనరల్ మెడిసిన్, లబ్ధిదారుని ఏరియా స్థానిక పీహెచ్సీ వైద్యుడు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. 88 రోజుల పాటు తొలి దశ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన 7.95 లక్షలమంది దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇతర రోగాల కారణంగా పింఛన్ పొందుతున్న వారికి ప్రభుత్వాసుపత్రుల వద్ద కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.పరీక్షల నిర్వహణకు కమిటీలు⇒ ఈ పరీక్షల నిర్వహణకు ప్రతి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా 11 మంది జిల్లా స్థాయి అ«ధికారులతో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లా కమిటీలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా లబ్ధిదారుల వైద్య పరీక్షలకు షెడ్యూల్ రూపొందిస్తాయి.⇒ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని పింఛనుదారులకు ఏ తేదీలో పరీక్షలు చేయాలో నిర్ణయించి, ఆ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ముందుగా లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తారు. వైద్య బృందం ఇంటికి వెళ్లినప్పుడు పక్షవాతం లేదా కండరాల వ్యాధితో పింఛను పొందుతున్న లబ్ధిదారు లేకపోతే పింఛను నిలిపివేస్తారు. అదేవిధంగా దివ్యాంగులు, ఇతర వ్యాధుల పింఛనుదారులు నిర్ణయించిన తేదీకి నిర్ణీత వైద్య బృందం ఎదుట హాజరు కాకపోయినా తని పింఛన్‌ను హోల్డ్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.⇒ ఒక్కొ వైద్య బృందం రోజుకు 25 మంది పింఛనుదారులకు అర్హత– అనర్హతల పరిశీలనతో పాటు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టారు. లబ్ధిదారునికి గతంలో పింఛను పొందేందుకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కాకుండా కొత్త వారి ద్వారా ఇప్పుడు పరీక్షలు చేస్తారు.⇒ఈ మొత్తం కార్యక్రమం పర్యవేక్షణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. వైద్య బృందాలు పరీక్షలు చేసే పింఛన్‌దారులపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. పునఃసమీక్షలో నిర్ధారించిన వాటిలో కనీసం 5 శాతం లబ్ధిదారులను కలెక్టర్లు సోషల్ ఆడిట్ చేయడానికి అదనంగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తారు. -
పెన్షన్లు లాకుంటున్న రేవంత్ సర్కార్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
TG: 'ఆసరా' పక్కదారి..
సాక్షి, హైదరాబాద్: ఆపన్నులకు ఇచ్చే ఆసరాలోనూ దుర్వినియోగం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సెర్ప్ తనిఖీల్లో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబీకులు.. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆపన్నులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు బయట పడింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు ఇటీవలి సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3824 మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్‌ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నారు.గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు... ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.2.50 కోట్లు ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల విచారణలో తేలింది.రాష్ట్రవ్యాప్తంగా తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలోనే ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు,బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు. గత ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు ఇవ్వగా కొత్త ప్రభుత్వం వీటిని ‘చేయూత’ పెన్షన్లుగా పేరు మార్చింది.మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. ఇదంతా అమానవీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హుల జాబితాలోనే ఉండటం గమనార్హం. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేది. 2010లో ఆమె మరణించింది. ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు రూ.24073 ఫ్యామిలీ పెన్షన్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆమెకు మరోవైపు ఆపన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. అందుకే జూన్ నెల నుంచి ఆసరా పెన్షన్ ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు. అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు కూడా రైతుబంధు చెల్లించి దాదాపు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అదే తీరుగా ఆసరా పెన్షన్ల పేరిట భారీఎత్తున నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం తాజా సంఘటనలో తేలిపోయింది. -
చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. – సాక్షి, అమరావతి మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మహిళా సాధికారత కోసం.. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్ – చైల్డ్ బేస్డ్ బడ్జెట్లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది. సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్ యాప్, దిశ పెట్రోల్ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
నూతన సంవత్సరంలో పింఛన్ పెంపు మహోత్సవాలు..
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేతి వృత్తిదారులకు ఇస్తున్న రూ.2,750 పింఛన్‌ను ఈ నెల నుంచి రూ.3వేలకు పెంచింది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలన్నారు. జనవరి నెలకు సంబంధించి 2,93,493 మంది పింఛన్‌దారులకు రూ.87.92 కోట్లు విడుదలైందన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన పింఛన్లు 5,234 ఉన్నాయన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 2,31,513 మంది రూ.3వేల పింఛన్లు అందుకోనున్నారన్నారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరిగినప్పటి నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ మార్పును పింఛన్‌దారులు గమనించాలని కోరారు. ఈ నెల మూడో తేదీ అనంతపురం అర్బన్, గార్లదిన్నె, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, గుంతకల్లు అర్బన్, కళ్యాణదుర్గం రూరల్, కూడేరు, నార్పల, రాప్తాడు, రాయదుర్గం రూరల్, శింగన మల, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్‌లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరుగుతాయన్నారు. 4న బెళుగుప్ప, అనంతపురం రూరల్, బొమ్మనహాళ్, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గుత్తి రూరల్, గుత్తి అర్బన్, కళ్యాణదుర్గం అర్బన్, పెద్దపప్పూరు, 5న ఆత్మకూరు, కణేకల్లు, పామిడి రూరల్, పామిడి అర్బన్, పుట్లూరు, రాయదుర్గం అర్బన్, శెట్టూరు, ఉరవకొండ, యాడికి, యల్లనూరు, విడపనకల్లు, 6న వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు, కుందుర్పి, కంబదూరులో పింఛన్ పెంపు మహోత్సవాలు నిర్వహిస్తారన్నారు. వలంటీర్లందరూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారన్నారు. పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి లేఖను పింఛన్‌దారులకు అందజేస్తారన్నారు. నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర జరగనుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు పింఛన్ల పెంపు సహా మూడు ప్రధాన పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ఆసరా’. ఈ నెల 23 నుంచి 31 వరకు ‘ఆసరా’ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద నాలుగో విడత ద్వారా జిల్లాలో 24,100 డ్వాక్రా సంఘాలకు రూ.183.59 కోట్ల లబ్ధి చేకూరనుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగో విడతలోనూ ఆర్థిక సాయం అందించేందుకు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1,18,881 మంది మహిళలకు రూ.35.96 కోట్లు అందజేయనున్నారు. ఇవి చదవండి: AP: బలంగా.. బడుగుల అడుగులు -
పింఛన్ పెంచుకుందాం: సీఎం కేసీఆర్
వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపుతారు కాంగ్రెస్ ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు అడుగుతోంది. మొన్నటిదాకా 50ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసింది? నాడు రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇస్తామనీ సరిగా ఇవ్వలేదు. రూ.500 పెన్షన్ ఇవ్వలేదు. అలాంటి కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని అంటున్నారు. వారు అధికారంలో ఉన్న కర్ణాటకలో పెంచకుండా ఇక్కడ పెంచుతామని మాయ మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు. అరచేతిలో వైకుంఠం చూపుతారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మనం పెన్షన్ మొత్తాన్ని పెంచుకుందాం. ఎంతనేది త్వరలోనే ప్రకటిస్తా. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి నల్లగొండ/ సూర్యాపేట: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని.. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గతంలో కంటే ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరెవరో వస్తారని.. వారి మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఆగమవుతామని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. త్వరలోనే ఆసరా పింఛన్లు పెంచుకుందామని చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలోని మోతె మండలం వరకు ఎలా వచ్చాయో మీకు తెలుసు. ఒకప్పుడు కరెంటు రాకపోతే, మోటార్లు కాలిపోతే రైతులు ఇబ్బందులు పడేవారు. వాటిని చూసి ఉద్యమ సమయంలో నేను కంటతడి పెట్టాను. ఇప్పుడు కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటడు, మరొకడు 3 గంటలు కరెంటు చాలంటడు. కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకలో కరెంటు సరిగా ఇవ్వక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మనం మళ్లీ అలా గోసపడదామా? లేదంటే 24 గంటల కరెంటు కావాలా? ఆలోచించాలి. ధరణి వద్దంటే దళారుల దందానే.. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణితోనే ఇప్పుడు రైతుబంధు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. ధాన్యం అమ్ముకున్నా ఖాతాలోనే సొమ్ము పడుతోంది. కాంగెస్ వస్తే రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు ఉండవు. గతంలో పాస్బుక్ల విషయంలో ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ, మంత్రి ఇలా ఎవరు పడితే వారు పెత్తనం చేసేవారు. వీఆర్వోలు ఇష్టానుసారంగా పేర్లు మార్చేశారు. అందుకే ఆ వ్యవస్థను రద్దుచేశాం. దాని స్థానంలో ధరణిని తీసుకువచ్చాం. అధికారులకు ఉన్న పవర్‌ను ధరణితో రైతుల బొటనవేలికే ఇచ్చాం. రికార్డులను ఎవరూ మార్చలేరు. కాంగ్రెస్ ధరణిని తీసేస్తామంటోంది. మళ్లీ దళారుల దందా రావాలా? వాళ్లు నల్లగొండను పట్టించుకోలేదు కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదు. సూర్యాపేట ప్రజలకు మురుగునీటినే తాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కావాల్సినన్ని ని«ధులు ఇచ్చాం. మంత్రి జగదీశ్‌రెడ్డి కొట్లాడి మరీ నల్లగొండ జిల్లాకు విద్యుత్ ప్లాంట్ సాధించారు. రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న దానిని త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. బీసీలందరికీ ఆర్థిక సాయం బీసీలందరికి ఆర్థిక సాయం అందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ అనుమానం పెట్టుకోవద్దు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న వారంతా ఇప్పుడు గ్రామాలకు వచ్చి, పనులు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి. సూర్యాపేటకు సీఎం వరాలు సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల చొప్పున.. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం. కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తాం. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం జీవో జారీ చేస్తాం. అతిథి గృహం మంజూరు చేస్తాం. రూ.37 వేల కోట్లు రుణామాఫీ చేశాం కరోనాతో రుణమాఫీ విషయంలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడిప్పుడే రైతులు ఒకరి వద్ద చేయి చాచకుండా బతుకున్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఖమ్మంలో సీతారామ వంటి ప్రాజెక్టులతో దిగుబడి 4 కోట్ల టన్నులకు పెరుగుతుంది. దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచాం తెలంగాణ ఏర్పాటయ్యాక అద్భుత పనితీరుతో మానవాభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్‌లో నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట కొత్త కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నామని.. కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ, సెక్రటేరియేట్లు కూడా ఈ స్థాయిలో లేవని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేటలో సీఎం కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్కారును నడిపడమంటే.. సంసారం నడిపించినట్టే.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగింది. ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తావిస్తూ. ‘‘సర్కారు నడిపించాలంటే.. సంసారం నడిపించినట్టే..’’ అని కేసీఆర్ పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. తర్వాత ‘‘60 ఏళ్ల నుంచి రూ.200 పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్ వాళ్లు ఇవాళ రూ.4వేలు ఇస్తరట.. అంటే నేను రూ.5వేలు ఇవ్వాలా? ఇదేమన్నా వేలం పాటనా?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగంలో సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎంను కోరారు. తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘జగదీశ్‌రెడ్డి ఇంత హుషారని అనుకోలేదు. మనకు అన్ని ఇచ్చారు, సూర్యాపేట జిల్లా కూడా ఇచ్చారు. అన్నీ అయిపోయాయి. సభకు వచ్చిపోతే చాలు. ఏమీ అడగనని అక్కడ చెప్పిండు. ఇప్పుడు అవికావాలి, ఇవి కావాలి అని అందరి ముందూ అడుగుతున్నారు..’’ అని పేర్కొన్నారు. -
దివ్యాంగులకు దిగులులేని మరింత దివ్యమైన ‘ఆసరా’
నెక్కొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్‌ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా రూ. వెయ్యి పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలోని 15,585 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్లతోపాటు ఉపకరణాలు, వాహనాలు, ఇతర పథకాలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ రోగులు మొత్తం 1,27,089 మంది ప్రతి నెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. 13 మండలాలు.. 15,585 మంది లబ్ధిదారులు సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 13 మండలాల పరిధిలోని మొత్తం 15,585 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెలా రూ.47 కోట్లను ఆసరా పింఛన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజా పెంపుతో అదనంగా రూ.1.55 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా దివ్యాంగులు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు రాగానే పంపిణీ.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 15,585 మంది దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 3,016 చొప్పున పింఛన్ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా రూ.1000 కలిపి రూ.4,016 పింఛన్ అందనుంది. ఉత్తర్వులు రాగానే పంపిణీ చేస్తాం. పోరాడి సాధించుకున్నాం.. సంఘటితంగా దివ్యాంగులు చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం పింఛన్‌ను పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని సంఘం తరఫున ఉద్యమించాం. దాని ఫలితంగా రాష్ట్రంలో రూ.4,016 అందుకోనుండడం సంతోషంగా ఉంది. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ధ్రువపత్రాలు జారీ చేసి పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పడం హర్షణీయం. –కృష్ణమూర్తి, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, నెక్కొండ -
పెన్షన్.. పరేషాన్! నగదు జమ కాక లబ్ధిదారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా బ్యాంక్ ఖాతాలకు కేవైసీ ప్రక్రియ చిక్కుముడిగా తయారైంది. బ్యాంకు ఖాతాల ద్వారా కొంత కాలంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రెండు, మూడు నెలలుగా పింఛన్ సొమ్ము జమకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్ అప్డేట్ సమస్య కూడా వెంటాడుతోంది. లబ్ధిదారులు తహసీల్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు సరైన సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు పింఛన్ల కోసం ఆందోళన చెందుతున్నారు. కార్డుల పంపిణీలో నిర్లక్ష్యమే ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో పాటు పాత లబ్ధిదారులకు సైతం ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులను ముద్రించింది. లబి్ధదారులు ఇళ్లు మారడంతో పాటు పంపిణీకి చిరునామా సమస్య తలెత్తింది. దీంతో సగానికి పైగా కార్డులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. కనీసం వార్డుల సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం ఎమ్మెల్యేల ద్వారా కొన్ని కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల 65 ఏళ్ల వృద్ధులతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతేడాది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తోంది. బ్యాంక్ ఖాతాకు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రధాన సమస్యగా పరిణమించింది. చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, వెల్గటూర్(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్ పరికరంలో పింఛన్‌దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు. వేలుముద్రలు రావడం లేదని పింఛన్‌దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే.. ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్‌దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. (చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి) -
Telangana: ఆసరా ఆలస్యం.. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు కూడా!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఆసరా ఆలస్యమవుతోంది. పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రతినెలా మొదట్లోనే అందాల్సిన సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు ఆలస్యంగా పింఛన్ డబ్బులు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల మరింత ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనితో పింఛన్‌పై ఆధారపడి బతుకీడుస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. మందులు, ఇతర నెలవారీ అవసరాలు తీరక అవస్థల పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పింఛన్ సొమ్ము అందుతుంది. దీనితో పలు ప్రాంతాల్లో వృద్ధులు పింఛన్ సొమ్ము జమ అయిందో, లేదో తెలుసుకునేందుకు పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంజూరు చేసినా.. రాష్ట్రంలో ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల కేటగిరీల్లో మొత్తంగా 35,95,675 మందికి పింఛన్లు అందేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే వివిధ కేటగిరీల పింఛన్ కోసం వచ్చిన మరో 3 లక్షల దరఖాస్తులు కలిపి.. మొత్తంగా 14 లక్షల దరఖాస్తులు అయ్యాయి. ఇందులో ప్రభుత్వం ఇటీవల కొత్తగా 9.38 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది. దీనితో మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అక్టోబర్ చివరినాటికి 44,14,915 మందికి చేరింది. మరో 4.6 లక్షల మంది పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. అందక.. మంజూరుగాక.. తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు రూ.200గా ఉన్న పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016కు.. వృద్ధులు, వితంతువులు ఇతర కేటగిరీల్లో రూ.2,016కు పెంచింది. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపశమనం కలిగింది. నెలవారీ మందులు, నిత్యావసరాలకు కష్టం తీరింది. కానీ ఇటీవల ఆసరా పింఛన్ల సొమ్ము అందడంలో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బంది మొదలైంది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించినా.. ఆ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొన్ని లక్షల మందికి ఇంకా మంజూరు కాలేదు. మంజూరు అయినవారిలోనూ కొందరికి పింఛన్ సొమ్ము అందడం లేదని వాపోతున్నారు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, బ్యాంకు ఖాతాల్లో మార్పులు, ఆధార్‌తో అనుసంధానం వంటి సమస్యలతోనూ పింఛన్లు సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం, ఇతర అంశాలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్యలను గుర్తించింది. పలు జిల్లాల్లో సమస్యలివీ.. ► సూర్యాపేట జిల్లాలో గత ఐదు నెలలుగా 25వ తేదీ తర్వా పింఛన్ల సొమ్ము అందుతోంది. అక్టోబర్ పింఛన్ సొమ్ము ఇప్పటికీ అందలేదని లబ్ధిదారులు చెప్తున్నారు. 57 ఏళ్లు దాటినవారి వృద్ధాప్య పింఛన్ల కోసం 30వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. కొత్తగా మంజూరైన వారిలోనూ కొందరికి సొమ్ము రావడం లేదు. ► కరీంనగర్ జిల్లాలో కొత్తగా పింఛన్ మంజూరైన వారిలో 4 వేల మంది వరకు ఇంకా సొమ్ము అందడం లేదు. ఇదేమిటంటే వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, మీసేవ వాళ్లు తప్పుగా నమోదు చేశారని చెప్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,61,988 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో వేల మంది ఇంకా మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. మంజూరైన పింఛన్లలోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, ఇతర సమస్యలతో కొందరిని పింఛన్ సొమ్ము అందడం లేదు. ఇక భార్యాభర్త ఇద్దరికీ పెన్షన్ ఉండటం, సొంత ఇళ్లు, వాహనాలు ఉండటం వంటి కారణాలతో కొందరి పింఛన్లను తొలగించారు. ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పింఛన్ సొమ్ము ఆలస్యంగా అందుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. అర్హత ఉన్నా తమకు మంజూరుకావడం లేదని వాపోతున్నవారు వేలలో ఉన్నారు. గోస పడుతున్నం ఈమె పేరు భూతం రాములమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామం. వయసు 85ఏళ్లు. భర్త, పిల్లలు ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛనే దిక్కు. ఈ సొమ్ము నెల నెలా సమయానికి అందడం లేదని, ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోందని ఆమె వాపోతోంది. ప్రతీ నెల మొదటివారంలో పింఛన్ పంపిణీ చేయాలని కోరుతోంది. మంజూరై రెండు నెలలైనా.. ఈ వ్యక్తి పేరు సంక రాజేందర్. జగిత్యాల జిల్లా సిరికొండ గ్రామం. కిడ్నీ వ్యాధి బాధితుడు. రెండు నెలల కింద డయాలసిస్ కేటగిరీలో పింఛన్ మంజూరైంది. గుర్తింపు కార్డు సైతం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పింఛన్ డబ్బులు రావడం లేదని వాపోతున్నాడు. -
డయాలసిస్ రోగులందరికీ పింఛన్లు ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్/వెంగళరావునగర్: రాష్ట్రంలోని ప్రతి డయాలసిస్ రోగికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వేల మంది డయాలసిస్ రోగులున్నారని, వారిలో 10 వేల మంది ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లోనే ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. వివిధ కేటగిరీల్లో అందిస్తున్న సామాజిక పింఛన్ల పరిధిలోకి రాని 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ల కింద ప్రతి నెలా రూ. 2,016 అందిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ)లో డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ కార్డులను మంత్రి హరీశ్‌రావు అందించారు. ఆసరా పింఛన్ అందని డయాలసిస్ రోగులు అధికారులను సంప్రదిస్తే పింఛన్లు మంజూరు చేస్తారన్నారు. రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇప్పటికే 83 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని.. అతిత్వరలో మిగతా చోట్ల కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలతోపాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, జీవితకాలం ఉచితంగా మందులు, ఉచిత బస్‌పాస్‌లు మొదలైనవి ప్రభుత్వం అందిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ సిస్టమ్‌తో డయాలసిస్ పరీక్షలను రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు. గతంలో ఒక ఫిల్టర్‌ను ముగ్గురు, నలుగురికి వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మానసిక ఆందోళనలను దూరం చేసేలా... అనంతరం టెలి మెంటల్ హెల్త్ సర్వీసుల (టెలి–మానస్) కాల్‌సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని... వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా టెలి–మానస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న వారు 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఉచితంగా వైద్య సలహాలు పొందొచ్చన్నారు. అలాగే అవసరమైతే వారికి సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 25 మంది సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు పనిచేస్తున్నారని, వారికి ప్రత్యేకంగా బెంగళూరులో శిక్షణ సైతం ఇప్పించినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. -
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్‌పుర్‌కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్‌దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్‌లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
ట్రాన్స్జెండర్లకు ‘ఆసరా’ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులందకీ ఇస్తున్నట్లే ట్రాన్స్జెండర్లకు కూడా ఆసరా పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు జీవో నంబర్ 17లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ట్రాన్స్జెండర్లకు ఉచిత బియ్యం, ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ లాంటి సౌకర్యాలు అందడం లేదని.. వారికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి పథకాలు అందేలా చూడాలని కోరుతూ.. వైజయంతి వసంత మోగ్లీ అలియాస్ ఎం.విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ సహా వైద్యారోగ్య, సివిల్ సప్లయ్, హోం, ఆర్థిక, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జైనాబ్ వాదనలు వినిపించారు. ట్రాన్స్జెండర్లకు ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో 58,000 మంది ట్రాన్స్జెండర్లు ఉండగా, 12,000 మందికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారని చెప్పారు. కర్ణాటక, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని... రాష్ట్రంలోనూ వారి కోసం పథకాలు అమలు చేసేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది రాధివ్‌రెడ్డి వాదిస్తూ ట్రాన్స్జెండర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ చేపట్టామని చెప్పారు. పిటిషన్ వేసే నాటికి 12,000 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినా.. ప్రస్తుతం దాదాపు అందరికీ పూర్తయిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ట్రాన్స్జెండర్లకు అసరా వర్తింజేయాలంటూ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. -
ఆసరా కోసం వెళ్తే చనిపోయావన్నారు!
ఆసరా పెన్షన్ కోసం ఓ వ్యక్తి ఏడాది క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఆ వ్యక్తి గురువారం తన దరఖాస్తును పరిశీలింగా చనిపోయినట్లు చూపడంతో ఒక్కసారిగా కంగుతున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో జరిగింది. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పాతనబోయిన పుల్లయ్య చనిపోయినట్లు చూపడంతో గత ఏడాది గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేశాడు. కానీ ఆన్లైన్లో పుల్లయ్య చనిపోయినట్లు చూపిస్తోంది. బతికి ఉన్న తనను ఏకంగా రికార్డుల్లో తప్పుగా నమోదు చేíసి చంపేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. –తిరుమలగిరి (నాగార్జునసాగర్) -
హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో కొత్తగా లక్షన్నర మందికి ఆసరా పింఛన్ల లబ్ధి చేకూరనుంది. పాత పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించింది. ఇప్పటికే తుది జాబితా సిద్ధంగా ఉండటంతో కొత్త పింఛన్ల మంజూరుకు మార్గం సుగమమైంది. పంద్రాగస్టు తర్వాత కొత్త పింఛన్లు అందనున్నాయి. వాస్తవంగా గత మూడేళ్లుగా ఆసరా కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. ఆసరా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది. దరఖాస్తులపై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి విచారణ పూర్తయి అర్హులను గుర్తించినా... . మంజూరు మాత్రం పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం నంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో కొత్త పింఛన్లకు మోక్షం లభించలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటనతో ఆసరా పెండింగ్ ప్రతిపాధనలకు కదలిక వచ్చినట్లయింది. దీంతో వితంతు,వికలాంగుల, ఒంటరి మహిళాలతోపాటు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే సెర్ప్ వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలతో వాటికి మోక్షం లభించినట్లయింది. (చదవండి: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు) మరో లక్షన్నర సడలింపు దరఖాస్తులు వయస్సు సడలింపు దరఖాస్తులు సుమారు లక్షన్నర పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం వయస్సు సడలింపుతో అర్హులైన వారి నుంచి మీ సేవా ఆన్లైన్ ద్వారా ఆగస్టులో పక్షం రోజులు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో పక్షం రోజులు దరఖాస్తులు స్వీకరించారు. బోగస్ దరఖాస్తులకు రాకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కాగా, వాటిపై ఇప్పటి వరకు సరైన ఆదేశాలు లేక కనీసం క్షేత్ర స్థాయి విచారణ లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం పెండింగ్‌లో పడిపోయాయి. (చదవండి: కేంద్రం ఇచ్చింది 3శాతం కంటే తక్కువే..) -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’.. ఇక కొత్త పింఛన్లు వచ్చేదెప్పుడో?
ఈమె పేరు నర్సమ్మ. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సి పాలిటీలో విలీనమైన తుప త్రాల్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ఆసరా పింఛనే ఆధారం. భర్త ఇదివరకే మృతిచెందగా ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రతినెలా ఆలస్యంగా వస్తున్న పింఛన్ వల్ల కాళ్ల నొప్పుల మందులు కొనుక్కోనేందుకు ఇబ్బంది పడుతోంది. గత నెల 22న పింఛన్ రాగా ఈ నెల ఇప్పటివరకు రాలేదని చెప్పింది. పింఛన్ పడిందేమోనని ఇప్పటికే నాలుగుసార్లు 4 కి.మీ. దూరంలోని అయిజ బ్యాంకుకు వెళ్లానని.. ప్రతిసారీ భోజనానికి రూ.50, చార్జీలు రూ. 20 అవుతున్నాయని తెలిపింది. ఈ గిరిజన మహిళ పేరు బుడ్డమ్మ. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పెద్దతండా గ్రామంలో నివసిస్తోంది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు బతుకుదెరువుకు హైదరాబాద్ వలస వెళ్లారు. భర్త కాలం చేయగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఉన్న పొలం ముంపునకు గురైంది. ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛనే ఆమెకు అండగా మారింది. కానీ గత కొన్ని నెలలుగా పింఛన్ సకాలంలో అందక ఇబ్బంది పడుతోంది. పింఛన్ కోసం గ్రామ పంచాయతీకి రోజూ వెళ్లి వాకబు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇది ఒకరిద్దరి వ్యథ మాత్రమే కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులందరి దీన గాథ ఇదే. ఆసరా లేని పేదలకు సాయం అందించి ఆదుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. అయితే కొంతకాలంగా ప్రతి నెలా పింఛన్ డబ్బు లు సకాలంలో అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు మరికొన్ని వర్గాల లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు. 2–3 నెలల నుంచి మరీ ఆలస్యం.. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, బీడీ వర్కర్లు, ఫైలేరియా బాధితు లు సుమారు 38.75 లక్షల మందికి నెలనెలా ఆస రా పింఛన్లు అందుతున్నాయి. గతంలో వీరికి ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు అందేవి. కరోనా కాలంలో అంటే 2020 నుంచి పెన్షన్ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. 2021లో ఆర్థిక వ్యవస్థ గాడి న పడిన తర్వాత పెద్దగా ఆలస్యం జరగలేదు. కానీ ఇటీవల 2–3 నెలల నుంచి పింఛన్ డబ్బులు 20వ తేదీ తర్వాతే బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో జమ వుతున్నాయి. గత నెలలో 25 తర్వాతే డబ్బులు జమవగా వరుస సెలవుతో 28వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ డబ్బులు ఖాతాల్లో జమకాకపోవడంతో పింఛ న్‌దారులు ఆందోళనలో కొట్టుమిట్టాడు తు న్నారు. పోస్టాఫీసులు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకా నెరవేరని ‘కుదింపు’ హామీ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు కనీస వయసు పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2018లో ఎన్నికల సమయంలో వృద్ధులకు ఈ మేరకు అధికార టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో సైతం పెట్టింది. ఈ మేరకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించినా కార్యరూపం దాల్చలేదు. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆసరా పింఛన్లకు రూ. 11,728 కోట్లు కేటాయిస్తున్నామని.. కుదించిన వయసు మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇప్పటివరకు పురోగతి లేదు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయా అని మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొడుకులు పట్టించుకోవట్లేదు.. నాకు బీపీ, షుగర్ ఇతర మందులకు నెలకు రూ. 1,500 వరకు ఖర్చవుతుంది. పింఛన్ వస్తదని నా కొడుకులు పట్టించుకోవట్లేదు. కానీ 3 నెలలుగా ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా. – పోచయ్య, వృద్ధుడు, జంగరాయి, చిన్నశంకరంపేట, మెదక్ ముసలోళ్లమని ఎవరూ చేబదులివ్వట్లేదు గత రెండు నెలలుగా ఆలస్యంగా పింఛన్ రావడంతో సకాలంలో మందులు కొనుక్కోలేకపోతున్నా. ఈ నెల ఇప్పటివరకు పింఛన్ రాలేదు. ఎవరినైనా డబ్బులు బదులు అడిగితే ముసలోళ్లమని ఇవ్వట్లేదు. – నాగవ్వ, వృద్ధ్యాప్య పింఛన్ లబ్ధిదారురాలు, బాల్కొండ, నిజామాబాద్ -
అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య పింఛన్ రాక ఎలా బతకాలని రామారెడ్డికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు దుడుక సత్తవ్వ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ను ప్రశ్నిచింది. ఆదివారం రామారెడ్డి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన సత్తవ్వ తనకు పింఛన్ ఇవ్వాలని కోరింది. తనతో పాటు మరో 8 మంది వృద్ధులు ఆయాలుగా పనిచేసి రిటైర్ అయినా పింఛన్ల రావడం లేదని చెప్పింది. తమకు అంగన్వాడీ నుంచి ఎలాంటి పింఛన్లు ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రేపటి నుంచి ఆసరా పింఛన్లకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ‘57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ల’కు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ‘మీ’సేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అర్హులైన వారందరికీ ఈ పింఛన్లు అందుతాయని సీఎం వారికి హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్... దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులైన పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్‌రావులను ఆదేశించారు. -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’
సాక్షి, నెట్వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్‌దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. ఎదురుచూపుల్లో 38 లక్షల మంది... ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు. మస్తు ఇబ్బంది అవుతోంది చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్‌కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది. – అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు. – రుక్కవ్వ, సోమార్పేట్, కామారెడ్డి జిల్లా -
చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల హామీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా పని చేస్తున్నారని కొనియాడారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగిన ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో మంతి వెల్లంపల్లి పాల్గొన్నారు. వేడుకల ముగింపు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం ఆర్పీలకు, డ్వాక్రా గ్రూప్ లీడర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పధకాలను చేరుస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి దేవినేని అవినాష్ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం మాటలతో కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో రూ.250 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో భూములన్నీ బినామిలకు దోచిపెట్టాడని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడులు పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారుని మండిపడ్డారు. చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాల వలన రాబోయే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయం అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలిపారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. గతంలో చంద్రబాబు మహిళలని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. జగన్ మహిళలుకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి దేశంలోనే రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. మరో 30 ఏళ్లపాటు వైఎస్ జగన్ తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు అందరి ఆశీస్సులు సీఎం జగన్‌కి ఉన్నాయని గుర్తుచేశారు. 30లక్షల మందికి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. దివంగత వైఎస్సార్ కన్న కలలు అన్ని జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ ద్వారా సీఎం జగన్ మహిళలుకి మరింత చేరువయ్యారని అన్నారు. మహిళలు అందరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని దేవినేని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు. -
‘డబుల్’ పింఛన్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: ఆసరా వృద్ధాప్య పింఛన్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా 14,975 మంది పింఛన్లను కాజేసినట్లు తేలింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో దంపతుల్లో ఒకరు మాత్రమే పింఛన్‌కు అర్హులు కాగా, అధికారుల కళ్లుగప్పి ఇరువురు పింఛన్ పొందుతున్నట్లు అంతర్గత విచారణలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తేల్చింది. ఈ మేరకు మే నెలకు సంబంధించి దాదాపు 30 వేల (దంపతుల) మంది పింఛన్లను నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ పొందిన పింఛన్ సొమ్మును రికవరీ కూడా చేయాలని నిర్ణయించింది. అక్రమంగా పింఛన్ తీసుకున్నవారి జాబితాను తయారుచేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిçషనర్లకు పంపింది. లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అర్హులు/అనర్హుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. ఈ నివేదిక అనంతరం అర్హులుగా తేలితే వారి పింఛన్‌ను విడుదల చేయాలని, అనర్హులుగా గుర్తిస్తే సొమ్మును రికవరీ చేయాలని స్పష్టం చేసింది. సామాజిక భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్ బాధితులకు రూ.2,016, వికలాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ను అందజేస్తోంది. అయితే ఈ పథకానికి కుటుంబసభ్యుల్లో ఒకరు మాత్రమే అర్హులు కాగా.. చాలాచోట్ల భార్యాభర్తలు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సెర్ప్ యంత్రాంగం జాబితాను తయారు చేసింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,766, నల్లగొండ 763, మంచిర్యాల 756, కరీంనగర్ 674, రంగారెడ్డి 643, జగిత్యాల 626, నారాయణపేట 623, మేడ్చల్ 585, ఖమ్మం 558, వరంగల్ అర్బన్ జిల్లాలో 546 మంది ఉన్నారు. ఈ మేరకు మే నెలకు సంబంధించి డబుల్ పింఛన్లను ఆపేసింది. ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులెవరైనా వృద్ధాప్య పింఛన్ తీసుకున్నట్లు తేలితే తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబసభ్యులు పింఛన్ పొందేందుకు అనర్హులు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయడంతో నెలానెలా వచ్చే పింఛన్ సొమ్మే వారికి ఆసరా అవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోçషణాభారం భరించని ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసి.. నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల పింఛన్ కట్ అయిన పక్షంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఉద్యోగులు తమ తల్లిదండ్రులకు ఇచ్చేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. అదేవిధంగా ఇప్పటివరకు అక్రమంగా పొందిన పింఛన్ సొమ్మును ఆయా ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను స్వయంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలని ఎంపీడీవోలు, పురపాలకసంఘాల కమిషనర్లను ఆదేశించింది. -
దంపతుల్లో ఒక్కరికే ఆసరా..
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల వడబోత ప్రారంభించింది. దంపతులిద్దరికి వృద్ధాప్య పింఛన్లు ఉంటే సర్కారు కత్తెర పెడుతోంది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 368 మంది లబ్ధిదారులకు మే నెల పింఛన్ సొమ్ము జమ చేయలేదు. దీంతో వీరికి ఇక పింఛన్ లేనట్లేనని బల్దియా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరి«ధిలో ఆసరా పథకం కింద ప్రభుత్వం 68,889 మంది పింఛన్ పొందుతున్నారు. అందులో వికలాంగులు 8,720, బీడీ కార్మికులు 5,909, ఒంటరి మహిళలు 1,786, వృద్ధులు 20,044, గీత కార్మికులు 639, చేనేత కార్మికులు 1,833, వితంతువులు 29,958మంది ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సామాజిక పింఛన్లను ప్రభుత్వం అమలుచేస్తోంది. గత ఏడాది నుంచి ప్రభుత్వం పింఛన్ సొమ్ము రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆహార భద్రత కార్డు, సదరన్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ తదితర పత్రాల ద్వారా అర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. సామాజిక పింఛన్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఏరివేతపై దృష్టిసారించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధాప్య పింఛన్ పొందుతున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికిపైగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఏరివేత కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 368 మంది పింఛన్ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. అంతేకాకుండా దంపతుల్లో భార్య లేదా భర్తలో ఒకరికి మాత్రమే పింఛన్ పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. ఈ మేరకు వారం రోజులుగా బల్దియా పన్నుల విభాగం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ప్రజాప్రతినిధుల పైరవీలు, బల్దియా సిబ్బంది చేతివాటం కారణంగా ఇంత కాలం పింఛన్ పొందిన వారికి చెక్ పడినట్లైంది. -
6.62 లక్షల మందికి...కొత్త 'ఆసరా'
సాక్షి, హైదరాబాద్: మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’దక్కనుంది. 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా 6.62 లక్షల మందికి ప్రయోజనం లభించనుంది. అసహాయులైన పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.46 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే జరిపి అర్హుల జాబితాను సేకరించింది.దీనికి అనుగుణంగా ఈ మేరకు వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని లెక్కతీసింది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను నమోదు చేస్తోంది. కేవలం దీన్నే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు జరిపి వయస్సును నిర్ధారించాలని నిర్ణయించింది.ఆధార్, ఓటర్ ఐడీ తదితర ధ్రువీకరణల ఆధారంగా జాబితాను స్క్రీనింగ్ చేయనుంది. అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభుత్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కొత్తగా పెరిగే 6.62 లక్షల పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర భారం పడనుందని అంచనా. ఏప్రిల్ నుంచి ఈ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, దీనిపై కరోనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగిన ఆసరా పెన్షన్లు గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సెలవుల్లో ఎస్పీఎం తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
బతికున్నట్లుగా సెల్ఫీ అప్లోడ్ చేస్తేనే పింఛను!
బోధన్ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి ప్రతీ నెలా వృద్ధాప్య పింఛను మంజూరవుతోంది. పింఛన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమవుతున్నాయి. వాస్తవానికి ఆ వ్యక్తి చనిపోయి చాలా నెలలవుతోంది. అయితే ఇటీవల సదరు వ్యక్తి భార్య వితంతు పింఛన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. డీఆర్డీఏ పింఛన్ విభాగంలో అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించారు. చనిపోయిన భర్త పేరు తెలుసుకుని మంజూరువుతున్న పింఛన్ జాబితాలో ఉందో లేదో చూశారు. ఇప్పటికీ ఆమె చని పోయిన తన భర్త పేరుపై వృద్ధాప్య పింఛ న్ ప్రభుత్వం నుంచి మంజూరు అవుతోందని తెలిసి షాక్ అయ్యారు. ఇలా మున్సిపా లిటీ ల్లో చనిపోయిన వారి పేరుతో బోగస్ పింఛన్లు డ్రా అవుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: మున్సిపాలిటీ ప్రాంతాల్లోని బోగస్ పింఛన్లకు త్వరలో చెక్ పడనుంది. చనిపోయిన వ్యక్తుల పేరిట మంజూరువుతున్న పింఛన్లను గుర్తించి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల్లోకి తేనుంది. అదే ‘లైవ్యాప్’ సిస్టం. ఈ మొబైల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని లబ్ధిదారులు సెల్ఫోన్లో ఒక సెల్ఫీ ఫొటో దిగి అందులో అప్లోడ్ చేస్తేనే ఇకపై పింఛన్ మంజూరు కానుంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా పింఛన్ డబ్బులు పొందుతున్న లబ్ధిదారులు మూడు, ఆరు నెలలకోసారి వారు బతికున్నట్లుగా మున్సిపాలిటీల నుంచి లైవ్ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వానికి చూపాల్సి ఉంటుంది. ఈ విధానం అమలవుతున్నా లైవ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగడం లేదు. దీంతో పింఛన్లు పొందే లబ్ధిదారులు బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు. పింఛన్ డబ్బులు మాత్రం నెలనెలా వారి ఖాతాల్లో జమ అవుతుండగా, కుటుంబ సభ్యులు వాటిని డ్రా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అదే గ్రామాల్లోని లబ్ధిదారుల విషయానికి వస్తే ప్రతీ నెలా లబ్ధిదారులే పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు బతికున్నట్లుగా తెలిసిపోతుంది. కానీ మున్సిపాలిటీ ప్రాంతాల్లో అలా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారులు బతికున్నారో, లేదో తెలుసుకోవడానికి వీలు పడదు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 2లక్షల 60వేలకు పైగా ఉన్నాయి. వికలాంగులకు రూ.3016 కాగా మిగతా అందరికీ రూ.2,016 పింఛన్ అందుతోంది. వచ్చే నెలాఖరు వరకు అమలయ్యే ఛాన్స్.. లైవ్ మొబైల్ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సంగారెడ్డిలో అమలు చేసి విజయవంతమైంది. వచ్చే నెలాఖరు వరకు రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీ ప్రాంతాల వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కూడా మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ దిగి ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాసులు, వృద్ధులకు ఇది సాధ్యం కాని పని అయినప్పటికీ తెలిసిన వారితో ఫోన్లో సెల్ఫీ ఫొటో దిగి యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందే. ఇలా ప్రతీఒక్కరూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేస్తేనే పింఛన్ ప్రభుత్వం నుంచి మంజూరు కానుంది. కొత్త విధానం వల్ల మున్సిపాలిటీ ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తులు సెల్ఫీ ఫొటో దిగే అవకాశం ఉండదు కాబట్టి ఇకపై ఆ వ్యక్తికి పింఛన్ మంజూరు కాబోదు. దీంతో జిల్లాలో చాలా బోగస్ పింఛన్లు తొలగిపోయే అవకాశం ఉంది. -
చాటుగా చూసే సంగ్రహించా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా చోటు చేసుకున్న ఆసరా పెన్షన్ల పథకం భారీ గోల్మాల్ కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆ కార్యాలయం ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నివృత్తి చేసుకోవడానికి నలుగురు నిందితుల్నీ కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసిన వీరిని సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవా రం అరెస్టు చేసిన విషయం విదితమే. నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ ఆరేడు ఏళ్ళుగా బండ్లగూడ, చార్మినార్ తహశీల్దార్ కార్యాలయాల కేంద్రంగా దళారిగా పని చేస్తున్నాడు. సర్వేయర్లు అనేక స్థలాలను సర్వే చేస్తుంటారు. ఇది పూర్తి చేయడానికి కనీసం మరో ఇద్దరు సహాయకుల అవసరం ఉంటుంది. ఈ పోస్టులు అధికారికంగా అందుబాటులో లేకపోవడంతో ఆయా సర్వేయర్లు ఇమ్రాన్ లాంటి వారిపై ఆధారపడుతున్నారు. ఇలా తహశీల్దార్ కార్యాలయంలోకి ‘అడుగుపెడుతున్న’ బయటి వ్యక్తులు ఆపై దళారులుగా మారి సాధారణ ప్రజలకు కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించడం వంటివి చేస్తూ కమీషన్లు తీసుకోవడం మొదలెడుతున్నారు. ఇమ్రాన్ కూడా ఇలానే చేస్తూ తహశీల్దార్ వద్ద నమ్మకం సంపాదించాడు. ఆపై కార్యాలయంలో ఆయన సమీపంలో ఉంటూ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ వినియోగించేప్పుడు వాటిని రహస్యంగా చూసి నమోదు చేసుకున్నాడని విచారణలో వెల్లడైంది. ఇమ్రాన్ వీటిని తన స్నేహితుడైన మహ్మద్ అస్లంతో పాటు సయ్యద్ సోహైలుద్దీన్‌లకు అందించారు. వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్ మోసిన్‌కు చేరాయి. ఈ నలుగురూ కలిసి బోగస్ ఖాతాలు సృష్టించడం, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు మార్చడం, అనర్హులనూ లబ్ధిదారులుగా చేర్చారు. ఇలా కొందరి పేరుతో సొమ్ము కాజేయడం, మరికొందరికి పెన్షన్లు ఇప్పిస్తూ నెలనెలా కమీషన్ తీసుకోవడం, ఇంకొందరి నుంచి ఒకేసారి కొంతమొత్తం తీసుకోవడం చేశారు. బండ్లగూ డ, చార్మినార్, చంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మంది పేర్లు, వివరాలను వీరు కొత్తగా చేర్చడానికి తహశీల్దార్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వాడారు.ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడటం ఆగిపోయిందని ఆర్డీఓ కు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర భద్రంరాజు రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్ మూలాలు కనిపెట్టారు. మంగళవారం అస్లంతో పాటు సోహైల్, మోసిన్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులను ఆరా తీస్తున్నారు. వీరిలో అస్లం అనే నిందితుడు 2015 నుంచి నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. 2017లో ఇదే తరహా స్కామ్‌కు పాల్పడి అరెస్టు కావడంతో సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి కటకటాల్లోకి చేయడంతో ఆ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు విద్యుత్ శాఖకు సమాచారం ఇచ్చారు. -
'ఆసరా' పెన్షన్ పథకంలో భారీ గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా ఆసరా పెన్షన్ల పథకంలో భారీ గోల్మాల్ జరిగింది. ఆ కార్యాలయ ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నలుగురితో కూడిన ముఠా 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసింది. దీనిపై హైదరాబాద్ ఆర్డీఓ డి.శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుడు 2017లో వెలుగులోకి వచ్చిన ఇదే తరహా ఆసరా స్కామ్‌లోనూ అరెస్టు అయినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. సూత్రధారి ఇమ్రాన్‌ఖాన్ ప్రతీకాత్మక చిత్రం; పోలీసుల అదుపులో నిందితులు ఆసరా పథకం కింద పెన్షన్ కోరుకునే అర్హులు దరఖాస్తు, ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్వాపరాలు పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హుల దరఖాస్తును తహసీల్దార్ అప్రూవ్ చేస్తారు. ఈ తంతు ముగిసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ఉండే డేటా ఎంట్రీ ఉద్యోగులు దరఖాస్తుదారుడి వివరాలను తమ సంస్థాగత ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. దీనికోసం ప్రతి తహసీల్దార్‌కు ఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయి. ఇలా అప్లోడ్ చేసిన వివరాలు కలెక్టరేట్ ద్వారా ‘సెర్ఫ్’ కార్యాలయానికి చేరతాయి. దీంతో అక్కడి అధికారులు లబ్ధిదారుడి ఖాతాలో నెలనెలా పెన్షన్ జమ చేస్తుంటారు. ఈ పెన్షన్‌ను కియోస్క్ యంత్రంలో వేలిముద్రలు వేయడం ద్వారా లబ్ధిదారులు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం మొత్తం తెలిసిన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తి ఈ స్కామ్‌కు సూత్రధారిగా మారాడు. ఆరేడేళ్లుగా బండ్లగూడ, చార్మినార్ తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా ఇతగాడు దళారీగా పని చేస్తున్నాడు. దీంతో ఇతడికి ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇమ్రాన్ ఎమ్మార్వో వినియోగించే యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించాడు. వీటిని తన స్నేహితుడు, నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహ్మద్ అస్లంతో పాటు సయ్యద్ సొహైలుద్దీన్‌లకు అందించాడు. వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్ మోసిన్‌కు చేరాయి. కియోస్క్ యంత్రాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ఇతడి వృత్తి. ఈ నలుగురూ ఇలా సంగ్రహించిన వివరాలతో ఆసరా పెన్షన్లు స్వాహా చేయడానికి దాదాపు ఎనిమిది నెలల క్రితం పథకం వేశారు. ఖాతా నంబర్లు మార్చి.. బండ్లగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మందితో కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఈ బ్యాంకు ఖాతాల నంబర్లను అప్పటికే పెన్షన్ పొందుతున్న ఆసరా లబ్ధిదారుల వాటికి బదులుగా రీప్లేస్ చేశారు. కొన్ని పేర్లను వీరే లబ్ధిదారులుగా చేర్చారు. చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలిసి ఉండడంతో వాటి ఆధారంగా కొత్త లబ్ధిదారులు, బ్యాంకు ఖాతా నంబర్ల అప్రూవల్ పొందారు. అనివార్య కారణాల నేపథ్యంలో కొందరు వృద్ధులు తమ బంధువులు, సంబంధీకుల బ్యాంకు ఖాతాలను ఆసరా పెన్షన్ కోసం ఇస్తూ/మారుస్తూ ఉంటారు. ఆ నెపంతో వీరంతా అప్రూవల్ పొందారు. దీంతో అప్పటి నుంచి ఆయా లబ్ధిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బు వీరి పొందుపరిచిన కొత్త ఖాతాల్లోకి వస్తోంది. ఆ డబ్బును ఖాతాదారుల సాయంతో వీళ్లు స్వాహా చేస్తున్నారు. ఇలా మొత్తం రూ.25 లక్షల వరకు ఈ గ్యాంగ్ కాజేసింది. ఇలా గుర్తింపు... ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడడం ఆగిపోయిందని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్ మూలాలు కనిపెట్టారు. దీంతో మంగళవారం అస్లంతో పాటు సొహైల్, మోసిన్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ బయటకు రావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందా? నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అస్లం గతంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశాడు. 2017లో మరికొందరితో ముఠా కట్టి ఆసరా పెన్షన్లనే కాజేశాడు. దాదాపు రూ.40 లక్షలు కాజేసిన ఆ స్కామ్‌లోనూ ఇతగాడు అరెస్టు అయ్యాడు. -
సెల్ఫీ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే, మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్‌తీసుకుని రండి. అప్పుడు మీ దరఖాస్తు పరిశీలిస్తాం’ – ఇదీ ఇప్పటివరకు పింఛనుదారులు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చాలా సందర్భాల్లో ఎదురైన అనుభవం. కళ్ల ముందే మనిషి కనిపిస్తున్నా.. మీరు బతికే ఉన్నారని, ఫలానా రామారావు మీరే అని కాగితాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకోసం కాళ్లరిగేలా ఆ కార్యాలయం, ఈ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తున్న మన రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. మూడు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి దానిని మొబైల్ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ఈ వినూత్న సాంకేతికతకు రూపునిచ్చారు. ఇప్పటివరకు దేశంలో రెండు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి ఫలితాలు సాధించగా.. మన దగ్గర మూడురకాల సాంకేతికతలను ఉపయోగించేలా సిద్ధం చేసిన యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించింది. ఒక్క సెల్ఫీతోనే దీని కచ్చితత్వం ప్రస్ఫుటమవుతుంది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను టీ యాప్ ఫోలియోలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీనిని కొంత మేరకు ట్రెజరీ విభాగంలో రిటైరైన ఉద్యోగుల పెన్షన్ పంపిణీ కోసం వినియోగిస్తున్నారు. రెండు మూడు నెలల్లో దీనిని ఈ విభాగంలో మరింతగా విస్తరించనున్నారు. ఆసరాలో ప్రయోగాత్మకంగా.. ఈ కొత్త యాప్‌ను ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు. పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమిబసు చొరవతో ఇటీవల సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఈ మొబైల్‌యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలించి చూశారు. ఈ గ్రామంలో 60 మంది వృద్దాప్య పింఛన్లు పొందుతున్న వారిని మొబైల్ యాప్ ద్వారా పరిశీలించగా 59 మంది వివరాలు సరైనవేనని తేలింది. ఒక్కరి విషయంలోనూ వివరాలు సరిగా లేకపోవడంతో డేటాబేస్‌లోని సమాచారంతో మ్యాచ్ కాలేదు. ప్రయోజనాలేంటి? పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛనుతో సహా ఆసరా పింఛనుదారులు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లబ్దిదారులు జీవించి ఉన్నారా లేదా నిజమైన లబ్దిదారులకే ఇవి అందుతున్నాయా అని కచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈ మొబైల్ యాప్ ఉపయోగపడనుంది. అలాగే లెర్నింగ్ లైసెన్స్ రెన్యువల్, ఇతర సర్వీసుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద నుంచే సెల్ఫీ తీసుకుని ఆయా సేవలను పొందే వెసులుబాటు కలగనుంది. ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛను పొందాలంటే ప్రతి ఏడాది ‘వార్షిక పెన్షనర్ లైవ్ సర్టిఫికెట్’ను సమర్పించాల్సి ఉండేది. ఇందుకోసం వారు ట్రెజరీ, పెన్షన్ కార్యాలయాలకు వెళ్లి తాము జీవించి ఉన్నట్టుగా స్వయంగా సర్టిఫికెట్లు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. సొంత లేదా అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో పెన్షనర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ తీసుకుని, అవసరమైన వివరాలను పొందుపరిచి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వెంటనే ట్రెజరీ డేటాబేస్‌లో ఉన్న వివరాల ఆధారంగా లైవ్ అథెంటికేషన్ పూర్తయి ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అదే సమయంలో ట్రెజరీ డిపార్ట్మెంట్కు అథెంటికేషన్ వెళుతుంది. పెన్షనర్ స్వయంగా లైవ్ అథెంటికేషన్ కోసం ట్రెజరీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.మాన్యువల్ ప్రక్రియలో ఎదురయ్యే చాలా ఇబ్బందులు ఈ యాప్‌తో తీరనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండానే.. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా యాప్‌ను రూపొందించాం. లబ్దిదారుడిని సెల్ఫీ తీయడం ద్వారా లైవ్ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్ వివరాలతో డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో మ్యాచ్ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి.. సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అన్న అథెంటికేషన్ వస్తుంది. ఇందులో మొదటిది ఓకే కాకపోతే రెండో అంశానికి వెళ్లే అవకాశముండదు. మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. డెబిట్ కార్డు వినియోగం కోసం ‘టు ఫాక్టర్ టెక్నాలజీ’ని ఉపయోగిస్తుండగా మేము వినూత్నంగా ‘త్రీ ఫాక్టర్ అథెంటికేషన్’ను ఉపయోగించాం. – జీటీ వెంకటేశ్వరరావు, ఎండీ టీఎస్టీఎస్, కమిషనర్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కచ్చితత్వం సాధించాం ఎద్దుమైలారంలో ఆసరా పింఛన్ల లబ్దిదారులను ఈ యాప్ ద్వారా పరిశీలించాం. ప్రధానంగా వృద్ధాప్య పింఛను పొందుతున్న వారిని 60 మందిని ఎంపిక చేసి, మా డేటాబేస్‌లో ఉన్న ఫోటో, ఇతర వివరాలను లబ్దిదారుల సెల్ఫీతో మ్యాచ్ చేసి చూశాం. 59 మంది సమాచారం మ్యాచ్ అయ్యింది. ఒక వ్యక్తి వివరాలు సరిగా లేకపోవడంతో మ్యాచ్ కాలేదు. – సూర్యారావు, సంగారెడ్డి జిల్లా అడిషనల్ డీఆర్‌డీఒ -
పింఛన్ కోసం ఎదురుచూపులు
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామని, లబ్ధిదారుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించి ఆసరా పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వం పాత లబ్ధిదారులకు రెట్టింపు పింఛన్లు అందజేస్తున్నా.. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు వయస్సు కుదింపు విషయంలో నేటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో వయస్సు కుదించిన తమకు పింఛన్ అందజేయాలని వారు కోరుతున్నారు. సాక్షి, తుంగతుర్తి: ఆసరా పథకంలో భా గంగా వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల వయోపరిమితిని కుదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోవడంలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ .. పింఛన్లు పెంచడంతో పాటు లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులు, బోధకాలు ఉన్న వారికి ఇస్తున్న పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగుల పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016లకు పెంచిన విషయం తెలిసిందే. వయస్సు కుదించిన లబ్ధిదారులకు జూన్–2019 నుంచి పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా... వృద్ధాప్య పింఛన్ల అర్హత, వయోపరిమితి విషయంలో ఇంత వరకు నిర్ణయం తీసుకోకపోవడంతో కొత్తగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు నిరాశ చెందుతున్నారు. తమకు పింఛన్ వస్తుందన్న నమ్మకంతో అర్హులైన లబ్ధిదారులు అన్ని పత్రాలను తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు ప్రభుత్వంపై పడే అదనపు భారాన్ని లెక్కించేందుకు 57ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక సర్వే నిర్వహించి జాబితాను సిద్ధం చేశారు. ప్రాథమిక సర్వే ద్వారా అర్హుల గుర్తింపు.. వృద్ధాప్య పించన్ల కోసం జిల్లాల్లో 57ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని వీఆర్ఓలు గ్రామాల్లో ప్రాథమిక సర్వేను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో చేపట్టిన ప్రాథమిక సర్వేలో 30,373 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేదక అందజేశారు. 5నెలల క్రితమే ఈ ప్రక్రియను వీఆర్ఓలు పూర్తిచేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమకు పింఛన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ దారులకు కుదించిన వయోపరిమితి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని తమకు పింఛన్లు అందజేయాలని వృద్ధులు కోరుతున్నారు. జిల్లాలో ఇలా.... జిల్లాలో ఇప్పటికే పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు 1,37,479 మంది ఉన్నారు. వీరికి జూలై 2019 నుంచి ఆసరా కింద రెట్టింపు మొత్తాన్ని అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016లకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతకార్మి కులు, చేనేత తదితర లబ్ధిదారులకు రూ.1,000 నుంచి రూ.2,016లకు ప్రభుత్వం పింఛన్లను పెంచింది. కాగా జిల్లాలో ప్రస్తుతం మొత్తం 1,37,479 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తవారు మరో 30,373 మంది ఉన్నారు. దీంతో జిల్లాలో మొత్తం ఆసరా పింఛన్ దారుల సంఖ్య 1,67,850 మందికి చేరనుంది. ఆదేశాలు రాగానే పింఛన్లు అందజేస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలో 57ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వేచేసి తాత్కలిక జాబితాను సిద్దం చేశాం. సర్వేలో జిల్లాలో 30,373 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వీరికి ప్రభుత్వం నుంచి ఆదేశాల రాగానే పింఛన్లు అందజేస్తాం. – కిరణ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట -
డ్వాక్రా అక్కచెల్లెమ్మల వడ్డీ కోసం నిధులు
-
‘సున్నా వడ్డీ’కి రూ.1,020 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.1,020 కోట్లను అక్టోబర్ 2వ తేదీలోగా వారి అప్పు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలానికి మహిళల అప్పులపై వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఏ సంఘానికి ఎంత మొత్తం జీరో వడ్డీ కింద చెల్లిందన్న బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అక్కచెల్లెమ్మల ఇంటి వద్ద అందజేయాలని నిర్ణయించింది. ‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా నేరుగా వారికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ సున్నా వడ్డీకి రుణాల విప్లవం తెస్తాం. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది’ అని వైఎస్ జగన్ నవరత్నాల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని ఏడాది తర్వాత నుంచి నాలుగు దఫాల్లో చెల్లించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. వైఎస్సార్ ఆసరా పథకం అమలయ్యే వరకు అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం ఉండకూడదని ఆ డబ్బులను ప్రభుత్వమే ఎప్పటికప్పుడు బ్యాంకులకు జమ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలుత ఐదు నెలల డబ్బులను అక్టోబరు 2వ తేదీలోగా జమ చేయనుంది. ప్రతి నెలా వడ్డీ రూ.204 కోట్లు ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.27,168.83 కోట్ల అప్పులు ఉన్నట్టు బ్యాంకర్ల సంఘం నిర్ధారించింది. ఈ వివరాలతో సెర్ప్, మెప్మా అధికారులు రాష్ట్ర మంతటా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి, ఏ సంఘానికి ఎంత అప్పు ఉందో తీర్మానం చేయించి, దానిని బ్యాంకు అధికారుల ద్వారా సర్టిఫై చేయిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 99 శాతం సంఘాలతో సమావేశాలు నిర్వహించే ప్రక్రియ పూర్తయింది. సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో 6,01,132 సంఘాల పేరిట రూ.19,504 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,50,042 సంఘాల పేరిట రూ.4,587.71 కోట్లు అప్పు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంఘాల వారీగా ఉన్న అప్పుపై ప్రతి నెలా సుమారు రూ.204 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జీరోవడ్డీ పాస్ పుస్తకాలు సంఘం వారీగా ఉన్న అప్పు మొత్తం, దానిపై ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ వివరాలతో పాటు ప్రభుత్వం ప్రతి నెలా వడ్డీగా బ్యాంకుకు చెల్లించిన రశీదు వివరాలు నమోదు చేయడానికి సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేకంగా పాస్ పుస్తకాలను తయారు చేయిస్తున్నారు. అక్టోబరు 2వ తేదీ తర్వాత ప్రభుత్వం తొలి విడతగా సుమారు రూ.1,020 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన తర్వాత వాటికి సంబంధించిన రశీదులు మహిళలకు అందజేసే సమయంలోనే ఈ పాస్‌పుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా ప్రభుత్వం సంఘాల వారీగా బ్యాంకులకు చెల్లించిన జీరో వడ్డీ రశీదులను అందజేసి, సంఘాల వద్ద ఉండే ఆ పాస్ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. -
పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు 26 నుంచి సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే, వైఎస్సార్ చేయూత పథకంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు ఇది ఉంటుంది. కాగా, ఆగస్టు 15న వలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 15న సీఎం చేతుల మీదుగా శ్రీకారం ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపికైన వలంటీర్లు అదేరోజు వారివారి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీఎం కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో వీరు వీక్షించేందుకు అన్నిచోట్ల ఎల్సీడీలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈవోలను ఆదేశించారు. 16–25 తేదీల మధ్య డేటా సేకరణ వలంటీర్లు విధుల్లో చేరిన వెంటనే తమకు కేటాయించిన 50 ఇళ్ల పరిధిలోని వ్యక్తుల సమగ్ర సమాచారంతో పాటు ఆ కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితి వంటి అన్ని అంశాలపై డేటా సేకరించాలని గిరిజాశంకర్ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య రోజుకు పది కుటుంబాల చొప్పున ఈ సమాచారం నిర్ణీత ఫార్మాట్లో సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు.. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వలంటీర్ల ద్వారా ఇంటికే రేషన్ బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఆరంభించనున్నారు. పెన్షన్ల పంపిణీపై కూడా వీరు సెప్టెంబరు 1న జరిగే పంపిణీ కార్యక్రమంలో ఆయా సిబ్బంది ద్వారా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కొత్త పింఛన్, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికపై శిక్షణ కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లకు అవసరమయ్యే శిక్షణను వచ్చే నెల 11 నుంచి 15 తేదీల మధ్య అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత వలంటీర్లు ప్రతీరోజు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రజల నుంచి అందే వినతులను 72 గంటలలో పరిష్కరించేలా చేయడం.. పింఛన్ల పంపిణీ, కొత్తవి మంజూరుకు అర్హులను గుర్తించడం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని వలంటీర్లే నిర్వహించాల్సి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు
సాక్షి, హుస్నాబాద్: ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 వరకు తగ్గించి పథకం వర్తింప చేస్తామని చెప్పింది. రూ.1000 పింఛన్‌ను రూ.2,016లకు పెంచుతామని ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓటరు జాబితాల ఆధారంగా ఐకేపీ సిబ్బందితో 57 నుంచి 65 మధ్య వయస్సు ఉన్న జాబితాను అందించాలని చెప్పడంతో గ్రామాల వారిగా సర్వే చేసి జాబితాలను సిద్ధం చేశారు. ఇటీవల పెంచిన ఫించన్లు అమలు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు చేసి ఆసరా పింఛన్‌దారులకు మంజూరు పత్రాలను అందజేసింది. ఆసరా ఫింఛన్లకు వయస్సును తగ్గించడంతో మాకు కూడా అందుతాయని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. కొత్త ఆసరా పింఛన్లపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారి ఎంపిక అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం వీటిపై మళ్లీ నిర్ణయం తీసుకునేవరకు ఆశావాదులు నిరీక్షించక తప్పడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఆసరాకు అర్హులెవరు? ప్రభుత్వం ఆసరా పథకానికి 65 నుంచి 57 సంవత్సరాలకు వయస్సు తగ్గించడంతో చాలా మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి 57 సంవత్సరాలు ఉంటే ఆసరా పథకానికి అర్హలవుతారు. కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఆసరాకు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. వీరందరూ ఆయా గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు పరిశీలించి ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే అధికారులు కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. కొత్తగా 4,207 మంది అర్హులు.. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని 49 గ్రామ పంచాయతీల్లో గతంలోనే స్వశక్తి సంఘాల అధ్వర్యంలో ఓటరు జాబితలను అధారంగా ఐకేపీ అధికారులు గ్రామాల వారిగా సర్వే చేయించారు. అప్పటి వరకు 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని సర్వే చేసి గ్రామ పంచాయతీల వారిగా జాబితలను ఉన్నతాధికారులకు పంపించారు. అక్కన్నపేట మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 2,939, హుస్నాబాద్ మండలంలోని 17 పంచాయతీల్లో 1,268 మంది ఉన్నట్లు సర్వే చేశారు. వీరందరూ ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఆసరా ఫించన్లకు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఉద్యోగ విరమణ చేసి ఫించన్ పొందేవారు కూడ ఇదే జాబితాలో ఉన్నారు. అయితే వారిని తొలగించి అర్హతగల వారికి ఆసరా పింఛన్లు అందించుటకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు కొత్త ఆసరా పథకం అమలుకు వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. ఓటరు జాబితాల ఆధారంగా సర్వే చేసి గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేశాం. కొత్త వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వెలువడగానే ఎంపికపై కసరత్తు చేస్తాం. అర్హులకు అందేలా చూస్తాం. – ఉదయ్‌భాస్కర్, ఇన్చార్జి ఎంపీడీఓ, అక్కన్నపేట -
లబ్ధిదారులతో స్పీకర్ వీడియో కాల్
బాన్సువాడ టౌన్: ఆసరా పింఛన్ లబ్ధిదారులతో బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాల్ మాట్లాడారు. పింఛన్లు రూ.2016 ఇవ్వడం సంతోషంగా ఉందని, పిల్లలపై ఆధారపడకుండా పింఛన్లు ఇచ్చి ఇంటికి కేసీఆర్, మీరు(పోచారం శ్రీనివాస్‌రెడ్డి)లు పెద్ద కొడుకులయ్యారని లబ్ధిదారులు పేర్కొనడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తనకు చెప్పవచ్చునని, తమ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పీఏ భగవాన్‌రెడ్డి అందుబాటులో ఉంటారని స్పీకర్ చెప్పారు. -
‘డబ్బు’ల్ ధమాకా!
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల ‘డబ్బు’ల్ ధమాకా లభించనుంది. రాష్ట్ర ప్రభు త్వం ఆసరా లబ్ధిదారులకు రెట్టింపు చేసిన పింఛన్లు ఈ నెలలోనే వారి ఖాతాల్లో చేరనున్నాయి. ఈ నెల 22 నుంచి బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాల్లోకి ఈ పింఛన్లు బదిలీ కానున్నాయి. ఇప్పటికే మే నెలకు సంబంధించిన పాత పింఛన్లు వారికి అందజేయగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జూన్ నుంచి చెల్లించాల్సిన రెట్టింపైన పింఛన్ల మొత్తాన్ని కూడా ఈ నెల 22 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో మే నెలకు సంబంధించిన పాత పింఛన్‌తో పాటు జూన్ నెలకు పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులు అందుకోనున్నారు. ఇలా ఒకే నెలలో రెండు పింఛన్లు వారికి అందనున్నాయి. ఇప్పటివరకు ఒక నెల అంతరంతో పింఛన్లు ఇస్తుండటంతో జూన్‌కు సంబంధిం చిన మొత్తం ఆగస్టులో అందుతుందని లబ్ధిదారులు భావించారు. అయితే పెరిగిన పింఛన్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని, జూలై 1న లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్నట్లు గతంలో పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఈ నెలలోనే పెంచిన పింఛన్లు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండురోజుల పాటు సాగిన శాసనసభ, మం డలి సమావేశాలు ముగియడంతో శనివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రెట్టింపు చేసిన పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. దివ్యాంగులకు రూ. 1,500 నుంచి రూ.3,016, ఇతర లబ్ధిదారులకు రూ.వెయ్యి నుంచి రూ.2,016 చొప్పు న పింఛన్ పెంచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి 2014, నవంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రతి నెలా రూ.1,500, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద మొత్తం 38,99,044 మందికి పెంచిన ఆసరా పింఛన్లు అందనున్నాయి. అంతేకాకుండా వృద్ధాప్య పింఛన్లు పొందే అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మందికి వివిధ పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ప్రస్తుత వయస్సు తగ్గింపుతో మరో 8 లక్షల మంది వరకు అదనంగా చేరతారని అధికారుల అంచనా. -
‘పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసు’
సిరిసిల్ల: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రూ.43 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘ఆసరా’ పించన్లు మంజూరు పత్రాలను శనివారం ఆయన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో అగ్రభాగం సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నామని వివరించారు. రాష్ట్ర జనాభా 3.60 కోట్లు కాగా, 50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ అర్హత వయసును 57కి తగ్గించడంతో రాష్ట్రంలో మరో రెండు లక్షల మందికి లబ్ధి కలుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏటా రూ.12వేల కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అంటే.. నెలకు రూ.వెయ్యి కోట్లతో పేదలకు ఆసరా కల్పిస్తున్నామని అన్నారు. రూ.12 వేల కోట్ల పింఛన్ సొమ్ములో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం 17 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ‘రాష్ట్రంలో ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 700 గురుకులాల్లో 3 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు వెచ్చిస్తున్నామని కేటీఆర్ వివరించారు. మనసున్న సీఎం.. పేదలకు ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. మనసున్న సీఎం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు, కేసీఆర్ కిట్టు అందిస్తున్నామని వివరించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, కాలేజీ స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, పేదల పెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు పింఛన్లతో ఆసరా కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రెట్టింపు చేశామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎలాంటి పైరవీ అవసరం లేదని, ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ జోక్యం ఉండదని సీఎం ప్రకటించారని వివరించారు. గత పాలకులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఖరీదు రూ.70వేలని ఆయన పేర్కొన్నారు. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లుతో పోల్చితే.. ఎనిమిది ఇందిరమ్మ ఇళ్లకు సమానమని కేటీఆర్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా పేదల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. అర్హులు ఎక్కువగా ఉంటే కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. జాగా ఉన్న వారికి సీఎం చెప్పినట్లుగా ఇల్లు కట్టుకోడానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాలకు వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్ తెలిపారు. రూ.65 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘మీ బాకీ ఉంచుకోం’అని మహిళలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల నేతన్నలకు రూ.300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి ఆదుకున్నామని చెప్పారు. సభలో కలెక్టర్ కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘దేశంలో రూ. 2016 పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే’
సాక్షి, సిద్దిపేట: దేశంలోని 29 రాష్ట్రాల్లో.. 130 కోట్ల జనాభాలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్లో పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 6 నెలల నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. పెరిగిన పెన్షన్ పేదల ఆత్మ గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ పెన్షన్లను రెట్టింపు చేసి పేదలకు ఆసరాగా నిలుస్తున్నారన్నారు హరీశ్ రావు. 57 ఏండ్లు నిండిన వారితో పాటుగా.. కొత్తగా పీఎఫ్ వచ్చిన బీడీ కార్మికులను కూడా గుర్తించి పెరిగిన పెన్షన్లు అందిస్తామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా బంద్ చేయాలని కోరారు. త్వరలోనే అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూంలు ఇస్తామని స్పష్టం చేశారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. సిద్దిపేట పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని హరీశ్ రావు కోరారు. -
మరింత ఆసరా!
సాక్షి, సిటీబ్యూరో: ఆసరా పింఛన్ల సొమ్ము రెట్టింపుగా అందనుంది. పెరిగిన పింఛన్లు అమల్లోకి రావడంతో హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 4.80 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెరిగిన పింఛన్ సొమ్ము జూలై మాసంలో లబ్ధిదారులకు అందనున్నాయి. శనివారం రవీంద్రభారతిలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.1000లుగా ఉన్న పింఛన్ రూ.2016ల చొప్పున అందనుంది. అదేవిధంగా వికలాంగులు, వృద్ధ కళాకారులకు రూ.1500లుగా ఉన్న పింఛన్ రూ.3016లుగా అందనుంది. ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ ముగిసిన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ కానుంది. మరో నాలుగు లక్షల మంది లబ్ధిదారులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పింఛన్ వయోపరిమితి 57కు తగ్గింపుతో మరో నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 57 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు గల వారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చని రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది. తాజాగా కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక కోసం 57 ఏళ్ల నుండి 64 సంవత్సరాల లోపు వ్యక్తుల ముసాయిదా జాబితాను ఈ నెల 25వ తేదీలోపు పూర్తిచేసే విధంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. 2018 నవంబర్ మాసంలో ప్రకటించిన ఎన్నికల తుది జాబితాను అనుసరించి 57 సంవత్సరాల పైబడ్డవారి వివరాల జాబితాను రూపొందించనున్నారు. నగర ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయం కలిగి ఏవిధమైన స్థిరాస్తి లేకుండా గతంలో పింఛను పొందని వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. బి.ఎల్.ఓలు ఇంటింటి సర్వేను చేపట్టి ప్రాథమికంగా అర్హులుగా ఉన్నవారి ఆధార్ నెంబర్లను సేకరించనున్నారు. పింఛన్ల మంజూరుకు వయోపరిమితిని సాధారణంగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ప్రామాణికంగా చేసుకొని నిర్ధారించనున్నారు. 57 ఏళ్ల నుండి 64 సంవత్సరాల లోపు ఉన్నవారి జాబితాను సేకరించి వారికి గతంలో వద్ధాప్య పింఛన్లు గాని, మరే ఇతర పింఛన్లు గానీ పొందుతున్న వివరాలను సకుటుంబ సర్వే, అందుబాటులో ఉన్న ఇతర సమాచారంతో అనుసంధానం చేసి అనర్హులను తొలగించి ముసాయిదాను రూపొందించనున్నారు. మొత్తం మీద వయసు సడలింపు అమలుతో ఆసరా పింఛన్లు పొందే వారి సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అందని ఆసరా
మెదక్‌జోన్: ‘ఆసరా’ కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. నెలనెలా 5వ తేదీ లోపున అందాల్సిన పింఛన్లు నెలన్నర గడిచినా ఇప్పటివరకు అందలేదు. వచ్చిన పింఛన్ డబ్బులతో మందులు కొనుక్కునేవారు చాలామంది ఉన్నారు. పింఛన్ సకాలంలో రాకపోవడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 1,03,213 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా 5వ తారీఖు లోపల రూ.11.20 కోట్లు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. కొంతమందికి పోస్టాఫీసుల ద్వారా అందుతుండగా మరికొందరికి నేరుగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. మరికొంత మందికి గ్రామాల్లో సీఏలు అందిస్తున్నారు. ఇప్పటివరకు దివ్యాంగులకు నెలకు రూ.1,500 ఇస్తుండగా మిగతా వారికి రూ.వెయ్యి చొప్పున అందజేస్తున్నారు. పింఛన్‌దారుల్లో 80 శాతం మంది వృద్ధులు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు పింఛన్ రాగానే నెలకు సరిపడా మందుగోలీలను కొనుగోలు చేస్తారు. మందుగోలీలు అయిపోయి పింఛన్ రాక వారు ఇబ్బంది పడుతున్నారు. వీరిలో ముఖ్యంగా కొడుకులు లేనివారు, అనాథల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దివ్యాంగులకు వచ్చే రూ.1,500 పింఛన్‌పై వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పింఛన్ డబ్బులు వస్తేనే రేషన్‌బియ్యం కొనుగోలు చేసి నెలంతా జీవనం సాగించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి ఆసరా పైకం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏ అధికారి కనిపించినా సారూ మా పింఛన్ వచ్చిందా? అంటూ ఆరా తీస్తున్నారు. రెట్టింపు ఎప్పుడో? రెండోసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తాము తిరిగి అధికారంలోకి వస్తే పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా పింఛన్ల పెంపుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నూతనంగా 57 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారనే జాబితాను మాత్రం ఇప్పటికే గ్రామీణాబివృద్ధిశాఖ అధికారులు సర్వే చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,03,213 మంది మంది అన్ని రకాల పింఛన్‌దారులు ఉండగా 57 సంవత్సరాలు నిండిన వారు 38,978 మంది ఉన్నారు. వీరిలో పింఛన్‌కు అర్హులైన వారు 10,982 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తవారితో పాటు పాతవారికి పింఛన్ పెంచితే ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ. 11.20కోట్లకు బదులు మూడింతలు పెరుగుతుంది. మందుగోలీలకు పైసల్లేవు నాకు బీపీ, దమ్ము ఉన్నాయి. నెలనెలా పింఛన్ రాగానే మందుగోలీలు కొంటాను. ఈసారి ఇంకా పింఛన్రాలేదు. మందుగోలీలు అయిపోయి పదిరోజులు అవుతోంది. నాకు పింఛన్ వస్తదని నా కొడుకులు ఎవరూ మందుగోలీలు తేరు. గా పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తయో ఏమో. పోచయ్య, వృద్ధాప్య పింఛన్‌దారుడు, జంగరాయి, చిన్నశంకరంపేట పింఛన్ వస్తేనే పూట గడిచేది మాది నిరేపేద కుటుంబం. నాకు పింఛన్ వస్తేనే పూట గడుస్తుంది. నెలనెలా వచ్చే పింఛన్‌తో రేషన్‌బియ్యం తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈనెల ఇంకా పింఛన్ రాకపోవడంతో ఈనెల సరుకులు తీసుకోలేదు. త్వరగా వచ్చేలా చూడాలి. – బాల్‌రాజు, దివ్యాంగుడు పాల్వంచ, టేక్మాల్ మండలం -
‘ఆసరా’ ఇవ్వరా?
వనపర్తి: పింఛన్‌పైనే ఆధారపడిన పేదలు చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు.. ఊర్లో అప్పు పుట్టక.. మందులు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేక పింఛన్ ఎప్పుడు వస్తుంది దేవుడా.. అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. రోజు కార్యాలయానికి వెళ్లడం ఏమైంది సారూ.. అని అడగడం.. ఏమో అని అధికారి చెప్పే సమాధానం విని నిరాశతో తిరిగిరావడం నిత్యకృత్యమైంది. పక్షం రోజులుగా పరేషాన్ ప్రతినెలా బ్యాంకు ఖాతాలో జమయ్యే ఆసరా పింఛన్ మే మాసం పూర్తయి పక్షం రోజులవుతున్నా రాకపోవటంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్‌పై ఆధారపడే వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. జూన్ మాసం నుంచి పింఛన్ పెరుగుతుందని ఆశ పడిన పేదలకు మే నెల పింఛన్ కూడా రాకపోవటంతో బ్యాంకుల వద్దకు వచ్చి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతీనెలా పింఛన్ వస్తుందనే ధైర్యంతో కిరాణం, టీకొట్టు, మెడికల్ షాపుల్లో అరుపు పెట్టే అలవాటు ఉన్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మే నెల పింఛన్లు ఎందుకు రాలేదన్న ప్రశ్నలకు ఇటు అధికారులు, అటు పాలకులు సరైన సమాధానం చెప్పకపోవటంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 71,589 మంది జిల్లాలో మొత్తం ఆసరా లబ్ధిదారులు 71,589 మంది ఉండగా వృద్ధులు 28,020, వితంతువులు 27,546, చేనేత కార్మికులు 696, గీత కార్మికులు 456, బీడీ కార్మికులు 1003 మంది ఉన్నారు. వారికి ప్రతినెల రూ. వెయ్యి, 11,277 మంది వికలాంగులకు ప్రతి నెల రూ.1500ల చొప్పున జిల్లాలో ప్రతి నెల ఆసరా పింఛన్ల రూపేన ప్రభుత్వం రూ. 8.19 కోట్లు కెటాయిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,591 మంది ఒంటరి మహిళలకు ప్రతినెల రూ. వెయ్యి చొప్పున నెలకు రూ.26 లక్షలు ఇస్తోంది. రెట్టింపైనట్టేనా? ప్రస్తుతం ఆసరా పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులకు ఎన్నికల హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ మాసం నుంచి రూ.వెయ్యి పింఛన్ తీసుకునే వారికి రూ.2016, రూ.1500 పింఛన్ అందుకునే వికలాంగులకు రూ.3016 ఇస్తామని ప్రకటించింది. కానీ ఒకనెల ముందే అసలుకే పింఛన్ ఇవ్వకపోవటంతో వృద్ధులు, వికలాంగులు ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లి అధికారులను నిలదీసేందుకు వెనకాడటం లేదు. అమరచింత నిరసన గురువారం జిల్లాలోని అమరచింత మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆసరా పింఛన్ల లబ్ధిదారులు మే, జూన్ మాసం పింఛన్లు వెంటనే ఇప్పించాలని నిరసన వ్యక్తం చేశారు. వారికి కమ్యూనిస్టు పార్టీలతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. పింఛన్లు పెంచుతామని చెప్పి మొత్తానికి ఇవ్వకుండా ఆపేస్తే వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని నినదించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన ప్రకారం ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘ఆసరా’ అందేలా..
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా దరఖాస్తుదారులకు మరో అవకాశం కల్పించింది. పింఛన్ దరఖాస్తు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. అర్హులు సంబంధిత గ్రామ కార్యదర్శి లేదా ఎంపీడీఓలకు తమ దర ఖాస్తులను అందజేయాలని సూచిం చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మరికొందరు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. వయసు కుదింపుతో 25,848 దరఖాస్తులు గతంలో ఉన్న 65 ఏళ్ల నిర్ణీత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించడంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది పింఛన్ పొందేందుకు అర్హత సాధించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ వయసు తగ్గిస్తామని ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ ప్రకటించారు. అంతేకాక.. కుదించిన వయసు వారికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే పెన్షన్ అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో జిల్లా అధికారులు వివిధ మండలాల నుంచి 57 ఏళ్లు నిండిన వారి వివరాలను ఓటర్ జాబితా ఆధారంగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే క్షేత్రస్థాయిలో గ్రామాలలో సర్వే చేసి గ్రామ సభలో వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వరుసగా ఎన్నికలు రావడంతో ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ప్రాథమికంగా అర్హత సాధించిన వారు 25,848 మంది ఉన్నట్లు తేలింది. దరఖాస్తు గడువు పెంపుతో మరికొందరు పెరిగే అవకాశం ఉంది. పెంచిన పింఛన్ జూలై నుంచి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. దీనికనుగుణంగా జూన్ నుంచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, బీడీ, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు అందే పెన్షన్లు పెరగనున్నాయి. జూలైలో ఈ మొత్తం లబ్ధిదారులకు అందనుంది. జిల్లాలో 1,05,695 ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రస్తుతం రూ.11.19 కోట్లు వస్తుండగా.. జూలై నుంచి ఈ మొత్తం రూ.22.55 కోట్లకు పెరగనుంది. దివ్యాంగుల పింఛన్ రూ.1500 నుంచి రూ.3016కు, మిగిలిన వారి పెన్షన్ రూ.1000 నుంచి రూ.2016కు పెరిగింది. జిల్లాకు రూ.11.36 కోట్ల అదనపు లబ్ధి.. పెంచిన ఆసరా పింఛన్ల మొత్తాన్ని వచ్చే నెలలో లబ్ధిదారులకు అందించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో వృద్ధాప్య పింఛ¯Œన్‌దారులు 38,907, దివ్యాంగులు 12,499, వితంతువులు 47,478, చేనేత 21, గీత కార్మికులు 146, ఒంటరి మహిళలు 5,656, ఏఆర్సీ బాధితులు 843, పైలేరియా బాధితులు 142, బీడీ కార్మికులు ముగ్గురు మొత్తం 1,05,695 మందికి ఆసరా పింఛ¯న్లు అందుతున్నాయి. వీరి కోసం ప్రతి నెలా జిల్లాకు రూ.11.19 కోట్ల మొత్తం విడుదలవుతోంది. పెరిగిన మొత్తం ప్రకారం జిల్లాకు రూ.22.55 కోట్లు కేటాయించనున్నారు. జిల్లాకు రూ.112.48 కోట్లు విడుదల.. ప్రభుత్వం ఇటీవల జిల్లాలకు ఆసరా నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఆసరా లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చెల్లింపులకు రూ.4361.79 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లాకు 112.48 కోట్లు మంజూరయ్యాయి. రెట్టింపు చేసిన ఆసరా పింఛన్లు జూన్ నుంచి ఇవ్వనున్న నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు రూ.90.10 కోట్లు విడుదల కాగా, ఏప్రిల్, మే నెలలకు గతంలో లాగే రూ.22.38 కోట్లు చెల్లిస్తారు. -
ఆదిలోనే అవరోధాలు
సాక్షి,సిటీబ్యూరో: కొత్త ఆసరా లబ్దిదారుల ఎంపికపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తరచూ సమస్యలు ఎదురవుతుండటంతో లబ్ధిదారుల జాబితా తుది అంకానికి చేరుకోవడం లేదు. అసరా అర్హుల జాబితా రెవెన్యూ నుంచి జీహెచ్ఎంసీ చేతికి అంది ఆరునెలలు గడిచినా తుది జాబితా రూపకల్పనపై స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం విధితమే. అనుకున్నట్లుగానే తిరిగి రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో నిధులను సైతం కేటాయించింది. దీంతో అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా ఆధారంగా ‘ఆసరా’ వృద్ధాప్య పించన్ల కోసం అర్హుల లెక్క తేల్చారు. వయస్సు నిర్ధారణకు ఓటరు కార్డును ప్రామాణికంగా తీసుకొని 57 నుంచి 65 ఏళ్ల వయస్సు లోపు వారిని అర్హులుగా గుర్తించారు. 6 మాసాల క్రితమే కొత్త నిబంధల ప్రకారం ఆసరా వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారిని గుర్తించాలని అధికార యంత్రాంగాలకు ఆదేశాలు అందాయి. ఆసరా పింఛన్ల అర్హతపై గతంలో జారీ అయిన జీఓ 17కు అనుగుణంగా తాజాగా మరో జీవో జారీ అయింది. వయస్సు సడలింపు మినహా మిగిలిన నిబంధనలు య«థాతధంగా ఉండటంతో ప్రస్తుతం ఆసరా పింఛన్లను పర్యవేక్షిస్తున్న విభాగాలు అర్హులైన వారిని గుర్తించి ప్రాథమిక జాబితా రూపొందించారు. ఓటరు జాబితా ఆధారంగా పలువురిని లబ్ధిదారులుగా గుర్తించినా వారిలో ఒకే ఇంట్లో రెండు పింఛన్లు, వారి పిల్లల ఉద్యోగస్తులుగా ఉండడం తదితర కారణాల రీత్యా ఆ జాబితాను వడబోశారు. అయితే అంతలో వరుస ఎన్నికలు, కోడ్ అమలులో ఉండడం తదితర కారణాలతో అర్హుల జాబితా తుది అంకానికి చేరలేదు. నాలుగు లక్షల పైనే... గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ రెవెన్యూ జిల్లాలో 57 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు గల వారు నాలుగు లక్షల పైగా> ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్లో మొత్తం 1,50,401 వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు ఉండగా, అందులో హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో 58, 575, రంగారెడ్డి జిల్లాలో 60,129, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 31697 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. వయోపరిమితి సడలింపుతో వారి సంఖ్య మూడింతలు పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పింఛన్ దారులతో కలిపి సంఖ్య రెట్టింపు కావచ్చని సమాచారం. -
పింఛన్లు రెట్టింపు చేసిన తెలంగాణ సర్కార్
-
ఆసరా రెట్టింపు
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి పెరిగిన పింఛన్లను అమలు చేయనున్నట్లు తెలిపింది. పెరిగిన పిం ఛన్ల మొత్తాలను జూలై 1 నుంచి లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులతో దివ్యాంగులకు నెలకు రూ. 3,016, మిగతా లబ్ధిదారులకు నెలకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్లు అందించనుంది. ఆదాయం పెంచాలి... పేదలకు పంచాలనేది తమ ప్రభుత్వ విధానమన్న టీఆర్ఎస్... అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఆసరా ఫించన్ల రెట్టింపును ప్రధానంగా పేర్కొంది. సామాజిక భద్రత కార్యక్రమం కింద ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా సగటున రూ. 5,300 కోట్లు ఖర్చు... రాష్ట్రంలో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచింది. 2014 నవంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 1,500, మిగిలిన పింఛనుదారులకు ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున అందిస్తోంది. తొమ్మిది రకాల ఆసరా లబ్ధిదారులు కలిపి రాష్ట్రంలో 39,42,371 మంది ఉన్నారు. ఆసరా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున రూ. 5,300 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫించన్ల మొత్తం పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం 2019–20 బడ్జెట్లో రూ. 12,067 కోట్లు కేటాయించింది. నిర్ణీత వార్షిక ఆదాయ అర్హత ఉంటేనే ఆసరా లబ్ధిదారులుగా అవకాశం కల్పిస్తారు. 65 ఏళ్లు నిండిన వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు. వితంతువులకు 18 ఏళ్లు నిండాలి. దివ్యాంగులకు వయసుతో సంబంధంలేదు. వృద్ధాప్య పింఛను అర్హత వయసును 58 ఏళ్లకు తగ్గించనున్నట్లు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తగ్గించిన వయోపరిమితి ప్రకారం వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తికాగానే కొత్త వారికి సైతం పెరిగిన పింఛను మొత్తాలను చెల్లించేలా గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆసరా పథకం లబ్ధిదారులకు అందిస్తున్న ప్రస్తుత పెన్షన్, పెరిగిన పెన్షన్ (రూ.లలో) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్లు రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా..ఆ హామీని అమలు చేయనున్నారు. ప్రతి నెల ఇచ్చే సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుంచి పింఛన్ల పెంపుదల వర్తిస్తుందని.. జూలైలో లబ్దిదారులకు ఆ మొత్తాన్ని అధికారులు అందజేస్తారని వెల్లడించింది. ఆసరా పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1000 పింఛన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2,016 అందనున్నాయి. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఇవ్వనున్నారు. -
ఆసరాకు.. అడ్డంకులు!
అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్ పెంచడంతోపాటు లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో ఓటరుజాబితాలో వయస్సును బట్టి అధికారులు పలువురిని లబ్ధిదారులుగా గుర్తించినా వారిలో ఒకే ఇంట్లో రెండు పింఛన్లు, వారి పిల్లల ఉద్యోగస్తులుగా ఉండడం తదితర కారణాల రీత్యా ఆ జాబితాను వడబోశారు. కానీ వరుస ఎన్నికలు రావడం..కోడ్ అమలులో ఉండడం వంటి ఆటంకాలతో అర్హులు పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొత్తగా ఆసరా పెన్షన్లు పొందేందుకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. అనుకున్నట్లుగానే తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. కానీ కొత్తగా అర్హులైన పెన్షన్ దారులు ఆసరా పెన్షన్లు పొందేందుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ మే 23 వరకు అమలులోనే ఉంటుంది. దీనికి తోడు జిల్లా పరిషత్ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రావడంతో ఈనెలలో కొత్త పెన్షన్‌దారులకు ఆసరా అందడం అసాధ్యంగానే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,89,589 మంది వివిధ రకాల ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో వృద్ధాప్య పెన్షన్లు 65,472 మంది పొందుతుండగా, దివ్యాంగులు 30,315 మంది, వింతంతు పెన్షన్లు 76,029 మంది, చేనేత కార్మికులు 2,928 మంది, గీత కార్మికులు 7,597 మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటరి మహిళలకు కూడా పెన్షన్ కల్పించడంతో జిల్లాలో 7248 మంది పెన్షన్ పొందుతున్నారు. ప్రతినెలా రూ.20.47 కోట్లు ఖర్చు ప్రతినెలా ప్రభుత్వం జిల్లాలోని వివిధ రకాల పెన్షన్ దారులకు రూ.20,47,46,500 జిల్లాలో ఖర్చు చేస్తుంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.వెయ్యి పెన్షన్ అందిస్తుండగా, వికలాంగులకు మాత్రం రూ.1500 అందజేస్తుంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండోసారి అధికారం చేపట్టగానే ఆసరా పెన్షన్ల కోసం 65 నుంచి 57 సంవత్సరాల వయస్సు ఉన్న అర్హులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను అనుసరించి డీఆర్డీఏ అధికారులు 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారందరినీ గుర్తించారు. అందులో 84,515 మంది 57 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిగా గుర్తించారు. గుర్తించిన వారిలో అర్హులను తేల్చిన ఎంపీడీఓలు ఓటర్ల జాబితా ఆధారంగా 84,515 మందిని గుర్తించగా, ఆయా మండలాల ఎంపీడీఓలు వాటన్నింటినీ పరిశీలించారు. అందులో ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరు పెన్షన్ పొందుతుండడం వల్ల కొందరిని తొలగించగా, మరికొందరిని ఇతర కారణాలతో అనర్హులుగా తేల్చారు. చివరికి 35863 మందిని అర్హులుగా గుర్తించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తే పెరగొచ్చు... ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న అధికా రులు 57 సంవత్సరాల వరకు ఉన్నవారి ని గుర్తించగా ఎంపీడీఓలు వారి జాబితా లను పరిశీలించి అర్హులుగా గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అసవరం ఉంది. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో అధికారులంతా బిజీగా ఉండడం, దానికితోడు కోడ్ కూడా ఉండడంతో ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకపోవడం, అటు ప్రభుత్వం కూడా కోడ్ కారణంగా కొత్త పెన్షన్‌ను అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. జూన్ వరకు కొత్త పెన్షన్‌దారులకు ఎదురుచూపులు తప్పవు ఇటు ఎన్నికల కోడ్, మరోపక్క అధికా రుల ఎన్నికల విధులతో బిజీగా ఉండడం వల్ల కొత్త పెన్షన్ దారులు అర్హత సాధించినా ప్రభుత్వం ఇస్తానన్న సమయం నుంచి పెన్షన్లు పొందలేని పరిస్థితి. మే మాసంలో కూడా అందే అవకాశాలు కన్పించడం లేదు. ఎన్నికలు పూర్తయితేనే అటు ఎన్నికల కోడ్‌తోపాటు అధికారులు కూడా ఫ్రీ అవుతారు. జూన్మాసంలో కొత్తవారికి పెన్ష న్ అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు కొత్త పెన్షన్‌దారులు ఎదురుచూడక తప్పని పరిస్థితి. -
నాకొద్దు ఈ పెద్దకొడుకు!
సాక్షి, విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రి సమీపంలో యాచిస్తున్న ఈ వృద్ధురాలి పేరు బత్తుల అనువాయమ్మ. ఆమె చేతి సంచిని ఒకసారి గమనించండి. చంద్రబాబు ఫొటోతో పాటు ‘పెన్షన్ పెద్దకొడుకు’ అని దానిపై ఉంది. ఆ సంచిపై ఏముందో కూడా నిజానికి ఆమెకు తెలియదు. రోజూ యాచన కోసం ఆ చేతి సంచినే వాడుతుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని అడ్డరోడ్డు వద్ద నివసిస్తున్న అనువాయమ్మను ‘సాక్షి’ పలకరించింది. వృద్ధాప్య పింఛన్ వస్తుందా? అని అడగ్గా.. పింఛన్ కోసం ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ ప్రభుత్వం కనికరించలేదని వాపోయింది. ఆ సంచిపై ఏముందో ఆమెకు చెప్పగా.. ‘ప్రచారానికి మాత్రమే ఆయన పెద్ద కొడుకు.. అలాంటి పెద్దకొడుకు నా కొద్దు’ అంది. -
ఈ కన్నీళ్లు.. కొన్నాళ్లే!
సాక్షి, నెట్వర్క్ : జవసత్వాలు ఉడికి కట్టెలుగా మారిన వృద్ధులు.. ముదిమిలో ఆసరా లేక ఆకలి కార్ఖానాలో పేగులు మాడ్చుకుంటున్నారు. ప్రభుత్వ నిర్దయకు గురై.. బతుకు భారమై కష్టాల సుడిగుండంలో విలవిలలాడుతున్నారు. పింఛన్ పెంచామని చెబుతూనే సవాలక్ష ఆంక్షలతో, బయోమెట్రిక్ జిమ్మిక్కులతో కొర్రీ పెట్టిన సర్కారు మాయాజాలంలో చిక్కుకుని వేదన పడుతున్నారు. అర్హతకు పార్టీనే కొలమానంగా మార్చిన తీరుకు కన్నీరవుతున్నారు. ఇదేనా మా భవిష్యత్‌కు మీ బాధ్యత అంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు. కుల, మత, వర్గ బేధం లేకుండా, పార్టీలకతీతంగా పింఛన్ రూ.3 వేలు ఇస్తామన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనను మనసారా స్వాగతిస్తున్నారు. ప్రజా సంకల్ప సూరీడై వచ్చిన ఆయన తమ బతుకుల్లో నవోదయం తీసుకొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల నుంచి అర్జీలు పెడుతున్నా మూడు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం అర్జీలు పెడుతున్నా మంజూరు కావడం లేదు. నాకు 74 సంవత్సరాలు. అర్హత ఉన్నా కూడా పింఛన్ ఇవ్వటం లేదు. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతి పరుడిననే సాకుతోనే అడ్డుకుంటున్నారు. పింఛన్ ద్వారా వచ్చే డబ్బులు కనీసం మందు బిళ్లల కోసమైనా పనికొస్తాయని ఆశతో అర్జీలు పెడుతున్నా మంజూరు చేయడం లేదు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పార్టీలకు అతీతంగా వృద్ధులకు నెలకు రు.3వేల పింఛన్ ఇస్తామని ప్రకటించడం భరోసా కల్పించింది. –వనమాల వెంకటరెడ్డి, రుద్రవరం జగన్‌తోనే న్యాయం జరుగుతుంది చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకే రూ.2వేలు ఇస్తున్నాడు. నాలుగేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు. జగన్ ప్రకటించాడని తెలియగానే తాను కూడా ఇచ్చాడు. జగన్ రూ.3వేలు ఇస్తానంటే తాను కూడా ఇస్తానంటున్నాడు. జగన్‌తో న్యాయం జరుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలన కరవుకాటకాలతో గడిచిపోయింది. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే పేదప్రజలకు న్యాయం జరుగుతుంది. అవ్వాతాతలకు రూ.3వేలు పింఛన్ కచ్చితంగా అమలవుతుంది. –పమిడిమర్రు జగన్, నరసరావుపేట -
మనవడొస్తాడు..అందరికీ ఇస్తాడు
సాక్షి, కైకలూరు : ‘వృద్ధులను గౌరవించడం మా బాధ్యత.. వారికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించి వారి శేషజీవితం ఆనందంగా గడిపేందుకు సహకరిస్తాం’. ఇది ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లలో రాజకీయాలకు తెరలేపారు. అర్హులకు మొండిచేయి చూపిస్తూ జన్మభూమి కమిటీలు సూచించిన తమ పార్టీవారు వారు అర్హులు కాకపోయినా పింఛను ముట్టజెప్పారు. ‘అయ్యా.. మాకు పింఛను సొమ్ము రావడంలేదు. వృద్ధాప్యంలో మాకు కాస్త అండగా ఉండేది ఆ డబ్బులేనయ్యా’ అంటూ పండుటాకులు వేడుకుంటున్నా.. ఓపిక లేకపోయినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈక్రమంలో కార్యాలయాల చుట్టూ తిరగలేక, మనోవ్యథతో, మందులకు డబ్బులులేక రాలిపోయిన పండుటాకులు ఎందరో.. పింఛన్లు పెంచామని డప్పులు కొట్టుకున్నారు గానీ.. మహానేత వైఎస్సార్ హయాంలో పింఛన్ పొందుకున్న దాదాపు 50శాతం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్‌ను దూరం చేశారన్నది జగమెరిగిన సత్యం. ఈక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీపై అవ్వాతాతలు ఆశపెట్టుకున్నారు. గతంలో కులం, మతం, వర్గం, పార్టీ అంటూ చూడకుండా మహానేత వైఎస్సార్ నడిచిన బాటలోనే వైఎస్ జగన్ నడిచి మాకు న్యాయం చేస్తాడని కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు... జగన్ చేసేదే చెప్తారు... వైఎస్ జగన్ నెలకు రూ2వేలు పింఛన్ ఇస్తానని నవరత్నాల్లో ప్రకటించడంతో ఎంతో ఆశపడ్డా. ఎన్నికలముందు చంద్రబాబు హడావుడిగా రూ.2వేలకు పెంచారు. ఇది ఎన్నికల గిమ్మిక్కని మాకుతెలుసు. ఇప్పుడు రూ.3వేలు ఇస్తానని చంద్రబాబు చెప్పే మాటలు నమ్మం. జగన్ చెప్పింది చేస్తాడనే నమ్మకం మాకుంది. – చొప్పాల మహంకాళరావు, చినకామనపూడి ఇన్నాళ్లు ఏమైంది? గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతేనే వారిస్థానంలో కొత్తపింఛన్ మంజూరు చేసేవారు. దివంగత వైఎస్ దయతో అర్హుౖలకు అందరికీ పింఛన్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు రకరకాల మాటలతో పింఛన్‌దారులను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారు.ఇన్నాళ్లులేని జాలి ఇప్పుడే ఎందుకు చూపాల్సి వస్తుందో మాలాంటి వారికందరికీ తెలుసు. – పి.సూర్యచంద్రరావు, చిగురుకోట -
పండుటాకులకు ఆసరా
సాక్షి, మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పండుటాకులకు ఆసరాగా, దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఆసరా పింఛన్లను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. గతంలో రూ.75 ఉన్న పింఛనును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.200లకు పెంచారు. దాంతో అప్పటి ధరల మేరకు వారికి ఆసరాగా నిలిచిన పింఛన్లను 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టోలో గెలిస్తే వాటిని పెంచుతామని ప్రకటించింది. గెలిచిన తరువాత వృద్ధులకు, వితంతువులకు రూ.200 నుంచి రూ.1000, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500 పెంచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచటంతో పాటు, పింఛను వయస్సను కుదిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పింఛను అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హామీ అమలు దిశగా రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అర్హులైన వారి వివరాలను ప్రభుత్వ యంత్రాంగం సేకరిస్తుంది. ఏప్రిల్ నుంచి పెంచిన ఫించన్లు అందజేసేలా సమాయత్తం అవుతుంది. మరింత మందికి లబ్ధి.. తాజా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 57 నుంచి 64 ఏళ్ల మధ్య ఎంతమంది ఉన్నారు అనే వివరాలతో కూడిన జాబితా అధికారులు సిద్ధంచేశారు. ఆ జాబితాలోని వారు మరే ఇతర రకాల పింఛన్లు ఏమైనా తీసుకుంటున్నారా అని పరిశీలిస్తున్నారు. 57–64 ఏళ్ల మధ్య ఉన్నవారు వికలాంగులైతే వికలాంగుల పింఛను తీసుకొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు మళ్లీ ఆసరా పింఛను తీసుకోవడానికి అనర్హులు. ఇలా క్షేత్రపరిశీలన చేసి నిజమైన అర్హులను గుర్తిస్తున్నారు. దీని ప్రకారం వృద్ధాప్య పెన్షన్ల నిబంధనలు పరిశీలిస్తే 1953 నుంచి 1961 మధ్య జన్మించి, 57 ఏళ్లు దాటి ఉండాలి. మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి మూడెకరాలు దాటరాదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు దాటరాదు. దరఖాస్తుదారుల వివరాలను వీఆర్వోలు, బిల్ కలెక్టర్లు సేకరిస్తున్నారు. సుమారుగా జిల్లావ్యాప్తంగా మరో 20వేల మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది. జిల్లాల వారీగా పింఛన్ల లబ్ధిదారుల వివరాలు.. మహబూబాబాద్ : 1,03,461 జనగాం : 79,228 భూపాలపల్లి : 92,737 వరంగల్ రూరల్ : 96,364 వరంగల్ అర్బన్ : 1,13,324 కన్న కొడుకులా ఆదుకుంటుండు.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముసలి , ఒంటరి, వికలాంగ , ఇతరులకు నెలసరి పింఛన్లు ఇచ్చి ఆదుకున్నాడు. కొత్తగా అప్పుడు ఆ దొర ఐదేళ్లు ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కొడుకులా నెలనెలా సొంత బిడ్డలా పింఛను ఇస్తున్నాడు. ఆ అయ్య చల్లంగా ఉండాలే. -షేక్ యాకూబ్ బీ, వృద్ధురాలు.గూడూరు అవసరానికి అందుతున్నయి.. వృద్ధాప్యంలో ఆసరా పింఛను ఇచ్చి సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఆదుకుంటుండు. పింఛన్ రూ.1000 నుంచి రూ.రెండు వేలు పెంచడం చాలా ఆనందంగా ఉంది. ముసలోళ్లు ప్రతిఒక్కరూ కేసీఆర్‌నే కోలుస్తుండ్రు. దేశంలో ఎవరూ చేయని విధంగా ఆదుకుంటుండు. ఒకటో తారీకు రాగానే పింఛను డబ్బులు వస్తే ఎవరిపై ఆధారపడకుండా అవసరానికి అందుతున్నాయి. -కొత్త బుచ్చమ్మ, వృద్ధురాలు, నర్సింహులపేట -
ఆసరాతో భరోసా... ఆడుతూ..పాడుతూ.. బీడీలు చుడుతూ..!
సాక్షి, నిజామాబాద్: పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని బీడీలు చుడితే రోజుకు వచ్చే కూలి రూ.120 దాటదు. బీడీ కంపెనీలు నెలలో కనీసం 15 రోజులు కూడా పనివ్వడం లేదు. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ బతుకు వెళ్లదీస్తున్న బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ‘ఆసరాపింఛన్లు’ కొంత మేర భరోసా ఇస్తున్నాయి. నెలకు వచ్చే రూ.1,500 నుంచి రూ.2,500కు తోడు ప్రభుత్వం ఇచ్చే భృతి వెయ్యి రూపాయలతో బతుక్కి కొంత భరోసా లభిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీడీ కార్మికుల సమస్యలు ప్రధానంగా చర్చ కొస్తున్నాయి. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పార్టీలన్నీ ఇప్పుడు హామీల వర్షం కురిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో నాలుగు నియోజకవర్గాల్లో బీడీ కార్మికులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో నిర్ణయాత్మక శక్తి వారే. మరో నాలుగు చోట్ల పరోక్ష ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ బీడీ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాయి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీడీ కార్మికులకు ప్రతి నెలా భృతి ఇస్తూ, వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని టీఆర్ఎస్ సర్కారు పేర్కొంటుండగా, పీఎఫ్ వంటి సౌకర్యాలు కలిస్తూ కార్మికులకు భరోసాగా నిలుస్తున్నామని బీజేపీ చెబుతోంది. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు సైతం హామీనిస్తున్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికుల్లో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నారు. సుమారు లక్షన్నర మంది ఇక్కడ ఉండగా, మిగతా వారంతా కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది వరకు బీడీ తయారీతో ఉపాధి పొందుతున్నారు. బీడీ పరిశ్రమ నిజామాబాద్‌తోపాటు, జిల్లాలో విస్తృతంగా ఉంది. నిజామాబాద్ నగరంలోనే 40 వరకు బీడీ కంపెనీలున్నాయి. నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల బీడీ కార్మికులున్నారు. ఇక్కడ తయారైన బీడీలు మహారాష్ట్ర, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. జీఓ నం.41 అమలు కోసం ఉద్యమం తమకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు దశాబ్దకాలంగా ఉద్యమం చేస్తున్నారు. తరచూ వేలాది మంది రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. వీరి కనీస వేతనాలను పెంచుతూ జీఓ నంబర్ 41 జారీ అయ్యింది. ఈ జీఓ ప్రకారం వెయ్యి బీడీలకు రూ.320 చెల్లించాలి. అయితే దీనిని అమలు చేస్తే తమకు పరిశ్రమ నడపడం గిట్టుబాటు కాదని, బీడీ ఉత్పత్తిని నిలిపివేస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. కొద్ది రోజులు కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి కూడా. దీంతో జీఓ అమలుకు నోచుకోలేదు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అందేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జీవన భృతితో 4.08 లక్షల మందికి లబ్ధి బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా వెయ్యి రూపాయల జీవనభృతిని ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.08 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రతినెలా వెయ్యి చొప్పున ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఒక్క నిజామాబాద్ పరిధిలోనే అత్యధికంగా 96,557 మంది కార్మికులు ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో 89,558 మంది పింఛన్ అందుకుంటున్నారు. సీఎం హామీపై ఆశలు.. బీడీ కార్మికులకు 2014 లోపు పీఎఫ్ సౌకర్యం ఉన్న వారికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయి. ఆ తర్వాత పీఎఫ్‌తో అనుసంధానమైన కార్మికులకు ఈ పింఛను అందడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ‘పీఎఫ్ ఉన్న కార్మికులందరికీ పింఛను వర్తింపచేస్తా’మని ఇచ్చిన హామీ బీడీ కార్మికుల్లో ఆశలు రేకెత్తించింది. త్వరలోనే ఈ హామీ కార్యరూపం దాల్చుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే అదనంగా మరో లక్షకు పైగా కార్మికులకు ప్రతినెలా భృతి లభించే అవకాశాలున్నాయి. ‘‘కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణలో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులుంటే.. దేశ వ్యాప్తంగా 52.32 లక్షల మంది ఉన్నారు. రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కడా ఈ పింఛన్లు ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వాలు బీడీ కార్మికుల బాధలను పట్టించుకోలేదు’’ ఈ నెల 19న ఎన్నికల ప్రచార బహిరంగసభలో సీఎం కేసీఆర్ ఆ భృతితోనే ఇన్ని మెతుకులు తింటున్నా.. బీడీలు చేస్తే నెలకు ఆరేడు వందలు వస్తుండేవి. ఆ డబ్బులు ఇంటి అద్దెకే సరిపోయేవి. తినడానికి సరిపోకపోయేవి. ఏ ఆధారం లేని నన్ను వెయ్యి రూపాయల పింఛన్ డబ్బే ఆదుకుంటోంది. బీడీ కార్మికులకు కూలి పెంచేలా చూడాలి. లేకపోతే బతకడమే కష్టమైతది. – కరెసూర శ్యామల, బీడీ కార్మికురాలు, నిజామాబాద్ జిల్లా పిల్లల చదువులకు వాడుకుంటున్నాం నా భర్త ఉపాధి కూలి పనికి వెళ్తాడు, నేను బీడీలు చుడతాను. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరికీ వచ్చే పైసలు కుటుంబ పోషణకే సరిపోతున్నాయి. పిల్లల చదువులకు అప్పు చేయాల్సి వచ్చేది. బీడీ కార్మికులకు ఇచ్చే జీవనభృతి పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. అప్పు చేయాల్సిన పనిలేకుండా పోయింది. – అంగల రోజా, బీడీ కార్మికురాలు, నిజామాబాద్ జిల్లా ఇంటి ఖర్చులు వెళ్తున్నాయి.. మాకు ఒక కొడుకు.. భర్త వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. నేను బీడీలు చేస్తాను. ఇద్దరం పనిచేస్తే వచ్చే పైసలు ఇంటి పోషణకే సరిపోతుండేవి. అదనంగా అయ్యే ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చేది. వెయ్యి రూపాయల బీడీ పింఛన్ డబ్బులు ఇంటి ఖర్చులకు బాగా ఉపయోగపడుతున్నాయి. – పట్నం నాగు, బీడీ కార్మికురాలు, నిజామాబాద్ జిల్లా జీవనభృతి ఆదుకుంటోంది.. బీడీ కార్మికులకు ఇస్తున్న పింఛను డబ్బులు మందులకు ఉపయోగపడుతున్నాయి. ఒక్కదాన్నే బతుకుతున్నాను. ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. బీడీలు చేస్తే వచ్చే కూలి గిట్టుబాటు కావడం లేదు. బీడీలు చేసుకొని బతికేటోల్లకు ప్రభుత్వం ఇస్తున్న జీవన భృతే అదుకుంటోంది. – గట్టు స్వర్ణలత, బీడీ కార్మికురాలు, నిజామాబాద్ జిల్లా -పాత బాలప్రసాద్గుప్త, సాక్షి ప్రతినిధి– నిజామాబాద్ -
కుటుంబంలో ఒక్కరికే పింఛన్
సాక్షి, మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో అర్హులైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.2 వేల పింఛన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండల నిరుపేదలు ఊరట చెందుతున్నారు. నూతన పింఛన్ విధానంతో మండలంలో లబ్ధిదారుల సంఖ్య బాగానే పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక్కరే పింఛన్‌కు అర్హులని ఆదేశాలు చేయడంతో వృద్ధులు ఉసూరుమంటున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో ఒకరికి పింఛన్ ఉండగా నూతన విధానంతో ఇంట్లో మరొకరికి పింఛన్ వస్తుందని ఆశపడిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ హామీ అమలు చేయడంలో షరతులు విధించడం సమంజసంగా లేదంటున్నారు. నూతన పింఛన్ విధానంపై.. ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అందించనున్న రూ.2 వేల పింఛన్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో 60 ఏళ్లు దాటితే పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి వృద్ధాప్యం సమీపిస్తుండగానే వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలివే.. మండలంలో అర్హులైన లబ్ధిదారులు తమ ఆదాయం రూ.1.50 లక్షలోపు ఉన్నట్లు ధ్రువపత్రం, తమ వయస్సు 57 ఏళ్లు పూర్తయినట్లు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు కలిగి ఉండాలి. మూడెకరాల తరి భూమి, 7 ఎకరాల్లోపు మెట్ట భూమి కలిగి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఇందుకు సంబంధించిన షరతులతో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కరికే ఇవ్వడం సరికాదు ఇంటికి ఒక్కరికే పింఛన్ ఇవ్వడం సరికాదు. ఇంట్లో 57 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉంటే అందరికీ ఇవ్వాలి. 60 ఏళ్లు నిండాయంటే లేవడం, కూర్చోవడానికి సైతం ఇబ్బందులు పడుతుంటారు. ఈ వయస్సులో ఏ పని చేయలేని పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇస్తే ఆ డబ్బులు మందులు, తిండి ఖర్చులకు పనికొస్తాయి. – సంజీవ నాయుడు, చెన్నిపాడు అర్హుల వివరాలు సేకరిస్తున్నాం.. మండలంలో 57 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. కుటుంబానికి ఒక్క పింఛన్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. కొత్త పింఛన్ పథకం కోసం ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. – ముషాయిదాబేగం -
యుక్తవయస్సులోనూ వృద్ధులుగా..
సాక్షి, కోదాడ : తెలంగాణ ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుంచి 2,016 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించడంతో పట్టుమని 40 సంవత్సరాలు నిండని వారు వృద్ధుల అవతారం ఎత్తుతున్నారు. మీ సేవ కేంద్రాలే అడ్డాగా ఆధార్, ఓటరు కార్డుల్లో వయస్సును అమాంతం పెంచుకుంటున్నారు. కోదాడ పట్టణంలో దీని కోసం ప్రత్యేక అడ్డాలు ఏర్పడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు, బీఎల్ఓలు, వారి భర్తలు దీన్ని లాభసాటి వ్యాపారంగా చేసుకున్నారు. వేల సంఖ్యలో కాగితాల్లో వృద్ధులు తయారు అవుతున్నారు. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, శ్రీరంగాపురం, సాలార్జంగ్పేట, బాలాజీనగర్‌లో ఇప్పటికే మార్పిడి యథేచ్ఛగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. దళారుల దందా.. వాస్తవానికి ఆసరా పింఛన్ కోసం ఆధార్‌కార్డు వయస్సుతో సంబంధం లేదు. కేవలం ఓటరు కార్డులోని వయస్సును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. కానీ కొందరు దళారులు ఆధార్ కార్డులో కూడా వయస్సు పెంచాలని మభ్యపెడుతూ సామాన్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ఇక ఓటరు గుర్తింపు కార్డుల్లో వయస్సు పెంపు కోసం పలువురు బీఎల్ఓలు కూడ భారీగా పుచ్చుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలో కోదాడ తహసీల్దార్ వద్ద పని చేసిన ఓ వ్యక్తి కొంత మంది కార్యాలయ ఉద్యోగులతో ఉన్న సంబంధాలతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, బాలాజీనగర్, సాలార్జంగ్ పేటలలో కూడా ఈ దందా పెద్దెత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరంగాపురం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి వయస్సు వాస్తవంగా 45 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ కార్డుల్లో వయస్సును పెంచుకుని కొంత కాలంగా పింఛన్ పొందడం గమనించదగ్గ విషయం. పింఛన్ల పంపిణీలో చేతివాటం.. కోదాడ పట్టణంలో దాదాపు 5 వేల వరకు వివిధ రకాల పింఛన్లను ప్రతి నెలా అందించాల్సి ఉంది. కానీ పట్టణంలో 3 బయోమెట్రిక్ యంత్రా లే ఉండడంతో పరిసర గ్రామాలలో ఉన్నవారిని కోదాడకు పిలిపించి పింఛన్లు ఇప్పిస్తున్నారు. అయితే వీరు తపాలా కార్యాలయంలో ఇవ్వాల్సిన పింఛన్లను ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తూ ప్రతి లబ్ధిదారు నుంచి 50 రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా వేలిముద్రలు పడడం లేదని కొంద మంది కోదాడలో లేకున్నా వారి పింఛన్లను పెద్ద ఎత్తున డ్రా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పింఛన్ల పంపిణీ సమయంలో వేలి ముద్రలు పడని వారి కోసం మున్సిపాలిటీ 1–15 వార్డులకు ఒకరిని, 16–30 వార్డులకు మరొకరిని నియమించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కీలకంగా వ్యవరిస్తున్నారని సమాచారం. పింఛన్లు పొందుతున్న వారు కోదాడలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్నారు. వారి వేలు ముద్రలు పడడం లేదని మున్సిపాలిటీ ఉద్యోగులు డబ్బులు డ్రా చేస్తున్నారని, దీని కోసం రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో చనిపోయిన వారివి కూడా వేలి ముద్రలు పడడం లేదని నొక్కేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు పింఛన్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. వేలి ముద్రలు పడనివారి పింఛన్లను మాత్రమే మున్సిపల్ ఉద్యోగులు డ్రా చేయాలి. చనిపోయిన వారి పింఛన్లు డ్రా చేసినట్లు తెలిస్తే తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. విచారించి తగు చర్యలు తీసుకుంటాం. – కందుల అమరేందర్‌రెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్ -
‘ఆసరా’పై ఆశలు
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేస్తున్నామని ప్రకటించడంపై పింఛన్‌దారుల్లో ఆశలు చిగురించాయి. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు చెల్లిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని అర్హులంతా ఆశగా చూస్తున్నారు. పింఛన్ల వయసు ఇప్పటి వరకు 65 ఏళ్లుగా ఉండగా.. దాన్ని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో డీఆర్డీఏ అధికారులు జిల్లాలో అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలోపడ్డారు. 2018 నవంబరు 19న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియకు అధి కారులు సిద్ధమయ్యారు. పెరగనున్న పింఛన్ మొత్తం.. ప్రస్తుతం పింఛన్ రూ.1000 చెల్లిస్తున్నారు. దివ్యాంగుల కు రూ.1,500 అందిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ రూ.2,016 నెలనెలా చెల్లించేందుకు నిర్ణయించింది. దివ్యాంగులకు రూ.3,016 గా నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న 1,16,351 మంది పెరిగే పింఛన్ సొమ్ము కోసం ఆ శగా చూస్తున్నారు. మరోవైపు.. కొత్తగా ఎంపికయ్యే లబ్ధి దారుల్లోనూ ఆసక్తి నెలకొంది. కొత్త నిబంధనల ప్రకారం పాతరేషన్ కార్డులు, ఓటరు కార్డు, బ్యాంకు పాస్ బుక్కులను పరిశీలిస్తూ.. వృద్ధుల వయసు నిర్ధారిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 2018 నవంబరు 19నాటికి 57 ఏళ్లు నిండితే పింఛన్‌కు అర్హులవుతారు. గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 17 ఆధారంగా గ్రామాల్లోని వృద్ధులకు ఏడాది కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలు మిం చరాదు, పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు మించరాదని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ నిబంధన మేరకు జిల్లాలో అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. వయసును 57 ఏళ్లకు కుదించడంతో ఆసరా పింఛన్‌దారుల సంఖ్య పెరుగనుంది. ప్రభావశక్తిగా పింఛన్‌దారులు పింఛన్‌దారులు ఎన్నికల తీర్పునివ్వడంలో ప్రభావశక్తిగా మారారు. ఓటర్ల సంఖ్యతో పోల్చితే.. పింఛన్‌దారుల సంఖ్య 28 – 30 శాతం వరకు ఉంటోంది. జిల్లావ్యాప్తంగా 4,06,006 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,16,351 మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. మొత్తం ఓట్లలో పింఛన్‌దారుల ఓట్ల సంఖ్య 28.65 శాతం ఉంది. దీంతో ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములపై ఆసరా పింఛన్‌దారుల ప్రభావం ప్రధానంగా కనిపిస్తోంది. పింఛన్‌దారుల్లో వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీతకార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. పింఛన్మొత్తాన్ని రెట్టింపు చేయడంతో వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నెలనెలా ఇస్తున్న పింఛన్ల మొత్తం రూ.1,21,30,850గా ఉంది. దీనిని రెట్టింపు చేయడంతోపాటు కొత్త పింఛన్‌దారులకూ మంజూరుచేస్తే.. 1.54 లక్షల మంది పింఛన్‌దారులు అవుతారు. వీరికి ప్రతినెలా రూ.3.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గ్రామసభ ఆమోదంతో.. అధికారులు గుర్తించిన జాబితాను గ్రామసభ ఆమోదం పొందాల్సి ఉంది. తొలుత జాబితాను పల్లెల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేస్తారు. పింఛన్‌దారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామసభ ఆమోదం పొందాల్సి ఉంది. జిల్లాలో అర్హులైన పింఛన్‌దారులు కొత్త పింఛన్ల కోసం ఆశగా చూస్తున్నారు. -
‘ఆసరా’గా చేసుకుని..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాల్లో నిలువు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సేవలను బట్టి వసూళ్ల పర్వం నడుస్తోంది. నూతన ఆధార్ కార్డులు, పాత కార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు తదితర సేవల కోసం ఆధార్ కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ పెన్షన్ పొందడానికి లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు కుదించిన విషయం తెలిసిందే. దీంతో ఆసరా పెన్షన్ పొందడానికి ఉవ్విళ్లూరుతున్న జనం, వారి ఆధార్ కార్డుల్లో వయస్సు మార్పిడి చేసుకోవడానికి ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రజల అవసరాన్ని ‘ఆసరా’గా చేసుకుని ఆధార్ నిర్వాహకులు నిబంధనలకు విస్మరించి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. జిల్లాలో గల మండలానికో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని మీ సేవా నిర్వాహకులకు అధికారులు మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 27 కేంద్రాలు మండలాల్లో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ఈఎస్డీ) సంస్థకు చెందిన 20 ఆధార్ కేంద్రాలుండగా, సీఎస్సీకి చెందిన ఆధార్ కేంద్రాలు 16 ఉన్నాయి. ఆధార్ కేంద్రాల్లో సేవల పేరిట అడ్డగోలుగా వసూళ్ల పర్వం నడుస్తున్నా.. పర్యవేక్షణ చేసే సంబంధిత అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు తావిస్తోంది. ఇటు తహసీల్దార్లు కూడా చూసీ చూడనట్లు ఉంటున్నారు. తనిఖీల మాటే లేకుండా పోయింది. ఆధార్ కేంద్రాల నిర్వాహకులతో అధికారులు మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా గుంజుతున్నారు.. ఆధార్ కేంద్రాల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేట్టాయి. వీలైనంత త్వరలో ప్రయివేటు వ్యక్తులు నడుపుతున్న ఆధార్ కేంద్రాలను తొలగించి మండల, పట్టణ ప్రాంత కేంద్రాల్లో గల ప్రభుత్వ కార్యాలయాల్లోకి తరలించాలని, వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఇటీవల తెలిపింది. దీంతో తాము నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాలకు గడ్డుకాలం వచ్చి పడిందని దోపిడీకి తెరలేపారు. ఇదే సమయంలో ఆధార్ కార్డుల్లో వయసు మార్పిడికి డిమాండ్ పెరగడం కూడా వారికి అవకాశంగా మారింది. నిజానికి కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునే వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకోకూడదు. కానీ రూ. 200 వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. అదే విధంగా పాత కార్డుల్లో చేర్పులు మార్పులకు రూ. 25 రుసుము తీసుకోవాల్సి ఉండగా రూ. 300 పైగా తీసుకుంటున్నారు. ఆధార్ కార్డులో వయస్సు మార్పిడి జరిగితే తమకు రూ. 2 వేల పెన్షన్ వస్తుందనే ఆశతో ఆధార్ నిర్వాహకులు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ విషయం దాదాపు బయటకు రావడం లేదు. ఇంద ల్వాయితో పాటుగా మాక్లూర్, డిచ్పల్లి మండలాల్లో కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సిరికొండ, నవీపేట్, నిజామాబాద్ నగరం, బాల్కొండ, భీమ్‌గల్, బోధన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
‘ఆసరా’కు అడుగులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆసరా పెన్షన్‌దారుల సంఖ్య పెరగనుంది. టీఆర్ఎస్ను తిరిగి గెలిపిస్తే ఆసరాలోని వృద్ధాప్య పెన్షన్లకు అర్హత 65 ఏళ్ల వయస్సు నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభల్లో ప్రజలకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం పెన్షన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. పెన్షన్ దారుల వయోపరిమితి తగ్గిస్తూ ఓటర్ల జాబితా, కుటుంబ సర్వేల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. కలెక్టర్లు కూడా ఇప్పటికే జిల్లాస్థాయిలో అర్హులను గుర్తించారు. గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఎంపీడీఓలకు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా జాబితాలు పంపించారు. జిల్లాలో ప్రస్తుతం 67,343 ఆసరా పెన్షన్లు 65 ఏళ్లు పైబడినవారికి అందుతున్నాయి. ప్రతి లబ్ధిదారుడికి రూ.వెయ్యి చొప్పున అందుతున్న విషయం తెలిసిందే. వయో పరిమితిని కుదిం చడంతోపాటు రూ.వెయ్యి నుంచి రూ.2016కు పెంచుతామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో ఎంపిక కార్యక్రమం మొదలైంది. ఓటర్ల జాబితా ఆధారంగా జిల్లాలో 85,103 మంది 57 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. అర్హుల ఎంపిక జిల్లాస్థాయిలో ఓటర్ల జాబితా ఆధారంగా 57 ఏళ్ల పైబడిన వారిని ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా గుర్తించారు. ఆయా జాబితాలను ఎంపీడీఓలకు అందించారు. వీటి ఆధారంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హుల ఎంపిక ఇలా... జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నవారు 67,347 మంది ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ఆధారంగా 57 ఏళ్లు పైబడినవారు 85,103 మంది ఉన్నారు. అయితే అర్హుల ఎంపిక మాత్రం ప్రారంభం కానుంది. ఇందులో ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు, ఇప్పటికే ఓ ఇంట్లో ఒకరు పెన్షన్ పొందితే మిగిలిన వారు ఉన్నారు. ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ విధానం అమలవుతుంది. దీంతో గ్రామసభల ద్వారా ఈ నిబంధనల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. 50వేల వరకు కొత్త పెన్షన్‌దారులు జిల్లాలో కొత్తగా 50 వేల వరకు కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత పొందే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా ఆధారంగా 85,103 మంది ఉండగా, దాదాపు 30 వేల మంది వరకు నిబంధనల ప్రకారం అనర్హులుగా తేలే అవకాశం ఉంది. అసలైన లబ్ధిదారులు 50 వేల వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ అమలు ప్రభుత్వం నూతనంగా 57 ఏళ్లు నిండిన అర్హులను ఎంపిక చేసి అర్హులను గుర్తించే కార్యక్రమం ప్రారంభించింది. ప్రక్రియ ముగిసిన అనంతరం జాబితాను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ రూ.2016ను కూడా అప్పటి నుంచే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల్లో ఆనందం 50 వేలకు పైబడి అన్ని అర్హతలు ఉన్నవారిలో ఆనందం నెలకొంది. ప్రభుత్వం వయోపరిమితి తగ్గించడంతో జిల్లాలో 50 వేల మంది వరకు అర్హత సాధించే అవకాశం ఉంది. వారందరికీ ఏప్రిల్ 1 నుంచి పెన్షన్‌ను అందించడంతోపాటు పెరిగిన పెన్షన్ అమలు చేస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. గ్రామాల్లో ఏ దిక్కూ లేనివారు చాలావరకు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంతో చాలా కుటుం బాలకు ఆర్థిక భరోసాను అందించినట్లవుతుంది. -
వయసు తగ్గె.. లెక్క పెరిగె..!
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో పింఛన్‌దారులు మరింత పెరగనున్నారు. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు పూర్తికాగానే.. వారిలో అర్హులను గుర్తించి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ వృద్ధాప్య పింఛన్‌దారుల వయసు కుదిస్తామని, ఇక 57 ఏళ్ల వయసు నుంచి పింఛన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హామీల అమలుపై దృష్టి సారించిన సీఎం.. ఆసరా పింఛన్లపై వెనువెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆసరా పింఛన్లను అందించేందుకు అర్హులను గుర్తించే పనిని ముమ్మరం చేశారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న 63,655 మంది.. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లను 63,655 మంది పొందుతున్నారు. గతంలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రతినెలా వీరికి పింఛన్లు సకాలంలో అందుతుండడంతో వీరికి ఎంతో కొంత ఆసరాగా ఉంటోంది. వారి మందులు, ఇతర అవసరాలు తీరుతుండడంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ పొందేందుకు 57 ఏళ్ల వయసును అర్హతగా పేర్కొనడంతో మరింత మందికి పింఛన్లు అందనున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇతర కారణాలతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. 60 ఏళ్లలోపే వృద్ధాప్యంతో అనేక మంది తమ పనులు తాము చేసుకోలేని స్థితికి చేరుతున్నారు. పింఛన్ తీసుకునే వయసు 65 ఏళ్లు చేయడంతో ఆ కింద వయసు కలిగిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లోని వృద్ధులకు కనీస ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో జీవనం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ వయసు 57 ఏళ్లకు తగ్గించడం.. అలాగే ఆసరా పింఛన్ కూడా పెంచడంతో వారికి ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్ రూ.1000 ఇచ్చే వారు. అయితే ఇప్పుడు ఆ పింఛన్ కూడా రెట్టింపు కావడంతో వృద్ధులకు మందులు, వారికి ఉండే ఇతర అవసరాలకు సొమ్ము చేతిలో ఉండే పరిస్థితి ఉంది. ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.2,016 చొప్పున అందించనున్నారు. లెక్కలు కట్టే పనిలో అధికారులు.. కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులను కసరత్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అందుకు సంబంధించిన పనుల్లో కిందిస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. 2018 నవంబర్ ఓటర్ల జాబితా ప్రకారం 57 నుంచి 64 ఏళ్లలోపు వృద్ధులు ఎంతమంది ఉన్నారనేది లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 90,959మంది ఉన్నారు. అయితే 56 ఏళ్లు దాటినవారు 1,81,442 మంది ఉన్నారు. అయితేఅధికారులు 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఉన్న వారి లెక్కలను తీసుకుని.. అందులో అర్హులను గుర్తించనున్నారు. అర్హులకు ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్లు అందజేసే అవకాశం ఉంది. అర్హులను గుర్తిస్తున్నాం.. వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ అందుకునే వారి వయసు 57 ఏళ్లకు కుదించడంతో ఆ వయసు కలిగిన అర్హులైన లబ్ధిదారులు జిల్లాలో ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నాం. ఓటరు జాబితాను అనుసరించి మొదట 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు వారు ఎంతమంది ఉన్నారనేది గుర్తిస్తున్నాం. అందులో నుంచి అర్హుల జాబితాను తయారు చేసి.. ఉన్నతాధికారులకు అందజేస్తాం. – ఇందుమతి, డీఆర్డీఓ -
మరింత ఆసరా
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురు చూసే పండుటాకులకు శుభవార్త. ‘ఆసరా’ కోసం దరఖాస్తు చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నవారికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నగదు అందించనున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 4 లక్షల మంది అర్హులు ఉన్నట్టు అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. వృద్ధాప్య పింఛన్ల అర్హతను 57 ఏళ్లకు తగ్గించడంతో ఓటర్ల జాబితా ఆధారంగా నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త పింఛన్‌దారుల ఎంపిక ప్రక్రియ మార్చిలోగా పూర్తి చేసి ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,51,285 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారి సంఖ్య మూడింతలు పెరగనుంది. వాస్తవానికి ఇప్పటికే అర్హులను గుర్తించి నివేదిక రూపొందించినప్పటికీ అదనంగా వచ్చే దరఖాస్తులను బట్టి వాటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వార్షికాదాయం రూ.2 లక్షలు ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు ఉండి 57 ఏళ్లు దాటినవారు అర్హులు. మరోవైపు నెలవారీ పింఛన్ సొమ్ము కూడా రూ.2016కు పెంచారు. ఓటరు జాబితా ఆధారంగా గుర్తించిన 54 నుంచి 57 వయసు గలవారి వివరాలు ‘ఎస్కేఎఫ్’ డేటాలో పొందుపర్చనున్నారు. ఆ జాబితాపై క్షేత్ర స్థాయి విచారణ చేపడతారు. అర్హులైన లబ్దిదారుడి యూఐడీ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఫొటోతో సహా సేకరించి పరిపాలన అనుమతి నిమిత్తం జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్న తర్వాత అర్హుల జాబితాను వెబ్సైట్లో ఉంచుతారు. పింఛన్లపై సీఎస్ ఆరా.. ఆసరా కొత్త పింఛన్ల మంజూరుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను అర్హుల గుర్తింపుపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా అర్హులైన వారిని గుర్తించి వివరాలు పంపించాలని ఆదేశించారు. కొత్త పింఛన్ల కోసం 57 ఏళ్ల నుంచి 64 సంవత్సరాల వయసు గలవారు అర్హులన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్‌రావు, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీఓ రామభద్రం, సెక్షన్ సూపరిటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపిక షురూ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌కు సంబంధించి నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే ప్రభుత్వం çస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా అధికారులు తొలుత 57–64 మధ్య వయస్సు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఇంతవరకు 64 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందజేస్తుండగా టీఆర్ఎస్ తాజా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హులుగా భావించనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితా ప్రకారం కొత్తగా 66,760 మందికి ఆసరా పింఛన్ లభించే అవకాశముందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, డీఆర్డీఓగా గురువారం బాధ్యతలు స్వీకరించిన క్రాంతి.. తొలిరోజే ఆసరా లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు. శాఖ అధికారులతో సమావేశమై ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు. 66,760 మంది గుర్తింపు ప్రభుత్వం నుంచి వెలువరించిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే 64 నిండిన వారికి పింఛన్లు అందజేస్తుండగా.. తాజా నిర్ణయం మేరకు 57 నుంచి 64 ఏళ్ల మధ్య వారిని గుర్తిస్తున్నారు. తొలుత ప్రతీ జిల్లా నుంచి కొత్తగా ఎందరు లబ్ధిదారులకు ఎంపికయ్యే అవకాశముందో వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మొత్తం 66,760 మంది ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. ఇవీ నిబంధనలు తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆసరా పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు పలు మార్గదర్శకాలకు వెలువరించింది. వీటి ప్రకారం 1953 నుంచి 1961 మధ్య జన్మించి 57 ఏళ్ల వయస్సు దాటిన వారిని అర్హులుగా గుర్తిస్తారు. వయస్సు నిర్ధారణ కోసం ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్న అధికారులు.. చెల్క భూమి 7.5 ఎకరాలు, తరి 3 ఎకరాలు మించకుండా.. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లోనైతే రూ.1.5 లక్షలు, నగరాల్లోనైతే రూ.2 లక్షలు దాటకుండా చూస్తున్నారు. ఇక సంతానం వైద్యులు, కాంట్రాక్టర్లతో పాటు ఇతర వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్నా... ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపుల వంటి వ్యాపారాలు, పెద్ద వాహనాలు ఉన్న వారు, ఐటీ రిటరŠన్స్ దాఖలు చేసే వారిని కూడా అనర్హులుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారితో పాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. ఎంపిక విధానం ఓటరు కార్డులోని వివరాల ప్రకారం 2018 నవంబర్ 19 నాటికి 57–64 సంవత్సరాల నిండిన వారిని ఆసరా పింఛన్‌కు అర్హులుగా గుర్తిస్తారు. ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాక.. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. గ్రామాల్లోనైతే వీఆర్ఓలు, పట్టణాల్లోనైతే బిల్కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పొల్గొంటారు. ఎంపిక అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల ద్వారా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, వినతుల తర్వాత తుది జాబితా రూపొందిచనున్న అధికారులు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లు సేకరిస్తారు. చివరకు ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఆసరా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. గ్రామసభల ద్వారా.. జిల్లాలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను మండలాలు, గ్రామాల వారీగా అధికారులువిభజించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తుండగా.. ఏకంగా 8 ఏళ్లు వయో పరిమితి తగ్గడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 66,760 కొత్తగా ఆసరా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తుది జాబితా రూపొదించాక ఈ సంఖ్య ఎంత మేరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వికలాంగులకు ఆసరా పింఛన్ కింద రూ.1500 అందజేస్తుండగా ఇది రూ.3,016కు పెరగనుంది. ఇక మిగతా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు చేరనున్నాయి. తద్వారా ఇప్పటికే పింఛన్ల రూపంలో ఇస్తున్న రూ.32,29,06,500లో భారీగా వ్యత్యాసం రానుంది. దీనికి తోడు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం ఇంకా మారనుంది. -
ఎంపిక షురూ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌కు సంబంధించి నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే ప్రభుత్వం çస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా అధికారులు తొలుత 57–64 మధ్య వయస్సు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఇంతవరకు 64 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందజేస్తుండగా టీఆర్ఎస్ తాజా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హులుగా భావించనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితా ప్రకారం కొత్తగా 66,760 మందికి ఆసరా పింఛన్ లభించే అవకాశముందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, డీఆర్డీఓగా గురువారం బాధ్యతలు స్వీకరించిన క్రాంతి.. తొలిరోజే ఆసరా లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు. శాఖ అధికారులతో సమావేశమై ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు. 66,760 మంది గుర్తింపు ప్రభుత్వం నుంచి వెలువరించిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే 64 నిండిన వారికి పింఛన్లు అందజేస్తుండగా.. తాజా నిర్ణయం మేరకు 57 నుంచి 64 ఏళ్ల మధ్య వారిని గుర్తిస్తున్నారు. తొలుత ప్రతీ జిల్లా నుంచి కొత్తగా ఎందరు లబ్ధిదారులకు ఎంపికయ్యే అవకాశముందో వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మొత్తం 66,760 మంది ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. ఇవీ నిబంధనలు తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆసరా పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు పలు మార్గదర్శకాలకు వెలువరించింది. వీటి ప్రకారం 1953 నుంచి 1961 మధ్య జన్మించి 57 ఏళ్ల వయస్సు దాటిన వారిని అర్హులుగా గుర్తిస్తారు. వయస్సు నిర్ధారణ కోసం ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్న అధికారులు.. చెల్క భూమి 7.5 ఎకరాలు, తరి 3 ఎకరాలు మించకుండా.. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లోనైతే రూ.1.5 లక్షలు, నగరాల్లోనైతే రూ.2 లక్షలు దాటకుండా చూస్తున్నారు. ఇక సంతానం వైద్యులు, కాంట్రాక్టర్లతో పాటు ఇతర వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్నా... ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపుల వంటి వ్యాపారాలు, పెద్ద వాహనాలు ఉన్న వారు, ఐటీ రిటరŠన్స్ దాఖలు చేసే వారిని కూడా అనర్హులుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారితో పాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. ఎంపిక విధానం ఓటరు కార్డులోని వివరాల ప్రకారం 2018 నవంబర్ 19 నాటికి 57–64 సంవత్సరాల నిండిన వారిని ఆసరా పింఛన్‌కు అర్హులుగా గుర్తిస్తారు. ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాక.. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. గ్రామాల్లోనైతే వీఆర్ఓలు, పట్టణాల్లోనైతే బిల్కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పొల్గొంటారు. ఎంపిక అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల ద్వారా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, వినతుల తర్వాత తుది జాబితా రూపొందిచనున్న అధికారులు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లు సేకరిస్తారు. చివరకు ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఆసరా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. గ్రామసభల ద్వారా.. జిల్లాలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను మండలాలు, గ్రామాల వారీగా అధికారులువిభజించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తుండగా.. ఏకంగా 8 ఏళ్లు వయో పరిమితి తగ్గడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 66,760 కొత్తగా ఆసరా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తుది జాబితా రూపొదించాక ఈ సంఖ్య ఎంత మేరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వికలాంగులకు ఆసరా పింఛన్ కింద రూ.1500 అందజేస్తుండగా ఇది రూ.3,016కు పెరగనుంది. ఇక మిగతా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు చేరనున్నాయి. తద్వారా ఇప్పటికే పింఛన్ల రూపంలో ఇస్తున్న రూ.32,29,06,500లో భారీగా వ్యత్యాసం రానుంది. దీనికి తోడు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం ఇంకా మారనుంది. -
మూడ్రోజుల్లో ఆసరా అర్హుల జాబితా
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకంలో మార్పులకు తగినట్లుగా వెంటనే చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 19న ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా గ్రామాలవారీగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు ఉన్నవారి వివరాలను మూడ్రోజుల్లో ఈ–సేవ కమి షనర్‌కు పంపాలని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు,పంచాయతీ ఎన్నికలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రైల్వేల భూ సేకరణ, అటవీ భూముల సర్వేల అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్ పి.కె.ఝా, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, సీసీఎల్ఏ డైరెక్టర్ వాకాటి కరుణ, సెర్ప్ సీఈవో పౌసమిబసు, ఈ–సేవ కమిషనర్ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. జోషి మాట్లాడుతూ, ‘57 ఏళ్లు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుంచి ఆసరా పింఛన్ల మంజూరుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అర్హుల జాబితాను కలెక్టర్లు సిద్ధం చేయాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన ప్రతి అభ్యర్థికి మార్కులు, ర్యాంకు, కేటగిరీలు ప్రకటించాలి. జాతీయ రహదారులు, రైల్వేలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి’ అని చెప్పారు. -
ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా ఆసరా పెన్షన్ అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. గ్రామాల్లో వార్షిక ఆదాయం లక్ష యాభై వేలు, పట్టణాలలో రెండు లక్షల ఆదాయ పరిమితి పెన్షన్‌కు అర్హతగా నిర్ణయించారు. మూడు ఎకరాల తడి, 7.5 ఎకరాల మెట్ట భూములు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికే అర్హత ఉంటుందని తెలిపారు. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు జారీ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016లకు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుండి రూ.3,016లకు పెంచే విషయంపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పెన్షన్ల గుర్తింపునకు నవంబర్ 2018లో ప్రచురించిన ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో 57 నుండి 64 వరకు వయసు ఉన్న వారి వివరాలు తీసుకొని ఎస్కేఎఫ్ డేటాలో సరిచూసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ లిస్టులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీలకు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లకు ధ్రువీకరణకోసం అందిస్తారని తెలిపారు. అర్హులైన వారి లిస్టులో సంబంధిత లబ్ధిదారుని యూఐడీ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫొటోసహా సేకరించి, గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లు పరిపాలన అనుమతి నిమిత్తం జిల్లా కలెక్టర్లకు అందచేస్తారన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకొన్న తదుపరి అర్హుల జాబితాను సంబంధిత వెబ్సైట్లో ఉంచుతారని సీఎస్ తెలిపారు. -
ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆసరా పెన్షన్ల పథకంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దృష్టి సారించారు. కొత్త వారితో పాటు, ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారందరికి కూడా ఏప్రిల్ నుంచి పెంచిన కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పెన్షన్ దారుల వయో పరిమితి తగ్గించడంతో పాటు, పెన్షన్ మొత్తాన్ని పెంచుతామంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్ వరకూ పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్, ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దాంతో సీఎస్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఓటర్ లిస్ట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. 57 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది నూతన లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్తవారితో పాటు పాత లబ్ధిదారులకు కూడా పెంచిన పెన్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. -
పెరిగిన ఆసరా...
సాక్షి, మెదక్: ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 1,03,410 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దివ్యాంగులకు రూ.1,500, మిగితా వారికి వెయ్యి రూపాయల చొప్పున అందచేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి దివ్యాంగులకు రూ.3,016, మిగిలిన లబ్ధిదారులకు రూ.2,016 పింఛన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మూడు రోజుల క్రితం విడుదల చేశారు. నూతన మార్గదర్శకాలు జిల్లా అధికారులకు అందాల్సి ఉంది. 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు కార్డులోని వయస్సును ప్రామాణికంగా తీసుకొని పింఛన్‌కు అర్హులయ్యే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అర్హత వయస్సు నిండిన వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పింఛన్ డబ్బులు చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి నిధులు కేటాయించి ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతో పాటు, కొత్త వారికి పింఛన్ అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఆసరా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. నవంబరు 19న ప్రకటించిన తుది జాబితా ప్రకారం వారిని ఎంపిక చేశారు. జిల్లాలో 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు 36,954 మంది ఉన్నట్లు గుర్తించారు. పింఛన్ పొందేందుకు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు లోపు సంవత్సర ఆదాయం మాత్రమే ఉండాలి. మూడెకరాల లోపు తరి భూమి, ఏడున్నర ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులుగా ఉంటారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ అందజేస్తారు. ప్రస్తుతం జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఓ) అధికారులు సేకరించిన వివరాలపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేయించనున్నారు. పోలింగ్ బూత్‌స్థాయి అధికారులకు జాబితాను అందచేసి వారి ద్వారా పరిశీలింపచేస్తారు. తర్వాత డీఆర్డీఓ అధికారులు, గ్రామైక్య సంఘం, ఇందిరా క్రాంతి పథకం సీసీల చేత క్షుణ్ణంగా విచారణ చేయించనున్నారు. అలాగే ఎంపిక చేసిన వారి ఇళ్ళకు వెళ్లి ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబర్లను సేకరించనున్నారు. ఒకటికి రెండుమార్లు వడపోత అనంతరం లబ్ధిదారుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితాను కలెక్టర్ ఆమోదించిన తర్వాత పింఛన్ మంజూరుకు ఉన్నతాధికారులకు పంపిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం కింద ప్రతినెలా రూ.10.78 కోట్లు చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించడం, దివ్యాంగులు, మిగితా వారికి పింఛన్ మొత్తం పెంచనుండటంతో ప్రభుత్వంపై భారం పడనుంది. జిల్లాలో కొత్తగా లబ్ధిదారుల చేరికతో సుమారు రూ.50 లక్షలకు పైగా భారం పడనుంది. ఏప్రిల్ నుంచి పింఛన్ మొత్తం పెంచితే పాత, కొత్త లబ్ధిదారులతో కలిపి జిల్లాలో సుమారు రూ.30 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ... గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపిక చేసిన జాబితాను గ్రామసభల ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వచ్చిన వాటిని పరిశీలించి తుదిజాబితాను రూపొందించడం జరుగుతుంది. లబ్ధిదారుల ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓలు, పట్టణాల్లోని లబ్ధిదారుల జాబితాను కమిషనర్లు పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాఫ్ట్‌వేర్‌లో లబ్ధిదారుల వివరాలను అప్లోడ్ చేస్తారు. త్వరలోనే తుది జాబితా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు ఉన్న వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ మేరకు పోలింగ్‌బూత్ అధికారుల ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తేల్చడం జరుగుతుంది. గ్రామైఖ్య సంఘం, సీసీలతో విచారణ జరిపించి తుది జాబితాను రూపొందిస్తాం. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. –భీమయ్య, డీఆర్డీఓ ఏడీ, మెదక్ -
‘ఆసరా’ రెట్టింపు
కల్వకుర్తి టౌన్: ఆసరా సామాజిక పింఛన్లు రెట్టింపు కానున్నాయి. ఇప్పటివరకు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న వెయ్యి రూపాయల ఫించన్ రూ.2,016కు పెరగనుంది. అలాగే వికలాంగులకు ఇస్తున్న రూ.1,500లు రూ.3,016కు పెరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు రెట్టింపు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు అణుగుణంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికితోడు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే వయస్సును 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించింది. దీనితో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య లక్షకుపైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో నిధులు కేటాయించన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.200 నుంచి రూ.2వేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సామాజిక భద్రత పింఛన్ రూ.200లు ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫించన్లను రూ.వెయ్యికి పెంచింది. వికలాంగులకు రూ.1,500కు పెంచింది. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరోసారి పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వికలాంగులు, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవీ, బోధకాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా అనేక రకాల పింఛన్లు అందిస్తోంది. వీరిలో వృద్ధాప్య, వికలాంగులకు మాత్రమే పింఛన్లు రెట్టింపు కానున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు 63,065, వికలాంగులు 23,743 మంది ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 46,065 మంది వృద్ధాప్య, వికలాంగులు 13,976 మంది లబ్ధిదారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వృద్ధాప్య 24,314 మంది, వికలాంగులు 11,166 మంది తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో 28,536 మంది వృద్ధాప్య, వికలాంగులు 11,047 మంది ఉన్నారు. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో గతంలో ఇస్తున్న ఆసరా పింఛన్లకు అదనంగా 57ఏళ్ల వయస్సు ఉన్నవారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఓటరు జాబితాల నుంచి సేకరించి, జాబితా సిద్ధం చేస్తున్నాం. ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే పింఛన్ తీసుకోవడానికి అర్హులు. 57ఏళ్లలోపు వారు, మరే ఇతర ఫించన్ తీసుకుంటున్న వారు అనర్హులు. దానికి సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నాం. – సుధాకర్, డీఆర్డీఓ పీడీ, నాగర్‌కర్నూల్ -
ఆసరా రూ.80 కోట్లు !
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల హామీల అమలుకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. కొత్త ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి, వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 57కు కుదిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అటు ఇటుగా రూ.39 కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ, ఫైలేరియా పేషంట్లకు ఆసరా పింఛన్ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఆసరాగా ఇస్తోంది. సర్కారు పింఛన్లను రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం డబుల్ కానుంది. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 64 నుంచి 57కు తగ్గించడంతో వేలాది మంది కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు అర్హులు కానున్నారు. ఈ మేరకు నెలకు సుమారు రూ.80కోట్ల పైనే ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు చెల్లించనున్నారు. ఈ పెరిగిన ఆసరా పింఛన్లు ఏ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతాయనే దానిపై స్పష్టత రావడం లేదు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 57 వృద్ధాప్య పింఛన్లు పొందాలంటే 64 సంవత్సరాలు ఉండాలనేది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. ఈ నిబంధనను సడలించి 57 ఏళ్లు నిండిన వారందిరికి వృద్ధాప్య పింఛన్లు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఓటర్ల జాబితాలోని వయస్సునే ప్రామాణికంగా తీసుకోనుండడంతో ఆ మేరకు పంచాయతీల వారీగా అర్హుల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. 1953 నుంచి 1961 లోపు జన్మించిన వారందరిని గుర్తిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లోని వయసు ఆధారంగా కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటికే మెజారిటీ వీఆర్ఓలు గ్రామాలలో అర్హుల జాబితాలను తయారు చేసి తహసీల్దార్లకు అందజేయగా, వారు కలెక్టర్లకు కూడా పంపించారు. ఈ జాబితాను పరిశీలించి కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రెట్టింపు కానున్న పింఛన్లు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రస్తుతం 3,62,721 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 1,13,941 మంది వృద్ధాప్య పింఛనుదారులే ఉన్నారు. వీరి తర్వాత వితంతువులైన మహిళా పింఛనుదారులు 1,26,669 మంది. ఇక ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులతోపాటు హెచ్ఐవీ, ఫైలేరియా పేషంట్లు 10 కేటగిరీల్లో కలిపి నెలకు సుమారు రూ.39 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింపులు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, వితంతుల, ఒంటరి మహిళలలు, ఇతర కేటగిరీల్లోని వారికి ఇప్పుడిస్తున్న రూ.1,000ని రూ. 2,016 , దివ్యాంగుల పింఛన్లను రూ.1500 నుంచి రూ.3016కు పెంచారు. ఈ లెక్కన ఆసరా పింఛన్ల బడ్జెట్ కూడా రెట్టింపు కానుంది. ఇక వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 64 నుంచి 57కు కుదించడం వల్ల ప్రతి జిల్లాలో వేలాది మంది కొత్తగా పింఛనుదారులు కానున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పింఛన్లకు రూ.80 కోట్లపైనే వెచ్చించాల్సి ఉంటుంది. నిర్మల్‌లోనే అధికం ఆసరా పింఛన్ల లబ్ధిదారులు నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ బీడీ కార్మికులు ఏకంగా 63,206 మంది ఉండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. అన్ని కేటగిరీల పింఛను దారులు కలిపి 1,48,679 మంది ఉండగా, వీరి కోసం ప్రభుత్వం రూ.15.37 కోట్లు నెలకు వెచ్చిస్తోంది. అతి తక్కువగా కుమురంభీం జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 51,201గా ఉంది. వీరికి నెల నెలా రూ.6.10 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. వయస్సు పరిమితి తగ్గించడంతో ఈసారి కుమురంభీం జిల్లాలో కూడా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
57 ఏళ్లకే పింఛన్ నిబంధనలివే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసరా లబ్ధిదారుల వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి వయసు నిర్ధారణకు ఓటరుకార్డును ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. మిగిలిన ఆసరా పింఛన్ల నిబంధనలు యథాతథంగా ఉంటాయి. నిబంధనలివే.. - 57 ఏళ్లు దాటినవారు అర్హులు. - 1953– 1961 మధ్య జన్మించి ఉండాలి. - వయసు నిర్ధారణకు ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికం - మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలు దాటొద్దు. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు దాటొద్దు. - పింఛన్ కావాలనుకున్న వారు లబ్ధిదారుల పిల్లలు డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తులు, వ్యాపారాలు ఉండరాదు. - లబ్ధిదారులకు పెద్దవ్యాపారాలు (ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపులు తదితరాలు) ఉండరాదు. - విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు అనర్హులు - లబ్ధిదారులకు పెద్దవాహనాలు ఉండరాదు, ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు అనర్హులు. - దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు అనర్హులు. - లబ్ధిదారుల పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండొద్దు. ఎంపిక విధానం.. - ఓటరు కార్డులో 2018 నవంబర్ 19 నాటికి 57–64 ఏళ్లు నిండినవారు అర్హులు. గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో బిల్కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పాల్గొంటారు. - ఎంపిక అనంతరం లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ/ వార్డు సభల ద్వారా ప్రదర్శి స్తారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. - అభ్యంతరాలు, వినతుల తర్వాత తుదిజాబితా రూపొందిస్తారు. - లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు/ బిల్ కలెక్టర్లు సేకరిస్తారు. - గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను కలెక్టర్లకు పంపుతారు. - లబ్ధిదారుల తుది జాబితాను ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతమున్న ఆసరా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తారు. ఆసరా మొత్తం లబ్ధిదారులు 39,36,503 వృద్ధులు 13,27,090 వికలాంగులు4,94,787 వితంతువులు14,37,164 చేనేతలు37,093 గీత కార్మికులు 62,510 హెచ్ఐవీ రోగులు 24,704 పైలేరియా రోగులు 13,601 బీడీ కార్మికులు 4,08,618 ఒంటరి మహిళలు 1,30,936 -
ఆసరా పింఛన్ల అర్హులను గుర్తించాలి
ఆదిలాబాద్‌అర్బన్: అర్హులైన ఆసరా పింఛన్ లబ్ధిదారులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 18న క్రిస్మస్ గిఫ్ట్ పంపిణీ, 20న ఫుడ్ మెటీరియల్ పంపిణీ చేయాలని అన్నారు. ఈ నెల 19న బతుకమ్మ చీరలను అర్హులైన పేద మహిళలకు పంపిణీ చేయాలని, జిల్లా స్థా«యి గోదాముల్లో ఉన్న చీరలను గ్రామ స్థాయికి సరఫరా చేయాలని చెప్పారు. పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకానికి ఈ నెల 25లోగా నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలని, అర్హత సాధించిన వారి హాల్‌టికెట్లను స్థానిక దినపత్రికల ద్వారా పబ్లిష్ చేయాలని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని చెప్పారు. జాతీయ రహదారుల పనులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని, రాష్ట్రంలో 16 జిల్లాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో 90 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 57 సంవత్సరాలు నిండిన అర్హత గల పేద వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో 57 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ల జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి సమాచారాన్ని పంపించాలని తెలిపారు. అర్హత గల వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9355 మంది జూనియర్ పంచాయతీ గ్రామ కార్యదర్శుల ని యామకానికి సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా పంపించనున్నట్లు వివరించారు. ఆయా జిల్లాలో పత్రికల్లో హాల్‌టికెట్లను ప్రచురించి అ భ్యుర్థులకు తెలియజేయాలన్నారు. ప్రతీ కుటుం బంలో ఒకరికి పింఛన్ అందేలా చూడాలని అన్నా రు. కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. ఆసరా పింఛన్లో భాగంగా ఆధార్‌ను వయస్సు ధ్రువీకరణలో సమస్యలు ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి కుటుంబంలో 75 ఎకరాల భూమి ఉందని, వారికి ఆసరా పింఛన్ మంజూరులో సమ స్య ఎదురవుతున్నాయని తెలిపారు. అభయహస్తం పింఛన్లు సమస్య వివరించారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో సహాయ కలెక్టర్ ప్రతిక్ జైన్, డీపీవో, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆసరా పింఛన్లు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు సాన పెడుతోంది. ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో మేనిఫెస్టో బాగా ప్రభావం చూపింది. అప్పటి హామీలు, ముఖ్యంగా బంగారు తెలంగాణ నినాదం ప్రజలకు బాగా చేరింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే పంథాతో వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పనకు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో 14 మంది నేతలతో కమిటీ నియమించారు. మంత్రులు కేటీఆర్, చందూలాల్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కమిటీలో ఉన్నారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 15న జరగనుంది. ఆరోజే మేనిఫెస్టో నివేదికను కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. వికలాంగులకు రూ.2 వేలు!: మేనిఫెస్టోలో కొత్త హామీలు తక్కువగానే ఉండనున్నాయి. ప్రస్తుతం ఆసరా పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వికలాంగులకు నెలకు రూ.1,500.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు రూ.1,000 చొప్పున చెల్లిస్తున్నారు. వికలాంగులకు రూ.2,000, ఇతర వర్గాలకు రూ.1,500లకు పింఛన్ పెంచే అవకాశాలపై టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే నిరుద్యోగ భృతి చెల్లింపు అంశమూ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. -
ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపు
-
ఇక ఠంచన్‌గా పింఛన్
రాయగిరి గ్రామానికి చెందిన ‘ఆసరా’లబ్ధిదారులు పింఛన్ డబ్బుల కోసం మండల కేంద్రంలోని పోస్టాఫీసుకు వచ్చారు. తీరా అక్కడి సిబ్బంది డబ్బు లేదన్నారు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. మరుసటి రోజు మళ్లీ వచ్చారు. గంటల తరబడి నిరీక్షిస్తే కానీ, పింఛన్ల పంపిణీ మొదలుపెట్టలేదు. ఉన్న కొద్దిపాటి నగదు కొందరికే వచ్చింది. దీంతో మిగిలిన వారు నిరాశతో ఇంటిముఖం పట్టారు... ఇలా పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఈ నెల నుంచి బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. సాక్షి, యాదాద్రి : ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కష్టాలు తీరే రోజులు వచ్చాయి. తపాలా కా ర్యాలయాల ద్వారా కాకుండా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినప్పటికీ ఈ నెలనుంచే అమలు చేసేం దుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎందుకంటే.. ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు చేతికందాలి. ఈ డబ్బును ప్రస్తుతం తపాలా కార్యాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లకు బ్యాంకుల నుంచి డ బ్బు వస్తే తప్ప పంపిణీ చేయలేని పరిస్థితి. కానీ, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పోస్టాఫీస్ లకు డబ్బు చేరడం లేదు. దీంతో ఒక్కోసారి రెం డు నెలలు కూడా పింఛన్ అందడం లేదు. పింఛన్ కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి క్యూలో నిలబడడం, తెల్లవారుజాము నుంచి పడిగాపులు గాయడం జరుగుతుంది. వీటికి తోడు ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సిగ్నల్స్ కోసం భవనాలపైకి, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నివారించేందుకు లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్ డబ్బు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అదేశాలు అందాయి. వచ్చే నెల నుంచి అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 92,934 మంది ఉన్నారు. వీరందరికీ పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెలా రూ.11కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయకుండా లబ్ధిదారులు ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. లేని వారికి జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ బ్యాంకు అధికారులను ఇటీవల ఆదేశించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమ కాగానే ఆసమాచారం లబ్ధిదారుల సెల్‌కు మెసేజ్ వస్తుంది. దీని వల్ల పింఛన్‌దారుల కష్టాలను గట్టెక్కించడానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఆసరా..బ్యాంకుల్లోనే !
ఇన్నాళ్లు ఆసరా పింఛన్లు పోస్టాఫీసు ద్వారా ఇచ్చేవారు. ఈ పద్ధతికి పులిస్టాప్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇకనుంచి వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు త్వరగా ఇవ్వాలని ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉమ్మడి జిల్లాలో 4,21,008 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. నల్లగొండ : ఆసరా పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి..! పింఛన్ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సమస్యల వల్ల పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల మార్గాన్ని ఎంచుకుంది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం రెండు నెలలకోసారి పింఛన్లు పంపిణీ చేస్తోంది. దీంతో లబ్ధిదారులు ఒక నెల పింఛన్, మరొక నెలలో తీసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నెల పింఛన్ ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని అయో మయ పరిస్థితి నెలకొంది. ప్రతి నెల మొదటివారంలో చేతికందాల్సిన పింఛన్ ఆలస్యం కావడంతో నెలాఖరు వరకు ఎదరుచూడాల్సి వస్తోంది. అదీగాక పింఛన్ల కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇలాంటి కష్టాల నుంచి గట్టేక్కేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు మండలాల్లో అయితే ఎంపీడీఓలకు, పట్టణాల్లో మున్సిపల్ క మిషనర్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు. అన్నీ ఆధారాలు తప్పనిసరి... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,21,008 మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెల నల్లగొండ జిల్లాలో రూ.23.33 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.17.19 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.9.90 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయడం ఉండదు కాబట్టి బ్యాంకుల్లో ఆర్థికలా వాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాల వివరాలు మాత్రమే అధికారులకు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలి. ప్రధానంగా లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమకాగానే ఆ సమాచారం లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటిదాకా ఈ సెల్‌నెంబరు అనేది లేకపోవడంతో వికలాంగులు, మరికొంత మంది లబ్ధిదారులు నష్టపోవడం జరిగింది. వికలాంగుల సదరమ్ సర్టిఫికెట్ గడువు ముగిశాక, మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందే వరకు (రీ అసెస్మెంట్) పింఛన్లు పంపిణీ చేయరు. తిరిగి సర్టిఫికెట్ పొందాక ఆగిపోయిన పింఛన్లు (ఎరియర్స్) పంపిణీ చేస్తారు. అయితే చాలా మంది వికలాంగులు ఈ విషయం తెలియక నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ చేయాలనుకోవడం, ఆ సమాచారాన్ని లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరవేయడంతో మేలు జరుగుతుంది. ఈ సారైనా అమలయ్యేనా..! పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారా చేయాలన్న ఆలోచన పాతదే. 2008–09లో మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారానే చెల్లించారు. వివిధ కారణాల దృష్ట్యా మళ్లీ పోస్టాఫీసులకు మార్చారు. మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పింఛన్‌దారులను బ్యాంకుల వైపునకు మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ ఆచరణలో సాధ్యం కాకపోవడంతో పోస్టాఫీసులనే కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండటం, పలు చోట్ల పింఛన్ నిధులు దుర్వినియోగం అవుతుండటంతో బ్యాంకులైతేనే శ్రేయస్కరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మేనెల నుంచే బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం ఆసరా చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం. మే నెల నుంచి పింఛన్ చెల్లింపులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. సెల్‌నంబరు, ఆధార్‌కార్డు తప్ప నిసరి. – రింగు అంజయ్య, డీఆర్డీఓ -
అదృశ్యం.. ప్రత్యక్షం..!
ఖమ్మం, కారేపల్లి: మూడేళ్ల క్రితం కారేపల్లిలో అదృశ్యమైన ఆ యువతి, మదనపల్లిలో ప్రత్యక్షమైంది. తన బిడ్డకు ఏమైందోనని.. ఎక్కడుందోనని ఇన్నేళ్లు మదనపడిన ఆ తండ్రి, ఆమె ఆచూకీ తెలియడంతో ఆనందభరితుడయ్యాడు. కారేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు... కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన ధంసలపూడి రాములు–ధనమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. ధనమ్మ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. కుమార్తె సునీల వికలాంగురాలు. డిగ్రీ, బీఈడీ పూర్తిచేసింది. ఖమ్మంలోని ఓ కన్సెల్టెంట్ (పేపర్లలో ఉద్యోగావకాశాలు పేరిట ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రకటనలు చేయడం) కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. పత్రికల్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనను చూసిన చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఫైజల్ అలీ.. ఫోన్ చేశాడు. ఇలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది క్రమేణా స్నేహానికి, ప్రేమకు దారితీసింది. వీరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. మతాలు వేరవడంతో తన తండ్రి, కుటుంబీకులు ఒప్పుకోకపోవచ్చని భయపడింది. 2015, ఆగస్టు 18న సునీల తన ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. కుటుంబీకులు అన్నిచోట్ల గాలించినా ఆచూకీ తెలియలేదు. 2015, ఆగస్టు 22న కారేపల్లి పోలీసులకు తండ్రి ధంసలపూడి రాములు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. (కేసుల) పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్న కారేపల్లి ఎస్ఐ కిరణ్‌కుమార్ దృష్టిలో ఈ మిస్సింగ్ కేసు పడింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఆసరాతో ఆచూకీ ఆసరా పథకం.. ఆమె ఆచూకీని కనిపెట్టింది. వికలాంగురాలైన సునీలకు నెలకు రూ.1500 పింఛన్ వస్తోంది. ఆమెకు ఇల్లందులోని ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. అందులోని పింఛన్ డబ్బు జమవుతోంది. ఎస్ఐ కిరణ్‌కుమార్, ఇటీవల ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు సేకరించారు. మూడు నెలలకోసారి, ఐదు నెలలకోసారి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఏటీఎం ద్వారా పింఛన్ డబ్బు డ్రా చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయన వెంటనే హెడ్ కానిస్టేబుల్ మహమ్మూద్ అలీ, కానిస్టేబుల్ రాజేష్‌ను (వారం క్రితం) మదనపల్లి పంపించారు. వారు అక్కడే బస చేశారు. ఏటీఎం సీసీ పుటేజీలను సేకరించారు. ఆమెను కనిపెట్టారు. విచిత్రంగా. ఆమె బురఖా వేసుకుని ఉంది. ఆమే సునీల కావచ్చని ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్థారించుకున్నారు. వారికి ఆ ‘బురఖా’తో చిక్చొచ్చి పడింది. ఆ ఫొటో, వివరాలతో స్థానిక పోలీసుల సాయంతో వారం రోజులపాటు ఇంటింటికీ తిరిగి వాకబు చేశారు. ఈ క్రమంలోనే, మినరల్ వాటర్ సప్లయ్ బాయ్‌కు కూడా ఫొటో చూపించి, వివరాలు (వయసు, వికలాంగురాలు) తెలిపారు. ఆమెను ఆ బాయ్ గుర్తించాడు. ఆచూకీ చెప్పాడు. అక్కడకు పోలీసులు వెళ్లారు. సునీల కనిపించింది. ఆమె తన పేరును రేష్మగా మార్చుకుంది. ఫైజల్ అలీని పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఆ ముగ్గురినీ పోలీసులు కారేపల్లికి తీసుకొచ్చారు. ఆ తండ్రి, తన కొడుకులతో కలిసి సునీల కోసం కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో పోలీసులతోపాటు వచ్చిన తన కూతురిని చూసి ఒక్కసారిగా భోరున విలపించాడు. తన బిడ్డ క్షేమంగా ఉందని, తనకు అది చాలని అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. సునీల కూడా తన తండ్రిని, తమ్ముళ్లను చూసి ఆనంద భాష్పాలు రాల్చింది. మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఎస్ఐ కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మూద్ అలీ, కానిస్టేబుల్ రాజేష్‌ను ఖమ్మం రూరల్ ఏసీపీ సురేష్ రెడ్డి అభినందించారు. మహమ్మూద్ అలీ, రాజేష్‌కు రివార్డు అందించారు. -
పైసల్లేవ్..!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలో ఆసరా లబ్ధిదారులను నగదు కొరత వెంటాడుతోంది. సరిపడా నగదు లేకపోవడంతో ఈనెల ఇంకా చాలా మందికి పింఛన్లు అందలేదు. దీంతో లబ్ధిదారులు పింఛన్ ఎప్పుడుస్తుందోనని ఆశగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. గతంలో ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకులు ‘ఆసరా’ పథకం ద్వారా కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. అయితే, గతంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా బ్యాంకుల్లో కొరత కారణంగా లబ్ధిదారులకు అందడం లేదు. దీంతో వారు ఆయోమయంలో పడిపోయారు. ఇప్పటికి లబ్ధిదారులకు నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ అందాల్సి ఉంది. పది రోజుల పాటు ప్రతి నెలా 22వ తేదీ నుంచి మరుసటి నెల 2వ తేదీ వరకు పింఛన్లు అందజేయాలి. కానీ రిజర్వ్ బ్యాంకు నుంచి సరిపడా నగదు రాకపోవడంతో స్థానిక బ్యాంకుల్లో కొరత ఏర్పడింది. ప్రతీ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.22.29 కోట్లు అవసరం. కానీ ఇందులో నవంబర్ నెలకు చెందిన రూ.22.29 కోట్లలో రూ.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా మిగతా రూ.11.29 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అలాగే, డిసెంబర్ నెలకు సం బంధించి మొత్తం అందాలి. ప్రతీనెలా ఆర్బీఐ నుంచి జిల్లా లోని ఎస్బీఐ మదర్ బ్యాం కుకు పింఛన్ డబ్బు చేరుతుంది. ఇందులో వచ్చే నెల కోసం కొంత నగదు నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి రిజర్వ్ బ్యాంకు జిల్లాకు కేవలం రూ.11 కోట్లే ఇవ్వడంతో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. అయి తే, చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఉండడంతో లబ్ధిదారులు ప్రతీరోజూ బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి వెళ్తున్నారు. లబ్ధిదారులు గాబరా పడొద్దు.. బ్యాంకుల్లో నగదు కొరత వల్ల ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు. అవుతుంది. ఈ మేరకు ఆసరా లబ్ధిదారులు గాబరా పడొద్దు. ప్రతిరోజు కొన్నికొన్ని డబ్బులు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తాం. – శారద, ఆసరా ఏపీఓ -
‘ఆసరా’ అవస్థలు
ఆసిఫాబాద్‌రూరల్ : గత మూడు నెలలుగా రాని పింఛన్ ఇప్పుడు వచ్చిందనే ఆశతో ఉదయం 9 గంటలకే పోస్టాఫీసుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల ఆశ నిరాశ అవుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా వట్టి చేతులతోనే ఇంటికి పోవాల్సి వచ్చింది. ఆదివారం మండలంలోని బూర్గుడ గ్రామంలో పోస్టాఫీస్ కేంద్రంలో వేలి ముద్ర మిషన్, సిగ్నల్ పని చేయడం లేదని నేనేం చేయాలని సంబంధిత సిబ్బంది అంటున్నారు.ఇప్పటికే రెండు రోజుల నుంచి వచ్చి తిరిగి పోతున్నామని, మిషన్ పని చేస్తలేదని చెబుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని ఆసరా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ ఎప్పుడు వస్తుందోనని బెంగ పెడుతున్నారు. -
ఆదిలోనే ఆటంకం
ఆదిలాబాద్: ఆసరా లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న ‘ఆసరా భవనం’ ఆదిలోనే ఆగిపోయింది. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన భవన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో నిరాశ్రయులకు నీడ కల్పన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులతో రెండేళ్ల క్రితం రాత్రిబస కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి మంజూరు చేసింది. 2017లో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆగస్టులో పనులు ప్రారంభించగా కాంట్రాక్టర్ పునాదులు, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో భవనం కుంగిపోయింది. అధికారులు పర్యవేక్షించకపోవడంతో పిల్లర్ల వరకే పనులు చేసిన కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారు. అనాథలకు ఆసరాగా.. అనాథలుగా రోడ్లపై, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం లేక జీవనం సాగించే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని మంజూరు చేసింది. ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రి భోజనంతో పాటు స్నానపు గదులు, నిద్రించేందుకు సదుపాయాలు సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిరాశ్రయుల కోసం ఓ కేంద్రాన్ని నిర్వహించింది. ప్రస్తుతం దాన్ని మూసివేయడంతో అభ్యాగులకు నిలువనీడలేకుండా పోయింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆశ్రయం లేనివారిని గుర్తించి ఇందులో వారికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఏటా నిర్వహణ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో భవన నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, ఠాకూర్‌హోటల్, బస్టాండ్, ఓల్డ్‌బస్టాండ్, తాంసి బస్టాండ్, వినాయక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, శివాజీచౌక్, తదితర ప్రాంతాల్లో ఎంతో మంది నిరాశ్రయులు నిత్యం కనిపిస్తుంటారు. చలికాలం, వర్షకాలంలో వీరి అవస్థలు వర్ణనాతీతం. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు రోడ్ల పక్కన పడుకునే వారిని అక్కడి నుంచి పంపివేస్తుంటారు. ఇలా అన్ని రకాలుగా నిరాశ్రయులకు ఆధారం లేకుండా పోతోంది. చేతులెత్తేసిన కాంట్రాక్టర్.. కాంట్రాక్టర్‌కు అప్పగించిన ఈ భవన నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా.. ఇంకా పిల్లర్ల దశ దాటలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపివేసి ఆరు నెలలు గడుస్తున్నా అతడిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులు అందించామని చెబుతున్న అధికారులు, సదరు కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసినా ఇంకా అతని కోసం ఎదురుచూడడం గమనార్హం. సకాలంలో భవనం పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్లు నిర్వహించి వేరేవారికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడా అది జరగడం లేదు. ఆసరా భవనం పూర్తయితే అందులో ఉండేందుకు నిరాశ్రయుల వివరాల సేకరణ సైతం చేశారు. నోటీసులు అందించాం.. భవన నిర్మాణాలు చేపట్టాలని ఇది వరకే కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించాం. త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆరు నెలల అగ్రిమెంట్‌తో పనులు అప్పగించడం జరిగింది. ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. నెల రోజుల్లో పూర్తి చేయకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొండల్రావు, మున్సిపల్ డీఈ -
‘ఆసరా’.. ఆలస్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏ ఆధారమూ లేనివారికి సకాలంలో దక్కాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. ఒకటికాదు.. రెండుకాదు, ప్రతినెలా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ వరుసగా మూడు నాలుగు నెలలపాటు లబ్ధిదారులు పింఛన్ సొమ్ముకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ఒక నిర్ధిష్ట సమయమంటూ లేకపోవడంతో పింఛర్దారులు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఇస్తారో తెలియని సంకట స్థితిలో చిక్కుకున్నారు. జనవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము ఇంకా అందలేదు. నిధులు విడుదల కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కేవలం పింఛన్సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి కీలకమైన పింఛన్ సొమ్ము సకాలంలో అందితేనే వారు తమ అవసరాలు తీర్చుకుంటారు. ఇది జరగపోవడంతే అప్పు తెచ్చుకుని పూట గడిపే దుస్థితి నెలకొంది. అవసరానికి అందవు.. జిల్లాలో 1.24 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య, వికలాంగ, వితంతువులు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి 4,038 మంది ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ చేస్తున్నారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో బ్యాంకు ద్వారా నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పించన్సొమ్ము అందేది. ఆయన మరణానంతరం నిధుల విడుదలతో జాప్యం జరుగుతోంది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సకాలంలో పింఛన్లు అందిన దాఖలాలు లేవు. తొలుత ప్రతినెలా 11 నుంచి 14వ తేదీలోగా పింఛన్ ఇచ్చేవారు. ఇది క్రమంగా 14 నుంచి 20 తేదీకి మారింది. కొంతకాలం నుంచి ఈ తేదీలకు కూడా చరమగీతం పాడారు. ప్రస్తుతం ఫిబ్రవరిలోకి అడుగు పెట్టినా జనవరి నెల పింఛను ఇంతవరకు అందలేదు. సకాలంలో పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిర్లక్ష్యం తగదు ఆసరా పింఛన్లు అందజేయడంలో నిర్లక్ష్యం తగదు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగితే పట్టించుకునే వారు లేరు. సకాలంలో ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటాం. లేకుంటే అప్పు చేయక తప్పడం లేదు. టైం ప్రకారం పింఛను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కట్టెల కిష్టయ్య, వికలాంగుడు ఎప్పుడూ ఆలస్యమే సర్కారు పెన్షన్ల సొమ్ము పెంచింది కానీ.. మాకు ఆ తృప్తి లేకుండా చేస్తోంది. గతంలో పింఛన్ సొమ్ముకు ఎన్నడూ లేటు కాలేదు. ఇప్పుడు సొమ్మును పెంచినా అవసరానికి మాత్రం ఇవ్వడం లేదు. వయసు పైబడ్డాక పిల్లలను అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. పింఛనైనా వస్తుందని అనుకుంటే.. అదీ లేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవదు. – అంజమ్మ, వితంతు పెన్షన్‌దారు అప్పు జేయాల్సి వచ్చింది ప్రతినెలా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల అవసరాల నిమిత్తం అప్పు చేస్తున్నాం. రూ.వెయ్యి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం. దవాఖానకు పోదామంటే నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఎవరినైనా అడుగుదామంటే.. ఎవరిస్తరు బిడ్డా. ప్రభుత్వం లేటు చేయకుండా పింఛన్లు ఇస్తే మాలాంటి ముసలోల్లకు ఇబ్బంది ఉండదు. – చెర్కూరి లక్ష్మయ్య, వృద్ధుడు -
ఆర్థిక భృతి దరఖాస్తు గడువు పెంపు
- ఈనెల 21 వరకు పొడిగించిన ప్రభుత్వం - గడువులోగా దరఖాస్తు చేసిన ఒంటరి మహిళలకే జూన్ 2న ఆర్థిక భృతి - ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 1.20 లక్షలే సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 21 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక భృతి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి 13 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సభల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయితే గడువులోగా ప్రభుత్వం ఊహించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో, దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును 21 వరకు పొడిగించారు. ఏ ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.2 వేలను) రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జూన్ 2న ఆర్థిక భృతిని చెల్లించనున్నారు. గడువు దాటాక వచ్చిన దరఖాస్తులకు జూన్ నెల నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయాలని నిర్ణయించారు. అందిన దరఖాస్తులు 1.20 లక్షలే రాష్ట్రంలో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా శనివారం వరకు 1,20,484 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భర్త వదిలేసిన మహిళలు, భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు.. ఇప్పటికే వితంతు కేటగిరీలో ఆసరా పింఛన్ పొందుతున్నారని, ఈ కారణంగానే ఒంటరి మహిళల కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. సెర్ప్ అధికారులకు అందిన మొత్తం దరఖాస్తుల్లో ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే అత్యధికంగా 10,313 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అలాగే ఆసరా పెన్షనరు ఉన్న కుటుంబంలోని బీడీ కార్మికులకు కూడా ఆర్థిక భృతిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, బీడీ కార్మికుల నుంచి సుమారు 80 వేల నుంచి 1 లక్ష దరఖాస్తులు రావచ్చని అంచనా వేసింది. అయితే చాలా తక్కువగా కేవలం 15,603 దరఖాస్తులు మాత్రమే అందాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా నుంచి 5,227, కామారెడ్డి జిల్లా నుంచి 3,567 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 31 జిల్లాల్లో 15 జిల్లాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడం గమనార్హం. -
మే నెల నుంచి పోస్టాఫీసుల ద్వారానే ఆసరా
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్లను వచ్చేనెల నుంచి పూర్తిగా పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ విధానం ద్వారానే ఇకపై పింఛన్ల పంపిణీ జరగాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోపే లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోస్టాఫీసులోనూ ఐరిస్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని తపాలా అధికారులను మంత్రి కోరారు. కూలీలకు జాబ్ కార్డులు ఇప్పించడంతో పాటు, పెద్ద ఎత్తున పనులు చేపట్టేలా మహిళా సంఘాలు చొరవ చూపాలని, ఆయా సంఘాలను చైతన్య పరిచేందుకు వీవోఏలను వినియోగించుకోవాలని సూచించారు. -
ఒంటరి మహిళలకు ‘ఆసరా’ అందేదిలా..
షెడ్యూల్ ఖరారు - ఈ నెల 13 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణ - 17 నుంచి 21 వరకు దరఖాస్తుల పరిశీలన.. అర్హుల జాబితా విడుదల - అనంతరం తుది జాబితా..మే 1 నుంచి పింఛను పంపిణీ సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం ద్వారా ఒంటరి మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించే ప్రక్రియకు షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఆదరువూ లేని ఒంటరి మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఏప్రిల్ నుంచి ఆర్థిక భృతి ఆందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌కు సంబంధిం చిన ఆర్థిక భృతిని మే నెల 1 నుంచి అందజేయాల్సి ఉన్నందున.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షెడ్యూల్‌ను గ్రామీణాభివృద్ధి శాఖ ఖరారు చేసింది. షెడ్యూల్ మేరకు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాల్లోనూ గ్రామ సభ/వార్డు సభలు నిర్వహించి అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 17 నుంచి 21 వరకు దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన లబ్ధిదా రుల జాబితాలను ఆయా గ్రామాల్లో/వార్డుల్లో మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రదర్శిస్తారు. 22 నుంచి 24 వరకు లబ్ధిదారుల జాబితాపై అభ్యంత రాలను స్వీకరించి తుది జాబితాను ప్రచురిస్తారు. ఈనెల 25 నుంచి 29 వరకు సమాచారాన్ని గ్రామాల్లోనైతే ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లాలో తహసీల్దార్లు, జీహెచ్ఎంసీ పరిధిలో డిప్యూటీ కమిషనర్లు ఆసరా వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. మే 1న నుంచి అర్హులైన ఒంటరి మహిళలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక భృతిని ప్రభుత్వం అందించనుంది. దరఖాస్తు చేయాల్సినది ఇలా..: అర్హులైన ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తును వ్యక్తిగతం గా సమర్పించాలి. దరఖాస్తుపై ఫోటోను అంటిం చడంతోపాటు ఆధార్ కార్డు, బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా పుస్తకం, వయస్సు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జిరాక్సు ప్రతులను జత చేయాలి. అత్యాచార, యాసిడ్ దాడుల బాధితులైనట్లయితే పోలీసులు ఇచ్చే ఎఫ్ఐఆర్ కాపీని జత చేయాలి. పరిశీలన జరిగేది ఇలా.. లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించాలి. కిందిస్థాయి సిబ్బంది మార్గదర్శకాల మేరకు పరిశీలన చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల గుర్తింపు నిమిత్తం మున్సిపల్ సిబ్బంది సహకారాన్ని పొందవచ్చు. పది శాతం దరఖాస్తులను మచ్చుకు తనిఖీ చేసే నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమించాలి. తప్పుడు గుర్తింపు, పరిశీలన చేసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలతోపాటు అప్పటికే చెల్లించిన సొమ్మును రికవరీ చేయాలి. అర్హతలు ఇలా ► ఏడాదికి పైగా భర్త వదిలేసిన, భర్త నుంచి వేరుగా ఉంటున్న, విడాకులు తీసుకున్న మహిళలను, ఏ ఆదరువు (కుటుంబం, ఆర్థిక తోడ్పాటు) లేని, 18 ఏళ్లు పైబడిన వారిని ఒంటరి మహిళలుగా పరిగణిస్తారు. స్థానికంగా విచారణ (లోకల్ ఎంక్వయిరీ) ద్వారా వీరి అర్హతను నిర్ధారిస్తారు. ► దేవునితో పెళ్లి జరిగిన మాతమ్మ, జోగిని, బసవి, తాయమ్మ, పార్వతి.. తదితర పేర్లతో ఉన్న వారు కూడా ఒంటరి మహిళల కింద ఆర్థిక భృతికి అర్హులు. అలాగే యాసిడ్ దాడుల బాధితులు, అత్యాచారానికి గురైన మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు వారి విచక్షణ మేరకు సిఫారసు చేయవచ్చు. ► గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న మహిళలే అర్హులు. దరఖాస్తుదారు ఇప్పటికే ఎలాంటి సామాజిక భద్రత పింఛన్ గానీ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గానీ పింఛన్ పొందుతున్న వారు కాకూడదు. ► ఒకవేళ తిరిగి వివాహం చేసుకున్నా, ఏదేని ఉద్యోగంలో చేరి ఆర్థిక స్థిరత్వాన్ని పొందిన మహిళలకు ఎప్పుడైనా ఆర్థిక భృతిని నిలిపివేస్తారు. ► పైన పేర్కొన్న కేటగిరీల్లో ఆర్థిక భృతిని పొందుతున్న మహిళలు 65 ఏళ్లు దాటిన తర్వాత ఆసరా (వృద్ధాప్య) పింఛన్ పథకంలోకి వస్తారు.