సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల హామీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా పని చేస్తున్నారని కొనియాడారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగిన ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో మంతి వెల్లంపల్లి పాల్గొన్నారు. వేడుకల ముగింపు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం ఆర్‌పీలకు, డ్వాక్రా గ్రూప్ లీడర్లకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పధకాలను చేరుస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి దేవినేని అవినాష్ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం మాటలతో కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో రూ.250 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో భూములన్నీ బినామిలకు దోచిపెట్టాడని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడులు పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారుని మండిపడ్డారు. చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాల వలన రాబోయే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయం అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలిపారు.
అదేవిధంగా వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. గతంలో చంద్రబాబు మహిళలని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. జగన్ మహిళలుకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి దేశంలోనే రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. మరో 30 ఏళ్లపాటు వైఎస్ జగన్ తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు అందరి ఆశీస్సులు సీఎం జగన్‌కి ఉన్నాయని గుర్తుచేశారు. 30లక్షల మందికి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. దివంగత వైఎస్సార్ కన్న కలలు అన్ని జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ ద్వారా సీఎం జగన్ మహిళలుకి మరింత చేరువయ్యారని అన్నారు. మహిళలు అందరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని దేవినేని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment